A u t o S c r o l l - C o n t r o l s : reverse fastforward rewind slower faster pause
Hover mouse pointer in the display area below to pause the auto scroll
Telugu News Headlines for May 26,2012

అమ్మా.. విజయమ్మా.. జగన్ లెంపలు వాయించి దార్లో పెట్టండి: లగడపాటి

జగన్ మోహన్ రెడ్డి తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని మోసం చేయడమే కాకుండా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి తండ్రి వైఎస్సార్‌కు కూడా తీరని ద్రోహం చేశారని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ విమర్శించారు. ఇప్పటికైనా మునిగిపోయిందేమీ లేదనీ, జగన్ తల్లి విజయమ్మ ఆయన లెంపలు వాయించి చేసిన తప్పులను ఒప్పుకోమని చెప్పాలని సూచించారు.
Source: ఏపీ న్యూస్ | 26 May 2012 | 8:47 am

జగన్ విచారణ: రెండో రోజు ముగిసింది, మళ్లీ రేపు

హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సిబిఐ విచారణ శనివారం రెండో రోజు ముగిసింది. శనివారం జగన్‌ను సిబిఐ అధికారులు ఏడున్నర గంటల పాటు ప్రశ్నించారు. సిబిఐ విచారణ ముగిసిన తర్వాత దిల్‌కుషా అతిథి గృహం నుంచి బయటకు వచ్చిన జగన్ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. రేపు మళ్లీ విచారణకు రమ్మన్నారని ఆయన
Source: Oneindia.in - thatsTelugu | 26 May 2012 | 7:08 am

జగన్ ఎపిసోడ్ : రెండో రోజు ముగిసిన సీబీఐ విచారణ!

అక్రమాస్తుల కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్.జగన్మోహన్ రెడ్డి వద్ద సీబీఐ సాగిస్తున్న విచారణ రెండో రోజు ముగిసింది. శనివారం ఉదయం 10.30 గంటలకు దిల్‌కుషా అతిథి గృహానికి చేరుకున్న జగన్‌ను సీబీఐ అధికారులు సాయంత్రం గంటల వరకు విచారణ కొనసాగించారు. ఈ విచారణ సుమారు 7.30 గంటల పాటు సుదీర్ఘంగా కొనసాగింది.
Source: ఏపీ న్యూస్ | 26 May 2012 | 6:59 am

కాంగ్రెస్‌కు వేయకుంటే ఓటు మురిగిపోయినట్టే : రాయపాటి

వచ్చే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కాకుండా ఇతర రాజకీయ పార్టీలకు ఓటు వేస్తే ఆ ఓటు మురిగిపోయినట్టేనని గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు అభిప్రాయపడ్డారు. అందువల్ల ఓటర్లు విజ్ఞతతో ఆలోచన చేసి ఓటు వేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర మంత్రి మోపిదేవి వెంకటరమణ అరెస్టుతో పత్తిపాడు, మాచర్ల ఉప ఎన్నికలకు ఇంచార్జీ నియామకంపై ఆయన శనివారం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో సమావేశమై చర్చించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మోపిదేవి అరెస్టు దురదృష్టకరమన్నారు.
Source: ఏపీ న్యూస్ | 26 May 2012 | 6:24 am

పూరి చెప్పింది నచ్చలేదు... టైటిల్ ఖరారు చేసిన పవన్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో ‘కెమెరా మెన్ గంగతో రాంబాబు’ చిత్రం రూపొందబోతున్స సంగతి తెలిసిందే. అయితే వాస్తవానికి తొలుత ఈ సినిమాకు అనుకున్న టైటిల్ ఇదికాదట. దర్శకుడు పూరి దీనికి ‘గంగ-రాంబాబు’ లేదా ‘గంగతో రాంబాబు’ టైటిల్ అనుకున్నారట.వీటితో దర్శకుడు పూరి పవన్‌ను సంప్రదించగా....ఈ టైటిల్ బాగోలేదని, పైగా న్యూమరాలజీ, ఆల్పాబెటికల్
Source: Oneindia.in - thatsTelugu | 26 May 2012 | 6:22 am

ఏం జరిగినా.. రాష్ట్ర ప్రభుత్వానికి ఢోకా లేదు : దామోదర

రాష్ట్రంలో ఎలాంటి పరిణామాలు ఉత్పన్నమైనా ప్రభుత్వానికి వచ్చిన ముప్పేమీ లేదని ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్శింహా అభిప్రాయపడ్డారు. ఆయన శనివారం హైదరాబాద్‌లో ఇంటర్మీడియట్ పాఠ్యపుస్తకాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోపిదేవి అరెస్టు వ్యవహారం కోర్టులో ఉందని, దానిపై వ్యాఖ్యానించడం సరికాదన్నారు.
Source: ఏపీ న్యూస్ | 26 May 2012 | 6:18 am

‘పవన్ కళ్యాణ్ వల్లే...ఆమె ప్రాణం నిలబడింది’

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను అభిమానులు అంతగా ఎందుకు ఆరాధిస్తారంటే...ఆయన దగ్గర క్రమశిక్షణ, మంచితనం, నిజాయితీ, సేవాభావం ఉన్నాయి, ఆయన యూత్ ఐకాన్‌గా నిలవడానికి ప్రధాన కారణం ఆ విశిష్టమైన గుణాలే అంటూ ఆ మధ్య ‘గబ్బర్ సింగ్’ దర్శకుడు హరీష్ శంకర్ ఉద్వేగంగా చెప్పిన విషయం తెలిసిందే. పవర్ స్టార్ పర్సనల్ లైఫ్‌ను, సినిమాలను పరిశీలించినా
Source: Oneindia.in - thatsTelugu | 26 May 2012 | 6:18 am

జగన్ పేరుతో అల్లర్లు చేస్తే సంబంధం లేదు: జూపూడి

హైదరాబాద్: తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పేరుతో ఎవరైనా అల్లర్లు చేస్తే పార్టీకి, జగన్‌కు సంబంధం లేదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు జూపూడి ప్రభాకర రావు అన్నారు. వైయస్ జగన్ విషయంలో దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. మరో అరగంటలో జగన్ బయటకు వస్తారని అనుకుంటున్నట్లు ఆయన తెలిపారు.
Source: Oneindia.in - thatsTelugu | 26 May 2012 | 6:13 am

సీఎం సంతకం చేయమంటే చేయకుండా ఉండగలమా: దానం

రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండే వ్యక్తి పిలిచి రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఫైలుపై సంతకం చేయకుండా ఉండగలమా అని రాష్ట్ర మంత్రి దానం నాగేందర్ ప్రశ్నించారు. ఆయన శనివారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ... వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆస్తుల కేసులో బలహీనవర్గాలకు చెందిన మోపిదేవిని బలిపశువును చేశారన్నారు.
Source: ఏపీ న్యూస్ | 26 May 2012 | 6:11 am

వైయస్ జగన్ అరెస్టు పుకార్లు: భారీ భద్రతా ఏర్పాట్లు

హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని సిబిఐ అరెస్టు చేస్తుందనే పుకార్లు ఊపందకున్నాయి. హైదరాబాదులో పోలీసులు కనీవినీ ఎరుగని రీతిలో భద్రతా ఏర్పాట్లు చేయడంతో ఈ పుకార్లు ఊపందకున్నాయి. ప్రత్యేక భద్రతా బలగాలు హైదరాబాదులోని నాంపల్లి కోర్టు ముందు మోహరించాయి. పరిసరాల్లో సిసి కెమెరాలు ఏర్పాటు చేశారు. జగన్‌ను సిబిఐ విచారిస్తున్న దిల్‌కుషా
Source: Oneindia.in - thatsTelugu | 26 May 2012 | 5:41 am

జగన్ సోనియా కాళ్లు మొక్కలా.. అందుకే పీడిస్తోంది.. పార్వతి

ఎంత పెద్ద తప్పు చేసినా నేరుగా వెళ్లి సోనియా గాంధీ కాళ్లు పట్టుకుంటే వదిలిపెట్టేస్తుందనీ, అదే ఎదురుతిరిగితే పీడిస్తుందని ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి అన్నారు. జగన్ మోహన్ రెడ్డి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని ఎదిరించినందుకే ఇప్పుడు ఆయనను కాంగ్రెస్ పార్టీ వేధిస్తోందని చెప్పుకొచ్చారు.
Source: ఏపీ న్యూస్ | 26 May 2012 | 5:41 am

జగన్ ఎపిసోడ్ : రాజధానిలో హైఅలెర్ట్ - బలగాల మొహరింపు

రాష్ట్ర రాజకీయాలను జగన్ ఎపిసోడ్ కుదిపేస్తున్నాయి. ఆస్తుల కేసులో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సీబీఐ గత రెండు రోజులుగా విచారణ సాగిస్తోంది. దీంతో హైదరాబాద్‌లో ఈనెల 29వ తేదీ వరకు 144 సెక్షన్‌ను అమలు చేస్తున్నారు.
Source: ఏపీ న్యూస్ | 26 May 2012 | 5:40 am

గడ్కరీతో రహస్య భేటీ: బిజెపిలోకి సినీనటి జయప్రద

న్యూఢిల్లీ: ప్రముఖ సినీ నటి, పార్లమెంటు సభ్యురాలు జయప్రద బిజెపి గూటికి చేరడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇందుకుగాను ఆమె పదిహేను రోజుల క్రితం బిజెపి అధ్యక్షుడు నితిన్ గడ్కరీతో రహస్యంగా సమావేశమై చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. కొన్నాళ్లుగా ఆమె తన రాజకీయ భవిష్యత్తుపై ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పుడు బిజెపి నుంచి సానుకూల సంకేతాలు వచ్చినట్లు సమాచారం."నిజజీవితంలో రాజకీయాలు
Source: Oneindia.in - thatsTelugu | 26 May 2012 | 5:32 am

టీవీ ఛానల్ పెడుతున్న నిర్మాత అశ్వినీదత్

ప్రముఖ నిర్మాత అశ్వినీ దత్ త్వరలో ఓ కొత్త టీవీ ఛానల్ పెట్టబోతున్నారు. ఆ చానల్‌కు ‘మాయా బజార్ టీవీ’ అనే పేరు పెడుతున్నట్లు సమాచారం. దత్‌కు సంబంధించిన వైజయంతి మూవీస్ సంస్థతో కలిసి సహారావన్ మీడియా అండ్ ఎంటర్‌టైన్మెంట్ లిమిటెడ్ ఈ చానల్‌ను రన్ చేస్తాయని తెలుస్తోంది. గతంలో ‘లోకల్ టీవీ’ని స్థాపించిన అశ్వినీదత్ దాన్ని
Source: Oneindia.in - thatsTelugu | 26 May 2012 | 5:28 am

అక్రమాస్తుల కేసు.. కొన్ని ప్రశ్నలకు జవాబులు చెప్పని జగన్

జగన్ అక్రమాస్తుల కేసులో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ జగన్ మోహన్ రెడ్డిని సీబీఐ రెండో రోజు కూడా సుదీర్ఘంగా విచారిస్తోంది. సుమారు 5 గంటల నుంచి జగన్‌కు సీబీఐ ప్రశ్నలపై ప్రశ్నలు సంధిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా వాన్‌పిక్ భూ కేటాయింపుల సమయంలో సాక్షిలోకి వరదలా వచ్చిన నిధులు ఎలా వచ్చాయి.. ఎక్కడి నుంచి వచ్చాయన్న అంశాలపైన ప్రశ్నిస్తున్నట్లు సమాచారం.
Source: ఏపీ న్యూస్ | 26 May 2012 | 5:13 am

ఆ మంత్రులను కేబినెట్ నుంచి తొలగించాలి : అన్నా బృందం

అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న 15 మంది మంత్రులను కేంద్ర మంత్రివర్గం నుంచి తక్షణం తొలగించాలని ప్రధానంమత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్‌కు అన్నా బృందం సభ్యుడు అరవింద్ కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ప్రధానికి శనివారం లేఖ రాశారు. అంతేకాకుండా ఈ 15 మంది మంత్రులు ఎదుర్కొంటున్న అవినీతి ఆరోపణలపై విచారించేందుకు ప్రత్యేక దర్యాప్తు ఏజెన్సీతో విచారణ జరిపించాలన్నారు. దీనిపై ఆయన మాట్లాడుతూ ఇదే విషయాన్ని డిమాండ్ చేస్తూ ప్రధానమంత్రికి అన్నా బృందం లేఖ పంపినట్టు చెప్పారు. తాము ప్రధానికి పంపిన లేఖలో 15 మంది మంత్రులు పేర్లు పేర్కొన్నట్టు చెప్పారు.
Source: జాతీయ | 26 May 2012 | 5:11 am

అలా చేస్తే కెవ్వు కేక: చిరంజీవి, జగన్‌పై ఫైర్

విశాఖ/ఏలూరు/తిరుపతి: ఉప ఎన్నికల్లో తమ పార్టీకి ఓటు వేస్తే కెవ్వు కేకే అని కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు చిరంజీవి అన్నారు. ఆయన శనివారం విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించారు. ఓటేసి కాంగ్రెసును గెలిపిస్తే కెవ్వు కేకేనని ఆయన అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌పై ఆయన మండిపడ్డారు. కాంగ్రెసులో పుట్టి, కాంగ్రెసులో
Source: Oneindia.in - thatsTelugu | 26 May 2012 | 5:06 am

రవితేజకు మళ్లీ ఆమె అందాల ఘాటు..!

మిరపకాయ్ చిత్రంలో తన ఘాటైన అందాలతో అటు హీరో రవితేజను, ఇటు ప్రేక్షకులకు కిర్రెక్కించిన హాటీ ‘రీచా గంగోపాధ్యాయ్’ మళ్లీ రవితేజతో జతకట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజాగా సినీ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం రవితేజ ‘సారొస్తారా’ చిత్రం కోసం ఆమెను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.ఇప్పటికే ఈచిత్రంకోసం త్రిష, అమలా పాల్‌లను సంప్రదించినప్పటికీ డేట్స్ అడ్జెస్ట్ కాక
Source: Oneindia.in - thatsTelugu | 26 May 2012 | 4:59 am

మోపిదేవిని బలిపశువును చేశారు: మంత్రి దానం

హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఆస్తుల కేసులో బలహీనవర్గాలకు చెందిన మోపిదేవిని బలిపశువును చేశారని మంత్రి దానం నాగేందర్ వ్యాఖ్యానించారు. బలహీనవర్గాలకు చెందినవారు కావడం వల్లనే మోపిదేవిని బలిపశువును చేశారని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. మంత్రివర్గం ఆమోదించిన నోట్ ఫైల్‌పై మోపిదేవి సంకతం చేశారని, విధానపరమైన లోపాలున్నట్లు తర్వాత బయటపడిందని
Source: Oneindia.in - thatsTelugu | 26 May 2012 | 4:40 am

ఇంద్రుడు.. చంద్రుడు అన్న సోనియా ఇప్పుడెక్కడ : వివేకా

నాడు దివంగత మహానేత వైఎస్.రాజశేఖర్ రెడ్డిని ఇంద్రుడు, చంద్రుడు అని పొగడ్తల వర్షంలో ముంచెత్తిన కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఇప్పడు ఎక్కడ ఉన్నారని, ఎందుకని నోరు మెదపడం లేదని ఆ పార్టీకి చెందిన మాజీ నేత, మాజీ మంత్రి వైఎస్.వివేకానంద రెడ్డి ప్రశ్నించారు.
Source: ఏపీ న్యూస్ | 26 May 2012 | 4:28 am

ఈనెల 28వ తేదీన ఆళ్ల నానికి షోకాజ్ నోటీసు : కంతేటి

అక్రమాస్తుల కేసులో సీబీఐ విచారణను ఎదుర్కొంటున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్.జగన్మోహన్ రెడ్డి వెంట నడిచిన ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ళనానికి ఈనెల 28వ తేదీ షోకాజ్ నోటీసులు జారీ చేయనున్నట్టు పీసీసీ క్రమశిక్షణా సంఘం ఛైర్మన్ కంతేటి సత్యనారాయణ తెలిపారు. ఆయన శనివారం గాంధీభవన్‌లో పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు జగన్ వెంట తిరుగుతున్న ఎమ్మెల్యే ఆళ్ల నాని, అనకాపల్లి ఎంపీ సబ్బం హరి తీరుపై చర్చించారు.
Source: ఏపీ న్యూస్ | 26 May 2012 | 4:23 am

నితిన్ గడ్కారీతో సమావేశమైన సినీ నటి జయప్రద!

భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన గడ్కారీతో ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రాంపూర్ ఎంపీ జయప్రద శనివారం ఆకస్మికంగా సమావేశమయ్యారు. దీంతో ఆమె కాషాయ తీర్థం పుచ్చుకోవచ్చన్న ఊహాగానాలు వినొస్తున్నాయి. గత సార్వత్రిక ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ నుంచి రాంపూర్ స్థానంలో పోటీ చేసి గెలుపొందిన జయప్రద... ఇపుడు ఆ పార్టీకి దూరమయ్యారు. దీంతో ఆమె వచ్చే ఎన్నికల నాటికి కొత్త గూడును వెతుక్కునే పనిలో ఉన్నారు.
Source: జాతీయ | 26 May 2012 | 2:44 am

అగ్ని-5 క్షిపణుల తయారీకి ఐదేళ్ళ కాలం : సారస్వత్

అగ్ని - 5 క్షిపణుల తయారీకి ఐదేళ్ళకాలం పట్టిందని రక్షణ, పరిశోధనా అభివృద్ధి సంస్థ డైరక్టర్ విజయ్ కుమార్ సారస్వత్ తెలిపారు. దీనిపై ఆయన మాట్లాడుతూ... దివంగత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ, మాజీ రాష్ట్రపతి, భారత అణు శాస్త్రవేత్త అబ్దుల్ కలాం సహకారంతో ఈ క్షిపణిని తయారు చేసినట్టు చెప్పారు.
Source: జాతీయ | 26 May 2012 | 12:37 am

పెట్రోల్ ధరల పెంపునకు నిరసనగా మమతా నేడు ర్యాలీ!

కేంద్ర ప్రభుత్వం ఇటీవల పెంచిన పెట్రోల్ ధరలకు నిరసనగా వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి, యూపీఏ కీలక భాగస్వామ్య పార్టీ అయిన తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ కోల్‌కతాలో భారీ ర్యాలీని నిర్వహించనున్నారు. ఈ ర్యాలీకి ఆమె స్వయంగా నేతృత్వం వహించనున్నారు. దక్షిణ కోల్‌కతాలోని జాదవ్‌పూర్ నుంచి హజ్రా వరకు సుమారు ఏడు కిలోమీటర్ల దూరం సాగే ఈ ర్యాలీలో ఆమె పాల్గొని తన నిరసనను తెలుపుతారని టీఎంసీ వర్గాలు వెల్లడించాయి.
Source: జాతీయ | 26 May 2012 | 12:11 am

భారతీయ జనతా పార్టీలో ముసలం : అద్వానీ, సుష్మ అలక!

భారతీయ జనతా పార్టీలో ముసలం ఏర్పడింది. తాజాగా దేశ వాణిజ్య రాజధాని ముంబైలో జరిగిన ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశం వేదికగా ఇవి బహిర్గతమయ్యాయి. ఇందులోభాగంగా శుక్రవారం సాయంత్రం జరిగిన బీజేపీ ర్యాలీకి ఆ పార్టీ అగ్రనేత ఎల్కే.అద్వానీ, లోక్‌సభ ప్రతిపక్ష నేత సుష్మా స్వరాజ్‌లు డుమ్మా కొట్టారు. దీంతో వీరు లేని లోటు కొట్టొచ్చినట్లు కనిపించింది.
Source: జాతీయ | 25 May 2012 | 10:50 pm