కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి యాకుబ్‌రెడ్డి కేసు ఘటనలో ప్రభుత్వం ఎలాంటి తప్పు చేయకపోతే సుప్రీం కోర్టు నుంచి స్టే ఎందుకు తెచ్చుకుందని జేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ ప్రశ్నించారు. తప్పు చేయని ప్రభుత్వం సీబీఐ విచారణపై సుప్రీం నుంచి స్టే ఎందుకు తెచ్చుకుందన్నారు. యాకుబ్‌రెడ్డి కేసు ఘటనలో బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తప్పు చేయని ప్రభుత్వం తన పిటిషన్‌ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కొత్త మంత్రుల్లో తెలంగాణకు ఎవరూ అనుకూలంగా లేరని కోదండరామ్ అన్నారు.
Source: ఏపీ న్యూస్ | 7 Feb 2012 | 4:01 am
దుబాయ్‌లో విల్లాలు కావాలని కోరినట్లు వస్తున్న ఆరోపణలను నిరూస్తే కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీభవన్‌లో ఉరేసుకుంటానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (ఏపీఐఐసీ) మాజీ ఛైర్మన్ శివరామ సుబ్రహ్మణ్యం సవాల్ చేశారు. విల్లాలు కొనుగోలు చేసినవారిని విచారిస్తే ఎమ్మార్ ప్రాపర్టీస్ కుంభకోణంలో ఎవరి పాత్ర ఉందనేది బయటపడుతుందని శివరామ అన్నారు.
Source: ఏపీ న్యూస్ | 7 Feb 2012 | 3:51 am
ప్రజల సమస్యలు ఏమాత్రం పట్టించుకోని కిరణ్ కుమార్ లాంటి ముఖ్యమంత్రి దేశంలోనే ఎవ్వరూ ఉండబోరని భాజాపా సీనియర్ నేత బండారు దత్తాత్రేయ ధ్వజమెత్తారు. పదవి కోసం ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న కిరణ్ కుమార్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రి మరెవ్వరూ లేరని దత్తాత్రేయ విమర్శించారు.
Source: ఏపీ న్యూస్ | 7 Feb 2012 | 3:48 am
కేబినెట్ విస్తరణకు రాజకీయాలు అంటగట్టవద్దని రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సూచించారు. శాఖల కేటాయింపులో ఎలాంటి రాజకీయ ఉద్దేశ్యంలేదని, ప్రజా ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని మంత్రి వర్గంలోకి తీసుకున్నట్లు సీఎం అన్నారు.మంత్రి వర్గ విస్తరణపై మీడియాలో వస్తున్న విభిన్న కథనాలపై మంగళవారం ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటనలో శాఖల కేటాయింపు పాలనాపరమైన వెసులుబాటు కోసమే జరిగిందని సీఎం పేర్కొన్నారు. కొన్ని ఛానళ్లు, పత్రికలు దీనికి రాజకీయ పరమైన ఉద్దేశ్యాలు జోడించాయని అవన్నీ అవాస్తవాలని ముఖ్యమంత్రి కొట్టి పారేశారు.
Source: ఏపీ న్యూస్ | 7 Feb 2012 | 3:38 am
హాలీవుడ్ అందమైన జంట బ్రాడ్ పిట్, ఏంజిలీనా జోలీ ముద్దుల కుమారుడు 'మేడాక్స్' పైలట్ పాఠాలు నేర్చుకుంటున్నాడని సమాచారం. బ్రాడ్‌పిట్, ఏంజిలీనా జోలీలకు పుట్టిన బిడ్డలు ఐదు సంవత్సరాల 'షైలో' మరియు మూడు సంవత్సరాల వయసు కలిగిన కవలలు నాక్స్, వివియన్నే. వీరితో పాటు బ్రాడ్ పిట్, ఏంజిలీనా జోలీ పది సంవత్సరాల వయసు కలిగిన మేడాక్స్,
Source: Oneindia.in - thatsTelugu | 7 Feb 2012 | 3:33 am
హైదరాబాద్: ప్రాంతీయ ఉద్యమాల కేసులు ఎత్తి వేయాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పోలీసు ఉన్నతాధికారులకు మంగళవారం సూచించినట్లుగా తెలుస్తోంది. రాష్ట్రంలో శాంతిభద్రతలపై ముఖ్యమంత్రి పోలీసు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రాంతీయ ఉద్యమాల కేసులు సాధ్యమైనన్ని ఎత్తివేయాలని వారిని ఆదేశించారని సమాచారం. ఈ కేసుల ఎత్తివేత కూడా బడ్జెట్ సమావేశాలలోగా పూర్తి చేయాలని
Source: Oneindia.in - thatsTelugu | 7 Feb 2012 | 3:24 am
హైదరాబాద్: తాను దుబాయ్‌లో విల్లాలు కావాలని కోరినట్లు నిరూపిస్తే కాంగ్రెసు పార్టీ కార్యాలయం గాంధీభవన్‌లో ఉరేసుకుంటానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (ఎపిఐఐసి) మాజీ చైర్మన్ శివరామ సుబ్రహ్మణ్యం సవాల్ చేశారు. ఎమ్మార్ ప్రాపర్టీస్ కుంభకోణం కేసును పక్కదారి పట్టించేందుకే తనపై అసత్యమైన ఆరోపణలు చేస్తున్నారని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. విల్లాలు
Source: Oneindia.in - thatsTelugu | 7 Feb 2012 | 3:13 am
హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డితో తనకు విభేదాలు ఉంటే ఆమె ఫోటో ఇంట్లో ఎందుకు పెట్టుకుంటానని మంత్రి ప్రసాద్ కుమార్ ప్రశ్నించారు. తనకు ఎనిమిది మంది సోదరీమణులు ఉన్నారని, అలాగే హోం మంత్రి సబితమ్మ తన తొమ్మిదో సోదరి అనుకుంటున్నానని మంత్రి ప్రసాద్ ఓ టీవికి ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. అందరినీ కలుపుకుని పనిచేస్తానని మంత్రి హామీ ఇచ్చారు.
Source: ఏపీ న్యూస్ | 7 Feb 2012 | 2:56 am
హాలీవుడ్‌లో తమకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్న టీనేజ్ పాప్ సింగర్స్ సెలీనా గోమెజ్, జస్టిన్ బైబర్. గత కొన్ని సంవత్సరాలుగా వీరిద్దరూ కలసి డేటింగ్ చేస్తున్న విషయం యావత్ ప్రపంచానికి తెలుసు. ఐతే ఇటీవల వీరిద్దరి సంబంధం గురించి సెలీనా గోమెజ్‌ని ప్రశ్నించగా గోమెజ్ తనదైన శైలిలో బదులిచ్చారు. టీనేజీలో ఉన్న ఇద్దరి ప్రేమికుల మద్య
Source: Oneindia.in - thatsTelugu | 7 Feb 2012 | 2:55 am
కడప: మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి వ్యాఖ్యలకు తిరుపతి శాసనసభ్యుడు చిరంజీవి వర్గం మంత్రి సి.రామచంద్రయ్య కౌంటర్ వేశారు. మంత్రి వర్గంలోకి ఎవరిని తీసుకోవాలనేది ముఖ్యమంత్రి ఇష్టానుసారమేనని అన్నారు. సమర్థతను బట్టే ఆయన మంత్రులను నియమిస్తారని అన్నారు. పాలనాపరమైన సర్దుబాటు కోసమే డిఎల్ రవీంద్రా రెడ్డి శాఖలో కోత విధించి ఉంటారని అన్నారు. కేవలం తన శాఖలో
Source: Oneindia.in - thatsTelugu | 7 Feb 2012 | 2:50 am
వర్మ నాకు అబ్సెస్ అవుతారనుకుంటున్నా...అప్పుడు ఆయన నన్ను బాగా స్క్ర్రీన్ పై బాగా ప్రొజక్ట్ చేస్తారు అంటోంది మంచు లక్ష్మి ప్రసన్న. అవిడ తన తన తాజా చిత్రం డిపార్టమెంట్ గురించి మీడియాతో మాట్లాడుతూ ఇలా లైటర్ వీన్ లో స్పందించింది. అలాగే తాను సంజయ్ దత్ భార్యగా డిపార్టమెంట్ లో నటిస్తూ అక్కడ పరిచయమవుతున్నానని చెప్పింది.
Source: Oneindia.in - thatsTelugu | 7 Feb 2012 | 2:43 am
రాష్ట్రంలో పేదలందరికీ సొంత ఇళ్లు నిర్మించడమే తన లక్ష్యమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. గృహ నిర్మాణ మంత్రిగా ఇళ్ల నిర్మాణ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు కృషి చేస్తానన్నారు. ఇకపై గృహ నిర్మాణంలో పొరపాట్లు జరగకుండా చూస్తానని మంత్రి హామీ ఇచ్చారు. గతంలో తిరుపతి శాసనసభ్యుడు చిరంజీవి వర్గం శాసనసభ్యులకు మాత్రమే మంత్రి పదవులు ఇచ్చినప్పడు అన్యాయం జరిగిందని, ఇప్పుడు పదవులు తీసుకోవడాన్ని తెరాస తప్పు పట్టడం ఏమిటని ఉత్తమ కుమార్ రెడ్డి తెలంగాణవాదులను ప్రశ్నించారు.
Source: ఏపీ న్యూస్ | 7 Feb 2012 | 2:41 am
మాలె: మాల్దీవుల అధ్యక్షుడు మొహమద్ నషీద్ మంగళవారం రాజీనామా చేశారు. సీనియర్ న్యాయమూర్తి అరెస్టుకు వ్యతిరేకంగా ప్రజలు గత వారం రోజులుగా చేస్తున్న నిరసన ప్రదర్శనలు తీవ్ర స్థాయికి చేరడంతో నషీద్ రాజీనామా చేసినట్లు మిలిటరీ ప్రకటించింది. రాజీనామా చేయడానికి నషీద్ అంగీకరించారని, ఉపాధ్యక్షుడు మొహమ్మద్ వాహీద్ హసన్‌కు అధ్యక్ష పదవిని అప్పగించడానికి కూడా ఒప్పుకున్నారని బ్రిగేడియర్
Source: Oneindia.in - thatsTelugu | 7 Feb 2012 | 2:40 am
హైదరాబాద్: మంత్రి వర్గ విస్తరణకు రాజకీయాలు అంటగట్టవద్దని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మంగళవారం సూచించారు. మంత్రి వర్గ విస్తరణపై మీడియాలో భిన్నమైన కథనాలు వస్తోన్న విషయం తెలిసిందే. దీనిపై ముఖ్యమంత్రి కార్యాలయం స్పందించింది. శాఖల కేటాయింపులో ఎలాంటి రాజకీయ ఉద్దేశ్యం లేదన్నారు. ప్రజా ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని ముగ్గురిని మంత్రి వర్గంలోకి తీసుకున్నట్టు చెప్పారు. పాలనాపరమైన
Source: Oneindia.in - thatsTelugu | 7 Feb 2012 | 2:16 am
అత్యంత ప్రతిష్టాత్మకమైన బిజినెస్ స్కూళ్లలో ఒక్కటైన కార్నెల్ జాన్సన్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ డీన్‌గా ఇటీవల పదోన్నతి పొందిన సౌమిత్ర దత్తా ఇంటర్వ్యూను వన్ ఇండియా ప్రత్యేకంగా అందిస్తోంది. ఆయనను ప్రముఖ విద్యావేత్త రాజీవ్ గౌడ్ ఇంటర్వ్యూ చేశారు. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌లో రాజీవ్ గౌడ్ ఆచార్యులుగా పనిచేస్తున్నారు. విధాన నిర్ణయాలు, విద్య, పాలన
Source: Oneindia.in - thatsTelugu | 7 Feb 2012 | 2:11 am
దేశానికి శాపంగా పరిణమించిన లంచావతారాలను న్యాయ వ్యవస్థ ఒక్కటే ఒంటరిగా ఎదిరించలేదని జస్టిస్ ఎ.కె. గంగూలీ వ్యాఖ్యానించారు. వివిధ కంపెనీలకు అక్రమంగా జారీచేసిన 2జి-స్ప్రెక్టం లైసెన్సులను రద్దు చేసిన సుప్రీం కోర్టు ధర్మాసనంలో గంగూలీ సభ్యునిగా ఉన్నారు. అవినీతిపై ఉమ్మడిగా పోరు సాగితేనే విజయం సాధించగలమని ఒక ఇంటర్వ్యూలో ఆయన పేర్కొన్నారు.
Source: జాతీయ | 7 Feb 2012 | 2:10 am
హైదరాబాద్: విస్తరణపై కొందరు ఎమ్మెల్యేల్లో అసంతృప్తి ఉన్నమాట వాస్తవమేనని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ మంగళవారం అన్నారు. వాటిని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి త్వరలో సరి చేస్తారని అన్నారు. అసంతృప్తుల ఆవేదనను పార్టీ అర్థం చేసుకుందని చెప్పారు. వారికి భవిష్యత్తులో న్యాయం చేస్తామని చెప్పారు. శాఖల మార్పుల పైన సిఎం ఆలోచిస్తున్నారని చెప్పారు.
Source: Oneindia.in - thatsTelugu | 7 Feb 2012 | 1:49 am
తెర వెనుక జరిగిన లావాదేవీలతో మంత్రులకు ఎలాంటి సంబంధం లేదని పీసీసి చీఫ్ బొత్స సత్యనారాయణ అన్నారు. మంత్రుల ఆదేశాలకు అనుగుణంగా జరిగిన వాటికే వారి బాధ్యత ఉంటుందని స్పష్టం చేశారు. వివిధ కేసుల్లో ఐఏఎస్ అధికారులను సీబీఐ ప్రశ్నిస్తున్న నేపధ్యంలో బొత్స చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
Source: ఏపీ న్యూస్ | 7 Feb 2012 | 1:26 am
ఆరోగ్య శాఖ మంత్రి డి.ఎల్. రవీంద్రారెడ్డి తన శాఖలో మాత్రమే కోతలు పెట్టారని ఎందుకు అనుకోవాలని దేవాదాయ మంత్రి సి. రామచంద్రయ్య అన్నారు. పాలనాపరమైన సర్దుబాట్ల కోసమే రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కొందరు మంత్రుల శాఖలను తొలగించే నిర్ణయం తీసుకుని ఉంటారని సి. రామచంద్రయ్య అభిప్రాయం వ్యక్తం చేశారు.
Source: ఏపీ న్యూస్ | 7 Feb 2012 | 12:53 am
ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రచారంలో భాగంగా ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా చేపట్టిన మోటార్ సైకిల్ ర్యాలీని అడ్డుకున్నారనే కారణంతో, ఎన్నికల పరిశీలకుడొకరిపై బదిలీ అస్త్రాన్ని ప్రయోగించారన్న ఆరోపణలను ఎన్నికల సంఘం తిరస్కరించింది. సోమవారం పొద్దుపోయిన తర్వాత ఈ అంశంపై ఈసీ వివరణ ఇచ్చింది.
Source: జాతీయ | 7 Feb 2012 | 12:21 am
అవిశ్వాస తీర్మానంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆపద్భాంధవుడిగా ఆదుకున్న పీఆర్పీ మాజీ అధినేత, తిరుపతి శాసనసభ్యుడు చిరంజీవికి అసెంబ్లీలో పెద్దపేట వేసేందుకు రంగం సిద్ధమవుతుంది. కాంగ్రెస్ పార్టీలో ప్రజారాజ్యం పార్టీని విలీనం చేసిన చిరంజీవిని కాంగ్రెస్ శాసనసభా పక్ష (సీఎల్పీ) ఉపనేతగా ఎన్నుకోనున్నట్లు తెలిసింది. చిరంజీవికి తగిన ప్రాధాన్యం ఇవ్వాలంటే ఆయనను సీఎల్పీ ఉపనేతను చేయడమే ఉత్తమమని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. రాజ్యసభ ఎన్నికలు జరిగితే చిరంజీవి ఎలాగో పెద్దల సభకు వెళ్లడం ఖాయమని, ఈ లోపు శాసనసభలో చిరంజీవికి తగిన గౌరవం ఇవ్వాలని కాంగ్రెస్ భావిస్తోంది.
Source: ఏపీ న్యూస్ | 7 Feb 2012 | 12:08 am
అధికారం కోసం భారతీయ జనతా పార్టీ చౌకబారు రాజకీయాలకు పాల్పడుతుందని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ ఆరోపించారు. 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణం విషయంలో ఢిల్లీ కోర్టు హోం శాఖ మంత్రి పి.చిదంబరానికి అనుకూలంగా తీర్పు రావటంతో సింఘ్వీ ప్రధాన ప్రతిపక్షమైన బీజేపీపై విరుచుకుపడ్డారు. అధికారంలో ఉన్న యుపిఎ ప్రభుత్వాన్ని బీజేపీ చౌకబారు రాజకీయాల ద్వారా అస్థిరపరిచి, కేంద్రంలో అధికారం కోసం బీజేపీ పాకులాడుతుందని సింఘ్వీ విమర్శించారు. ప్రధాన ప్రతిపక్షం భాద్యతా రాహిత్యంతా వ్యవహరిస్తుందన్నారు.
Source: జాతీయ | 6 Feb 2012 | 11:35 pm
దేశాన్ని కుదిపేసిన 2జీ స్పెక్ట్రమ్‌కు సంబంధించిన 122 లైసెన్సులను సుప్రీం కోర్టు రద్దు చేసిన అంశంపై ప్రధాని మన్మోహన్ సింగ్, హోం శాఖ మంత్రి పి.చిదంబరం వెంటనే రాజీనామా చేయాలని ప్రముఖ గాంధేయ వాది అన్నా హజారే బృందం సభ్యుడు శాంతి భూషణ్ డిమాండ్ చేశారు. 2జీ స్పెక్ట్రమ్‌కు సంబంధించిన 122 లైసెన్సుల విషయంలో భారీ నష్టం వాటిల్లకుండా ఉండేందుకు వారు ఎలాంటి చర్యలు తీసుకోవలేదని శాంతి భూషణ్ ఆరోపించారు.
Source: జాతీయ | 6 Feb 2012 | 11:30 pm
రైతు పోరుబాట చేస్తున్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రైతన్నలకు ఏం చేశాడు అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ అడిగారు. చంద్రబాబు ప్రస్తుతం సంక్షోభంలో ఉన్నారని, పార్టీని కాపాడేందుకు బాగా కష్టపడుతున్నారని కన్నా దుయ్యబట్టారు.రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, యూపీఏ ఛైర్ పర్సన్ సోనియా గాంధీ తనకు అప్పగించిన ఈ మంత్రి పదవిని సమర్థవంతంగా నిర్వర్తిస్తానని చెప్పారు. వ్యవసాయ శాఖను సవాలుగా తీసుకుని పనిచేస్తానని కన్నా ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.
Source: ఏపీ న్యూస్ | 6 Feb 2012 | 11:12 pm
మహారాష్ట్రలో స్థానిక ఎన్నికలు భారీ భద్రతుల నడుమ మంగళవారం ఉదయం ప్రారంభమైంది. మహారాష్ట్ర జనాభాలో దాదాపు ఎక్కువ శాతం గ్రామీణ, అర్బన్ ప్రాంతాల్లో జరిగే స్థానిక ఎన్నికల్లో 27 జిల్లా పరిషత్, 305 పంచాయతీలకు పోలింగ్ జరగనుందని అధికారి ఒకరు తెలిపారు.అయితే రాష్ట్రంలో చలి తీవ్రత ఎక్కువుగా వుండటం వల్ల పోలింగ్ బూత్‌ల వద్ద జన ప్రభావం అంతగా లేదని, కాని పోలింగ్ పక్రియ ఉదయం 7:30 ని కే ప్రారంభమైయి, సాయంత్రం 5:30ని వరకూ కొనసాగుతుందని, అయితే నిషేదిత గడ్చిరోలి ప్రాంతంలో మాత్రం 3:30ని మాత్రమే ఎన్నికల పక్రియ ముగుస్తుందని తెలిపారు.
Source: జాతీయ | 6 Feb 2012 | 10:13 pm
ఉత్తరప్రదేశ్‌లోని అధికార బీఎస్పీని సమాజ్‌వాది పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ ఎండగట్టారు. తమ పార్టీకి అధికారం అప్పగిస్తే ఉత్తరప్రదేశ్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని ములాయం హామీ ఇచ్చారు. యూపీలోని బీఎస్పీ ప్రభుత్వం పీకల్లోతు అవినీతిలో కూరుకుపోయిందని ములాయం విరుచుకుపడ్డారు.
Source: జాతీయ | 6 Feb 2012 | 10:01 pm
యాంట్రిక్స్-దేవాస్ ఒప్పందం విషయంలో ఇస్రో మాజీ చీఫ్ మాధవన్ నాయర్‌కు తనకు మధ్య ఎలాంటి విభేదాలు లేవని ప్రస్తుత ఇస్రో చీఫ్ కె.రాధాకృష్ణన్ స్పష్టం చేశారు. తనను ఏమాత్రం విచారించకుండానే ఒప్పందంలో అనేక లొసుగులు చోటుచేసుకున్నట్లు అధికార నివేదికలో పేర్కొన్నారని, ఇది పిరికిపంద చర్యగా ఉందని నాయర్ ఆరోపణలు చేస్తున్నారు.దీనిపై రాధాకృష్ణన్ మాట్లాడుతూ ఒప్పందంలోని లోపాలు, లొసుగులు, సిఫారసులను వివరిస్తూ ప్రత్యూష్ సిన్హా కమిటీ తమకు అందజేసిన లేఖ పూర్తి పాఠాన్ని నాయర్‌తో పాటు మరో ఏడుగురు అధికారులకు పంపామని చెప్పారు. ఈ కమిటీ గత జూలైలో పంపిన లేఖకు నాయర్ వివరణ ఇచ్చారని వివరించారు. తర్వాత వ్యక్తిగతంగా తన వాదన వినిపించుకునేందుకు కూడా నాయర్‌కు కమిటీ చైర్మన్ అనుమతి ఇచ్చారన్నారు. తనకు ఎవరిపైనా వ్యక్తిగత కక్షలు లేవు. మేం ఎక్కడా పిరికివారిలా వ్యవహరించలేదని ఆయన స్పష్టం చేశారు.
Source: జాతీయ | 6 Feb 2012 | 5:19 pm
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా మంగళవారం తొలి దశ ఎన్నికల పోలింగ్ జరుగనుంది. ఈ దశలో మొత్తం 55 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగనుంది. ఎంతో వాడివేడిగా సాగిన ప్రచారం సోమవారం సాయంత్రంతో ముగిసింది. కాగా, తొలి దశ పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు రెండు లక్షలకు పైగా భద్రతా సిబ్బందిని ఎన్నికల బందోబస్తు కోసం వినియోగిస్తున్నారు. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రంగా గుర్తింపు పొంది ఉత్తరప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు మొత్తం 403 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. ఈ స్థానాలకు ఈనెల ఎనిమిదో తేదీ నుంచి మార్చి ఏడో తేదీ వరకు ఏడు దశల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. ఇందులోభాగంగా పైసాబాద్, సిదాపూర్, బస్తీతో సహా మొత్తం 10 జిల్లాల్లో ఉన్న 55 అసెంబ్లీ స్థానాలకు ఈనెల ఎనిమిదో తేదీన పోలింగ్ నిర్వహించనున్నారు.
Source: జాతీయ | 6 Feb 2012 | 3:25 pm
తన భర్త రాబర్ట్ వద్రా రాజకీయ రంగ ప్రవేశంపై వస్తున్న ఊహాగానాలకు ఆయన సతీమణి, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కుమార్తె ప్రియాంక గాంధీ సోమవారం తెరదించారు. తన భర్త రాబర్ట్ వద్రా హ్యాపీ బిజినెస్‌మేన్ అని, ఆయన రాజకీయాల్లోకి రారని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ప్రియాంక గాంధీ తన సోషల్ నెట్‌వర్క్ సైట్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రచారంలో అమేథీ ఎంపీ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, రాబర్ట్ వద్రాలు నిమగ్నమైవున్నారు. ఈ సందర్భంగా ముఖ్యంగా తమ కుటుంబానికి కంచుకోటలుగా ఉన్న అమేథీ, రాయ్‌బరేలీ స్థానాల్లో ప్రియాంక గాంధీ తరచూ పర్యటిస్తూ ప్రచారం చేస్తున్నారు. ఆమెతో పాటు.. రాబర్ట్ వద్రా కూడా అక్కడ పర్యటనలు నిర్వహిస్తున్నారు. దీంతో ఆయన రాజకీయాల్లోకి రావొచ్చని ఊహాగానాలు వస్తున్నాయి. ఇదే అంశాన్ని రాహుల్ గాంధీ కూడా సూచన ప్రాయంగా వెల్లడించారు. దీనిపై ప్రియాంక గాంధీ స్పందించారు. తన భర్త హ్యాపీ బిజినెస్‌మేన్ అని ఆయన రాజకీయాల్లోకి రారని చెప్పారు.
Source: జాతీయ | 6 Feb 2012 | 12:44 pm
2జీ స్పెక్ట్రమ్ స్కామ్‌లో ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్, కేంద్ర హోం మంత్రి చిదంబరంలు తమ పదవులకు రాజీనామా చేయాలని అన్నా బృందం సభ్యుడు, ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ డిమాండ్ చేశారు. దీనిపై ఆయన సోమవారం బెంగుళూరులో మాట్లాడుతూ... 2జీ స్కామ్‌లో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు తర్వాత వీరిద్దరు రాజీనామా చేసి ఉండాల్సిందన్నారు. ముఖ్యంగా 2జీ కేసులో చిదంబరం పాత్రపై పూర్తి స్థాయి విచారణను కొనసాగించాలన్నారు. 2జీ స్కామ్‌లో కేంద్ర టెలికామ్ శాఖామంత్రి ఏ.రాజాతో పాటు మరికొందరిపై కుట్ర చేసినట్టు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయనీ, కానీ, చిదంబరంకు వ్యతిరేకంగా అలాంటి ఆధారాలు ఏమీ లేవని సీబీఐ ట్రయల్ కోర్టు పేర్కొందని ఆయన గుర్తు చేశారు. కానీ, ఈ కేసులో చిదంబరానికి వ్యతిరేకంగా ఆధారాలను సేకరించాలంటే ఖచ్చితంగా పూర్తి స్థాయి విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.
Source: జాతీయ | 6 Feb 2012 | 10:06 am