అమెరికాలో మూతపడిన మరో ఐదు బ్యాంకులు!

ప్రపంచ ఆర్థిక మాంద్యం నుంచి అమెరికా బ్యాంకులు ఇప్పట్లో కోలుకునే పరిస్థితి కనిపించడం లేదు. శుక్రవారం మరో ఐదు బ్యాంకులు మూతపడ్డాయి. దీంతో ఇప్పటి వరకు మూతపడిన బ్యాంకుల సంఖ్య 108కు చేరుకుంది. మూత పడిన ఐదు బ్యాంకులు వాయువ్య, నైరుతి అమెరికా ప్రాంతాల్లో ఉన్నాయి.
Source: Yahoo! Telugu: News | 31 Jul 2010 | 9:20 am

భారత్‌లో 2020 నాటికి నీటి కొరత: అమెరికా హెచ్చరిక

శరవేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో రెండో స్థానంలో ఉన్న భారత్‌లో మరో పదేళ్ల తర్వాత తీవ్రమైన నీటి ఎద్దడి ఏర్పడుతుందని అమెరికా హెచ్చరించింది. రాష్ట్రాల మధ్య నెలకొనే నీటి, సరిహద్దు సమస్యల కారణంగా ఈ నీటి కొరత నెలకొంటుందని అమెరికా విదేశాంగ సహాయ మంత్రి రాబర్ట్ బ్లేక్ అభిప్రాయపడ్డారు.
Source: Yahoo! Telugu: News | 31 Jul 2010 | 8:48 am

కామన్వెల్త్ క్రీడల ఏర్పాట్లపై కార్యదర్శితో సమీక్ష: పీఎంఓ

కామన్వెల్త్ క్రీడల ఏర్పాట్లలో తీవ్ర జాప్యం జరుగుతోందని వస్తున్న వార్తలపై ప్రధానమంత్రి కార్యాలయం జోక్యం చేసుకుంది. ఏర్పాట్లపై కేబినెట్ కార్యదర్శితో సమీక్ష చేయాల్సిందిగా పీఎంఓ ఆదేశాలు జారీ చేసింది. దీంతో కేబినెట్ సెక్రటరీ కె.ఎం.చంద్రశేఖర రంగంలోకి దిగి కామన్వెల్త్ క్రీడల ఏర్పాట్లపై సమీక్ష చేసి పీఎంఓకు నివేదిక సమర్పించనున్నారు.
Source: Yahoo! Telugu: News | 31 Jul 2010 | 8:39 am

కాంగ్రెస్ ఉప్పు నీటిలో జగన్ మంచినీటి బిందువు: అంబటి

కాంగ్రెస్ అనే ఉప్పునీటి సముద్రంలో వైఎస్.జగన్మోహన్ రెడ్డి ఒక మంచినీటి బిందువు అని సస్పెండ్‌కు గురైన పీసీసీ ప్రధాన కార్యదర్శి అంబటి రాంబాబు మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. అధిష్టానం ఈ విషయాన్ని గుర్తించి అంబటి సేవలను పార్టీకి వినియోగించుకోవాలని ఆయన సూచించారు.
Source: Yahoo! Telugu: News | 31 Jul 2010 | 8:37 am

పాకిస్థాన్‌లో భారీ వరదలు: 400 మందికి పైగా మృతి!

పాకిస్థాన్‌ను భారీ వరదలు ముంచెత్తుతున్నాయి. ఎడతెరపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలు, వరద కారణంగా ఇప్పటి వరకు సుమారు 400 మంది పైగా మరణించారు. మరో నాలుగు లక్షల మంది వరకు నిరాశ్రయులైనట్టు స్థానిక అధికారులు వెల్లడించారు. అలాగే ఆప్ఘనిస్థాన్ సరిహద్దు ప్రాంతాల్లో కూడా భారీ వర్షాల కారణంగా వరదలు సంభవించాయి. వీటికి మరో 60 మంది మృతి చెందారు.
Source: Yahoo! Telugu: News | 31 Jul 2010 | 7:33 am

కాశ్మీర్‌లో మళ్లీ చెలరేగిన అల్లర్లు: నలుగురి మృతి!

కాశ్మీర్ లోయలో మళ్లీ అల్లర్లు చెలరేగాయి. ఫలితంగా నలుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో కాశ్మీర్ లోయలోని ప్రధాన ప్రాంతాల్లో నిరవధిక కర్ఫ్యూను విధించారు. నలుగురి మృతితో ఆగ్రహోద్రుక్తులైన స్థానికులు రోడ్లపైకి వచ్చి భద్రతా దళాలతో తలపడ్డాయి. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
Source: Yahoo! Telugu: News | 31 Jul 2010 | 7:12 am

సెయిల్ పెట్టుబడుల ఉపసంహరణకు తీవ్ర వ్యతిరేకత!

స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్)లో పెట్టుబడుల ఉపసంహరణకు అన్ని కార్మిక సంఘాల యూనియన్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ విషయాన్ని శుక్రవారం జరిగిన రాజ్యసభ సమావేశాల్లో కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఏ.సాయి ప్రతాప్ వెల్లడించారు
Source: Yahoo! Telugu: News | 31 Jul 2010 | 6:57 am

తెదేపాకు వ్యతిరేకంగా రాజకీయ కుట్ర: ఎర్రబెల్లి దయాకర్

ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీని నిర్వీర్యం చేసేందుకు గాను రాజకీయ కుట్ర సాగుతోందని ఆ పార్టీ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపించారు. ఈ కుట్రలో తెలంగాణ రాష్ట్ర సమితి, కాంగ్రెస్‌ పార్టీలు పాలు పంచుకుంటున్నాయని ఆయన సందేహం వ్యక్తం చేశారు.
Source: Yahoo! Telugu: News | 31 Jul 2010 | 6:32 am

తెలంగాణ అంశం సర్వరోగ నివారిణి కాదు: జయప్రకాష్

రాష్ట్ర విభజనపై నెలకొన్న సమస్యను పరిష్కరించేందుకు తెలంగాణ అంశం సర్వరోగ నివారిణి కాదని లోక్‌సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ అభిప్రాయపడ్డారు. ఆయన శనివారం విశాఖపట్నంలో విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ ఉప ఎన్నికల్లో ఓటర్లను డబ్బు, మద్యం వంటి అంశాలు ఓటర్లను ఏమాత్రం ప్రభావితం చేయలేదన్నారు. అదేసమయంలో ఆ ప్రాంత ప్రజలు ఆగ్రహావేశాలతో ఉన్నారని, అందువల్ల ప్రస్తుతం తెలంగాణ అంశంపై స్పందించడం మంచిది కాదన్నారు.
Source: Yahoo! Telugu: News | 31 Jul 2010 | 6:24 am

బికినీ వేసినంత మాత్రాన నగ్నంగా నటిస్తానా...?

మనం నిత్యం ఎన్నో చూస్తుంటాం. మనకు నచ్చినవి కొన్ని ఉంటాయి. నచ్చనివి కొన్ని ఉంటాయి. పురాతన కట్టడాల్లో, దేవాలయాల్లో బొమ్మల్లో ఎంతో శృంగారం దాగి ఉంది. అవి మంచివి కాకపోతే వాటి గురించి ఎందుకు గొప్పగా చెపుతాం. మంచి చెడు మనం చూసే దృష్టిని బట్టి ఉంటుంది. అయితే నేను హాలీవుడ్ చిత్రంలో నగ్నంగా నటిస్తానని కొన్ని వార్తలు వచ్చాయి. నేను భారతీయురాలిని. ఎంత బికినీ చేసినా నగ్నంగా ఎలా నటిస్తాను అని ప్రశ్నించింది. అలాగే ఆర్నెల్లపాటు నేను ఎవరినో పెండ్లి చేసుకుని హాయిగా ఎంజాయ్ చేస్తున్నట్లు రాసేశాయి. పెళ్లి అనేది పవిత్రం. దాన్ని ఎవరికీ తెలియకుండా ఎలా చేసుకుంటాం అంది.
Source: Yahoo! Telugu: Entertainment | 31 Jul 2010 | 6:16 am

సెంటిమెంట్ వల్లే తెరాస అభ్యర్థుల విజయం: పురంధేశ్వరి!

తెలంగాణ ప్రాంత ప్రజల్లో సెంటిమెంట్ బలంగా ఉండటం వల్లే తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థులు ఘన విజయం సాధించారని కేంద్ర సహాయ మంత్రి పురంధేశ్వరి అభిప్రాయపడ్డారు. ఆమె శనివారం విశాఖలో మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ఉప ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును ప్రతి ఒక్కరూ ప్రతి రాజకీయ పార్టీ గౌరవించి తీరాలన్నారు.
Source: Yahoo! Telugu: News | 31 Jul 2010 | 6:15 am

కామన్వెల్త్ క్రీడల ఏర్పాట్లపై కార్యదర్శితో సమీక్ష: పీఎంఓ

కామన్వెల్త్ క్రీడల ఏర్పాట్లలో తీవ్ర జాప్యం జరుగుతోందని వస్తున్న వార్తలపై ప్రధానమంత్రి కార్యాలయం జోక్యం చేసుకుంది. ఏర్పాట్లపై కేబినెట్ కార్యదర్శితో సమీక్ష చేయాల్సిందిగా పీఎంఓ ఆదేశాలు జారీ చేసింది. దీంతో కేబినెట్ సెక్రటరీ కె.ఎం.చంద్రశేఖర రంగంలోకి దిగి కామన్వెల్త్ క్రీడల ఏర్పాట్లపై సమీక్ష చేసి పీఎంఓకు నివేదిక సమర్పించనున్నారు.
Source: జాతీయ | 31 Jul 2010 | 3:09 am

కాంగ్రెస్ ఉప్పు నీటిలో జగన్ మంచినీటి బిందువు: అంబటి

కాంగ్రెస్ అనే ఉప్పునీటి సముద్రంలో వైఎస్.జగన్మోహన్ రెడ్డి ఒక మంచినీటి బిందువు అని సస్పెండ్‌కు గురైన పీసీసీ ప్రధాన కార్యదర్శి అంబటి రాంబాబు మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. అధిష్టానం ఈ విషయాన్ని గుర్తించి అంబటి సేవలను పార్టీకి వినియోగించుకోవాలని ఆయన సూచించారు.
Source: ఏపీ న్యూస్ | 31 Jul 2010 | 3:08 am

కాశ్మీర్‌లో మళ్లీ చెలరేగిన అల్లర్లు: నలుగురి మృతి!

కాశ్మీర్ లోయలో మళ్లీ అల్లర్లు చెలరేగాయి. ఫలితంగా నలుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో కాశ్మీర్ లోయలోని ప్రధాన ప్రాంతాల్లో నిరవధిక కర్ఫ్యూను విధించారు. నలుగురి మృతితో ఆగ్రహోద్రుక్తులైన స్థానికులు రోడ్లపైకి వచ్చి భద్రతా దళాలతో తలపడ్డాయి. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
Source: జాతీయ | 31 Jul 2010 | 1:42 am

తెదేపాకు వ్యతిరేకంగా రాజకీయ కుట్ర: ఎర్రబెల్లి దయాకర్

ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీని నిర్వీర్యం చేసేందుకు గాను రాజకీయ కుట్ర సాగుతోందని ఆ పార్టీ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపించారు. ఈ కుట్రలో తెలంగాణ రాష్ట్ర సమితి, కాంగ్రెస్‌ పార్టీలు పాలు పంచుకుంటున్నాయని ఆయన సందేహం వ్యక్తం చేశారు.
Source: ఏపీ న్యూస్ | 31 Jul 2010 | 1:06 am

తెలంగాణ అంశం సర్వరోగ నివారిణి కాదు: జయప్రకాష్

రాష్ట్ర విభజనపై నెలకొన్న సమస్యను పరిష్కరించేందుకు తెలంగాణ అంశం సర్వరోగ నివారిణి కాదని లోక్‌సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ అభిప్రాయపడ్డారు. ఆయన శనివారం విశాఖపట్నంలో విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ ఉప ఎన్నికల్లో ఓటర్లను డబ్బు, మద్యం వంటి అంశాలు ఓటర్లను ఏమాత్రం ప్రభావితం చేయలేదన్నారు. అదేసమయంలో ఆ ప్రాంత ప్రజలు ఆగ్రహావేశాలతో ఉన్నారని, అందువల్ల ప్రస్తుతం తెలంగాణ అంశంపై స్పందించడం మంచిది కాదన్నారు.
Source: ఏపీ న్యూస్ | 31 Jul 2010 | 12:54 am

సెంటిమెంట్ వల్లే తెరాస అభ్యర్థుల విజయం: పురంధేశ్వరి!

తెలంగాణ ప్రాంత ప్రజల్లో సెంటిమెంట్ బలంగా ఉండటం వల్లే తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థులు ఘన విజయం సాధించారని కేంద్ర సహాయ మంత్రి పురంధేశ్వరి అభిప్రాయపడ్డారు. ఆమె శనివారం విశాఖలో మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ఉప ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును ప్రతి ఒక్కరూ ప్రతి రాజకీయ పార్టీ గౌరవించి తీరాలన్నారు.
Source: ఏపీ న్యూస్ | 31 Jul 2010 | 12:45 am

పలు రాజకీయ పార్టీల గుర్తింపును రద్దు చేసిన ఈసీ!

వివిధ రాజకీయ పార్టీల గుర్తింపును రద్దు చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. అలాగే, కేంద్ర మాజీ మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) పార్టీ జాతీయ గుర్తింపును కూడా ఈసీ రద్దు చేసింది. మరో ఐదు పార్టీలు వివిధ రాష్ట్రాల్లోని పార్టీ గుర్తింపును కూడా కోల్పోయాయి.
Source: జాతీయ | 31 Jul 2010 | 12:22 am

డీఎస్... మీ సారథ్యం చాలు.. ఇక తప్పుకోండి: కాకా

తెలంగాణ ఉప ఎన్నికల ఫలితాలు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ పదవికి ఎసరు పెట్టేలా కనిపిస్తున్నాయి. ఉప ఎన్నికల ఫలితాలకు నైతిక బాధ్యత వహిస్తూ డీఎస్ రాజీనామా చేయాలనే విమర్శలు నలువైపులా వస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతానికి చెందిన వృద్ధ నేతలే ఈ తరహా డిమాండ్ చేస్తున్నారు. దీంతో డీఎస్‌కు ఏం చేయాలో పాలుపోవడం లేదు.
Source: ఏపీ న్యూస్ | 30 Jul 2010 | 11:14 pm

సొహ్రాబుద్దీన్ కేసును వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలి: సీబీఐ

సొహ్రాబుద్దీన్ నకిలీ ఎన్‌కౌంటర్ కేసు విచారణను గుజరాత్ నుంచి మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని ఈ కేసును విచారిస్తున్న కేంద్ర నేర పరిశోధనా సంస్థ (సీబీఐ) కోరింది. సుప్రీంకోర్టు ఆదేశం మేరకు ఈ కేసును విచారిస్తున్న సీబీఐ.. కేసును మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని ఉన్నత న్యాయస్థానాన్ని కోరినట్టు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు గుజరాత్‌లో నిష్పక్షపాతంగా కొనసాగడం లేదని అందువల్ల మరోరాష్ట్రానికి బదిలీ చేయాలని కోరారు.
Source: జాతీయ | 30 Jul 2010 | 10:17 pm

సీబీఐ తాటాకు చప్పుళ్ళకు భయపడబోం: నరేంద్ర మోడీ

సొహ్రాబుద్దీన్ ఎన్‌కౌంటర్ పేరుతో సీబీఐ చేస్తున్న తాటాకు చప్పుళ్ళకు భయపడే ప్రసక్తే లేదని గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. ఈ కేసులో సీబీఐ తనను విచారించవచ్చనే వార్తలు మీడియాలో వస్తున్నాయి. దీనిపై ఆయన పై విధంగా స్పందించారు.
Source: జాతీయ | 30 Jul 2010 | 9:52 pm

గుడ్లప్పగించి చూస్తుండి పోయా: సమంత

నా అదృష్టం ఏమిటోగానీ మొట్టమొదటి సినిమాతోనే హిట్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్నానని సమంత చెప్పింది. ఇందుకు గౌతమ్ మీనన్‌కు థ్యాంక్స్ చెప్పింది. లేటెస్ట్‌గా ఎన్టీఆర్‌తో బృందావనంలో నటిస్తోంది. ఈ చిత్రం షూటింగ్‌లో ఆయనతో అనుభవాన్ని గురించి చెపుతూ... నా పాత్రలో సాంప్రదాయం, సెక్సీతనం రెండూ కలిసి ఉన్నాయి. ఎన్టీఆర్‌తో డాన్స్ చేసే సన్నివేశముంది. ఆయన డైలాగులు, డాన్స్ చేస్తుంటే అలా చూస్తుండిపోయాను. నోట మాట రాలేదు. అమ్మో ఆయనతో చేయడం చాలా కష్టం. అందుకే ఆయన సినిమాలన్నీ చూసేసి సెట్లోకి వెళ్లానని చెప్పింది. ఇండస్ట్రీలో ఎవరికీ గ్యారంటీ లేదు. టాలెంట్‌తోపాటు అదృష్టం ఉండాలని చెప్పింది. నిజమే కదా...!!
Source: Yahoo! Telugu: Entertainment | 30 Jul 2010 | 10:03 am

ఇక తెలంగాణాను ఆపటం ఎవరి తరం కాదు: కేసీఆర్

ఉపఎన్నికల్లో తెలంగాణా ప్రజలు తమ గుండెల్లోని ఆకాంక్షను చీల్చి బయటకు తెచ్చి తెరాసకు ఓట్లుగా మలిచారనీ, ఇక తెలంగాణా రాష్ట్రాన్ని ఆపటం ఎవరి తరమూ కాదని తెలంగాణా రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్ అన్నారు. రాష్ట్ర విభజన జరిగే వరకూ తెలంగాణా ప్రజలు ఇదే స్ఫూర్తితో ఉండాలని పిలుపునిచ్చారు.
Source: ఏపీ న్యూస్ | 30 Jul 2010 | 9:54 am

నాడు ప్రజారాజ్యం... నేడు తెదేపా గల్లంతు: విజయశాంతి

గత సాధారణ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ గల్లంతైందని... ఈ ఉప ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ అడ్రస్ లేకుండా పోయిందని తెలంగాణ రాష్ట్ర సమితి మహిళా నేత, మెదక్ ఎంపీ విజయశాంతి జోస్యం చెప్పారు. ఎన్నికల ఫలితాలపై ఆమె స్పందిస్తూ.. ఉప ఎన్నికలు జరిగిన 12 సెగ్మెంట్లలో అధికార, ప్రతిపక్ష పార్టీల సభ్యులకు ధరావత్తు గల్లంతైందని ఆమె గుర్తు చేశారు.
Source: ఏపీ న్యూస్ | 30 Jul 2010 | 7:02 am

వీళ్లు మళ్లీ రాజీనామా చేస్తారేమో: నారాయణ సందేహం!

ఉప ఎన్నికల్లో విజయభేరీ మోగించిన తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యులు మళ్లీ రాజీనామా చేస్తారేమోననే సందేహాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ సందేహం వ్యక్తం చేశారు. ఈ విజయ గర్వంతో మరోమారు రాజీనామాలు చేస్తే ప్రజలు తగిన బుద్ధిచెపుతారని ఆయన జోస్యం చెప్పారు.
Source: ఏపీ న్యూస్ | 30 Jul 2010 | 6:52 am

పబ్లిక్‌లో హీరోయిన్ ప్యాంట్ పుటుక్కు జర జర...

ఆమధ్య షెర్లిన్ చోప్రా వేసుకున్న టాప్ ఊడి దబ్బున కిందపడిన సంఘటనను మరిచిపోక ముందే ఇటువంటి సంఘటనే మరొకటి రిపీట్ అయింది. కాకపోతే ఈసారి షెర్లిన్ చోప్రా స్థానంలో మరొక హీరోయిన్ ఉన్నది. ఇంతకీ ఎవరా హీరోయిన్.. అంటారా...? సోనమ్ కపూర్. సోనమ్ కపూర్ ఇటీవల ఓ మీడియా సమావేశంలో ఫ్యాషనబుల్ ప్యాంట్ వేసుకుని నడుము ఊపుకుంటూ వారి ముందుకొచ్చి మాట్లాడటానికి సిద్ధమైంది. ఇంతలో ఆమె వేసుకున్న ప్యాంటు బొత్త ఒకటి ఊడిపోవడంతో అది కాస్తా గబుక్కున కిందకు జారిపోయింది. అంతే..! ఆ దృశ్యాన్ని చూసిన పాత్రికేయులు ఒకరకమైన ట్రాన్స్‌లోకి వెళ్లిపోయారు. ఇది గమనించిన సోనమ్ పర్సనల్ మేనేజర్ గబుక్కున ఊడి కింద పడ్డ ప్యాంటును తిరిగి సోనమ్ చేతికందించారు. జారిపోతున్న ప్యాంటును చేతబట్టుకుని సోనమ్ బిలబిలమంటూ తన రూమ్‌లోకి పరుగెట్టింది. మీడియావారు మాత్రం తిరిగి సోనమ్ వస్తుందేమోనని ఎదురు చూశారు. కానీ ప్యాంటు జారిన బాధలో సోనమ్ తిరిగి వారికి ముఖం చూపించలేదు.
Source: Yahoo! Telugu: Entertainment | 30 Jul 2010 | 6:47 am

స్థానిక సమస్యలే విజయానికి కారణం: మొయిలీ

తెలంగాణ ప్రాంతంలో 12 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అభ్యర్థులు గెలుపొందడానికి స్థానిక సమస్యలే ప్రధాన కారణమని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్, కేంద్ర మంత్రి వీరప్ప మొయిలీ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఉప ఎన్నికల ఫలితాలపై ఆయనను ఢిల్లీలో శుక్రవారం మీడియా మాట్లాడుతూ పైవిధంగా స్పందించారు.
Source: ఏపీ న్యూస్ | 30 Jul 2010 | 5:24 am

కాశ్మీరీ గ్రూపులతో చర్చించేందుకు కేంద్రం సిద్ధం: పీసీ

కాశ్మీర్ లోయలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులపై కాశ్మీరీ గ్రూపులతో చర్చించేందుకు కేంద్రం సిద్ధంగా ఉన్నట్టు కేంద్ర హోంశాఖామంత్రి పి.చిదంబరం తెలిపారు. దీనిపై ఆయన శుక్రవారం న్యూఢిల్లీలో మాట్లాడుతూ కాశ్మీర్ అంశంపై తాను నిర్వహించిన సమావేశంలో విభిన్న రకాల అభిప్రాయాలు వ్యక్తమైనట్టు చెప్పారు. అయితే, కాశ్మీర్‌లోని వివిధ గ్రూపులతో చర్చలు జరిపేందుకు సిద్ధమని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ చెప్పారని గుర్తు చేశారు.
Source: జాతీయ | 30 Jul 2010 | 4:49 am

తెలంగాణా కాంగ్రెస్ నేతలు దద్దమ్మలు: అందుకే తెరాస స్వీప్

తెలంగాణాలో జరిగిన ఉపఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయానికి తెలంగాణా ప్రాంత కాంగ్రెస్ నేతలే కారణమని కాంగ్రెస్ నాయకుడు అనంత వెంకట్రామిరెడ్డి అభిప్రాయపడ్డారు. ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలన్న పట్టుదల అక్కడి నేతల్లో ఏ కోశానా కనబడలేదన్నారు.
Source: ఏపీ న్యూస్ | 30 Jul 2010 | 4:21 am

కేంద్ర ఎన్నికల సంఘం పీఠంపై తొలి ముస్లిం వ్యక్తి!

కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌గా ఎస్.వై.ఖురేషీ బాధ్యతలు స్వీకరించారు. కేంద్ర సీఈసీ బాధ్యతలు చేపట్టిన తొలి ముస్లిం వ్యక్తిగా ఆయన రికార్డు సృష్టించారు. ప్రజాసేవలో ఉన్న ఆయనకు 35 సంవత్సరాల అనుంభవాన్ని గడించిన ఈయన కేంద్ర సీఈసీగా ఆయన రెండు సంవత్సరాల కంటే తక్కువ కాలం కొనసాగనున్నారు.
Source: జాతీయ | 30 Jul 2010 | 3:14 am