పెట్టుబడుల కోసం బ్రిటన్‌‌ కంపెనీలతో చర్చలు: ప్రభుత్వం

దేశీయ మౌలికరంగ సదుపాయాల ప్రాజెక్ట్‌లలో పెట్టుబడులను సేకరించేందుకు ప్రభుత్వం బ్రిటన్‌కు చెందిన కంపెనీలతో చర్చలు జరుపుతున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి కమల్ నాథ్ తెలిపారు. అయితే కంపెనీల పేర్లను మాత్రం కమల్ వెల్లడించలేదు.
Source: Yahoo! Telugu: News | 29 Jul 2010 | 9:16 am

బ్రిటీష్ ప్రధాని కెమెరాన్ వ్యాఖ్యలపై పాకిస్థాన్ మండిపాటు!

బ్రిటన్ ప్రధానమంత్రి డేవిడ్ కెమెరాన్ చేసిన వ్యాఖ్యలపై పాకిస్థాన్ తీవ్రంగా మండిపడింది. భారత్ పర్యటనలో ఉన్న ఆయన ఇస్లామాబాద్ యంత్రాంగం తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ ఇతర దేశాలకు ఎగుమతి చేస్తోందని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను పాక్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అబ్దుల్ బాసిక్ ఖండిస్తూ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు.
Source: Yahoo! Telugu: News | 29 Jul 2010 | 9:14 am

ఆహార ద్రవ్యోల్బణ ప్రభావం: సెన్సెక్స్, నిఫ్టీల వృద్ధి!

ఆహార ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడం బాంబే స్టాక్ మార్కెట్ వృద్ధిని నమోదు చేసుకుంది. ట్రేడింగ్ ప్రారంభం నుంచే తిరోగమనం వైపు పయనించిన బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్, మధ్యాహ్నం లాభాల వైపు ర్యాలీని కొనసాగించింది. ఫలితంగా గురువారం మధ్యాహ్నం 2.45 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 15 పాయింట్ల స్వల్ప లాభంతో 17,972 పాయింట్ల మార్కును తాకింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా రెండు పాయింట్ల స్వల్ప వృద్ధితో 5,400 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.
Source: Yahoo! Telugu: News | 29 Jul 2010 | 9:08 am

సొహ్రాబుద్దీన్ కేసు: గీతా జోహ్రీకి సమన్లు జారీ చేసిన సీబీఐ

సొహ్రాబుద్దీన్ నకిలీ ఎన్‌కౌంటర్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఇటీవల గుజరాత్ మాజీ మంత్రిని అరెస్టు చేసిన సీబీఐ అధికారులు గురువారం ఈ కేసు విచారణ జరుపుతున్న విచారణాధికారి గీతా జోహ్రీకి సమన్లు జారీ చేశారు. ఆగస్టు పదో తేదీన తమ కార్యాలయంలో హాజరుకావాలని అందులో సీబీఐ పేర్కొంది.
Source: Yahoo! Telugu: News | 29 Jul 2010 | 8:56 am

యూరప్ స్టాక్ మార్కెట్ ప్రభావం: సెన్సెక్స్ వృద్ధి!

యూరప్ స్టాక్ మార్కెట్ ప్రభావంతో బాంబే స్టాక్ మార్కెట్ స్వల్ప వృద్ధిని నమోదు చేసుకుంటోంది. ఫలితంగా గురువారం మధ్యాహ్నం 1.40 గంటల ప్రాంతంలో బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్, 15 పాయింట్ల స్వల్ప వృద్ధితో, 17,972 పాయింట్ల మార్కును తాకింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 8 పాయింట్ల లాభంతో, 5,405 పాయింట్ల వద్ద పయనిస్తోంది.
Source: Yahoo! Telugu: News | 29 Jul 2010 | 7:51 am

వైఎస్‌లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది: భట్టి విక్రమార్క

రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలోనే కాకుండా, రాష్ట్ర రాజకీయాల్లో కూడా మహానేత వైఎస్.రాజశేఖర రెడ్డి లేని లోటు స్పష్టంగా కనిపిస్తోందని ప్రభుత్వ చీప్ విఫ్ భట్టి విక్రమార్క, విప్‌లు శైలజానాథ్‌లు అభిప్రాయపడ్డారు. వైఎస్ మరణించిన రోజు నుంచే ఇది తేటతెల్లమైందన్నారు.
Source: Yahoo! Telugu: News | 29 Jul 2010 | 7:48 am

నవదీప్ లేటెస్ట్ గాళ్ ఫ్రెండ్... తాప్సీ

సినిమా హీరోయిన్లతో నటించేటపుడే కాదు, నిజ జీవితంలోనూ చెట్టాపట్టాలేసుకుని తిరిగే యువహీరో నవదీప్, తాజాగా తాప్సీ వెనకాలే తిరుగుతున్నట్లు టాలీవుడ్ సినీజనం చెపుతున్నారు. తాప్సీ కూడా ఫ్రెండ్‌షిప్‌కు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చే భామ కావడంతో ఆమెతో నవదీప్ స్నేహం సులభమైపోయిందంటున్నారు. ఇటీవల హైదరాబాదులో జరిగిన ఓ ఫంక్షన్‌లో తాప్సీ, నవదీప్ ఇద్దరూ గంటల తరబడి మాట్లాడుకుంటూ జోకులేసుకుంటూ నవ్వుతూ కనిపించారు. ఇంకేముందీ... పెన్ను, పేపర్‌కు చాలామంది పని చెప్పేశారు. అన్నట్లు నవదీప్‌కు టాలీవుడ్‌లో ద్వితీయశ్రేణి కథానాయికలు, చిన్నచితకా హీరోయిన్లు, కొత్తగా వచ్చిన తారలు... ఇలా చాలామంది స్నేహితురాళ్లున్నారట. కేవలం స్నేహం మాత్రమే అని నవదీప్ చెపుతున్నా, అతడి తల్లిదండ్రులు మాత్రం ఆ మాటను విశ్వసించడం లేదట. వీలైనంత త్వరగా వివాహం చేయాలని వధువు వేట సాగిస్తున్నారట.
Source: Yahoo! Telugu: Entertainment | 29 Jul 2010 | 7:25 am

తీవ్రవాద వ్యాప్తిని పాక్ మానుకోవాలి: డేవిడ్ కెమెరాన్

తీవ్రవాద వ్యాప్తి, ప్రోత్సహించడాన్ని పాకిస్థాన్ తక్షణం మానుకోవాలని బ్రిటన్ ప్రధానమంత్రి డేవిడ్ కెమెరాన్ పిలుపునిచ్చారు. అలాగే, తమ దేశ ఆర్థిక వ్యవస్థలో భారత్ పాత్ర కీలకపాత్ర పోషిస్తోందన్నారు.
Source: Yahoo! Telugu: News | 29 Jul 2010 | 7:18 am

9.67శాతానికి తగ్గిన ఆహార ద్రవ్యోల్బణం

ఆహార ద్రవ్యోల్బణం మరోసారి తగ్గుముఖం పట్టింది. ఈ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ఆహార ద్రవ్యోల్బణం ఏక సంఖ్య(సింగిల్ డిజిట్)లో 9.67శాతంగా నమోదయ్యింది. ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం జులై 17తో ముగిసిన వారానికి గానూ 12.47శాతం ఉన్న ద్రవ్యోల్బణం 2.80శాతానికి తగ్గి 9.67శాతానికి చేరుకుంది.
Source: Yahoo! Telugu: News | 29 Jul 2010 | 7:09 am

స్టాక్ మార్కెట్: స్వల్ప లాభాల్లో సెన్సెక్స్, నిఫ్టీ!

బాంబే స్టాక్ మార్కెట్ గురువారం మిశ్రమ ఫలితాలను నమోదు చేసుకుంటోంది. ట్రేడింగ్ ప్రారంభంలోనే నష్టాల చవిచూసిన బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్, మధ్యాహ్నం 12.45 గంటల ప్రాంతంలో పది పాయింట్లు స్వల్పంగా వృద్ధి చెందింది. ఫలితంగా సెన్సెక్స్ 17,968 పాయింట్ల మార్కును తాకింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా పది పాయింట్ల లాభంతో, 5,408 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.
Source: Yahoo! Telugu: News | 29 Jul 2010 | 6:57 am

జగన్ జపమంటే.. జనం జపమే: అంబటి రాంబాబు

వైఎస్.జగన్మోహన్ రెడ్డి జపం చేయడమంటే.. జనం జపం చేయడమేనని సస్పెండ్‌కు గురైన ప్రదేశ్ కాంగ్రెస్ కమిటి కార్యదర్శి అంబటి రాంబాబు తేల్చి చెప్పారు. జగన్ చేపట్టిన ఓదార్పు యాత్రలో జనం తప్పా మరొకటి ఎక్కడా కనిపించడం లేదన్నారు. అలాగే, జగన్ యాత్రలో పాల్గొంటే చర్య అధిష్టానం చర్య తీసుకుంటుందని వస్తున్న వార్తలు కేవలం మీడియా సృష్టేనన్నారు.
Source: Yahoo! Telugu: News | 29 Jul 2010 | 6:49 am

మంచి క్యారెక్టర్ ఉన్న భర్త కావాలి: మమత

కేరళలో పుట్టి బెహ్రెయిన్‌లో పెరిగిన మమతా మోహన్ దాస్‌ను 2005లో మలయాళ దర్శకుడు హీరోయిన్‌గా పరిచయం చేశాడు. ఆ తర్వాత చేసిన బస్ కండక్టర్ సినిమా ఆమెకు మంచి పేరు తెచ్చి పెట్టింది. 2007లో యమదొంగ సినిమాతో తెలుగులోనూ మంచి గుర్తింపును తెచ్చుకుంది. డాన్స్, సంగీతం, యాక్టింగ్‌లో శిక్షణ పొందిన ఆమె నటనతోపాటు సింగర్ కూడా అవ్వాలనే కోరికతో రాఖీలో పాడింది. మొదటి పాటకే ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్‌గా నంది అవార్డును దక్కించుకున్నది.
Source: Yahoo! Telugu: Entertainment | 29 Jul 2010 | 5:50 am

సొహ్రాబుద్దీన్ కేసు: గీతా జోహ్రీకి సమన్లు జారీ చేసిన సీబీఐ

సొహ్రాబుద్దీన్ నకిలీ ఎన్‌కౌంటర్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఇటీవల గుజరాత్ మాజీ మంత్రిని అరెస్టు చేసిన సీబీఐ అధికారులు గురువారం ఈ కేసు విచారణ జరుపుతున్న విచారణాధికారి గీతా జోహ్రీకి సమన్లు జారీ చేశారు. ఆగస్టు పదో తేదీన తమ కార్యాలయంలో హాజరుకావాలని అందులో సీబీఐ పేర్కొంది.
Source: జాతీయ | 29 Jul 2010 | 3:26 am

వైఎస్‌లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది: భట్టి విక్రమార్క

రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలోనే కాకుండా, రాష్ట్ర రాజకీయాల్లో కూడా మహానేత వైఎస్.రాజశేఖర రెడ్డి లేని లోటు స్పష్టంగా కనిపిస్తోందని ప్రభుత్వ చీప్ విఫ్ భట్టి విక్రమార్క, విప్‌లు శైలజానాథ్‌లు అభిప్రాయపడ్డారు. వైఎస్ మరణించిన రోజు నుంచే ఇది తేటతెల్లమైందన్నారు.
Source: ఏపీ న్యూస్ | 29 Jul 2010 | 2:18 am

జగన్ జపమంటే.. జనం జపమే: అంబటి రాంబాబు

వైఎస్.జగన్మోహన్ రెడ్డి జపం చేయడమంటే.. జనం జపం చేయడమేనని సస్పెండ్‌కు గురైన ప్రదేశ్ కాంగ్రెస్ కమిటి కార్యదర్శి అంబటి రాంబాబు తేల్చి చెప్పారు. జగన్ చేపట్టిన ఓదార్పు యాత్రలో జనం తప్పా మరొకటి ఎక్కడా కనిపించడం లేదన్నారు. అలాగే, జగన్ యాత్రలో పాల్గొంటే చర్య అధిష్టానం చర్య తీసుకుంటుందని వస్తున్న వార్తలు కేవలం మీడియా సృష్టేనన్నారు.
Source: ఏపీ న్యూస్ | 29 Jul 2010 | 1:20 am

ఓట్ల లెక్కింపును వీడియో చిత్రీకరిస్తాం: ఐ.వి.సుబ్బారావు

ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియనంతా వీడియో తీయనున్నట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఐ.వి.సుబ్బారావు తెలిపారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు, బ్యాలెట్ పెట్టెలు ఉన్న స్ట్రాంగ్ రూమ్‌లలో సీసీటీవీ కెమెరాలను అమర్చుతున్నట్టు ఆయన తెలిపారు. స్ట్రాంగ్ రూమ్‌ తాళాలు తెరిచినప్పటి నుంచి ఓట్ల లెక్కింపు పూర్తయ్యేంత వరకు వీడియో చిత్రీకరణ జరుపుతామని ఆయన తెలిపారు.
Source: ఏపీ న్యూస్ | 29 Jul 2010 | 12:57 am

లగడపాటి రాజగోపాల్ కాంగ్రెస్ ద్రోహి: మంత్రి కోమటిరెడ్డి

తెలంగాణ ఉప ఎన్నికల ఫలితాలపై విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ నిర్వహించిన సర్వేపై రాష్ట్ర క్రీడల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీతో చేతులు కలిపిన లగడపాటి.. కాంగ్రెస్ పార్టీ ద్రోహిగా పని చేస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి వ్యక్తిని పార్టీ నుంచి తక్షణం సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు
Source: ఏపీ న్యూస్ | 29 Jul 2010 | 12:51 am

సొహ్రాబుద్దీన్ ఎన్‌కౌంటర్ : మోడీని విచారించనున్న సీబీఐ!

గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి సొహ్రాబుద్దీన్ నకిలీ ఎన్‌కౌంటర్ కేసు చిక్కులు తప్పేలా కనిపించడం లేదు. ఈ కేసులో ఆయన వద్ద విచారణ జరపాలని కేంద్ర నేరపరిశోధక సంస్థ (సీబీఐ) అధికారులు భావిస్తున్నారు. ఇందుకోసం ఆయన సీబీఐ కార్యాలయానికి రావాల్సిందిగా మోడీకి సమన్లు జారీ చేసే అవకాశం ఉంది.
Source: జాతీయ | 29 Jul 2010 | 12:29 am

ధరలపై జాతీయ స్థాయి ఆందోళనకు భాజపా పిలుపు

దేశంలో పెరిగిన నిత్యావసర వస్తు ధరలతో పాటు గుజరాత్ మంత్రి అరెస్టుకు నిరసనగా భారతీయ జనతా పార్టీ దేశ వ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చింది. ఈ విషయాన్ని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ గడ్కారీ ప్రకటించారు. ధరల పెరుగుదలపై చర్చకు పట్టుబట్టిన విపక్షాలు లోక్‌సభలో వాయిదా తీర్మానాన్ని ఇవ్వగా స్పీకర్ మీరా కుమార్ తోసిపుచ్చారు. అయితే, విపక్షాలన్నీ ఏకమై.. ధరల పెరుగుదల అంశంపై చర్చ జరపాలనే మొండిపట్టుతో వ్యవహరిస్తూ సభా కార్యక్రమాలను అడ్డుకుంటున్నాయి.
Source: జాతీయ | 29 Jul 2010 | 12:15 am

ఉప సమరం: 11 స్థానాల్లో మాజీలదే విజయం: లగడపాటి

తెలంగాణలో 12 అసెంబ్లీ స్థానాలకు మంగళవారం జరిగిన ఉప ఎన్నికల్లో 11 స్థానాల్లో తెలంగాణ ఉద్యమం కోసం తమ సభ్యత్వాలకు రాజీనామా చేసిన సభ్యులే తిరిగి విజయం సాధిస్తారని కాంగ్రెస్ పార్టీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ (విజయవాడ) జోస్యం చెప్పారు.
Source: ఏపీ న్యూస్ | 29 Jul 2010 | 12:10 am

మూర్ఖత్వపు నిర్ణయాల వల్లే సీపీఎం ఓటమి: సోమనాథ్

అగ్రనాయకత్వం తీసుకుంటున్న, అమలు చేస్తున్న మూర్ఖత్వపు నిర్ణయాలు, విధానాల వల్లే సీపీఎం హూందాతనాన్ని కోల్పోయిందని లోక్‌‍సభ మాజీ స్పీకర్, ఆ పార్ట బహిష్కృత నేత సోమనాథ్ ఛటర్జీ అభిప్రాయపడ్డారు. దీనికి తోడు వరుస పరాజయాలు కూడా ఆ పార్టీని మరింతగా కుంగదీసిందన్నారు. తన సుదీర్ఘ పార్లమెంటరీ రాజకీయ జీవితాన్ని వివరిస్తూ.. సోమనాథ్ ఆత్మకథను రచించారు. దీన్ని త్వరలో ఆవిష్కరించనున్నారు.
Source: జాతీయ | 28 Jul 2010 | 11:21 pm

సారీ అన్నా... సోనియాను ప్రశంసించలేను: వైఎస్.జగన్

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పేరును మాటమాత్రానికైనా ఉచ్ఛరించేందుకు కడప ఎంపీ వైఎస్.జగన్మోహన్ రెడ్డి ససేమిరా అంటున్నారు. తాను చేపట్టిన ఓదార్పు యాత్రకు ఆమె అనుమతి ఇవ్వలేదు. ఈ విషయం రాష్ట్ర ప్రజానీకం మొత్తానికి తెలుసు. అలాంటపుడు ఆమె పేరును ఈ యాత్రలో ఎందుకు ప్రస్తావించాలి అని జగన్ తన వద్దకు సయోధ్యకు వచ్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలను ప్రశ్నించినట్టు సమాచారం.
Source: ఏపీ న్యూస్ | 28 Jul 2010 | 11:21 pm

కాకినాడలో తెగదెంపుల 'బహిరంగ' సంగ్రామమా?

తూర్పుగోదావరి జిల్లాల్లో కడప ఎంపీ వైఎస్.జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ఓదార్పు యాత్ర గురువారంతో ముగియనుంది. ఈ సందర్భంగా కాకినాడలో భారీ బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. వివిధ అంశాలపై ప్రతిపక్షాలు వాయిదా తీర్మానాలను ప్రవేశపెడుతున్నందున ఎంపీలంతా సభలో ఉండాలని కాంగ్రెస్ హైకమాండ్ విప్ జారీ చేసింది. కానీ, జగన్ మాత్రం "గన్‌"లా విప్‌ను ధిక్కరించి, తన పని తాను చేసుకుని ముందుకు పోతున్నారు.
Source: ఏపీ న్యూస్ | 28 Jul 2010 | 11:07 pm

ముస్లింలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు: ఖుర్షీద్

దేశంలోని ముస్లింలకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించనున్నట్టు కేంద్రం మంత్రి సల్మాన్ ఖుర్షీద్ తెలిపారు. ఇందుకోసం అవసరమైన చర్యలను కేంద్రం చేపట్టినట్టు ఆయన వెల్లడించారు. ఇతర వెనుకబడిన కులాల (ఓబీసీ) కోటాలో ఉప కోటాను ప్రవేశపెట్టి ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించే అంశాన్ని కేంద్రం తీవ్రంగా పరిశీలిస్తోందని మంత్రి వెల్లడించారు.
Source: జాతీయ | 28 Jul 2010 | 10:07 pm

మహేష్ బాబుతోనా...? చాలా థ్రిల్‌గా ఉంది: కాజల్ అగర్వాల్

కాజల్ అగర్వాల్ మళ్లీ టాప్ హీరోతో నటించే ఛాన్స్ కొట్టేసింది. మగధీర తర్వాత ఎంతో రేంజ్‌కు వెళ్లిన ఆమె తాజాగా ప్రభాస్ చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రం తర్వాత మహేష్ బాబుతో తెలుగు, తమిళ భాషల్లో లింగుస్వామి దర్శకత్వంలో చేయబోయే చిత్రానికి కమిట్ అయింది. ఈ చిత్రంలో అవకాశం రావడం చాలా థ్రిల్‌గా ఉందని కాజల్ చెబుతోంది. కాగా ఈ చిత్రం షూటింగ్ సెప్టెంబరులో జరుగనుంది. అయితే ఇందులో ఆమె సోదరి కూడా ఓ సీన్‌లో కన్పించనున్నట్లు ఆమె స్నేహితులు చెపుతున్నారు. అక్కాచెల్లెళ్లు ఈ చిత్రాన్ని ఏం చేస్తారో చూడాలి.
Source: Yahoo! Telugu: Entertainment | 28 Jul 2010 | 2:21 pm

బాలయ్య చేస్తుంది కరెక్టేనా...?

నందమూరి బాలకృష్ణ తనకు నచ్చిందే చేస్తాడు. ఒక్కమగాడు వంటి సబ్జెక్ట్ వైవిఎస్ చెప్పగానే ఓకే చేసి ఆ చిత్రాన్ని చేసిన ఘనత ఉంది. అంటే ఆయన అంతగా నమ్మేలా కొన్ని వర్గాలు ఆయన చుట్టూ ఉన్నాయనే వార్తలు ఎప్పటినుంచో విన్పిస్తునే ఉన్నాయి. అయితే ఆ తర్వాత బాలయ్యకు సక్సెస్‌లు రాకపోవడంతో బోయపాటి శీను సింహా కథ చెప్పడంతో దానిని ఛాలెంజ్‌గా తీసుకుని హిట్ కొట్టారు. ఆ ఊపులో దాసరి నారాయణరావు చిత్రం పరమవీరచక్రకు కమిట్ అయ్యారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ రామోజీ ఫిలిమ్ సిటీలో ప్రారంభమైంది. ఏమైందోగానీ తాజాగా ఎం.ఎల్ కుమార్ చౌదరితో సినిమా చేయడానికి బాలయ్య ఓకే చెప్పినట్లు తెలిసింది. మరి ఈ లైన్‌ను నిర్మాత ఎలా చెప్పాడోగానీ ఒకేసారి రెండు సినిమాలు పెట్టుకున్నారు. ఇలాగే బెల్లంకొండ సురేష్‌తో పూరీ జగన్నాథ్‌తో ఓ సినిమా చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే పూరీ చెప్పిన వర్షెన్ బాలయ్యకు నచ్చకపోవడంతో దాన్ని పక్కన పెట్టినట్లు సమాచారం. అయితే కుమార్ చౌదరి చెప్పిన కథ ఎలా నచ్చిందోనని ఫిలిమ్ నగర్ జనం ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 28 Jul 2010 | 12:28 pm

ఆగస్టు 6న రవితేజ "డాన్ శీను"

రవితేజ, శ్రీహరి, శ్రేయ కాంబినేషన్‌లో తయారవుతున్న చిత్రం డాన్ శీను. బుధవారంతో షూటింగ్ పూర్తయింది. హైదరాబాద్ శివార్లలో నీగ్రో ఫైటర్లతో యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. సమర్పకుడు సురేష్ రెడ్డి మాట్లాడుతూ... ఈ రోజుతో షూటింగ్ పూర్తయిపోయింది. ఆడియో మంచి హిట్ అయింది. సినిమాను కూడా అంత హిట్ చేస్తారని అనుకుంటున్నాను. శ్రీహరి కథ వినగానే నచ్చి చేస్తున్నారు. వచ్చే నెల 6న సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అన్నారు.మహేష్ మంజ్రేకర్ మాట్లాడుతూ... తెలుగులో షూటింగ్ ఆర్గనైజింగ్ బాగుంది. ఈమధ్య సినిమాలు చేయడం లేదు. అయితే మంచి పాత్రలు రావడంతో తెలుగులో చేస్తున్నాను. నా పాత్ర చాలా ఎంజాయ్‌మెంట్‌గా ఉంటుంది. విలన్ తరహాలో ఉన్నా.. చూసేవారికి నవ్వు తెప్పిస్తుంది అన్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 28 Jul 2010 | 12:24 pm

యూ ఎండ్ ఐ చిత్రం ట్రెయిలర్

యూ ఎండ్ ఐ చిత్రం ట్రెయిలర్
Source: Yahoo! Telugu: Entertainment | 28 Jul 2010 | 12:17 pm

శుభప్రదం ట్రెయిలర్

శుభప్రదం ట్రెయిలర్
Source: Yahoo! Telugu: Entertainment | 28 Jul 2010 | 12:16 pm

స్నేహగీతం ట్రెయిలర్

స్నేహగీతం ట్రెయిలర్
Source: Yahoo! Telugu: Entertainment | 28 Jul 2010 | 12:13 pm

ప్రేమించిన కొత్తలో ట్రెయిలర్

ప్రేమించిన కొత్తలో ట్రెయిలర్
Source: Yahoo! Telugu: Entertainment | 28 Jul 2010 | 12:06 pm

కాఫీబార్ చిత్రం ట్రెయిలర్

కాఫీబార్ చిత్రం ట్రెయిలర్
Source: Yahoo! Telugu: Entertainment | 28 Jul 2010 | 12:02 pm

చంద్రబాబు నాయుడు ఆధునిక ఔరంగజేబు: రోశయ్య

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పేరెత్తితే ముఖ్యమంత్రి రోశయ్య చిర్రుబుర్రులాడుతన్నారు. పనిగట్టుకుని తనను విమర్శించడంపై రోశయ్య గరంగరంగా ఉన్నారు. చంద్రబాబు ఇటీవల తనపై చేసిన వ్యాఖ్యల గురించి మాట్లాడుతూ... బాబు రోజు రోజుకీ దిగజారిపోతున్నాడు.
Source: ఏపీ న్యూస్ | 28 Jul 2010 | 7:22 am

స్నేహగీతం ట్రెయిలర్

స్నేహగీతం ట్రెయిలర్
Source: వినోదం | 28 Jul 2010 | 6:44 am

ప్రేమించిన కొత్తలో ట్రెయిలర్

ప్రేమించిన కొత్తలో ట్రెయిలర్
Source: వినోదం | 28 Jul 2010 | 6:38 am

కాఫీబార్ చిత్రం ట్రెయిలర్

కాఫీబార్ చిత్రం ట్రెయిలర్
Source: వినోదం | 28 Jul 2010 | 6:34 am

మానసిక ఒత్తిడితోనే అలాంటి వ్యాఖ్యలు: సీఎం రోశయ్య

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రమైన మానసిక ఒత్తిడిలో ఉన్నారని ముఖ్యమంత్రి కె.రోశయ్య ఆరోపించారు. అందువల్ల బాబ్లీ అంశంపై ఆయన ఇష్టానుసారంగా ఆయన వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన అన్నారు. బుధవారం మధ్యాహ్నం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి రోశయ్యపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
Source: ఏపీ న్యూస్ | 28 Jul 2010 | 5:45 am

"బ్రహ్మ లోకం"లో ఆర్తీ అగర్వాల్ ఫుల్ ఎక్స్‌పోజింగ్

నటకిరీటి రాజేంద్రప్రసాద్ బ్రహ్మగా నటిస్తున్న బ్రహ్మలోకం టు యమలోకం వయా భూలోకం చిత్రం ఆధ్యాత్మిక రసాన్ని మాత్రమే పంచుతుందని ప్రేక్షకులు అనుకుంటున్నారు. కానీ ఈ ఆధ్యాత్మిక రసంతోపాటు శృంగార రసాన్ని కావలసినంత దట్టించినట్లు ఆ చిత్రం తాలూకు ఫోటోలను చూస్తే తెలుస్తుంది. అసలు విషయం ఏంటయా... అంటే, ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్‌తో పాటు శివాజీ, తెల్లపిల్ల ఆర్తీ అగర్వాల్ నటించారు. అయితే ఆర్తీ అగర్వాల్ పరిమితికి మించి ఎక్స్‌పోజింగ్ చేసిందని చిత్రానికి సంబంధించిన ప్రొమో ఫోటోలను చూస్తే తెలుస్తుంది. అయితే స్వర్గలోకంలో రంభ - ఊర్వశిలు శృంగారాన్ని ఒలకబోసే నాయికలు కనుక, రంభలా నటిస్తున్న ఆర్తి అగర్వాల్ అదే స్థాయిలో ఒలకబోసిందని అంటున్నారు. మొత్తమ్మీద రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఆర్తీ అగర్వాల్ అందాలను ప్రదర్శించడానికి ఎటువంటి అభ్యంతరం పెట్టడం లేదని టాలీవుడ్ సినీ వర్గాల టాక్.
Source: వినోదం | 28 Jul 2010 | 5:05 am

దేశ వ్యాప్తంగా 80 జిల్లాలకు వరద తాకిడి: పీకే.బన్సాల్

దేశంలో కురుస్తున్న వర్షాల కారణంగా మొత్తం 80 జిల్లాలు వరదతాకిడి గురైనట్టు కేంద్రం వెల్లడించింది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌లో 14 జిల్లాలు ఉండగా, అరుణాచల్ ప్రదేశ్, కేరళ రాష్ట్రాల్లో పది చొప్పున, బీహార్‌లో ఐదు, గోవా, మేఘాలయ, ఉత్తరాఖండ్, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఒక్కొక్క జిల్లాల చొప్పున ఉన్నాయి. వీటితో పాటు హర్యానాలో ఐదు, మిజోరాం, పంజాబ్ రాష్ట్రాల్లో ఎనిమిది చొప్పున జిల్లాలు వరద ముంపుకు గురైనట్టు కేంద్ర జలవనరుల శాఖామంత్రి పవన్ కుమార్ బన్సాల్ వివరించారు.
Source: జాతీయ | 28 Jul 2010 | 4:59 am

ధరల పెరుగుదలపై ఓటింగ్‌ లేదు: స్పీకర్ మీరా కుమార్

ధరల పెరుగుదలపై ఓటింగ్ నిర్వహించాలని ప్రతిపక్ష రాజకీయ పార్టీలు చేసిన డిమాండ్‌ను లోక్‌సభ స్పీకర్ మీరా కుమార్ తోసిపుచ్చారు. అలాగే, ధరల పెరుగుదలపై సభలో చర్చించాలని ప్రతిపక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని కూడా ఆమె నిర్ద్వంధంగా తోసిపుచ్చారు. ధరల పెరుగుదల ప్రతి ఒక్కరినీ ఆందోళనకు గురి చేసే అంశమని, అందువల్ల దీనిపై చర్చకు వాయిదా తీర్మానమే ఏకైక మార్గం కాదన్నారు.
Source: జాతీయ | 28 Jul 2010 | 4:11 am

బాబ్లీపై న్యాయం కోసం తెదేపా 'మహా' పోరాటం: చంద్రబాబు

మహారాష్ట్ర ప్రభుత్వం గోదావరి నదిపై అక్రమంగా నిర్మిస్తున్న బాబ్లీ ప్రాజెక్టు విషయంలో రాష్ట్రానికి న్యాయం జరిగేంత వరకు తమ పార్టీ పోరాటం చేస్తుందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఆయన బుధవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ బాబ్లీని తాము తీవ్రమైన సమస్యగా పరిగణిస్తున్నట్టు తెలిపారు. అందుకే ఈ అంశానికి జాతీయ స్థాయిలో మద్దతు కోరుతున్నట్టు ఆయన తెలిపారు. ఇప్పటికే ఏబీ.బర్దన్ (సీపీఐ), ప్రకాష్ కారత్ (సీపీఎం), తంబిదురై (అన్నాడీఎంకే), శరద్ యాదవ్ (జేడీయూ) నేతలను కలిసి మద్దతు ఇవ్వాల్సిందిగా కోరినట్టు చెప్పారు.
Source: ఏపీ న్యూస్ | 28 Jul 2010 | 3:48 am