బాబ్లీపై న్యాయం కోసం తెదేపా 'మహా' పోరాటం: చంద్రబాబు

మహారాష్ట్ర ప్రభుత్వం గోదావరి నదిపై అక్రమంగా నిర్మిస్తున్న బాబ్లీ ప్రాజెక్టు విషయంలో రాష్ట్రానికి న్యాయం జరిగేంత వరకు తమ పార్టీ పోరాటం చేస్తుందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఆయన బుధవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ బాబ్లీని తాము తీవ్రమైన సమస్యగా పరిగణిస్తున్నట్టు తెలిపారు. అందుకే ఈ అంశానికి జాతీయ స్థాయిలో మద్దతు కోరుతున్నట్టు ఆయన తెలిపారు. ఇప్పటికే ఏబీ.బర్దన్ (సీపీఐ), ప్రకాష్ కారత్ (సీపీఎం), తంబిదురై (అన్నాడీఎంకే), శరద్ యాదవ్ (జేడీయూ) నేతలను కలిసి మద్దతు ఇవ్వాల్సిందిగా కోరినట్టు చెప్పారు.
Source: Yahoo! Telugu: News | 28 Jul 2010 | 9:17 am

స్టాక్ మార్కెట్: 17వేల మార్కు కనిష్ఠ స్థాయికి సెన్సెక్స్!

బాంబే స్టాక్ మార్కెట్ నష్టాల్లో కూరుకుపోయింది. రెండేళ్ల తర్వాత గత శుక్రవారం నుంచి 18వేల మార్కును తాకిన బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్, బుధవారం తిరిగి 17వేల కనిష్ఠ స్థాయికి పడిపోయింది. బుధవారమంతా లాభనష్టాలతో ర్యాలీని కొనసాగించిన బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్, మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో 95 పాయింట్లు పతనమైంది. ఫలితంగా సెన్సెక్స్ సూచీ 17,982 పాయింట్ల కనిష్ఠ స్థాయికి పడిపోయింది.
Source: Yahoo! Telugu: News | 28 Jul 2010 | 8:41 am

నష్టాల్లో స్టాక్ మార్కెట్: సెన్సెక్స్, నిఫ్టీల పతనం!

బాంబే స్టాక్ మార్కెట్ నష్టాల్లో కూరుకుపోయింది. ట్రేడింగ్ ప్రారంభం నుంచే హెచ్చుతగ్గులతో ర్యాలీని కొనసాగిస్తున్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్, మధ్యాహ్నం 1.45 గంటల ప్రాంతంలో 80 పాయింట్లు పతనమై 17,982 పాయింట్ల కనిష్ఠ స్థాయికి పడిపోయింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 25 పాయింట్లు క్షీణించి, 5,405 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.
Source: Yahoo! Telugu: News | 28 Jul 2010 | 8:35 am

రాష్ట్ర కాంగ్రెస్‌లో 'ఒక్క మగాడు' జగన్: అంబటి రాంబాబు

రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీలో ఉన్న ఒకే ఒక్క మగాడు వైఎస్.జగన్మోహన్ రెడ్డి అని సస్పెండ్‌కు గురైన పీసీసీ కార్యదర్శి అంబటి రాంబాబు అన్నారు. ముఖ్యమంత్రి రోశయ్య, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్‌లు ఇద్దరూ ఎందుకు పనికిరాని నేతలని ఆయన దుయ్యబట్టారు.
Source: Yahoo! Telugu: News | 28 Jul 2010 | 8:10 am

ఎక్స్‌ఎల్‌ టెలికాంకు 65.7 కోట్ల ఎగుమతి ఆర్డర్లు!

హైదరాబాద్‌కు చెందిన ఎక్స్‌ఎల్‌ టెలికాం కంపెనీ రూ. 65.7 కోట్లు విలువచేసే రెండు ఎగుమతి ఆర్డర్లను సొంతం చేసుకుంది. ఇందులో భాగంగా యూరోపియన్‌ మార్కెట్‌కు సోలార్‌ ప్యానెల్స్‌ను ఎక్స్‌ఎల్‌ టెలికాం సరఫరా చేయాల్సి ఉంటుంది. ఈ ఆర్డరులో మార్కెట్‌లో కంపెనీ షేర్ల విలువలు 3.3శాతం పెరిగి రూ. 32.85 వద్ద కొనసాగుతున్నాయి.
Source: Yahoo! Telugu: News | 28 Jul 2010 | 8:06 am

పాక్ విధాన నిర్ణయాన్ని పునఃపరిశీలించండి: ఆప్ఘన్

ఆప్ఘనిస్థాన్ యుద్ధానికి సంబంధించిన పెంటగాన్ డాక్యుమెంట్లు లీక్ కావడం ప్రపంచ దేశాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. వీకీలీక్ అనే వెబ్‌సైట్ 90 వేలకు పైగా పెంటగాన్ డాక్యుమెంట్లను తన వెబ్‌సైటులో ప్రచురించింది. దీనిపై ఆప్ఘనిస్థాన్ జాతీయ భద్రతా సలహాదారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాశ్చాత్య దేశాలు పాకిస్థాన్ పట్ల అనుసరిస్తున్న వైఖరిని ఇప్పటికైనా మార్చుకోవాలని కోరారు.
Source: Yahoo! Telugu: News | 28 Jul 2010 | 7:47 am

మళ్లీ నష్టాల్లో కూరుకుపోయిన సెన్సెక్స్, నిఫ్టీ!

బాంబే స్టాక్ మార్కెట్ మళ్లీ నష్టాల్లో కూరుకుపోయింది. ట్రేడింగ్ ప్రారంభం నుంచే లాభనష్టాలతో ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నబాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్, మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో 29 పాయింట్లు పతనమైంది. ఫలితంగా సెన్సెక్స్ సూచి 18,047 పాయింట్ల మార్కును తాకింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 18 పాయింట్ల నష్టంతో 5,412 పాయింట్ల వద్ద పయనిస్తోంది.
Source: Yahoo! Telugu: News | 28 Jul 2010 | 7:45 am

సొహ్రాబుద్దీన్ కేసు: అమిత్‌ షాను విచారించనున్న సీబీఐ!

సొహ్రాబుద్దీన్ నకిలీ ఎన్‌కౌంటర్ కేసులో అరెస్టయి ఉన్న గుజరాత్ రాష్ట్ర మాజీ మంత్రి అమిత్ షాను సీబీఐ ప్రత్యేక బృందం బుధవారం విచారించనుంది. ఈయన వద్ద విచారణ జరిపేందుకు సీబీఐ ప్రత్యేక కోర్టు అనుమతి ఇచ్చిన విషయం తెల్సిందే. దీంతో 28వ తేదీ నుంచి 30వ తేదీ వరకు అమిత్ షా వద్ద సీబీఐ బృందం విచారణ జరుపనుంది.
Source: Yahoo! Telugu: News | 28 Jul 2010 | 7:30 am

ఫేస్‌బుక్‌పై నిషేదం విధించాలి: పాకిస్థాన్ పిటిషన్

ఇస్లాం మతంపై దుష్ప్రచారం చేస్తున్నారనే ఆరోపనలపై ప్రముఖ సోషల్‌ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్ "ఫేస్‌బుక్" సర్వీసులను శాస్వతంగా నిలుపుదల చేయాలని పాకిస్థాన్ అధికారులను కోరుతూ జమాత్-ఉద్-దావ్ అనే సంస్థ కోర్టులో పిటషన్ దాఖలు చేసింది.
Source: Yahoo! Telugu: News | 28 Jul 2010 | 7:26 am

ట్విట్టర్‌లో మల్లికా శరావత్ టాప్‌లెస్ ఫోటో

అవకాశమొస్తే చాలు... అంగాగ ప్రదర్శనకు అర్రులు చాచే బాలీవుడ్ నటి మల్లికా షెరావత్ ప్రముఖ సోషల్‌ నెట్‌వర్క్ వెబ్‌సైట్ "ట్విట్టర్"లో అర్ధనగ్నంగా దర్శనమిచ్చి కుర్రకారును వెర్రెక్కిస్తోంది. షెర్లిన్ చోప్రా తర్వాత "స్నేక్‌ వుమెన్"గా పిలిచే మల్లికా ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
Source: Yahoo! Telugu: Entertainment | 28 Jul 2010 | 7:15 am

స్టాక్ మార్కెట్: స్వల్ప లాభాల్లో సెన్సెక్స్, నిఫ్టీ!

బాంబే స్టాక్ మార్కెట్ స్వల్ప లాభాలతో పుంజుకుంది. ట్రేడింగ్ ప్రారంభంలో తిరోగమనం వైపు ర్యాలీని కొనసాగించిన బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచి సెన్సెక్స్, మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో ఏడు పాయింట్లు స్వల్పంగా లాభపడి, 18,085 పాయింట్ల మార్కును తాకింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా ఏడు పాయింట్ల స్వల్ప వృద్ధితో 5,437 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.
Source: Yahoo! Telugu: News | 28 Jul 2010 | 6:47 am

అంగాంగ ప్రదర్శనే సినిమా సక్సెస్‌కు కారణం: తాప్సీ

దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన 'ఝుమ్మందినాదం' చిత్రం ద్వారా తెలుగు వెండితెరకు పరిచయమైన అందాల ముద్దుగుమ్మ తాప్సీ. తన గ్లామర్‌తో యువతను కట్టిపడేసిన ఈ భామ.. ఝుమ్మందినాదం చిత్రంలో అంగాంగ ప్రదర్శన చేసింది. చిత్రంలో తాప్సీ చేసిన క్యారెక్టర్ కంటే.. ఆమె చేసిన ఎక్స్‌పోజింగ్‌కే మంచి పేరు వచ్చింది. తన ఎక్స్‌పోజింగ్‌కు లభిస్తున్న క్రేజ్‌పై ఈ ముద్దుగుమ్మ స్పందిస్తూ.. "ఝుమ్మందినాదం" చిత్రం ద్వారా యువతకు తాను తెగ నచ్చేశానని ప్రచారం చేసుకుంటోంది. అంగాంగ ప్రదర్శన, ఎక్స్‌పోజింగ్‌ను దర్శకేంద్రుడు చెప్పినదానికంటే మరింత బాగా బాగా చేయడంవల్లే యువత థియేటర్లకు వస్తున్నారని ఓ తుంటరి విలేకరి తాప్సీని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు చిరునవ్వుతో సమాధానం ఇస్తూ.. వాళ్ళ వయస్సు అమ్మాయిని కాబట్టే నా అందచందాలు వారికి బాగా నచ్చాయి. దానికి తోడు తన అందాలను దర్శకేంద్రుడు ప్రత్యేక కోణంలో చూపించారు. పైపెచ్చు నటన కూడా బాగుంది అని చెప్పుకొచ్చింది. తాజాగా రవితేజ, విష్ణు, ప్రభాస్ సినిమాల్లో నటిస్తున్నట్టు తాప్సీ తెలిపింది.
Source: Yahoo! Telugu: Entertainment | 28 Jul 2010 | 5:35 am

బాబ్లీపై న్యాయం కోసం తెదేపా 'మహా' పోరాటం: చంద్రబాబు

మహారాష్ట్ర ప్రభుత్వం గోదావరి నదిపై అక్రమంగా నిర్మిస్తున్న బాబ్లీ ప్రాజెక్టు విషయంలో రాష్ట్రానికి న్యాయం జరిగేంత వరకు తమ పార్టీ పోరాటం చేస్తుందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఆయన బుధవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ బాబ్లీని తాము తీవ్రమైన సమస్యగా పరిగణిస్తున్నట్టు తెలిపారు. అందుకే ఈ అంశానికి జాతీయ స్థాయిలో మద్దతు కోరుతున్నట్టు ఆయన తెలిపారు. ఇప్పటికే ఏబీ.బర్దన్ (సీపీఐ), ప్రకాష్ కారత్ (సీపీఎం), తంబిదురై (అన్నాడీఎంకే), శరద్ యాదవ్ (జేడీయూ) నేతలను కలిసి మద్దతు ఇవ్వాల్సిందిగా కోరినట్టు చెప్పారు.
Source: ఏపీ న్యూస్ | 28 Jul 2010 | 3:48 am

రాష్ట్ర కాంగ్రెస్‌లో 'ఒక్క మగాడు' జగన్: అంబటి రాంబాబు

రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీలో ఉన్న ఒకే ఒక్క మగాడు వైఎస్.జగన్మోహన్ రెడ్డి అని సస్పెండ్‌కు గురైన పీసీసీ కార్యదర్శి అంబటి రాంబాబు అన్నారు. ముఖ్యమంత్రి రోశయ్య, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్‌లు ఇద్దరూ ఎందుకు పనికిరాని నేతలని ఆయన దుయ్యబట్టారు.
Source: ఏపీ న్యూస్ | 28 Jul 2010 | 2:41 am

సొహ్రాబుద్దీన్ కేసు: అమిత్‌ షాను విచారించనున్న సీబీఐ!

సొహ్రాబుద్దీన్ నకిలీ ఎన్‌కౌంటర్ కేసులో అరెస్టయి ఉన్న గుజరాత్ రాష్ట్ర మాజీ మంత్రి అమిత్ షాను సీబీఐ ప్రత్యేక బృందం బుధవారం విచారించనుంది. ఈయన వద్ద విచారణ జరిపేందుకు సీబీఐ ప్రత్యేక కోర్టు అనుమతి ఇచ్చిన విషయం తెల్సిందే. దీంతో 28వ తేదీ నుంచి 30వ తేదీ వరకు అమిత్ షా వద్ద సీబీఐ బృందం విచారణ జరుపనుంది.
Source: జాతీయ | 28 Jul 2010 | 2:00 am

ప్రతికూల వాతావరణం: అమర్‌నాథ్ యాత్ర నిలిపివేత!

ప్రతికూల వాతావరణం కారణంగా అమర్‌నాథ్ యాత్రను జమ్మూలో నిలిపివేశారు. విస్తారంగా వర్షంతో పాటు మంచు కురుస్తుండటం వల్ల భక్తుల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో భగవతి నగర్ నుంచి కాశ్మీర్ లోయకు వెళ్లాల్సిన అమర్‌నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపి వేశారు. ఈ మార్గంతో పాటు బల్తాల్ అండ్ పహల్గామ్ మార్గాల్లో కూడా యాత్రను నిలుపుదల చేశారు.
Source: జాతీయ | 28 Jul 2010 | 12:38 am

క్లీన్‌స్వీప్ చేస్తాం... సోనియా కళ్లు తెరిపిస్తాం: కేసీఆర్

ముగిసిన ఉప ఎన్నికల సమరంలో తెలంగాణ రాష్ట్ర సమితి క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని ఆ పార్టీ అధినేత కె.చంద్రశేఖర రావు జోస్యం చెప్పారు. పోలింగ్ ముగిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉప ఎన్నికలు జరిగిన 12 నియోజకవర్గాలలో తాము క్లీన్ స్వీప్ చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ గెలుపుతో సీమాంధ్ర పెట్టుబడిదారులతో పాటు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కళ్లు తెరిపిస్తామని ఆయన ప్రకటించారు.
Source: ఏపీ న్యూస్ | 28 Jul 2010 | 12:33 am

డీఎస్ చిత్తుగా ఓడటం ఖాయం: కాంగ్రెస్ నేతల సర్వేలు!

ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, నిజామాబాద్ అర్బన్ స్థానం అభ్యర్థి ధర్మపురి శ్రీనివాస్ చిత్తుగా ఓడిపోవడం ఖాయమని కాంగ్రెస్ నేతలు స్వయంగా నిర్వహించిన సర్వేల్లో వెల్లడైంది. ఈ విషయాన్ని వారే స్వయంగా మంగళవారం సాయంత్రం పోలింగ్ ముగిసిన తర్వాత బహిర్గతం చేశారు.
Source: ఏపీ న్యూస్ | 27 Jul 2010 | 11:28 pm

గత తొమ్మిది నెలలుగా రాష్ట్రం అల్లకల్లోలం: వైఎస్.జగన్

గత తొమ్మిది నెలలుగా రాష్ట్రంలో ఏం జరుగుతుందో మీ అందరికీ తెలుసు. ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన పనిలేదు. ఒక మహానేత కోల్పోయిన మరుక్షణం నుంచే రాష్ట్రం అల్లకల్లోలంగా మారింది. కొందరు నేతలు సంబరాలు చేసుకున్నారని కడప ఎంపీ వైఎస్.జగన్మోహన్ రెడ్డి అన్నారు.
Source: ఏపీ న్యూస్ | 27 Jul 2010 | 11:06 pm

ముగిసిన 'ఉప' సమరం.. బాక్సుల్లో అభ్యర్థుల భవిత!

తెలంగాణ ప్రాంతంలో 12 అసెంబ్లీ నియోజకవర్గాలకు మంగళవారం జరిగిన ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఓటరు ఇచ్చిన తీర్పు బ్యాలెట్ బాక్సుల్లో భద్రంగా నిక్షిప్తమై వుంది. ఈనెల 30వ తేదీ ఉదయం ఏడు గంటలకు బ్యాలెట్ బాక్సులను తెరిచి ఓట్ల లెక్కింపు చేపడుతారు.
Source: ఏపీ న్యూస్ | 27 Jul 2010 | 10:52 pm

కేంద్ర ఎన్నికల సంఘం సీఈసీగా ఎస్.వై.ఖురేషీ: కేంద్రం

కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌గా షాబుద్దీన్ యాకుబ్ ఖురేషీ నియమితులయ్యారు. ప్రస్తుత కమిషన్‌లో ద్వితీయ స్థానం సభ్యుడిగా ఉన్న ఆయనను ప్రధాన కమిషనర్‌గా నియమిస్తూ కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రస్తుత సీఈఓ నవీన్ చావ్లా పదవీ కాలం గురువారంతో ముగియనుంది. దీంతో తదుపరి సీఈఓగా ఖురేషీని నియమిస్తూ న్యాయశాఖ నిర్ణయం తీసుకోగా, ఈయన నియామకానికి రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ కూడా ఆమోదముద్ర వేశారు.
Source: జాతీయ | 27 Jul 2010 | 10:45 pm

ఆగస్టు నెలాఖరులో ఏఐసీసీ అధ్యక్ష పీఠానికి ఎన్నికలు!

అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పీఠానికి ఆగస్టు నెలాఖరులో ఎన్నికలు నిర్వహించనున్నారు. వాస్తవానికి ఈ ఎన్నిక ఈనెల 25వ తేదీన జరగాల్సి వుంది. అయితే, కాంగ్రెస్ పార్టీ సంస్థాగత ఎన్నికల నిర్వహణలో జాప్యం నెలకొనడం వల్ల ఏఐసీసీ అధ్యక్షురాలి ఎన్నికను వాయిదా వేయాల్సి వచ్చింది.
Source: జాతీయ | 27 Jul 2010 | 10:30 pm

జగన్ వేరు కుంపటి తథ్యం: ఢిల్లీలో కాంగ్రెస్ ఎంపీలు!

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల పుణ్యమాని రాష్ట్ర కాంగ్రెస్‌కు చెందిన 33 మంది ఎంపీల్లో ఒక్కరు (వైఎస్.జగన్) మినగా మిగిలిన 32 మంది ఎంపీలు ఒకేచోట కలుసుకునే అవకాశం లభించింది. నిన్నమొన్నటి వరకు తమ మధ్య ఉన్న ప్రాంతీయ విభేదాలను పక్కన పెట్టి ఒకరి భుజాలపై ఒకరు చేతులేసుకుని పార్లమెంట్ హాలులో సందడి చేస్తున్నారు.
Source: ఏపీ న్యూస్ | 27 Jul 2010 | 9:12 pm

నాకింకా పెళ్ళి వయస్సురాలేదు..!: గౌరీ పండిట్

"నాకింకా పెళ్ళి వయస్సు రాలేదని" అందాల ముద్దుగుమ్మ గౌరీపండిట్ అంటోంది. అయితే తప్పకుండా ప్రేమ వివాహమే చేసుకుంటానని గౌరీపండిట్ చెబుతోంది. కానీ ప్రేమ పాఠాలు మాత్రం ఇంకా నేర్చుకోలేదు. ఎందుకంటే నాకింకా పెళ్ళి వయస్సు రాలేదని ఈ భామ అంటోంది. "పెళ్లి వయస్సు వచ్చాక ప్రేమ పాఠాలు నేర్చుకుంటాను. ప్రేమవల్ల భాగస్వామి ఎలా ఉండాలో? తెలుసుకునే అవకాశం ఉంది. ఇద్దరి మధ్య అవగాహన ఏర్పడుతుంది. అందుకే నాకు ప్రేమ పెళ్ళి అంటే ఇష్టం." అని 'ఆంధ్రుడు' హీరోయిన్ గౌరీ పండిట్ చెబుతోంది. తాజాగా పోసాని కృష్ణ మురళీ హీరోగా నటిస్తున్న 'నిత్య పెళ్లికొడుకు' సినిమాలో నటిస్తోంది. 'ఆంద్రుడు'తో తెరంగేట్రం చేసిన గౌరీపండిట్ 'ఆకాశ రామన్న' అనే చిత్రంలోనూ నటించింది.అయితే గోపిచంద్ హీరోగా నటించిన 'ఆంధ్రుడు' చిత్రం ఈ భామ గౌరీపండిట్ కు మంచి పేరు సంపాదించిపెట్టలేక పోయింది. కానీ పోసాని కృష్ణమురళీతో చేసే తాజా చిత్రం గౌరీపండిట్‌కు మంచి గుర్తింపునిస్తుందని సినీ విశ్లేషకులు జోస్యం చెబుతున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 27 Jul 2010 | 12:38 pm

హ్యాపీడేస్ తెల్లపిల్ల 'తమన్నా' కటౌట్‌కు పాలాభిషేకం..!

కోలీవుడ్‌లో త్రిష, నమిత, ఇలియానా తర్వాత తమన్నా టైమ్ వచ్చినట్టుంది. ప్రస్తుతం కోలీవుడ్‌లో తమన్నా ప్రేక్షకుల హృదయ స్పందనగా మారింది. ఈ మధ్యనే తూత్తుకుడి జిల్లాలో తమన్నా ఫ్యాన్స్ ఓ క్లబ్‌ని కూడా ప్రారంభించారు. దీనికి 'తంగపదుమై' (గోల్డెన్ గర్ల్)అని పేరు పెట్టారు. ఇది హెడ్ ఫ్యాన్ క్లబ్ అని వారు తెలిపారు. దీనిని పూర్తిగా 'తమన్నా అఖిల భారత గోల్డెన్ గర్ల్ ఫ్యాన్స్ సంక్షేమ సంఘంగా' పిలుస్తారు. భవిష్యత్తులో మరిన్ని తమన్నా సంక్షేమ సంఘ శాఖలను ఏర్పాటు చేస్తామని ఫ్యాన్స్ క్లబ్‌ వారు తెలిపారు.మరోవైపు.. తమన్నా తాజా తమిళ చిత్రం 'పయ్యా' (తెలుగులో ఆవారా) ప్రదర్శిస్తున్న ఓ థియేటర్లో తమన్నాకు 50 అడుగుల కటౌట్‌ను కట్టి పాలాభిషేకం కూడా చేశారు. ఈ విషయమై తమన్నాను ప్రశ్నిస్తే.. "నాకు అభిమానులు చాలా ముఖ్యం. అయితే ఈ ఫ్యాన్ క్లబ్ గురించి నాకు తెలియదు, ఒకవేళ అది జరిగితే వారి అభిమానాన్ని నేను గౌరవిస్తాను. కానీ.. ఈ పాలాభిషేకం వంటివి ప్రోత్సహించను. ఎందుకంటే..? ఇటువంటివి భగవంతుడికి మాత్రమే చెయ్యాలి" అని అమాయకంగా బదులిచ్చింది.. ఈ హ్యాపీడేస్ తెల్లపిల్ల తమన్నా..!.
Source: Yahoo! Telugu: Entertainment | 27 Jul 2010 | 12:07 pm

నన్నెందుకు హీరోగా నిలబెట్టలేకపోయారు..?: సాయికుమార్

నటుడు, డబ్బింగ్ కళాకారుడు అయిన సాయికుమార్‌ మంగళవారానికి 50 ఏట అడుగుపెట్టారు. 50వ పుట్టినరోజు సందర్భంగా తన కుమారుడు ఆదిత్య హీరోగా పరిచయం కావడం ఆనందంగా ఉన్నప్పటికీ, తాను నటునిగా ఇంకా అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోయాననే ఫీలింగ్ వెంటాడుతుందని చెప్పారు. ఇంకా సాయికుమార్ మాట్లాడుతూ.."కన్నడ, తమిళ, హిందీ చిత్రాలతో పాటు వెయ్యి సినిమాలకు డబ్బింగ్ చెప్పాను. కానీ నటుడిగా ఇంకా ఎదగకలేకపోయాను. దానికి కారణాలు ఏమిటనేవి ఇప్పటికీ అర్థంకావు. దర్శకులు నన్ను ఎందుకు సరైన హీరోగా చేయలేకపోయారు..?. సుమన్, రాజశేఖర్‌లకు డబ్బింగ్ చెబితే వారి సినిమాలు హిట్ అయ్యాయి. మరి నేను నటిస్తే ఎలా ఉండేది? అని నాకై నేను ప్రశ్నించుకున్నా..?" అర్థంకాలేదని అన్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 27 Jul 2010 | 11:45 am

ఉప ఎన్నికల్లో 64.2 శాతం పోలింగ్: ఐవి.సుబ్బారావు

తెలంగాణ ప్రాంతంలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల్లో సరాసరిగా 64.2 శాతం మేరకు పోలింగ్ జరిగినట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఐ.వి.సుబ్బారావు వెల్లడించారు. ఆయన మంగళవారం సాయంత్రం సచివాలయం విలేకరులతో మాట్లాడుతూ ఉప ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయన్నారు. కొన్ని చెదురుముదురు సంఘటనలు మినహా పోలింగ్ అంతా శాంతియుతంగా ముగిసిందన్నారు.
Source: ఏపీ న్యూస్ | 27 Jul 2010 | 7:53 am

ఉప సమరం: 11 స్థానాల్లో మాజీలదే విజయం: లగడపాటి

తెలంగాణలో 12 అసెంబ్లీ స్థానాలకు మంగళవారం జరిగిన ఉప ఎన్నికల్లో 11 స్థానాల్లో తెలంగాణ ఉద్యమం కోసం తమ సభ్యత్వాలకు రాజీనామా చేసిన సభ్యులే తిరిగి విజయం సాధిస్తారని కాంగ్రెస్ పార్టీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ (విజయవాడ) జోస్యం చెప్పారు.
Source: ఏపీ న్యూస్ | 27 Jul 2010 | 7:42 am

ప్రేమ వివాహం అంటేనే ఇష్టం..!: సమంత

"ఏ మాయ చేశావే" చిత్రం ద్వారా టాలీవుడ్ ఆరంగేట్రం చేసి యువత హృదయాలను మాయ చేసిన "సమంత" పెద్దలు కుదిర్చిన పెళ్లికంటే ప్రేమ వివాహాన్నే ఎక్కువగా ఇష్టపడుతుందట. తన పాఠశాల రోజుల్లో ఓ అబ్బాయిని కూడా ప్రేమించానని సమంత కాజువల్‌గా ఒప్పేసుకుంది. అయితే ఆ ప్రేమ కాస్త కాలగమనంలో కలసిపోయిందని సమంతా చెబుతోంది. చిన్నతనం కదా ఏవో చిన్న చిన్న గొడవల కారణంగా ఆ ప్రేమ కాస్త విరిగిపోయిందని అమ్మడు మనసులోని మాటను బయటపెట్టింది. ఇంకా సమంతా తన ప్రేమ గురించి చెబుతూ.. "నా కోసం ఎక్కడో అక్కడ ఒకతను పుట్టే ఉంటాడు, భవిష్యత్‌లో కచ్చితంగా అతనితో మరోసారి ప్రేమలో పడతాను. పెద్దలు కుదిర్చిన పెళ్లి కన్నా ప్రేమ వివాహాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాను" అంటుంది ఈ అందాల ముద్దుగుమ్మ. మరి ఇంతకి సమంత ప్రేమను దక్కించుకునే ఆ అదృష్టవంతుడు ఎవరో..? వేచి చూడాల్సిందే..!
Source: Yahoo! Telugu: Entertainment | 27 Jul 2010 | 6:13 am

పారామిలిటరీకి 86 వేల బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్ల కొరత!

దేశ భద్రతలో నిమగ్నమయ్యే పారామిలిటరీ బలగాలకు సుమారు 86,220 వేల బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్లు కొరతగా ఉన్నట్టు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఎం.రామచంద్రన్ తెలిపారు. మంగళవారం జరిగిన పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా లోక్‌సభలో ప్రతిపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు.
Source: జాతీయ | 27 Jul 2010 | 6:07 am

మధ్యేమార్గంగానే సమస్యకు పరిష్కారం: రోశయ్య

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కోరినట్టుగా ఏ సమస్య అయినా అక్కడికక్కడే పరిష్కరించడం సాధ్యం కాదని ముఖ్యమంత్రి కె.రోశయ్య అభిప్రాయపడ్డారు. ఆయన మంగళవారం సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ బాబ్లీ ప్రాజెక్టు సమస్యను ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అక్కడికక్కడే పరిష్కరించాలని చంద్రబాబు కోరడం సమంజసం కాదన్నారు. ఈ సమస్య పరిష్కారానికి సముచిత రీతిలో కృషి చేయాలన్నారు.
Source: ఏపీ న్యూస్ | 27 Jul 2010 | 4:22 am

ధరలపై దుమారం: ఉభయ సభలు రేపటికి వాయిదా!

పెరిగిన నిత్యావసర వస్తు రేట్లపై పార్లమెంట్ ఉభయ సభలు మంగళవారం దద్ధరిల్లాయి. పెరిగిన ధరలతో దేశ ప్రజలు అష్టకష్టాలు పడుతున్నాయని, అందువల్ల ఈ అంశంపై చర్చ చేపట్టాలని ప్రతిపక్ష పార్టీలు పట్టుబట్టాయి. ప్రతిపక్ష పార్టీలకు యూపీఏ భాగస్వామ్య పక్షాలైన తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే వంటి పార్టీలు జత కలిశాయి. దీంతో సభలో గందరగోళం నెలకొంది. సభాపతులు మీరా కుమార్ (లోక్‌సభ), హమీద్ అన్సారీ (రాజ్యసభ)లు ప్రతిపక్షాల పట్టుకు అంగీకరించలేదు.
Source: జాతీయ | 27 Jul 2010 | 3:47 am

వారిద్దరు వారంలో 32 సార్లు మాట్లాడుకున్నారు: సీబీఐ

సొహ్రాబుద్దీన్ నకిలీ ఎన్‌కౌంటర్ కేసులో సీబీఐ అరెస్టు చేసిన గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ప్రధాన అనుచరుడు అమిత్ షాకు కష్టాలు తప్పేలా లేవు. ఈ కేసులో అరెస్టయి జైళ్లలో ఉన్న మాజీ డీఎస్పీతో సహా మరో ఇద్దరు పోలీసులు అప్రూవర్‌గా మారేందుకు సమ్మతించారు. ముఖ్యంగా, మాజీ డీఎస్పీ ఎన్.కె.అమిన్, మాజీ మంత్రి అమిత్ షాలు ఎన్‌కౌంటర్‌కు ముందు ఒక వారంలో 32 సార్లు మాట్లాడుకున్నట్టు దర్యాప్తులో వెల్లడైంది.
Source: జాతీయ | 27 Jul 2010 | 3:02 am