కుళ్లబొడిచి వదిలితే ఒక్క మాట అడగలేదు: బాబు

మూడు రోజుల పాటు చీకటి గదుల్లో ఉంచడమే కాకుండా, హైదరాబాద్‌కు తరలించే సమయంలో మహారాష్ట్ర పోలీసులు కండకావరం ప్రదర్శిస్తే ముఖ్యమంత్రి కె.రోశయ్య మాటమాత్రానికైనా ఎలా ఉన్నారని అడగలేదని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ బాబ్లీతో పాటు నిత్యావసర వస్తు ధరల పెరుగుదల కూడా ప్రధాన సమస్యేనన్నారు.
Source: Yahoo! Telugu: News | 27 Jul 2010 | 9:42 am

ధరలపై దుమారం: ఉభయ సభలు రేపటికి వాయిదా!

పెరిగిన నిత్యావసర వస్తు రేట్లపై పార్లమెంట్ ఉభయ సభలు మంగళవారం దద్ధరిల్లాయి. పెరిగిన ధరలతో దేశ ప్రజలు అష్టకష్టాలు పడుతున్నాయని, అందువల్ల ఈ అంశంపై చర్చ చేపట్టాలని ప్రతిపక్ష పార్టీలు పట్టుబట్టాయి. ప్రతిపక్ష పార్టీలకు యూపీఏ భాగస్వామ్య పక్షాలైన తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే వంటి పార్టీలు జత కలిశాయి. దీంతో సభలో గందరగోళం నెలకొంది. సభాపతులు మీరా కుమార్ (లోక్‌సభ), హమీద్ అన్సారీ (రాజ్యసభ)లు ప్రతిపక్షాల పట్టుకు అంగీకరించలేదు.
Source: Yahoo! Telugu: News | 27 Jul 2010 | 9:16 am

ఉప ఎన్నికల్లో క్లీన్‌స్వీప్ చేస్తాం: పీసీసీ చీఫ్ జోస్యం

ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ క్లీన్‌స్వీప్ చేయడం ఖాయమని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, నిజామాబాద్ అర్బన్ అభ్యర్థి ధర్మపురి శ్రీనివాస్ జోస్యం చెప్పారు. ఆయన తన భార్యతో కలిసి నిజామాబాద్ పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
Source: Yahoo! Telugu: News | 27 Jul 2010 | 8:43 am

విదేశీ మార్కెట్ల ప్రభావం: లాభాల్లో సెన్సెక్స్!

బాంబే స్టాక్ మార్కెట్ మంగళవారం లాభాలను నమోదు చేసుకుంటోంది. ట్రేడింగ్ ప్రారంభం నుంచి పురోగమనం వైపు ర్యాలీని కొనసాగించిన బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచి సెన్సెక్స్, మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో 121 పాయింట్లు పుంజుకుని, 18,141 పాయింట్ల మార్కును తాకింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 23 పాయింట్లు లాభపడి, 5,442 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.
Source: Yahoo! Telugu: News | 27 Jul 2010 | 8:09 am

స్టాక్ మార్కెట్: సెన్సెక్స్ 80 పాయింట్ల వృద్ధి..!

బాంబే స్టాక్ మార్కెట్ లాభాల బాటలో కొనసాగుతోంది. ట్రేడింగ్ ప్రారంభం నుంచే ఊపందుకున్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచి సెన్సెక్స్, 80 పాయింట్లు వృద్ధి చెంది, 18,100 పాయింట్ల మార్కును తాకింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచి నిఫ్టీ కూడా 22 పాయింట్లు లాభపడి, 5,441 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.
Source: Yahoo! Telugu: News | 27 Jul 2010 | 7:35 am

నాన్న పోయిన తర్వాత పండుగ చేసుకున్నారు: జగన్

తన తండ్రి వైఎస్.రాజశేఖర రెడ్డి హఠాన్మరణం చెందిన తర్వాత పలువురు నేతలు పండుగ చేసుకున్నారని ఆయన తనయుడు, కడప ఎంపీ వైఎస్.జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. ఇపుడు తాను చేపట్టిన ఓదార్పు యాత్రకు లభిస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక తనపైనా.. తన కుటుంబంపైనా లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని జగన్ మరో విమర్శనాస్త్రం సంధించారు.
Source: Yahoo! Telugu: News | 27 Jul 2010 | 7:31 am

లాభాల్లో స్టాక్ మార్కెట్: సెన్సెక్స్, నిఫ్టీల వృద్ధి!

బాంబే స్టాక్ మార్కెట్ లాభాలను ఆర్జిస్తోంది. ట్రేడింగ్ ప్రారంభం నుంచే పురోగమనం వైపు ర్యాలీని కొనసాగిస్తున్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో 50 పాయింట్లు పుంజుకుని, 18,070 పాయింట్ల మార్కును తాకింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా పది పాయింట్ల వృద్ధితో 5,429 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.
Source: Yahoo! Telugu: News | 27 Jul 2010 | 7:20 am

మరోసారి రెపో, రివర్స్‌ రెపో రేట్లను పెంచిన ఆర్‌బీఐ

భారతీయ రిజర్వు బ్యాంకు కీలక వడ్డీరేట్లను మరోసారి పెంచింది. ఇవాళ జరిగిన త్రైమాసిక ద్రవ్య పరపతి సమీక్షలో వడ్డీరేట్లను పెంచుతూ ఆర్‌బీఐ నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం రెపో, రివర్స్‌ రెపో రేట్లను 0.25శాతం, 0.50శాతంగా పెంచింది. మార్చి 2011 చివరినాటికి ద్రవ్యోల్బణాన్ని 6శాతానికి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్టు ఆర్‌బీఐ తెలిపింది.
Source: Yahoo! Telugu: News | 27 Jul 2010 | 7:17 am

వారిద్దరు వారంలో 32 సార్లు మాట్లాడుకున్నారు: సీబీఐ

సొహ్రాబుద్దీన్ నకిలీ ఎన్‌కౌంటర్ కేసులో సీబీఐ అరెస్టు చేసిన గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ప్రధాన అనుచరుడు అమిత్ షాకు కష్టాలు తప్పేలా లేవు. ఈ కేసులో అరెస్టయి జైళ్లలో ఉన్న మాజీ డీఎస్పీతో సహా మరో ఇద్దరు పోలీసులు అప్రూవర్‌గా మారేందుకు సమ్మతించారు. ముఖ్యంగా, మాజీ డీఎస్పీ ఎన్.కె.అమిన్, మాజీ మంత్రి అమిత్ షాలు ఎన్‌కౌంటర్‌కు ముందు ఒక వారంలో 32 సార్లు మాట్లాడుకున్నట్టు దర్యాప్తులో వెల్లడైంది.
Source: Yahoo! Telugu: News | 27 Jul 2010 | 6:35 am

గట్టి భద్రతల మధ్య భోపాల్ కోర్టుకు వచ్చిన అబూసలేం

నకిలీ పాస్‌పోర్టుల కుంభకోణంలో నిందితుడు గ్యాంగ్‌స్టర్ అబూసలేం విచారణ నిమిత్తం మంగళవారం భోపాల్ కోర్టు హాజరు కావలసి ఉండగా.. శనివారం అబూసలేంపై ఆర్ధర్ రోడ్‌ జైలులో దావూద్ ఇబ్రహీం అనుచరుడు ముస్తఫా దొస్సా చేసిన దాడిని దృష్టిలో ఉంచుకొని పోలీసులు గట్టి భద్రతల నడుమ సలేంను కోర్టులో హాజరుపరచారు.
Source: Yahoo! Telugu: News | 27 Jul 2010 | 6:30 am

ప్రేమ వివాహం అంటేనే ఇష్టం..!: సమంత

"ఏ మాయ చేశావే" చిత్రం ద్వారా టాలీవుడ్ ఆరంగేట్రం చేసి యువత హృదయాలను మాయ చేసిన "సమంత" పెద్దలు కుదిర్చిన పెళ్లికంటే ప్రేమ వివాహాన్నే ఎక్కువగా ఇష్టపడుతుందట. తన పాఠశాల రోజుల్లో ఓ అబ్బాయిని కూడా ప్రేమించానని సమంత కాజువల్‌గా ఒప్పేసుకుంది. అయితే ఆ ప్రేమ కాస్త కాలగమనంలో కలసిపోయిందని సమంతా చెబుతోంది. చిన్నతనం కదా ఏవో చిన్న చిన్న గొడవల కారణంగా ఆ ప్రేమ కాస్త విరిగిపోయిందని అమ్మడు మనసులోని మాటను బయటపెట్టింది. ఇంకా సమంతా తన ప్రేమ గురించి చెబుతూ.. "నా కోసం ఎక్కడో అక్కడ ఒకతను పుట్టే ఉంటాడు, భవిష్యత్‌లో కచ్చితంగా అతనితో మరోసారి ప్రేమలో పడతాను. పెద్దలు కుదిర్చిన పెళ్లి కన్నా ప్రేమ వివాహాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాను" అంటుంది ఈ అందాల ముద్దుగుమ్మ. మరి ఇంతకి సమంత ప్రేమను దక్కించుకునే ఆ అదృష్టవంతుడు ఎవరో..? వేచి చూడాల్సిందే..!
Source: Yahoo! Telugu: Entertainment | 27 Jul 2010 | 6:13 am

కుళ్లబొడిచి వదిలితే ఒక్క మాట అడగలేదు: బాబు

మూడు రోజుల పాటు చీకటి గదుల్లో ఉంచడమే కాకుండా, హైదరాబాద్‌కు తరలించే సమయంలో మహారాష్ట్ర పోలీసులు కండకావరం ప్రదర్శిస్తే ముఖ్యమంత్రి కె.రోశయ్య మాటమాత్రానికైనా ఎలా ఉన్నారని అడగలేదని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ బాబ్లీతో పాటు నిత్యావసర వస్తు ధరల పెరుగుదల కూడా ప్రధాన సమస్యేనన్నారు.
Source: ఏపీ న్యూస్ | 27 Jul 2010 | 4:13 am

ధరలపై దుమారం: ఉభయ సభలు రేపటికి వాయిదా!

పెరిగిన నిత్యావసర వస్తు రేట్లపై పార్లమెంట్ ఉభయ సభలు మంగళవారం దద్ధరిల్లాయి. పెరిగిన ధరలతో దేశ ప్రజలు అష్టకష్టాలు పడుతున్నాయని, అందువల్ల ఈ అంశంపై చర్చ చేపట్టాలని ప్రతిపక్ష పార్టీలు పట్టుబట్టాయి. ప్రతిపక్ష పార్టీలకు యూపీఏ భాగస్వామ్య పక్షాలైన తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే వంటి పార్టీలు జత కలిశాయి. దీంతో సభలో గందరగోళం నెలకొంది. సభాపతులు మీరా కుమార్ (లోక్‌సభ), హమీద్ అన్సారీ (రాజ్యసభ)లు ప్రతిపక్షాల పట్టుకు అంగీకరించలేదు.
Source: జాతీయ | 27 Jul 2010 | 3:47 am

ఉప ఎన్నికల్లో క్లీన్‌స్వీప్ చేస్తాం: పీసీసీ చీఫ్ జోస్యం

ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ క్లీన్‌స్వీప్ చేయడం ఖాయమని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, నిజామాబాద్ అర్బన్ అభ్యర్థి ధర్మపురి శ్రీనివాస్ జోస్యం చెప్పారు. ఆయన తన భార్యతో కలిసి నిజామాబాద్ పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
Source: ఏపీ న్యూస్ | 27 Jul 2010 | 3:14 am

వారిద్దరు వారంలో 32 సార్లు మాట్లాడుకున్నారు: సీబీఐ

సొహ్రాబుద్దీన్ నకిలీ ఎన్‌కౌంటర్ కేసులో సీబీఐ అరెస్టు చేసిన గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ప్రధాన అనుచరుడు అమిత్ షాకు కష్టాలు తప్పేలా లేవు. ఈ కేసులో అరెస్టయి జైళ్లలో ఉన్న మాజీ డీఎస్పీతో సహా మరో ఇద్దరు పోలీసులు అప్రూవర్‌గా మారేందుకు సమ్మతించారు. ముఖ్యంగా, మాజీ డీఎస్పీ ఎన్.కె.అమిన్, మాజీ మంత్రి అమిత్ షాలు ఎన్‌కౌంటర్‌కు ముందు ఒక వారంలో 32 సార్లు మాట్లాడుకున్నట్టు దర్యాప్తులో వెల్లడైంది.
Source: జాతీయ | 27 Jul 2010 | 3:02 am

నాన్న పోయిన తర్వాత పండుగ చేసుకున్నారు: జగన్

తన తండ్రి వైఎస్.రాజశేఖర రెడ్డి హఠాన్మరణం చెందిన తర్వాత పలువురు నేతలు పండుగ చేసుకున్నారని ఆయన తనయుడు, కడప ఎంపీ వైఎస్.జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. ఇపుడు తాను చేపట్టిన ఓదార్పు యాత్రకు లభిస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక తనపైనా.. తన కుటుంబంపైనా లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని జగన్ మరో విమర్శనాస్త్రం సంధించారు.
Source: ఏపీ న్యూస్ | 27 Jul 2010 | 2:02 am

గట్టి భద్రతల మధ్య భోపాల్ కోర్టుకు వచ్చిన అబూసలేం

నకిలీ పాస్‌పోర్టుల కుంభకోణంలో నిందితుడు గ్యాంగ్‌స్టర్ అబూసలేం విచారణ నిమిత్తం మంగళవారం భోపాల్ కోర్టు హాజరు కావలసి ఉండగా.. శనివారం అబూసలేంపై ఆర్ధర్ రోడ్‌ జైలులో దావూద్ ఇబ్రహీం అనుచరుడు ముస్తఫా దొస్సా చేసిన దాడిని దృష్టిలో ఉంచుకొని పోలీసులు గట్టి భద్రతల నడుమ సలేంను కోర్టులో హాజరుపరచారు.
Source: జాతీయ | 27 Jul 2010 | 1:00 am

మందిరం-మసీదు నిర్మాణంతోనే సమస్యకు పరిష్కారం!

దేశంలోని హిందు-ముస్లిం ప్రజల మధ్య నెలకొనివున్న ఘర్షణలను శాశ్వతంగా నివారించేందుకు ఏకైక మార్గం మందిరం-మసీదు నిర్మాణమేనని శారదా పీఠాధిపతి శంకరాచార్య స్వామి స్వరూపానంద సరస్వతి అభిప్రాయపడ్డారు. అయితే, ఈ రెండింటిని దూరదూరంగా నిర్మించాలని సూచించారు.
Source: జాతీయ | 27 Jul 2010 | 12:21 am

సోంపేట రైతులపై కాల్పులు జరిపిన స్థానిక ఎస్.ఐ!

శ్రీకాకుళం జిల్లా సోంపేటలో నిర్మించతలపెట్టిన థర్మల్ విద్యుత్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఆందోళన చేసిన రైతులపై కాల్పులు జరిపింది స్థానిక ఎస్.ఐ.అశోక్ కుమార్ అని నిజ నిర్ధారణ కమిటీ తేల్చింది. సోంపేట వైపు వెళుతున్న పోలీసు వాహనం నుంచి తొలుత కాల్పులు వచ్చాయని స్థానికులు చెప్పారని ఈ కమిటీ పేర్కొంది.
Source: ఏపీ న్యూస్ | 26 Jul 2010 | 11:50 pm

తెలంగాణలోని 12 నియోజకవర్గాల్లో ఓటర్ల వివరాలు

తెలంగాణలో మంగళవారం ఉపఎన్నికలు జరుగుతున్న 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటర్ల వివరాలు కింది విధంగా ఉన్నాయి. మొత్తం 12 నియోజకవర్గాల్లో 23,59,228 మంది ఓటర్లు ఉండగా, వీరిలో ఎక్కువ శాతం మహిళలు కావడం గమనార్హం. వీరిసంఖ్య 11,84,111 ఉండగా, పురుషుల సంఖ్య 11,75,117గా ఉంది.
Source: ఏపీ న్యూస్ | 26 Jul 2010 | 11:39 pm

తెలంగాణ ఉప పోరు: ప్రశాంతంగా సాగుతున్న పోలింగ్!

తెలంగాణ ప్రాంతంలో 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు మొరాయించినప్పటికీ.. అంతటా ప్రశాంతంగా సాగుతోందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఐవి.సుబ్బారావు వెల్లడించారు. ఆయన సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. మంగళవారం ఉదయం ఏడు గంటల నుంచే పోలింగ్ 12 స్థానాల్లో ప్రారంభమైనట్టు చెప్పారు.
Source: ఏపీ న్యూస్ | 26 Jul 2010 | 11:25 pm

సైనిక దళానికి పూర్తి సహకారం అందిస్తాం: ఆంటోనీ

మనదేశ భూభాగంలో ప్రతి ఒక్క అంగుళాన్ని సంరక్షించుకునేందుకు వీలుగా సైనిక దళానికి పూర్తి సహకారం అందజేస్తామని కేంద్ర రక్షణ మంత్రి ఎ.కె. ఆంటోనీ హామీ ఇచ్చారు. ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపేందుకు అమెరికా అందిస్తున్న సాయాన్ని పాకిస్థాన్‌ భారత వ్యతిరేక కార్యకలాపాల కోసం వినియోగించే అవకాశం ఉందని మంత్రి అభిప్రాయం వ్యక్తం చేశారు. అందుచేత సైన్యానికి అన్ని విధాలా సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆంటోనీ తెలిపారు.
Source: జాతీయ | 26 Jul 2010 | 11:05 pm

అమిత్ షాపై కక్ష సాధించుకుంటున్న కాంగ్రెస్: గడ్కారీ

కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి అమిత్ షాపై కక్ష సాధించుకుంటుందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ గడ్కారీ ఆరోపించారు. రానున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లను కొల్లగొట్టడానికి మాత్రమే సోహ్రాబుద్దీన్ కేసును కాంగ్రెస్ ఉపయోగించుకుంటోందని నితిన్ గడ్కారీ విమర్శించారు.
Source: జాతీయ | 26 Jul 2010 | 11:05 pm

నేడే ఉప సమరం పోలింగ్: ఎవరెక్కడ పోటీ చేస్తున్నారు?

రాష్ట్రంలో మూడు ప్రధాన రాజకీయ పార్టీలు ఆఖరి పోరాటానికి సిద్ధమయ్యాయి. మంగళవారం ఉదయం ఏడు నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు జరిగే పోలింగ్‌ జరుగనుంది. అన్ని పార్టీలూ తెలంగాణవాదాన్నే ప్రధాన అజెండాగా నమ్ముకుని పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉప ఎన్నికల్లో ఎవరు ఎక్కడెక్కడ పోటీ చేస్తున్నారనే వివరాలను తెలుసుకుందాం. కరీంనగర్ జిల్లాలోని కోరుట్ల స్థానంలో తెరాస అభ్యర్థిగా కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు బరిలో ఉన్నారు. ఈయన ప్రత్యర్థులుగా కాంగ్రెస్ అభ్యర్థి జువ్వాడి రత్నాకర్‌రావు, తెదేపా తరపు శికారి విశ్వనాథంలు పోటీ చేస్తున్నారు.
Source: ఏపీ న్యూస్ | 26 Jul 2010 | 9:59 pm

'మాగ్జిమ్' ముఖ చిత్రం ఫోటోలో దర్శనమిచ్చిన త్రిష

దక్షిణాది సెక్సీ తార త్రిష ఫోటోను ప్రముఖ మాగ్జిమ్ పత్రిక జులై సంచికలో కవర్ పేజీగా ప్రచురించింది. ప్రముఖ ఫోటోగ్రాఫర్ డబూ రత్నాని ఈ ఫోటోలను తీశారు. ఈ పత్రిక కోసం త్రిష హాట్ హాట్ ఫోజులిచ్చారు.
Source: Yahoo! Telugu: Entertainment | 26 Jul 2010 | 11:30 am

నీటి సమస్య పరిష్కారానికి ప్రధాని హామీ: రోశయ్య

మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ఏర్పడిన నీటి సమస్య పరిష్కారాన్ని వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ హామీ ఇచ్చారని ముఖ్యమంత్రి కె.రోశయ్య చెప్పారు. బాబ్లీతో పాటు.. మహారాష్ట్ర నిర్మిస్తున్న 13 ప్రాజెక్టుల అంశంలో రాష్ట్రానికి న్యాయం చేస్తారనే నమ్మకం తమకు కుదిరిందన్నారు.
Source: ఏపీ న్యూస్ | 26 Jul 2010 | 7:39 am

ప్రభాస్ సినిమాకు కవలలు కావాలెను

ప్రభాస్, కాజల్ అగర్వాల్, తాప్సీ హీరోహీరోయిన్లుగా దశరథ్ దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో కీలక పాత్రలైన కవల సోదరులు కావాలని నిర్మాత దిల్ రాజు ఆదివారంనాడు తెలియజేశారు. రాష్ట్రంలో ఇంతవరకూ తమకు తగినవిధంగా ఎవ్వరూ తారసపడలేదు కనుక ఇతర రాష్ట్రాలు, లేదా దేశాల్లో ఎవరైనాఉంటే తమను సంప్రదించండి అన్నారు. వారి వివరాలను దిల్‌రాజుఎస్వీసి ఎట్ జీమెయిల్ డాట్ కామ్‌కు పంపించాలని తెలిపారు. చిత్రం ప్రోగ్రెస్ వెల్లడిస్తూ... మూడు షెడ్యూళ్లను పూర్తి చేసుకుంది. అహోబిలం, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో ఈ షెడ్యూల్ జరిగింది. వచ్చే నెలలో ఆస్ట్రేలియాలో షూటింగ్ జరుపుతామనీ, అనంతరం సెప్టెంబరులో హైదరాబాద్, పొల్లాచ్చిల్లో షూటింగ్ ఉంటుందన్నారు. ఈ ఏడాది చివర్లో చిత్రాన్ని విడుదల చేస్తామన్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 26 Jul 2010 | 6:56 am

ఢిల్లీ మెట్రోలో ముఖ్యమంత్రి రోశయ్యకు చేదు అనుభవం!

ముఖ్యమంత్రి రోశయ్యకు ఢిల్లీ మెట్రో రైల్లో చేదు అనుభవం ఎదురైంది. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన సోమవారం ఢిల్లీ మెట్రో రైలును పరిశీలించారు. తన సెక్యూరిటీ సిబ్బందితో పాటు అధికారులతో కలిసి పార్లమెంట్ మెట్రో స్టేషన్ నుంచి రైల్లో ప్రయాణించారు. మెట్రో రైలులోని సాంకేతికాంశాలతో పాటు ప్రయాణికుల సౌకర్యాలపైనా ఆరాదీశారు. మెట్రో అంతా కలియదిరుగుతూ ఓ సాధారణ ప్రయాణికుడిలా గడిపారు.
Source: ఏపీ న్యూస్ | 26 Jul 2010 | 6:56 am

'మాగ్జిమ్' ముఖ చిత్రం ఫోటోలో దర్శనమిచ్చిన త్రిష

దక్షిణాది సెక్సీ తార త్రిష ఫోటోను ప్రముఖ మాగ్జిమ్ పత్రిక జులై సంచికలో కవర్ పేజీగా ప్రచురించింది. ప్రముఖ ఫోటోగ్రాఫర్ డబూ రత్నాని ఈ ఫోటోలను తీశారు. ఈ పత్రిక కోసం త్రిష హాట్ హాట్ ఫోజులిచ్చారు.
Source: వినోదం | 26 Jul 2010 | 6:03 am

ముక్కోణపు సమరంలో ఓటరన్న ఎవరివైపు మొగ్గు?

తెలంగాణ ఉప ఎన్నికల సమరం చివరి అంకానికి చేరుకుంది. మొత్తం 12 అసెంబ్లీ నియోజకవర్గాలకు మంగళవారం ఉప ఎన్నికల పోలింగ్ జరుగనుంది. 'తెలంగాణ పోరు వీరులం తామే'నంటూ అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం, ఉప ప్రాంతీయ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితిలు పోటాపోటీగా ప్రచారం చేశాయి. ముక్కోణపు పోటీ నెలకొన్న ఈ ఉప ఎన్నికల్లో తుది గెలుపు కోసం అన్ని పార్టీల నేతలు అహర్నిశలు కృషి చేశారు.
Source: ఏపీ న్యూస్ | 26 Jul 2010 | 5:33 am

ఖలేజా టైటిల్ మహేశ్ బాబుది కాదు.. మాదే..!!

ఖలేజా అనే టైటిల్ తమదేనని నిత్యశ్రీ ప్రొడక్షన్స్ ఓ ప్రకటనలో పేర్కొంది. ఆదివారంనాడు విడుదల చేసిన ఆ ప్రకటనలో చిత్ర నిర్మాత ఎస్. విజయభాస్కర్ రెడ్డి తెలియజేస్తూ... మా బ్యానర్‌లో ఎప్పుడో ఛాంబర్‌లో టైటిల్ రిజిస్టర్ చేశాం. అయితే మహేష్ బాబు చిత్రానికి ఖలేజా పెడుతున్నట్లు వార్తలు వచ్చాయి. ఆయన తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. కనుక ఖలేజా టైటిల్ మహేశ్ బాబుకు ఇవ్వలేదు. ఈ విషయాన్ని ఫిలిమ్ ఛాంబర్ దృష్టికి తీసుకుని వెళ్లాం. తగు విధంగా చర్యలు తీసుకుంటామని వారు హామీ ఇచ్చారని చెప్పారు.
Source: Yahoo! Telugu: Entertainment | 26 Jul 2010 | 5:24 am

సోనియా నాకు తగిన జోడీ: శివాజీ

నటుడు శివాజీ, లయ కాంబినేషన్‌లో చాలా చిత్రాలు వచ్చాయి. లయకు పెండ్లి కానప్పుడు ఆమెతో అతి చనువుగా ఉండేవాడని ఇండస్ట్రీ చెప్పుకునేది. పెండ్లి తర్వాత కూడా శివాజీ నటించే చిత్రంలో ప్రత్యేక పాత్రను కూడా లయ ఇస్తుండేది. వీరిద్దర మధ్య బంధం 'టాటా బిర్లా మధ్యలో లైలా'తో గట్టిపడింది. అయితే ప్రస్తుతం శివాజీ దృష్టి నటి సోనియాపై పడినట్లు టాలీవుడ్ సినీజనం అంటున్నారు. హ్యాపీడేస్‌లో, వినాయకుడులో గిరజాల జట్టుతో ఉన్న ఆ అమ్మాయి చాలా బాగుంటుందని శివాజీ కితాబిచ్చాడు. తాజాగా ఆమె శివాజీతో జోడీగా 'బ్రహ్మలోకం టు యమలోకం వయా భూలోకం'లో నటించింది. ఆమె గురించి చెబుతూ.. లయ తర్వాత నాకు సరైన జోడీ సోనియా అనిపిస్తుంది. ఆ విషయం ఆమెకూ తెలియదు. ఇది నా మనసులోఉంది. ఈరోజు చెబుతున్నాను. ఆమె మంచి నటి. మంచి కెరీర్‌ ఉంది అంటూ పొగడ్తలతో ముంచెత్తాడు. శివాజీ స్పందనను స్టేజిపై ఉన్న సోనియా విని ముసిముసి నవ్వులు నవ్వుకుంది.
Source: Yahoo! Telugu: Entertainment | 26 Jul 2010 | 5:08 am

అప్రూవర్‌గా మారిన మాజీ డీఎస్పీ: అమిత్‌ షాకు కష్టాలు!

సొహ్రాబుద్దీన్ నకిలీ ఎన్‌కౌంటర్ కేసులో సీబీఐ అరెస్టు చేసిన గుజరాత్ మాజీ మంత్రి అమిత్ షాకు మరిన్ని కష్టాలు తప్పేలా కనిపించడం లేదు. ఈ కేసులోని నిందితుల్లో ఒకరైన ఆ రాష్ట్ర మాజీ డీఎస్పీ అప్రూవర్‌గా మారనున్నట్టు సమాచారం. ఇదే అంశంపై ఆయన దరఖాస్తు చేసుకోవాలని భావిస్తున్నట్టు ఆయన తరపు న్యాయవాది సోమవారం అహ్మదాబాద్‌లో వెల్లడించారు.
Source: జాతీయ | 26 Jul 2010 | 3:51 am

1993 ముంబై పేలుళ్ళపై జనవరిలో తుది విచారణ

1993లో జరిగిన ముంబై వరుసు పేలుళ్ళ కేసులో తుది విచారణను 2011 జనవరి 11వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు సుప్రీంకోర్టు ప్రకటించింది. ఈ కేసులో నిందితులకు మరికొంత కాలం శిక్షవిధించాలన్న సీబీఐ విజ్ఞప్తితో జస్టిస్ పి.సదాశివం, బీఎస్.చౌహాన్‌లతో కూడిన ధర్మాసనం నిందితులకు నోటీసులు జారీ చేసింది.
Source: జాతీయ | 26 Jul 2010 | 3:47 am