ఆయిల్ లీకేజీ: ఉద్యోగాలు కోల్పోయిన 17 వేల మంది

అమెరికాలోని మెక్సీకో సముద్ర జలాశయాల్లో చమురు లీకేజీ కారణంగా ఈ యేడాది ఇప్పటి వరకు దాదాపు 17 వేల మంది ఉపాధి కోల్పోయారు. మరికొంతమంది పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. మెక్సికోకు చెందిన చమురు బావి నుంచి గత మూడు నెలలుగా ఆయిల్ లీక్ అవుతోంది. ఇది సముద్ర జలాలపై బాగా పేరుకుని పోయి చేపల వేటతో పర్యాటక రంగంపై తీవ్ర ప్రభావం చూపింది. సముద్ర గర్భంలో ఏర్పడిన ఈ చమురు లీకేజీ కారణంగా సముద్ర జలచరాలతో పాటు.. పర్యావరణానికి తీవ్ర హాని కలిగింది. అలాగే, కోట్లాది రూపాయల మేరకు ఆర్థిక నష్టం వాటిల్లింది.
Source: Yahoo! Telugu: News | 26 Jul 2010 | 7:36 am

స్టాక్ మార్కెట్: నష్టాల్లో సెన్సెక్స్, నిఫ్టీల ర్యాలీ!

బాంబే స్టాక్ మార్కెట్ నష్టాల బాటలో కొనసాగుతోంది. ట్రేడింగ్ ప్రారంభం నుంచే తిరోగమనం వైపు ర్యాలీని కొనసాగించిన బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచి సెన్సెక్స్, మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో 58 పాయింట్లు క్షీణించి, 18,072 పాయింట్ల మార్కును తాకింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచి నిఫ్టీ కూడా 18 పాయింట్ల స్వల్ప నష్టంతో 5,430 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.
Source: Yahoo! Telugu: News | 26 Jul 2010 | 7:32 am

బంగాళాఖాతంలో అల్పపీడనం: విస్తారంగా వర్షాలు!

వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో పాటు రుతుపవనాల కారణంగా రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గోదావరి పరీవాహక ప్రాంతాల్లో భారీ వర్షాల వల్ల వరద పోటెత్తుతోంది. ప్రధానంగా తూర్పుగోదావరి జిల్లాలో గత రెండు రోజులుగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి.
Source: Yahoo! Telugu: News | 26 Jul 2010 | 7:10 am

ప్రభాస్ సినిమాకు కవలలు కావాలెను

ప్రభాస్, కాజల్ అగర్వాల్, తాప్సీ హీరోహీరోయిన్లుగా దశరథ్ దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో కీలక పాత్రలైన కవల సోదరులు కావాలని నిర్మాత దిల్ రాజు ఆదివారంనాడు తెలియజేశారు. రాష్ట్రంలో ఇంతవరకూ తమకు తగినవిధంగా ఎవ్వరూ తారసపడలేదు కనుక ఇతర రాష్ట్రాలు, లేదా దేశాల్లో ఎవరైనాఉంటే తమను సంప్రదించండి అన్నారు. వారి వివరాలను దిల్‌రాజుఎస్వీసి ఎట్ జీమెయిల్ డాట్ కామ్‌కు పంపించాలని తెలిపారు. చిత్రం ప్రోగ్రెస్ వెల్లడిస్తూ... మూడు షెడ్యూళ్లను పూర్తి చేసుకుంది. అహోబిలం, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో ఈ షెడ్యూల్ జరిగింది. వచ్చే నెలలో ఆస్ట్రేలియాలో షూటింగ్ జరుపుతామనీ, అనంతరం సెప్టెంబరులో హైదరాబాద్, పొల్లాచ్చిల్లో షూటింగ్ ఉంటుందన్నారు. ఈ ఏడాది చివర్లో చిత్రాన్ని విడుదల చేస్తామన్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 26 Jul 2010 | 6:56 am

ట్రేడింగ్ క్షీణత: నష్టాల్లో బాంబే స్టాక్ మార్కెట్!

దేశీయ వాటాల ట్రేడింగ్ క్షీణించడంతో సోమవారం బాంబే స్టాక్ మార్కెట్ నష్టాల్లో కూరుకుపోయింది. కన్జూమర్ డూరబుల్స్, టెక్, ఆటో, రియాల్టీ, పీఎస్‌యూ వాటాలు అమ్మకాల ఒత్తిడికి గురికావడంతో బాంబే స్టాక్ మార్కెట్ పతనమైంది. ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం 12.40 గంటల ప్రాంతంలో బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచి సెన్సెక్స్ 23 పాయింట్లు పతనమై 18,107 పాయింట్ల మార్కును తాకింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచి నిఫ్టీ కూడా 11 పాయింట్లు క్షీణించి, 5,437 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది.
Source: Yahoo! Telugu: News | 26 Jul 2010 | 6:51 am

మాజీ సభ్యులకు నివాళి: పార్లమెంట్ రేపటికి వాయిదా!

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభమైన కొద్దిసేపటికే సభా కార్యక్రమాలను మంగళవారానికి స్పీకర్ మీరా కుమార్ వాయిదా వేశారు. రాజ్యసభ మాజీ ఛైర్మన్, మాజీ ఉపరాష్ట్రపతి భైరాన్‌సింగ్ షెకావత్, ఎంపీలు వీరేంద్ర బాటియా, దిగ్విజయ్‌సింగ్‌ల మృతికి సభ సంతాపం తెలిపింది. అనంతరం స్పీకర్ సభను రేపటికి వాయిదా వేశారు.
Source: Yahoo! Telugu: News | 26 Jul 2010 | 6:50 am

పోలింగ్‌కు వేతనంతో కూడిన సెలవు: కార్మిక శాఖ

తెలంగాణ ప్రాంతంలో 12 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరుగనున్న ఉప ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మంగళవారం వేతనంతో కూడిన సెలవును కార్మిక శాఖ ప్రకటించింది. ఉప ఎన్నికల పోలింగ్ జరిగే నియోజకవర్గాల పరిధిలోని దుకాణాలు, ఇతర ప్రైవేటు సంస్థల్లో పని చేసే సిబ్బందికి వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని ప్రకటించింది.
Source: Yahoo! Telugu: News | 26 Jul 2010 | 6:43 am

అఖిలపక్షానికి ముందే పీఎం అపాయింట్‌మెంట్ కోరిన బాబు

బాబ్లీ ప్రాజెక్టు అక్రమ నిర్మాణం వ్యవహారంపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఢిల్లీలో తనదైన రీతిలో చురుగ్గా పావులు కదుపుతున్నారు. ఇప్పటికే కేంద్రంలో ఉన్న ప్రధాన ప్రతిపక్ష రాజకీయ పార్టీల మద్దతును కూడగట్టారు.
Source: Yahoo! Telugu: News | 26 Jul 2010 | 6:34 am

నేడు కార్గిల్ దివస్: అమర వీరులకు ఘన నివాళులు

"కార్గిల్ యుద్ధం" భారతీయ జన హృదయాలను కలచివేసే హృదయవిదారక సంఘటన. భారతదేశ చరిత్రలో ఓ చెరగని ముద్ర వేసింది. భారత్-పాకిస్థాన్ మధ్య మే - జులై 1999 లో కాశ్మీర్‌లోని కార్గిల్ జిల్లాతో పాటు.. సరిహద్దుల వెంబడి ఈ యుద్ధం జరిగింది. ఈ యుద్దానికి కారణం పాకిస్థాన్ సైనికులు మరియు తీవ్రవాదులు కుతంత్రంతో ఎల్.ఒ.సి (వాస్తవాధీన రేఖ) దాటివచ్చి భారత సరిహద్దుని ఆనుకుని మాష్కో వ్యాలీ, డ్రాస్ ప్రాంతాలను ఆక్రమించారు.
Source: Yahoo! Telugu: News | 26 Jul 2010 | 6:24 am

నష్టాల్లో స్టాక్ మార్కెట్: సెన్సెక్స్, నిఫ్టీల పతనం!

బాంబే స్టాక్ మార్కెట్ సోమవారం నష్టాల్లో కూరుకుపోయింది. ట్రేడింగ్ ప్రారంభం నుంచే తిరోగమనం వైపు ర్యాలీని కొనసాగించిన బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచి సెన్సెక్స్, మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో 41 పాయింట్లు పతనమై, 18,089 పాయింట్ల మార్కును తాకింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచి నిఫ్టీ కూడా 12 పాయింట్లు క్షీణించి, 5,436 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.
Source: Yahoo! Telugu: News | 26 Jul 2010 | 6:11 am

దగ్గు, చలి జ్వరంతో వణికిపోతున్న వైఎస్ జగన్

గత 18 రోజులుగా ఉత్తరాంధ్రలో ఓదార్పు యాత్ర చేస్తున్న వైఎస్ జగన్ తీవ్రమైన చలిజ్వరం, దగ్గు, జలుబుతో బాధపడుతున్నారు. వాతావరణంలో వచ్చిన మార్పులకు తోడు ఆయన గత 10 రోజుల నుంచి వళ్లు నొప్పులతో సతమతమవుతున్నారు. అయినా వాటిని లెక్క చేయక ఓదార్పు యాత్రను కొనసాగిస్తున్నారు.
Source: Yahoo! Telugu: News | 26 Jul 2010 | 5:57 am

ఖలేజా టైటిల్ మహేశ్ బాబుది కాదు.. మాదే..!!

ఖలేజా అనే టైటిల్ తమదేనని నిత్యశ్రీ ప్రొడక్షన్స్ ఓ ప్రకటనలో పేర్కొంది. ఆదివారంనాడు విడుదల చేసిన ఆ ప్రకటనలో చిత్ర నిర్మాత ఎస్. విజయభాస్కర్ రెడ్డి తెలియజేస్తూ... మా బ్యానర్‌లో ఎప్పుడో ఛాంబర్‌లో టైటిల్ రిజిస్టర్ చేశాం. అయితే మహేష్ బాబు చిత్రానికి ఖలేజా పెడుతున్నట్లు వార్తలు వచ్చాయి. ఆయన తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. కనుక ఖలేజా టైటిల్ మహేశ్ బాబుకు ఇవ్వలేదు. ఈ విషయాన్ని ఫిలిమ్ ఛాంబర్ దృష్టికి తీసుకుని వెళ్లాం. తగు విధంగా చర్యలు తీసుకుంటామని వారు హామీ ఇచ్చారని చెప్పారు.
Source: Yahoo! Telugu: Entertainment | 26 Jul 2010 | 5:24 am

సోనియా నాకు తగిన జోడీ: శివాజీ

నటుడు శివాజీ, లయ కాంబినేషన్‌లో చాలా చిత్రాలు వచ్చాయి. లయకు పెండ్లి కానప్పుడు ఆమెతో అతి చనువుగా ఉండేవాడని ఇండస్ట్రీ చెప్పుకునేది. పెండ్లి తర్వాత కూడా శివాజీ నటించే చిత్రంలో ప్రత్యేక పాత్రను కూడా లయ ఇస్తుండేది. వీరిద్దర మధ్య బంధం 'టాటా బిర్లా మధ్యలో లైలా'తో గట్టిపడింది. అయితే ప్రస్తుతం శివాజీ దృష్టి నటి సోనియాపై పడినట్లు టాలీవుడ్ సినీజనం అంటున్నారు. హ్యాపీడేస్‌లో, వినాయకుడులో గిరజాల జట్టుతో ఉన్న ఆ అమ్మాయి చాలా బాగుంటుందని శివాజీ కితాబిచ్చాడు. తాజాగా ఆమె శివాజీతో జోడీగా 'బ్రహ్మలోకం టు యమలోకం వయా భూలోకం'లో నటించింది. ఆమె గురించి చెబుతూ.. లయ తర్వాత నాకు సరైన జోడీ సోనియా అనిపిస్తుంది. ఆ విషయం ఆమెకూ తెలియదు. ఇది నా మనసులోఉంది. ఈరోజు చెబుతున్నాను. ఆమె మంచి నటి. మంచి కెరీర్‌ ఉంది అంటూ పొగడ్తలతో ముంచెత్తాడు. శివాజీ స్పందనను స్టేజిపై ఉన్న సోనియా విని ముసిముసి నవ్వులు నవ్వుకుంది.
Source: Yahoo! Telugu: Entertainment | 26 Jul 2010 | 5:08 am

అప్రూవర్‌గా మారిన మాజీ డీఎస్పీ: అమిత్‌ షాకు కష్టాలు!

సొహ్రాబుద్దీన్ నకిలీ ఎన్‌కౌంటర్ కేసులో సీబీఐ అరెస్టు చేసిన గుజరాత్ మాజీ మంత్రి అమిత్ షాకు మరిన్ని కష్టాలు తప్పేలా కనిపించడం లేదు. ఈ కేసులోని నిందితుల్లో ఒకరైన ఆ రాష్ట్ర మాజీ డీఎస్పీ అప్రూవర్‌గా మారనున్నట్టు సమాచారం. ఇదే అంశంపై ఆయన దరఖాస్తు చేసుకోవాలని భావిస్తున్నట్టు ఆయన తరపు న్యాయవాది సోమవారం అహ్మదాబాద్‌లో వెల్లడించారు.
Source: జాతీయ | 26 Jul 2010 | 3:51 am

1993 ముంబై పేలుళ్ళపై జనవరిలో తుది విచారణ

1993లో జరిగిన ముంబై వరుసు పేలుళ్ళ కేసులో తుది విచారణను 2011 జనవరి 11వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు సుప్రీంకోర్టు ప్రకటించింది. ఈ కేసులో నిందితులకు మరికొంత కాలం శిక్షవిధించాలన్న సీబీఐ విజ్ఞప్తితో జస్టిస్ పి.సదాశివం, బీఎస్.చౌహాన్‌లతో కూడిన ధర్మాసనం నిందితులకు నోటీసులు జారీ చేసింది.
Source: జాతీయ | 26 Jul 2010 | 3:47 am

నేనేమైనా వెర్రి వెంగళప్పలా కనిపిస్తున్నానా?: రోశయ్య

ఏమయ్యా విలేఖరులారా? మీకు.. నేనేమైనా వెర్రి వెంగళప్పలా కనిపిస్తున్నానా? మంత్రివర్గ విస్తరణ గురించి ప్రధానమంత్రితో చర్చించేందుకు తెలివితక్కువ దద్దమ్మాలా కనిపిస్తున్నానా అని ముఖ్యమంత్రి కె.రోశయ్య మీడియాను ప్రశ్నించారు. దీంతో ఆయనను చుట్టిముట్టిన మీడియా ప్రతినిధులు ఒక్కసారి అవాక్కయ్యారు.
Source: ఏపీ న్యూస్ | 26 Jul 2010 | 3:24 am

బంగాళాఖాతంలో అల్పపీడనం: విస్తారంగా వర్షాలు!

వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో పాటు రుతుపవనాల కారణంగా రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గోదావరి పరీవాహక ప్రాంతాల్లో భారీ వర్షాల వల్ల వరద పోటెత్తుతోంది. ప్రధానంగా తూర్పుగోదావరి జిల్లాలో గత రెండు రోజులుగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి.
Source: ఏపీ న్యూస్ | 26 Jul 2010 | 1:40 am

మాజీ సభ్యులకు నివాళి: పార్లమెంట్ రేపటికి వాయిదా!

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభమైన కొద్దిసేపటికే సభా కార్యక్రమాలను మంగళవారానికి స్పీకర్ మీరా కుమార్ వాయిదా వేశారు. రాజ్యసభ మాజీ ఛైర్మన్, మాజీ ఉపరాష్ట్రపతి భైరాన్‌సింగ్ షెకావత్, ఎంపీలు వీరేంద్ర బాటియా, దిగ్విజయ్‌సింగ్‌ల మృతికి సభ సంతాపం తెలిపింది. అనంతరం స్పీకర్ సభను రేపటికి వాయిదా వేశారు.
Source: జాతీయ | 26 Jul 2010 | 1:21 am

పోలింగ్‌కు వేతనంతో కూడిన సెలవు: కార్మిక శాఖ

తెలంగాణ ప్రాంతంలో 12 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరుగనున్న ఉప ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మంగళవారం వేతనంతో కూడిన సెలవును కార్మిక శాఖ ప్రకటించింది. ఉప ఎన్నికల పోలింగ్ జరిగే నియోజకవర్గాల పరిధిలోని దుకాణాలు, ఇతర ప్రైవేటు సంస్థల్లో పని చేసే సిబ్బందికి వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని ప్రకటించింది.
Source: ఏపీ న్యూస్ | 26 Jul 2010 | 1:13 am

అఖిలపక్షానికి ముందే పీఎం అపాయింట్‌మెంట్ కోరిన బాబు

బాబ్లీ ప్రాజెక్టు అక్రమ నిర్మాణం వ్యవహారంపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఢిల్లీలో తనదైన రీతిలో చురుగ్గా పావులు కదుపుతున్నారు. ఇప్పటికే కేంద్రంలో ఉన్న ప్రధాన ప్రతిపక్ష రాజకీయ పార్టీల మద్దతును కూడగట్టారు.
Source: జాతీయ | 26 Jul 2010 | 1:05 am

తెరాస కొంపముంచనున్న మితిమీరిన అభిమానం?

మంగళవారం జరుగనున్న 12 అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల పోలింగ్‌లో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థుల కొంప మునగనుందా.? అవుననే అంటున్నారు ఆ పార్టీకి చెందిన కొంతమంది సీనియర్ నేతలు, కింది స్థాయి శ్రేణులు. పార్టీ అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు తీసుకున్న నిర్ణయమే దీనికి ఏకైక కారణమని వారు చెపుతున్నారు.
Source: ఏపీ న్యూస్ | 26 Jul 2010 | 12:37 am

దగ్గు, చలి జ్వరంతో వణికిపోతున్న వైఎస్ జగన్

గత 18 రోజులుగా ఉత్తరాంధ్రలో ఓదార్పు యాత్ర చేస్తున్న వైఎస్ జగన్ తీవ్రమైన చలిజ్వరం, దగ్గు, జలుబుతో బాధపడుతున్నారు. వాతావరణంలో వచ్చిన మార్పులకు తోడు ఆయన గత 10 రోజుల నుంచి వళ్లు నొప్పులతో సతమతమవుతున్నారు. అయినా వాటిని లెక్క చేయక ఓదార్పు యాత్రను కొనసాగిస్తున్నారు.
Source: ఏపీ న్యూస్ | 26 Jul 2010 | 12:28 am

సీబీఐ..కాంగ్రెస్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ కాదు: ప్రధాని

కేంద్ర నేర పరిశోధక సంస్థ (సీబీఐ) కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కాదని ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ అభిప్రాయపడ్డారు. సోమవారం నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఆరంభమయ్యాయి. ఈ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఆయన పార్లమెంట్ వెలుపల మీడియాతో మాట్లాడారు.
Source: జాతీయ | 26 Jul 2010 | 12:05 am

చెపుతున్నాం.. చెపుతున్నాం.. మళ్లీమళ్లీ చెపుతున్నాం...!

తెలంగాణ ప్రాంతంలో 12 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరుగనున్న ఉప ఎన్నికలకు మరో రెండురోజుల సమయం మాత్రమే మిగిలి వుంది. ఈ ఎన్నికల పోలింగ్‌పై తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర రావు, ఆయన తనయుడు కె.తారక రామారావులకు అపుడే గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ఉన్న అభిమానం కాస్త.. హెచ్చిమీరి రాతలుగా మారితే తమ తలరాతలే మారిపోయే అవకాశం ఉందని వారు భయపడుతున్నారు.
Source: ఏపీ న్యూస్ | 26 Jul 2010 | 12:04 am

నా వెంట రావాలంటేనే ఎమ్మెల్యేలకు భయం..!: జగన్

వై.ఎస్. రాజశేఖర రెడ్డి మరణాన్ని జీర్ణించుకోలేక మృతిచెందిన కుటుంబాలను పరామర్శించే దిశగా చేపట్టిన 'ఓదార్పు' యాత్రలో తన వెంట రావాలంటేనే ఎమ్మెల్యేలు భయపడుతున్నారని కడప పార్లమెంట్ సభ్యుడు వై.ఎస్. జగన్మోహన రెడ్డి అన్నారు.
Source: ఏపీ న్యూస్ | 26 Jul 2010 | 12:01 am

బెంగాల్‌లో ఎన్‌కౌంటర్ ఆరుగురు నక్సల్స్ హతం

పశ్చిమ బెంగాల్‌లో ఆదివారం రాత్రి జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు మృతి చెందారు. పారామిలటరీ దళాలకు నక్సల్స్‌కు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో వీరు మృతి చెందారు. మృతి చెందిన వారిలో ఒక మహిళా నక్సల్‌తో పాటు ఓ సీఆర్‌పీఎఫ్ జవాన్ కూడా ఉన్నారు. ఈ ఆపరేషన్‌లో భాగంగా సీఆర్‌పీఎఫ్ బృందం, ప్రత్యేక నక్సల్ వ్యతిరేక బృందం (ఎస్ఏఎఫ్) గొలాటోర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అడవుల్లోకి వెళ్లినట్లు సీఆర్‌పీఎఫ్ వర్గాలు తెలిపాయి.
Source: జాతీయ | 25 Jul 2010 | 10:46 pm

నేటి నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభంకానున్నాయి. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, పెట్రోలియం ఉత్పత్తుల ధరల పెంపకం, ఇతర ప్రజాసమస్యలపై ప్రభుత్వంతో ఉమ్మడి పోరాటానికి ప్రతిపక్షాలన్నీ సమాయత్తం కావడంతో సోమవారం నుంచి ప్రారంభంకాబోయే పార్లమెంటు వర్షాకాల సమావేశాలు యుద్ధవాతావరణాన్ని తలపించనున్నాయి. ఇప్పటికే ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ నాయకత్వంలోని యూపీఏ సంకీర్ణ ప్రభుత్వాన్ని స్తంభింపజేసేందుకు ప్రతిపక్షాలు అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకున్నాయి.
Source: జాతీయ | 25 Jul 2010 | 10:11 pm

ఉపఎన్నికల ప్రచారానికి తెర: పోలింగ్‌కు సర్వం సిద్ధం!

గత పక్షం రోజులుగా సాగిన ఉప ఎన్నికల ప్రచారం ఆదివారం సాయంత్రతో ముగిసింది. మరో 24 గంటల్లో పోలింగ్ జరుగనుంది. ఇందుకోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసింది. ఉప ఎన్నికలు జరుగుతున్న 12 అసెంబ్లీ స్థానాలకు గాను ఐదింటిలో బ్యాలెట్ విధానం ద్వారా పోలింగ్ జరుగనుంది. మిగిలిన ఏడింటిలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల ద్వారా పోలింగ్ నిర్వహించనున్నారు
Source: ఏపీ న్యూస్ | 25 Jul 2010 | 5:35 am

బాబ్లీపై జాతీయ స్థాయి మద్దతు: ఢిల్లీలో బాబు బిజిబిజీ!

ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ బాబ్లీపై మహా పోరాటం చేయాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం జాతీయ స్థాయిలో మద్దతు సేకరించే పనిలో నిమగ్నమైంది. ఈ బాధ్యతను ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్వీకరించారు. ఇందులోభాగంగా ఆయన ఆదివారం ఢిల్లీకి చేరుకున్నారు. పలువురు జాతీయ పార్టీ నేతలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
Source: ఏపీ న్యూస్ | 25 Jul 2010 | 5:33 am

మంత్రి కోమటిరెడ్డి, కేసీఆర్‌లకు ఈసీ నోటీసులు జారీ!

రాష్ట్ర క్రీడల మంత్రిత్వ శాఖామంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర రావుకు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. రాష్ట్ర హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి, ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు, నిజామాబాద్ అర్బన్ కాంగ్రెస్ అభ్యర్థి ధర్మపురి శ్రీనివాస్‌లపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు కేసీఆర్‌కు ఈసీ మరోమారు నోటీసు ఇచ్చింది.
Source: ఏపీ న్యూస్ | 25 Jul 2010 | 5:21 am

అజ్ఞాతం వీడిన అమిత్ షా.. ఆరోపణలన్నీ నిరాధారం!

సొహ్రాబుద్దీన్ నకిలీ ఎన్‌కౌంటర్ కేసులో సంబంధం ఉన్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న గుజరాత్ రాష్ట్ర మాజీ హోంమంత్రి, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ సన్నిహితుడు అమిత్ షా ఎట్టకేలకు అజ్ఞాతం వీడారు. ఆదివారం ఆకస్మాతుగా మీడియా ముందుకు వచ్చారు. తనపై వచ్చిన ఆరోపణలన్నీ నిరాధారమని, అసత్యమని పునరుద్ఘాటించారు.
Source: జాతీయ | 25 Jul 2010 | 4:37 am

చిరుతిండ్ల కోసం రూ.94 లక్షల ఖర్చు: ఆరోగ్య శాఖ

కేంద్ర ఆరోగ్య మంత్రత్వ శాఖ గడచిన రెండేళ్ల కాలంలో చిరుతిండ్లు, ఆహార పానీయాలకు కోసం రూ.94 లక్షలను ఖర్చు చేసింది. దేశ ప్రధానమంత్రి కార్యాలయానికయ్యే ఖర్చుతో పోలిస్తే ఎనిమిది రెట్లు అధికం. ఈ మొత్తాన్ని 2008-09, 2009-20010 కాలంలో ఖర్చు పెట్టారు. ఇదే సమయంలో ప్రధాన మంత్రి కార్యాలయంలో రిఫ్రెష్‌మెంట్‌ కోసం అయిన ఖర్చు కేవలం రూ.11.77 లక్షలు మాత్రమే కావడం గమనార్హం.
Source: జాతీయ | 25 Jul 2010 | 4:25 am