100కోట్లతో విస్తరణ: గోయెంకా డైమండ్ అండ్ జువెల్స్

బ్రాండెడ్ వజ్రాల నగలకు పెరుగుతున్న గిరాకీని దృష్టిలో ఉంచుకొని ముంబైకి చెందిన గోయెంకా డైమండ్ అండ్ జువెల్స్ తమ వ్యాపారాన్ని మరింత విస్తరించనుంది. ఇందుకు గానూ రూ. 100 కోట్లను వెచ్చించనున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. ఈ విస్తరణతో వచ్చే ఐదేళ్లలో కనీసం 25శాతం వృద్ధిని కంపెనీ ఆశిస్తోంది.
Source: Yahoo! Telugu: News | 25 Jul 2010 | 8:23 am

మలేషియా-భారత్‌ల మధ్య రెట్టింపు విమాన సర్వీసులు

మలేషియా నుంచి భారత్‌కు వచ్చే విమానాల సంఖ్యను రెండితలు చేయనున్నట్లు ప్రకటించింది. భారత విమాన మార్కెట్‌లో 20శాతం వృద్ధిని ఆశిస్తూ ప్రస్తుతం రోజుకి 30 విమానాలుగా ఉన్న సంఖ్యను రోజుకి 60కి పెంచనున్నట్లు ఎయిర్‌లైన్‌కు చెందిన ఓ ఉన్నతాధికారి తెలిపారు.
Source: Yahoo! Telugu: News | 25 Jul 2010 | 7:43 am

కొలంబియాతో కయ్యానికి సిద్ధమంటున్న వెనెజులా!

కొలంబియా, వెనెజుల దేశాల మధ్య మళ్లీ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వెనెజులాపై పోరు చేసేందుకు కొలంబియా సిద్ధమవుతోంది. దీన్ని సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు వెనెజులా సర్వసన్నద్ధమైంది. ఈ విషయాన్ని వెనిజులా రక్షణశాఖ మంత్రి కార్లోస్‌ మటా హెచ్చరించారు. తమ అధ్యక్షుడు హ్యూగో ఛావెజ్‌ కొలంబియాతో సంబంధాలు తెంచుకొని సైన్యాన్ని అప్రమత్తం చేయడంతో ఆ దేశం ఘర్షణకు దిగే సూచనలు కనిపిస్తున్నాయి.
Source: Yahoo! Telugu: News | 25 Jul 2010 | 7:02 am

చెపుతున్నాం.. చెపుతున్నాం.. మళ్లీమళ్లీ చెపుతున్నాం...!

తెలంగాణ ప్రాంతంలో 12 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరుగనున్న ఉప ఎన్నికలకు మరో రెండురోజుల సమయం మాత్రమే మిగిలి వుంది. ఈ ఎన్నికల పోలింగ్‌పై తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర రావు, ఆయన తనయుడు కె.తారక రామారావులకు అపుడే గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ఉన్న అభిమానం కాస్త.. హెచ్చిమీరి రాతలుగా మారితే తమ తలరాతలే మారిపోయే అవకాశం ఉందని వారు భయపడుతున్నారు.
Source: Yahoo! Telugu: News | 25 Jul 2010 | 6:52 am

అబూసలేంను తలోజా సెంట్రల్ జైలుకు తరలింపు!

శనివారం మాఫియాడాన్ అబూసలేంపై ఆర్ధర్ రోడ్‌లోని సెంట్రల్ జైలులో దావూద్ ఇబ్రహీం అనుచరుడు ముస్తఫా దొస్సా చేసిన దాడి అనంతంరం సలేంను రాయగఢ్ జిల్లాలని తలోజా సెంట్రల్ జైలుకు తరలించారు.
Source: Yahoo! Telugu: News | 25 Jul 2010 | 6:44 am

ఆంక్షలు విధించే దేశాలతో వాణిజ్య సంబంధాలకు స్వస్తి!

వివాదాస్పద అణు కార్యక్రమాన్ని చేపట్టిన ఇరాన్ సరికొత్త ఎత్తుగడ వేసింది. తమ దేశంపై ఆంక్షలు విధించే దేశాలతో వర్తక వ్యాపారాలకు స్వస్తి చెప్పాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని శనివారం ఇరాన్ ప్రకటించింది.
Source: Yahoo! Telugu: News | 25 Jul 2010 | 6:34 am

సొహ్రాబుద్దీన్ ఎన్‌కౌంటర్: అజ్ఞాతంలోనే అమిత్ షా

సోహ్రాబుద్దీన్ షేక్ నకిలీ ఎన్‌కౌంటర్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న గుజరాత్ మాజీ హోం శాఖ సహాయ అమిత్‌ షా ఇంకా పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అయితే ఆయనను ఆచూకీ తెలుసుకునేందుకు సీబీఐ ఇప్పటికే 10 బృందాలను ఏర్పాటు చేసింది.
Source: Yahoo! Telugu: News | 25 Jul 2010 | 6:18 am

బంగ్లాదేశ్‌లో 25 మంది అనుమానిత మిలిటెంట్ల అరెస్టు

బంగ్లాదేశ్‌లో అల్లార్ దళ్ మిలిటెంట్ గ్రూపుకు చెందినవారిగా భావిస్తున్న 25 మంది అనుమానితులను ఆ దేశ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. వాయువ్య గైబంధ నిషేధించబడిన జమాతుల్ ముజహిదీన్ బంగ్లాదేశ్ తీవ్రవాదుల కోసం జరుపుతున్న గాలింపులో వీరిని అరెస్టు చేసి గైబంధ పోలీసులు తెలిపారు.
Source: Yahoo! Telugu: News | 25 Jul 2010 | 4:50 am

అటవీ ప్రాంతాల్లో అభివృద్ధి కీలకం: ప్రధాని మన్మోహన్

అటవీ ప్రాంతాల్లోని గిరిజనుల అభివృద్ధి ఎంతో కీలకమని ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ అభిప్రాయపడ్డారు. ఈ అడవులపై పూర్తి హక్కు గిరిజనలకై ఉండాలని ఆయన తేల్చి చెప్పారు. అందువల్ల వీటిని సంఘ విద్రోహశక్తుల నుంచి కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇందుకోసం అటవీ హక్కుల చట్టం, పంచాయతీరాజ్ (షెడ్యూల్డ్ ప్రాంతాలకు విస్తరణ) చట్టాలను సమర్థంగా అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
Source: Yahoo! Telugu: News | 25 Jul 2010 | 4:48 am

ఆర్‌కామ్‌, టీటీఎస్‌ఎల్‌కు భారీ జరిమానా: సుప్రీం కోర్టు

యాక్సెస్‌ డెఫిసిట్‌ ఛార్జీల(ఏడీసీ)ను చెల్లించకుండా వాకీ సర్వీసులను నిర్వహించినందుకు రిలయన్స్‌ కమ్యూనికేషన్స్(ఆర్ కామ్)‌, టాటా టెలీ సర్వీసెస్‌(టీటీఎస్‌ఎల్‌)కు సుప్రీం కోర్టు భారీ జరిమానా విధించింది. ఆగస్టు 2005 నుంచి ఫిబ్రవరి 2006 వరకు రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌, టాటా టెలీ సర్వీసెస్‌లు వాకీ సర్వీసులను నిర్వహించాయి
Source: Yahoo! Telugu: News | 25 Jul 2010 | 4:05 am

చెపుతున్నాం.. చెపుతున్నాం.. మళ్లీమళ్లీ చెపుతున్నాం...!

తెలంగాణ ప్రాంతంలో 12 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరుగనున్న ఉప ఎన్నికలకు మరో రెండురోజుల సమయం మాత్రమే మిగిలి వుంది. ఈ ఎన్నికల పోలింగ్‌పై తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర రావు, ఆయన తనయుడు కె.తారక రామారావులకు అపుడే గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ఉన్న అభిమానం కాస్త.. హెచ్చిమీరి రాతలుగా మారితే తమ తలరాతలే మారిపోయే అవకాశం ఉందని వారు భయపడుతున్నారు.
Source: ఏపీ న్యూస్ | 25 Jul 2010 | 1:23 am

అబూసలేంను తలోజా సెంట్రల్ జైలుకు తరలింపు!

శనివారం మాఫియాడాన్ అబూసలేంపై ఆర్ధర్ రోడ్‌లోని సెంట్రల్ జైలులో దావూద్ ఇబ్రహీం అనుచరుడు ముస్తఫా దొస్సా చేసిన దాడి అనంతంరం సలేంను రాయగఢ్ జిల్లాలని తలోజా సెంట్రల్ జైలుకు తరలించారు.
Source: జాతీయ | 25 Jul 2010 | 1:14 am

సొహ్రాబుద్దీన్ ఎన్‌కౌంటర్: అజ్ఞాతంలోనే అమిత్ షా

సోహ్రాబుద్దీన్ షేక్ నకిలీ ఎన్‌కౌంటర్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న గుజరాత్ మాజీ హోం శాఖ సహాయ అమిత్‌ షా ఇంకా పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అయితే ఆయనను ఆచూకీ తెలుసుకునేందుకు సీబీఐ ఇప్పటికే 10 బృందాలను ఏర్పాటు చేసింది.
Source: జాతీయ | 25 Jul 2010 | 12:48 am

అటవీ ప్రాంతాల్లో అభివృద్ధి కీలకం: ప్రధాని మన్మోహన్

అటవీ ప్రాంతాల్లోని గిరిజనుల అభివృద్ధి ఎంతో కీలకమని ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ అభిప్రాయపడ్డారు. ఈ అడవులపై పూర్తి హక్కు గిరిజనలకై ఉండాలని ఆయన తేల్చి చెప్పారు. అందువల్ల వీటిని సంఘ విద్రోహశక్తుల నుంచి కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇందుకోసం అటవీ హక్కుల చట్టం, పంచాయతీరాజ్ (షెడ్యూల్డ్ ప్రాంతాలకు విస్తరణ) చట్టాలను సమర్థంగా అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
Source: జాతీయ | 24 Jul 2010 | 11:18 pm

చెయ్యి, కాలు పడిపోయినంతగా ఫీలయ్యాను: కళ్యాణి

చైల్డ్‌ ఆర్టిస్టులైన మలయాళ నటీనటులు కళ్యాణి, సూర్యకిరణ్‌ నిజజీవితంలో భార్యభర్తలయ్యారు. ఆ తర్వాత కెరీర్‌కు కొంతగ్యాప్‌ తీసుకున్నారు. లేటెస్ట్‌గా 'చాప్టర్‌-6' అనే సినిమాను నిర్మిస్తున్నారు. దీనికి దర్శకుడు సూర్యకిరణ్‌, నిర్మాత కళ్యాణి. అయితే కళ్యాణి సొమ్మంతా సూర్యకిరణ్‌ వాడేసుకుంటున్నాడనీ, ఆమెను స్వంతానికి ఉపయోగించి చివరికి వదిలేస్తాడనేమోనని ఇటీవలే ఓ వెబ్‌సైట్‌లో న్యూస్‌ వచ్చిందట. దీనిపై కళ్యాణి శనివారం స్పందించింది. ఏదో గాలివార్తలు రాసే వెబ్‌సైట్‌ అలా రాసేసరికి నాకు ఒక చెయ్యి, కాలు పడిపోయినంతగా ఫీలయ్యాను. ఏమో.. సూర్యకిరణ్‌ అలాంటివాడేనన్న లేనిపోని అనుమానం రేపినట్లుయింది. "దయచేసి ఇలాంటి వార్తలు రాసి మా మధ్య చిచ్చుపెట్టకండి." అంటూ వేడుకుంది.
Source: Yahoo! Telugu: Entertainment | 24 Jul 2010 | 2:12 pm

సెన్సార్‌ పూర్తయిన సూర్య కిరణ్ 'చాప్టర్‌-6'

నటి కళ్యాణి నిర్మాతగా సూర్యకిరణ్‌ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న 'చాప్టర్‌-6' చిత్రం సెన్సార్‌ పూర్తయింది. ఈ సందర్భంగా శనివారం ఛాంబర్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో చిత్ర దర్శకుడు సూర్యకిరణ్‌ మాట్లాడుతూ, ఈ సినిమా ప్రారంభంలో నిర్మాతగా భయమేసింది. షూటింగ్‌ చేయగా చేయగా స్నేహితులు, శ్రేయోభిలాషులు సపోర్ట్‌తో ధైర్యంగా పూర్తిచేశాను. ఆరు కథలతో రూపొందిన ఈ చాప్టర్‌ రొటీన్‌ చిత్రాలకు భిన్నంగా ఉంటుంది. ఈ చిత్రంలోని ఆరు పాటలను ఒక్కో సంగీత దర్శకుడు ఆలపించడం ప్రత్యేకత. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సెన్సార్‌వల్ల విడుదల కాస్త ఆలస్యమైంది. 'సత్యం' చిత్రంతో దర్శకుడిగా నన్ను ఆదరించారు. నిర్మాతగా నా భార్యను ఆదరించి ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను. ఆగస్టు మొదటివారంలో విడుదలచేయడానికి సిద్ధంచేస్తున్నామని' తెలిపారు.
Source: Yahoo! Telugu: Entertainment | 24 Jul 2010 | 12:13 pm

జూలై 29న 'బ్రహ్మలోకం టు యమలోకం'

రాజేంద్రప్రసాద్‌ బ్రహ్మగా, జయప్రకాష్‌రెడ్డి యముడిగా, శివాజీ నరుడిగా నటించిన చిత్రం 'బ్రహ్మ లోకం టు యమలోకం వయా భూలోకం'. క్రిమినల్‌ లాయర్‌ నాగేశ్వరరావు దర్శకుడిగా పరిచమవుతున్నారు. బెక్కం వేణుగోపాల్‌ నిర్మిస్తున్నారు. చిత్రం గురించి రాజేంద్రప్రసాద్‌ వివరిస్తూ... పాత్రలకు సరిపడా నటీనటులు వుంటేనే ఎటువంటి కథ అయినా సక్సెస్‌ అవుతుంది. 34 ఏళ్ళ నా కెరీర్‌లో తెలుసుకున్నది ఇది. ఆ కోవలోనిదే ఈ చిత్రం. కొన్ని చిత్రాలు ఎన్నిసార్లు చూసినా ఇంకా చూడాలనేట్లు ఉంటాయి. ఈ చిత్రంకూడా అలాంటిదేనని చెప్పగలను. సహజంగా బ్రహ్మకు మూడు తలలు కృతకంగా పెడుతుంటారు. మారిన టెక్నాలజీ రీత్యా ఒరిజినల్‌గా వచ్చేట్లు చూపుతామని చెప్పగానే అందుకు ఖర్చయినా నిర్మాత వెనుకాడకుండా ఓకే అన్నారు. యముడి పాత్రలో జయప్రకాష్‌రెడ్డి అద్భుతంగా నటించాడు. సోషియో ఫాంటసీతో రూపొందిన ఈ చిత్రం అందరి మన్ననలను పొందుతుందనే నమ్మకముందని' అన్నారు
Source: Yahoo! Telugu: Entertainment | 24 Jul 2010 | 11:57 am

రేపే ఫిలిమ్ ఛాంబర్ ఎన్నికలు: వృద్ధ ప్యానల్ vs యూత్ ప్యానల్

తెలుగుచలనచిత్ర పరిశ్రమకు చెందిన ఫిలింఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఎన్నికలు సజావుగానే జరుగుతాయని దాసరి నారాయణరావు ప్యానల్‌ స్పష్టం చేసింది. ఏడాదిపాటు కాలపరిమితి గల ఈ ఎన్నికలు ఈనెల 25 అంటే... ఆదివారం జరుగనున్నాయి. అయితే పోటీ వర్గం సభ్యుల్లో లేనిపోని అపోహలు సృష్టించి రకరకాలుగా ఎస్‌.ఎం.ఎస్‌.లపేరుతో గందరగోళం సృషిస్తోందని అల్లు అరవింద్‌ శనివారం తెలిపారు. ఛాంబర్‌ ఎన్నికల్లో దాసరి ప్యానల్‌కు పోటీగా యలమంచి శివాజీ గ్రూప్‌ (ఇటీవలే పైరసీపై నిరాహారదీక్షచేసిన వ్యక్తి) నిలబడింది. ఒకటి యూత్‌ వర్గం, రెండోది వృద్ధవర్గం అనే పేరు ఇండిస్ట్రీలో నెలకొంది. దీంతో యూత్‌ అంతా తమవైపు రావాలని ఆ వర్గం మెసేజ్‌ల ద్వారా పంపుతుంది.
Source: Yahoo! Telugu: Entertainment | 24 Jul 2010 | 11:38 am

బయ్యారం లీజు రద్దు మా పరిధిలో లేదు: రోశయ్య

వైఎస్సార్ అల్లుడు అనిల్‌కు లీజుకిచ్చిన బయ్యారం గనుల రద్దు చేయడం లేదా మంజూరు చేయడం కానీ తమ చేతుల్లో లేదనీ, అది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నదని ముఖ్యమంత్రి రోశయ్య వెల్లడించారు. అందువల్ల ఆ ప్రాంతాన్ని తిరిగి రీ- సర్వే చేయమని ఆదేశాలు జారీ చేశామన్నారు.
Source: ఏపీ న్యూస్ | 24 Jul 2010 | 8:20 am

పూనమ్ థండర్ థైస్‌పై కెమెరాలు "క్లిక్.. క్లిక్"

వినాయకుడు, శౌర్యం వంటి చిత్రాల్లో గ్లామర్ అందాలను ఆరబోసిన పూనమ్ కౌర్‌కు అనుకున్నంత స్థాయిలో అవకాశాలు తలుపు తట్టలేదు. అందాలను ఒక దశ వరకూ ఆరబోసినా ఎవరూ పట్టించుకోలేదు. బహుశా: ఆమె కాస్త కురచగా ఉండటం వల్లనేమోనన్న సందేహాలను ఆమె స్నేహితులు వ్యక్తం చేస్తే, తనకంటే పొట్టి హీరోయిన్లు హిట్లు కొట్టడం లేదా..? అని పూనమ్ బుకాయించిందట. ఈ సంగతి ఇలా వుంటే దర్శక, నిర్మాతల కళ్లల్లో పడాల్సిన రీతిలో పడలేదని ఎవరో ఓ స్నేహితురాలు పూనమ్‌కు చెప్పిందట. అంతే నాగార్జున "గగనం" టైటిల్ లాంఛ్ కార్యక్రమానికి పూనమ్ తనే సెంటర్ అట్రాక్షన్‌గా నిలిచింది. తొడలన్నీ కనిపించే విధంగా మహా పొట్టి గౌను ధరించి స్టేజిపై కూచుంది. అసలే పొట్టి గౌను.... ఆపై కుర్చీలో కూచునే సరికి తొడల అందాలు పూర్తిగా బయటపడ్డాయి. దీంతో అక్కడే ఉన్న కెమేరాలు మిగిలిన విషయాలన్నిటినీ వదిలేసి పూనమ్ తొడలపై క్లిక్‌ల మీద క్లిక్‌లు కురిపించాయి.
Source: Yahoo! Telugu: Entertainment | 24 Jul 2010 | 8:15 am

మమ్మల్ని తంతుంటే.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలేంచేస్తున్నారు.?

బాబ్లీ పరిశీలన కోసం వెళ్లిన ప్రజాప్రతినిధులను మహారాష్ట్ర పోలీసులు తన్నుతుంటే, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. బాబ్లీ ప్రాజెక్టుతో ఉత్తర తెలంగాణాకు ఏర్పడే భారీ నష్టాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ ప్రాజెక్టు సందర్శనార్థం వెళ్లిన 72 మంది ప్రజా ప్రతినిధులపై మహారాష్ట్ర పోలీసులు లాఠీఛార్జీ ప్రయోగిస్తుంటే.. 33 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారని బాబు నిలదీశారు.
Source: ఏపీ న్యూస్ | 24 Jul 2010 | 7:42 am

బాబ్లీపై రాష్ట్ర పార్టీలన్నీ ఏకాతాటిపై నడవాలి: చిరంజీవి

బాబ్లీ సమస్యపై రాష్ట్రంలోని అన్ని పార్టీలు ఏకతాటిపై నడిచి పోరాటం చేయాలని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఉత్తర తెలంగాణ రైతన్నలకు తీవ్ర నష్టం కలిగించే బాబ్లీ ప్రాజెక్టుపై అన్ని పార్టీలు ఏకం కావాలని మెగాస్టార్ పిలుపునిచ్చారు. బాబ్లీ ప్రాజెక్టును ఆపివేయడంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోదనడం సబబు కాదని చిరు అన్నారు.
Source: ఏపీ న్యూస్ | 24 Jul 2010 | 7:15 am

తెలంగాణాకోసం గుజ్జర్ల తరహా పోరాటానికి సిద్ధం: కేసీఆర్

తెలంగాణా సెంటిమెంట్ బాణంతో తెరాస చీఫ్ కేసీఆర్ ఉపఎన్నికల పర్యటనలో దూసుక పోతున్నారు. తెలంగాణా ఏర్పాటు విషయమైన ఒకవైపు శ్రీకృష్ణ కమిటీ రాష్ట్రంలో పర్యటిస్తుండగానే, డిసెంబరు తర్వాత తెలంగాణాలో గొప్ప ఉద్యమం ఉందనీ, విద్యార్థులు, న్యాయవాదులు, ఉద్యోగులు గుజ్జర్ల తరహా పోరాటానికి సిద్ధమవుతున్నారని ఎన్నికల పర్యటనలో ప్రకటించారు.
Source: ఏపీ న్యూస్ | 24 Jul 2010 | 7:06 am

అల్పపీడన ద్రోణి : రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు!

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో రానున్న 24 గంటల్లో కోస్తా తీర ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు విశాఖపట్నం వాతావరణ హెచ్చరిక కేంద్రం అధికారులు తెలిపారు.
Source: ఏపీ న్యూస్ | 24 Jul 2010 | 6:58 am

ఆ వీడియో నిజం కాదు..!: తమిళ సినీనటి రంజిత

రాసలీల బాగోతం వెలుగులోకి రావడంతో కొంత కాలం జైలు శిక్ష అనుభవించిన స్వామి నిత్యానంద రంజితను మంచి భక్తురాలని సర్టిఫికేట్ ఇచ్చిన రెండే రోజుల్లోనే, సినీ నటి రంజిత నిత్యానందతో తాను శృంగారం జరిపినట్లు బయటికొచ్చిన వీడియో నిజం కాదని చెబుతోంది. ఇంకా ఆ వీడియోలో ఉన్నది తాను కాదని రంజిత వెల్లడించింది.
Source: జాతీయ | 24 Jul 2010 | 6:20 am

తమన్నాది ఐరన్ లెగ్ అయిపోయిందా...?!!

హ్యాపీడేస్ చిత్రంతో హ్యాపీ హ్యాపీగా వరుస ఆఫర్లు దక్కించుకుని తొలుత టాలీవుడ్‌లో ఆ పిదప కోలీవుడ్‌లో సక్సెస్‌లు సాధిస్తున్న తమన్నాకు గడ్డు కాలం మొదలైనట్లు కనబడుతోంది. ఇటీవల ఆమె తమిళ అగ్రహీరో విజయ్‌తో నటించిన సుర చిత్రం బాక్సీఫీసు వద్ద ఘోరంగా బోల్తా కొట్టింది. ఒక్క సినిమాయేగా.. అని ధైర్యంగా ఉంటుండగానే జయం రవితో నటించిన తాజా చిత్రం శుక్రవారం తమిళనాడులో విడుదలైంది. రిపోర్టు ఎలా ఉందని ఆరా తీస్తే... అది కూడా బాక్సాఫీసు వద్ద బోర్లా పడినట్లు తెలిసింది. దీంతో తమన్నా వైపు దర్శక నిర్మాతలు అనుమానంగా చూస్తున్నారట. టాలీవుడ్ ఐరెన్ లెగ్ హన్సిక మాదిరిగా తమన్నా లక్ కూడా తిరగబడి ఐరన్ లెగ్ అయిపోయిందా అని దీర్ఘంగా ఆలోచిస్తున్నారట.
Source: Yahoo! Telugu: Entertainment | 24 Jul 2010 | 6:04 am

ఆగస్టు 6న విడుదల కానున్న ప్రిడేటర్స్

1987లో ప్రిడేటర్ పేరుతో సైఫై చరిత్రలో పాపులర్ క్యారక్టర్స్‌ని తీసుకుని జంగిల్ వీరుల కథతో రూపొందించారు. ప్రేక్షకులు ఈ చిత్రంలోని ఉన్నతమైన మైథాలాజికల్ గ్రాఫిక్స్‌కి మైమరిచిపోయారు. దాదాపు 13 ఏళ్ల నుంచి ప్రిడేటర్ చిత్రం ప్రేక్షకులను ఎక్సైట్ చేస్తూనే ఉండటం విశేషం.ప్రిడేటర్స్ చిత్రంలోని పాత్రలు తీసుకుని కొన్ని చిత్రాలు వచ్చినా కూడా అవి అంతగా అభిమానుల్ని అలరించలేకపోయాయి. ఇప్పుడు ప్రొడ్యూసర్ రాబర్ట్ రాడ్రిగేజ్, డైరెక్టర్ నిమ్రాడ్ అంటల్ ఒరిజినల్‌కి సీక్వెల్‌గా ఈ ప్రిడేటర్స్ చిత్రాన్ని రూపొందించారు.
Source: Yahoo! Telugu: Entertainment | 24 Jul 2010 | 5:23 am

అబూ సలేంపై దావూద్ ఇబ్రహీం అనుచరుడి దాడి..!

ఆర్ధర్ రోడ్‌ జైలులో ఉన్న మాఫియాడాన్ అబూసలేంపై శనివారం దావూద్ ఇబ్రహీం అనుచరుడు ముస్తఫా దొస్సా దాడి చేశాడు. ఈ దాడిలో అబూసలేం ముఖంపై స్వల్ప గాయాలయ్యాయి. కాగా.. ఈ దాడికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.అబూసలేం ఉత్తరప్రదేశ్‌లోని అజాంగర్లో జన్మించాడు. ముంబై వరుస పేలుళ్ల కేసులో 1993లో అరెస్టయ్యాడు. అంతేగాకుండా 1997లో జరిగిన గుల్షన్ కుమార్ హత్య కేసులో ఆరోపణలను ఎదుర్కుంటున్నాడు.
Source: జాతీయ | 24 Jul 2010 | 4:18 am

నా వెంట రావాలంటేనే ఎమ్మెల్యేలకు భయం..!: జగన్

వై.ఎస్. రాజశేఖర రెడ్డి మరణాన్ని జీర్ణించుకోలేక మృతిచెందిన కుటుంబాలను పరామర్శించే దిశగా చేపట్టిన 'ఓదార్పు' యాత్రలో తన వెంట రావాలంటేనే ఎమ్మెల్యేలు భయపడుతున్నారని కడప పార్లమెంట్ సభ్యుడు వై.ఎస్. జగన్మోహన రెడ్డి అన్నారు.
Source: ఏపీ న్యూస్ | 24 Jul 2010 | 4:05 am

కేసీఆర్ స్వార్థం కోసమే ఎమ్మెల్యేల రాజీనామా..!: గోనె

తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె. చంద్రశేఖర రావు తన స్వార్థం కోసమే ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గోనె ప్రకాశరావు ఆరోపించారు. గత ఎన్నికల్లో ఇచ్చిన వాగ్ధానాలను నిలబెట్టుకోలేక పోయిన కేసీఆర్ స్వార్థ రాజకీయాలను ప్రజలు గుర్తించాలని గోనె అన్నారు.
Source: ఏపీ న్యూస్ | 24 Jul 2010 | 4:00 am