కేసీఆర్ స్వార్థం కోసమే ఎమ్మెల్యేల రాజీనామా..!: గోనె

తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె. చంద్రశేఖర రావు తన స్వార్థం కోసమే ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గోనె ప్రకాశరావు ఆరోపించారు. గత ఎన్నికల్లో ఇచ్చిన వాగ్ధానాలను నిలబెట్టుకోలేక పోయిన కేసీఆర్ స్వార్థ రాజకీయాలను ప్రజలు గుర్తించాలని గోనె అన్నారు.
Source: Yahoo! Telugu: News | 24 Jul 2010 | 9:29 am

నా వెంట రావాలంటేనే ఎమ్మెల్యేలకు భయం..!: జగన్

వై.ఎస్. రాజశేఖర రెడ్డి మరణాన్ని జీర్ణించుకోలేక మృతిచెందిన కుటుంబాలను పరామర్శించే దిశగా చేపట్టిన 'ఓదార్పు' యాత్రలో తన వెంట రావాలంటేనే ఎమ్మెల్యేలు భయపడుతున్నారని కడప పార్లమెంట్ సభ్యుడు వై.ఎస్. జగన్మోహన రెడ్డి అన్నారు.
Source: Yahoo! Telugu: News | 24 Jul 2010 | 9:16 am

పూనమ్ థండర్ థైస్‌పై కెమెరాలు "క్లిక్.. క్లిక్"

వినాయకుడు, శౌర్యం వంటి చిత్రాల్లో గ్లామర్ అందాలను ఆరబోసిన పూనమ్ కౌర్‌కు అనుకున్నంత స్థాయిలో అవకాశాలు తలుపు తట్టలేదు. అందాలను ఒక దశ వరకూ ఆరబోసినా ఎవరూ పట్టించుకోలేదు. బహుశా: ఆమె కాస్త కురచగా ఉండటం వల్లనేమోనన్న సందేహాలను ఆమె స్నేహితులు వ్యక్తం చేస్తే, తనకంటే పొట్టి హీరోయిన్లు హిట్లు కొట్టడం లేదా..? అని పూనమ్ బుకాయించిందట. ఈ సంగతి ఇలా వుంటే దర్శక, నిర్మాతల కళ్లల్లో పడాల్సిన రీతిలో పడలేదని ఎవరో ఓ స్నేహితురాలు పూనమ్‌కు చెప్పిందట. అంతే నాగార్జున "గగనం" టైటిల్ లాంఛ్ కార్యక్రమానికి పూనమ్ తనే సెంటర్ అట్రాక్షన్‌గా నిలిచింది. తొడలన్నీ కనిపించే విధంగా మహా పొట్టి గౌను ధరించి స్టేజిపై కూచుంది. అసలే పొట్టి గౌను.... ఆపై కుర్చీలో కూచునే సరికి తొడల అందాలు పూర్తిగా బయటపడ్డాయి. దీంతో అక్కడే ఉన్న కెమేరాలు మిగిలిన విషయాలన్నిటినీ వదిలేసి పూనమ్ తొడలపై క్లిక్‌ల మీద క్లిక్‌లు కురిపించాయి.
Source: Yahoo! Telugu: Entertainment | 24 Jul 2010 | 8:15 am

సియోచెన్‌లో భారత్-పాక్ సైనిక బలగాల ఉపసంహరణ: జర్దారీ

సియాచెన్ గ్లేసియర్ సరిహద్దు నుంచి భారత్ మరియు పాకిస్తాన్ సైనిక బలగాలను ఉపసంహరించుకోవాలని పాకిస్థాన్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ అన్నారు. సరిహద్దు సమస్యను సామరస్యంగా పరిష్కరించుకుందామని ఆయన పిలుపునిచ్చారు. సియాచెన్‌లో ఒక్కో సైనికుడిపైనా భారత్ రోజుకు 50 డాలర్లు ఖర్చు చేస్తుందని, అదే పాకిస్థాన్ మాత్రం తమ సైన్యంలో ఒక్కో వ్యక్తిపై రోజుకు రూ. 50లు చొప్పున ఖర్చు చేస్తున్నట్లు జర్దారీ తెలిపారు.
Source: Yahoo! Telugu: News | 24 Jul 2010 | 7:58 am

రోశయ్యను నమ్ముకుంటే రాష్ట్రం అధోగతే: చంద్రబాబు

రాష్ట్ర ప్రయోజనాలు పట్టని ముఖ్యమంత్రి రోశయ్యను నమ్ముకుంటే రాష్ట్రం అధోగతి పాలవుతుందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. రోశయ్య తన పదవిని కాపాడుకునేందుకు ప్రాధాన్యమిస్తున్నారు తప్ప ప్రజల ప్రయోజనాలు కళ్లెదురుగా మంటగలిసి పోతున్నా పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
Source: Yahoo! Telugu: News | 24 Jul 2010 | 7:29 am

అమిత్ షా ఇప్పటికే ఆలస్యం చేశారు..!: రాజీవ్ శుక్లా

సోహ్రాబుద్ధీన్ ఎన్‌కౌంటర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సమయంలోనే గుజరాత్ మంత్రి అమిత్ షా రాజీనామా చేయాల్సిందని ఏఐసీసీ గుజరాత్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ రాజీవ్ శుక్లా అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇప్పటికే అమిత్ రాజీనామా విషయంలో జాప్యం చేశారని శుక్లా తెలిపారు.
Source: Yahoo! Telugu: News | 24 Jul 2010 | 7:11 am

సమైక్య వాదానికే ఓటు వేయండి: తెరాస విజయశాంతి

తెలంగాణా రాజకీయ వీరవనితగా పేరు సంపాదించుకున్న మెదక్ ఎంపీ విజయశాంతి తెలంగాణాలో తెరాస అభ్యర్థుల గెలుపుకోసం అలుపెరగకుండా ఎన్నికల పర్యటనల్లో పాల్గొంటున్నారు. ఇందులో భాగంగా ఆమె ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో పర్యటించారు.
Source: Yahoo! Telugu: News | 24 Jul 2010 | 6:57 am

సుమత్రాలో భారీ భూకంపం: రిక్టర్ స్కేలుపై 6.0గా నమోదు!

ఇండోనేషియాలోని ఉత్తర సుమత్రాలో తీవ్ర భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.0గా నమోదైన ఈ తీవ్ర భూకంపనంతో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని భూగోళిక అధికారులు తెలిపారు.
Source: Yahoo! Telugu: News | 24 Jul 2010 | 6:32 am

శాంతిభద్రతల సమస్యగా మారిన నక్సలైట్లు: రోశయ్య

ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ ఆధ్వర్యంలో జాతీయ అభివృద్ధి సలహా మండలి సమావేశం శనివారం ఢిల్లీలో ప్రారంభమయ్యింది. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రోశయ్యతోపాటు అన్ని రాష్ట్రాల సీఎంలు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రోశయ్య మాట్లాడుతూ.. నక్సలిజం సమస్య ఆర్థిక, సామాజిక సమస్య నుంచి శాంతిభద్రతల సమస్యగా మారిందన్నారు.
Source: Yahoo! Telugu: News | 24 Jul 2010 | 6:26 am

తమన్నాది ఐరన్ లెగ్ అయిపోయిందా...?!!

హ్యాపీడేస్ చిత్రంతో హ్యాపీ హ్యాపీగా వరుస ఆఫర్లు దక్కించుకుని తొలుత టాలీవుడ్‌లో ఆ పిదప కోలీవుడ్‌లో సక్సెస్‌లు సాధిస్తున్న తమన్నాకు గడ్డు కాలం మొదలైనట్లు కనబడుతోంది. ఇటీవల ఆమె తమిళ అగ్రహీరో విజయ్‌తో నటించిన సుర చిత్రం బాక్సీఫీసు వద్ద ఘోరంగా బోల్తా కొట్టింది. ఒక్క సినిమాయేగా.. అని ధైర్యంగా ఉంటుండగానే జయం రవితో నటించిన తాజా చిత్రం శుక్రవారం తమిళనాడులో విడుదలైంది. రిపోర్టు ఎలా ఉందని ఆరా తీస్తే... అది కూడా బాక్సాఫీసు వద్ద బోర్లా పడినట్లు తెలిసింది. దీంతో తమన్నా వైపు దర్శక నిర్మాతలు అనుమానంగా చూస్తున్నారట. టాలీవుడ్ ఐరెన్ లెగ్ హన్సిక మాదిరిగా తమన్నా లక్ కూడా తిరగబడి ఐరన్ లెగ్ అయిపోయిందా అని దీర్ఘంగా ఆలోచిస్తున్నారట.
Source: Yahoo! Telugu: Entertainment | 24 Jul 2010 | 6:04 am

18 విదేశీ పెట్టుబడుల ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదం

రూ.2,245.32 కోట్ల విలువ చేసే 18 విదేశీ పెట్టుబడుల ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదం తెలిపింది. పరిశీలనకు వచ్చిన మొత్తం ప్రతిపాదనలలో 10 ప్రతిపాదనలను కేంద్రం తిరస్కరించింది. వీటిలో మహీంద్రా అండ్‌ మహీంద్రా లిమిటెడ్‌, ఐఎన్‌ఎక్స్‌ మీడియా ప్రైవేట్‌ లిమిటెడ్‌, టెల్కార్డియా టెక్నాలజీస్‌, సీమెన్స్‌ కంపెనీలు ఉన్నాయి.
Source: Yahoo! Telugu: News | 24 Jul 2010 | 5:40 am

బాబుపై పురంధరేశ్వరి వ్యాఖ్యలు సరికావు: దేవినేని

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై కేంద్ర మంత్రి పురంధేశ్వరి చేసిన వ్యాఖ్యలు సరికావని తెదేపా కృష్ణాజిల్లా అధ్యక్షుడు, శాసన సభ్యుడు దేవినేని ఉమా మహేశ్వర రావు విజయవాడలో అన్నారు. చేతనైతే మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులను అడ్డుకోవాలని దేవినేని చెప్పారు.
Source: Yahoo! Telugu: News | 24 Jul 2010 | 5:40 am

ఆగస్టు 6న విడుదల కానున్న ప్రిడేటర్స్

1987లో ప్రిడేటర్ పేరుతో సైఫై చరిత్రలో పాపులర్ క్యారక్టర్స్‌ని తీసుకుని జంగిల్ వీరుల కథతో రూపొందించారు. ప్రేక్షకులు ఈ చిత్రంలోని ఉన్నతమైన మైథాలాజికల్ గ్రాఫిక్స్‌కి మైమరిచిపోయారు. దాదాపు 13 ఏళ్ల నుంచి ప్రిడేటర్ చిత్రం ప్రేక్షకులను ఎక్సైట్ చేస్తూనే ఉండటం విశేషం.ప్రిడేటర్స్ చిత్రంలోని పాత్రలు తీసుకుని కొన్ని చిత్రాలు వచ్చినా కూడా అవి అంతగా అభిమానుల్ని అలరించలేకపోయాయి. ఇప్పుడు ప్రొడ్యూసర్ రాబర్ట్ రాడ్రిగేజ్, డైరెక్టర్ నిమ్రాడ్ అంటల్ ఒరిజినల్‌కి సీక్వెల్‌గా ఈ ప్రిడేటర్స్ చిత్రాన్ని రూపొందించారు.
Source: Yahoo! Telugu: Entertainment | 24 Jul 2010 | 5:23 am

కేసీఆర్ స్వార్థం కోసమే ఎమ్మెల్యేల రాజీనామా..!: గోనె

తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె. చంద్రశేఖర రావు తన స్వార్థం కోసమే ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గోనె ప్రకాశరావు ఆరోపించారు. గత ఎన్నికల్లో ఇచ్చిన వాగ్ధానాలను నిలబెట్టుకోలేక పోయిన కేసీఆర్ స్వార్థ రాజకీయాలను ప్రజలు గుర్తించాలని గోనె అన్నారు.
Source: ఏపీ న్యూస్ | 24 Jul 2010 | 4:00 am

రోశయ్యను నమ్ముకుంటే రాష్ట్రం అధోగతే: చంద్రబాబు

రాష్ట్ర ప్రయోజనాలు పట్టని ముఖ్యమంత్రి రోశయ్యను నమ్ముకుంటే రాష్ట్రం అధోగతి పాలవుతుందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. రోశయ్య తన పదవిని కాపాడుకునేందుకు ప్రాధాన్యమిస్తున్నారు తప్ప ప్రజల ప్రయోజనాలు కళ్లెదురుగా మంటగలిసి పోతున్నా పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
Source: ఏపీ న్యూస్ | 24 Jul 2010 | 2:01 am

అమిత్ షా ఇప్పటికే ఆలస్యం చేశారు..!: రాజీవ్ శుక్లా

సోహ్రాబుద్ధీన్ ఎన్‌కౌంటర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సమయంలోనే గుజరాత్ మంత్రి అమిత్ షా రాజీనామా చేయాల్సిందని ఏఐసీసీ గుజరాత్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ రాజీవ్ శుక్లా అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇప్పటికే అమిత్ రాజీనామా విషయంలో జాప్యం చేశారని శుక్లా తెలిపారు.
Source: జాతీయ | 24 Jul 2010 | 1:42 am

సమైక్య వాదానికే ఓటు వేయండి: తెరాస విజయశాంతి

తెలంగాణా రాజకీయ వీరవనితగా పేరు సంపాదించుకున్న మెదక్ ఎంపీ విజయశాంతి తెలంగాణాలో తెరాస అభ్యర్థుల గెలుపుకోసం అలుపెరగకుండా ఎన్నికల పర్యటనల్లో పాల్గొంటున్నారు. ఇందులో భాగంగా ఆమె ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో పర్యటించారు.
Source: ఏపీ న్యూస్ | 24 Jul 2010 | 1:31 am

మమ్మల్ని తంతుంటే.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలేంచేస్తున్నారు.?

బాబ్లీ పరిశీలన కోసం వెళ్లిన ప్రజాప్రతినిధులను మహారాష్ట్ర పోలీసులు తన్నుతుంటే, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. బాబ్లీ ప్రాజెక్టుతో ఉత్తర తెలంగాణాకు ఏర్పడే భారీ నష్టాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ ప్రాజెక్టు సందర్శనార్థం వెళ్లిన 72 మంది ప్రజా ప్రతినిధులపై మహారాష్ట్ర పోలీసులు లాఠీఛార్జీ ప్రయోగిస్తుంటే.. 33 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారని బాబు నిలదీశారు.
Source: ఏపీ న్యూస్ | 24 Jul 2010 | 1:30 am

శాంతిభద్రతల సమస్యగా మారిన నక్సలైట్లు: రోశయ్య

ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ ఆధ్వర్యంలో జాతీయ అభివృద్ధి సలహా మండలి సమావేశం శనివారం ఢిల్లీలో ప్రారంభమయ్యింది. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రోశయ్యతోపాటు అన్ని రాష్ట్రాల సీఎంలు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రోశయ్య మాట్లాడుతూ.. నక్సలిజం సమస్య ఆర్థిక, సామాజిక సమస్య నుంచి శాంతిభద్రతల సమస్యగా మారిందన్నారు.
Source: జాతీయ | 24 Jul 2010 | 12:56 am

తాడూ బొంగరం లేకుండా తెలంగాణ వస్తుందా: డీఎస్

తాడూ లేదూ.. బొంగరం లేదూ.. తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ సాధిస్తాడంటా. అదెలా సాధ్యం. రాష్ట్ర సాధన ఏ విధంగా చేస్తారో తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర రావు ప్రజలకు వివరణ ఇవ్వాలని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, నిజామాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి ధర్మపురి శ్రీనివాస్ డిమాండ్ చేశారు.
Source: ఏపీ న్యూస్ | 24 Jul 2010 | 12:18 am

రోశయ్యా... మీరు మహారాష్ట్రకు ముఖ్యమంత్రా..?!!: బాబు ధ్వజం

కేంద్రం మరోసారి బాబ్లీ సమస్యను గాలికొదిలేసే చర్యలకు పూనుకుంటున్నట్లు స్పష్టమవుతోందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు విమర్శించారు. శుక్రవారం కేంద్ర జలవనరుల శాఖామంత్రి చేసిన ప్రకటన దీనినే స్పష్టం చేస్తోందని అన్నారు.
Source: ఏపీ న్యూస్ | 24 Jul 2010 | 12:15 am

బాబుపై పురంధరేశ్వరి వ్యాఖ్యలు సరికావు: దేవినేని

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై కేంద్ర మంత్రి పురంధేశ్వరి చేసిన వ్యాఖ్యలు సరికావని తెదేపా కృష్ణాజిల్లా అధ్యక్షుడు, శాసన సభ్యుడు దేవినేని ఉమా మహేశ్వర రావు విజయవాడలో అన్నారు. చేతనైతే మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులను అడ్డుకోవాలని దేవినేని చెప్పారు.
Source: ఏపీ న్యూస్ | 24 Jul 2010 | 12:13 am

జగన్.. పార్టీని చీల్చు... మేం మద్దతిస్తాం: తెదేపా రాయబారం?

కడప పార్లమెంట్ సభ్యుడు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి తనయుడు వైఎస్.జగన్మోహన రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మధ్య ఒక లోపాయకారి ఒప్పందం కుదిరినట్టు రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. రాష్ట్రంలోని రోశయ్య సర్కారు ఇటు జగన్ వర్గానికి.. అటు తెదేపాకు బద్ధ శత్రువుగా వ్యవహరిస్తోంది. దీంతో రోశయ్య సర్కారును కూల్చాలని ఇరు వర్గాలు పోటీపోటీగా ఎత్తులు పైఎత్తులు వేస్తున్నాయి. దీనిపై జగన్ వర్గం అంతర్గతంగా భారీ కసరత్తే చేస్తున్నట్టు కాంగ్రెస్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి.
Source: ఏపీ న్యూస్ | 24 Jul 2010 | 12:10 am

చీనాబ్ నదిలో పడిన మినీ బస్సు: 25 మంది మృతి

జమ్మూ అండ్ కాశ్మీర్‌లో ఓ మినీ బస్సు ప్రమాదానికి గురైంది. పోగుమల్ నుంచి కిష్ట్వర్ వెళ్తున్న మిని బస్సు ప్రమాదవశాత్తు చీనాబ్ నదిలో పడింది. ఈ సంఘటనలో బస్సుతో పాటు ప్రయాణికులు మునిగిసోయారు. ఈ ప్రమాదంలో దాదాపు 25 మంది మృతి చెంది ఉండవచ్చని అంచనా.
Source: జాతీయ | 23 Jul 2010 | 11:48 pm

హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి పెద్ద సన్నాసి: కేసీఆర్

రాష్ట్ర హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి తన జీవితంలో ఇప్పటివరకూ ఈ మాటను బహుశా విని ఉండకపోవచ్చు. అటువంటి అభ్యంతరకర పదాన్ని కేసీఆర్ తన ఉపఎన్నికల పర్యటనలో సాక్షాత్తూ హోంమంత్రిపై ప్రయోగించారు.
Source: ఏపీ న్యూస్ | 23 Jul 2010 | 11:19 pm

అమిత్ షా రాజీనామాను ఆమోదించిన నరేంద్ర మోడీ!

సోహ్రాబుద్ధీన్ షేక్ నకిలీ ఎన్‌కౌంటర్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అమిత్ షా తన పదవికి రాజీనామా చేశారు. గుజరాత్ హోం శాఖ సహాయమంత్రి అమిత్‌షా రాజీనామాను ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ శనివారం ఆమోదించారు. ఈ విషయమై గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. తనపై కక్షతోనే కాంగ్రెస్ పార్టీ అమిత్‌పై తీవ్రంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఇంకా తనపై కక్ష తీర్చుకునేందుకు అమిత్‌ను పావుగా ఉపయోగించుకుంటుందని, దీనిపై న్యాయపోరాటం చేస్తానని చెప్పారు.
Source: జాతీయ | 23 Jul 2010 | 10:35 pm

సోహ్రాబుద్దీన్ ఎన్‌కౌంటర్ కేసు: గుజరాత్ మంత్రికి నో బెయిల్!

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2005 నాటి సోహ్రాబుద్దీన్ బూటకపు ఎన్‌కౌంటర్ కేసులో గుజరాత్ హోం మంత్రి అమిత్‌షా దాఖలు చేసుకున్న ముందస్తు బెయిలు పిటిషన్‌ను సీబీఐ ప్రత్యేక కోర్టు తిరస్కరించింది. బెయిల్‌పై అమిత్ షా న్యాయవాది మితేష్ అమిన్ గుజరాత్ హైకోర్టుకు వెళ్లవచ్చని సమాచారం.
Source: జాతీయ | 23 Jul 2010 | 9:43 pm

బాబ్లీపై సీఎంలతో భేటీ అనవసరం: మాటమార్చిన బన్సాల్!

బాబ్లీ ప్రాజెక్టుపై ఆంధ్రప్రదేశ్-కర్ణాటక ముఖ్యమంత్రుల సమావేశం అవసరం లేదని కేంద్ర జనవనరుల మంత్రి పవన్ కుమార్ బన్సాల్ అన్నారు. బాబ్లీ వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించేందుకు వీలైనంత త్వరగా ఆంధ్ర-మహారాష్ట్ర సీఎంల సమావేశాన్ని ఏర్పాటు చేస్తానని తెలుగుదేశం ప్రజాప్రతినిధులకు గతంలో హామీ ఇచ్చిన బన్సాల్ ఒక్కసారిగా బాణీ మార్చారు.
Source: జాతీయ | 23 Jul 2010 | 9:37 pm

యువసామ్రాట్ నాగార్జున కొత్త సినిమా "గగనం"

గ్రీకు వీరుడు అక్కినేని నాగార్జున తాజా చిత్రానికి "గగనం" పేరును ఖరారు చేశారు. అంతకుముందు... వాంటెడ్, గగనం, పయనం.. ఇలా మూడు పేర్లను ప్రేక్షకుల ముందు ఉంచి, ఏ టైటిల్‌కు ప్రేక్షకులు అత్యధిక ఓట్లు వేస్తే దానినే ఎంపిక చేస్తామని నిర్మాత ప్రకటించారు. ఆ ప్రకారంగా గగనం టైటిల్‌కు అత్యధిక ఓట్లు రావడంతో ఆ పేరునే తన చిత్రానికి పెట్టినట్లు నాగార్జున వెల్లడించారు. శుక్రవారం హైదరాబాదులో టైటిల్ ఆవిష్కరణ కార్యక్రమంలో నాగార్జున మాట్లాడారు. తాను ఇటీవల నటించిన "కేడీ" చిత్రంతో తన బుర్ర పాడైందనీ, తన బుర్రే కాదు, ప్రేక్షకుల బుర్రలు కూడా పాడై ఉంటాయని ఛలోక్తి విసిరారు. ఆ గ్యాప్‌లో రాధామోహన్‌గారు తనకు ఓ కథ వినిపించారనీ, ఆ కథ విన్నాక సినిమా చేద్దామని ఆయనతో చెప్పానన్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 23 Jul 2010 | 2:21 pm

తెలంగాణాకోసం గుజ్జర్ల తరహా పోరాటానికి సిద్ధం: కేసీఆర్

తెలంగాణా సెంటిమెంట్ బాణంతో తెరాస చీఫ్ కేసీఆర్ ఉపఎన్నికల పర్యటనలో దూసుక పోతున్నారు. తెలంగాణా ఏర్పాటు విషయమైన ఒకవైపు శ్రీకృష్ణ కమిటీ రాష్ట్రంలో పర్యటిస్తుండగానే, డిసెంబరు తర్వాత తెలంగాణాలో గొప్ప ఉద్యమం ఉందనీ, విద్యార్థులు, న్యాయవాదులు, ఉద్యోగులు గుజ్జర్ల తరహా పోరాటానికి సిద్ధమవుతున్నారని ఎన్నికల పర్యటనలో ప్రకటించారు.
Source: ఏపీ న్యూస్ | 23 Jul 2010 | 9:30 am

రాజమౌళి బ్రాండ్ సునీల్ మర్యాద రామన్న "క్లిక్"

రాజమౌళి సినిమాలంటే రాయలసీమ, ఫ్యాక్షనిజాలు కంపల్సరీ. బాంబు పేలుళ్లు, కత్తులు కఠారులు మామూలే. అయితే బాంబుబ్లాస్టులు లేకుండా కత్తులతోనే ప్రేమతో కూడిన మర్యాద అనే పాయింట్‌ను ఎంచుకుని వినోదాత్మకంగా తీసిన విధానం బాగుంది. రాయలసీమలో అంతా పగకోసం ప్రతీకారంకోసం ఉన్నవారే అన్న తరహాలో బోల్డన్ని చిత్రాలు వచ్చినా వారిలోనూ అతిథి మర్యాదలు చేసే కోణం మరోటి ఉందని చెప్పే ప్రయత్నమిది. ఏ సినిమా తీసినా అందులో నటించిన నటీనటులకంటే దర్శకునికే పేరు వస్తుంది. ఈ చిత్రమూ అంతే.. చిన్న పాయింట్‌ను పక్కాగా స్క్రిప్ట్ రాసుకుని పట్టు సడలకుండా ఎలా తీయవచ్చో ఈ చిత్రం రుజువు చేసింది. ఏవో కొద్దిపాటి మచ్చలున్నా అవి కథాగమనంలో పెద్దగా పట్టించుకోనేవి కావు.
Source: Yahoo! Telugu: Entertainment | 23 Jul 2010 | 9:09 am

పడిపోతున్న ఛార్మిని ఒడిసి పట్టుకున్న దేవీశ్రీ

ఛార్మింగ్ గాళ్ ఛార్మికి ఈమధ్య సినిమాలు లేకపోయినప్పటికీ బిజీగానే ఉంటోంది. ఈ బిజీ ఎటువంటిదని అంటారా.. మరేం లేదు. పబ్బుల్లో తిరుగుతూ క్షణం తీరిక లేకుండా గడిపేస్తోంది. ఛార్మికి మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీ ప్రసాద్‌కు మధ్య ప్రేమాయణం నడుస్తోందనీ, వారిద్దరూ త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే వార్తలు ఆ మధ్య వచ్చాయి కూడా. ఈమధ్య జరిగిన ఓ సంఘటన ఇది నిజమేనని రుజువు చేస్తోంది. ఇటీవల ఛార్మి, దేవీశ్రీ ప్రసాద్ ఇద్దరూ కలిసి పబ్బుల్లో చిందులేశారు. పబ్బుకు చీర కట్టుకొచ్చినప్పటికీ ఛార్మి రెచ్చిపోయి డాన్స్ చేసింది. అందరికీ అందాల ప్రదర్శన చేసింది. ఒకానొక పరిస్థితిలో ఛార్మి పడిబోతుంటే దేవిశ్రీ ఆమెను గట్టిగా ఒడిసి పట్టుకున్నాడట. ఈ ఫోటోలు ఫిలిమ్ నగర్‌లో చక్కర్లు కొడుతున్నాయి. మరి ఇప్పటికైనా ఛార్మి తన లవ్ ఎఫైర్ గురించి ఒప్పుకుంటుందో లేదో...
Source: Yahoo! Telugu: Entertainment | 23 Jul 2010 | 7:08 am

బికినీ వేయను.. వేస్తే సిగ్గుపడను: సోనమ్ కపూర్

సోనమ్ కపూర్ అంటే ఇపుడు బాలీవుడ్ కుర్రకారు చొంగ కార్చుకుంటున్నారట. ఆమెలో ఉన్న అంతటి ప్రత్యేకత ఏంటట... అని వారినడిగితే, ఎన్నెన్నో ఉన్నాయని ఏవేవో కబుర్లు చెపుతున్నారు. ముఖ్యంగా సోనమ్ డ్రెస్‌సెన్స్ అదిరిపోతుందని, అందాలను చూపించి చూపించకుండా వస్త్రాలంకరణ చేసుకుంటుందని చెపుతున్నారు. ఈ బ్యూటీ క్వీన్‌ను బికినీలో చూడాలనుందని అసలు సంగతి బయట పెట్టారు. ఈ విషయాన్ని ఓ బాలీవుడ్ పిల్ల జర్నలిస్ట్ సోనమ్ చెవిన పడేశాడు. ఆ మాట విన్న సోనమ్ తనదైన సెక్సీ నవ్వును విసురుతూ... ఖచ్చితంగా బికినీ వేసుక నటించాల్సిన పాత్ర వస్తే నటిస్తానని చెప్పేసింది. అయితే తాను ఇప్పటి వరకూ బికినీ వేయలేదనీ, ఒకవేళ వేయవలసి వస్తే సిగ్గుపడి పోతూ బికినీ వేసుకుని ముడుచుక పోనని అంటోంది.
Source: Yahoo! Telugu: Entertainment | 23 Jul 2010 | 5:52 am

బెంగాల్‌లో నలుగురు మావోయిస్టు అగ్రనేతల అరెస్టు!

మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి ఆజాద్‌ను కోల్పోయిన మావోయిస్టులు తాజాగా ఆ పార్టీకి చెందిన నలుగురు అగ్రనేతలను బెంగాల్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. వీరిలో మావోయిస్టు చీఫ్ కిషన్‌జీ సన్నిహితుడు కూడా ఉన్నారు.
Source: జాతీయ | 23 Jul 2010 | 5:45 am

ప్రధానమంత్రి లంచ్ ఆహ్వానాన్ని తిరస్కరించిన భాజపా!

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభంకానున్నాయి. వీటిని పురస్కరించుకుని ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రతిపక్ష పార్టీల నేతలను శుక్రవారం లంచ్‌కు ఆహ్వానించారు. ఈ విన్నపాన్ని ప్రధాన ప్రతిపక్షం భారతీయ జనతా పార్టీ నేతలు గైర్హాజరయ్యారు. సొహ్రాబుద్దీన్ షేక్ ఎన్‌కౌంటర్ కేసులో గుజరాత్ హోం మంత్రి అమిత్ షాకు సీబీఐ నోటీసులు జారీ చేయడానికి నిరసనగా కమలనాథులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
Source: జాతీయ | 23 Jul 2010 | 4:41 am

రాజమౌళి బ్రాండ్ సునీల్ మర్యాద రామన్న "క్లిక్"

రాజమౌళి సినిమాలంటే రాయలసీమ, ఫ్యాక్షనిజాలు కంపల్సరీ. బాంబు పేలుళ్లు, కత్తులు కఠారులు మామూలే. అయితే బాంబుబ్లాస్టులు లేకుండా కత్తులతోనే ప్రేమతో కూడిన మర్యాద అనే పాయింట్‌ను ఎంచుకుని వినోదాత్మకంగా తీసిన విధానం బాగుంది. రాయలసీమలో అంతా పగకోసం ప్రతీకారంకోసం ఉన్నవారే అన్న తరహాలో బోల్డన్ని...
Source: వినోదం | 23 Jul 2010 | 3:43 am

బీహార్‌లో నితీష్ ప్రభుత్వ రద్దుకు కాంగ్రెస్ పార్టీ డిమాండ్

బీహార్‌లోని ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రభుత్వాన్ని తక్షణం రద్దు చేయాలని కోరుతూ ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. రాష్ట్రంలోని జేడీయూ ప్రభుత్వం 11,412 కోట్ల రూపాయలను దుర్వినియోగం చేసిందని ఆ పార్టీ ఆరోపించింది.
Source: జాతీయ | 23 Jul 2010 | 3:39 am