ప్రధానితో కలిసే అఖిలపక్ష బృందంలో బాబు: తెదేపా

ఈనెల 26వ తేదీన ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్‌తో భేటీ అయ్యే రాష్ట్ర అఖిలపక్ష సమావేశానికి పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు హాజరవుతారని తెలుగుదేశం పార్టీ వెల్లడించింది. మహారాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న బాబ్లీ ప్రాజెక్టు అంశంపై ఈనెల 26న ప్రధాని ఆధ్వర్యంలో రాష్ట్ర రాజకీయ పార్టీల అఖిలపక్ష సమావేశం జరుగనుంది.
Source: Yahoo! Telugu: News | 23 Jul 2010 | 7:10 am

స్టాక్ మార్కెట్: 18వేల మార్కు వద్ద సెన్సెక్స్ ర్యాలీ!

బాంబే స్టాక్ మార్కెట్ లాభాలను ఆర్జిస్తోంది. ట్రేడింగ్ ప్రారంభం నుంచే పురోగమనం వైపు ర్యాలీని కొనసాగిస్తున్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచి సెన్సెక్స్, మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో స్వల్ప లాభాలను ఆర్జిస్తోంది. ఇందులో సెన్సెక్స్ 12 పాయింట్ల స్వల్ప వృద్ధితో, 18,125 పాయింట్ల మార్కును తాకగా, నిఫ్టీ అదే 12 పాయింట్ల స్వల్ప లాభంతో 5,454 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. ఫలితంగా సెన్సెక్స్ 18వేల మార్కును తాకి, రెండేళ్ల గరిష్ఠ స్థాయికి చేరుకుంది.
Source: Yahoo! Telugu: News | 23 Jul 2010 | 7:09 am

పడిపోతున్న ఛార్మిని ఒడిసి పట్టుకున్న దేవీశ్రీ

ఛార్మింగ్ గాళ్ ఛార్మికి ఈమధ్య సినిమాలు లేకపోయినప్పటికీ బిజీగానే ఉంటోంది. ఈ బిజీ ఎటువంటిదని అంటారా.. మరేం లేదు. పబ్బుల్లో తిరుగుతూ క్షణం తీరిక లేకుండా గడిపేస్తోంది. ఛార్మికి మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీ ప్రసాద్‌కు మధ్య ప్రేమాయణం నడుస్తోందనీ, వారిద్దరూ త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే వార్తలు ఆ మధ్య వచ్చాయి కూడా. ఈమధ్య జరిగిన ఓ సంఘటన ఇది నిజమేనని రుజువు చేస్తోంది. ఇటీవల ఛార్మి, దేవీశ్రీ ప్రసాద్ ఇద్దరూ కలిసి పబ్బుల్లో చిందులేశారు. పబ్బుకు చీర కట్టుకొచ్చినప్పటికీ ఛార్మి రెచ్చిపోయి డాన్స్ చేసింది. అందరికీ అందాల ప్రదర్శన చేసింది. ఒకానొక పరిస్థితిలో ఛార్మి పడిబోతుంటే దేవిశ్రీ ఆమెను గట్టిగా ఒడిసి పట్టుకున్నాడట. ఈ ఫోటోలు ఫిలిమ్ నగర్‌లో చక్కర్లు కొడుతున్నాయి. మరి ఇప్పటికైనా ఛార్మి తన లవ్ ఎఫైర్ గురించి ఒప్పుకుంటుందో లేదో...
Source: Yahoo! Telugu: Entertainment | 23 Jul 2010 | 7:08 am

అక్రమ ప్రాజెక్టుల అడ్డుకట్టకు పూర్తి మద్దతు: తెదేపా

మహారాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న బాబ్లీతో సహా 13 అక్రమ ప్రాజెక్టుల నిర్మాణాలను ఆపేందుకు ప్రభుత్వం తీసుకునే ఎలాంటి చర్యకైనా తమ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలు స్పష్టం చేశారు. శుక్రవారం ముఖ్యమంత్రి కె.రోశయ్య అధ్యక్షతన జరిగే అఖిలపక్ష సమావేశానికి తెదేపాకు చెందిన నలుగురు సభ్యుల బృందం గైర్హాజరైన విషయం తెల్సిందే.
Source: Yahoo! Telugu: News | 23 Jul 2010 | 7:00 am

స్వల్ప లాభాల్లో బాంబే స్టాక్ మార్కెట్ ర్యాలీ!

బాంబే స్టాక్ మార్కెట్ స్వల్ప లాభాలను ఆర్జిస్తోంది. వారాంతమైన శుక్రవారం బాంబే స్టాక్ మార్కెట్ పురోగమనం వైపు ర్యాలీ కొనసాగిస్తోంది. ఫలితంగా శుక్రవారం బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచి సెన్సెక్స్ 17 పాయింట్ల స్వల్ప లాభంతో 18,130 పాయింట్ల మార్కును తాకింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచి నిఫ్టీ కూడా ఏడు పాయింట్ల స్వల్ప వృద్ధితో 5,448 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.
Source: Yahoo! Telugu: News | 23 Jul 2010 | 6:38 am

గుండెపోటుతో ముగ్గురు అమర్నాథ్ భక్తుల కన్నుమూత!

హిమ శివలింగ దర్శన యాత్రకు వెళ్లిన భక్తుల్లో ముగ్గురు భక్తులు గుండెపోటుతో మరణించినట్టు అమర్నాథ్ ఆలయ అధికారులు వెల్లడించారు. దక్షిణ కాశ్మీర్‌ హిమాలయాల్లో ప్రకృతి సహజసిద్ధంగా ఏర్పడిన అమర్నాథ్‌ ఆలయ మార్గ మధ్యంలో వీరు కన్నుమూశారు. మరణించిన వారిలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన 22 సంవత్సరాల ప్రదీప్ కుమార్ జైశ్వాల్ పహల్గామ్-అమర్నాథ్ మార్గంలోని షెషాంగ్ అనే ప్రాంతం వద్ద కన్నుమూసినట్టు చెప్పారు.
Source: Yahoo! Telugu: News | 23 Jul 2010 | 6:24 am

ట్యాబ్లెట్ పీసీని విడుదల చేసిన ఆలివ్ టెలికాం

దేశంలో త్వరలో రానున్న 3జీ సేవలను దృష్టిలో ఉంచుకొని, ప్రముఖ వైర్‌లెస్ డివైజ్‌ల తయారీ సంస్థ ఆలివ్ టెలికాం "ఆలివ్‌ప్యాడ్-వీటీ100" పేరుతో ఓ సరికొత్త ట్యాబ్లెట్ పీసీని విడుదల చేసింది. దేశీయ మార్కెట్‌లో దీని ధర రూ. 25,000గా ఉన్నట్లు సంస్థ ప్రకటించింది.
Source: Yahoo! Telugu: News | 23 Jul 2010 | 6:21 am

నేడు నేపాల్ ప్రధానమంత్రి పీఠానికి మరోదఫా ఎన్నికలు!

నేపాల్ దేశ ప్రధానమంత్రి పీఠానికి శుక్రవారం మరోదఫా ఎన్నికలు జరుగనున్నాయి. గత బుధవారం జరిగిన ఎన్నికల్లో మావోయిస్టు పార్టీ చీఫ్ ప్రచండ, నేపాలీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రామ్‌చంద్ర ఫౌడల్‌లు సంఖ్యాబలాన్ని కూడగట్టడంలో పూర్తిగా విఫలమయ్యారు. ఫలితంగా ఎన్నికను శుక్రవారం మరోమారు నిర్వహించాలని ఆ దేశ పార్లమెంట్ స్పీకర్ నిర్ణయించారు. ఆ ప్రకారంగా సాయంత్రం ఎన్నిక జరుగనుంది.
Source: Yahoo! Telugu: News | 23 Jul 2010 | 6:12 am

ఊపందుకున్న ట్రేడింగ్: వృద్ధిబాటలో సెన్సెక్స్, నిఫ్టీ!

దేశీయ వాటాల ట్రేడింగ్ ఊపందుకోవడంతో బాంబే స్టాక్ మార్కెట్ లాభాలను ఆర్జించింది. ఆటో, టెక్, కన్జూమర్ డూరబుల్స్, మెటల్ వాటాల ట్రేడింగ్ పుంజుకోవడంతో శుక్రవారం 10.30 గంటల ప్రాంతంలో సెన్సెక్స్, నిఫ్టీలు లాభాలను నమోదు చేసుకుంటున్నాయి.
Source: Yahoo! Telugu: News | 23 Jul 2010 | 6:11 am

ఈ యేడాది వెబ్‌ కౌన్సెలింగ్ ద్వారా బీఈడీ అడ్మిషన్లు!

ఈ యేడాది బీఈడీ అడ్మిషన్లు పూర్తిగా వెబ్ ఆధారిత కౌన్సెలింగ్ ద్వారా నిర్వహించనున్నారు. కౌన్సెలింగ్ సెంటర్లకు అభ్యర్థులు వెళ్లకుండానే, ఇంటి నుంచి గానీ, సైబర్ కేఫ్‌ల నుంచి గానీ ఇంటర్నెట్‌లో ఆప్షన్లు ఇచ్చుకోవడం ద్వారా అడ్మిషన్ పొందవచ్చు. మెరిట్, రిజర్వేషన్ల ప్రాతిపదికన అభ్యర్థులు ఇచ్చుకునే ఆప్షన్లకు లోబడి సీట్ల కేటాయింపు జరుగుతుందని. ఇందుకు సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ప్రాథమికంగా ఒక నిర్ణయం తీసుకుంది.
Source: Yahoo! Telugu: News | 23 Jul 2010 | 5:59 am

మొదటి త్రైమాసికంలో 30.5శాతం వృద్ధి: విప్రో

ప్రముఖ ఐటీ దిగ్గజం విప్రో జూన్ 30తో ముగిన తొలి త్రైమాసికానికి గానూ 30.5శాతం వృద్ధిని నమోదు చేసుకుంది. కంపెనీ మొత్తం నికర లాభం రూ. 1318.6 కోట్లకు చేరుకుంది. గత సంవత్సరం ఇదే సమయానికి సంస్థ నికర లాభం రూ. 1,010.4 కోట్లుగా నమోదయినట్లు కంపెనీ ప్రకటించింది.
Source: Yahoo! Telugu: News | 23 Jul 2010 | 5:53 am

బికినీ వేయను.. వేస్తే సిగ్గుపడను: సోనమ్ కపూర్

సోనమ్ కపూర్ అంటే ఇపుడు బాలీవుడ్ కుర్రకారు చొంగ కార్చుకుంటున్నారట. ఆమెలో ఉన్న అంతటి ప్రత్యేకత ఏంటట... అని వారినడిగితే, ఎన్నెన్నో ఉన్నాయని ఏవేవో కబుర్లు చెపుతున్నారు. ముఖ్యంగా సోనమ్ డ్రెస్‌సెన్స్ అదిరిపోతుందని, అందాలను చూపించి చూపించకుండా వస్త్రాలంకరణ చేసుకుంటుందని చెపుతున్నారు. ఈ బ్యూటీ క్వీన్‌ను బికినీలో చూడాలనుందని అసలు సంగతి బయట పెట్టారు. ఈ విషయాన్ని ఓ బాలీవుడ్ పిల్ల జర్నలిస్ట్ సోనమ్ చెవిన పడేశాడు. ఆ మాట విన్న సోనమ్ తనదైన సెక్సీ నవ్వును విసురుతూ... ఖచ్చితంగా బికినీ వేసుక నటించాల్సిన పాత్ర వస్తే నటిస్తానని చెప్పేసింది. అయితే తాను ఇప్పటి వరకూ బికినీ వేయలేదనీ, ఒకవేళ వేయవలసి వస్తే సిగ్గుపడి పోతూ బికినీ వేసుకుని ముడుచుక పోనని అంటోంది.
Source: Yahoo! Telugu: Entertainment | 23 Jul 2010 | 5:52 am

జగన్‌కు చెక్ పెడదామా: కాంగ్రెస్ అధిష్టానం ఆరా!

కడప ఎంపీ వైఎస్.జగన్మోహన్ రెడ్డిపై కాంగ్రెస్ అధిష్టానం గుర్రుగా ఉంది. వ్యక్తిగత ప్రతిష్టను పెంచుకునేలా ఓదార్పు యాత్రను కొనసాగిస్తున్న జగన్‌ వ్యవహార శైలిని పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో పాటు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ కూడా నిశితంగా పరిశీలిస్తున్నారు. ఇందులోభాగంగానే.. రాష్ట్ర రాజకీయ పరిణామాలపై వారిద్దరు ప్రత్యేక దృష్టి సారించినట్టు సమాచారం.
Source: ఏపీ న్యూస్ | 23 Jul 2010 | 3:58 am

తాడూ బొంగరం లేకుండా తెలంగాణ వస్తుందా: డీఎస్

తాడూ లేదూ.. బొంగరం లేదూ.. తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ సాధిస్తాడంటా. అదెలా సాధ్యం. రాష్ట్ర సాధన ఏ విధంగా చేస్తారో తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర రావు ప్రజలకు వివరణ ఇవ్వాలని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, నిజామాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి ధర్మపురి శ్రీనివాస్ డిమాండ్ చేశారు.
Source: ఏపీ న్యూస్ | 23 Jul 2010 | 3:40 am

బీహార్‌లో నితీష్ ప్రభుత్వ రద్దుకు కాంగ్రెస్ పార్టీ డిమాండ్

బీహార్‌లోని ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రభుత్వాన్ని తక్షణం రద్దు చేయాలని కోరుతూ ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. రాష్ట్రంలోని జేడీయూ ప్రభుత్వం 11,412 కోట్ల రూపాయలను దుర్వినియోగం చేసిందని ఆ పార్టీ ఆరోపించింది.
Source: జాతీయ | 23 Jul 2010 | 3:39 am

ప్రధానితో కలిసే అఖిలపక్ష బృందంలో బాబు: తెదేపా

ఈనెల 26వ తేదీన ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్‌తో భేటీ అయ్యే రాష్ట్ర అఖిలపక్ష సమావేశానికి పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు హాజరవుతారని తెలుగుదేశం పార్టీ వెల్లడించింది. మహారాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న బాబ్లీ ప్రాజెక్టు అంశంపై ఈనెల 26న ప్రధాని ఆధ్వర్యంలో రాష్ట్ర రాజకీయ పార్టీల అఖిలపక్ష సమావేశం జరుగనుంది.
Source: ఏపీ న్యూస్ | 23 Jul 2010 | 1:40 am

అక్రమ ప్రాజెక్టుల అడ్డుకట్టకు పూర్తి మద్దతు: తెదేపా

మహారాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న బాబ్లీతో సహా 13 అక్రమ ప్రాజెక్టుల నిర్మాణాలను ఆపేందుకు ప్రభుత్వం తీసుకునే ఎలాంటి చర్యకైనా తమ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలు స్పష్టం చేశారు. శుక్రవారం ముఖ్యమంత్రి కె.రోశయ్య అధ్యక్షతన జరిగే అఖిలపక్ష సమావేశానికి తెదేపాకు చెందిన నలుగురు సభ్యుల బృందం గైర్హాజరైన విషయం తెల్సిందే.
Source: ఏపీ న్యూస్ | 23 Jul 2010 | 1:31 am

గుండెపోటుతో ముగ్గురు అమర్నాథ్ భక్తుల కన్నుమూత!

హిమ శివలింగ దర్శన యాత్రకు వెళ్లిన భక్తుల్లో ముగ్గురు భక్తులు గుండెపోటుతో మరణించినట్టు అమర్నాథ్ ఆలయ అధికారులు వెల్లడించారు. దక్షిణ కాశ్మీర్‌ హిమాలయాల్లో ప్రకృతి సహజసిద్ధంగా ఏర్పడిన అమర్నాథ్‌ ఆలయ మార్గ మధ్యంలో వీరు కన్నుమూశారు. మరణించిన వారిలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన 22 సంవత్సరాల ప్రదీప్ కుమార్ జైశ్వాల్ పహల్గామ్-అమర్నాథ్ మార్గంలోని షెషాంగ్ అనే ప్రాంతం వద్ద కన్నుమూసినట్టు చెప్పారు.
Source: జాతీయ | 23 Jul 2010 | 12:54 am

అక్రమ బాబ్లీపై ఆమరణ దీక్షకు చంద్రబాబు సన్నాహాలు!

బాబ్లీ అక్రమ ప్రాజెక్టు నిర్మాణానికి వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమంలో ఎట్టిపరిస్థితుల్లోనూ వెనక్కితగ్గరాదని ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. ఇందులోభాగంగా ఈనెల 26వ తేదీన ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ అధ్యక్షతన జరిగే అఖిలపక్ష సమావేశంలో స్పష్టమైన హామీ కోసం తెదేపా పట్టుపట్టనుంది.
Source: ఏపీ న్యూస్ | 23 Jul 2010 | 12:14 am

కూలిన మహానంది ముఖద్వారం: అధికారుల విచారణ!

దేశంలోని సుప్రసిద్ధ శైవక్షేత్రాల్లో ఒకటైన మహానంది క్షేత్రం ముఖద్వారం కుప్పకూలిపోయింది. తాజాగా చోటు చేసుకున్న ఈ సంఘటనతో ఆలయానికి పది లక్షల రూపాయల మేరకు ఆస్తినష్టం వాట్లినట్టు అధికారులు వెల్లడించారు. ఇదిలావుండగా, మహానంది ముఖద్వారం కూలిపోయిన ఘటనపై రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ మంత్రిత్వ శాఖ విచారణ చేపట్టింది.
Source: ఏపీ న్యూస్ | 23 Jul 2010 | 12:04 am

నేడు హస్తినకు వెళ్లనున్న ముఖ్యమంత్రి రోశయ్య!

ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య శుక్రవారం సాయంత్రం మరోమారు ఢిల్లీకి వెళ్లనున్నారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా ఈనెల 24వ తేదీన అక్కడ జరిగే జాతీయ అభివృద్ధి సలహా మండలి సమావేశంలో ఆయన పాల్గొంటారు.
Source: ఏపీ న్యూస్ | 22 Jul 2010 | 11:56 pm

డీఎస్‌ను గెలిపిస్తే సమైక్యవాది అవుతాడు: కేసీఆర్

తెలంగాణాలో జూలై 27న జరుగనున్న ఉపఎన్నికల నేపధ్యంలో నాయకులు పరస్పర ఆరోపణాస్త్రాలు సంధించుకుంటున్నారు. నిజామాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి డీఎస్‌ను గెలిపిస్తే ఆయన సమైక్యవాదిగా మారిపోవడం ఖాయమని తెలంగాణా రాష్ట్ర సమితి చీఫ్ కె. చంద్రశేఖర రావు జోస్యం చెప్పారు.
Source: ఏపీ న్యూస్ | 22 Jul 2010 | 11:42 pm

ఓబీసీ జాబితాలో మరిన్ని కులాల చేర్పు: కేంద్రం సమ్మతం!

ఓబీసీ రిజర్వేషన్ జాబితాలో మరికొన్ని కులాలను చేర్చేందుకు కేంద్ర ప్రభుత్వం గురువారం సమ్మతం తెలిపింది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం నక్సల్స్ బాధిత రాష్ట్రాల్లో నివశిస్తున్న ప్రజలకు మరింత ప్రయోజనం చేకూర్చుతుందని కేంద్ర వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ప్రధానంగా, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లోని పలు కులాలను ఈ జాబితాలోకి చేర్చనున్నట్టు కేంద్ర వర్గాలు తెలిపారు.
Source: జాతీయ | 22 Jul 2010 | 11:37 pm

బాబూ చిత్రాల్లో నటించు.. పైసలు వస్తాయ్: రాములమ్మ

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు తెలంగాణ రాష్ట్ర సమితి మహిళా నేత, మెదక్ ఎంపీ విజయశాంతి ఒక సూచన చేశారు. చంద్రబాబు ఆయన బృందం చిత్రాల్లో నటిస్తే రెండు చేతులా డబ్బులు అర్జించవచ్చన్నారు. అందువల్ల తెలుగు చిత్ర పరిశ్రమలో సభ్యులుగా చేరాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
Source: ఏపీ న్యూస్ | 22 Jul 2010 | 11:32 pm

రాత్రిపూట రైళ్ల పునరుద్ధరణపై త్వరలోనే నిర్ణయం: రైల్వే

జార్ఖండ్ వంటి నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాల్లో రాత్రిపూట ప్రయాణికుల రైళ్లను తిరిగి పునరుద్ధరించే అంశంపై రైల్వే శాఖ ఉన్నతాధికారులు త్వరలోనే సమావేశమై ఓ నిర్ణయం తీసుకుంటారని జార్ఖండ్ రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. మే 28వ తేదీన పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో జరిగిన జ్ఞానేశ్వరి ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం తర్వాత జార్ఖండ్ రాష్ట్రంలో రాత్రిపూట నడిచే ప్యాసింజర్ రైళ్లను రైల్వే శాఖ రద్దు చేసిన విషయం తెల్సిందే.
Source: జాతీయ | 22 Jul 2010 | 9:57 pm

మావోలపై చిదంబరం వైఖరి సరైంది కాదు: దిగ్విజయ్

మావోయిస్టుల అణిచివేతపై కేంద్ర హోం మంత్రి చిదంబరం అనుసరిస్తున్న వైఖరి సరైనది కాదని కాంగ్రెస్ పార్టీ ప్రధానకార్యదర్శి దిగ్విజయ్ సింగ్ మరోమారు పునరుద్ఘాటించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన ముమ్మాటికీ దుందుడుకు ధోరణితోనే వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
Source: జాతీయ | 22 Jul 2010 | 9:46 pm

అది నందమూరి స్టామినా అన్నారు ఎన్టీఆర్: సమంత

సహజ అందాల తార సమంత జూనియర్ ఎన్టీఆర్‌ సరసన 'బృందావనంలో నటిస్తోంది. ఎన్టీఆర్ నటనను చూసి అచ్చెరువొందాననీ, అతని డైలాగ్ డెలివరీ సూపర్‌గా ఉందని తెగ పొగుడుతోంది. "జూనియర్ ఎన్టీఆర్ తో డ్యాన్స్ చేయడమంటే మాటలు కాదు. ఆయన డాన్స్ అద్భుతంగా చేస్తున్నారు. ఆయన నటించిన 'ఆది', 'స్టూడెంట్ నెం1' యమదొంగ సినిమాలు చూశాను. అంత ఎనర్జీ ఎలా వస్తుందని అడిగాను.. చిరునవ్వుతో ఇది నందమూరి స్టామినా అన్నారు" అని నవ్వింది. ఆయనతో నటించడంవల్ల చాలా విషయాలు తెలుసుకున్నాను అని చెపుతున్న సమంతకు ఈ సినిమా చేయడం వల్ల మహేష్ బాబు,శ్రీను వైట్ల కాంబినేషన్‌లో అవకాశం వచ్చింది. మరి మహేష్ బాబును చూసి ఏం చెపుతుందో చూడాలి.
Source: Yahoo! Telugu: Entertainment | 22 Jul 2010 | 1:41 pm

ఇద్దరు భామలతో లవర్ బాయ్ సిద్ధార్థ్ "180"

సిద్ధార్థ్ ఇద్దరు భామలతో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి "180" అని పేరు పెట్టారు. నిత్య మీనన్, ప్రియా ఆనంద్ సిద్ధార్థ్ సరసన నటిస్తున్నారు. ఈ చిత్రం తమిళ, తెలుగు భాషల్లో రూపొందుతోంది. ఎస్పీఎల్ సినిమా ప్రైవేట్ లిమిటెడ్, అగల్ ఫిలిమ్స్ పతాకం సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సిద్ధార్థ్ గురువు యాడ్ ఫిలిమ్ మేకర్ జయేంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం గురించి సిద్ధార్థ్ మాట్లాడుతూ... "ఈ చిత్రం షూటింగ్ అమెరికాలో జరుగుతుంది. దర్శకుడు మా కుటుంబ స్నేహితుడు. చిన్నతనంలో అంటే... పదేళ్ల వయస్సులో నన్ను ఓ యాడ్ ఫిలిమ్‌కు డబ్బింగ్ చెప్పమన్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 22 Jul 2010 | 1:30 pm

కరాటె కిడ్ ట్రెయిలర్

కరాటె కిడ్ ట్రెయిలర్
Source: Yahoo! Telugu: Entertainment | 22 Jul 2010 | 1:25 pm

ఝుమ్మంది నాదం ట్రెయిలర్

ఝుమ్మంది నాదం ట్రెయిలర్
Source: Yahoo! Telugu: Entertainment | 22 Jul 2010 | 1:22 pm

"మర్యాద రామన్న"తో పవన్ కల్యాణ్ "కొమరం పులి" ట్రైలర్

సునీల్, రాజమౌళి ఆర్కా మీడియా వర్క్స్ పతాకంపై నిర్మించిన మర్యాద రామన్న 325 ప్రింట్లతో 400కు పైగా థియేటర్స్‌లో జూలై 23న విడుదలవుతున్న విషయం తెలిసిందే. కాగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా ఖుషి ఫేం ఎస్ జె. సూర్య దర్శకత్వంలో ప్రముఖ ఫైనాన్షియర్ శింగనమల రమేష్ బాబు నిర్మిస్తున్న కొమరం పులి చిత్రం థియేటర్ ట్రైలర్స్‌ని మర్యాద రామన్న చిత్రంతోపాటు పంపిస్తున్నారు. ఈ సందర్భంగా కొమరం పులి నిర్మాత శింగనమల రమేష్ మాట్లాడుతూ... మర్యాద రామన్న ప్రదర్శించే అన్ని థియేటర్లలో మా కొమరం పులి ట్రైలర్స్‌ను ప్రేక్షకులు, అభిమానులు చూడవచ్చు. కొమరం పులి ఆడియోకు మంచి స్పందన వచ్చిందన్నారు. థియేటర్ ట్రైలర్స్ కూడా మంచి రెస్పాన్స్ వస్తుందని అనుకుంటున్నామని చెప్పారు. అతి త్వరలో కొమరం పులిగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మీ ముందుకు వస్తారు అన్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 22 Jul 2010 | 10:25 am

రంజిత... అద్భుతమైన భక్తురాలు: నిత్యానంద

రంజితతో శృంగారంలో పాల్గొన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నిత్యానంద ఎట్టకేలకు సినీ నటి రంజిత విషయమై నోరు తెరిచాడు. రంజిత అత్యంత విశ్వాసపాత్రురాలైన అణుకువగల భక్తురాలని ఆమెను కొనియాడాడు.
Source: జాతీయ | 22 Jul 2010 | 9:46 am

ఇద్దరు భామలతో లవర్ బాయ్ సిద్ధార్థ్ "180"

సిద్ధార్థ్ ఇద్దరు భామలతో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి "180" అని పేరు పెట్టారు. నిత్య మీనన్, ప్రియా ఆనంద్ సిద్ధార్థ్ సరసన నటిస్తున్నారు. ఈ చిత్రం తమిళ, తెలుగు భాషల్లో రూపొందుతోంది. ఎస్పీఎల్ సినిమా ప్రైవేట్ లిమిటెడ్, అగల్ ఫిలిమ్స్ పతాకం సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సిద్ధార్థ్ గురువు యాడ్ ఫిలిమ్ మేకర్ జయేంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం గురించి సిద్ధార్థ్ మాట్లాడుతూ... "ఈ చిత్రం షూటింగ్ అమెరికాలో జరుగుతుంది. దర్శకుడు మా కుటుంబ స్నేహితుడు. చిన్నతనంలో అంటే... పదేళ్ల వయస్సులో నన్ను ఓ యాడ్ ఫిలిమ్‌కు డబ్బింగ్ చెప్పమన్నారు.
Source: వినోదం | 22 Jul 2010 | 8:00 am

కరాటె కిడ్ ట్రెయిలర్

కరాటె కిడ్ ట్రెయిలర్
Source: వినోదం | 22 Jul 2010 | 7:56 am

ఝుమ్మంది నాదం ట్రెయిలర్

ఝుమ్మంది నాదం ట్రెయిలర్
Source: వినోదం | 22 Jul 2010 | 7:54 am

నగ్నంగా కనపడింది నేను కాదు.. ఎవరో అమ్మాయి: కత్రినా

ఎవరో అమ్మాయికి నా ముఖాన్ని తగిలించి మార్ఫింగ్ ప్రక్రియ ద్వారా ఓ వెబ్‌సైట్ నగ్నంగా చూపించిందని కత్రినా కైఫ్ ఎగిరెగిరి పడుతోంది. పిచ్చి ఫోటోలను పెడుతున్న సదరు సైటుపై కేసు వేస్తానని హెచ్చరించింది. వివరాల్లోకి వెళితే... ఇటీవల ఓ వెబ్‌సైట్‌లో 'కత్రినా సెక్స్ స్కాండల్' పేరుతొ బ్లూఫిలిం వచ్చింది. అది చూసిన కత్రినా.. అందులో కనిపించింది తాను కాదని.. ఎవరో అమ్మాయిని మార్ఫింగ్ చేశారని చెప్పింది. వెంటనే దాన్ని తీసేయాలని వార్నింగ్ ఇచ్చింది.. లేదంటే కేసుపెడతానని అంది. పాపులారిటీ కోసం ఇంత నీచానికి దిగుతారా అని సదరు వెబ్‌సైట్‌ను నిలదీస్తుంది. ఇలాంటి రాతలు రాసేవారిని కఠినంగా శిక్షించాలని కోరింది.
Source: Yahoo! Telugu: Entertainment | 22 Jul 2010 | 7:26 am

అవినీతి మంత్రులను తప్పించాల్సిందే: రాయపాటి డిమాండ్

రాష్ట్ర మంత్రివర్గంలోని అవినీతి మంత్రులను కేబినెట్ నుంచి తప్పించాల్సిందేనని గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు మరోమారు డిమాండ్ చేశారు. రాష్ట్ర మంత్రివర్గంలో చాలా మంది మధుకోడాలు ఉన్నారంటూ గతంలో వ్యాఖ్యలు చేసి సంచలనం సృష్టించిన విషయం తెల్సిందే.
Source: ఏపీ న్యూస్ | 22 Jul 2010 | 7:00 am

జూలై నెలాఖరున వస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా

వైశాలి ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రవీందర్ దర్శకత్వంలో తుమ్మ రవీందర్, మహ్మద్ సలీమ్ నిర్మిస్తున్న వినోదాత్మక ప్రేమకథా చిత్రం "జయమ్ము నిశ్చయమ్మురా". గోపాల్, సాత్విక్, సుచరిత నాయకానాయికలుగా కృష్ణభగవాన్, కొండవలస, వహీదా, దువ్వాసి, మధుమణి, చిట్టిబాబు, అనంత్ ఇతర ముఖ్య పాత్రల్ని పోషించిన ఈ చిత్రం ఇటీవలే సెన్సార్ పూర్తి చేసుకుంది.
Source: Yahoo! Telugu: Entertainment | 22 Jul 2010 | 6:19 am

"మర్యాద రామన్న"తో పవన్ కల్యాణ్ "కొమరం పులి" ట్రైలర్

సునీల్, రాజమౌళి ఆర్కా మీడియా వర్క్స్ పతాకంపై నిర్మించిన మర్యాద రామన్న 325 ప్రింట్లతో 400కు పైగా థియేటర్స్‌లో జూలై 23న విడుదలవుతున్న విషయం తెలిసిందే. కాగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా ఖుషి ఫేం ఎస్ జె. సూర్య దర్శకత్వంలో ప్రముఖ ఫైనాన్షియర్ శింగనమల రమేష్ బాబు నిర్మిస్తున్న కొమరం పులి చిత్రం థియేటర్ ట్రైలర్స్‌ని మర్యాద రామన్న చిత్రంతోపాటు పంపిస్తున్నారు. ఈ సందర్భంగా కొమరం పులి నిర్మాత శింగనమల రమేష్ మాట్లాడుతూ... మర్యాద రామన్న ప్రదర్శించే అన్ని థియేటర్లలో మా కొమరం పులి ట్రైలర్స్‌ను ప్రేక్షకులు, అభిమానులు చూడవచ్చు. కొమరం పులి ఆడియోకు మంచి స్పందన వచ్చిందన్నారు. థియేటర్ ట్రైలర్స్ కూడా మంచి రెస్పాన్స్ వస్తుందని అనుకుంటున్నామని చెప్పారు. అతి త్వరలో కొమరం పులిగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మీ ముందుకు వస్తారు అన్నారు.
Source: వినోదం | 22 Jul 2010 | 4:56 am

సొహ్రాబుద్దీన్ ఎన్‌కౌంటర్: గుజరాత్ హోంమంత్రికి సమన్లు

సొహ్రాబుద్దీన్ షేక్ నకిలీ ఎన్‌కౌంటర్ కేసులో గుజరాత్ హోంమంత్రి అమిత్ షాకు కేంద్ర నేర పరిశోధక దర్యాప్తు సంస్థ గురువారం సమన్లు జారీ చేసింది. తమ ఎదుట తక్షణం హాజరుకావాలని సీబీఐ తమ సమన్లలో పేర్కొంది. గాంధీనగర్‌లోని సీబీఐ కార్యాలయంలో హాజరై రిపోర్టు చేయాలని కోరింది. కాగా, గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి అత్యంత సన్నిహితుడిగా షా పేరుంది.
Source: జాతీయ | 22 Jul 2010 | 4:49 am

12 మంది ఎల్జేపీ శాసనసభ్యుల మూకుమ్మడి రాజీనామా!

బీహార్ రాష్ట్ర శాసనసభ సభ్యత్వానికి కేంద్ర మాజీ మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ నేతృత్వంలోని లోక్‌జనశక్తి పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలు గురువారం మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు. ఈ మేరకు తమ రాజీనామా లేఖలను పార్టీ జాతీయ అధ్యక్షుడికి గురువారం అందజేశారు.
Source: జాతీయ | 22 Jul 2010 | 2:23 am