శబరి-టీకేఎన్ ఎకో ఫార్మ్ ఆధ్వర్యంలో వెడ్డింగ్ మేనేజ్మెంట్

హోటల్ ఆతిథ్య రంగంలో ఒకటిగా గుర్తింపు పొందిన శబరి గ్రూపు, టీకేఎన్ ఎకో ఫార్మ్ సంస్థలు సంయుక్తంగా వెడ్డింగ్ ప్లానర్ కమ్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్‌ను తాజాగా ప్రారంభించాయి. ఈ మేరకు ఈ రెండు సంస్థల మధ్య ఒక ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం మేరకు.. శబరి ఎకో రిసార్ట్స్ అండ్ హాస్పిటాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఒక సంస్థను ఏర్పాటు చేశారు. ఈ సంస్థ ఆధ్వర్యంలో వెడ్డింగ్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్ సేవలను అందించనున్నట్టు చెప్పారు. దీనికి "పలన్‌క్వీన్" అనే నామకరణం చేశారు.
Source: Yahoo! Telugu: News | 22 Jul 2010 | 9:35 am

స్వల్పంగా తగ్గిన వార్షిక ఆహార ద్రవ్యోల్బణం

వార్షిక ఆహార ద్రవ్యోల్బణం స్వల్పంగా తగ్గి 12.47శాతానికి చేరుకుంది. జూన్ 10తో ముగిన వారానికి గానూ ఇది 12.81శాతంగా నమోదైంది. దీంతో కూరగాయల ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. ముఖ్యంగా బంగాలదుంపలు, ఉల్లిపాయల ధరలు బాగా తగ్గాయి. ఇయర్లీ బేసిస్ ప్రకారం బంగాలదుంపల ధరలు 45శాతానికి తగ్గగా, ఉల్లిపాయలు దాదాపు 8శాతానికి తగ్గి, మొత్తంమీద కూరగాయల ధరలు 9.92శాతానికి తగ్గాయి.
Source: Yahoo! Telugu: News | 22 Jul 2010 | 9:08 am

స్టాక్ మార్కెట్: 18వేల మార్కును తాకిన సెన్సెక్స్!

బాంబే స్టాక్ ఎక్చేంజ్ సెన్సెక్స్ గురువారం 18వేల మార్కును తాకింది. గురువారం ట్రేడింగ్ ప్రారంభం నుంచి తిరోగమనం వైపు ర్యాలీని కొనసాగించిన బాంబే స్టాక్ మార్కెట్, తిరిగి లాభాలను ఆర్జించింది. ఫలితంగా మధ్యాహ్నం 2.45 గంటల ప్రాంతంలో బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచి సెన్సెక్స్, 102 పాయింట్లు లాభపడి, 18,080 పాయింట్ల మార్కును తాకింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచి నిఫ్టీ కూడా 25 పాయింట్ల వృద్ధితో 5,424 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది.
Source: Yahoo! Telugu: News | 22 Jul 2010 | 8:59 am

దాడి జరిగితే దౌత్య సంబంధాలకు విఘాతం: హిల్లరీ

తమ దేశంలో చిన్నపాటి దాడి జరిగినా పాకిస్థాన్-అమెరికా దేశాల మధ్య ఉన్న దౌత్య సంబంధాలకు విఘాతం కలుగుతుందని అమెరికా విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ అభిప్రాయపడ్డారు. అందువల్ల తీవ్రవాద నిర్మూలనకు మరిన్ని చర్యలు తీసుకోవాలని ఆమె పాకిస్థాన్‌ పాలకులకు హితవు పలికారు.
Source: Yahoo! Telugu: News | 22 Jul 2010 | 8:09 am

ట్రేడింగ్ క్షీణత: నష్టాల్లో బాంబే స్టాక్ మార్కెట్

దేశీయ వాటాల ట్రేడింగ్ క్షీణించడం ద్వారా బాంబే స్టాక్ మార్కెట్ నష్టాల్లో కూరుకుపోయింది. ట్రేడింగ్ ప్రారంభం నుంచే తిరోగమనం వైపు ర్యాలీని కొనసాగించిన బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచి సెన్సెక్స్, మధ్యాహ్నం 1.45 గంటల ప్రాంతంలో 15 పాయింట్ల నష్టంతో 17,962 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచి నిఫ్టీ కూడా కేవలం రెండు పాయింట్లు పతనమై, 5,397 పాయింట్ల మార్కును తాకింది.
Source: Yahoo! Telugu: News | 22 Jul 2010 | 7:57 am

12 మంది ఎల్జేపీ శాసనసభ్యుల మూకుమ్మడి రాజీనామా!

బీహార్ రాష్ట్ర శాసనసభ సభ్యత్వానికి కేంద్ర మాజీ మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ నేతృత్వంలోని లోక్‌జనశక్తి పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలు గురువారం మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు. ఈ మేరకు తమ రాజీనామా లేఖలను పార్టీ జాతీయ అధ్యక్షుడికి గురువారం అందజేశారు.
Source: Yahoo! Telugu: News | 22 Jul 2010 | 7:52 am

స్వల్ప లాభాల్లో బాంబే స్టాక్ మార్కెట్ ర్యాలీ!

బాంబే స్టాక్ మార్కెట్ గురువారం తిరోగమనం వైపు ర్యాలీని కొనసాగిస్తోంది. అంతర్జాతీయ స్టాక్ మార్కెట్ల ప్రభావంతో బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచి సెన్సెక్స్, మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో 18 పాయింట్ల స్వల్ప నష్టంతో 17,958 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచి నిఫ్టీ కూడా కేవలం ఒక్క పాయింట్ నష్టంతో 5,397 పాయిట్ల వద్ద కొనసాగుతోంది.
Source: Yahoo! Telugu: News | 22 Jul 2010 | 7:45 am

ఛత్తీస్‌ఘడ్‌ రాష్ట్రంలో 18 మంది మావోయిస్టులు అరెస్టు!

ఛత్తీస్‌ఘర్‌లో 18 మంది మావోయిస్టులు అరెస్టయ్యారు. ఛత్తీస్‌ఘర్‌లో గాలింపు చర్యలు చేపట్టిన పోలీసు బలగాలు 18 మంది మావోయిస్టులను చుట్టుముట్టి అరెస్టు చేశారు. ఛత్తీస్‌ఘర్‌, బీజాపూర్ జిల్లా, అటవీ ప్రాంతంలో మావోయిస్టుల తలదాచుకున్నట్లు నిఘా సంస్థల నుంచి సమాచారం అందింది.
Source: Yahoo! Telugu: News | 22 Jul 2010 | 7:29 am

నగ్నంగా కనపడింది నేను కాదు.. ఎవరో అమ్మాయి: కత్రినా

ఎవరో అమ్మాయికి నా ముఖాన్ని తగిలించి మార్ఫింగ్ ప్రక్రియ ద్వారా ఓ వెబ్‌సైట్ నగ్నంగా చూపించిందని కత్రినా కైఫ్ ఎగిరెగిరి పడుతోంది. పిచ్చి ఫోటోలను పెడుతున్న సదరు సైటుపై కేసు వేస్తానని హెచ్చరించింది. వివరాల్లోకి వెళితే... ఇటీవల ఓ వెబ్‌సైట్‌లో 'కత్రినా సెక్స్ స్కాండల్' పేరుతొ బ్లూఫిలిం వచ్చింది. అది చూసిన కత్రినా.. అందులో కనిపించింది తాను కాదని.. ఎవరో అమ్మాయిని మార్ఫింగ్ చేశారని చెప్పింది. వెంటనే దాన్ని తీసేయాలని వార్నింగ్ ఇచ్చింది.. లేదంటే కేసుపెడతానని అంది. పాపులారిటీ కోసం ఇంత నీచానికి దిగుతారా అని సదరు వెబ్‌సైట్‌ను నిలదీస్తుంది. ఇలాంటి రాతలు రాసేవారిని కఠినంగా శిక్షించాలని కోరింది.
Source: Yahoo! Telugu: Entertainment | 22 Jul 2010 | 7:26 am

నష్టాల్లో స్టాక్ మార్కెట్: పతనమైన సెన్సెక్స్, నిఫ్టీ!

దేశీయ వాటాల ట్రేడింగ్ క్షీణించడంతో బాంబే స్టాక్ మార్కెట్ నష్టాల్లో కూరుకుపోయింది. గురువారం ట్రేడింగ్ ప్రారంభం నుంచే తిరోగమనం వైపు కొనసాగుతున్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచి సెన్సెక్స్, మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో 53 పాయింట్లు పతనమై 17,923 పాయింట్ల మార్కును తాకింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచి నిఫ్టీ కూడా 13 పాయింట్ల స్వల్ప నష్టంతో 5,386 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.
Source: Yahoo! Telugu: News | 22 Jul 2010 | 7:15 am

నష్టాల్లో స్టాక్ మార్కెట్: సెన్సెక్స్, నిఫ్టీల పతనం!

బాంబే స్టాక్ మార్కెట్ నష్టాల్లో కూరుకుపోయింది. ట్రేడింగ్ ప్రారంభం నుంచి తిరోగమనం వైపు ర్యాలీని కొనసాగిస్తున్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచి సెన్సెక్స్, ఉదయం 10.30 గంటల ప్రాంతంలో 80 పాయింట్ల నష్టంతో 17,896 పాయింట్ల మార్కును తాకింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచి నిఫ్టీ కూడా 21 పాయింట్లు పతనమై, 5,378 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.
Source: Yahoo! Telugu: News | 22 Jul 2010 | 7:08 am

జూలై నెలాఖరున వస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా

వైశాలి ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రవీందర్ దర్శకత్వంలో తుమ్మ రవీందర్, మహ్మద్ సలీమ్ నిర్మిస్తున్న వినోదాత్మక ప్రేమకథా చిత్రం "జయమ్ము నిశ్చయమ్మురా". గోపాల్, సాత్విక్, సుచరిత నాయకానాయికలుగా కృష్ణభగవాన్, కొండవలస, వహీదా, దువ్వాసి, మధుమణి, చిట్టిబాబు, అనంత్ ఇతర ముఖ్య పాత్రల్ని పోషించిన ఈ చిత్రం ఇటీవలే సెన్సార్ పూర్తి చేసుకుంది.
Source: Yahoo! Telugu: Entertainment | 22 Jul 2010 | 6:19 am

12 మంది ఎల్జేపీ శాసనసభ్యుల మూకుమ్మడి రాజీనామా!

బీహార్ రాష్ట్ర శాసనసభ సభ్యత్వానికి కేంద్ర మాజీ మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ నేతృత్వంలోని లోక్‌జనశక్తి పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలు గురువారం మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు. ఈ మేరకు తమ రాజీనామా లేఖలను పార్టీ జాతీయ అధ్యక్షుడికి గురువారం అందజేశారు.
Source: జాతీయ | 22 Jul 2010 | 2:23 am

ఛత్తీస్‌ఘడ్‌ రాష్ట్రంలో 18 మంది మావోయిస్టులు అరెస్టు!

ఛత్తీస్‌ఘర్‌లో 18 మంది మావోయిస్టులు అరెస్టయ్యారు. ఛత్తీస్‌ఘర్‌లో గాలింపు చర్యలు చేపట్టిన పోలీసు బలగాలు 18 మంది మావోయిస్టులను చుట్టుముట్టి అరెస్టు చేశారు. ఛత్తీస్‌ఘర్‌, బీజాపూర్ జిల్లా, అటవీ ప్రాంతంలో మావోయిస్టుల తలదాచుకున్నట్లు నిఘా సంస్థల నుంచి సమాచారం అందింది.
Source: జాతీయ | 22 Jul 2010 | 2:02 am

శివసేనే కాదు... వారి తాత వచ్చినా తరుముతాం: యాష్కీ

తమ ఉనికిని కాపాడుకునేందుకు తెలుగుదేశం - శివసేన రెండూ పార్టీలు కుమ్మక్కై ఇటువంటి నాటకాలు ఆడుతున్నారని నిజామాబాద్ ఎంపీ మధు యాష్కీ అన్నారు. సాలూరు ఎత్తిపోతల పథకాన్ని కూలగొడతామంటూ శివసేన సమాయత్తమవడం ద్వారా ఆ రాష్ట్రంలో తమ స్వార్థానికి ఉపయోగించుకోవాలని చూస్తున్నాయని దుయ్యబట్టారు.
Source: ఏపీ న్యూస్ | 22 Jul 2010 | 1:25 am

విద్యార్థినిపై అత్యాచారం: అదుపులోకి కీచక ప్రిన్సిపల్!

విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడిన ఓ కీచక ప్రిన్సిపల్‌ను సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత ఏడాది కాలంగా రంగారెడ్డి జిల్లా మన్నెగూడలోని పార్క్‌వుడ్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రిన్స్‌పల్ సలావుద్ధీన్ అయిబ్ ఓ విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డాడు.రివాల్వర్‌తో విద్యార్థినులను భయపెట్టి వారిపై అఘాయిత్యానికి పాల్పడేవాడు. ఈ విషయాన్ని బాధితురాలు తల్లిదండ్రులు సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Source: ఏపీ న్యూస్ | 22 Jul 2010 | 1:23 am

తెదేపాకు బొచ్చె చేతికిచ్చి చిప్ప కూడు పెట్టాల్సింది: థాక్రే

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై శివసేన అధినేత బాల్‌థ్రాకే తీవ్రంగా విరుచుకుపడ్డారు. బాబ్లీ పరిశీలనకు వచ్చిన తెలుగుదేశం బృందానికి మర్యాద చాలదని థాక్రే అన్నారు. తెదేపా బృందానికి ఖైదీ దుస్తులు వేసి, చిప్పకూడు పెట్టి, బొచ్చె చేతికి ఇచ్చి ఉండాల్సిందని బాల్‌థ్రాకే తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బాబ్లీ ప్రాజెక్టును చూస్తామని మహారాష్ట్రలో కాలు పెట్టేందుకు తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు ఎంత ధైర్యం? అని థాక్రే హూంకరించారు.
Source: జాతీయ | 22 Jul 2010 | 12:33 am

శ్రావణ మాసంలో అమీతుమీకి జగన్ అస్త్రశస్త్రాలు!

శ్రావణమాసంలో (ఆగస్టు నెల) ముఖ్యమంత్రి కె.రోశయ్య, కాంగ్రెస్ అధిష్టానంతో అమీతుమీ తేల్చుకునేందుకు కడప ఎంపీ వైఎస్.జగన్మోహన్ రెడ్డి అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నారు. ప్రభుత్వంపై ఎన్నో రకాలుగా విమర్శలు గుప్పించిన వారిపై ఎలాంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోని అధిష్టానం.. తన వర్గానికి చెందిన పీసీసీ కార్యదర్శి అంబటి రాంబాబుపై చర్య తీసుకోవడాన్ని జగన్ వర్గం ఏమాత్రం జీర్ణించుకోలేక పోతోంది.
Source: ఏపీ న్యూస్ | 22 Jul 2010 | 12:26 am

రాష్ట్ర భూభాగంలోనే సాలూర ఎత్తిపోతల పథకం: పొన్నాల

నిజామాబాద్ జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న సాలూర ఎత్తిపోతల పథకాన్ని ఆంధ్రప్రదేశ్ భూభాగంలోనే నిర్మిస్తున్నట్టు రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖామంత్రి పొన్నాల లక్ష్మయ్య స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టును చేపట్టే ముందు మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చించిన తర్వాతే చేపట్టామని ఆయన వివరణ ఇచ్చారు.
Source: ఏపీ న్యూస్ | 21 Jul 2010 | 11:09 pm

సాలూర ఎత్తిపోతల పథకంపై శివసేన పాదయాత్ర!

నిజామాబాద్ జిల్లా సాలూరలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సాలూర ఎత్తిపోతల పథకానికి వ్యతిరేకంగా శివసేన పార్టీ పాదయాత్ర చేపట్టింది. మహారాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా చేపడుతున్న బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెల్సిందే.
Source: ఏపీ న్యూస్ | 21 Jul 2010 | 10:37 pm

భారత్-పాక్ చర్చలపై పిళ్లై వ్యాఖ్యల ప్రభావం: ఎస్ఎం.కృష్ణ

పాకిస్థాన్‌ను ఉద్దేశించి కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోపాలకృష్ణ పిళ్లై చేసిన వ్యాఖ్యలు ఇటీవల భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య జరిగిన చర్చలపై ప్రభావం చూపాయని కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్.ఎం.కృష్ణ అన్నారు. ఈ వ్యాఖ్యల పట్ల మంత్రి కృష్ణ అసహనం వ్యక్తం చేశారు.
Source: జాతీయ | 21 Jul 2010 | 10:14 pm

రైలు ప్రమాదాల వెనుక సీపీఎం కార్యకర్తల హస్తం: మమతా

పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో జరుగుతున్న వరుస రైలు ప్రమాదాల వెనుక అధికార సీపీఎం కార్యకర్తల హస్తం ఉండివుండచ్చని కేంద్ర రైల్వే శాఖామంత్రి మమతా బెనర్జీ సందేహం వ్యక్తం చేశారు. ఇదే అంశంపై పూర్తి స్థాయిలో, అన్నికోణాల్లో దర్యాప్తు సాగిస్తున్నట్టు ఆమె తెలిపారు.
Source: జాతీయ | 21 Jul 2010 | 9:51 pm

"ఆప్తమిత్ర" సీక్వెల్: వెంకీ షూటింగ్ వాయిదా ఎందుకంటే...?

సినిమాల్లో సెంటిమెంట్ బాగా నమ్ముతారు. ఇందుకు చాలా ఉదాహరణలున్నాయి. పి. వాసు దర్శకత్వంలో చంద్రముఖి రూపొందింది. కన్నడంలో 'ఆప్తమిత్ర' సీక్వెల్‌గా తీస్తుంటే హీరో విష్ణువర్థన్ చనిపోయాడు. దాంతో సీక్వెల్స్ రజనీకాంత్ చేయలేదు.అయితే తెలుగులో వెంకటేష్ చేస్తున్నాడు. షూటింగ్ 40% అయింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం బుధవారం నానక్‌రామ్‌గూడలో షూటింగ్ జరుగుతుండగా యూనిట్ సభ్యుడు చనిపోయాడు. దీంతొ షాక్‌కు గురయ్యారు. వెంకటేష్ షూటింగ్‌ను కాన్సిల్ చేశాడు. డ్రైవర్స్ యూనియన్ అధ్యక్షుడు బాలరాజ్ చనిపోయాడు. దీంతో యూనిట్‌కు సెంటిమెంట్ గుర్తుకు వచ్చింది. భవిష్యత్‌లో ఇంకా ఏమి జరుగుతుందోనని నిర్మాతలు కంగారుపడుతున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 21 Jul 2010 | 11:41 am

ఓనామాలు ఆయన వద్దే నేర్చుకున్నాను: వరుణ్ సందేశ్

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన 'హ్యాపీడేస్‌' చిత్రం హీరోల్లో ఒకడిగా నటించిన వరుణ్‌ సందేశ్‌ తాజాగా 'హ్యాపీ హ్యాపీ'గా చిత్రంతో ముందుకు వస్తున్నాడు. ప్రియశరణ్‌ దర్శకత్వంలో దుర్గాప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం విడుదలకు ముస్తాబవుతోంది. వరుణ్‌ సందేశ్‌‌కు నేడే పుట్టినరోజు (21వతేదీ-బుధవారం). ఈ సందర్భంగా ఆయనతో వెబ్‌దునియా తెలుగు జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు మీ కోసం.. ప్రశ్న: ఇది మీకు ఎన్నో పుట్టినరోజు..?జ : సినిమారంగానికి వచ్చాక ఇది నాలుగో పుట్టినరోజు. ఈ నాలుగేళ్ళు హ్యాపీగా సాగింది. నా 18వ పుట్టినరోజును 'హ్యాపీడేస్‌' సెట్‌లో చేశారు. ప్రశ్న: ఇండస్ట్రీలోకి ఎలా వచ్చారు? జ: నా తండ్రి పార్థసారథిగారు నటుడు. ఆయన కొన్ని సినిమాల్లో నటించారు. నేను ఇంజనీరింగ్‌ చేశాను. యు.ఎస్‌.లో ఉండేవాడిని. ఒకరోజు అనుకోకుండా నెట్‌లో హ్యాపీడేస్‌ గురించి కొత్తవారు కావాలనే ప్రకటన చూశాను. ఏదో సరదాగా మా నాన్నగారు అప్లై చేయించారు. వెంటనే ఆడిషన్‌ జరగడం. శేఖర్‌కమ్ముల ఓకే అనడం జరిగిపోయాయి. నిజంగా నటన ఎలా ఉంటుంది. నటనా పరంగా ఓనామాలు ఆయన వద్దే నేర్చుకున్నాను.
Source: Yahoo! Telugu: Entertainment | 21 Jul 2010 | 10:09 am

చవాన్.. బాబ్లీని చూస్తాం... చొరవ చూపండి: చిరంజీవి విజ్ఞప్తి

మహారాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ చవాన్‌కు ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి లేఖ రాశారు. దేశంలో ఏ రాష్ట్రానికి చెందిన ప్రజాప్రతినిధులనైనా గౌరవించుకోకపోతే జాతీయ సమగ్రతకు భంగం కలుగుతుందని ఆ లేఖలో సూచించారు.
Source: ఏపీ న్యూస్ | 21 Jul 2010 | 9:23 am

సిరిసిల్ల - వేములవాడపై సుప్రీంలో ఈసీ సవాల్

తెలంగాణాలో ఉపఎన్నికలు మరో వారం రోజుల్లో జరుగనుండగా సిరిసిల్ల, వేములవాడ అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరపాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాన్ని సవాల్ చేస్తూ బుధవారం కేంద్ర ఎన్నికల సంఘం సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. దీనిపై గురువారం తీర్పు వెలువడే అవకాశం ఉన్నది.
Source: ఏపీ న్యూస్ | 21 Jul 2010 | 9:08 am

బీహార్‌లో 67 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలు సస్పెండ్!

బీహార్ అసెంబ్లీలో రణరంగం సృష్టించిన 67 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ఆ రాష్ట్ర శాసనసభ సభాపతి సస్పెండ్ చేశారు. బుధవారం జరిగిన సమావేశాల్లో భాగంగా ప్రతిపక్ష పార్టీలకు చెందిన సభ్యులు దురుసుగా, అసభ్యంగా నడుచుకోవడంతో పాటు సభాపతిపై చెప్పులు విసిరి వేశారు. దీంతో ఆగ్రహించిన స్పీకర్ విపక్ష సభ్యులను మూకుమ్మడిగా సస్పెండ్ చేశారు.
Source: జాతీయ | 21 Jul 2010 | 8:51 am

ముఖ్యమంత్రి రోశయ్యకు సిగ్గూశరం ఉందా: బాబు ప్రశ్న!

ముఖ్యమంత్రి రోశయ్యకు ఏమాత్రం సిగ్గూశరం ఉందా అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. రాష్ట్ర జలదోపిడీ యధేచ్చగా జరుగుతుంటే ఈ ముఖ్యమంత్రి మాత్రం తమ పదవులను కాపాడుకునేందుకు హైకమాండ్ వద్ద మోకారిల్లుతున్నారని ఆయన ఆరోపించారు.
Source: ఏపీ న్యూస్ | 21 Jul 2010 | 8:12 am

తెదేపా హయాంలోనే బాబ్లీకి టెండర్లు: సీఎం రోశయ్య

తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలోనే బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణానికి టెండర్లను మహారాష్ట్ర సర్కారు ఆహ్వానించిందని ముఖ్యమంత్రి కె.రోశయ్య ఆరోపించారు. ఆరంభంలో కిమ్మనకుండా ఉండిన చంద్రబాబు.. ఇప్పుడు రాద్ధాంతం చేయడం సరికాదన్నారు. ప్రారంభంలోనే బాబ్లీ నిర్మాణాన్ని అడ్డుకునేందుకు చర్యలు తీసుకుని ఉండివుంటే రాష్ట్రానికి ఇంత నష్టం జరిగి ఉండేది కాదన్నారు.
Source: ఏపీ న్యూస్ | 21 Jul 2010 | 8:10 am

బాబు-బాల్‌థాక్రేలు కుమ్మక్కయ్యారు: హనుమంతరావు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, శివసేన చీఫ్ బాల్‌థాక్రేల మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు ఆరోపించారు. తెలంగాణలో జరుగనున్న ఉప ఎన్నికల కోసం ప్రచారం చేస్తున్నారు.
Source: ఏపీ న్యూస్ | 21 Jul 2010 | 8:09 am

ఓనామాలు ఆయన వద్దే నేర్చుకున్నాను: వరుణ్ సందేశ్

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన 'హ్యాపీడేస్‌' చిత్రం హీరోల్లో ఒకడిగా నటించిన వరుణ్‌ సందేశ్‌ తాజాగా 'హ్యాపీ హ్యాపీ'గా చిత్రంతో ముందుకు వస్తున్నాడు. ప్రియశరణ్‌ దర్శకత్వంలో దుర్గాప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం విడుదలకు ముస్తాబవుతోంది. వరుణ్‌ సందేశ్‌‌కు నేడే పుట్టినరోజు (21వతేదీ-బుధవారం). ఈ సందర్భంగా ఆయనతో వెబ్‌దునియా తెలుగు జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు మీ కోసం.. ప్రశ్న: ఇది మీకు ఎన్నో పుట్టినరోజు..?జ : సినిమారంగానికి వచ్చాక ఇది నాలుగో పుట్టినరోజు. ఈ నాలుగేళ్ళు హ్యాపీగా సాగింది. నా 18వ పుట్టినరోజును 'హ్యాపీడేస్‌' సెట్‌లో చేశారు. ప్రశ్న: ఇండస్ట్రీలోకి ఎలా వచ్చారు? జ: నా తండ్రి పార్థసారథిగారు నటుడు. ఆయన కొన్ని సినిమాల్లో నటించారు. నేను ఇంజనీరింగ్‌ చేశాను. యు.ఎస్‌.లో ఉండేవాడిని. ఒకరోజు అనుకోకుండా నెట్‌లో హ్యాపీడేస్‌ గురించి కొత్తవారు కావాలనే ప్రకటన చూశాను. ఏదో సరదాగా మా నాన్నగారు అప్లై చేయించారు. వెంటనే ఆడిషన్‌ జరగడం. శేఖర్‌కమ్ముల ఓకే అనడం జరిగిపోయాయి. నిజంగా నటన ఎలా ఉంటుంది. నటనా పరంగా ఓనామాలు ఆయన వద్దే నేర్చుకున్నాను.
Source: వినోదం | 21 Jul 2010 | 6:19 am

"ఆప్తమిత్ర" సీక్వెల్: వెంకీ షూటింగ్ వాయిదా ఎందుకంటే...?

సినిమాల్లో సెంటిమెంట్ బాగా నమ్ముతారు. ఇందుకు చాలా ఉదాహరణలున్నాయి. పి. వాసు దర్శకత్వంలో చంద్రముఖి రూపొందింది. కన్నడంలో 'ఆప్తమిత్ర' సీక్వెల్‌గా తీస్తుంటే హీరో విష్ణువర్థన్ చనిపోయాడు. దాంతో సీక్వెల్స్ రజనీకాంత్ చేయలేదు.అయితే తెలుగులో వెంకటేష్ చేస్తున్నాడు. షూటింగ్ 40% అయింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం బుధవారం నానక్‌రామ్‌గూడలో షూటింగ్ జరుగుతుండగా యూనిట్ సభ్యుడు చనిపోయాడు. దీంతొ షాక్‌కు గురయ్యారు. వెంకటేష్ షూటింగ్‌ను కాన్సిల్ చేశాడు. డ్రైవర్స్ యూనియన్ అధ్యక్షుడు బాలరాజ్ చనిపోయాడు. దీంతో యూనిట్‌కు సెంటిమెంట్ గుర్తుకు వచ్చింది. భవిష్యత్‌లో ఇంకా ఏమి జరుగుతుందోనని నిర్మాతలు కంగారుపడుతున్నారు.
Source: వినోదం | 21 Jul 2010 | 6:12 am

దేవీశ్రీ ప్రొడక్షన్స్ వారి "బాబాల భాగోతం"

నిత్యానంద స్వామి, మరో స్వామి ఇలా కొందరి జీవితాలను తీసుకుని దేవిశ్రీ ప్రొడక్షన్స్‌ అనే నిర్మాణ సంస్థ 'బాబాల భాగోతం' చిత్రాన్ని నిర్మిస్తోంది. సీనియర్‌ దర్శకుడు పి. చంద్రశేఖర్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఎస్‌.దేవదానం నిర్మాత. భరత్‌బాబు, శఫాలీ శర్మ హీరోహీరోయిన్లుగా పరిచయమవుతున్న ఈ చిత్రం షూటింగ్‌ మంగళవారంనాడు జూబ్లీహిల్స్‌లోని మాదాలరవి హౌస్‌లో ప్రారంభమైంది. డైరెక్టర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు సాగర్‌ ఆహ్వానితులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజంలో నకిలీబాబాల వలలో ప్రజలు పడకూడదనే సందేశంతో ఈ చిత్రం రూపొందుతుందని తెలిసింది. మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను అన్నారు
Source: Yahoo! Telugu: Entertainment | 21 Jul 2010 | 6:07 am

జూలై 23న యాక్షన్ థ్రిల్లర్ 'సాల్ట్‌'

ఏంజెలినా జోలీ ప్రధాన పాత్రలో సోనీ పిక్చర్స్‌ సమర్పణలో యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రం 'సాల్ట్‌' రూపొందింది. ఇది ప్రపంచవ్యాప్తంగా 23న విడుదలకానుంది. ఈ విషయాన్ని సోనీ మార్కెటింగ్‌ మేనేజర్‌ అబుకుమార్‌ సింగ్‌ మీడియాకు తెలియజేశారు. ఈ చిత్ర దర్శకుడు ఫిలిప్‌‌నోస్‌ గతంలో రాబిట్‌ ఫ్రూఫ్‌ఫెన్స్‌, క్యాబ్‌ ఎఫైర్‌ చిత్రాలు చేశాడు. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ఈ చిత్రం విడుదలవుతుందని అన్నారు. రష్యాకుచెందిన గూఢఛారిణిగా ఏంజిలినా నటిస్తోంది. ఈ చిత్రానికి జేమ్స్‌ న్యూటన్‌ హౌవార్డ్‌ సంగీతం సమకూర్చారు.
Source: Yahoo! Telugu: Entertainment | 21 Jul 2010 | 5:48 am

బీహార్ అసెంబ్లీలో రణరంగం: సభాపతిపైకి చెప్పులు!

బీహార్ అసెంబ్లీ రణరంగాన్ని తలపించింది. రాష్ట్రంలో భారీగా ఆర్థిక అవకతవకలు జరిగాయంటూ కంప్ట్రోలర్ ఆఫ్ ఆడిట్ (కాగ్) ఇచ్చిన నివేదికపై సాగిన చర్చ సందర్భంగా ఈ పరిస్థితి చోటు చేసుకుంది. దీంతో నిగ్రహం కోల్పోయిన రాష్ట్రీయ జనతాదళ్ సభ్యులు సభాపతిపై చెప్పులు విసిరి వేశారు.
Source: జాతీయ | 21 Jul 2010 | 4:31 am