విమానాలు, నౌకల తనిఖీని వ్యతిరేకిస్తున్న ఇరాన్!

తమ దేశానికి చెందిన విమానాలు, నౌకలను విదేశాల్లో తనిఖీ చేయడాన్ని ఇరాన్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇదే అంశంపై ఆ దేశ పార్లమెంట్‌లో ఒక ముసాయిదా బిల్లును దాఖలు చేయనున్నారు. అంతర్జాతీయ సమాజ హెచ్చరికలను ఖాతరు చేయకుండా వివాదాస్పద అణు కార్యక్రమాన్ని చేపట్టిన ఇరాన్‌పై ఐక్యరాజ్యసమితి వివిధ రకాల ఆర్థిక ఆంక్షలను విధించిన విషయం తెల్సిందే.
Source: Yahoo! Telugu: News | 21 Jul 2010 | 9:26 am

లాభాల్లో స్టాక్ మార్కెట్: సెన్సెక్స్ 79 పాయింట్ల వృద్ధి!

బాంబే స్టాక్ మార్కెట్ బుధవారం లాభాలను నమోదు చేసుకుంటోంది. ట్రేడింగ్ ప్రారంభం నుంచే వృద్ధి చెందిన బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచి సెన్సెక్స్, మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో 79 పాయింట్లు లాభపడి, 17,958 పాయింట్ల మార్కును తాకింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచి నిఫ్టీ కూడా 25 పాయింట్లు బలపడి, 5,393 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.
Source: Yahoo! Telugu: News | 21 Jul 2010 | 8:35 am

పుంజుకున్న ట్రేడింగ్: లాభాల్లో బాంబే స్టాక్ మార్కెట్!

దేశీయ వాటాల ట్రేడింగ్ పుంజుకోవడంతో బాంబే స్టాక్ మార్కెట్ లాభాలను ఆర్జిస్తోంది. ట్రేడింగ్ ప్రారంభం నుంచే పురోగమనం వైపు కొనసాగుతున్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచి సెన్సెక్స్, మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో 83 పాయింట్ల మేర క్షీణించింది. ఫలితంగా సెన్సెక్స్ సూచి 18వేల మార్కుకు (17,961) సమీపంలో కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచి నిఫ్టీ కూడా 22 పాయింట్లు బలపడి, 5,390 పాయింట్ల మార్కును తాకింది.
Source: Yahoo! Telugu: News | 21 Jul 2010 | 8:00 am

ప్రాణాలతో తిరిగొస్తామని అనుకోలేదు: చంద్రబాబు

మహారాష్ట్ర పోలీసుల చెర నుంచి తాము ప్రాణాలతో తిరిగి వస్తామని అనుకోలేదని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా తెదేపా బుధవారం అసెంబ్లీ ప్రాంగణంలోని గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేపట్టింది. ఇందులో చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు.
Source: Yahoo! Telugu: News | 21 Jul 2010 | 7:53 am

3జీ సేవల విస్తరణ కోసం చైనా భారీ పెట్టుబడులు

3జీ టెలికాం విస్తరణలో భాగంగా చైనా 120 బిలియన్ యువాన్ల(17.70 బిలియన్ డాలర్లు)ను వెచ్చించనున్నట్లు ఓ ప్రైవేటు టెలివిజన్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపింది. 2011 కల్లా మరో 400 బిలియన్ యువాన్‌లను ఖర్చు చేస్తామని, దేశవ్యాప్తంగా 3జీ సేవలను విస్తరించడమే ప్రధాన లక్ష్యమని కేంద్ర పరిశ్రమల, సాంకేతి విజ్ఞానశాఖ మంత్రి వర్గం తెలియజేసింది.
Source: Yahoo! Telugu: News | 21 Jul 2010 | 7:20 am

అమెరికా మార్కెట్ ప్రభావం: లాభాల్లో సెన్సెక్స్, నిఫ్టీ!

అమెరికా స్టాక్ మార్కెట్ పురోగమనం వైపు ర్యాలీని కొనసాగించడంతో బాంబే స్టాక్ మార్కెట్ లాభాలను ఆర్జిస్తోంది. బుధవారం ట్రేడింగ్ ప్రారంభం నుంచే లాభాలను ఆర్జించిన స్టాక్ మార్కెట్ ఉదయం 11.30 గంటల ప్రాంతంలోనూ పుంజుకుంది. దేశీయ వాటాల ట్రేడింగ్ ఆశాజనకంగా కొనసాగడంతో సెన్సెక్స్, నిఫ్టీలు వృద్ధి చెందాయి.
Source: Yahoo! Telugu: News | 21 Jul 2010 | 7:02 am

తన్నులు తిన్నప్పటికీ... రాజకీయం చేస్తే ఎలా: ఎర్రబెల్లి

మహారాష్ట్ర పోలీసు చేతిలో తన్నులు తిన్నప్పటికీ తాము చేపట్టిన బాబ్లీ యాత్రను రాజకీయం చేయడం చాలా బాధగా ఉందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ ఎర్రబెల్లి దయాకర్ రావు ఆవేదన వ్యక్తం చేశారు.
Source: Yahoo! Telugu: News | 21 Jul 2010 | 6:51 am

లాభాల్లో స్టాక్ మార్కెట్: సెన్సెక్స్, నిఫ్టీల వృద్ధి!

దేశీయ వాటాల ట్రేడింగ్ బలపడటంతో బాంబే స్టాక్ మార్కెట్ లాభాల వైపు ర్యాలీని కొనసాగిస్తోంది. ట్రేడింగ్ ప్రారంభం నుంచి పురోగమనం వైపు ర్యాలీని కొనసాగిస్తోన్న సెన్సెక్స్, నిఫ్టీలు పది గంటల ప్రాంతంలోనూ వృద్ధి చెందాయి. ఇందులో సెన్సెక్స్ లాభాలతో 17,950 మార్కును తాకగా, సెన్సెక్స్ సైతం 5380 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.
Source: Yahoo! Telugu: News | 21 Jul 2010 | 6:26 am

బాబ్లీ ప్రాజెక్టుపై పోరాటం ఆగదు: స్పష్టం చేసిన తెదేపా

మహారాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టుపై తాము సాగిస్తున్న పోరాటం ఆపే ప్రసక్తే లేదని తెలుగుదేశం పార్టీ స్పష్టం చేసింది. ఇందులోభాగంగా హైదరాబాద్‌లోని గన్‌పార్కు వద్ద, అసెంబ్లీలోని గాంధీ విగ్రహం వద్ద మహా ధర్నాకు చేపట్టింది. ఈ సందర్భంగా పలుపురు తెదేపా నేతలను నగర పోలీసులు అరెస్టు చేశారు.
Source: Yahoo! Telugu: News | 21 Jul 2010 | 6:11 am

త్రైమాసిక ఫలితాల్లో దేశీయ, విదేశీ కంపెనీల జోరు!

త్రైమాసిక ఫలితాల్లో పలు కంపెనీలు భారీ అభివృద్ధిని సొంతం చేసుకున్నాయి. మణప్పరం జెనరల్ ఫైనాన్స్ అండ్ లీజింగ్ సంస్థ మొదటి త్రైమాసికానికి గానూ 225శాతం వృద్ధిని నమోదు చేసుకొని రూ. 46 కోట్లకు ఎగబాకింది. కంపెనీ మొత్తం నిర్వహణ కింది ఆస్తులు (ఏయూఎమ్) రూ. 3,377 కోట్లకు పెరిగాయి. ఇందులో కేవలం బంగారం లోను నిర్వహణ కింది ఆస్తులు మాత్రం రూ. 3,310 కోట్లకు చేరుకున్నాయి. గత సంవత్సరం ఇదే సమయానికి రూ. 1,120 కోట్లుగా నమోదయ్యాయి.
Source: Yahoo! Telugu: News | 21 Jul 2010 | 6:08 am

దేవీశ్రీ ప్రొడక్షన్స్ వారి "బాబాల భాగోతం"

నిత్యానంద స్వామి, మరో స్వామి ఇలా కొందరి జీవితాలను తీసుకుని దేవిశ్రీ ప్రొడక్షన్స్‌ అనే నిర్మాణ సంస్థ 'బాబాల భాగోతం' చిత్రాన్ని నిర్మిస్తోంది. సీనియర్‌ దర్శకుడు పి. చంద్రశేఖర్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఎస్‌.దేవదానం నిర్మాత. భరత్‌బాబు, శఫాలీ శర్మ హీరోహీరోయిన్లుగా పరిచయమవుతున్న ఈ చిత్రం షూటింగ్‌ మంగళవారంనాడు జూబ్లీహిల్స్‌లోని మాదాలరవి హౌస్‌లో ప్రారంభమైంది. డైరెక్టర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు సాగర్‌ ఆహ్వానితులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజంలో నకిలీబాబాల వలలో ప్రజలు పడకూడదనే సందేశంతో ఈ చిత్రం రూపొందుతుందని తెలిసింది. మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను అన్నారు
Source: Yahoo! Telugu: Entertainment | 21 Jul 2010 | 6:07 am

జూలై 23న యాక్షన్ థ్రిల్లర్ 'సాల్ట్‌'

ఏంజెలినా జోలీ ప్రధాన పాత్రలో సోనీ పిక్చర్స్‌ సమర్పణలో యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రం 'సాల్ట్‌' రూపొందింది. ఇది ప్రపంచవ్యాప్తంగా 23న విడుదలకానుంది. ఈ విషయాన్ని సోనీ మార్కెటింగ్‌ మేనేజర్‌ అబుకుమార్‌ సింగ్‌ మీడియాకు తెలియజేశారు. ఈ చిత్ర దర్శకుడు ఫిలిప్‌‌నోస్‌ గతంలో రాబిట్‌ ఫ్రూఫ్‌ఫెన్స్‌, క్యాబ్‌ ఎఫైర్‌ చిత్రాలు చేశాడు. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ఈ చిత్రం విడుదలవుతుందని అన్నారు. రష్యాకుచెందిన గూఢఛారిణిగా ఏంజిలినా నటిస్తోంది. ఈ చిత్రానికి జేమ్స్‌ న్యూటన్‌ హౌవార్డ్‌ సంగీతం సమకూర్చారు.
Source: Yahoo! Telugu: Entertainment | 21 Jul 2010 | 5:48 am

ప్రాణాలతో తిరిగొస్తామని అనుకోలేదు: చంద్రబాబు

మహారాష్ట్ర పోలీసుల చెర నుంచి తాము ప్రాణాలతో తిరిగి వస్తామని అనుకోలేదని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా తెదేపా బుధవారం అసెంబ్లీ ప్రాంగణంలోని గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేపట్టింది. ఇందులో చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు.
Source: ఏపీ న్యూస్ | 21 Jul 2010 | 2:24 am

తన్నులు తిన్నప్పటికీ... రాజకీయం చేస్తే ఎలా: ఎర్రబెల్లి

మహారాష్ట్ర పోలీసు చేతిలో తన్నులు తిన్నప్పటికీ తాము చేపట్టిన బాబ్లీ యాత్రను రాజకీయం చేయడం చాలా బాధగా ఉందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ ఎర్రబెల్లి దయాకర్ రావు ఆవేదన వ్యక్తం చేశారు.
Source: ఏపీ న్యూస్ | 21 Jul 2010 | 1:22 am

బాబ్లీ ప్రాజెక్టుపై పోరాటం ఆగదు: స్పష్టం చేసిన తెదేపా

మహారాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టుపై తాము సాగిస్తున్న పోరాటం ఆపే ప్రసక్తే లేదని తెలుగుదేశం పార్టీ స్పష్టం చేసింది. ఇందులోభాగంగా హైదరాబాద్‌లోని గన్‌పార్కు వద్ద, అసెంబ్లీలోని గాంధీ విగ్రహం వద్ద మహా ధర్నాకు చేపట్టింది. ఈ సందర్భంగా పలుపురు తెదేపా నేతలను నగర పోలీసులు అరెస్టు చేశారు.
Source: ఏపీ న్యూస్ | 21 Jul 2010 | 12:43 am

బాబు-బాల్‌థాక్రేలు కుమ్మక్కయ్యారు: హనుమంతరావు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, శివసేన చీఫ్ బాల్‌థాక్రేల మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు ఆరోపించారు. తెలంగాణలో జరుగనున్న ఉప ఎన్నికల కోసం ప్రచారం చేస్తున్నారు.
Source: ఏపీ న్యూస్ | 21 Jul 2010 | 12:27 am

సోపోర్ ఎన్‌కౌంటర్‌లో హెచ్‌ఎం టాప్ మిలిటెంట్ హతం!

ఉత్తర కాశ్మీర్ మరోమారు భద్రతా బలగాల కాల్పులతో దద్దరిల్లింది. ఈ ప్రాంతంలోని సోపోర్ జిల్లాలో బుధవారం ఉదయం ఎన్‌కౌంటర్ జరిగింది. హర్కత్ ఉల్ ముజాహిద్దీన్ సంస్థకు చెందిన టాప్ మిలిటెంట్‌తో పాటు మరో ఇద్దరు సాయుధ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. దీనిపై డిఫెన్స్ ప్రతినిధి మాట్లాడుతూ శ్రీనగర్‌కు యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న హైఘామ్ అనే ప్రాతంలో మంగళవారం నుంచి ఇరు వర్గాల మధ్య కాల్పులు ప్రారంభమైనట్టు చెప్పారు.
Source: జాతీయ | 20 Jul 2010 | 11:54 pm

అణుపరిహార బిల్లు పరిశీలనపై గురువారం సమావేశం

వివాదాస్పద అణుపరిహార బిల్లుపై పార్లమెంటరీ కమిటీ గురువారం పరిశీలించనుంది. దీనిపై పలువురు ప్రముఖుల సలహాలను తీసుకోనుంది. ఈ నెల 26న ప్రారంభం కానున్న పార్లమెంట్‌ సమావేశాల్లో ఈ బిల్లుపై రాజ్యసభలో తమ నివేదికను సమర్పించేందుకు కమిటీ కృషి చేస్తోంది.
Source: జాతీయ | 20 Jul 2010 | 11:48 pm

మహారాష్ట్ర మరో పాకిస్థాన్ కాదుకదా: నారాయణ ప్రశ్న!

భారతదేశానికి శత్రుదేశం పాకిస్థాన్. ఇది ప్రతి ఒక్కరికీ తెలిసిన విషయం. కానీ, మన రాష్ట్రానికి మరో పాకిస్థాన్ తయారైందని అదే మహారాష్ట్ర అని వామపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. మహారాష్ట్రను మరో పాకిస్థాన్‌లా కాంగ్రెస్ నేతలు మార్చివేశారన్నారు. ఇకపై ఆ రాష్ట్ర సందర్శనకు వెళ్లాలంటే పాస్‌పోర్టులు, వీసాలు తీసుకెళ్లాల్సి వస్తుందేమో అని సీపీఐ, సీపీఎం రాష్ట్ర నేతలైనా కె.నారాయణ, బీవీ.రాఘవులు ప్రశ్నించారు.
Source: ఏపీ న్యూస్ | 20 Jul 2010 | 11:35 pm

శ్రీకృష్ణ కమిటీ తర్వాత అసలు యుద్ధం ఆరంభం: కేసీఆర్

జస్టీస్ శ్రీకృష్ణ కమిటీ ఇచ్చే నివేదిక తర్వాత రాష్ట్రంలో అసలు యుద్ధం ఆరంభమవుతుందని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర రావు మరోమారు ప్రకటించారు. ప్రస్తుతం జరుగుతున్న ఉప ఎన్నికలు తెలంగాణ సాధనలో ఒక భాగం మాత్రమేనన్నారు. ఈ ఎన్నికలతో తెలంగాణవాదం అంతమైపోదని జోస్యం చెప్పారు.
Source: ఏపీ న్యూస్ | 20 Jul 2010 | 11:18 pm

ముంబై దాడుల్లో సయీద్-లఖ్వీ పాత్రపై సందేహాలు!

ముంబై మారణహోమంలో జైష్ మొహ్మద్ చీఫ్ హఫీద్ సయీద్‌తో పాట.. జహీర్ లఖ్వీతో సహా మరో ఐదుగురి పాత్ర ఉన్నట్టు నిర్ధారణ కాలేదని జాతీయ దర్యాప్తు సంస్థ అభిప్రాయపడింది. అయితే, వీరు దేశంలోని వివిధ ప్రాంతాలలో ఇటువంటి కుట్రలకు పన్నాగాలు చేశారని భారతదేశ జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఢిల్లీ కోర్టుకు తెలిపింది. ఈ కేసుపై ప్రత్యేక దృష్టి సారించి దర్యాప్తు చేశామని ఎన్ఐఏ కౌన్సిల్ తెలిపింది.
Source: జాతీయ | 20 Jul 2010 | 11:11 pm

కేసీఆర్.. జిత్తులు మారిన పక్కా మరాఠావాది: తలసాని

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పోరాటం చేస్తున్నామని చెప్పుకునే తెరాస అధినేత కె.చంద్రశేఖర రావుపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతుంటే కేసీఆర్ మాత్రం నోరు మెదపరన్నారు. తెలుగువారిని ప్రధానంగా తెలంగాణ ప్రజల కోసం తమ పార్టీ చేస్తున్న పోరాటాన్ని అవమానించడాన్ని ఆయన తప్పుబట్టారు.
Source: ఏపీ న్యూస్ | 20 Jul 2010 | 11:07 pm

సోమవారం నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు!

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు వచ్చే సోమవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ సమావేశాల్లో వివిధ అంశాలపై ప్రభుత్వంపై ఎదురుదాడికి దిగేందుకు ప్రతిపక్షాలు అస్త్ర శస్త్రాలతో సిద్ధమవుతున్నాయి. నిత్యావసర వస్తు ధరల పెరుగుదలతో పాటు పెట్రో వడ్డన, బాబ్లీ ప్రాజెక్టు అక్రమ నిర్మాణం తదితర అంశాలు ఇందులో ప్రస్తావనకు రానున్నాయి.
Source: జాతీయ | 20 Jul 2010 | 10:25 pm

తెలుగువాడి దమ్మేంటో మరోసారి ఢిల్లీకి చాటాలి: ఎన్టీఆర్

తెలుగుదేశం పార్టీ నాయకుల అరెస్టు, అనంతరం మహారాష్ట్ర ప్రభుత్వం వారిపట్ల ప్రదర్శిస్తున్న వైఖరిపై జూనియర్ ఎన్టీఆర్ మండిపడ్డారు. తెలుగువారికి మరోసారి అవమానం జరుగుతోందన్నారు. కాంగ్రెస్ పార్టీ వ్యవహార శైలి చూస్తుంటే బ్రిటిష్ పాలన వచ్చిందా అనిపిస్తోందని అన్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 20 Jul 2010 | 11:54 am

అందాలన్నీ చూపిస్తానన్నా ఛార్మికి ఆఫర్లు నిల్..!!

ఛార్మింగ్ గాళ్ ఛార్మి గురించి ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ హాట్‌గా చర్చ సాగుతోంది. కొత్త హీరోయిన్ల రాకతో ఛార్మిని హీరోలు పట్టించుకోవడం మానేశారని తెలిసింది. గ్లామర్ అందాలను ఎంతగా పరుస్తానని బాహాటంగా చెపుతున్నప్పటికీ ఆమె వైపు కన్నెత్తి కూడా చూడటం లేదట.వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ వంటి అగ్రహీరోలు సైతం హీరోయిన్‌లు నయనతార, త్రిష, అనుష్కలవైపు మొగ్గుచూపుతున్నారని భోగట్టా. మరోవైపు కొత్త తాప్సీ, తమన్నా వంటి హీరోయిన్లు ఇపుడు కుర్ర హీరోయిన్లకు క్రేజీ స్టార్లుగా కనబడుతున్నారు. దీంతో వారంతా ఆ బ్యూటీలను ఎంచుకుంటున్నారని తెలిసింది. దీంతో ఛార్మి గ్లామర్ వెలవెలబోతున్నట్లు ఫీలవుతోంది. చాలాకాలంగా ఊరిస్తున్న ఓ కొత్త సినిమా ఆఫర్ కూడా మిణుకుమిణుకుమంటూ కనిపిస్తుందే తప్ప చేతికి రావడం లేదు. దీంతో ఛార్మి శకం ముగిసినట్లే అంటున్నారు సినీజనం.
Source: Yahoo! Telugu: Entertainment | 20 Jul 2010 | 10:23 am

చర్చల ద్వారా పరిష్కరించుకుందాం.. పొండి: చవాన్

మహారాష్ట్ర ముఖ్యమంత్రి చేయాల్సినదంతా చేసి చివరికి తెలుగుదేశం పార్టీ నాయకులకు ముక్తాయింపు మాటను చెప్పి పంపేందుకు యత్నిస్తున్నారు. బాబ్లీ సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకుందామనీ, కనుక చంద్రబాబు నాయుడు, మిగిలిన ప్రజాప్రతినిధులు వెంటనే మహారాష్ట్రను వదిలి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లిపోవాలని విజ్ఞప్తి చేశారు.
Source: జాతీయ | 20 Jul 2010 | 8:59 am

మైక్రో ఫైనాన్స్ వడ్డీరేట్ల నియంత్రణకు ప్రత్యేక బిల్లు: ప్రణబ్

మైక్రో ఫైనాన్స్ కంపెనీలు వసూలు చేస్తున్న వడ్డీరేట్లను నియంత్రించేందుకు ఒక బిల్లును రూపొందిస్తున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ మంగళవారం తెలిపారు. పంటరుణాలపై వడ్డీ శాతం ఇప్పటికే ఏడు నుంచి 5 శాతానికి తగ్గిందని ప్రణబ్ వెల్లడించారు.
Source: జాతీయ | 20 Jul 2010 | 8:39 am

తెదేపాపై కేసులు ఎత్తివేత: రాష్ట్రానికి పంపేందుకు యత్నం

బాబ్లీ ప్రాజెక్టు సందర్శనకు వచ్చిన తెదేపా బృందంపై పెట్టిన కేసులను మహారాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఈ మేరకు ప్రభుత్వ న్యాయవాది ధర్మాబాదు కోర్టులో పిటిషన్ వేశారు.
Source: ఏపీ న్యూస్ | 20 Jul 2010 | 8:12 am

తెదేపా నాయకులను ఉగ్రవాదుల్లా చూస్తున్నారు..!: బాలయ్య

తెలుగుదేశం పార్టీ నాయకులను మహారాష్ట్ర పోలీసులు ఉగ్రవాదుల్లా చూస్తున్నారని ప్రముఖ సినీ నటుడు, తెలుగుదేశం పార్టీ నాయకుడు నందమూరి బాలకృష్ణ మండిపడ్డారు. తెదేపా అధినేత చంద్రబాబు నాయుడుతో పాటు తెదేపా నేతల పట్ల మహారాష్ట్ర పోలీసులు వ్యవహరించిన తీరుపై బాలయ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం నేతలను మంగళవారం ఎటు తీసుకు వెళ్తున్నారో కూడా తెలియడం లేదని బాలకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు.
Source: ఏపీ న్యూస్ | 20 Jul 2010 | 7:44 am

తెదేపా నేతలపై లాఠీఛార్జీ: ఎట్టకేలకు ఖండించిన సీఎం!

తెలుగుదేశం పార్టీ నేతలపై మరాఠీ పోలీసులు జరిపిన లాఠీఛార్జీని ముఖ్యమంత్రి రోశయ్య ఖండించారు. ధర్మాబాద్ సంఘటనపై నివేదిక తెప్పించి, అందుకు అనుగుణంగా తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు.
Source: ఏపీ న్యూస్ | 20 Jul 2010 | 7:38 am

రామ్‌చరణ్‌ అక్కబావలుగా మంజుల, సంజయ్

రామ్‌చరణ్‌తో "బొమ్మరిల్లు" భాస్కర్‌ దర్శకత్వంలో అంజనా ప్రొడక్షన్స్‌ పతాకంపై నాగబాబు నిర్మిస్తున్న భారీ చిత్రం మలేషియాలో జరుగుతోంది. ఇందులో రామ్‌చరణ్‌కు అక్క, బావలుగా మహేష్‌బాబు సోదరి మంజుల, ఆమె భర్త సంజయ్ స్వరూప్‌లు నటిస్తున్నారు. ఇటీవలే వారునిర్మించిన 'ఏ మాయ చేసావె'లో నాగచైతన్య బావగా సంజయ్ స్వరూప్‌ నటించారు. అయితే అక్కగా మంజుల నటిస్తే బాగుండేదని చిత్రం చూశాక చాలామంది శ్రేయోభిలాషులు కృష్ణకు తెలియజేశారు. దీంతో రామ్‌చరణ్‌ నటించే చిత్రంలో అవకాశం రావడంతో ఇద్దరూ కలిసి నటిస్తున్నారు. మలేషియా షూటింగ్‌ తర్వాత ఈ చిత్రం హైదరాబాద్‌కు షిప్ట్ కానుంది.
Source: Yahoo! Telugu: Entertainment | 20 Jul 2010 | 5:48 am

సిల్వర్‌స్క్రీన్‌పై బోరెత్తిన ఐష్ - అభి కపుల్..?!!

మణిరత్నం "రావణ్" చిత్రం బాక్సాఫీసు వద్ద బోర్లా పడటంతో ఇపుడా ప్రభావం ఐష్ - అభి దంపతులపై పడింది. ఐశ్వర్యారాయ్ - అభిషేక్ బచ్చన్ కలిసి నటిస్తామని ముందుకు వస్తుంటే.. పారిపోతున్నంత పని చేస్తున్నారట బాలీవుడ్ సినీ దర్శకనిర్మాతలు. వివాహమైన తర్వాత ఆ ఇద్దరూ కలిసి నటించిన సినిమాలు విజయవంతమైనవి వేళ్లమీద లెక్కపెట్టవచ్చు. మొత్తమ్మదీ రావణ్ చిత్రం ఫట్‌మనడంతో ఐష్ - అభిలిద్దర్నీ హీరోహీరోయిన్లుగా పెట్టి సినిమా తీయాలంటే నిర్మాతలు జంకుతున్నారు. ఇదిలావుంటే ఇప్పటికే వీళ్లద్దరితో సినిమాలను మొదలుపెట్టిన దర్శకనిర్మాతలు తాత్కాలికంగా వాటిని పక్కన పెట్టేస్తున్నారట. దీంతో ఎంతో బిజీగా కనిపించే ఐశ్వర్యారాయ్ - అభిషేక్ బచ్చన్‌లు చేతులు ముందు పెట్టుక కూచోవాల్సి వస్తోందని చెపుతున్నారు. ఈ సంగతి ఇలావుంటే కొంతమంది అభిమానులైతే... నేరుగా ఐశ్వర్యారాయ్‌కు ఉచిత సలహాలను కూడా ఇస్తున్నారట. పెళ్లికాక ముందే నటి కానీ, పెళ్లయిన తర్వాత ఇంకా చిందులేంటీ...? హేపీగా భర్తా, అత్త - మామలతో కాలం గడపవచ్చు కదా అని అంటున్నారట. మరి ఐశ్వర్యారాయ్ ఏం చేస్తుందో..?!!
Source: Yahoo! Telugu: Entertainment | 20 Jul 2010 | 5:23 am

పుట్టపర్తి పర్యటనను రద్దు చేసుకున్న మహారాష్ట్ర సీఎం!

మహారాష్ట్రలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టు నేపథ్యంలో, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ చవాన్ పుట్టపర్తి పర్యటనను రద్దు చేసుకున్నారు. అశోక్ చవాన్ పుట్టపర్తి పర్యటనను అడ్డుకుంటామని తెదేపా నాయకులు ప్రకటించడంతో పుట్టపర్తి రావద్దని సత్యసాయి ట్రస్టు మహారాష్ట్ర సీఎంకు సూచించింది.
Source: జాతీయ | 20 Jul 2010 | 4:56 am

రాష్ట్రంలో పరిణామాలకు కేంద్రానిదే బాధ్యత: వెంకయ్య

తెదేపా నేతల పట్ల మహారాష్ట్ర పోలీసులు ప్రవర్తించిన తీరు అత్యంత దారుణమని భారతీయ జనతాపార్టీ నాయకుడు ఎమ్.వెంకయ్య నాయుడు అన్నారు. చంద్రబాబు అరెస్టు నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగే పరిణామాలకు కేంద్ర ప్రభుత్వమే సమాధానం చెప్పాలన్నారు.
Source: జాతీయ | 20 Jul 2010 | 4:19 am