|
జీటీఎల్ చేతికి 17,500 ఎయిర్‌సెల్ టవర్లుప్రంపంచపు అతిపెద్ద టెలికాం సంస్థ జీటీఎల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఎయిర్‌సెల్‌తో ఓ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఎయిర్‌సెల్‌కు చెందిన 17,500 టెలికాం టవర్లను జీటీఎల్ ఇన్‌ఫ్రా దక్కించుకుంది. దీంతో జీటీఎల్ ఇన్‌ఫ్రా ప్రతి సంవత్సర రూ. 750 కోట్ల ఆదాయాన్ని పొందనుంది. ఈ ఒప్పందం విలువ రూ. 8,026 కోట్లు.Source: Yahoo! Telugu: News | 20 Jul 2010 | 9:13 am స్వల్ప లాభాల్లో బాంబే స్టాక్ మార్కెట్బాంబే స్టాక్ మార్కెట్ స్వల్ప లాభాల వైపు ర్యాలీని కొనసాగిస్తోంది. ట్రేడింగ్ ప్రారంభం నుంచి పురోగమనం వైపు ర్యాలీని కొనసాగించిన బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచి సెన్సెక్స్, మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో ఆరు పాయింట్లు స్వల్పంగా లాభపడింది. దీంతో సెన్సెక్స్ సూచి 17,934 పాయింట్ల మార్కును తాకింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచి నిఫ్టీ కూడా కేవలం రెండు పాయింట్ల స్వల్ప లాభంతో 5,383 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.Source: Yahoo! Telugu: News | 20 Jul 2010 | 9:08 am విదేశీ మార్కెట్ల ప్రభావం: లాభాల్లో సెన్సెక్స్!బాంబే స్టాక్ మార్కెట్ మంగళవారం లాభాల బాటలో కొనసాగుతోంది. ట్రేడింగ్ ప్రారంభంలోనే 18వేల మార్కును తాకిన బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచి సెన్సెక్స్, మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో 68 పాయింట్లు వృద్ధి చెంది, 17,997 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచి నిఫ్టీ కూడా 18 పాయింట్లు బలపడి, 5,405 పాయింట్ల వద్ద పయనిస్తోంది.Source: Yahoo! Telugu: News | 20 Jul 2010 | 8:49 am ప్రజాప్రతినిధులు చొరబాటుదారులా...?: "మహా"కు చిరు ప్రశ్నతెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధుల పట్ల మహారాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు, పోలీసుల లాఠీఛార్జ్‌పై ఎలా స్పందించాలో మాటలు రావడం లేదని ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి తన ఆవేదనను వ్యక్తం చేశారు.Source: Yahoo! Telugu: News | 20 Jul 2010 | 8:43 am మహారాష్ట్రలో బాబు అరెస్టు: మంత్రులతో సీఏం ఆరా!బాబ్లీకి బస్సు యాత్ర చేపట్టి అరెస్టయిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టుపై ఎట్టకేలకు రాష్ట్ర ముఖ్యమంత్రి కె. రోశయ్య స్పందించారు. నారా చంద్రబాబు నాయుడుతో పాటు తెదేపా నాయకుల అరెస్టుతో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితిపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. ముఖ్యమంత్రి రోశయ్యతో భారీ నీటి పారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య మంగళవారం ఉదయం భేటీ అయ్యారు.Source: Yahoo! Telugu: News | 20 Jul 2010 | 8:35 am తెలుగు బిడ్డల్ని కొడతారా...? కడుపు రగిలి పోతోందితెలుగుదేశం నాయకులపై మహారాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై సినీ నటుడు మోహన్ బాబు రాజకీయాలకు అతీతంగా స్పందించారు. తెలుగువారిపై మరాఠీ పోలీసులు అమానుషంగా నడుచుకోవడం పట్ల మోహన్ బాబు మండిపడ్డారు. బాబ్లీ యాత్ర పరిశీలనకు వచ్చిన తెలుగు బిడ్డలపై మరాఠీ సర్కారు దౌర్జన్య చర్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబ్లీ యాత్రపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యాఖ్యలు సరికావని, మహారాష్ట్ర వాడెబ్బ సొత్తు కాదని మోహన్ బాబు తీవ్రంగా విమర్శించారు.Source: Yahoo! Telugu: News | 20 Jul 2010 | 8:08 am సింగపూర్‌లో ప్రతి నలుగురిలో ఓ భారతీయుడుసింగపూర్లో స్థిరపడ్డ భారతీయుల సంఖ్య గడచిన రెండేళ్లతో పోలిస్తే రెండింతలు పెరిగింది. రెండేళ్ల క్రితం 2లక్షలు ఉన్న భారతీయులు ప్రస్తుతం 4లక్షలకు చేరినట్లు ఓ పత్రిక వెల్లడించింది. ఆ దేశ మొత్తం జనాభా 1.79 మిలియన్లు ఉండగా అందులో మన భారతీయులే 4లక్షల మంది ఉండటం విశేషం. అంటే సగటున ప్రతి నలుగురిలో ఓ భారతీయడు ఉన్నట్లు ది స్ట్రైట్స్ టైమ్స్ పత్రిక ప్రచురించింది.Source: Yahoo! Telugu: News | 20 Jul 2010 | 7:40 am లాభాల్లో స్టాక్ మార్కెట్: సెన్సెక్స్, నిఫ్టీల వృద్ధి!బాంబే స్టాక్ మార్కెట్ మంగళవారం లాభాల వైపు ర్యాలీని కొనసాగిస్తోంది. ట్రేడింగ్ ప్రారంభం నుంచి పురోగమనం వైపు పయనిస్తున్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచి సెన్సెక్స్, ఉదయం 11.30 గంటల ప్రాంతంలో 64 పాయింట్ల వృద్ధితో 17,993 పాయింట్ల మార్కును తాకింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచి నిఫ్టీ కూడా 15 పాయింట్ల స్వల్ప లాభంతో, 5,401 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.Source: Yahoo! Telugu: News | 20 Jul 2010 | 7:13 am ఎగుమతులు పరిమితం: మారుతి సుజూకిదేశీయ అతి పెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజూకి తమ ఉత్పత్తుల ఎగుమతులను పరిమితం చేయనుంది. ఉత్పత్తి సామర్ధ్యం తక్కువగా ఉండటంతో గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఎగుమతులను పరిమితం చేయనున్నట్లు సంస్థ ఛైర్మన్ ఆర్ సీ భార్గవ తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్‌లో మేము పోటీ పడటం లేదని, ఉత్పత్తి సామర్ధ్యం తక్కువగా ఉండటం వల్ల గత సంవత్సరం మాదిరి ఈ సంవత్సరం ఎగుమతులు ఉండబోవని భార్గవ అన్నారు.Source: Yahoo! Telugu: News | 20 Jul 2010 | 7:09 am తెదేపా నాయకులను ఆంధ్రలో వదిలిపెట్టేందుకు వ్యూహం..!బాబ్లీ యాత్రకు వెళ్లి అరెస్టయిన తెలుగుదేశం పార్టీ నాయకులను వాహనాల్లో ఎక్కించి ఆంధ్రప్రదేశ్‌లో వదిలిపెట్టేందుకు మహారాష్ట్ర పోలీసులు వ్యూహం రచించినట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ నాయకులను ఏ జైలుకు తరలిస్తున్నారనే అంశంపై గందరగోళం నెలకొంది. సోమవారం రాత్రి తెదేపా నేతలను ఔరంగాబాద్ జైలు తరలించాలని ప్రయత్నించిన పోలీసులు, తమ వ్యూహం మార్చుకున్నట్లు తెలుస్తోంది.Source: Yahoo! Telugu: News | 20 Jul 2010 | 6:57 am రామ్‌చరణ్ అక్కబావలుగా మంజుల, సంజయ్రామ్చరణ్తో "బొమ్మరిల్లు" భాస్కర్ దర్శకత్వంలో అంజనా ప్రొడక్షన్స్ పతాకంపై నాగబాబు నిర్మిస్తున్న భారీ చిత్రం మలేషియాలో జరుగుతోంది. ఇందులో రామ్‌చరణ్‌కు అక్క, బావలుగా మహేష్‌బాబు సోదరి మంజుల, ఆమె భర్త సంజయ్ స్వరూప్‌లు నటిస్తున్నారు. ఇటీవలే వారునిర్మించిన 'ఏ మాయ చేసావె'లో నాగచైతన్య బావగా సంజయ్ స్వరూప్ నటించారు. అయితే అక్కగా మంజుల నటిస్తే బాగుండేదని చిత్రం చూశాక చాలామంది శ్రేయోభిలాషులు కృష్ణకు తెలియజేశారు. దీంతో రామ్‌చరణ్ నటించే చిత్రంలో అవకాశం రావడంతో ఇద్దరూ కలిసి నటిస్తున్నారు. మలేషియా షూటింగ్ తర్వాత ఈ చిత్రం హైదరాబాద్‌కు షిప్ట్ కానుంది.Source: Yahoo! Telugu: Entertainment | 20 Jul 2010 | 5:48 am సిల్వర్‌స్క్రీన్‌పై బోరెత్తిన ఐష్ - అభి కపుల్..?!!మణిరత్నం "రావణ్" చిత్రం బాక్సాఫీసు వద్ద బోర్లా పడటంతో ఇపుడా ప్రభావం ఐష్ - అభి దంపతులపై పడింది. ఐశ్వర్యారాయ్ - అభిషేక్ బచ్చన్ కలిసి నటిస్తామని ముందుకు వస్తుంటే.. పారిపోతున్నంత పని చేస్తున్నారట బాలీవుడ్ సినీ దర్శకనిర్మాతలు. వివాహమైన తర్వాత ఆ ఇద్దరూ కలిసి నటించిన సినిమాలు విజయవంతమైనవి వేళ్లమీద లెక్కపెట్టవచ్చు. మొత్తమ్మదీ రావణ్ చిత్రం ఫట్‌మనడంతో ఐష్ - అభిలిద్దర్నీ హీరోహీరోయిన్లుగా పెట్టి సినిమా తీయాలంటే నిర్మాతలు జంకుతున్నారు. ఇదిలావుంటే ఇప్పటికే వీళ్లద్దరితో సినిమాలను మొదలుపెట్టిన దర్శకనిర్మాతలు తాత్కాలికంగా వాటిని పక్కన పెట్టేస్తున్నారట. దీంతో ఎంతో బిజీగా కనిపించే ఐశ్వర్యారాయ్ - అభిషేక్ బచ్చన్‌లు చేతులు ముందు పెట్టుక కూచోవాల్సి వస్తోందని చెపుతున్నారు. ఈ సంగతి ఇలావుంటే కొంతమంది అభిమానులైతే... నేరుగా ఐశ్వర్యారాయ్‌కు ఉచిత సలహాలను కూడా ఇస్తున్నారట. పెళ్లికాక ముందే నటి కానీ, పెళ్లయిన తర్వాత ఇంకా చిందులేంటీ...? హేపీగా భర్తా, అత్త - మామలతో కాలం గడపవచ్చు కదా అని అంటున్నారట. మరి ఐశ్వర్యారాయ్ ఏం చేస్తుందో..?!!Source: Yahoo! Telugu: Entertainment | 20 Jul 2010 | 5:23 am ప్రజాప్రతినిధులు చొరబాటుదారులా...?: "మహా"కు చిరు ప్రశ్నతెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధుల పట్ల మహారాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు, పోలీసుల లాఠీఛార్జ్‌పై ఎలా స్పందించాలో మాటలు రావడం లేదని ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి తన ఆవేదనను వ్యక్తం చేశారు.Source: ఏపీ న్యూస్ | 20 Jul 2010 | 3:15 am మహారాష్ట్రలో బాబు అరెస్టు: మంత్రులతో సీఏం ఆరా!బాబ్లీకి బస్సు యాత్ర చేపట్టి అరెస్టయిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టుపై ఎట్టకేలకు రాష్ట్ర ముఖ్యమంత్రి కె. రోశయ్య స్పందించారు. నారా చంద్రబాబు నాయుడుతో పాటు తెదేపా నాయకుల అరెస్టుతో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితిపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. ముఖ్యమంత్రి రోశయ్యతో భారీ నీటి పారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య మంగళవారం ఉదయం భేటీ అయ్యారు.Source: ఏపీ న్యూస్ | 20 Jul 2010 | 3:05 am తెలుగు బిడ్డల్ని కొడతారా...? కడుపు రగిలి పోతోందితెలుగుదేశం నాయకులపై మహారాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై సినీ నటుడు మోహన్ బాబు రాజకీయాలకు అతీతంగా స్పందించారు. తెలుగువారిపై మరాఠీ పోలీసులు అమానుషంగా నడుచుకోవడం పట్ల మోహన్ బాబు మండిపడ్డారు. బాబ్లీ యాత్ర పరిశీలనకు వచ్చిన తెలుగు బిడ్డలపై మరాఠీ సర్కారు దౌర్జన్య చర్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబ్లీ యాత్రపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యాఖ్యలు సరికావని, మహారాష్ట్ర వాడెబ్బ సొత్తు కాదని మోహన్ బాబు తీవ్రంగా విమర్శించారు.Source: ఏపీ న్యూస్ | 20 Jul 2010 | 2:50 am తెదేపా నాయకులను ఆంధ్రలో వదిలిపెట్టేందుకు వ్యూహం..!బాబ్లీ యాత్రకు వెళ్లి అరెస్టయిన తెలుగుదేశం పార్టీ నాయకులను వాహనాల్లో ఎక్కించి ఆంధ్రప్రదేశ్‌లో వదిలిపెట్టేందుకు మహారాష్ట్ర పోలీసులు వ్యూహం రచించినట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ నాయకులను ఏ జైలుకు తరలిస్తున్నారనే అంశంపై గందరగోళం నెలకొంది. సోమవారం రాత్రి తెదేపా నేతలను ఔరంగాబాద్ జైలు తరలించాలని ప్రయత్నించిన పోలీసులు, తమ వ్యూహం మార్చుకున్నట్లు తెలుస్తోంది.Source: ఏపీ న్యూస్ | 20 Jul 2010 | 1:28 am ఔరంగాబాద్ జైలుకు బాబు: ఆగ్రహంలో తెలుగు తమ్ముళ్లుబాబ్లీ ప్రాజెక్టు సందర్శనకు వెళ్లిన తెలుగుదేశం ఎమ్మెల్యేలను నమ్మించి అరెస్టు చేయడమే కాక అక్రమ కేసులు బనాయించిన మహారాష్ట్ర సర్కార్ తన దుష్ట వైఖరిని మరోసారి బయటపెట్టంది. ధర్మాబాద్ ఐటీఐ నుంచి బలవంతంగా బాబుతో సహా ఎమ్మెల్యేలను పోలీసు వాహనాల్లో ఈడ్చుకుంటూ తీసుక పోయింది.Source: ఏపీ న్యూస్ | 20 Jul 2010 | 1:26 am సీఎంలతో ప్రణబ్ భేటీ: రైతు రుణ ప్రణాళికపై చర్చ!కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ దక్షిణ రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులతో మంగళవారం సమావేశం కానున్నారు. ఇందుకుగాను మంగళవారం ప్రణబ్ ముఖర్జీ రాష్ట్ర రాజధాని నగరం హైదరాబాద్ చేరుకోనున్నారు.జూబ్లీహాల్‌లో జరిగే ముఖ్యమంత్రుల సమావేశానికి ప్రణబ్ ముఖర్జీ అధ్యక్షతన వహిస్తారు. ఈ సమావేశానికి అనంతరం ప్రణబ్ ముఖర్జీ విలేకరుల సమావేశంలో పాల్గొని, హస్తినకు చేరుకుంటారు.Source: జాతీయ | 20 Jul 2010 | 1:13 am ఉత్తర ప్రదేశ్‌లో పడవ మునక: ఆరుగురి మృతిఉత్తర ప్రదేశ్‌లోని మొరాదాబాద్ జిల్లాలో ఉన్న రామ్‌గంగా నదిలో ఈ ఉదయం ఓ పడవ ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా మరో తొమ్మిది మంది గల్లంతైనట్లు మొరాదాబాద్ జిల్లా డీఐజీ బీపీ జోగ్దాండ్ తెలియజేశారు.Source: జాతీయ | 20 Jul 2010 | 1:02 am బాబు బాధ్యత మరిచారు... అందుకే శాస్తి జరుగుతోందితెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు బాధ్యత మరిచి ప్రవర్తించిన ఫలితమే నేటి పరిస్థితికి కారణమని నిజామాబాద్ ఎంపీ మధుయాష్కీ అభిప్రాయపడ్డారు. తెలుగుదేశం నాయకుల పట్ల మహారాష్ట్ర పోలీసుల దురుసు ప్రవర్తనను తాను ఖండిస్తున్నాననీ, అయితే నాయకులనేవారు విజ్ఞతతో మసలుకోవాలని ఉద్బోధించారు.Source: ఏపీ న్యూస్ | 19 Jul 2010 | 11:47 pm తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు "మహా" ఘోర పరాభవంమహారాష్ట్ర జల దోపిడిపై అడ్డుకునేందుకు శాంతియుతంగా పోరుబాట పట్టిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు ఘోర పరాభవం జరిగింది. ప్రజాప్రతినిధులని కూడా చూడకుండా ఎమ్మెల్యేలపై మహారాష్ట్ర పోలీసుల లాఠీఛార్జ్ చేశారు.Source: ఏపీ న్యూస్ | 19 Jul 2010 | 11:23 pm కంటతడిపెట్టిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు!బాబ్లీ ప్రాజెక్టు పరిశీలన కోసం వెళ్లిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కంటతడిపెట్టారు. బాబ్లీ ప్రాజెక్టు పరిశీలన కోసం వెడితే తప్పుదోవ పట్టించిన మహారాష్ట్ర సర్కారు తమ పట్ల వ్యవహరిస్తున్న తీరును చంద్రబాబు తీవ్రంగా ఖండించారు.తెదేపా నేతలను అక్రమంగా నిర్బంధించి, ప్రజాప్రతినిధులపట్ల మహారాష్ట్ర పోలీసులు అమర్యాదకరంగా ప్రవర్తిస్తున్నారంటూ టీడీపీ అధినేత చంద్రబాబు కంటతడిపెట్టుకున్నారు. పోలీసులSource: ఏపీ న్యూస్ | 19 Jul 2010 | 11:10 pm బెంగాల్ రైలు ప్రమాదం: 60కి పెరిగిన మృతుల సంఖ్య!పశ్చిమబెంగాల్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 60కి పెరిగింది. పశ్చిమ బెంగాల్‌లో జార్ఖండ్ రాష్ట్ర సరిహద్దుకు దగ్గర్లో ఉన్న సైంధియా రైల్వే స్టేషన్ వద్ద సోమవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 60 మందికి పైగా చనిపోగా, మరో 150 మంది గాయపడ్డారు.బీర్భమ్ జిల్లా సైంధియా రైల్వే స్టేషన్‌లో ఆగి ఉన్న వనాంచల్ ఎక్స్‌ప్రెస్‌ను వేగంగా వచ్చిన ఉత్తరబంగ ఎక్స్‌ప్రెస్ ఢీకొనడంతో ఈ ఘోర ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. సోమవారానికి 50కి ఉన్న మృతుల సంఖ్య మంగళవారానికి 60కిపైగా పెరిగిందని పోలీసులు తెలిపారు.Source: జాతీయ | 19 Jul 2010 | 11:02 pm ఉత్తరబంగ ఎక్స్‌ప్రెస్ వేగ పరిమితిని మించిందిఆదివారం అర్థరాత్రి పశ్చిమబెంగాల్‌లో ఘోర రైలు ప్రమాదం వెనుక అతివేగం కూడా ఒక కారణమని చెపుతున్నారు. ప్రమాదం జరిగిన మార్గంలో రైలు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించాల్సి ఉండగా దాన్ని మించి గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించినట్లు వెల్లడైంది.Source: జాతీయ | 19 Jul 2010 | 10:59 pm గాలి సోదరులకు క్లీన్‌చీట్: ఆక్షేపించిన సీపీఏం!అక్రమ మైనింగ్ అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న గాలి సోదరులకు కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప క్లీన్‌చిట్ ఇవ్వడంపై సీపీఏం ఆక్షేపించింది. ఈ మైనింగ్ అవినీతిపై సీబీఐ విచారణ చేపట్టాలని పార్టీ పొలిట్ బ్యూరో డిమాండ్ చేసింది. అక్రమ గనుల తవ్వకాలకు పాల్పడుతున్న గాలి బ్రదర్స్‌ను వెంటనే పదవుల నుంచి తొలగించాలని సీపీఏం పొలిట్ బ్యూరో కోరింది.Source: జాతీయ | 19 Jul 2010 | 10:54 pm తెదేపా ఎమ్మెల్యేలపై మహా పోలీసుల పశుబలంతెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలపై మహారాష్ట్ర పోలీసులు విరుచుక పడ్డారు. ధర్మాబాద్‌లోని ఐటీఐ నుంచి వెలుపలికి తోసుకుంటూ ఎమ్మెల్యేలను ఈడ్చుకెళ్లి పోలీసు జీపుల్లో బస్తాలను వేసినట్లు వేస్తున్నట్లు అక్కడి ఎమ్మెల్యేలు చెపుతున్నారు.Source: ఏపీ న్యూస్ | 19 Jul 2010 | 10:38 pm నవదీప్ - శ్రద్ధా దాస్.. ఏం దూకుడండీ బాబూ...!!హైదరాబాద్‌లో ప్రముఖ పారిశ్రామికవేత్త కుమారుడైన నవదీప్ పలు చిత్రాల్లో హీరోగా నటించాడు. చందమామ చిత్రం ద్వారా గుర్తింపు పొందాడు.ఆ తర్వాత ఎందుకనో పెద్దగా అవకాశాలు రాలేదు. అయితే రాత్రి పార్టీలకు బాగా అలవాటుపడి జూబ్లీహిల్స్ బడా స్వాముల పిల్లల్తో కలిసి పార్టీలకు తెగ వెళ్తుంటాడు.ఓసారి అలా కారులో ఫుల్‌గా మందుకొట్టి పంజాగుట్ట పోలీసులకు దొరికిపోయాడు కూడా. అది జరిగిన రెండు రోజులకు ఇటీవలే నవదీప్ బైక్‌రేస్‌లా విపరీతమైన దూకుడుతో తన గాళ్‌ఫ్రెండ్‌తో కలిసి పోతున్నాడట. వారివెనుక మరో ఇద్దరు స్నేహితులు తమ గాళ్‌ఫ్రెండ్స్‌తో వెళుతూ ఓచోట పోలీసుల చెకింగ్ పాయింట్ వద్ద మళ్లీ దొరికిపోయాడట. చెకింగ్ ఉందని తెలిసి స్లో చేసినా మందుతాగి ఉండడంతో మౌత్‌మిషన్‌తో కనిపెట్టిన పోలీసులు ఫైన్ వేయగా కట్టేశాడట కూడా. అయితే అదేసమయంలో అటుగా వస్తున్న ఓ ఛానల్‌వారు చూసి అతని వెంటపడ్డారట. కానీ చిత్రంగా ఆయనతో పాటు హీరోయిన్ శ్రద్దాదాస్ కూడా ఉండడంతో ఆశ్కర్యపోయారట.Source: Yahoo! Telugu: Entertainment | 19 Jul 2010 | 11:22 am మరాఠీ - తెలుగు ప్రజల మధ్య చిచ్చు పెట్టొద్దు: సీఎంబాబ్లీ వ్యవహారంపై ముఖ్యమంత్రి రోశయ్య తొలిసారిగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. బాబ్లీ సమస్యను ప్రధాని సమక్షంలో పరిష్కరించుకునేందుకు తాను ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. అదేసమయంలో చంద్రబాబు అరెస్టుపై స్పందిస్తూ... ఆయన పట్ల మర్యాదగా ప్రవర్తించమని మహారాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ చవాన్‌గారిని కోరినట్లు వెల్లడించారు.Source: ఏపీ న్యూస్ | 19 Jul 2010 | 9:48 am నగ్న సుందరి షెర్లిన్ యోగా వీడియో పాఠాలుషెర్లిన్ చోప్రా... అంటేనే నగ్న సుందరి అని చటుక్కున చెప్పేస్తారు చాలామంది. ఇపుడా సుందరి తన రూటు మార్చుకున్నది. ప్రజల ఆరోగ్యానికి సూత్రాలను ఉపదేశించే ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు చెప్పుకొచ్చింది. ఇంతకీ అదేంటయా.. అని ఆరా తీస్తే... యోగాకు సంబంధించిన పాఠాలట. కాగా ఇప్పటికే బిపాసాబసు, శిల్పా శెట్టి వంటి సెక్సీ తారలు తమ అందాల యోగా పాఠాలను ప్రేక్షల ముందు వుంచారు. అయితే షెర్లిన్ మాత్రం దీనికి భిన్నంగా యోగా క్లాసులు ఇస్తానంటోంది. యోగాసనాలు ఎవరు ఎలా చూపించినా అవే కదా.. మీరు వాటినెలా చూపిస్తారేంటి..? అని ఓ పిల్ల జర్నలిస్టు ప్రశ్నిస్తే... తను ఏం చేసినా విభిన్నంగా ఉంటుందనీ, అర్థనగ్నంగా, నగ్నంగా ఎంతమంది ఎన్ని చేసినా తనకు మాత్రమే ప్రత్యేక గుర్తింపు ఎందుకు వచ్చిందో తెలుసా..? అంటూ ఎదురు ప్రశ్నలు వేస్తోందట. దీన్నిబట్టి శిల్పాశెట్టి వంటి తారలు యోగా దుస్తులు ధరించి పాఠాలు చెప్పారు. మరి షెర్లిన్ ఎటువంటి దుస్తులు ధరించి చెపుతుందోనన్న సందేహాలు రేకెత్తుతున్నాయి. అన్నట్లు మమాలుగానే షెర్లిన్ దుస్తులను చాలా పొదుపుగా వేసుకుంటుంది. మరి యోగా పాఠాల్లోనూ ఇదే సూత్రాన్ని పాటిస్తుందేమో చూడాలి.Source: Yahoo! Telugu: Entertainment | 19 Jul 2010 | 9:33 am బాబుపై చట్టపరమైన చర్యలు తీసుకోండి: "మహా" సీఎంమహారాష్ట్ర సర్కార్ తెలుగుదేశం పార్టీ నాయకులను చెరబట్టడమే కాక మానసికంగా పీడింపులను తీవ్రతరం చేసినట్లు కనబడుతోంది. బెయిల్ నిరాకరించిన చంద్రబాబు, ఇతర తెలుగుదేశం నేతలపై చట్టపరమైన చర్యలు తీసుకోవల్సిందిగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ చవాన్ పోలీసులను అదేశించారు.Source: జాతీయ | 19 Jul 2010 | 7:56 am రైళ్ల ప్రమాదంలో విద్రోహ చర్యను తోసిపుచ్చలేం: రైల్వేశాఖపశ్చిమబెంగాల్ రాష్ట్రంలో రెండు ప్రయాణికుల రైళ్లు ఢీకొన్న ప్రమాదం వెనుక విద్రోహ చర్యను తోసిపుచ్చలేమని కేంద్ర రైల్వే శాఖ అభిప్రాయపడింది. ఈ దుర్ఘటన వెనుక దుశ్చర్యను కొట్టిపారేయలేమని, ఇది విచారణ తర్వాతే తేలుతుందని ఈశాన్య రైల్వే జనరల్ మేనేజర్ వీఎన్.త్రిపాఠీ అన్నారు.Source: జాతీయ | 19 Jul 2010 | 6:55 am వైఎస్ జీవిత చరిత్ర ఆధారంగా "భగీరథుడు"దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జీవిత చరిత్రను సినిమాగా మలిచారు. ప్రచార కమిటీ నిర్వాహకుడు, స్మాల్ పేపర్స్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు గిరిరెడ్డి దీనికి నిర్మాత, దర్శకుడు. వైఎస్‌తో తనకున్న అనుభవం, ఆయనపై తనకున్న ప్రేమను వెల్లడి చేస్తూ ఈ చిత్రాన్ని నిర్మించారు. షూటింగ్ పూర్తయింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సాయి యూనివర్శల్ ఫిలిమ్స్‌పై తొలి ప్రయత్నంగా "భగీరథుడు" అనే చిత్రాన్ని నిర్మించాం. జనహృదయ నేత కోట్లాది మంది హృదయాల్లో ఆయన సంపాదించుకున్న స్థానం గురించి తెలియజేశాం. షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆగస్టులో సినిమాను విడుదల చేస్తాం అన్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 19 Jul 2010 | 6:30 am హీరోయిన్ అన్నాక గ్లామర్ పాత్రలు చేయాలి: మంజరి"సిద్దూ ఫ్రమ్ సికాకుళం" చిత్రంలో అల్లరి నరేష్ సరసన నటించిన సుందరి మంజరి. మళ్లీ తాజాగా ఆయనతో "శుభప్రదం"లో నటించింది. ఇద్దరికీ కె.విశ్వనాథ్ చిత్రంలో అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నారు. నిండుగా చీర కట్టుకుని సంప్రదాయమైన అమ్మాయిలా నటించడం చాలా ఆనందంగా ఉందని ముంబై భామ చెపుతోంది. చూడ్డానికి తెలుగింటి అమ్మాయిలా కన్పిస్తున్నాను కనుకనే నాకీ అవకాశం దక్కిందని చెపుతున్న ఈ భామతో వెబ్‌దునియా చిట్‌చాట్... థియేటర్‌లో కూర్చుని ప్రేక్షకుల మధ్యలో సినిమా చూస్తుంటే ఎలా ఉంది...?చాలా థ్రిల్‌గా ఫీలవుతున్నాను. ముఖ్యంగా నేను చేసిన డాన్స్‌కు ఇంటర్వెల్‌లో అంతా మెచ్చుకుంటుంటే చాలా ఆనందంగా ఉంది. స్వంత ఊరిలో ఉన్నంత అనుభూతి కలిగింది. తెలుగువారు ఇంత అభిమానాన్ని కురిపిస్తుంటే ఆశ్చర్యమేసింది. వారికి ఎలా థ్యాంక్స్ చెప్పాలో తెలియలేదు.ద్విపాత్రాభినయం చేయడం ఎలా అనిపించింది...?నటించిన రెండో చిత్రంలోనే డ్యూయల్ రోల్ రావడం అదృష్టంగా భావిస్తున్నాను. కథంతా నాపైనే నడుస్తుంది. మొదటి భాగం నరెష్ భార్యగా, రెండవ భాగంలో శరత్ బాబు మనవరాలిగా నటించాను. ఇటువంటి అవకాశం మళ్లీ వస్తుందనుకోలేను.Source: Yahoo! Telugu: Entertainment | 19 Jul 2010 | 5:49 am సిక్కు అల్లర్ల కేసు: సజ్జన్ పిటీషన్ కొట్టేసిన ఢిల్లీ హైకోర్టుసిక్కు అల్లర్ల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎంపీ సజ్జన్ కుమార్ దాఖలు చేసుకున్న పిటీషన్‌ను ఢిల్లీ హైకోర్టు సోమవారం తోసిపుచ్చింది. పనిలోపనిగా ఢిల్లీ పోలీసుల వైఖరిని కూడా తప్పుబట్టింది. సజ్జన్ కుమార్‌పై వచ్చిన ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు సాగుతుండగా, ఆయనపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయడం వెనుక పోలీసులు ఉద్దేశ్యమేమిటని కోర్టు ప్రశ్నించింది.Source: జాతీయ | 19 Jul 2010 | 4:25 am నగ్న సుందరి షెర్లిన్ యోగా వీడియో పాఠాలుషెర్లిన్ చోప్రా... అంటేనే నగ్న సుందరి అని చటుక్కున చెప్పేస్తారు చాలామంది. ఇపుడా సుందరి తన రూటు మార్చుకున్నది. ప్రజల ఆరోగ్యానికి సూత్రాలను ఉపదేశించే ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు చెప్పుకొచ్చింది. ఇంతకీ అదేంటయా.. అని ఆరా తీస్తే... యోగాకు సంబంధించిన పాఠాలట. కాగా ఇప్పటికే బిపాసాబసు, శిల్పా శెట్టి వంటి...Source: వినోదం | 19 Jul 2010 | 4:16 am జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో ఇద్దరు నార్కోటిక్ స్మగ్లర్ల అరెస్ట్!అక్రమంగా నార్కోటిక్ (నల్లమందు) రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను జమ్మూ పోలీసులు అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి 150 కేజీల నల్లమందును స్వాదీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. జమ్మూ నగర శివార్లలోని మిరాన్ షాహిబ్ వద్ద పోలీసుల బృందం ఓ వాహనాన్ని తనికీ చేయగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.Source: జాతీయ | 19 Jul 2010 | 2:27 am
|