నగ్న సుందరి షెర్లిన్ యోగా వీడియో పాఠాలు

షెర్లిన్ చోప్రా... అంటేనే నగ్న సుందరి అని చటుక్కున చెప్పేస్తారు చాలామంది. ఇపుడా సుందరి తన రూటు మార్చుకున్నది. ప్రజల ఆరోగ్యానికి సూత్రాలను ఉపదేశించే ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు చెప్పుకొచ్చింది. ఇంతకీ అదేంటయా.. అని ఆరా తీస్తే... యోగాకు సంబంధించిన పాఠాలట. కాగా ఇప్పటికే బిపాసాబసు, శిల్పా శెట్టి వంటి సెక్సీ తారలు తమ అందాల యోగా పాఠాలను ప్రేక్షల ముందు వుంచారు. అయితే షెర్లిన్ మాత్రం దీనికి భిన్నంగా యోగా క్లాసులు ఇస్తానంటోంది. యోగాసనాలు ఎవరు ఎలా చూపించినా అవే కదా.. మీరు వాటినెలా చూపిస్తారేంటి..? అని ఓ పిల్ల జర్నలిస్టు ప్రశ్నిస్తే... తను ఏం చేసినా విభిన్నంగా ఉంటుందనీ, అర్థనగ్నంగా, నగ్నంగా ఎంతమంది ఎన్ని చేసినా తనకు మాత్రమే ప్రత్యేక గుర్తింపు ఎందుకు వచ్చిందో తెలుసా..? అంటూ ఎదురు ప్రశ్నలు వేస్తోందట. దీన్నిబట్టి శిల్పాశెట్టి వంటి తారలు యోగా దుస్తులు ధరించి పాఠాలు చెప్పారు. మరి షెర్లిన్ ఎటువంటి దుస్తులు ధరించి చెపుతుందోనన్న సందేహాలు రేకెత్తుతున్నాయి. అన్నట్లు మమాలుగానే షెర్లిన్ దుస్తులను చాలా పొదుపుగా వేసుకుంటుంది. మరి యోగా పాఠాల్లోనూ ఇదే సూత్రాన్ని పాటిస్తుందేమో చూడాలి.
Source: Yahoo! Telugu: Entertainment | 19 Jul 2010 | 9:33 am

2014 నాటికి ఆప్ఘన్‌లో నాటో బలగాల ఉపసంహరణ!

ఆప్ఘనిస్థాన్‌లో తిష్టవేసిన ఆల్‌ఖైదా, తాలిబన్ తీవ్రవాదుల ఏరివేతలో నిమగ్నమైవున్న అమెరికా నేతృత్వంలోని నాటో బలగాలు 2014 నాటికి ఉపసంహరించే అవకాశం ఉంది. ఈ విషయం ఇంగ్లండ్ నుంచి ప్రచురితమయ్యే ఒక వార్తా పత్రిక ప్రచురించింది.
Source: Yahoo! Telugu: News | 19 Jul 2010 | 9:22 am

లాభాలతో పుంజుకున్న బాంబే స్టాక్ మార్కెట్

బాంబే స్టాక్ మార్కెట్ సోమవారం మిశ్రమ ఫలితాలను నమోదు చేసుకుంటోంది. ట్రేడింగ్ ప్రారంభం నుంచి నష్టాలను చవిచూసిన బాంబే స్టాక్ మార్కెట్, మధ్యాహ్నానికి తిరిగి లాభాలను ఆర్జించింది.ఫలితంగా సోమవారం మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 15 పాయింట్ల స్వల్ప లాభంతో 17,970 పాయింట్ల మార్కును తాకింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచి నిఫ్టీ కూడా రెండు పాయింట్ల స్వల్ప వృద్ధితో 5,396 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.
Source: Yahoo! Telugu: News | 19 Jul 2010 | 8:51 am

అనంతపురం జిల్లా ప్రరాపా కార్యకర్తల పరస్పర దాడులు!

అనంతపురం జిల్లాలో ప్రజారాజ్యం పార్టీ అంతర్గత వ్యవహారాలు బయటపడ్డాయి. సోమవారం జరిగిన జిల్లా కార్యకర్తల సమావేశం రసాభాసగా మారింది. ఈ సమావేశానికి హాజరైన ఆ పార్టీ యువజన విభాగమైన యువరాజ్యం జిల్లా అధ్యక్షుడు శివారెడ్డిని సొంత పార్టీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఫలితంగా ఇరు వర్గాల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఇవి పెద్దవి కావడంతో పరస్పర దాడులకు దిగారు.
Source: Yahoo! Telugu: News | 19 Jul 2010 | 8:39 am

బీహెచ్‌ఈఎల్‌కు రూ. 2,665 కోట్ల ఆర్డర్

దేశీయ విద్యుత్ పరికరాల సంస్థ భారత్ హెవీ ఎలక్ట్రికల్స్‌(బీహెచ్‌ఈఎల్) భారీ ఆర్డర్‌ను సొంతం చేసుకుంది. ఈ ఆర్డర్ ప్రకారం దైనిక్‌ భాస్కర్‌ పవర్‌‌ లిమిటెడ్‌కు 1,200 మెగా వాట్ల థెర్మల్ పవర్ ప్లాంట్‌కు కావలసిన పరికరాలను బీహెచ్‌ఈఎల్ సరఫరా చేయాల్సి ఉంటుంది.
Source: Yahoo! Telugu: News | 19 Jul 2010 | 7:57 am

కాబూల్‌లో భారత్-పాక్ మంత్రులతో హిల్లరీ క్లింటన్ భేటీ!

ఆప్ఘనిస్థాన్‌కు ఆర్థికసాయం చేస్తున్న దేశాల విదేశాంగ మంత్రులు ఆ దేశ రాజధాని కాబూల్‌లో భేటీ కానున్నారు. ఈ సమావేశానికి అమెరికా విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్, భారత్, పాకిస్థాన్ మంత్రులు ఎస్ఎం.కృష్ణ, షా మొహ్మద్ ఖురేషీలతో సహా 70 దేశాల విదేశాంగ మంత్రులు హాజరుకానున్నారు. ఆ సమయంలో భారత్-పాక్ విదేశాంగ మంత్రులతో హిల్లరీ క్లింటన్ వేర్వేరుగా సమావేశం కావాలని భావిస్తున్నారు.
Source: Yahoo! Telugu: News | 19 Jul 2010 | 7:52 am

నష్టాల్లో స్టాక్ మార్కెట్: సెన్సెక్స్, నిఫ్టీల పతనం!

బాంబే స్టాక్ మార్కెట్ సోమవారం స్వల్ప నష్టాల్లో పయనిస్తోంది. అంతర్జాతీయ స్టాక్ మార్కెట్ల ప్రభావంతో ట్రేడింగ్ ప్రారంభం నుంచే తిరోగమనం వైపు పయనిస్తున్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచి సెన్సెక్స్, మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో 22 పాయింట్లు పతనమై, 17,933 పాయింట్ల మార్కును తాకింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచి నిఫ్టీ కూడా 12 పాయింట్లు క్షీణించి, 5,381 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.
Source: Yahoo! Telugu: News | 19 Jul 2010 | 7:27 am

జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో ఇద్దరు నార్కోటిక్ స్మగ్లర్ల అరెస్ట్!

అక్రమంగా నార్కోటిక్ (నల్లమందు) రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను జమ్మూ పోలీసులు అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి 150 కేజీల నల్లమందును స్వాదీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. జమ్మూ నగర శివార్లలోని మిరాన్ షాహిబ్ వద్ద పోలీసుల బృందం ఓ వాహనాన్ని తనికీ చేయగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
Source: Yahoo! Telugu: News | 19 Jul 2010 | 7:26 am

ఏమిటీ దౌర్భాగ్యం.. చనిపోవాలని వుంది: హరికృష్ణ

కేంద్రం, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉన్న కాంగ్రెస్ సర్కార్లపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ మండిపడ్డారు. తెలుగువాడి ఆత్మ గౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో కాంగ్రెస్ సర్కారు తాకట్టుపెడుతోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
Source: Yahoo! Telugu: News | 19 Jul 2010 | 7:05 am

ట్రేడింగ్ క్షీణత: తిరోగమనంలో స్టాక్ మార్కెట్!

దేశీయ వాటాల ట్రేడింగ్ క్షీణించడంతో బాంబే స్టాక్ మార్కెట్ నష్టాల్లో కూరుకుపోయింది. ట్రేడింగ్ ప్రారంభం నుంచి తిరోగమనం వైపు కొనసాగిన బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచి సెన్సెక్స్, ఉదయం 11.30 గంటల ప్రాంతంలో 35 పాయింట్లు పతనమై, 17,990 పాయింట్ల మార్కును తాకింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచి నిఫ్టీ కూడా తొమ్మిది పాయింట్ల స్వల్ప నష్టంతో 5,403 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.
Source: Yahoo! Telugu: News | 19 Jul 2010 | 6:54 am

అలహాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం: 11మంది మృతి

అదిలాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో నలుగురు మహిళలు, ముగ్గురు పిల్లలతో సహా మొత్తం 11మంది మృతి చెందగా మరో 8మందికి తీవ్ర గాయాల పాలైనట్లు పోలీసులు తెలిపారు. ఈ సంఘటన ఉత్తరాన్ పోలీసు స్టషనకు 40 కిలోమీటర్ల దూరంలో చోటు చేసుకుంది.
Source: Yahoo! Telugu: News | 19 Jul 2010 | 6:52 am

వైఎస్ జీవిత చరిత్ర ఆధారంగా "భగీరథుడు"

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జీవిత చరిత్రను సినిమాగా మలిచారు. ప్రచార కమిటీ నిర్వాహకుడు, స్మాల్ పేపర్స్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు గిరిరెడ్డి దీనికి నిర్మాత, దర్శకుడు. వైఎస్‌తో తనకున్న అనుభవం, ఆయనపై తనకున్న ప్రేమను వెల్లడి చేస్తూ ఈ చిత్రాన్ని నిర్మించారు. షూటింగ్ పూర్తయింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సాయి యూనివర్శల్ ఫిలిమ్స్‌పై తొలి ప్రయత్నంగా "భగీరథుడు" అనే చిత్రాన్ని నిర్మించాం. జనహృదయ నేత కోట్లాది మంది హృదయాల్లో ఆయన సంపాదించుకున్న స్థానం గురించి తెలియజేశాం. షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆగస్టులో సినిమాను విడుదల చేస్తాం అన్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 19 Jul 2010 | 6:30 am

హీరోయిన్ అన్నాక గ్లామర్ పాత్రలు చేయాలి: మంజరి

"సిద్దూ ఫ్రమ్ సికాకుళం" చిత్రంలో అల్లరి నరేష్ సరసన నటించిన సుందరి మంజరి. మళ్లీ తాజాగా ఆయనతో "శుభప్రదం"లో నటించింది. ఇద్దరికీ కె.విశ్వనాథ్ చిత్రంలో అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నారు. నిండుగా చీర కట్టుకుని సంప్రదాయమైన అమ్మాయిలా నటించడం చాలా ఆనందంగా ఉందని ముంబై భామ చెపుతోంది. చూడ్డానికి తెలుగింటి అమ్మాయిలా కన్పిస్తున్నాను కనుకనే నాకీ అవకాశం దక్కిందని చెపుతున్న ఈ భామతో వెబ్‌దునియా చిట్‌చాట్... థియేటర్‌లో కూర్చుని ప్రేక్షకుల మధ్యలో సినిమా చూస్తుంటే ఎలా ఉంది...?చాలా థ్రిల్‌గా ఫీలవుతున్నాను. ముఖ్యంగా నేను చేసిన డాన్స్‌కు ఇంటర్వెల్‌లో అంతా మెచ్చుకుంటుంటే చాలా ఆనందంగా ఉంది. స్వంత ఊరిలో ఉన్నంత అనుభూతి కలిగింది. తెలుగువారు ఇంత అభిమానాన్ని కురిపిస్తుంటే ఆశ్చర్యమేసింది. వారికి ఎలా థ్యాంక్స్ చెప్పాలో తెలియలేదు.ద్విపాత్రాభినయం చేయడం ఎలా అనిపించింది...?నటించిన రెండో చిత్రంలోనే డ్యూయల్ రోల్ రావడం అదృష్టంగా భావిస్తున్నాను. కథంతా నాపైనే నడుస్తుంది. మొదటి భాగం నరెష్ భార్యగా, రెండవ భాగంలో శరత్ బాబు మనవరాలిగా నటించాను. ఇటువంటి అవకాశం మళ్లీ వస్తుందనుకోలేను.
Source: Yahoo! Telugu: Entertainment | 19 Jul 2010 | 5:49 am

అనంతపురం జిల్లా ప్రరాపా కార్యకర్తల పరస్పర దాడులు!

అనంతపురం జిల్లాలో ప్రజారాజ్యం పార్టీ అంతర్గత వ్యవహారాలు బయటపడ్డాయి. సోమవారం జరిగిన జిల్లా కార్యకర్తల సమావేశం రసాభాసగా మారింది. ఈ సమావేశానికి హాజరైన ఆ పార్టీ యువజన విభాగమైన యువరాజ్యం జిల్లా అధ్యక్షుడు శివారెడ్డిని సొంత పార్టీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఫలితంగా ఇరు వర్గాల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఇవి పెద్దవి కావడంతో పరస్పర దాడులకు దిగారు.
Source: ఏపీ న్యూస్ | 19 Jul 2010 | 3:16 am

జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో ఇద్దరు నార్కోటిక్ స్మగ్లర్ల అరెస్ట్!

అక్రమంగా నార్కోటిక్ (నల్లమందు) రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను జమ్మూ పోలీసులు అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి 150 కేజీల నల్లమందును స్వాదీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. జమ్మూ నగర శివార్లలోని మిరాన్ షాహిబ్ వద్ద పోలీసుల బృందం ఓ వాహనాన్ని తనికీ చేయగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
Source: జాతీయ | 19 Jul 2010 | 2:27 am

ఏమిటీ దౌర్భాగ్యం.. చనిపోవాలని వుంది: హరికృష్ణ

కేంద్రం, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉన్న కాంగ్రెస్ సర్కార్లపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ మండిపడ్డారు. తెలుగువాడి ఆత్మ గౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో కాంగ్రెస్ సర్కారు తాకట్టుపెడుతోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
Source: ఏపీ న్యూస్ | 19 Jul 2010 | 1:36 am

అలహాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం: 11మంది మృతి

అదిలాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో నలుగురు మహిళలు, ముగ్గురు పిల్లలతో సహా మొత్తం 11మంది మృతి చెందగా మరో 8మందికి తీవ్ర గాయాల పాలైనట్లు పోలీసులు తెలిపారు. ఈ సంఘటన ఉత్తరాన్ పోలీసు స్టషనకు 40 కిలోమీటర్ల దూరంలో చోటు చేసుకుంది.
Source: జాతీయ | 19 Jul 2010 | 1:23 am

రాష్ట్ర పరిణామాలపై దృష్టి సారించిన సోనియా-రాహుల్!

దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి హఠాన్మరణం అనంతరం రాష్ట్ర రాజకీయాలు శరవేగంగా మారిపోయాయి. తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర రావు ఆమరణ నిరాహారదీక్ష మొదలుకుని వైఎస్ తనయుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డి కొనసాగిస్తున్న ఓదార్పు యాత్ర వరకు ఇలా.. అనేక సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఇవన్నీ జాతీయ మీడియాను ఇట్టే ఆకర్షించాయి.
Source: ఏపీ న్యూస్ | 19 Jul 2010 | 12:39 am

జగన్ ప్రచారంపై సోనియా ఆగ్రహం: ఏ క్షణమైనా చర్య!

కడప పార్లమెంట్ సభ్యుడు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి తనయుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే అధిష్టానాన్ని ధిక్కరించి ఓదార్పు యాత్రను చేపట్టిన జగన్‌ పట్ల ఏఐసీసీ ఉదాసీన వైఖరిని అవలంభిస్తోంది.
Source: ఏపీ న్యూస్ | 19 Jul 2010 | 12:18 am

నేను క్షేమమే.. కానీ మన ఎమ్మెల్యేలకే అస్వస్థత: బాబు

గత మూడు రోజులుగా మహారాష్ట్ర పోలీసుల నిర్బంధంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి చెందిన 75 మంది ప్రజా ప్రతినిధుల్లో పలువురి ఆరోగ్యం స్వల్పంగా క్షిణించింది. డీ హైడ్రేషన్ కారణంగా వీరంతా అస్వస్థతకు లోనైనట్టు సమాచారం. దీంతో వీరికి మహారాష్ట్ర వైద్య బృందం చికిత్సలు చేస్తోంది.
Source: ఏపీ న్యూస్ | 19 Jul 2010 | 12:09 am

రైళ్ళ ఢీకొన్న ప్రమాదంపై కొన్ని సందేహాలు: మమతా

పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో రెండు ప్యాసింజర్ రైళ్లు ఢీకొన్న ప్రమాదంపై కొన్న సందేహాలు ఉన్నట్టు కేంద్ర రైల్వే శాఖామంత్రి మమతా బెనర్జీ అన్నారు. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 50 మంది మృతి చెందినట్టు ఆమె తెలిపారు. సెంధియా రైల్వే స్టేషన్‌ నాలుగో ఫ్లాట్‌ఫామ్‌పై ఆగివున్న వనాంచల్ ఎక్స్‌ప్రెస్‌ను షీల్డా నుంచి వస్తున్న ఉత్తర బంగా ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొన్న విషయం తెల్సిందే. ఆదివారం అర్థరాత్రి 1.54 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకోగా, 50 మంది మృత్యువాత పడ్డారు. మూడు బోగీలు బాగా దెబ్బతిన్నాయి. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
Source: జాతీయ | 18 Jul 2010 | 11:51 pm

కేసులు ఎత్తివేయాలి.. క్షమాపణ చెప్పాలి: బాబు డిమాండ్

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో సహా 74 మంది ప్రజాప్రతినిధులకు ధర్మాబాద్ మేజిస్ట్రేట్ విధించిన రెండు రోజుల రిమాండ్ సోమవారం సాయంత్రంతో ముగియనుంది. దీంతో మహారాష్ట్ర పోలీసులు సోమవారం ఉదయం చంద్రబాబుతో మరోమారు మంతనాలు జరిపారు. వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్ తీసుకుని హైదరాబాద్‌కు తిరిగి వెళ్లిపోవాలని విజ్ఞప్తి చేశారు.
Source: ఏపీ న్యూస్ | 18 Jul 2010 | 10:55 pm

నక్సల్స్‌పై పోరుకు ఆర్మీ వినియోగానికి వ్యతిరేకం: పీసీ

దేశ అంతర్గత భద్రతకు పెనుసవాల్ విసురుతున్న నక్సల్స్‌పై సైన్యం వినియోగించేందుకు కేంద్రం వ్యతిరేకమని కేంద్ర హోంశాఖామంత్రి పి.చిదంబరం అన్నారు. ఆయన విరుదునగర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ మావోయిస్టుల ఏరివేతకు ఆర్మీని ఉపయోగిస్తే ప్రాణ నష్టం ఎక్కువగా జరుగుతుందన్నారు. అందువల్ల సైన్యం వినియోగానికి కేంద్రం వ్యతిరేకమన్నారు.
Source: జాతీయ | 18 Jul 2010 | 10:37 pm

రాష్ట్ర వ్యాప్తంగా తెదేపా హర్తాళ్: నిలిచిపోయిన ఆర్టీసీ!

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతో సహా ఆ పార్టీకి చెందిన 74 మంది ప్రజాప్రతినిధుల పట్ల మహారాష్ట్ర సర్కారు అనుసరించిన.. అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా రాష్ట్ర బంద్‌కు తెదేపా శ్రేణులు పిలుపునిచ్చాయి. ఫలితంగా సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా వందల సంఖ్యలో ఆర్టీసీ బస్సు సేవలు ఆగిపోయాయి. దీంతో సాధారణ ప్రజానీకం తీవ్ర ఇబ్బందులు పడుతోంది. ముందస్తు జాగ్రత్త చర్యగా ఆర్టీసీ యాజమాన్యం బస్సు సర్వీసులను నిలిపి వేసింది. అన్ని జిల్లాల్లో ఈ హార్తాళ్ జరుగుతోంది.
Source: ఏపీ న్యూస్ | 18 Jul 2010 | 10:12 pm

పశ్చిమబెంగాల్‌లో ఢీకొన్న రైళ్లు: 50 మంది దుర్మరణం!

పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో రెండు రైళ్లు ఢీకొన్నాయి. ఈ ఘోర ప్రమాదంలో కనీసం యాభై మంది దుర్మరణం పాలయ్యారు. ఆదివారం అర్థరాత్రి ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బీర్‌భూమ్ జిల్లా సెంధియా రైల్వే స్టేషన్‌లో ఆగివున్న వనాంఛల్ ఎక్స్‌ప్రెస్‌ రైలును ఉత్తర బంగా ఎక్స్‌ప్రెస్ ఢీకొంది. ఈ దుర్ఘటనలో 50 మంది మృతి చెందినట్టు అధికార వర్గాలు పేర్కొంటుండగా, అనధికారికంగా 83 మంది మృతి చెందినట్టు సమాచారం. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. గాయపడిన వారిని సమీప ఆస్పత్రికి తరలించారు.
Source: జాతీయ | 18 Jul 2010 | 9:59 pm

మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉద్రిక్తత: రేపు తెదేపా రాష్ట్ర బంద్!

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో సహా తెదేపాకు చెందిన 74 మంది ఎమ్మెల్యేలు, ఎంపీల అరెస్టుకు నిరసనగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు రెండో రోజైన ఆదివారం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. సోమవారం రాష్ట్రబంద్‌కు తెదేపా పిలుపునిచ్చింది. రాష్ట్ర ప్రతిపక్ష నేతలకు ఇంత అవమానం జరిగినా అధికార కాంగ్రెస్ నేతలు హేళన ధోరణితో మాట్లాడుతున్నారని తెదేపా శ్రేణులు మండిపడ్డాయి.
Source: ఏపీ న్యూస్ | 18 Jul 2010 | 5:48 am

రెడ్డి సోదరులను తొలగించే ప్రసక్తే లేదు: యడ్యూరప్ప

తన మంత్రివర్గం నుంచి గాలి సోదరులను తగ్గించే ప్రసక్తే లేదని కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్.యడ్యూరప్ప స్పష్టం చేశారు. అలాగే, సీబీఐ దర్యాప్తుకు పట్టుబట్టి ఆందోళన చేస్తున్న ప్రతిపక్ష పార్టీలతో అమీ తుమీ తేల్చుకునేందుకు భాజపా సిద్ధమైంది. రాష్ట్ర పరిస్థితులను ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, హోం మంత్రి చిదంబరంలకు యడ్యూరప్ప వివరించారు.
Source: జాతీయ | 18 Jul 2010 | 4:39 am

అంబటి రాంబాబుపై చర్య.. జగన్ వర్గానికి హెచ్చరికా?

ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) కార్యదర్శి అంబటి రాంబాబుపై సస్పెన్షన్‌పై వేటు వేయడం కడప ఎంపీ వైఎస్.జగన్మోహన్ రెడ్డి వర్గానికి పంపిన తొలి హెచ్చరిక అని అఖిల భారత కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. ముఖ్యమంత్రి రోశయ్యను అనరాని మాటలంటూ.. అసభ్య సవాళ్లు విసిరిన జగన్ విధేయుడు అంబటి రాంబాబును పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. సస్పెన్షన్ తక్షణం అమల్లోకి వస్తుందని ప్రకటించింది.
Source: ఏపీ న్యూస్ | 18 Jul 2010 | 4:05 am

చంద్రబాబుకు ముఖం చెల్లకనే ఈ నాటకాలు: కేసీఆర్

తెలంగాణ ప్రాంతంలో జరిగే ఉప ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు ముఖం చెల్లకనే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ తరహా దొంగనాటకాలు ఆడుతున్నారని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర రావు ఆరోపించారు. ఉప ఎన్నికల ప్రచారం నిమగ్నమైవున్న కేసీఆర్.. చంద్రబాబుతో తీవ్రస్థాయిలో విమర్శనా బాణాలు ఎక్కుపెట్టారు. ఉప ఎన్నికల్లో ప్రచారానికి ముఖం చెల్లకే చంద్రబాబు జైలు నాటకమాడుతున్నారన్నారు.
Source: ఏపీ న్యూస్ | 18 Jul 2010 | 2:40 am