|
వ్యాపార విస్తరణలో భారీగా పెట్టుబడులు: కెఎస్ ఆయిల్స్మధ్యప్రదేశ్కి చెందిన ఎడిబిల్ ఆయిల్ తయారీ సంస్థ కెఎస్ ఆయిల్స్ వ్యాపార విస్తరణలో భాగంగా భారీ పెట్టుబడులు పెట్టనుంది. దేశీయ, విదేశీయ మార్కెట్లలో తమ ఉత్పత్తులను విస్తరించడానికి గానూ ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 220 కోట్లను వెచ్చించనున్నట్లు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ అగర్వాల్ తెలిపారు.Source: Yahoo! Telugu: News | 18 Jul 2010 | 8:34 am చంద్రబాబుకు ముఖం చెల్లకనే ఈ నాటకాలు: కేసీఆర్తెలంగాణ ప్రాంతంలో జరిగే ఉప ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు ముఖం చెల్లకనే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ తరహా దొంగనాటకాలు ఆడుతున్నారని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర రావు ఆరోపించారు. ఉప ఎన్నికల ప్రచారం నిమగ్నమైవున్న కేసీఆర్.. చంద్రబాబుతో తీవ్రస్థాయిలో విమర్శనా బాణాలు ఎక్కుపెట్టారు. ఉప ఎన్నికల్లో ప్రచారానికి ముఖం చెల్లకే చంద్రబాబు జైలు నాటకమాడుతున్నారన్నారు.Source: Yahoo! Telugu: News | 18 Jul 2010 | 8:09 am రాజ్యసభలో మూడో అతిపెద్ద పార్టీగా బీఎస్పీ!రాజ్యసభలో మూడో అతిపెద్ద పార్టీగా బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ ఆవిర్భవించింది. గత నెలలో జరిగిన ద్వైవార్షిక ఎన్నికల్లో బీఎస్పీ అధిక స్థాలను కైవసం చేసుకోవడంతో సీపీఎం పార్టీని వెనక్కి నెట్టి మూడో స్థానాన్ని కైవసం చేసుకుంది. ఫలితంగా 245 సభ్యులు కలిగిన రాజ్యసభలో బీఎస్పీ మూడో పార్టీగా అవతరించింది. పశ్చిమబెంగాల్, కేరళ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న తరుణంలో వామపక్ష పార్టీలకు ఇది పెద్ద షాక్ లాంటింది.Source: Yahoo! Telugu: News | 18 Jul 2010 | 7:40 am 1,50,000 ఏజెంట్ల నియామకం: రిలయన్స్ లైఫ్అనిల్ అంబానికి చెందిన బీమా సంస్థ రిలయన్స్ లైఫ్ విస్తరణలో భాగంగా ఈ ఆర్థిక సంవత్సరంలోగా కొత్తగా 3,000 సేల్స్ మేనేజర్లను, 1,50,000 మంది బీమా ఏజెంట్లను చేర్చుకోనున్నట్లు తెలిపింది. ప్రస్థుత ఆర్ధిక సంవత్సరానికి గానూ 20శాతం ఉద్యోగ అవకాశాలను పెంచతున్నామని రిలయన్స్ లైఫ్ అధ్యక్షుడు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మాలే గోష్ తెలిపారు.Source: Yahoo! Telugu: News | 18 Jul 2010 | 7:36 am మొదటి త్రైమాసికంలో 27 శాతం వృద్ధి: ఆర్ఐఎల్ముఖేష అంబానికి చెందిన రిలయన్స్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ జూన్ 30తో ముగిసిన త్రైమాసికానికి 27 శాతం వృద్ధిని నమోదు చేసుకుంది. ఈ సమయంలో మొత్తం నికర లాభం 6.47 కోట్ల రూపాయలును ఆర్జించింది. గత సంవత్సరం ఇదే సమయానికి సంస్థ 5.10 కోట్ల రూపాయల నికర లాభాన్ని నమోదు చేసుకున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది.Source: Yahoo! Telugu: News | 18 Jul 2010 | 6:54 am నీటి కోసం ప్రపంచ యుద్ధం తప్పదేమో: కలాంభవిష్యత్లో మంచినీటి కోసం యుద్ధాలు చేసే పరిస్థితి ఉత్పన్నమయ్యే అవకాశాలు లేకపోలేదని మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం భారత్‌లోని రాష్ట్రాల మధ్యే నీటి సమస్య ఉత్పన్నమైందన్నారు. ఇది మున్ముందు దేశాల మధ్య ఉత్పన్నమయ్యే అవకాశాలు ఉన్నట్టు చెప్పారు.Source: Yahoo! Telugu: News | 18 Jul 2010 | 6:40 am హైదరాబాద్‌లో స్వైన్‌ఫ్లూతో మరో మహిళ మృతిరాష్ట్రంలో స్వైన్‌ఫ్లూ మహమ్మారి మరొకర్ని బలితీసుకుంది. లింగాల ఘణపురం మండలం కుందారం గ్రామానికి చెందిన రజిత అనే మహిళకు స్వైన్‌ఫ్లూ సోకింది. హైదరాబాద్‌లో ఛాతీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. దీంతో నగర ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు.Source: Yahoo! Telugu: News | 18 Jul 2010 | 6:22 am అంబటి ఏం తప్పు చేశారు.. శిక్ష వేసేందుకు: జగన్ ప్రశ్న!ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి అంబటి రాంబాబు ఏం తప్పు చేశారని, ఆయనపై సస్పెన్షన్ వేటు వేశారని కడప ఎంపీ వైఎస్.జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. ఆయనపై చర్య తీసుకోవడం చాలా బాధ కలిగించిందన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో సాగుతున్న ఓదార్పు యాత్రలో భాగంగా హుకుంపేటకు బయలుదేరే ముందు విలేకరులతో మాట్లాడుతూ అంబటి గొప్ప నాయకుడు అని అన్నారు.Source: Yahoo! Telugu: News | 18 Jul 2010 | 6:04 am అల్బానియాలో లోయలో పడ్డ బస్సు: 14 మంది మృతిఅల్బానియాలో ఓ బస్సు ప్రమాదవశాత్తు లోయలో పడింది. ఈ ప్రమాదంలో 14 మంది మృతి చెందగా 12 మంది తీవ్రంగా గాయపడినట్లు అధికారులు తెలిపారు. అల్బానియా రాజధానికి ఉత్తర భాగంలో ప్రయాణికులతో వెలుతున్న బస్సు భారీగా కురుస్తున్న కుంభ వర్షం కారణంగా అదుపుతప్పి లోయలో పడినట్లు పోలీసు అదికారి హైస్నీ బుర్గజ్ తెలిపారు.Source: Yahoo! Telugu: News | 18 Jul 2010 | 5:55 am పాకిస్తాన్‌లో తాలిబాన్ల దాడి: 18 మంది మృతిపాకిస్తాన్లో తాలిబాన్ ఉగ్రవాదులు జరిపిన దాడిలో 18 మంది షియా ముస్లింలు మృతి చెందారు. ఈ సంఘటన వాయువ్య పాకిస్తాన్‌లోని కుర్రాంలో చోటు చేసుకుంది. ప్రైవేటు వాహనాలను లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు ఈ దాడి జరిపినట్లు పోలీసులు భావిస్తున్నారు. గత మూడేళ్లగా ఈ ప్రాంతం షియా-సున్నీల మధ్య గొడవలతో రగిలిపోతుంది.Source: Yahoo! Telugu: News | 18 Jul 2010 | 5:17 am చంద్రబాబుకు ముఖం చెల్లకనే ఈ నాటకాలు: కేసీఆర్తెలంగాణ ప్రాంతంలో జరిగే ఉప ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు ముఖం చెల్లకనే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ తరహా దొంగనాటకాలు ఆడుతున్నారని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర రావు ఆరోపించారు. ఉప ఎన్నికల ప్రచారం నిమగ్నమైవున్న కేసీఆర్.. చంద్రబాబుతో తీవ్రస్థాయిలో విమర్శనా బాణాలు ఎక్కుపెట్టారు. ఉప ఎన్నికల్లో ప్రచారానికి ముఖం చెల్లకే చంద్రబాబు జైలు నాటకమాడుతున్నారన్నారు.Source: ఏపీ న్యూస్ | 18 Jul 2010 | 2:40 am నీటి కోసం ప్రపంచ యుద్ధం తప్పదేమో: కలాంభవిష్యత్లో మంచినీటి కోసం యుద్ధాలు చేసే పరిస్థితి ఉత్పన్నమయ్యే అవకాశాలు లేకపోలేదని మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం భారత్‌లోని రాష్ట్రాల మధ్యే నీటి సమస్య ఉత్పన్నమైందన్నారు. ఇది మున్ముందు దేశాల మధ్య ఉత్పన్నమయ్యే అవకాశాలు ఉన్నట్టు చెప్పారు.Source: జాతీయ | 18 Jul 2010 | 2:11 am రాజ్యసభలో మూడో అతిపెద్ద పార్టీగా బీఎస్పీ!రాజ్యసభలో మూడో అతిపెద్ద పార్టీగా బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ ఆవిర్భవించింది. గత నెలలో జరిగిన ద్వైవార్షిక ఎన్నికల్లో బీఎస్పీ అధిక స్థాలను కైవసం చేసుకోవడంతో సీపీఎం పార్టీని వెనక్కి నెట్టి మూడో స్థానాన్ని కైవసం చేసుకుంది. ఫలితంగా 245 సభ్యులు కలిగిన రాజ్యసభలో బీఎస్పీ మూడో పార్టీగా అవతరించింది. పశ్చిమబెంగాల్, కేరళ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న తరుణంలో వామపక్ష పార్టీలకు ఇది పెద్ద షాక్ లాంటింది.Source: జాతీయ | 18 Jul 2010 | 2:10 am హైదరాబాద్‌లో స్వైన్‌ఫ్లూతో మరో మహిళ మృతిరాష్ట్రంలో స్వైన్‌ఫ్లూ మహమ్మారి మరొకర్ని బలితీసుకుంది. లింగాల ఘణపురం మండలం కుందారం గ్రామానికి చెందిన రజిత అనే మహిళకు స్వైన్‌ఫ్లూ సోకింది. హైదరాబాద్‌లో ఛాతీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. దీంతో నగర ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు.Source: ఏపీ న్యూస్ | 18 Jul 2010 | 12:52 am అంబటి ఏం తప్పు చేశారు.. శిక్ష వేసేందుకు: జగన్ ప్రశ్న!ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి అంబటి రాంబాబు ఏం తప్పు చేశారని, ఆయనపై సస్పెన్షన్ వేటు వేశారని కడప ఎంపీ వైఎస్.జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. ఆయనపై చర్య తీసుకోవడం చాలా బాధ కలిగించిందన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో సాగుతున్న ఓదార్పు యాత్రలో భాగంగా హుకుంపేటకు బయలుదేరే ముందు విలేకరులతో మాట్లాడుతూ అంబటి గొప్ప నాయకుడు అని అన్నారు.Source: ఏపీ న్యూస్ | 18 Jul 2010 | 12:35 am ఆసియా అందాల్లో తాజ్ మహల్‌కే అగ్రస్థానం!ప్రపంచ ఏడు వింతలలో ఒకటైన తాజ్ మహల్ మరో కొత్త రికార్డును దక్కించుకుంది. ఆసియాలో ఉన్న పర్యాటక ప్రాంతాలలోనే చూడదగ్గ ప్రాంతంగా తాజ్ మహల్‌కే ఓటర్లు పట్టంకట్టారు. కౌలాలంపూర్‌లో జరిగిన ఏసియన్ అట్రాక్షన్ ఎక్స్‌పో (ఏఏఈ) 2010 కార్యక్రమంలో ఇంటర్నేషనల్ అషోసియేషన్ ఆఫ్ అమ్యూజ్‌మెంట్ పార్క్స్ అట్రాక్షన్ ఈ విషయాన్ని ప్రకటించింది.Source: జాతీయ | 17 Jul 2010 | 10:33 pm సోనియా గాంధీకి సమన్లు జారీ చేసిన బీహార్ కోర్టుఏఐసీసీ అధినేత్రి, కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీకి బీహార్ కోర్టు శనివారం సమన్లు జారీ చేసింది. ఈ నెల 29వ తేదీన కోర్టుకు హాజరు కావాలని ఈ సమన్లలో పేర్కొంది. ఉత్తరప్రదేశ్‌లో 2007లో సోనియా గాంధీని దుర్గా మాతగా చిత్రీకరిస్తూ వేసిన పోస్టర్ హిందూ ప్రజల మనోభావాలను దెబ్బ తీసే విధంగా ఉందనే ఆరోపణపై ముజఫర్‌పూర్ అడిషినల్ జడ్జి ఈ నోటీసులు జారీ చేశారు.Source: జాతీయ | 17 Jul 2010 | 10:25 pm సినిమా పరిశ్రమ భూమిని వైఎస్సార్ అమ్మేశారుతెలుగు చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికోసం కేటాయించిన భూమిని ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేయడం పట్ల నిరసన తెలుపుతూ తెలుగుచలన చిత్ర పరిశ్రమ శనివారంనాడు దీక్షకు దిగింది. పద్మాలయ స్టూడియో దిగువన 30 ఎకరాలను తెలుగు చిత్ర పరిశ్రమకు 1983లో ప్రభుత్వం కేటాయించింది. కాలక్రమంలో 10 ఎకరాలు రియల్ ఎస్టేట్లకు, 20 ఎకరాలు మలేసియా టౌన్‌షిప్ సంస్థలకు ప్రభుత్వం అమ్మేసింది. ఇది వైఎస్ ప్రభుత్వ హయాంలో జరిగింది. శనివారంనాడు వైఎస్ జగన్‌కు చెందిన భారత్ కంపెనీ పూజా కార్యక్రమాలు చేస్తుందని వార్తలు రాగానే ఇండస్ట్రీ పెద్దలు వచ్చి ఆ స్థలం వద్ద చుట్టుముట్టారు. ఒకవైపు వర్షం పడుతున్నా లెక్కచేయకుండా బురదలోనే నినాదాలు చేశారు. మురళీమోహన్, సాగర్, సురేందర్ రెడ్డి, నట్టికుమార్‌లతోపాటు ఇండస్ట్రీకి చెందిన పలు శాఖల పెద్దలు ఆ స్థలం వద్ద ధర్నాకు దిగారు.Source: Yahoo! Telugu: Entertainment | 17 Jul 2010 | 1:27 pm నిజంగానే "ఏం పిల్లో... ఏం పిల్లడో..."లాగే ఉంది!!రెండు గ్రామాల పెద్దలకు చెందిన పిల్లలు ఆ పెద్దల మధ్య వైషమ్యాలకు తెరదించి వారిని ఒక్కటి చేసే కథఈ పాయింట్ వింటుంటే పాతకాలం కథలు గుర్తుకు వస్తున్నాయా...? వస్తాయి. దాన్ని నేటి ట్రెండ్‌కు ఎలా తీశాడు అన్నది పోకూరి బాబూరావు స్టైల్. ఈతరం బ్యానర్‌లో గత చిత్రాల్ని పోల్చి చూస్తే కష్టమే. ఎందుకంటే ఈనాడు కాస్త మసాలా ఉంటేనే చూస్తారన్న నిర్ణయానికి వచ్చిన నిర్మాత చేసిన ప్రయత్నమిది. సినిమా ఆద్యంతం చూస్తే ఢీ, రెడీ ఫార్ములా బాటలోనేగాక, అక్కడ అమ్మాయి - ఇక్కడ అబ్బాయి సినిమాను కూడా గుర్తు చేస్తుంది. ప్రేక్షకులు తెలుగు సినిమాలు అన్నీ సక్సెస్ ఎందుకు చేయరు.. కొన్నే ఎందుకు చేస్తారనేందుకు చక్కటి ఉదాహరణ ఈ సినిమా.Source: Yahoo! Telugu: Entertainment | 17 Jul 2010 | 12:42 pm బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి: జలవనరుల సంఘంమహారాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయిందని కేంద్ర జలవనరుల సంఘం ఛైర్మన్ అరుణ్ కుమార్ బజాజ్ శనివారం అన్నారు. అసలు ఈ ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతి ఇస్తూ సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందని ఆయన గుర్తు చేశారు.Source: ఏపీ న్యూస్ | 17 Jul 2010 | 8:04 am చంద్రబాబు అరెస్టు వెనుక రోశయ్య హస్తం: నాగంతమ పార్టీ అధినేత చంద్రబాబుతో సహా 75 మంది తెదేపా నేతల అరెస్టు వెనుక ముఖ్యమంత్రి కె.రోశయ్య హస్తం ఉందని ఆ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే నాగం జనార్ధన్ రెడ్డి ఆరోపించారు. బాబ్లీ ప్రాజెక్టు సందర్శనకు వెళ్లిన తెదేపా నేతలను మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.Source: ఏపీ న్యూస్ | 17 Jul 2010 | 7:22 am మేం తప్పు చేయలేదు.. మాకు బెయిల్ వద్దు: చంద్రబాబుతప్పు చేసిన వారికి బెయిల్ మంజూరు చేయడం ఆనవాయితీ అని, తాము ఎలాంటి తప్పు చేయలేదని, అందువల్ల తమకు బెయిల్ తీసుకునే ప్రసక్తే లేదని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఇదేవిషయాన్ని ధర్మాబాద్ మేజిస్ట్రేట్‌కు ఆయన తేల్చి చెప్పారు. దీంతో అరెస్టైన తెదేపా నేతలను రిమాండ్‌కు తరలించాల్సిందిగా ఆదేశించారు.Source: ఏపీ న్యూస్ | 17 Jul 2010 | 6:59 am పశ్చిమ బెంగాల్‌లో ముగ్గురుని హతమార్చిన మావోలుపశ్చిమ బెంగాల్‌లో మావోయిస్టులు ముగ్గురుని హతమార్చారు. ఈ సంఘటన మిడ్నాపూర్ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసు ఇన్ఫార్మర్లనే సందేహంతో వారిని చంపి ఉండవచ్చునని పోలీసులు పేర్కొన్నారు. కాగా చనిపోయిన వారిలో ఒకరు 22 ఏళ్ల వుకాయ్ ముర్ముగా గర్తించారు. వందుదహి గ్రామంలో ఉన్న ఇతని ఇంటి నుంచి రెండి కిలో మీటర్ల దూరంలో చిట్‌మటియా ప్రాంతలో ఈ శవాన్ని గుర్తించినట్లు వారు తెలిపారు.Source: జాతీయ | 17 Jul 2010 | 6:53 am రియా.. ప్లీజ్ మాకు "ప్చ్" ఇవ్వవూ: కుర్ర హీరోలుసెలబ్రిటీలు మందు కొట్టడం, దమ్ము కొట్టడం మామూలే. వారు కనుక మందు కొట్టారంటే సీన్ సితారైపోతుంది. తాజాగా బాలీవుడ్ తార రియాసేన్ ఓ నైట్ పార్టీలో పీకలదాకా డ్రింక్ చేసి పార్టీలో సహచర నటులతో తైతక్కలాడిందట. అలా చిందులేస్తూనే నిషా నషాలానికంటడంతో పలువురు హీరోలను గట్టిగా వాటేసుకుని వేడి వేడి ముద్దులు కురిపించిందట. ఆ ముద్దులు ఇచ్చింది ఎక్కడో తెలుసా...? నేరుగా హీరోల పెదవులకే. అడగకుండా ఉచితంగా అలా రియా ముద్దులిస్తుండేసరికి ఆమె ముద్దులు కోసం అక్కడే ఉన్న మరికొంతమంది చిన్న హీరోలు క్యూ కట్టారట. అడిగినవారికి అడిగినట్లు... ప్చ్.. ప్చ్... ప్చ్‌ప్చ్‌ప్చ్‌ప్చ్.. అంటూ దీర్ఘమైన లిప్‌లాక్ ముద్దులు ఇచ్చేసిందట. ఆ ముద్దుల రుచి చూసిన సదరు హీరోలు ఆ మైకం నుంచి ఇంకా తేరుకోనేలేదట. మరుసటి రోజు ఉదయం రియాకు ఫోన్ చేసి మళ్లీ "ప్చ్" కావాలని అడుగుతున్నారట.Source: Yahoo! Telugu: Entertainment | 17 Jul 2010 | 6:37 am పిలవని పేరంటానికి ఎలా వెళ్తాం..?!: చిరంజీవి ప్రశ్న"పెళ్లికి కూడా పత్రిక ఇచ్చి పిలుస్తారు. ఉన్నట్టుండి బస్సులు రెడీ చేసి ఎక్కమంటే..? ఖాళీలేని బస్సుల్లో ఎలా వెళ్తామని..?" ప్రజారాజ్యం అధినేత చిరంజీవి అన్నారు. బాబ్లీ బస్సు యాత్రలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు తొందరపడకుండా ఉండి ఉంటే బాగుండేదని చిరంజీవి వ్యాఖ్యానించారు.Source: ఏపీ న్యూస్ | 17 Jul 2010 | 6:24 am బద్రినాథ్‌కు చిన్నికృష్ణ బౌండెడ్ స్క్రిప్ట్2002లో చిరంజీవి నటించిన ఇంద్ర సినిమాకు చిన్నకృష్ణ బౌండెడ్ స్క్రిప్ట్ ఇచ్చారు. ఆ తర్వాత 2003లో అర్జున్ నటించిన గంగోత్రికి కూడా చిన్నికృష్ణ ఆ విధంగానే చేశారు. తాజాగా అల్లు అర్జున్ హీరోగా వి.వి.వినాయక్ దర్శకత్వంలో అల్లు అరవింద్ నిర్మిస్తున్న బద్రినాథ్‌కు కూడా చిన్నికృష్ణ బౌండెడ్ స్క్రిప్ట్ ని ఇచ్చారు. ఇటీవలే ఈ స్క్రిప్ట్‌ను వినాయక్, మధు తదితరుల సమక్షంలో చిత్ర నిర్మాత అల్లు అరవింద్‌కు అందజేశారాయన. ఈ నెల 26న ఈ చిత్రం షూటింగ్ ఆరంభం కానుంది. తమన్నా కథానాయికగా నటించే ఈ చిత్రానికి సంగీతం: కీరవాణి, కెమేరా: రవివర్మ, మాటలు: శ్రీ విస్సు, ఆర్ట్: ఆనంద్ సాయి, కథ - స్క్రీన్ ప్లే: చిన్నికృష్ణ, నిర్మాత: అల్లు అరవింద్, దర్శకత్వం: వి.వి.వినాయక్Source: Yahoo! Telugu: Entertainment | 17 Jul 2010 | 6:04 am బాబ్లీ సందర్శనకు అనుమతిచ్చే ప్రసక్తే లేదు: చవాన్తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును బాబ్లీ ప్రాజెక్టు సందర్శనకు అనుమతిచ్చే ప్రసక్తే లేదని మహారాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ చవాన్ తేల్చి చెప్పారు. ఈ కేసు సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నదని, అందువల్ల కోర్టు తీర్పు వచ్చేంత వరకు ఇరు వర్గాలు ఆగాల్సిందేనని ఆయన చెప్పారు. తాము కోర్టు తీర్పుకు అనుగుణంగా నడుచుకుంటామన్నారుSource: జాతీయ | 17 Jul 2010 | 4:09 am బెయిల్ వద్దు.. బాబ్లీ సందర్శనే ముద్దు: చంద్రబాబుతమకు బెయిల్ వద్దని, బాబ్లీ ప్రాజెక్టును సందర్శనకు తమకు అనుమతి ఇవ్వాల్సిందేనని మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తెగేసి చెప్పారు. తమపై ఎలాంటి కేసులు బనాయించినా వెరవబోమని, ఎన్ని రోజులైనా కటిక నేలపై పడుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు తేల్చి చెప్పారు.Source: ఏపీ న్యూస్ | 17 Jul 2010 | 2:25 am
|