బాబ్లీ సందర్శనకు అనుమతిచ్చే ప్రసక్తే లేదు: చవాన్

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును బాబ్లీ ప్రాజెక్టు సందర్శనకు అనుమతిచ్చే ప్రసక్తే లేదని మహారాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ చవాన్ తేల్చి చెప్పారు. ఈ కేసు సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నదని, అందువల్ల కోర్టు తీర్పు వచ్చేంత వరకు ఇరు వర్గాలు ఆగాల్సిందేనని ఆయన చెప్పారు. తాము కోర్టు తీర్పుకు అనుగుణంగా నడుచుకుంటామన్నారు
Source: Yahoo! Telugu: News | 17 Jul 2010 | 9:39 am

ఆగస్టు 21న ఆస్ట్రేలియా పార్లమెంట్ ఎన్నికలు: గిలార్డ్

ఆస్ట్రేలియా దేశ పార్లమెంట్ ఎన్నికలు వచ్చే నెల 21వ తేదీన జరుగనున్నాయి. ఈ విషయాన్ని ఆ దేశ కొత్త ప్రధానమంత్రి జూనియా గిలార్డ్ వెల్లడించారు. ఈ ఎన్నికల్లో ఓటర్లు తమ పార్టీకి పూర్తిగా అండగా నిలిచి మరోమారు అధికారంలోకి వచ్చేందుకు సహకరించాలని ఆమె ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.
Source: Yahoo! Telugu: News | 17 Jul 2010 | 8:56 am

మొన్న స్వర్ణాంధ్ర - నిన్న హరితాంధ్ర - నేడు స్వప్నాంధ్ర

కుటిల రాజకీయాలు కుళ్లు కంపు కొడుతున్నాయి కదూ....రాష్ట్ర రాజకీయాలు భ్రష్టు పట్టిపోయాయి కదూ....అధికారం కోసం ఒకరు, పదవి కోసం మరొకరు, పరువు కోసం ఇంకొకరు, ప్రత్యేక రాష్ట్రం కోసం వేరొకరు ఇలా... ఎవరికివారే... యమునా తీరే... అన్న చందంగా మారిపోయాయి కదూ... అయ్యా....! పేదోడి సమస్యలపైన చర్చిండంటే మీ ప్రభుత్వం ఇంత తిన్నదని ఒకరంటే మీరేం తక్కువ తిన్నారా... అంటారింకొకరు. మరొకరైతే.. పేదోడి రక్తాన్ని సైతం డబ్బుగా మార్చి వ్యాపారం చేయాలనుకుంటారు.
Source: Yahoo! Telugu: News | 17 Jul 2010 | 8:50 am

బెయిల్ వద్దు.. బాబ్లీ సందర్శనే ముద్దు: చంద్రబాబు

తమకు బెయిల్ వద్దని, బాబ్లీ ప్రాజెక్టును సందర్శనకు తమకు అనుమతి ఇవ్వాల్సిందేనని మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తెగేసి చెప్పారు. తమపై ఎలాంటి కేసులు బనాయించినా వెరవబోమని, ఎన్ని రోజులైనా కటిక నేలపై పడుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు తేల్చి చెప్పారు.
Source: Yahoo! Telugu: News | 17 Jul 2010 | 7:54 am

"గాలి" గనుల దుమారం: సభలో సభ్యుల జాగారం

ఇద్దరే మంత్రులు.. ఇద్దరూ సోదరులే. వారి వ్యాపారం రాష్ట్ర అసెంబ్లీని స్తంభింపజేసింది. ప్రతిపక్ష సభ్యులను అసెంబ్లీలోనే జాగారం చేసేందుకు పురిగొల్పింది. కర్నాటక రాష్ట్రంలో మంత్రి పదవులను అలంకరించిన ఆ ఇద్దరూ గాలి జనార్థన్ రెడ్డి, గాలి కరుణాకర్ రెడ్డి. వీరిద్దరూ కర్నాటక రాష్ట్రాన్ని లూటీ చేస్తుంటే ముఖ్యమంత్రి యడ్యూరప్ప హాయిగా రోజుకో సినిమా చూస్తున్నాడని ఆ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు సిద్ధరామయ్య విమర్శిస్తున్నారు.
Source: Yahoo! Telugu: News | 17 Jul 2010 | 7:34 am

చెన్నైలో మోగా రియల్టర్ల కీలక సమావేశం ప్రారంభం

తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైనగర శివారుల్లో ఉన్న మామల్లాపురంలోని రాడిసన్ రిసోర్ట్ టెంపుల్ బేలో జాతీయ రియల్టర్ల సంఘం రెండవ సవత్సర సమావేశం శుక్రవారం ప్రారంభమైంది. దీన్ని సీఆర్‌ఈడీఏఐ అధ్యక్షుడు టి.చిట్టిబాబు ప్రారంభించారు. మార్గ్ గ్రూప్ ఛైర్మన్ జీఆర్‌కే రెడ్డి ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. చెన్నై రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ అషోసియేషన్ ఆధ్వర్యంలో రెండు రోజులు జరుగనున్న ఈ సమావేశానికి దేశం నలుమూలల నుంచి దాదపు 500 మంది ప్రతినిధులు హాజరయ్యారు.
Source: Yahoo! Telugu: News | 17 Jul 2010 | 7:24 am

ఐ-ఫోన్‌లోనూ జోస్యం చెప్పనున్న ఆక్టోపస్ "పాల్"

అగ్గిపుల్ల - సబ్బు బిళ్ళ - కుక్క పిల్ల కాదేది కవితకి అనర్హం అన్న శ్రీశ్రీ మాటలేమో గానీ... సెలబ్రిటీ కావడానికి మనిషే కానవసరం లేదు... నేను సైతం అంటోంది జర్మనీకి చెందిన ఓ ఆక్టోపస్. సాకర్ ప్రపంచ కప్‌లో జోస్యం చెప్పిన "పాల్" (ఆక్టోపస్ పేరు) ప్రపంచ వ్యాప్తంగా అభిమాన్ని చూరగొంది. దీనిని సొంతం చేసుకునేందుకు ఇప్పటికే అనేక దేశాలు క్యూ కడుతున్నాయి.
Source: Yahoo! Telugu: News | 17 Jul 2010 | 7:10 am

తెలంగాణ ప్రజల వల్లే సమైక్యాంధ్ర ఆవిర్భావం: ఉండవల్లి

సమైక్యాంధ్ర ఏర్పాటులో అన్ని ప్రాంతాల ప్రజల సమ్మతం ఉందని రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అభిప్రాయపడ్డారు. ప్రధానంగా, తెలంగాణ ప్రాంత ప్రజల మనోభీష్టం మేరకే సమైక్య రాష్ట్రం ఆవిర్భవించిందన్నారు.
Source: Yahoo! Telugu: News | 17 Jul 2010 | 6:50 am

ఐఫోన్ వినియోగదారులకు సంరక్షక కవచాలు

ఈ మధ్యనే విడుదల చేసిన తమ సరికొత్త ఐఫోన్ కొనుగోలు చేసిన వినియోగదారులకు ఉచితంగా సంరక్షక కవచా(ప్రోటెక్టివ్ కేస్‌)లను అందిస్తున్నట్లు ఆపిల్ సంస్థ సీఈఓ స్టీవ్ జాబ్స్ కాలిఫోర్నియాలోని కంపెనీ ప్రధాన కార్యాలయంలో తెలియజేశారు. ఈ ఫోన్‌ను చేతితో పట్టుకోవడంలో కొన్ని సమస్యలు తలెత్తడంతో("డెత్ గ్రిప్"గా పిలవబడే) ఈ నిర్ణయం తీసుకున్నట్లు జాబ్స్ అన్నారు.
Source: Yahoo! Telugu: News | 17 Jul 2010 | 6:47 am

దోషులుగా తేలితే మంత్రివర్గం నుంచి తప్పిస్తాం: బీఎస్

ఇనుప ఖనిజం అక్రమ తరలింపులో తన మంత్రివర్గంలోని ఏ ఒక్కరికైనా పాత్ర ఉన్నట్టు నిరూపితమైతే.. వారిని 24 గంటల్లో మంత్రివర్గం నుంచి తొలగిస్తానని ముఖ్యమంత్రి బీఎస్.యడ్యూరప్ప స్పష్టం చేశారు. కర్ణాటక రాష్ట్ర రాజకీయాలపై చర్చించేందుకు ముఖ్యమంత్రి యడ్యూరప్ప హస్తినకు చేరుకున్నారు.
Source: Yahoo! Telugu: News | 17 Jul 2010 | 6:40 am

రియా.. ప్లీజ్ మాకు "ప్చ్" ఇవ్వవూ: కుర్ర హీరోలు

సెలబ్రిటీలు మందు కొట్టడం, దమ్ము కొట్టడం మామూలే. వారు కనుక మందు కొట్టారంటే సీన్ సితారైపోతుంది. తాజాగా బాలీవుడ్ తార రియాసేన్ ఓ నైట్ పార్టీలో పీకలదాకా డ్రింక్ చేసి పార్టీలో సహచర నటులతో తైతక్కలాడిందట. అలా చిందులేస్తూనే నిషా నషాలానికంటడంతో పలువురు హీరోలను గట్టిగా వాటేసుకుని వేడి వేడి ముద్దులు కురిపించిందట. ఆ ముద్దులు ఇచ్చింది ఎక్కడో తెలుసా...? నేరుగా హీరోల పెదవులకే. అడగకుండా ఉచితంగా అలా రియా ముద్దులిస్తుండేసరికి ఆమె ముద్దులు కోసం అక్కడే ఉన్న మరికొంతమంది చిన్న హీరోలు క్యూ కట్టారట. అడిగినవారికి అడిగినట్లు... ప్చ్.. ప్చ్... ప్చ్‌ప్చ్‌ప్చ్‌ప్చ్.. అంటూ దీర్ఘమైన లిప్‌లాక్ ముద్దులు ఇచ్చేసిందట. ఆ ముద్దుల రుచి చూసిన సదరు హీరోలు ఆ మైకం నుంచి ఇంకా తేరుకోనేలేదట. మరుసటి రోజు ఉదయం రియాకు ఫోన్ చేసి మళ్లీ "ప్చ్" కావాలని అడుగుతున్నారట.
Source: Yahoo! Telugu: Entertainment | 17 Jul 2010 | 6:37 am

బద్రినాథ్‌కు చిన్నికృష్ణ బౌండెడ్ స్క్రిప్ట్

2002లో చిరంజీవి నటించిన ఇంద్ర సినిమాకు చిన్నకృష్ణ బౌండెడ్ స్క్రిప్ట్ ఇచ్చారు. ఆ తర్వాత 2003లో అర్జున్ నటించిన గంగోత్రికి కూడా చిన్నికృష్ణ ఆ విధంగానే చేశారు. తాజాగా అల్లు అర్జున్ హీరోగా వి.వి.వినాయక్ దర్శకత్వంలో అల్లు అరవింద్ నిర్మిస్తున్న బద్రినాథ్‌కు కూడా చిన్నికృష్ణ బౌండెడ్ స్క్రిప్ట్ ని ఇచ్చారు. ఇటీవలే ఈ స్క్రిప్ట్‌ను వినాయక్, మధు తదితరుల సమక్షంలో చిత్ర నిర్మాత అల్లు అరవింద్‌కు అందజేశారాయన. ఈ నెల 26న ఈ చిత్రం షూటింగ్ ఆరంభం కానుంది. తమన్నా కథానాయికగా నటించే ఈ చిత్రానికి సంగీతం: కీరవాణి, కెమేరా: రవివర్మ, మాటలు: శ్రీ విస్సు, ఆర్ట్: ఆనంద్ సాయి, కథ - స్క్రీన్ ప్లే: చిన్నికృష్ణ, నిర్మాత: అల్లు అరవింద్, దర్శకత్వం: వి.వి.వినాయక్
Source: Yahoo! Telugu: Entertainment | 17 Jul 2010 | 6:04 am

బాబ్లీ సందర్శనకు అనుమతిచ్చే ప్రసక్తే లేదు: చవాన్

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును బాబ్లీ ప్రాజెక్టు సందర్శనకు అనుమతిచ్చే ప్రసక్తే లేదని మహారాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ చవాన్ తేల్చి చెప్పారు. ఈ కేసు సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నదని, అందువల్ల కోర్టు తీర్పు వచ్చేంత వరకు ఇరు వర్గాలు ఆగాల్సిందేనని ఆయన చెప్పారు. తాము కోర్టు తీర్పుకు అనుగుణంగా నడుచుకుంటామన్నారు
Source: జాతీయ | 17 Jul 2010 | 4:09 am

బెయిల్ వద్దు.. బాబ్లీ సందర్శనే ముద్దు: చంద్రబాబు

తమకు బెయిల్ వద్దని, బాబ్లీ ప్రాజెక్టును సందర్శనకు తమకు అనుమతి ఇవ్వాల్సిందేనని మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తెగేసి చెప్పారు. తమపై ఎలాంటి కేసులు బనాయించినా వెరవబోమని, ఎన్ని రోజులైనా కటిక నేలపై పడుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు తేల్చి చెప్పారు.
Source: ఏపీ న్యూస్ | 17 Jul 2010 | 2:25 am

తెలంగాణ ప్రజల వల్లే సమైక్యాంధ్ర ఆవిర్భావం: ఉండవల్లి

సమైక్యాంధ్ర ఏర్పాటులో అన్ని ప్రాంతాల ప్రజల సమ్మతం ఉందని రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అభిప్రాయపడ్డారు. ప్రధానంగా, తెలంగాణ ప్రాంత ప్రజల మనోభీష్టం మేరకే సమైక్య రాష్ట్రం ఆవిర్భవించిందన్నారు.
Source: ఏపీ న్యూస్ | 17 Jul 2010 | 1:21 am

దోషులుగా తేలితే మంత్రివర్గం నుంచి తప్పిస్తాం: బీఎస్

ఇనుప ఖనిజం అక్రమ తరలింపులో తన మంత్రివర్గంలోని ఏ ఒక్కరికైనా పాత్ర ఉన్నట్టు నిరూపితమైతే.. వారిని 24 గంటల్లో మంత్రివర్గం నుంచి తొలగిస్తానని ముఖ్యమంత్రి బీఎస్.యడ్యూరప్ప స్పష్టం చేశారు. కర్ణాటక రాష్ట్ర రాజకీయాలపై చర్చించేందుకు ముఖ్యమంత్రి యడ్యూరప్ప హస్తినకు చేరుకున్నారు.
Source: జాతీయ | 17 Jul 2010 | 1:11 am

మద్యం మత్తులో సహచరులను కాల్చి చంపిన జవాను!

జార్ఖండ్ రాష్ట్రంలో ఒక సీఆర్‌పీఎఫ్ జవాను ఘాతుకానికి పాల్పడ్డాడు. పీకలదాకా మద్యం సేవించి, సహచర జవాన్లపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఫలితంగా ఆరుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో అసిస్టెంట్ కమాండెంట్ కూడా ఉన్నాడు. ఈ దారుణం జార్ఖండ్ రాష్ట్రంలోని సరైకేల జిల్లాలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది.
Source: జాతీయ | 17 Jul 2010 | 12:08 am

బాబు బాబ్లీ యాత్ర ముమ్మాటికీ రాజకీయమే: పొన్నాల

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చేపట్టిన బాబ్లీ ప్రాజెక్టు సందర్శన బస్సు యాత్రపై రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖామంత్రి పొన్నాల లక్ష్మయ్య మండిపడ్డారు. ఇది బాబ్లీ సందర్శన యాత్ర కాదనీ.. ముమ్మాటికీ రాజకీయ యాత్రే అని ఆయన ఆరోపించారు.
Source: ఏపీ న్యూస్ | 17 Jul 2010 | 12:08 am

సీఎం రోశయ్య ఓ చవట దద్దమ్మ: తెదేపా ఎమ్మెల్యేలు

ముఖ్యమంత్రి కె.రోశయ్య ఒక చవటదద్దమ్మలా వ్యవహరిస్తున్నారని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఆరోపించారు. గాంధీ కుటుంబం ఆది నుంచి రాష్ట్రానికి అన్యాయం చేస్తోందని వారు దుయ్యబట్టారు. మహారాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రతి అక్రమ ప్రాజెక్టు గురించి కాంగ్రెస్ అధినేత్రి సోనియాకు బాగా తెలుసన్నారు.
Source: ఏపీ న్యూస్ | 16 Jul 2010 | 11:40 pm

ఓదార్పుతో పార్టీకి లాభమే గానీ నష్టం లేదు: మంత్రి పిల్లి

కడప ఎంపీ వైఎస్.జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన ఓదార్పు యాత్ర వల్ల కాంగ్రెస్ పార్టీకి లాభమేగానీ, ఎలాంటి నష్టం లేదని రాష్ట్ర సంఘీక సంక్షేమ శాఖామంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ అభిప్రాయపడ్డారు. ఆయన శనివారం రాజమండ్రిలో విలేకరులతో మాట్లాడుతూ తూర్పుగోదావరిలోనే ఇప్పటి వరకు సాగిన ఓదార్పు యాత్రకు ప్రజల నుంచి అపూర్వ స్పందన వస్తోందన్నారు. జగన్ వ్యక్తిగతంగా యాత్ర చేస్తున్నప్పటికీ.. దీనివల్ల పార్టీకి లాభమే కానీ నష్టం లేదన్నారు.
Source: ఏపీ న్యూస్ | 16 Jul 2010 | 11:17 pm

టెంటు కింద.. కటిక నేలపై చంద్రబాబుకు 'మహా'రాత్రి!

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు కాళరాత్రి ఎలా ఉంటుందో మహారాష్ట్ర పోలీసులు అనుభవపూర్వకంగా చూపించారు. బాబ్లీ ప్రాజెక్టు సందర్శన పేరుతో బస్సు యాత్రను చేపట్టిన చంద్రబాబు అండ్ కోను మహారాష్ట్ర పోలీసులు మహామోసం ఫక్కీలో అరెస్టు చేసిన విషయం తెల్సిందే. అక్కడ నుంచి ధర్మాబాద్‌లోని ఒక ఐటీఐ కళాశాలకు ఆ బృందాన్ని తరలించారు.
Source: ఏపీ న్యూస్ | 16 Jul 2010 | 10:22 pm

ఢిల్లీలో కర్ణాటక రాజకీయాలు: నేడు ప్రధానితో బీఎస్ భేటీ!

కర్ణాటక రాజకీయాలు హస్తినకు మారాయి. ముఖ్యమంత్రి బీఎస్.యడ్యూరప్ప శనివారం ఢిల్లీకి చేరుకుని ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్‌తో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై ఆయనకు వివరిస్తారు.
Source: జాతీయ | 16 Jul 2010 | 9:56 pm

పాక్‌తో చర్చల వల్ల ప్రయోజనం శూన్యం: సుష్మాస్వరాజ్

దాయాది దేశం పాకిస్థాన్‌తో చర్చలు జరపడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండబోదని తాము ముందే చెప్పామని భారతీయ జనతా పార్టీ లోక్‌సభ ప్రతిపక్ష నేత సుష్మాస్వరాజ్ అన్నారు. ఇపుడే.. ఎప్పటికీ.. పాకిస్థాన్ తన వైఖరిని మార్చుకోబోదని, అందువల్ల ఆ దేశంలో ఎలాంటి ద్వైపాక్షిక సంబంధాలను కొనసాగించరాదన్నారు.
Source: జాతీయ | 16 Jul 2010 | 9:39 pm

నాగ్ చిత్రానికి టైటిల్ పెట్టండి - బహుమతి గెల్చుకోండి

అక్కినేని నాగార్జునతో దిల్ రాజు నిర్మిస్తోన్న చిత్రానికి టైటిల్ పెట్టి బహుమతి గెలుకోండని నిర్మాత ప్రకటించారు. "ఆకాశమంత" చిత్ర దర్శకుడు రాధామోహన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ... ఈ చిత్రానికి "పయనం", "గగనం", "వాంటెడ్" అని మూడు టైటిల్స్ పరిశీలనకు పెట్టాం. ప్రేక్షకులు, అభిమానులు వీటిలో దేన్ని సరైన టైటిల్‌గా ఎంపిక చేస్తే డ్రా తీసి అందులో గెలుపొందిన వరుస ఏడుగురికి బహుమతులు అందజేస్తామని దిల్ రాజు చెప్పారు. ఈ చిత్రం నాగార్జునకు చాలా ప్రీతిపాత్రమైనదనీ, తెలుగు ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్ సృష్టిస్తుందని దిల్ రాజు అన్నారు. టైటిల్ ఈ అడ్రెస్‌కు మెయిల్ చేయాలన్నారు... నాగ్ ఫిలింటైటిల్ ఎట్ జీమెయిల్.కామ్
Source: Yahoo! Telugu: Entertainment | 16 Jul 2010 | 3:16 pm

టైటిల్ వరకే "శుభప్రదం".. మరి సినిమానో...

మామూలు సినిమాలకంటే కె.విశ్వనాథ్ చిత్రాలంటే ప్రేక్షకుల్లో ఆసక్తి ఎక్కువ. సంగీత ప్రధానమైనా ఎటువంటి తరహాలో కథ ఉంటుందనే ఉత్సాహం ఉంటుంది. అదే థియేటర్ వరకు లాక్కొస్తుంది. గతంలో విశ్వనాథ్ తీసిన చిత్రాలు ఒక ఎత్తు. ఈసారి అల్లరి నరేష్ పేరులోనే అల్లరి ఉందిగా.. అలా అల్లరిచిల్లరిగా ఉండే నరేష్‌ను హీరోగా ఎంచుకుని కామెడీ ట్రాక్ వైపు మళ్లాడు. మొదటి భాగమంతా ఏదో సరదాగా సాగినా రెండో భాగం 20 నిమిషాల మినహా సినిమా ఆసక్తికరంగా సాగదు. కథలోకి వెళితే... చక్రధరరావు - చక్రి ( నరేష్) జులాయిగా తిరిగే యువకుడు. నోటి దురుసు ఎక్కువే. దేన్నీ సీరియస్‌గా తీసుకోడు. పెద్దవాళ్లయినా చిన్నవాళ్లయినా ఒకేలా ట్రీట్ చేస్తాడు. అతని బాబాయ్ కేరళలో క్యాటరింగ్ చేస్తుంటాడు. ఆ పనిలో భాగంగా రైలు దిగి వస్తాడు. అక్కడ అనుకోని రీతిలో ఇందు(మంజరి) పరిచయం ఏర్పడుతుంది. ఇతగాడు స్వరగాయకుడని భ్రమిస్తుంది. దాన్నే ఖాయంగా చేసుకునేలా చక్రి ప్రవర్తిస్తుంటాడు.
Source: Yahoo! Telugu: Entertainment | 16 Jul 2010 | 11:56 am

బాబ్లీని చూడనివ్వం- చవాన్: చూసేదాకా వెళ్లం- బాబు

మహారాష్ట్ర సర్కార్ అనుకున్నది చేసింది. బాబ్లీని సందర్శించేందుకు వెళ్లిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుతో సహా 76మంది ప్రజాప్రతినిధులను నాటకీయంగా అరెస్టు చేసి ధర్మాబాద్ ఐటీఐకి తరలించింది.
Source: ఏపీ న్యూస్ | 16 Jul 2010 | 9:09 am

పొన్నాలకు సిగ్గుంటే రాజీనామా చేయాలి: నాగం

రాష్ట్ర ప్రయోజనాలు మంటగలుస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం కళ్లు మూసుకుని కూచుందని నాగం జనార్థన్ రెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్రానికి రావలసిన జలాన్ని మహారాష్ట్ర దోచుకుంటూ ఎడాపెడా ప్రాజెక్టులను నిర్మిస్తుంటే ప్రభుత్వం మొద్దు నిద్ర పోతోందని విమర్శించారు.
Source: ఏపీ న్యూస్ | 16 Jul 2010 | 8:10 am

తెలుగు సినిమాల్లో శృంగారం తక్కువే: సమీర

మ్యూజిక్ వీడియో ఆల్బమ్‌తో కెరీర్ ప్రారంభమయినా వెండితెరపై సొహైల్ ఖాన్‌తో "మైనే దిల్ తుఝ్ కో దియా"తో సినీరంగ ప్రవేశం చేసిన సమీరా రెడ్డి... తాజాగా రెడ్ అలర్ట్ చిత్రంలో మహిళా మావోయిస్టుగా నటిస్తోంది. ఈ పాత్రతో చాలా నేర్చుకున్నానని చెపుతోంది. ఇదే తరహా పాత్రలు చేయననీ, శృంగారాత్మక చిత్రాల్లో కూడా నటిస్తానని చెప్పింది. తాజాగా ఓ తెలుగు సినిమా నిర్మాత ఆమెను ముంబైలో కలిసినట్లు వార్తలు వచ్చాయి. అయితే బాలీవుడ్ కంటే టాలీవుడ్‌లో శృంగారం తక్కువగానే ఉంటుందని అంది. అయితే నెక్ట్స్ తెలుగులో చేస్తుందన్నమాట.
Source: Yahoo! Telugu: Entertainment | 16 Jul 2010 | 7:46 am

సునిల్‌ "సుడి" తిరిగింది: శాన్వి ప్రొడక్షన్ చిత్రం

ప్రముఖ హాస్య నటుడు సునిల్ కథానాయకుడిగా త్వరలో మరోచిత్రం రూపొందనుంది. శాన్వి ప్రొడక్షన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ 1గా నిర్మాణం కానున్న ఈ చిత్రాన్ని ఇంతకు ముందు టాలీ టు హాలీ పతాకంపై ప్రవరాఖ్యుడు, ఆ ఒక్కడు చిత్రాలను నిర్మించిన గణేష్ ఇందుకూరి నిర్మిస్తున్నారు. తాజా చిత్రం గురించి గురువారం ఆయన మాట్లాడుతూ... సునిల్ కథానాయకుడిగా నటించనున్న ఈ చిత్రం షూటింగ్ వచ్చే నెల 15న ప్రారంభిస్తాం. నవ్యమైన కథ, కథనాలతో రూపొందనున్న ఈ చిత్రానికి పనిచేసే దర్శకుడు, ఇతర సాంకేతిక నిపుణులు, నటీనటుల వివరాలు త్వరలో తెలియజేస్తాం అన్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 16 Jul 2010 | 7:19 am

రాజకీయ ప్రయోజనం కోసమే 'బాబు' బాబ్లీ బస్సు యాత్ర..!?

రాజకీయ ప్రయోజనం కోసమే తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బాబ్లీ బస్సు యాత్ర చేపట్టారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అలాగే తెలంగాణలో ఉప ఎన్నికలు జరుగనుండటంతో ఎన్నికల ప్రచారంలో భాగంగానే తెదేపా అధినేత చంద్రబాబు తన పార్టీ నాయకులతో కలిసి బాబ్లీ బస్సు యాత్ర చేపట్టినట్లు రాజకీయ నేతలు భావిస్తున్నారు.
Source: ఏపీ న్యూస్ | 16 Jul 2010 | 7:16 am

ఎఫ్‌డిసిని ముట్టడిస్తాం: ఆంధ్రప్రదేశ్ ప్రజా నాట్యమండలి

సినీ పరిశ్రమ అభివృద్ధికోసం కేటాయించిన జూబ్లీహిల్స్ లోని ఎఫ్.డి.సికి చెందిన 30 ఎకరాల భూమిని నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ సంస్థలకు ధారాదత్తం చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామనీ, సత్వరమే ఈ ప్రయత్నాన్ని విరమించుకోకపోతే ఎఫ్.డి.సిని ముట్టడించి స్తంభింపజేస్తామని - ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి చలనచిత్రశాఖ అధ్యక్ష, కార్యదర్శులు బాబ్జీ, మద్దినేని రమేష్‌లు ఓ ప్రకటనలో హెచ్చరించారు.
Source: Yahoo! Telugu: Entertainment | 16 Jul 2010 | 7:14 am

జగన్ ఏం చేశాడు..? ఎందుకు చర్య తీసుకోవాలి...?: మొయిలీ

సోనియా గాంధీ చెప్పిన మాటను ఖాతరు చేయకుండా ఓదార్పు యాత్రను చేపడుతూ నిర్ణయం తీసుకోవడమే కాక, పలుమార్లు ముఖ్యమంత్రి రోశయ్యపై విమర్శనాస్త్రాలు సంధించిన వైఎస్ జగన్‌ను వీరప్ప మొయిలీ వెనకేసుకొచ్చారు. జగన్ తాను చేపట్టిన యాత్ర వ్యక్తిగతమైనదని చెప్పారు కనుక దానిపై చర్చించుకోవాల్సిన అవసరం లేదని కొట్టి పారేశారు.
Source: ఏపీ న్యూస్ | 16 Jul 2010 | 7:13 am

పవన్ కల్యాణ్ "కొమరం పులి" ట్రెయిలర్

పవన్ కల్యాణ్ "కొమరం పులి" ట్రెయిలర్
Source: Yahoo! Telugu: Entertainment | 16 Jul 2010 | 7:13 am

టైటిల్ వరకే "శుభప్రదం".. మరి సినిమానో...

మామూలు సినిమాలకంటే కె.విశ్వనాథ్ చిత్రాలంటే ప్రేక్షకుల్లో ఆసక్తి ఎక్కువ. సంగీత ప్రధానమైనా ఎటువంటి తరహాలో కథ ఉంటుందనే ఉత్సాహం ఉంటుంది. అదే థియేటర్ వరకు లాక్కొస్తుంది. గతంలో విశ్వనాథ్ తీసిన చిత్రాలు ఒక ఎత్తు. ఈసారి అల్లరి నరేష్ పేరులోనే అల్లరి ఉందిగా.. అలా అల్లరిచిల్లరిగా ఉండే నరేష్‌ను హీరోగా ఎంచుకుని కామెడీ ట్రాక్ వైపు...
Source: వినోదం | 16 Jul 2010 | 6:29 am

ముంబై పేలుళ్ల కేసులో పాకిస్థాన్ సహకారం: ఎస్.ఎమ్. కృష్ణ

2008వ సంవత్సరం జరిగిన ముంబై పేలుళ్ల కేసులో భారత్‌కు కావాల్సిన సమాచారం ఇస్తామని పాకిస్థాన్ హామీ ఇచ్చినట్లు కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్.ఎమ్. కృష్ణ తెలిపారు. ఇరుదేశాల మధ్య శాంతి, సౌభ్రాతృత్వం పెంపొందేలా చర్చలు సాగినట్లు మంత్రి తెలియజేశారు.
Source: జాతీయ | 16 Jul 2010 | 5:03 am