|
'బాబ్లీ'కి చంద్రబాబు బస్సు యాత్ర అనవసరం: వీహెచ్గోదావరి నదిపై మహారాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న బాబ్లీ ప్రాజెక్టుపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చేపట్టిన బస్సు యాత్ర అనసరమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి. హనుమంతరావు వ్యాఖ్యానించారు. తెదేపా అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హయాంలోనే బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభమైందని వీహెచ్ అన్నారు.Source: Yahoo! Telugu: News | 16 Jul 2010 | 8:28 am మా నీళ్లు మాక్కావాలి: సరిహద్దులో బాబు బైఠాయింపుమహా అక్రమ ప్రాజెక్టులపై తెలుగుదేశం పార్టీ పోరుబాటు చేపట్టింది. మహారాష్ట్రలోని ధర్మాబాద్ సరిహద్దు ప్రాంతంలో మహారాష్ట్ర పోలీసులు ఏర్పాటు చేసిన బారి సరిహద్దు దాటేందుకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుతో సహా మిగిలిన ఎమ్మెల్యేలు యత్నించి పోలీసులు అడ్డుకోవడంతో అక్కడే రోడ్డుపై బైఠాయించారు.Source: Yahoo! Telugu: News | 16 Jul 2010 | 8:22 am యూరప్ స్టాక్ మార్కెట్ ప్రభావం: సెన్సెక్స్ వృద్ధి!బాంబే స్టాక్ మార్కెట్ శుక్రవారం లాభాలను ఆర్జిస్తోంది. ట్రేడింగ్ ప్రారంభం నుంచే స్వల్ప లాభాలతో కొట్టుమిట్టాడుతున్న బాంబే స్టాక్ మార్కెట్, మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో 54 పాయింట్లు బలపడింది. దీంతో సెన్సెక్స్ సూచి 17,963 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచి నిఫ్టీ కూడా 18 పాయింట్ల స్వల్ప వృద్ధితో 5,396 పాయింట్ల మార్కు వద్ద పయనిస్తోంది.Source: Yahoo! Telugu: News | 16 Jul 2010 | 8:14 am ఊపందుకున్న ట్రేడింగ్: లాభాల్లో సెన్సెక్స్!వారాంతమైన శుక్రవారం బాంబే స్టాక్ మార్కెట్ లాభాలను ఆర్జించింది. ట్రేడింగ్ ప్రారంభం నుంచే ఆశాజనకంగా కొనసాగుతున్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచి సెన్సెక్స్, మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో 37 పాయింట్లు లాభపడి, 17,946 పాయింట్ల మార్కును తాకింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచి నిఫ్టీ కూడా పది పాయింట్లు స్వల్పంగా పుంజుకుని, 5,388 పాయింట్ల వద్ద పయనిస్తోంది.Source: Yahoo! Telugu: News | 16 Jul 2010 | 8:05 am తెలుగు సినిమాల్లో శృంగారం తక్కువే: సమీరమ్యూజిక్ వీడియో ఆల్బమ్‌తో కెరీర్ ప్రారంభమయినా వెండితెరపై సొహైల్ ఖాన్‌తో "మైనే దిల్ తుఝ్ కో దియా"తో సినీరంగ ప్రవేశం చేసిన సమీరా రెడ్డి... తాజాగా రెడ్ అలర్ట్ చిత్రంలో మహిళా మావోయిస్టుగా నటిస్తోంది. ఈ పాత్రతో చాలా నేర్చుకున్నానని చెపుతోంది. ఇదే తరహా పాత్రలు చేయననీ, శృంగారాత్మక చిత్రాల్లో కూడా నటిస్తానని చెప్పింది. తాజాగా ఓ తెలుగు సినిమా నిర్మాత ఆమెను ముంబైలో కలిసినట్లు వార్తలు వచ్చాయి. అయితే బాలీవుడ్ కంటే టాలీవుడ్‌లో శృంగారం తక్కువగానే ఉంటుందని అంది. అయితే నెక్ట్స్ తెలుగులో చేస్తుందన్నమాట.Source: Yahoo! Telugu: Entertainment | 16 Jul 2010 | 7:46 am స్టాక్ మార్కెట్: 18వేల మార్కును తాకిన సెన్సెక్స్!బాంబే స్టాక్ మార్కెట్ శుక్రవారం లాభాలను ఆర్జిస్తోంది. ఫలితంగా బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచి 18వేల మార్కును తాకింది. శుక్రవారం ట్రేడింగ్ ప్రారంభం నుంచే పురోగమనం వైపు ర్యాలీని కొనసాగిస్తున్న బాంబే స్టాక్ మార్కెట్, 11.30 గంటల ప్రాంతంలో స్వల్ప లాభాలను నమోదు చేసుకుంది. ఫలితంగా బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచి సెన్సెక్స్, 10 పాయింట్ల స్వల్ప వృద్ధితో 18,919 మార్కును తాకింది.Source: Yahoo! Telugu: News | 16 Jul 2010 | 7:36 am డీజిల్ ధరలపై వ్యాట్ టాక్స్‌ను తగ్గించిన ఢిల్లీ ప్రభుత్వంపెరిగిన ద్రవ్యోల్బణంను దృష్టిలో ఉంచుకొని ఢిల్లీ ప్రజలకు కాస్త ఊరట కలిగిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం డీజిల్‌పై వ్యాట్ టాక్స్‌ను తగ్గించింది. ప్రస్తుతం 20శాతం ఉన్న ఈ టాక్స్‌ను 12.5శాతానికి తగ్గించింది. ఫలితంగా నగరంలో డీజిల్ ధర లీటరుకు రూ. 40 ఉండగా ఈ తగ్గింపు వల్ల 37.50 పైసలకు చేరుకుంది.Source: Yahoo! Telugu: News | 16 Jul 2010 | 7:29 am స్టాక్ మార్కెట్: లాభాల్లో సెన్సెక్స్, నిఫ్టీల ర్యాలీ!వారాంతమైన శుక్రవారం బాంబే స్టాక్ మార్కెట్ లాభాలను ఆర్జిస్తోంది. ట్రేడింగ్ ప్రారంభం నుంచే పురోగమనం వైపు ర్యాలీని కొనసాగించన బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచి సెన్సెక్స్, ఉదయం 10.30 గంటల ప్రాంతంలో 28 పాయింట్లు పుంజుకుని, 17,938 పాయింట్ల మార్కును తాకింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచి నిఫ్టీ కూడా 8 పాయింట్ల స్వల్ప లాభంతో 5,387 పాయింట్ల వద్ద ర్యాలీని కొనసాగిస్తోంది.Source: Yahoo! Telugu: News | 16 Jul 2010 | 7:27 am ముంబై పేలుళ్లపై విచారణ వేగిరం చేయండి: కృష్ణ డిమాండ్దేశ వాణిజ్య నగరం ముంబై మారణ హోమంపై పాకిస్థాన్ విచారణను వేగిరం చేయాలని పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఖురేషిని, కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్.ఎమ్. కృష్ణ డిమాండ్ చేశారు. పాకిస్థాన్‌కు చెందిన తీవ్రవాద సంస్థ ముంబైలో సృష్టించిన విధ్వంసంపై ఆ దేశంలో జరిగే విచారణను త్వరితగతిన పూర్తి స్థాయిలో చేపట్టాలని ఎస్.ఎమ్ కృష్ణ విజ్ఞప్తి చేశారు.Source: Yahoo! Telugu: News | 16 Jul 2010 | 7:22 am సునిల్ "సుడి" తిరిగింది: శాన్వి ప్రొడక్షన్ చిత్రంప్రముఖ హాస్య నటుడు సునిల్ కథానాయకుడిగా త్వరలో మరోచిత్రం రూపొందనుంది. శాన్వి ప్రొడక్షన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ 1గా నిర్మాణం కానున్న ఈ చిత్రాన్ని ఇంతకు ముందు టాలీ టు హాలీ పతాకంపై ప్రవరాఖ్యుడు, ఆ ఒక్కడు చిత్రాలను నిర్మించిన గణేష్ ఇందుకూరి నిర్మిస్తున్నారు. తాజా చిత్రం గురించి గురువారం ఆయన మాట్లాడుతూ... సునిల్ కథానాయకుడిగా నటించనున్న ఈ చిత్రం షూటింగ్ వచ్చే నెల 15న ప్రారంభిస్తాం. నవ్యమైన కథ, కథనాలతో రూపొందనున్న ఈ చిత్రానికి పనిచేసే దర్శకుడు, ఇతర సాంకేతిక నిపుణులు, నటీనటుల వివరాలు త్వరలో తెలియజేస్తాం అన్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 16 Jul 2010 | 7:19 am ఎఫ్‌డిసిని ముట్టడిస్తాం: ఆంధ్రప్రదేశ్ ప్రజా నాట్యమండలిసినీ పరిశ్రమ అభివృద్ధికోసం కేటాయించిన జూబ్లీహిల్స్ లోని ఎఫ్.డి.సికి చెందిన 30 ఎకరాల భూమిని నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ సంస్థలకు ధారాదత్తం చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామనీ, సత్వరమే ఈ ప్రయత్నాన్ని విరమించుకోకపోతే ఎఫ్.డి.సిని ముట్టడించి స్తంభింపజేస్తామని - ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి చలనచిత్రశాఖ అధ్యక్ష, కార్యదర్శులు బాబ్జీ, మద్దినేని రమేష్‌లు ఓ ప్రకటనలో హెచ్చరించారు.Source: Yahoo! Telugu: Entertainment | 16 Jul 2010 | 7:14 am పవన్ కల్యాణ్ "కొమరం పులి" ట్రెయిలర్పవన్ కల్యాణ్ "కొమరం పులి" ట్రెయిలర్Source: Yahoo! Telugu: Entertainment | 16 Jul 2010 | 7:13 am నక్సలిజం వ్యాప్తికి నితీష్ కుమారే కారణం!: లాలూ ప్రసాద్బీహార్లో నక్సలిజం వ్యాప్తి చెందడానికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ముఖ్య కారణమని రాష్ట్రీయ జనతా దళ పార్టీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ విమర్శించారు. రాష్ట్రంలో నక్సల్స్ దుశ్చర్యలు పెరిగిపోవడానికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పరిపాలనే తీరే ప్రధాన కారణమని లాలూ ప్రసాద్ దుయ్యబట్టారు.Source: Yahoo! Telugu: News | 16 Jul 2010 | 7:01 am "బాబ్లీ" బయలుదేరిన తెదేపా బృందం: సరిహద్దులో ఉద్రిక్తతమహారాష్ట్ర చేపట్టిన అక్రమ ప్రాజెక్టులను నిలిపివేయాలంటూ తెలుగుదేశం పార్టీ పోరుబాటు పట్టింది. బాబ్లీకి బస్సు యాత్ర చేపట్టింది. కాగా బాబ్లీ ప్రాజెక్టును తెదేపా బృందం చేరుకోకుండా చేసేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం ఆంధ్ర - సరిహద్దు ప్రాంతంలో 144వ సెక్షన్ విధించారు. రహదారి మొత్తాన్ని పూర్తిగా మూసివేశారు.Source: Yahoo! Telugu: News | 16 Jul 2010 | 6:47 am 'బాబ్లీ'కి చంద్రబాబు బస్సు యాత్ర అనవసరం: వీహెచ్గోదావరి నదిపై మహారాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న బాబ్లీ ప్రాజెక్టుపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చేపట్టిన బస్సు యాత్ర అనసరమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి. హనుమంతరావు వ్యాఖ్యానించారు. తెదేపా అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హయాంలోనే బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభమైందని వీహెచ్ అన్నారు.Source: ఏపీ న్యూస్ | 16 Jul 2010 | 3:00 am మా నీళ్లు మాక్కావాలి: సరిహద్దులో బాబు బైఠాయింపుమహా అక్రమ ప్రాజెక్టులపై తెలుగుదేశం పార్టీ పోరుబాటు చేపట్టింది. మహారాష్ట్రలోని ధర్మాబాద్ సరిహద్దు ప్రాంతంలో మహారాష్ట్ర పోలీసులు ఏర్పాటు చేసిన బారి సరిహద్దు దాటేందుకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుతో సహా మిగిలిన ఎమ్మెల్యేలు యత్నించి పోలీసులు అడ్డుకోవడంతో అక్కడే రోడ్డుపై బైఠాయించారు.Source: ఏపీ న్యూస్ | 16 Jul 2010 | 2:53 am "బాబ్లీ" బయలుదేరిన తెదేపా బృందం: సరిహద్దులో ఉద్రిక్తతమహారాష్ట్ర చేపట్టిన అక్రమ ప్రాజెక్టులను నిలిపివేయాలంటూ తెలుగుదేశం పార్టీ పోరుబాటు పట్టింది. బాబ్లీకి బస్సు యాత్ర చేపట్టింది. కాగా బాబ్లీ ప్రాజెక్టును తెదేపా బృందం చేరుకోకుండా చేసేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం ఆంధ్ర - సరిహద్దు ప్రాంతంలో 144వ సెక్షన్ విధించారు. రహదారి మొత్తాన్ని పూర్తిగా మూసివేశారు.Source: ఏపీ న్యూస్ | 16 Jul 2010 | 2:04 am నక్సలిజం వ్యాప్తికి నితీష్ కుమారే కారణం!: లాలూ ప్రసాద్బీహార్లో నక్సలిజం వ్యాప్తి చెందడానికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ముఖ్య కారణమని రాష్ట్రీయ జనతా దళ పార్టీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ విమర్శించారు. రాష్ట్రంలో నక్సల్స్ దుశ్చర్యలు పెరిగిపోవడానికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పరిపాలనే తీరే ప్రధాన కారణమని లాలూ ప్రసాద్ దుయ్యబట్టారు.Source: జాతీయ | 16 Jul 2010 | 1:32 am ఒరిస్సాలో పోలీస్ స్టేషన్‌ను పేల్చివేసిన మావోయిస్టులు!ఒరిస్సాలోని నాబరంగ్‌పూర్ జిల్లాలో గురువారం రాత్రి ఓ పోలీస్ స్టేషన్‌ను మావోయిస్టులు పేల్చివేశారు. అయితే ఈ సంఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని పోలీసులు తెలిపారు. దాదాపు 30 మంది సాయుద తిరుగుబాటుదారులు రాయ్‌ఘర్ బ్లాక్‌లోనికి ప్రవేశించి శక్తివంతమైన మందుపాతరలతో పోలీస్ స్టేషనుపై దాడి చేశారు. వీరిలో ఒక మహిళా మావోయిస్టు కూడా ఉన్నట్లు జిల్లా ఎస్‌పీ ప్రఫుల్ బారిక్ తెలిపారు.Source: జాతీయ | 16 Jul 2010 | 1:18 am లోకాయుక్త వ్యవస్థ బలపడుతుంది: సీఎం యడ్యూరప్పరాష్ట్రంలో లోకాయుక్త వ్యవస్థ బలపడుతుందని కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప వ్యాఖ్యానించారు. లోకాయుక్త న్యాయపరమైన కార్యకలాపాలు దిగ్విజయంగా కొనసాగడానికి రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని యడ్యూరప్ప అన్నారు. కర్ణాటక గవర్నర్ భరద్వాజతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యడ్యూరప్ప సమావేశమయ్యారు.Source: జాతీయ | 16 Jul 2010 | 12:28 am టెర్మనల్-3లోకి ల్యాండ్ అయిన అతిపెద్ద విమానం!దేశ రాజధాని న్యూఢిల్లీలోని కొత్తగా నిర్మించిన ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్-3లో మొట్టమొదటి విమానం ల్యాండ్ అయింది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రయాణికుల విమానం ఎ 380 కొత్తగా నిర్మించిన టెర్మినల్ 3కి వచ్చింది. ఎమిరేట్స్ ఎ 380 సూపర్ జంబో "ఈకె 516" విమాన సిబ్బందితో సహా మొత్తం 543 ప్రయాణికులతో దుబాయి నుంచి విచ్చేశారు.Source: జాతీయ | 15 Jul 2010 | 11:50 pm ఏడుకొండలపై అక్రమాలను ఎండగట్టేందుకు చిరు పాదయాత్ర!ప్రజారాజ్యం అధినేత చిరంజీవి తిరుపతిలో పాదయాత్ర చేపట్టనున్నారు. తిరుమలలో జరుగుతున్న వరుస అక్రమాలపై తక్షమే సీబీఐతో గానీ, సుప్రీం కోర్టుతో గానీ విచారణ జరిపించాలని డిమండ్ చేస్తూ తమ పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి తిరుపతి నుంచి తిరుమలకు పాదయాత్ర చేయనున్నారు. తితిదేలో తలెత్తున్న వరుస వివాదాలు, శ్రీవారికి రాయలు సమర్పించిన ఆభరణాలు మాయం వంటి కుంభకోణాలతో శ్రీవారి ప్రతిష్ట దెబ్బతింటోందని దీనిపై వంటనే విచారణ జరిపించాలని ఆయన కోరారు. దీనికోసం ఇప్పటికే ఆయన తిరుపతి చేరుకున్నారు.Source: ఏపీ న్యూస్ | 15 Jul 2010 | 11:49 pm మహారాష్ట్ర బెదిరింపులకు ఏ మాత్రం భయపడం..!: బాబుబాబ్లీపై మహారాష్ట్ర నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులను నిరసిస్తూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆధ్వర్యంలో బాబ్లీ ప్రాజెక్టు వద్దకు భారీస్థాయిలో బస్సుయాత్ర ప్రారంభించారు. 15 బస్సుల్లో 70 మంది ఎమ్మెల్యేలతో బాబ్లీకు పయనమయ్యారు. వీరితోపాటు లోక్‌సత్తా సభ్యులు చేతులు కలిపారు.Source: ఏపీ న్యూస్ | 15 Jul 2010 | 11:38 pm కర్ఫ్యూతో కుదేలైన కాశ్మీర్: ఆర్థిక పరిస్థితిపై ప్రభావం!కాశ్మీర్ లోయలో ఉద్రిక్త పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పదిరోజులుగా విధించిన కర్ఫ్యూ ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం చూపింది. ప్రతిరోజూ ఏదో ఒక ప్రాంతంలో ఘర్షణలు తలెత్తడంతో అధికార యంత్రాంగం కంటిమీద కునుకు లేకుండా పరిస్థితిని సమీక్షిస్తోంది. పైగా రోజుకు కోట్ల రూపాయల మేర ఆర్థిక నష్టం వాటిల్లుతోందని సమాచారం.Source: జాతీయ | 15 Jul 2010 | 10:42 pm ఎంత రుచి చూసినా... ఇంకా చూడాలనిపిస్తోంది: నేహాఓవర్ ఎక్స్‌పోజింగ్, అర్థనగ్నపు సన్నివేశాలలో అలవోకగా నటించే నేహాధూపియాను తన సెక్సీ ఫిగర్ వెనుక దాగున్న రహస్యం ఏమిటని అడిగితే, ఆపకుండా చెప్పడం మొదలుపెట్టింది. " నేను సహజంగా పెద్ద తిండిబోతుని. గోవా ఆహారప్రియులకు స్వర్గం లాంటిది. ఇక్కడ అన్ని రకాలు లభిస్తాయి. అందుకే నాకు ఎప్పుడు టైం దొరికినా అక్కడకెళ్లి కడుపారా తిని వస్తా. పనిలో పనిగా కాసేపు గోవా బీచ్ వెంట సేద తీరుతా. నా సినీ కెరీర్ జపనీస్ సినిమాతో ఆరంభించాను. ఇప్పుడీ విషయం ఎందుకు చెపుతున్నానంటే... అక్కడ నేను ఎంతో ఇష్టంగా తిన్న ఆహారం గురించి చెప్పడానికే. జపాన్‌లో సినిమా చేసేటపుడు, అక్కడి ఆహారం ఎలా ఉంటుందో అనుకున్నాను. కానీ, అక్కడి వంటకం "సుషి" తిన్నాక మళ్లీ మళ్లీ ఆ రుచే కావాలనిపిస్తోంది. ఇక ఫ్రెంచ్ ఆహారం కోసం లాప్లేన్‌ను ఇష్టపడతాను.భారతీయ ఆహారాన్ని పెద్దగా ఇష్టపడను కాని ధ్రిల్, సలాడ్, గ్రేవీలు బాగా ఇష్టపడతాను. ఆహారాన్ని ఎంతగా ఎంజాయ్ చేస్తానో క్యాలరీలనూ అంతే లెక్కించుకుంటాను. నిద్ర లేచీ లేవగానే ఆకలిగా ఉంటే తక్కువ ఫ్యాట్ ఉండే పెరుగు, ఓ కప్పు ద్రాక్ష పండ్లు తింటాను" అని వివరించింది నేహాధూపియాSource: Yahoo! Telugu: Entertainment | 15 Jul 2010 | 10:24 am మంత్రి ధర్మానకు బాగా కొవ్వెక్కింది: చంద్రబాబు ధ్వజంరాష్ట్ర రెవెన్యూ శాఖామంత్రి ధర్మాన ప్రసాదరావుకు బాగా కొవ్వెక్కిందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. తమ బతుకులు సర్వ నాశనమైపోతాయని అన్ని వర్గాల ప్రజలు మొత్తుకుంటున్నా వారి గోడును పట్టించుకోని మంత్రి ధర్మాన.... ఆందోళనకారుల శవాలపై విద్యుత్ కేంద్రాన్ని నిర్మించాలని మొండిపట్టు పట్టడాన్ని చంద్రబాబు తీవ్రంగా తప్పుబట్టారు.Source: ఏపీ న్యూస్ | 15 Jul 2010 | 9:22 am సోంపేట భూమి చెత్త భూమి: ప్రభుత్వ తప్పుడు నివేదికప్రైవేటు యాజమాన్యానికి లాభం చేకూర్చాలనే ఒకే ఒక్క ఉద్దేశ్యంతో సోంపేటలో ప్లాంట్ స్థాపించదలచిన భూమిని బంజర భూమిగా చిత్రీకరించారని సోంపేట బాధితుల తరపు న్యాయవాది వెల్లడించారు.Source: ఏపీ న్యూస్ | 15 Jul 2010 | 9:14 am "మాక్జిమ్"కోసం త్రిష ఎద అందాలు బట్టబయలుదక్షిణాది సినీ పరిశ్రమలో అత్యంత సెక్సీతారగా ఇమేజ్ సంపాదించుకున్న త్రిష, తాజాగా బాలీవుడ్ టీనేజ్ హృదయాలను షేక్ చేస్తోంది. బాలీవుడ్‌లో అడుగు పెట్టిందో లేదో అక్కడి కుర్రకారుకు ఏం కావాలో తెలుసుకుని అందుకు తగ్గట్లుగా నడుచుకుంటోంది. ఇందులో భాగంగా ఇప్పటికే మాక్జిమ్ పత్రికపై తన ఎద అందాలను మాక్జిమమ్ బయట పెట్టేసింది. అలా ఆమె కవర్‌పై ఫోజు కనబడిందో లేదో... జూలై నెలలో విడుదలైన ఆ పత్రిక ఇపుడు మార్కెట్లో లేదంటే త్రిష ఎక్స్‌పోజింగ్ ఫోటోకి ఎంత గిరాకీ ఏర్పడిందో ఇట్టే అర్థమవుతుంది. మాక్జిమ్ కవర్‌పై అందాల ఆరబోత గురించి త్రిషను కదిలిస్తే... ఆ ఫోటోకు ఇచ్చిన ఫోజులో తాను పూర్తిస్థాయిలో తన అందాలను ఎక్స్‌పోజ్ చేయలేదని అంటోంది. దీన్నిబట్టి త్రిష కనుక పూర్తి స్థాయిలో చూపిస్తే... మల్లికా, సెలీనా, సమీరా వంటి తారలు కూడా ఔటేనన్నమాట.అన్నట్లు ఇప్పటికే బాలీవుడ్‌లో తిష్ట వేసిన అసిన్, త్రిష దెబ్బకు తట్టాబుట్టా సర్దుకుని తిరిగి చెన్నై చెక్కేద్దామన్న ఆలోచనలో బాలీవుడ్ సినీజనం అంటున్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 15 Jul 2010 | 7:42 am అమ్మతోడు.. శంకుస్థాపన చేసేందుకు వెళ్లలేదు: ఎన్సీసీనాగార్జున కన్‌స్ట్రక్షన్ కంపెనీ యాజమాన్యం వ్యవహరశైలి చూస్తే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న చందంగా ఉంది. శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలంలో థర్మల్ పవర్ ప్రాజెక్టు నిర్మాణ పనుల శంకుస్థాపనకు తాము సోంపేటకు వెళ్లలేదని గురువారం వివరణ ఇచ్చారు. కాలుష్య నియంత్రణ బోర్డు అనుమతి ఇచ్చిన తర్వాత నిర్మాణ పనులు చేపడుతామని గత మార్చిలోనే జిల్లా కలెక్టర్‌కు తెలిపామని ఆ కంపెనీ యాజమాన్యం చెపుతోంది.Source: ఏపీ న్యూస్ | 15 Jul 2010 | 6:47 am ప్రచారానికి ఏ ఒక్కరూ ఆహ్వానించలేదు: సీఎం రోశయ్యఉప ఎన్నికల్లో తమకు మద్దతుగా ప్రచారం చేయమని తమ పార్టీకి చెందిన ఏ ఒక్క అభ్యర్థి తనను ఆహ్వానించలేదని ముఖ్యంత్రి కె.రోశయ్య చెప్పారు. అయితే, తాను ప్రచారానికి వెళ్లే అంశంపై ఇంకా ఓ నిర్ణయం తీసుకోలేదని, అవసరమైతేనే ప్రచారానికి వెళతానని స్పష్టం చేశారు.Source: ఏపీ న్యూస్ | 15 Jul 2010 | 6:36 am బెంగాల్‌లో మీథేన్ వాయువు లీకేజీ: 27 మందికి అస్వస్థతముంబై ఓడరేవులో క్లోరిన్ వాయువు లీకేజీ కారణంగా వంద మంది అస్వస్థతకు గురై 24 గంటలు కూడా గడువక ముందే పశ్చిమబెంగాల్‌లోని స్టీల్ ప్లాంట్ నుంచి మీథేన్ వాయువు లీకైంది. బర్ధమాన్ జిల్లాలోని దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్ నుంచి గురువారం ఈ వాయువు లీకైంది. దీనివల్ల 27 మంది తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు.Source: జాతీయ | 15 Jul 2010 | 6:14 am సెక్స్ ఎడ్యుకేషన్ అవసరం: లక్ష్మీ ప్రసన్నసినిమాల్లో ముద్దు, రొమాన్స్ చూపించడంలో తప్పు లేదని మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మీ ప్రసన్న అంటోంది. మనవాళ్లు ఎందుకు దానిని తప్పుగా చూస్తున్నారో తనకు అర్థం కావడం లేదనీ, సెక్స్ ఎడ్యుకేషన్ అందరికీ ఎంతో అవసరమని తేల్చి చెపుతుంది. అసలు ముద్దులు పెట్టుకోకుండా, కాపురం చేయకుండా పిల్లలు ఎలా కంటారు. ఇవన్నీ నేటి తరానికి తెలియాలి కదా. అదేదో తప్పుడు భావనతో గోప్యంగా దాస్తే మరింతగా పిల్లల మనస్సులో నాటుకుని తప్పుడు పనులు చేయడానికి అవకాశం ఇచ్చిన వారమవుతాం. దేవాలయాల్లో బూతుబొమ్మలు ఎందుకు పెట్టారు..? అసలు దేవుళ్లకు ఇద్దరు భార్యలు ఎందుకున్నారు..? వారిని సమర్థిస్తున్నాం కదా... అంటూ సెక్స్ ఎడ్యుకేషన్‌పై ఓ చిన్నసైజు లెక్చరిచ్చింది. అసలు విషయం ఏమంటే... ఝుమ్మంది నాదం సినిమాకు ఆమె నిర్మాత. ఆ చిత్రంలో రొమాన్స్ ఎక్కువగా ఉందన్న ప్రశ్నకు... ఆమె పై విధంగా స్పందించింది. శృంగారం జీవితంలో భాగమనీ, దాన్ని వేరుచేసి చూపడం మరింత తప్పుచేసినట్లవుతుందని చెప్పింది. కరెక్టేగా.. కాకపోతే దేనికైనా లిమిట్స్ ఉంటాయని గుర్తు చేసింది.Source: Yahoo! Telugu: Entertainment | 15 Jul 2010 | 6:00 am ఎంత రుచి చూసినా... ఇంకా చూడాలనిపిస్తోంది: నేహాఓవర్ ఎక్స్‌పోజింగ్, అర్థనగ్నపు సన్నివేశాలలో అలవోకగా నటించే నేహాధూపియాను తన సెక్సీ ఫిగర్ వెనుక దాగున్న రహస్యం ఏమిటని అడిగితే, ఆపకుండా చెప్పడం మొదలుపెట్టింది. " నేను సహజంగా పెద్ద తిండిబోతుని. గోవా ఆహారప్రియులకు స్వర్గం లాంటిది. ఇక్కడ అన్ని రకాలు లభిస్తాయి. అందుకే నాకు ఎప్పుడు టైం దొరికినా అక్కడకెళ్లి...Source: వినోదం | 15 Jul 2010 | 4:55 am లష్కర్ తీవ్రవాది హతం: సాగుతున్న ఆర్మీ ఆపరేషన్జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని పూంఛ్ జిల్లా సరిహద్దుల్లో తీవ్రవాదుల ఏరివేత కోసం చేపట్టిన ఆపరేషన్ గురువారానికి మూడో రోజుకు చేరుకుంది. ఈ ప్రాంతంలో ఒక తీవ్రవాది మృతదేహాన్ని ఆర్మీ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. తీవ్రవాదులకు, సైనికులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఈ తీవ్రవాది మరణించాడు.Source: జాతీయ | 15 Jul 2010 | 4:19 am సోంపేట పవర్ ప్లాంట్‌కు పర్యావరణ అనుమతి రద్దు!శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలంలో నిర్మించ తలపెట్టిన థర్మల్ విద్యుత్ కేంద్రానికి పర్యావరణ అనుమతి రద్దు అయింది. ఈ మేరకు పర్యావరణ అప్పీలేట్ ట్రిబ్యునల్ గురువారం నిర్ణయం తీసుకుంది. కోస్తా తీర ప్రాంతంలో పూర్తి అధ్యయనం చేసిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాలని ట్రిబ్యునల్ ఆదేశాలు జారీ చేసింది.Source: ఏపీ న్యూస్ | 15 Jul 2010 | 2:22 am
|