|
భారత్ పర్యటనకు రానున్న ఆప్ఘన్-పాక్ ప్రత్యేక ప్రతినిధిఆప్ఘనిస్థాన్, పాకిస్థాన్ దేశాల్లో అమెరికా ప్రత్యేక ప్రతినిధి హాల్‌బ్రూక్ త్వరలో భారత్, బ్రిటన్ దేశాల్లో పర్యటించనున్నారు. ప్రస్తుతం ఆయన ఆప్ఘనిస్థాన్, పాకిస్థాన్ దేశాలతో పాటు బ్రిటన్, జర్మనీ దేశాల్లో కూడా పర్యటించనున్నారు. దీనిపై అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ ఒక ప్రకటన విడుదల చేసింది. త్వరలో భారత్, బ్రిటన్ దేశాల్లో పర్యటించే హాల్‌బ్రూక్ ఆ దేశ ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులతో సమావేశం అవుతారని చెప్పారు. అయితే, హాల్‌బ్రూక్ పర్యటన తేదీల వివరాలను మాత్రం స్టేట్ డిపార్ట్‌మెంట్ స్పష్టం చేయలేదు.Source: Yahoo! Telugu: News | 15 Jul 2010 | 9:19 am సోంపేట పవర్ ప్లాంట్‌కు పర్యావరణ అనుమతి రద్దు!శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలంలో నిర్మించ తలపెట్టిన థర్మల్ విద్యుత్ కేంద్రానికి పర్యావరణ అనుమతి రద్దు అయింది. ఈ మేరకు పర్యావరణ అప్పీలేట్ ట్రిబ్యునల్ గురువారం నిర్ణయం తీసుకుంది. కోస్తా తీర ప్రాంతంలో పూర్తి అధ్యయనం చేసిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాలని ట్రిబ్యునల్ ఆదేశాలు జారీ చేసింది.Source: Yahoo! Telugu: News | 15 Jul 2010 | 7:51 am స్టాక్ మార్కెట్: నష్టాల్లో బాంబే స్టాక్ మార్కెట్!యూరప్, ఆసియా స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కూరుకుపోవడంతో బాంబే స్టాక్ మార్కెట్ తిరోగమనం వైపు ర్యాలీని కొనసాగిస్తోంది. ట్రేడింగ్ ప్రారంభం నుంచే నష్టాల వైపు ర్యాలీని కొనసాగిస్తున్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచి సెన్సెక్స్, మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో 43 పాయింట్లు పతనమై, 17,895 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచి నిఫ్టీ కూడా 16 పాయింట్లు క్షీణించి, 5,369 పాయింట్ల వద్ద పయనిస్తోంది.Source: Yahoo! Telugu: News | 15 Jul 2010 | 7:48 am "మాక్జిమ్"కోసం త్రిష ఎద అందాలు బట్టబయలుదక్షిణాది సినీ పరిశ్రమలో అత్యంత సెక్సీతారగా ఇమేజ్ సంపాదించుకున్న త్రిష, తాజాగా బాలీవుడ్ టీనేజ్ హృదయాలను షేక్ చేస్తోంది. బాలీవుడ్‌లో అడుగు పెట్టిందో లేదో అక్కడి కుర్రకారుకు ఏం కావాలో తెలుసుకుని అందుకు తగ్గట్లుగా నడుచుకుంటోంది. ఇందులో భాగంగా ఇప్పటికే మాక్జిమ్ పత్రికపై తన ఎద అందాలను మాక్జిమమ్ బయట పెట్టేసింది. అలా ఆమె కవర్‌పై ఫోజు కనబడిందో లేదో... జూలై నెలలో విడుదలైన ఆ పత్రిక ఇపుడు మార్కెట్లో లేదంటే త్రిష ఎక్స్‌పోజింగ్ ఫోటోకి ఎంత గిరాకీ ఏర్పడిందో ఇట్టే అర్థమవుతుంది. మాక్జిమ్ కవర్‌పై అందాల ఆరబోత గురించి త్రిషను కదిలిస్తే... ఆ ఫోటోకు ఇచ్చిన ఫోజులో తాను పూర్తిస్థాయిలో తన అందాలను ఎక్స్‌పోజ్ చేయలేదని అంటోంది. దీన్నిబట్టి త్రిష కనుక పూర్తి స్థాయిలో చూపిస్తే... మల్లికా, సెలీనా, సమీరా వంటి తారలు కూడా ఔటేనన్నమాట.అన్నట్లు ఇప్పటికే బాలీవుడ్‌లో తిష్ట వేసిన అసిన్, త్రిష దెబ్బకు తట్టాబుట్టా సర్దుకుని తిరిగి చెన్నై చెక్కేద్దామన్న ఆలోచనలో బాలీవుడ్ సినీజనం అంటున్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 15 Jul 2010 | 7:42 am తీవ్రవాదులకు వైద్యం చేసిన పాకిస్థాన్ వైద్యుడు మాయం!ఈశాన్య పాకిస్థాన్‌లోని అహ్మెది మసీదుపై దాడి కేసులో సంబంధం ఉండి గాయపడిన తీవ్రవాదికి వైద్యం చేసిన డాక్టరు గత మూడు రోజులుగా కనిపించడం లేదు. దీనిపై పాక్ పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ప్రాథమిక సమాచార నివేదిక (ఎఫ్ఐఆర్) ప్రకారం అలీ అబ్దుల్లా అనే వైద్యుడు గత ఆదివారం రాత్రి తన ఇంటికి మోటార్ సైకిల్‌పై వస్తుండగా, కిడ్నాప్‌కు గురయ్యాడు. మే 28వ తేదీన అహ్మెది మసీదుపై జరిగిన దాడిలో గాయపడిన మోజా అలియాస్ అమిర్ మావోవియా అనే తీవ్రవాది పోలీసులకు చిక్కాడు. తీవ్రంగా గాయపడిన ఈ తీవ్రవాదికి అలీ అబ్దుల్లా వైద్యం చేసి వస్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది.Source: Yahoo! Telugu: News | 15 Jul 2010 | 7:26 am పప్పుధాన్యాల అమ్మకానికి బిడ్డింగ్: ఎమ్ఎమ్టీసీఎమ్ఎమ్టిసి దిగుమతి చేసుకున్న 5,000 టన్నుల పప్పుధాన్యాలను స్థానిక మార్కెట్లో అమ్మకానికై బిడ్‌లను ఆహ్వానించింది. ఈ బిడ్డింగు జూలై 20న ముగుస్తుంది. ఈ బిడ్డింగు ఫలితాలపై నిర్ణయం జూన్ 23న తీసుకోనున్నట్లు ప్రకటించింది.Source: Yahoo! Telugu: News | 15 Jul 2010 | 7:20 am కర్ణాటక అసెంబ్లీ: కొనసాగుతున్న విపక్షాల ఆందోళనకర్ణాటక రాష్ట్ర అసెంబ్లీలో విపక్ష పార్టీలకు చెందిన సభ్యులు చేపట్టిన ఆందోళన యధావిధిగా కొనసాగుతోంది. గత మూడు రాత్రులుగా అసెంబ్లీలోని బస చేస్తూ ఆందోళన చేస్తున్నారు. అయినప్పటికీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప సర్కారు మాత్రం ఏమాత్రం మెత్తబడటం లేదు.Source: Yahoo! Telugu: News | 15 Jul 2010 | 7:06 am ట్రేడింగ్ క్షీణిత: నష్టాల్లో బాంబే స్టాక్ మార్కెట్!దేశీయ వాటాల ట్రేడింగ్ క్షీణించడంతో బాంబే స్టాక్ మార్కెట్ నష్టాల్లో కూరుకుపోయింది. ట్రేడింగ్ ప్రారంభం నుంచే తిరోగమనం వైపు ర్యాలీని కొనసాగిస్తున్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచి సెన్సెక్స్, మధ్యాహ్నం 12.40 గంటల ప్రాంతంలో 17,897 పాయింట్ల మార్కును తాకింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచి నిఫ్టీ కూడా 18 పాయింట్లు పతనమై, 5,367 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది.Source: Yahoo! Telugu: News | 15 Jul 2010 | 7:03 am మూడు కోట్ల మందికి ఊబకాయం: ఎన్ఎఫ్హెచ్ఎస్దేశ జనాభా ఏ విధంగా పెరుగుతుందో.. ఊబకాయుల సంఖ్య కూడా నానాటికీ పెరుగుతోంది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే) తాజాగా నిర్వహించిన సర్వేలో దేశంలో మూడు కోట్ల మంది ఊబకాయులు ఉన్నట్టు వెల్లడైంది. అలాగే, పాఠశాలకు వెళ్లే చిన్నారుల్లో 20 శాతం మంది అధిక బరువుతో బాధపడుతున్నట్టు ఈ సర్వే పేర్కొంది.Source: Yahoo! Telugu: News | 15 Jul 2010 | 6:38 am ఎలక్ట్రానిక్ మోటర్‌బైకులను ప్రారంభించిన యమహాప్రపంచపు రెండవ మోటర్ సైకిల్ తయారీ సంస్థ జపాన్‌కు చెందిన యమహా మోటార్ కంపెనీ తమ సరికొత్త ఎలక్ట్రానిక్ మోటర్‌బైకులను బుధవారం మోర్కెట్‌లోకి విడుదల చేసింది. ఈ వాహనాల విభాగంలో 2020 నాటికంతా ప్రపంచవ్యాప్తంగా 20శాతం వాటా లక్ష్యంతో ఉన్నట్లు సంస్థ తెలిపింది. ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి తమ ఎలక్ట్రానిక్ మోటర్‌బైక్ ఈసీ-03 విక్రయాలను చేపట్టనున్నట్లు, అలాగే తైవాన్ మరియు యూరప్‌లలో 2011 నుంచి అమ్మకాలు ప్రారంభిస్తామని తెలిపింది.Source: Yahoo! Telugu: News | 15 Jul 2010 | 6:35 am కోతులకు జిహాదీ శిక్షణ ఇస్తున్న తాలిబన్లు: చైనా పత్రికతమపై ఉక్కుపాదం మోపుతున్న అమెరికా నేతృత్వంలోని నాటో సంకీర్ణ బలగాలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు తాలిబన్ తీవ్రవాదులు కొత్త తరహా పద్దతులు ఎంచుకుంటున్నారు. వీటిలో కొన్ని విజయాన్ని చేకూర్చి పెడుతున్పప్పటికీ.. ఎక్కువ సంఖ్యలో నష్టం జరుగుతుంది. ప్రధానంగా ప్రాణ నష్టం ఎక్కువగా జరుగుతుంది.Source: Yahoo! Telugu: News | 15 Jul 2010 | 6:15 am సెక్స్ ఎడ్యుకేషన్ అవసరం: లక్ష్మీ ప్రసన్నసినిమాల్లో ముద్దు, రొమాన్స్ చూపించడంలో తప్పు లేదని మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మీ ప్రసన్న అంటోంది. మనవాళ్లు ఎందుకు దానిని తప్పుగా చూస్తున్నారో తనకు అర్థం కావడం లేదనీ, సెక్స్ ఎడ్యుకేషన్ అందరికీ ఎంతో అవసరమని తేల్చి చెపుతుంది. అసలు ముద్దులు పెట్టుకోకుండా, కాపురం చేయకుండా పిల్లలు ఎలా కంటారు. ఇవన్నీ నేటి తరానికి తెలియాలి కదా. అదేదో తప్పుడు భావనతో గోప్యంగా దాస్తే మరింతగా పిల్లల మనస్సులో నాటుకుని తప్పుడు పనులు చేయడానికి అవకాశం ఇచ్చిన వారమవుతాం. దేవాలయాల్లో బూతుబొమ్మలు ఎందుకు పెట్టారు..? అసలు దేవుళ్లకు ఇద్దరు భార్యలు ఎందుకున్నారు..? వారిని సమర్థిస్తున్నాం కదా... అంటూ సెక్స్ ఎడ్యుకేషన్‌పై ఓ చిన్నసైజు లెక్చరిచ్చింది. అసలు విషయం ఏమంటే... ఝుమ్మంది నాదం సినిమాకు ఆమె నిర్మాత. ఆ చిత్రంలో రొమాన్స్ ఎక్కువగా ఉందన్న ప్రశ్నకు... ఆమె పై విధంగా స్పందించింది. శృంగారం జీవితంలో భాగమనీ, దాన్ని వేరుచేసి చూపడం మరింత తప్పుచేసినట్లవుతుందని చెప్పింది. కరెక్టేగా.. కాకపోతే దేనికైనా లిమిట్స్ ఉంటాయని గుర్తు చేసింది.Source: Yahoo! Telugu: Entertainment | 15 Jul 2010 | 6:00 am లష్కర్ తీవ్రవాది హతం: సాగుతున్న ఆర్మీ ఆపరేషన్జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని పూంఛ్ జిల్లా సరిహద్దుల్లో తీవ్రవాదుల ఏరివేత కోసం చేపట్టిన ఆపరేషన్ గురువారానికి మూడో రోజుకు చేరుకుంది. ఈ ప్రాంతంలో ఒక తీవ్రవాది మృతదేహాన్ని ఆర్మీ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. తీవ్రవాదులకు, సైనికులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఈ తీవ్రవాది మరణించాడు.Source: జాతీయ | 15 Jul 2010 | 4:19 am సోంపేట పవర్ ప్లాంట్‌కు పర్యావరణ అనుమతి రద్దు!శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలంలో నిర్మించ తలపెట్టిన థర్మల్ విద్యుత్ కేంద్రానికి పర్యావరణ అనుమతి రద్దు అయింది. ఈ మేరకు పర్యావరణ అప్పీలేట్ ట్రిబ్యునల్ గురువారం నిర్ణయం తీసుకుంది. కోస్తా తీర ప్రాంతంలో పూర్తి అధ్యయనం చేసిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాలని ట్రిబ్యునల్ ఆదేశాలు జారీ చేసింది.Source: ఏపీ న్యూస్ | 15 Jul 2010 | 2:22 am కర్ణాటక అసెంబ్లీ: కొనసాగుతున్న విపక్షాల ఆందోళనకర్ణాటక రాష్ట్ర అసెంబ్లీలో విపక్ష పార్టీలకు చెందిన సభ్యులు చేపట్టిన ఆందోళన యధావిధిగా కొనసాగుతోంది. గత మూడు రాత్రులుగా అసెంబ్లీలోని బస చేస్తూ ఆందోళన చేస్తున్నారు. అయినప్పటికీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప సర్కారు మాత్రం ఏమాత్రం మెత్తబడటం లేదు.Source: జాతీయ | 15 Jul 2010 | 1:36 am మూడు కోట్ల మందికి ఊబకాయం: ఎన్ఎఫ్హెచ్ఎస్దేశ జనాభా ఏ విధంగా పెరుగుతుందో.. ఊబకాయుల సంఖ్య కూడా నానాటికీ పెరుగుతోంది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే) తాజాగా నిర్వహించిన సర్వేలో దేశంలో మూడు కోట్ల మంది ఊబకాయులు ఉన్నట్టు వెల్లడైంది. అలాగే, పాఠశాలకు వెళ్లే చిన్నారుల్లో 20 శాతం మంది అధిక బరువుతో బాధపడుతున్నట్టు ఈ సర్వే పేర్కొంది.Source: జాతీయ | 15 Jul 2010 | 1:10 am సోంపేటలో తప్పంతా గ్రామస్తులదే: హోంమంత్రి సబితాసోంపేట ఘటనలో పోలీసులు చేసిన తప్పేమీ లేదని రాష్ట్ర హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. సోంపేట మండలంలోని గ్రామాల ప్రజలు పోలీసులపై దాడికి దిగడం వల్లే ఆత్మరక్షణార్థం పోలీసులు తమ వద్ద ఉన్న చిన్నపాటి ఆయుధాలతో కాల్పులు జరిపారన్నారు.Source: ఏపీ న్యూస్ | 15 Jul 2010 | 12:26 am మావోయిస్టులపై సమిష్టి పోరు సాగిద్దాం: మన్మోహన్దేశ అంతర్గత భద్రతకు పెను ముప్పుగా మారిన మావోయిస్టుల (నక్సల్స్) సమస్యపై సమిష్టిగా పోరాటం చేద్దామని ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ అభిప్రాయపడ్డారు. నక్సల్ బాధిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఆయన బుధవారం కీలక సమావేశం నిర్వహించిన విషయం తెల్సిందే.Source: జాతీయ | 15 Jul 2010 | 12:03 am సోంపేట వాసులను ధర్మానే రెచ్చగొట్టారు: చంద్రబాబుసోంపేట మండల ప్రజలను రాష్ట్ర మంత్రి ధర్మాన ప్రసాద రావు రెచ్చగొట్టడం వల్లే ఈ పరిస్థితి ఉత్పన్నమైందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. శ్రీకాకుళం జిల్లా సోంపేటలో నిర్మించ తలపెట్టిన థర్మల్ విద్యుత్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఆ మండల ప్రజలు ఆందోళన చేపట్టారు. వీరిపై పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు గ్రామస్తులు మరణించిన విషయం తెల్సిందే. ఈ బాధితులను పరామర్శించేందుకు చంద్రబాబు గురువారం సోంపేటకు చేరుకున్నారు.Source: ఏపీ న్యూస్ | 15 Jul 2010 | 12:01 am ప్లాంట్ నిర్మించి తీరుతాం.. మీరేం చేస్తారో చూస్తా: ధర్మాన!మేం చేయదలచుకున్న పని చేసి తీరుతాం. జిల్లాలో థర్మల్ విద్యుత్ ప్లాంట్ నెలకొల్పుతాం. మీ గ్రామంలో ఎంత మంది ఉంటారు. మహా అయితే, పది మంది ఆందోళన చేస్తారు. మీరు.. మమ్మలను ఏం చేస్తారు. విద్యుత్ ప్లాంట్ నెలకొల్పి తీరుతాం. దీనివల్ల వచ్చే ఎన్నికల్లో ఓడిపోయినా ఫర్వాలేదు. ఈ తరహా వ్యాఖ్యలు చేసింది... ఎవరో కాదు. సాక్షాత్ మన రాష్ట్ర రెవెన్యూ మంత్రి. పేరులో మాత్రం ధర్మం ఉంది. కానీ.. ఆయన చేసే ప్రసంగాలు అధర్మంగానే సాగుతాయని ప్రతిపక్ష నేతలు అంటుంటారు. ఆయనే ధర్మాన ప్రసాదరావు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన మంత్రి.Source: ఏపీ న్యూస్ | 14 Jul 2010 | 11:41 pm సోంపేట బాధితులకు చంద్రబాబు పరామర్శా?: ప్రరాపాశ్రీకాకుళం జిల్లా సోంపేట గ్రామంలో జరిగిన పోలీసు కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలను తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పరామర్శించే అర్హత ఉందా అని ప్రజారాజ్యం పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి సంఘటనలను రాష్ట్రంలో పరిచయం చేసింది చంద్రబాబే కదా అని వారు అంటున్నారు. అలాంటి చంద్రబాబు ఇపుడు సోంపేట గ్రామస్తులను పరామర్శించేందుకు గురువారం అక్కడు చేరుకోవడం వింతగా, హాస్యాస్పందంగా ఉందన్నారు.Source: ఏపీ న్యూస్ | 14 Jul 2010 | 11:14 pm కార్యకర్తలను ఓదారిస్తే రోశయ్యకు ఎందుకో భయం: జగన్కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కృషి, శ్రమ ఫలితమే పార్టీ నేతలు అందలం ఎక్కుతున్నారని, అలాంటి కార్యకర్తలు ఆపదలో ఉన్నపుడు ఓదార్చడం కనీస మానవధర్మమని కడప ఎంపీ వైఎస్.జగన్మోహన్ రెడ్డి అన్నారు. తమ ప్రియతమనేత హఠాన్మరణాన్ని తట్టుకోలేక అశువులు బాసిన వారి కుటుంబాలను ఓదార్చడంలో తప్పేముందని ఆయన ప్రశ్నించారు. ప్రధానంగా, ముఖ్యమంత్రి రోశయ్య ఎందుకు భయపడిపోతున్నారో అర్థం కావడం లేదన్నారు.Source: ఏపీ న్యూస్ | 14 Jul 2010 | 10:13 pm గవర్నర్ భరద్వాజ్‌ను తొలగించాలి: భాజపా డిమాండ్కర్ణాటక రాష్ట్ర గవర్నర్ హెచ్.ఆర్.భరద్వాజ్‌ను తక్షణం తొలగించాలి భారతీయ జనతా పార్టీ గట్టిగా డిమాండ్ చేసింది. రాజ్యాంగాని లోబడి నడుచుకోవాల్సిన గవర్నర్... కాంగ్రెస్ ఏజెంటుగా వ్యవహరిస్తున్నారని ఆ పార్టీ సీనియర్ నేత అనంత కుమార్ ఆరోపించారు. అందువల్ల ఆయనను తక్షణం గవర్నర్ గిరి నుంచి తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు.Source: జాతీయ | 14 Jul 2010 | 9:48 pm నమిత అందాలకోసం 6 కోట్ల మంది సెర్చ్ఎద అందాలను ఆరబోయడంలో నమితను మించినవారు ప్రస్తుతం దక్షిణాది చిత్ర పరిశ్రమల్లో లేరంటే అతిశయోక్తి కాదు. ఇటీవల సింహా చిత్రంలో అడవిలాంటి అందాలే ఆక్రమించాడే అంటూ బాలకృష్ణతో సయ్యాట ఆడిన నమిత గురించిన వివరాలను తెలుసుకునేందుకు ప్రముఖ సెర్చ్ ఇంజిన్‌లో 6 కోట్లమంది వీక్షించారు. ఆమె పర్సనల్ టచ్ మీకోసం.పుట్టిన రోజు: మే 10, 1973పుట్టిన ఊరు: సూరత్, గుజరాత్కుటుంబం: ఏకైక కుమార్తె, తండ్రి - వ్యాపారవేత్త, తల్లి - గృహిణిచదువు: ఇంగ్లీష్ లిటరేచర్అవార్డులు: మిస్ సూరత్ - 1998, మిస్ ఇండియా నాలుగో స్థానం - 2001సినిమాలకు ముందు: టీవీ కమర్షియల్స్, హిమామి క్రీమ్, అరుణ్ ఐస్‌క్రీమ్, మానిక్‌చంద్ గుట్కా, నైల్ హెర్బల్ షాంపూSource: Yahoo! Telugu: Entertainment | 14 Jul 2010 | 1:38 pm రిస్క్‌కు ఫలితం 8 నెలలు రెస్ట్సినిమా హీరోలు యాక్షన్ సన్నివేశాలు చేసేటప్పుడు డూప్‌లను పెడుతుంటారు. కానీ యూత్ హీరోలు అందుకు ససేమిరా అంటుంటారు. శ్రీహరి అలానే రిస్క్ షాట్‌లు చేసి రియల్ హీరో అయ్యారు. ఈ కోవలో కొంతమంది యూత్ హీరోలు ఉన్నారు. కానీ ఇటువంటి ఫీట్లు ఒక్కోసారి బెడిసికొడుతుంటాయి. యాంగ్రీ యంగ్‌మెన్‌గా మోహన్ బాబు వారసుడిగా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకతను సంపాదించుకున్న మంచు మనోజ్ రిస్క్ విషయంలో మొహమాటమేలేదు. 'నేను మీకు తెలుసా' చిత్రంలో కొన్ని యాక్షన్ సన్నివేశాల్లో ఒరిజినల్ ఫైట్స్ సీన్స్‌లో పాల్గొన్నారు. ఎత్తైన గోడలు దూకడం, పరుగెట్టడం, గుంతలు, రాళ్లురప్పలు లాంటివి లెక్కచేయకుండా చేశాడు. అప్పట్లో కుడిభుజానికి బలమైన దెబ్బ తగిలింది. యువరక్తం కనుక దాన్ని కాస్త అశ్రద్ధ చేశాడనే చెప్పాలి. ఆ తర్వాత ఇటీవలే విడుదలైన "ఝుమ్మంది నాదం"లో కూడా రాఘవేంద్రరావుగారు వద్దన్నా వినకుండా మరో రిస్క్ ఫైట్ చేశాడు. ఈసారి ఎడమ భుజానికి దెబ్బ తగిలింది. దీంతో మనోజ్ ఎనిమిది నెలలపాటు రెస్ట్ తీసుకుంటున్నట్లు తెలిసింది.Source: Yahoo! Telugu: Entertainment | 14 Jul 2010 | 1:10 pm 79 కేంద్రాల్లో గోలీమార్ అర్థశతదినోత్సవండాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎగ్రెసివ్ హీరో గోపీచంద్ కథానాయకుడిగా శ్రీమతి బెల్లంకొండ పద్మావతి సమర్పణలో శ్రీసాయి గణేష్ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ నిర్మించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ "గోలీమార్" 79 కేంద్రాల్లో 50 రోజులు పూర్తి చేసుకుంది.ఈ సందర్భంగా నిర్మాత బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ... జూలై 15కి మా గోలీమార్ చిత్రం 79 కేంద్రాల్లో 50 రోజులు పూర్తి చేసుకుని శతదినోత్సవానికి పరుగులు తీస్తోంది. పూరి జగన్నాథ్ టేకింగ్, గోపీచంద్ ఎక్స్‌లెంట్ పెర్‌ఫార్మెన్స్, చక్రి మ్యూజిక్, శ్యామ్ కె. నాయుడు అద్భుతమైన ఫోటోగ్రఫీ ఈ చిత్రాన్ని సూపర్ హిట్ రేంజ్ కి తీసుకెళ్లాయి. గోలీమార్ చిత్రం మా బ్యానర్‌లో మరో సూపర్ హిట్ చిత్రంగా నిలిచినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇంత మంచి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు, అభిమానులకు నా ధన్యవాదాలు" అన్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 14 Jul 2010 | 12:27 pm అమీషా టాప్‌లెస్ ఫోటో: ఎగబడుతున్న కుర్రజనంహాట్ బేబీ అమీషా పటేల్ ఉన్నట్లుండి ఒక్కసారిగా ఎదపై ఎటువంటి ఆచ్ఛాదన లేకుండా ఓ పత్రికకు ఫోజులిచ్చింది. ఆ ఫోటో షూట్‌లో వేడెక్కించే కొన్ని అమీషా టాప్‌లెస్ ఫోటోలను సదరు మేగజైన్ నెట్‌లోకి ఎక్కించింది. దీంతో కుర్రకారు నెట్‌లో ఆ ఫోటోలకోసం ఎగబడుతున్నారు. ముఖ్యంగా పూర్తి నగ్నంగా ఉన్న ఎద సౌందర్యాలను చేతులతో కప్పుకుంటూ ఫోజిచ్చిన భంగిమను నెటిజన్లు అదేపనిగా డౌన్‌లోడ్ చేసుకుంటున్నారట. పనిలో పనిగా టాప్‌లెస్ అమీషా సౌందర్యాన్ని పలు విధాలుగా వర్ణిస్తూ ఇ- మెయిళ్లతో దండెత్తుతున్నారట. అయితే మెయిళ్లన్నిటినీ చూసిన ఆమె స్నేహితురాలు, బాలీవుడ్‌లో హీరోయిన్లు టాప్‌లెస్‌గా ఫోజిలివ్వడం సర్వసాధారణమైన విషయమేననీ, కొంతమంది తారలు నగ్నంగా నటించేందుకు కూడా రెడీ అవుతుంటే టాప్‌లెస్ ఫోటోపై ఇంత రాద్ధాంతం ఎందుకని ఎదురు మెయిళ్లు పెడుతోందట. అలా రాస్తే మనం మాత్రం ఏం చేస్తాం.Source: Yahoo! Telugu: Entertainment | 14 Jul 2010 | 9:26 am పోలీసు కాల్పుల్లో నలుగురి మృతి: స్పందించిన హెచ్ఆర్సిశ్రీకాకుళం జిల్లా సోంపేట గ్రామంలో బుధవారం పోలీసులు జరిపిన కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య నాలుగుకు చేరుకుంది. మరికొంతమంది పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఇదిలావుండగా, సోంపేట పోలీసు కాల్పులపై రాష్ట్ర మానవహక్కుల సంఘం (హెచ్ఆర్‌సి) స్పందించింది. సోంపేట నుంచి తక్షణం పోలీసు బలగాలను ఉపసంహరించాలని జిల్లా ఎస్పీకి ఆదేశించింది. అలాగే, ఈనెల 16వ తేదీ మధ్యాహ్నం 11 గంటలలోపు ఘటనపై నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్‌తో పాటు.. ఎస్పీకి హెచ్‌ఆర్సీ ఛైర్మన్ జస్టీస్ సుభాషణ్ రెడ్డి ఆదేశించారు.Source: ఏపీ న్యూస్ | 14 Jul 2010 | 8:38 am వైట్ బ్యూటీ హాన్సికపై బ్లాక్ బ్యూటీ నయన్ గరంగరంహాన్సిక పేరు చెబితే నయనతార భగ్గుమంటోంది. ఒళ్లంతా కంపరం పుట్టుకొస్తోందంటూ చికాకును ప్రదర్శిస్తోంది. కారణం ఏంటా అని ఆరా తీస్తే... హాన్సిక తరచూ ప్రభుదేవాను కలవడమేనని తెలిసింది. నవ్వొస్తానంటే నేనొద్దంటానా చిత్రంతో దర్శకుడిగా మారిన ప్రభుదేవా ఈ మధ్యనే తెలుగు "పోకిరి" చిత్రాన్ని తమళంలో, హిందీలో తీసి హిట్ కొట్టాడు. దీంతో ఆయనకు క్రేజ్ పెరిగింది. మరోవైపు ప్రభుదేవా ఫ్యామిలీ గొడవలతో సతమతమవుతున్నాడు. మరోవైపు నయనతారతో పెండ్లి కూడా జరిగిపోయిందని ఆమధ్య వార్తలు కూడా వచ్చాయి. అయితే నటి హాన్సిక మాత్రం ప్రభుదేవా తాజాగా తీయబోయే "ఇచ్" చిత్రంతోపాటు హిందీలో చేసే చిత్రంలో తనకు అవకాశం ఇవ్వాల్సిందిగా తరచూ ప్రభుదేవా గెస్ట్‌హౌస్‌కు రావడం, ఛాటింగ్ చేయడం జరుగుతోంది.Source: Yahoo! Telugu: Entertainment | 14 Jul 2010 | 6:58 am నాభీ నృత్యం చేయడానికి నేను రెడీ: సలోనిబెల్లీ డాన్స్ చేస్తా, బెల్లీ డాన్స్.. అంటూ నటి సలోని అంటోంది. మర్యాద రామన్న సినిమాలో సునీల్ సరసన నటించింది. ఈ సందర్భంగా సలోని మాట్లాడుతూ... సునీల్‌తో 'ఒక ఊరిలో', 'చుక్కల్లొ చంద్రుడు'లో నటించాను. మంచి టైమింగ్‌గల నటుడు అని కితాబిస్తోంది. డాన్స్ గురించి చెబుతూ.. మాస్ సాంగ్స్ బాగా చెస్తాననీ, బెల్లీ డాన్స్ బాగా వచ్చుననీ అంది. మగధీరలో డాన్స్ చూసి రాజమౌళి మర్యాద రామన్న సినిమాలో ఛాన్స్ ఇచ్చారని అంది. ఎక్స్‌పోజింగ్‌కు సిద్ధమేనా అనంటే కథనుబట్టి చేస్తానని చెప్పింది.Source: Yahoo! Telugu: Entertainment | 14 Jul 2010 | 6:35 am గూండా ముఖ్యమంత్రి బీఎస్.యడ్యూరప్ప: సిద్ధరామయ్యకర్ణాటక రాజకీయాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. మైనింగ్ అక్రమాలకు సంబంధించి యాడ్యూరప్ప సర్కారుపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆందోళన మరింత ఉధృతమవుతోంది. ప్రతిపక్ష నాయకుడు సిద్ధరామయ్య ఒక అడుగు ముందుకు వేసి ఆ రాష్ట్ర అసెంబ్లీలోనే ముఖ్యమంత్రి యాడ్యూరప్పను గూండా ముఖ్యమంత్రి అని సంభోదించడంతో అధికార పార్టీ సభ్యులు నివ్వెర పోయారు.Source: జాతీయ | 14 Jul 2010 | 4:51 am తెలంగాణ ఉప ఎన్నికలు: అందరి దృష్టి ఆ ఇద్దరిపైనే!తెలంగాణ ఉప ఎన్నికల ప్రచార వేడి ఊపందుకుంది. నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం ముగియడంతో ఎన్నికల ఏర్పాట్లపై ఈసీ దృష్టిసారించింది. అలాగే, రాజకీయ పార్టీలు కూడా తమ వ్యూహ ప్రతివ్యూహాలలో నిమగ్నమయ్యాయి. ఉప ఎన్నికలు జరిగే 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇప్పటికే ప్రచారం జోరుగా సాగుతోంది. గురువారం తెరాస అధినేత కేసీఆర్ ప్రచారం ప్రారంభంకానుంది. దీంతో ఈ ప్రచార వేడి మరింత ఉధృతంగా మారనుంది.Source: ఏపీ న్యూస్ | 14 Jul 2010 | 4:32 am ఖాకీలపై సోంపేట వాసుల దాడి: పోలీసుల కాల్పులు!శ్రీకాకుళం జిల్లా సోంపేట గ్రామంలో నిర్మించ తలపెట్టిన థర్మల్ విద్యుత్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా స్థానిక గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఈ ప్రాజెక్టు నిర్మిస్తున్న ప్రాంతానికి స్థానికులు కర్రలు, రాళ్ళతో దాడి చేశారు. ఈ దాడిలో ఒక హెడ్‌కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అలాగే, మరికొంత మంది పోలీసులు, ఒక టీవీ కెమెరామెన్ కూడా గాయపడ్డారు.Source: ఏపీ న్యూస్ | 14 Jul 2010 | 2:43 am
|