అమీషా టాప్‌లెస్ ఫోటో: ఎగబడుతున్న కుర్రజనం

హాట్ బేబీ అమీషా పటేల్ ఉన్నట్లుండి ఒక్కసారిగా ఎదపై ఎటువంటి ఆచ్ఛాదన లేకుండా ఓ పత్రికకు ఫోజులిచ్చింది. ఆ ఫోటో షూట్‌లో వేడెక్కించే కొన్ని అమీషా టాప్‌లెస్ ఫోటోలను సదరు మేగజైన్ నెట్‌లోకి ఎక్కించింది. దీంతో కుర్రకారు నెట్‌లో ఆ ఫోటోలకోసం ఎగబడుతున్నారు. ముఖ్యంగా పూర్తి నగ్నంగా ఉన్న ఎద సౌందర్యాలను చేతులతో కప్పుకుంటూ ఫోజిచ్చిన భంగిమను నెటిజన్లు అదేపనిగా డౌన్‌లోడ్ చేసుకుంటున్నారట. పనిలో పనిగా టాప్‌లెస్ అమీషా సౌందర్యాన్ని పలు విధాలుగా వర్ణిస్తూ ఇ- మెయిళ్లతో దండెత్తుతున్నారట. అయితే మెయిళ్లన్నిటినీ చూసిన ఆమె స్నేహితురాలు, బాలీవుడ్‌లో హీరోయిన్లు టాప్‌లెస్‌గా ఫోజిలివ్వడం సర్వసాధారణమైన విషయమేననీ, కొంతమంది తారలు నగ్నంగా నటించేందుకు కూడా రెడీ అవుతుంటే టాప్‌లెస్ ఫోటోపై ఇంత రాద్ధాంతం ఎందుకని ఎదురు మెయిళ్లు పెడుతోందట. అలా రాస్తే మనం మాత్రం ఏం చేస్తాం.
Source: Yahoo! Telugu: Entertainment | 14 Jul 2010 | 9:26 am

డయాగ్నోస్టిక్ యూనిట్‌ను విక్రయించిన పిరమల్

పిరమల్ హెల్త్ కేర్ తమ డయాగ్నోస్టిక్ సర్వీసెస్ యూనిట్‌ను సూపర్ రెలిగేర్ లేబొరేటరీ (ఎస్‌ఆర్‌ఎల్)కి 600 కోట్ల రూపాయలకు విక్రయించాలని నిర్ణయించింది. పిరమల్ డయాగ్నోస్టిక్ సర్వీసెస్‌లో మొత్తం 107 లేబొరేటరీలు ఉన్నాయి. ఈ ఒప్పందంతో ఎస్‌ఆర్‌ఎల్ లేబొరేటరీల సంఖ్య 170కి పెరగి దేశంలోనే అతిపెద్ద డయాగ్నోస్టిక్ సర్వీసెస్‌ను అందించే సంస్థగా ఎదగనుంది.
Source: Yahoo! Telugu: News | 14 Jul 2010 | 9:23 am

జూన్‌లో 10.55శాతానికి పెరిగిన ద్రవ్యోల్బణం

జూన్ నెలలో హోల్‌సేల్ ధరల ఆధారిత ద్రవ్యోల్బణం 10.55శాతంగా నమోదైంది. ఇదే నెల 25న చమురు ఉత్పత్తుల ధరలను పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా ద్రవ్యోల్బణం స్వల్పంగా పెరిగింది. గత మే నెలలో ఇది 10.16శాతంగా నమోదైంది.
Source: Yahoo! Telugu: News | 14 Jul 2010 | 8:57 am

స్టాక్ మార్కెట్: స్వల్పంగా నష్టపోయిన సెన్సెక్స్

యూరోపియన్ మార్కెట్‌ సానుకూలంగా ప్రారంభంకావడం ముంబై స్టాక్ మార్కెట్‌పై ప్రభావం చూపింది. ఫలితంగా ఉదయం నుంచి వృద్ధిబాటలో ఉన్న సెన్సెక్స్ సూచీ మధ్యాహ్నం సమయంలో స్వల్పంగా కోల్పోయింది. బుధవారం ట్రేడింగ్ ఆరంభమైన వెంటనే 29 నెలల క్రితం నమోదైన 18057 పాయింట్లకు చేరుకుంది. ఆ తర్వాత యూరోపియన్ మార్కెట్ ప్రారంభం కారణంగా 29 పాయంట్లను కోల్పోయి 18016కు పడిపోయింది. అలాగే, నిఫ్టీ సైతం ఉదయం వద్ధికంటే 11 పాయింట్లను కోల్పోయి 5411 వద్ద ఉంది.
Source: Yahoo! Telugu: News | 14 Jul 2010 | 8:28 am

ఖాకీలపై సోంపేట వాసుల దాడి: పోలీసుల కాల్పులు!

శ్రీకాకుళం జిల్లా సోంపేట గ్రామంలో నిర్మించ తలపెట్టిన థర్మల్ విద్యుత్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా స్థానిక గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఈ ప్రాజెక్టు నిర్మిస్తున్న ప్రాంతానికి స్థానికులు కర్రలు, రాళ్ళతో దాడి చేశారు. ఈ దాడిలో ఒక హెడ్‌కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అలాగే, మరికొంత మంది పోలీసులు, ఒక టీవీ కెమెరామెన్‌ కూడా గాయపడ్డారు.
Source: Yahoo! Telugu: News | 14 Jul 2010 | 8:12 am

అడల్ట్ టీవీ ప్రోగ్రామ్స్‌ని అదుపుచేసే స్మార్ట్ రిమోట్!

మీరు ఇంట్లో లేనప్పుడు మీ పిల్లలు అడల్ట్ టీవీ ప్రోగ్రామ్స్ చూడటాన్ని ఆపాలనుకుంటున్నారా..? అయితే మీకోసమే ఈ సరికొత్త రిమోట్...!అవునండీ..!! శాస్త్రవేత్తలు ఓ సరికొత్త టీవీ రిమోట్‌ను రూపొందించారు. ఇందులో ఉన్న సెన్సార్, ఆపరేట్ చేసే కుటుంబ సభ్యులను బట్టి స్పందించి సదరు ఛానెళ్లను ప్రసారం కాకుండా ఆపుతుంది.
Source: Yahoo! Telugu: News | 14 Jul 2010 | 7:31 am

ఖైర్లాంజి ఊచకోత నిందితులకు మరణశిక్ష విధింపు!

2006లో ఖైర్లాంజిలో జరిగిన దళితుల ఊచకోత కేసులో జీవితఖైదు అనుభవిస్తున్న ఆరుగురు దోషులకు బాంబే హైకోర్టు బుధవారం ఉరిశిక్షలను ఖరారు చేసింది. జస్టిస్ ఏ.పి.లవాండే, జస్టిస్ ఆర్.సి. చౌహాన్‌ల ఆధ్వర్యంలో తుది తీర్పు వెలువడింది. సీబీఐ కూడా ఈ కేసులో కీలక పాత్ర పోషించింది.
Source: Yahoo! Telugu: News | 14 Jul 2010 | 7:29 am

స్టాక్ మార్కెట్: నిలకడగా సెనెక్స్ సూచీ

ముంబై స్టాక్ మార్కెట్‌లో సెన్సెక్స్ సూచీ నిలకడగా ఉంది. బుధవారం ఉదయం వంద పాయింట్ల వృద్ధితో ట్రేడింగ్ ఆరంభమై 18 వేల అధిగమించిన మించిన విషయం తెల్సిందే. ఈ పెరుగుదల నిలకడగా ఉంది. మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో సెన్సెక్స్ సూచి 39 పాయింట్ల వృద్ధితో 18025 వద్ద కొనసాగుతోంది. అలాగే, నిఫ్టీ సైతం 17 పాయింట్ల మేరకు లాభపడి 5418 వద్ద కొనసాగుతోంది.
Source: Yahoo! Telugu: News | 14 Jul 2010 | 7:15 am

వైట్ బ్యూటీ హాన్సికపై బ్లాక్ బ్యూటీ నయన్ గరంగరం

హాన్సిక పేరు చెబితే నయనతార భగ్గుమంటోంది. ఒళ్లంతా కంపరం పుట్టుకొస్తోందంటూ చికాకును ప్రదర్శిస్తోంది. కారణం ఏంటా అని ఆరా తీస్తే... హాన్సిక తరచూ ప్రభుదేవాను కలవడమేనని తెలిసింది. నవ్వొస్తానంటే నేనొద్దంటానా చిత్రంతో దర్శకుడిగా మారిన ప్రభుదేవా ఈ మధ్యనే తెలుగు "పోకిరి" చిత్రాన్ని తమళంలో, హిందీలో తీసి హిట్ కొట్టాడు. దీంతో ఆయనకు క్రేజ్ పెరిగింది. మరోవైపు ప్రభుదేవా ఫ్యామిలీ గొడవలతో సతమతమవుతున్నాడు. మరోవైపు నయనతారతో పెండ్లి కూడా జరిగిపోయిందని ఆమధ్య వార్తలు కూడా వచ్చాయి. అయితే నటి హాన్సిక మాత్రం ప్రభుదేవా తాజాగా తీయబోయే "ఇచ్" చిత్రంతోపాటు హిందీలో చేసే చిత్రంలో తనకు అవకాశం ఇవ్వాల్సిందిగా తరచూ ప్రభుదేవా గెస్ట్‌హౌస్‌కు రావడం, ఛాటింగ్ చేయడం జరుగుతోంది.
Source: Yahoo! Telugu: Entertainment | 14 Jul 2010 | 6:58 am

నాభీ నృత్యం చేయడానికి నేను రెడీ: సలోని

బెల్లీ డాన్స్ చేస్తా, బెల్లీ డాన్స్.. అంటూ నటి సలోని అంటోంది. మర్యాద రామన్న సినిమాలో సునీల్ సరసన నటించింది. ఈ సందర్భంగా సలోని మాట్లాడుతూ... సునీల్‌తో 'ఒక ఊరిలో', 'చుక్కల్లొ చంద్రుడు'లో నటించాను. మంచి టైమింగ్‌గల నటుడు అని కితాబిస్తోంది. డాన్స్ గురించి చెబుతూ.. మాస్ సాంగ్స్ బాగా చెస్తాననీ, బెల్లీ డాన్స్ బాగా వచ్చుననీ అంది. మగధీరలో డాన్స్ చూసి రాజమౌళి మర్యాద రామన్న సినిమాలో ఛాన్స్ ఇచ్చారని అంది. ఎక్స్‌పోజింగ్‌కు సిద్ధమేనా అనంటే కథనుబట్టి చేస్తానని చెప్పింది.
Source: Yahoo! Telugu: Entertainment | 14 Jul 2010 | 6:35 am

సీనియర్ బలోచ్ నాయకుడు హబీబ్ జలీబ్ హత్య

బలోచ్ సీనియర్ నాయకుడు, పార్లమెంటు మాజీ సభ్యుడైన హబీబ్ జలీబ్ బలోచ్‌ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. ఈ సంఘటన పాకిస్థాన్‌లోని క్వెట్టా నగరంలో చోటు చేసుకుంది. సరియాబ్ రోడ్‌లోని అతని నివాసంలో ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు మోటార్ సైకిల్‍పై వచ్చి కాల్పులు జరిపినట్లు డిఐజీ హమీద్ శకీల్ తెలిపారు.
Source: Yahoo! Telugu: News | 14 Jul 2010 | 6:32 am

రాజధానిలో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది వికారుద్దీన్ అరెస్టు!

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ నగర వాసులతో పాటు.. పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేసిన మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది వికారుద్దీన్‌ను రాజధాని పోలీసులు అరెస్టు చేశారు. ఆయనతో పాటు.. ఆయన సోదురుడు, మరో ఇద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Source: Yahoo! Telugu: News | 14 Jul 2010 | 6:23 am

18 వేల మైలురాయిని దాటిన సెన్సెక్స్ సూచీ

ముంబై స్టాక్ మార్కెట్‌లో బుధవారం ట్రేడింగ్ మంచి ఊపుమీద సాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లలో కనిపించిన సానుకూలత స్టాక్ మార్కెట్‌పై పడటంతో వృద్ధి బాటలో పయనిస్తోంది. ట్రేడింగ్ ఆరంభమైన వెంటనే వంద పైచిలుకు పాయింట్లతో సెన్సెక్స్ సూచీలో పెరుగుదల కనిపించింది. ఇది క్రమంగా బలపడి 181 పాయింట్ల పెరింగింది. ఫలితంగా.. సెన్సెక్స్ 18 వేల మైలురాయిని దాటింది. అలాగే, నిఫ్టీ సైతం యాభై పాయింట్ల మేరకు బలపడి 5453 వద్ద కొనసాగుతోంది.
Source: Yahoo! Telugu: News | 14 Jul 2010 | 6:04 am

ఖాకీలపై సోంపేట వాసుల దాడి: పోలీసుల కాల్పులు!

శ్రీకాకుళం జిల్లా సోంపేట గ్రామంలో నిర్మించ తలపెట్టిన థర్మల్ విద్యుత్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా స్థానిక గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఈ ప్రాజెక్టు నిర్మిస్తున్న ప్రాంతానికి స్థానికులు కర్రలు, రాళ్ళతో దాడి చేశారు. ఈ దాడిలో ఒక హెడ్‌కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అలాగే, మరికొంత మంది పోలీసులు, ఒక టీవీ కెమెరామెన్‌ కూడా గాయపడ్డారు.
Source: ఏపీ న్యూస్ | 14 Jul 2010 | 2:43 am

ఖైర్లాంజి ఊచకోత నిందితులకు మరణశిక్ష విధింపు!

2006లో ఖైర్లాంజిలో జరిగిన దళితుల ఊచకోత కేసులో జీవితఖైదు అనుభవిస్తున్న ఆరుగురు దోషులకు బాంబే హైకోర్టు బుధవారం ఉరిశిక్షలను ఖరారు చేసింది. జస్టిస్ ఏ.పి.లవాండే, జస్టిస్ ఆర్.సి. చౌహాన్‌ల ఆధ్వర్యంలో తుది తీర్పు వెలువడింది. సీబీఐ కూడా ఈ కేసులో కీలక పాత్ర పోషించింది.
Source: జాతీయ | 14 Jul 2010 | 2:00 am

వ్యూహాత్మకంగానే వెనుకడుగు..?!!: వేడి తగ్గిన "ఓదార్పు"

కడప ఎంపీ వైఎస్.జగన్మోహన్ రెడ్డి సాగిస్తున్న ఓదార్పు యాత్ర వేడి తగ్గింది. ఈనెల ఎనిమిదో తేదీన చేపట్టిన ఓదార్పు యాత్ర.. తొలి రోజు పూర్తిగా చప్పగా సాగింది. రెండు మూడు రోజులు వాడివేడిగా సాగింది. దీనిపై వైఎస్ వ్యతిరేక వర్గాలు ఒక్కసారి భగ్గుమన్నాయి. అటు కాంగ్రెస్‌లోనూ.. ఇటు ప్రభుత్వంలోనూ ప్రకంపనలు చెలరేగాయి.
Source: ఏపీ న్యూస్ | 14 Jul 2010 | 1:36 am

జగన్ వెంట ఉన్నవారంతా బచ్చాలే: ఎమ్మెల్యే శంకర్ రావు

ఓదార్పు యాత్ర పేరుతో జిల్లాల్లో పర్యటిస్తున్న కడప ఎంపీ వైఎస్.జగన్మోహన్ రెడ్డిపై సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శంకర్ రావు మరోమారు మండిపడ్డారు. జగన్ తన ఉనికిని కాపాడుకునేందుకే ఈ యాత్ర చేపట్టారని ఆయన ఆరోపించారు.
Source: ఏపీ న్యూస్ | 14 Jul 2010 | 12:54 am

రాజధానిలో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది వికారుద్దీన్ అరెస్టు!

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ నగర వాసులతో పాటు.. పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేసిన మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది వికారుద్దీన్‌ను రాజధాని పోలీసులు అరెస్టు చేశారు. ఆయనతో పాటు.. ఆయన సోదురుడు, మరో ఇద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Source: ఏపీ న్యూస్ | 14 Jul 2010 | 12:53 am

ముంబైలో క్లోరిన్ వాయువు లీక్: 60 మందికి అస్వస్థత

ముంబై హజీ బదార్ పోర్టు ట్రస్ట్ ప్రాంతంలో బుధవారం తెల్లవారు జామున 4 గంటల ప్రాంతలో క్లోరిన్ వాయువు లీక్ అయింది. దీంతో ఈ వాయువును పీల్చిన వారిలో 60 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరిలో 6 గురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఫైర్ బ్రిడ్జ్ అధికారులు తెలిపారు. అయితే, కొన్ని జాతీయ మీడియాలు మాత్రం ముగ్గురు మరణించినట్టు చెపుతున్నాయి.
Source: జాతీయ | 14 Jul 2010 | 12:03 am

కర్ణాటక రాజకీయాలను కుదిపేస్తున్న 'గాలి' సమస్య!

భారతీయ జనతా పార్టీ పాలనలో ఉన్న కర్ణాటక రాష్ట్ర రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ముఖ్యమంత్రి యడ్యూరప్ప క్యాబినెట్‌లో మంత్రులుగా ఉన్న గాలి సోదరులైన గాలి జనార్ధన్ రెడ్డి, గాలి కరుణాకర్ రెడ్డిలను మంత్రివర్గం నుంచి తప్పించాలని ఆ రాష్ట్ర గవర్నర్ హెచ్.ఆర్.భరద్వాజ్ ఆదేశించారు. ఇది ముఖ్యమంత్రి యడ్యూరప్పకు ప్రాణసంకటంగా మారింది.
Source: జాతీయ | 13 Jul 2010 | 9:55 pm

నేడు నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో ప్రధాని భేటీ!

నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ బుధవారం భేటీకానున్నారు. ఈ రాష్ట్రాల్లో నక్సల్ కార్యకలాపాల అణిచివేతతో పాటు.. అభివృద్ధిపై అనుసరించాల్సిన వ్యూహాలను ఇందులో రూపొందించే అవకాశం ఉంటుంది.
Source: జాతీయ | 13 Jul 2010 | 9:47 pm

నిర్మాత కాసిన పందెం: నూడ్‌గా కనిపించిన శ్వేతబసు..!?

"కొత్త బంగారులోకం" చిత్రం ద్వారా తెలుగు చిత్రసీమకు పరిచయమైన అందాల ముద్దుగుమ్మ శ్వేతబసు ప్రసాద్‌కు తీరని కష్టం వచ్చి పడింది. ప్రముఖ దర్శకుడు దిల్‌రాజు పరిచయం చేసిన ఈ భామకు.. పెద్ద బేనర్ నటించినా‌, సినిమా హిట్ అయినా అదృష్టం ఏ మాత్రం కలిసిరావట్లేదు. ఒక చిత్రం సక్సెస్ తర్వాత ఆమెకు వచ్చిన అభినందనలతో పాటు స్నేహితులు లాంటివారు ఇచ్చే రాత్రి పార్టీలతో ఎంజాయ్ చేయడం శ్వేతబసు ప్రసాద్ అలవాటుగా మార్చుకుంది. విచ్చలవిడిగా మందు కొట్టడంతో సీనియర్ నటీమణులే శ్వేతను చూసి ముక్కున వేలేసుకుంటున్నారట.ఇంతేకాదండీ..? డబ్బులు కోసం ఏదైనా చేసేందుకు సిద్ధంగా ఉండే హీరోయిన్ల జాబితాలో ఈవిడగారు కూడా చేరిందని ఫిలిమ్ నగర్ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. ఇలా ఒకసారి పార్టీలో పరిచయమైన ఓ నిర్మాత కాసిన పందెంతో శ్వేత నూడ్‌గా అతని రూమ్‌లో కన్పించి నిర్మాత నుంచి డబ్బులు బాగా లాగేసిందని ఫిలిమ్ నగర్ వర్గాల్లో వినికిడి.
Source: Yahoo! Telugu: Entertainment | 13 Jul 2010 | 11:45 am

శభాష్ అనిపించుకునే "ఏం పిల్లో ఏం పిల్లడో"..!

ఈతరం పిక్చర్స్ అధినేత పోకూరి బాబూరావు తనీష్, ప్రణీత జంటగా ఎ.ఎస్.రవికుమార్ చౌదరి దర్శకత్వాన నిర్మించిన "ఏం పిల్లో ఏం పిల్లడో" చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని జూలై 16వ తేదీన విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా గురించి నిర్మాత మాట్లాడుతూ, "మా పిల్లా, పిల్లాడులు తిట్టుకుంటారు, కొట్టుకుంటారు, ఆడతారు, నవ్విస్తారు, కాసేపు కంట తడిపెట్టిస్తారు. చివర్లో పెద్దల కళ్ళు తెరిపించి "ఏం పిల్లో ఏం పిల్లడో" శభాష్ అనిపించుకుంటారు. ఇక మా దర్శకుడు రవికుమార్ చౌదరి మేం గతంలో నిర్మించిన యజ్ఞం తర్వాత మళ్లీ బాగా తీశాడు. ఇంకా ఈ సినిమా కాదు. చిన్న హీరో హీరోయిన్లతో చేసిన చాలా పెద్ద సినిమా. నా గత 14 చిత్రాల కంటే ఈ సినిమా నాకు చాలా ఆనందాన్ని కలిగించింది. జూలై 16న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉంది" అని అన్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 13 Jul 2010 | 11:20 am

జె.డి. చక్రవర్తి దర్శకత్వంలో 'మనీ మనీ మోర్ మనీ'

న్యూ జనరేషన్ కామెడీ చిత్రాల్లో ఓ ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన చిత్రం "మనీ". సెన్సేషనల్ డైరక్టర్ రామ్‌గోపాల్ వర్మ నిర్మించిన ఈ చిత్రం సన్నివేశాల పరంగాను, సంగీత పరంగాను, చిత్రీకరణ పరంగానూ, పాత్రల రూపకల్పన పరంగాను కొత్త పుంతలు తొక్కింది. తాజాగా 'మనీ'కి పార్ట్ త్రీ రాబోతోంది. 'మనీ మనీ మోర్ మనీ' పేరుతో రూపొందనున్న ఈ చిత్రానికి రామ్‌గోపాల్‌వర్మ ప్రియ శిష్యుడైన జె.డి.చక్రవర్తి దర్శకత్వం వహించబోతున్నారు. 'ఖాన్‌దాదా'గా బ్రహ్మానందం ముఖ్యపాత్ర పోషించబోతున్నారు. 'అనంతరంపురం', 'సర్వం' వంటి అనువాద చిత్రాలతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సింహపురి టాకీస్ అధినేతలు రఘునాథ్, నరేందర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 13 Jul 2010 | 10:28 am

త్వరలో తెలుగు ప్రేక్షకుల ముందుకు "అంగాడి తెరు"

తమిళంలో ఇటీవల అంతా కొత్తవారితో వసంత బాలన్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ అయ్యంగరన్ ఇంటర్నేషనల్ ఫిలిమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ 'అంగాడి తెరు' అనే ఓ వినూత్నమైన ప్రేమకథా చిత్రాన్ని నిర్మించింది. తమిళనాట విడుదలై వందరోజులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం దాదాపు 15 కోట్లకు పైగా కలెక్షన్ చేసింది.తెలుగులో ఈ సినిమా హక్కులను ఓ యువ తెలుగు నిర్మాత సొంతం చేసుకున్నాడు. ఇప్పటికే డబ్బింగ్ కార్యక్రమాలు శుక్రవారం చెన్నై కోదండపాణి థియేటర్లో ప్రారంభమయ్యాయి. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఆగస్టులో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది.
Source: Yahoo! Telugu: Entertainment | 13 Jul 2010 | 10:08 am

కేసీఆర్-కేటీఆర్ పని పట్టండి: నేతలకు మొయిలీ ఆదేశం!

చీటీకిమాటికీ ఉప ఎన్నికలకు కారణమవుతున్న తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర రావు, ఆయన తనయుడు కె.తారక రామారావు పని పట్టాలని రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ వీరప్ప మొయిలీ తెలంగాణ ప్రాంత నేలను కోరారు. ఉప ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
Source: ఏపీ న్యూస్ | 13 Jul 2010 | 8:05 am

జగన్ యాత్రపై రోశయ్యకు అంత ఉలుకెందుకో: అంబటి

ముఖ్యమంత్రి కె.రోశయ్యపై జగన్ వర్గం ఎదురుదాడికి దిగింది. ఈ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు పాలెం శ్రీకాంత్ రెడ్డి, పీసీసీ ప్రధాన కార్యదర్శి అంబటి రాంబాబులు ఈ బాధ్యతను స్వీకరించారు. జగన్ ఓదార్పు యాత్రకు వెళుతుంటే.. ముఖ్యమంత్రి రోశయ్య మాత్రం.. సీఎం పీఠం కావాలని జగన్ యాత్ర చేపడుతున్నారని ప్రచారం చేయడం దురదృష్టకరమన్నారు.
Source: ఏపీ న్యూస్ | 13 Jul 2010 | 8:05 am

పార్టీ కోసం జగన్ ఏం కష్టపడ్డారు: ఎంపీ హర్షకుమార్

కడప ఎంపీ వైఎస్.జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కోసం ఏం కష్టపడ్డారని అమలాపురం ఎంపీ హర్షకుమార్ ప్రశ్నించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖ రెడ్డి కుమారుడు కాకుంటే ఇంత గుర్తింపు వచ్చేదా అని ఆయన అన్నారు.
Source: ఏపీ న్యూస్ | 13 Jul 2010 | 6:56 am

నిర్మాత కాసిన పందెం: నూడ్‌గా కనిపించిన శ్వేతబసు..!?

"కొత్త బంగారులోకం" చిత్రం ద్వారా తెలుగు చిత్రసీమకు పరిచయమైన అందాల ముద్దుగుమ్మ శ్వేతబసు ప్రసాద్‌కు తీరని కష్టం వచ్చి పడింది. ప్రముఖ దర్శకుడు దిల్‌రాజు పరిచయం చేసిన ఈ భామకు.. పెద్ద బేనర్ నటించినా‌, సినిమా హిట్ అయినా అదృష్టం ఏ మాత్రం కలిసిరావట్లేదు. ఒక చిత్రం సక్సెస్ తర్వాత ఆమెకు వచ్చిన అభినందనలతో పాటు...
Source: వినోదం | 13 Jul 2010 | 6:17 am

శభాష్ అనిపించుకునే "ఏం పిల్లో ఏం పిల్లడో"..!

ఈతరం పిక్చర్స్ అధినేత పోకూరి బాబూరావు తనీష్, ప్రణీత జంటగా ఎ.ఎస్.రవికుమార్ చౌదరి దర్శకత్వాన నిర్మించిన "ఏం పిల్లో ఏం పిల్లడో" చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని జూలై 16వ తేదీన విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా గురించి నిర్మాత మాట్లాడుతూ, "మా పిల్లా, పిల్లాడులు తిట్టుకుంటారు, కొట్టుకుంటారు, ఆడతారు, నవ్విస్తారు, కాసేపు కంట తడిపెట్టిస్తారు. చివర్లో పెద్దల కళ్ళు తెరిపించి "ఏం పిల్లో ఏం పిల్లడో" శభాష్ అనిపించుకుంటారు. ఇక మా దర్శకుడు రవికుమార్ చౌదరి మేం గతంలో నిర్మించిన యజ్ఞం తర్వాత మళ్లీ బాగా తీశాడు. ఇంకా ఈ సినిమా కాదు. చిన్న హీరో హీరోయిన్లతో చేసిన చాలా పెద్ద సినిమా. నా గత 14 చిత్రాల కంటే ఈ సినిమా నాకు చాలా ఆనందాన్ని కలిగించింది. జూలై 16న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉంది" అని అన్నారు.
Source: వినోదం | 13 Jul 2010 | 5:52 am

గాలి సోదరులపై చర్యలు తీసుకోండి: గవర్నర్ ఆదేశం

ఇనుప ఖనిజాన్ని అక్రమంగా రాష్ట్ర సరిహద్దులు దాటిస్తున్న వ్యవహారంలో పాలుపంచుకున్న మంత్రులపై తగిన చర్యలు తీసుకోవాలని కర్ణాటక రాష్ట్ర గవర్నర్ హెచ్.ఆర్.భరద్వాజ్ కోరారు. ఈ మేరకు ఆయన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీఎస్.యడ్యూరప్పను ఆదేశించారు. బళ్ళారి ఇనుప ఖనిజం త్రవ్వకాలు, తరలింపులో కర్ణాటక కేబినెట్‌ మంత్రులుగా ఉన్న గాలి జనార్ధన్ రెడ్డి (పర్యాటక శాఖ), గాలి కరుణాకర్ రెడ్డి (రెవెన్యూ)లు ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెల్సిందే.
Source: జాతీయ | 13 Jul 2010 | 5:49 am

లడక్‌లో ఎన్టీఆర్, ఇలియానాల "శక్తి" షూటింగ్!

యంగ్‌టైగర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా 'కంత్రి' ఫేమ్ మెహర్ రమేష్ దర్శకత్వంలో మెగా ప్రొడ్యూసర్ సి. అశ్వనీదత్ వైజయంతీ మూవీస్ పతాకంపై నిర్మిస్తున్న భారీ ప్రతిష్టాత్మక చిత్రం "శక్తి". ఈ సినిమా నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రం గురించి నిర్మాత సి. అశ్వనీదత్ మాట్లాడుతూ.."ఈజిప్టులో జరిగిన షెడ్యూల్‌లో విలన్స్‌కు సంబంధించిన కొన్ని కీలమైన సన్నివేశాల్ని జాకీష్రాఫ్, పూజాబేడి, సోనూ సూద్‌లతో పాటు 25 మంది ఫారిన్ ఆర్టిస్టులతో చిత్రీకరించడం జరిగింది. జూలై 11 నుంచి సినిమాలోని ప్రధాన తారాగణం పాల్గొనే కొన్ని సన్నివేశాల్ని లడక్, జమ్మూకాశ్మీర్, రుషికేష్, హరిద్వార్‌లలో అత్యంత కీలమైన సన్నివేశాల్ని చిత్రీకరించనున్నాం. తెలుగు చలనచిత్ర చరిత్రలో అత్యధిక లొకేషన్స్‌లో, భారీ బడ్జెట్‌తో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందుతున్న ఈ చిత్రం ఎన్టీఆర్ కెరీర్‌లోనే ఓ లాండ్‌మార్క్ ఫిలిమ్ అవుతుంది. మా వైజయంతీ మూవీస్ బేనర్‌కి "శక్తి" ఓ ప్రెస్టీజియస్ మూవీ అవుతుంది. మెహర్ రమేష్ ఈ చిత్రాన్ని చాలా అద్భుతంగా తీస్తున్నారు. తప్పకుండా ఈ సినిమా సూపర్‌హిట్ అవుతుందనే నమ్మకం నాకుంది." అని చెప్పారు.
Source: Yahoo! Telugu: Entertainment | 13 Jul 2010 | 5:40 am

"మర్యాద రామన్న" సైకిల్‌కు క్రేజీస్టార్ రవితేజ వాయిస్..!

కామెడీ కింగ్ సునీల్ హీరోగా, సలోని కథానాయికగా ఆర్కా మీడియా వర్క్స్ పతాకంపై సూపర్ సక్సెస్‌ఫుల్ డైరక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న "మర్యాద రామన్న" చిత్రం ఈ నెల 23వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రసాద్ దేవినేని, యార్లగడ్డ శోభు నిర్మిస్తున్న ఫుల్‌లెంగ్త్ ఎంటర్‌టైనర్ 'మర్యాద రామన్న' సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు ముస్తాబవుతోంది. ఈ సినిమా గురించి నిర్మాత ప్రసాద్ దేవినేని మాట్లాడుతూ.. "ఈ చిత్రంలో సైకిల్ ఓ ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. సినిమాలో ఓ క్యారెక్టర్‌లా సైకిల్ కంటిన్యూగా వుంటుంది. దీనికి క్రేజీస్టార్ రవితేజ వాయిస్ ఇవ్వడం విశేషం. సినిమాకి ఇదొక హైలైట్‌గా నిలుస్తుంది. ఈ నెల 23న విడుదలవుతున్న ఈ చిత్రం మా బేనర్‌కి పెద్ద హిట్‌గా నిలుస్తుంది" అన్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 13 Jul 2010 | 5:23 am

జె.డి. చక్రవర్తి దర్శకత్వంలో 'మనీ మనీ మోర్ మనీ'

న్యూ జనరేషన్ కామెడీ చిత్రాల్లో ఓ ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన చిత్రం "మనీ". సెన్సేషనల్ డైరక్టర్ రామ్‌గోపాల్ వర్మ నిర్మించిన ఈ చిత్రం సన్నివేశాల పరంగాను, సంగీత పరంగాను, చిత్రీకరణ పరంగానూ, పాత్రల రూపకల్పన పరంగాను కొత్త పుంతలు తొక్కింది. తాజాగా 'మనీ'కి పార్ట్ త్రీ రాబోతోంది. 'మనీ మనీ మోర్ మనీ' పేరుతో రూపొందనున్న ఈ చిత్రానికి రామ్‌గోపాల్‌వర్మ ప్రియ శిష్యుడైన జె.డి.చక్రవర్తి దర్శకత్వం వహించబోతున్నారు. 'ఖాన్‌దాదా'గా బ్రహ్మానందం ముఖ్యపాత్ర పోషించబోతున్నారు. 'అనంతరంపురం', 'సర్వం' వంటి అనువాద చిత్రాలతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సింహపురి టాకీస్ అధినేతలు రఘునాథ్, నరేందర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
Source: వినోదం | 13 Jul 2010 | 4:59 am

సంక్షేమమంటే అంత చులకనయిందా?.. చంద్రబాబు

రాష్ట్ర సంక్షేమంటే అంత చులకనయిందా, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుని రాకూడదా అంటూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా, మంగళవారం బాబ్లీ ప్రాజెక్టుతో పాటు బయ్యారం గనుల లీజు అంశాలపై చర్చ చేపట్టాలని తెదేపా సభ్యులు పట్టుబట్టారు.
Source: ఏపీ న్యూస్ | 13 Jul 2010 | 4:49 am

త్వరలో తెలుగు ప్రేక్షకుల ముందుకు "అంగాడి తెరు"

తమిళంలో ఇటీవల అంతా కొత్తవారితో వసంత బాలన్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ అయ్యంగరన్ ఇంటర్నేషనల్ ఫిలిమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ 'అంగాడి తెరు' అనే ఓ వినూత్నమైన ప్రేమకథా చిత్రాన్ని నిర్మించింది. తమిళనాట విడుదలై వందరోజులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం దాదాపు 15 కోట్లకు పైగా కలెక్షన్ చేసింది.తెలుగులో ఈ సినిమా హక్కులను ఓ యువ తెలుగు నిర్మాత సొంతం చేసుకున్నాడు. ఇప్పటికే డబ్బింగ్ కార్యక్రమాలు శుక్రవారం చెన్నై కోదండపాణి థియేటర్లో ప్రారంభమయ్యాయి. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఆగస్టులో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది.
Source: వినోదం | 13 Jul 2010 | 4:39 am

అక్టోబరులో స్థానిక సంస్థల ఎన్నికలు: ఒమర్ అబ్దుల్లా

జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చే అక్టోబరు నెలలో నిర్వహిస్తామని ఒమర్ అబ్దుల్లా వెల్లడించారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లను చేస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో తుపాకీ పవర్‌ను వీలైనంత మేరకు తగ్గించేందుకు అన్ని రకాల కృషి చేస్తుందని ఆయన తెలిపారు. ప్రస్తుతం కాశ్మీర్ లోయలో నెలకొన్న పరిస్థితులపై చర్చించేందుకు సోమవారం అఖిలపక్ష సమావేశాని అబ్దుల్లా నిర్వహించారు.
Source: జాతీయ | 13 Jul 2010 | 3:20 am