|
వాల్‌స్ట్రీట్ బిల్లుకు మద్దతు ప్రకటించిన రిపబ్లిక్ సెనెటర్లువాల్స్ట్రీట్ రీఫార్మ్స్ (సంస్కరణలు) బిల్లుకు రిపబ్లిక్ పార్టీకి చెందిన ఇద్దరు సెనెటర్లు తమ సంపూర్ణ మద్దతు తెలిపారు. దీంతో అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తలెపెట్టిన ఈ సంస్కరణ బిల్లుకు ఆమోదముద్ర లభించేలా కనిపిస్తోంది. అమెరికా సెనెట్‌లో ఈ బిల్లు పాస్ కావాలంటే మొత్తం 60 ఓట్లు కావాల్సి ఉంది.Source: Yahoo! Telugu: News | 13 Jul 2010 | 9:04 am అక్టోబరులో స్థానిక సంస్థల ఎన్నికలు: ఒమర్ అబ్దుల్లాజమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చే అక్టోబరు నెలలో నిర్వహిస్తామని ఒమర్ అబ్దుల్లా వెల్లడించారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లను చేస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో తుపాకీ పవర్‌ను వీలైనంత మేరకు తగ్గించేందుకు అన్ని రకాల కృషి చేస్తుందని ఆయన తెలిపారు. ప్రస్తుతం కాశ్మీర్ లోయలో నెలకొన్న పరిస్థితులపై చర్చించేందుకు సోమవారం అఖిలపక్ష సమావేశాని అబ్దుల్లా నిర్వహించారు.Source: Yahoo! Telugu: News | 13 Jul 2010 | 8:50 am ఆసియా మార్కెట్ ప్రభావం: నష్టాల్లో స్టాక్ మార్కెట్!ఆసియా స్టాక్ మార్కెట్ తిరోగమనం వైపు ర్యాలీని కొనసాగించడంతో బాంబే స్టాక్ మార్కెట్ పతనమైంది. మంగళవారం ట్రేడింగ్ ప్రారంభం నుంచే నష్టాల్లో కూరుకుపోయిన బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచి సెన్సెక్స్, మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో 66 పాయింట్లు పతనమై, 17,870 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచి నిఫ్టీ కూడా 16 పాయింట్ల స్వల్ప నష్టంతో 5,365 పాయింట్ల వద్ద పయనిస్తోంది.Source: Yahoo! Telugu: News | 13 Jul 2010 | 8:18 am నష్టాల్లో స్టాక్ మార్కెట్: సెన్సెక్స్, నిఫ్టీల పతనం!బాంబే స్టాక్ మార్కెట్ మంగళవారం నష్టాల్లో కూరుకుపోయింది. ట్రేడింగ్ ప్రారంభం నుంచే తిరోగమనం వైపు ర్యాలీని పయనింపజేసిన బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచి సెన్సెక్స్, మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో 72 పాయింట్లు పతనమై 17,864 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచి నిఫ్టీ కూడా 21 పాయింట్లు క్షీణించి, 5,361 పాయింట్ల వద్ద పయనిస్తోంది.Source: Yahoo! Telugu: News | 13 Jul 2010 | 8:12 am ఇకపై రాత్రిపూట కూడా వంటగ్యాస్ సరఫరా: మంత్రి జితిన్వినియోగదారుల సౌకర్యార్థం ఇకపై రాత్రిపూట వంటగ్యాస్ సిలిండర్లను సరఫరా చేయనున్నట్టు కేంద్ర పెట్రోలియం శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద్ తెలిపారు. ఆయన న్యూఢిల్లీ మాట్లాడుతూ.. ప్రస్తుతం ఉదయం ఎనిమిది నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు వంటగ్యాస్ సిలిండర్లను సరఫరా చేస్తున్నామన్నారు.Source: Yahoo! Telugu: News | 13 Jul 2010 | 7:44 am ఇటాలియన్ మాఫియాపై పోలీసుల ఉక్కుపాదంమాఫియా ముఠాలపై ఇటాలీ పోలీసులు ఉక్కుపాదం మోపారు. దేశ రాజధాని రోమ్‌తో పాటు.. వివిధ ప్రాంతాల్లో చేపట్టిన మెరుపు ఆపరేషన్‌లో సుమారు 300 మంది మాఫియా గ్యాంగ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. దక్షిణ రీజియన్‌లోని కలబ్రియా ప్రాంతంలో క్రైమ్ సిండికేట్ ఈ ఆపరేషన్ నిర్వహించింది.Source: Yahoo! Telugu: News | 13 Jul 2010 | 7:28 am స్వల్ప నష్టాల్లో బాంబే స్టాక్ మార్కెట్ ర్యాలీ!బాంబే స్టాక్ మార్కెట్ మంగళవారం తిరోగమనం వైపు ర్యాలీని కొనసాగిస్తోంది. ట్రేడింగ్ ప్రారంభం నుంచే నష్టాల్లో కూరుకుపోయిన బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచి సెన్సెక్స్ మంగళవారం ఉదయం 11.30 గంటల ప్రాంతంలో 23 పాయింట్లు పతనమైంది. దీంతో సెన్సెక్స్ సూచి 17,914 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచి నిఫ్టీ కూడా 6 పాయింట్ల స్వల్ప నష్టంతో 5,376 పాయింట్ల వద్ద పయనిస్తోంది.Source: Yahoo! Telugu: News | 13 Jul 2010 | 6:51 am జగన్‌కు సంఘీభావం ప్రకటించిన ఎంపీ ఉండవల్లి అరుణ్కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డికి రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సంఘీభావం ప్రకటించారు. ఈనెల 14వ తేదీన రాజానగరంలో జరిగే ఓదార్పు యాత్రలో పాల్గొంటానని ఉండవల్లి స్పష్టం చేశారు.Source: Yahoo! Telugu: News | 13 Jul 2010 | 6:14 am ట్రేడింగ్ క్షీణత: నష్టాల్లో బాంబే స్టాక్ మార్కెట్!బాంబే స్టాక్ మార్కెట్ నష్టాల వైపు ర్యాలీని కొనసాగిస్తోంది. సోమవారం లాభాల వైపు ర్యాలీని కొనసాగించిన బాంబే స్టాక్ మార్కెట్, మంగళవారం కుప్పకూలింది. ఫలితంగా మంగళవారం ఉదయం 10.30 గంటల ప్రాంతంలో 32 పాయింట్లు పతనమైన సెన్సెక్స్, 17,903 పాయింట్ల మార్కును తాకింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచి నిఫ్టీ కూడా 9 పాయింట్లు స్వల్పంగా క్షీణించి, 5,373 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.Source: Yahoo! Telugu: News | 13 Jul 2010 | 6:11 am డీఎస్.. పోటీ నుంచి తప్పుకో: అమరవీరుల కుటుంబాలు!నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ తక్షణం పోటీ నుంచి తప్పుకోవాలని తెలంగాణ అమరవీరుల కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో వచ్చే ఎన్నికల్లో ఆయనను చిత్తుగా ఓడిస్తామని వారు హెచ్చరించారు.Source: Yahoo! Telugu: News | 13 Jul 2010 | 6:02 am లడక్‌లో ఎన్టీఆర్, ఇలియానాల "శక్తి" షూటింగ్!యంగ్‌టైగర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా 'కంత్రి' ఫేమ్ మెహర్ రమేష్ దర్శకత్వంలో మెగా ప్రొడ్యూసర్ సి. అశ్వనీదత్ వైజయంతీ మూవీస్ పతాకంపై నిర్మిస్తున్న భారీ ప్రతిష్టాత్మక చిత్రం "శక్తి". ఈ సినిమా నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రం గురించి నిర్మాత సి. అశ్వనీదత్ మాట్లాడుతూ.."ఈజిప్టులో జరిగిన షెడ్యూల్‌లో విలన్స్‌కు సంబంధించిన కొన్ని కీలమైన సన్నివేశాల్ని జాకీష్రాఫ్, పూజాబేడి, సోనూ సూద్‌లతో పాటు 25 మంది ఫారిన్ ఆర్టిస్టులతో చిత్రీకరించడం జరిగింది. జూలై 11 నుంచి సినిమాలోని ప్రధాన తారాగణం పాల్గొనే కొన్ని సన్నివేశాల్ని లడక్, జమ్మూకాశ్మీర్, రుషికేష్, హరిద్వార్‌లలో అత్యంత కీలమైన సన్నివేశాల్ని చిత్రీకరించనున్నాం. తెలుగు చలనచిత్ర చరిత్రలో అత్యధిక లొకేషన్స్‌లో, భారీ బడ్జెట్‌తో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందుతున్న ఈ చిత్రం ఎన్టీఆర్ కెరీర్‌లోనే ఓ లాండ్‌మార్క్ ఫిలిమ్ అవుతుంది. మా వైజయంతీ మూవీస్ బేనర్‌కి "శక్తి" ఓ ప్రెస్టీజియస్ మూవీ అవుతుంది. మెహర్ రమేష్ ఈ చిత్రాన్ని చాలా అద్భుతంగా తీస్తున్నారు. తప్పకుండా ఈ సినిమా సూపర్‌హిట్ అవుతుందనే నమ్మకం నాకుంది." అని చెప్పారు.Source: Yahoo! Telugu: Entertainment | 13 Jul 2010 | 5:40 am "మర్యాద రామన్న" సైకిల్‌కు క్రేజీస్టార్ రవితేజ వాయిస్..!కామెడీ కింగ్ సునీల్ హీరోగా, సలోని కథానాయికగా ఆర్కా మీడియా వర్క్స్ పతాకంపై సూపర్ సక్సెస్‌ఫుల్ డైరక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న "మర్యాద రామన్న" చిత్రం ఈ నెల 23వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రసాద్ దేవినేని, యార్లగడ్డ శోభు నిర్మిస్తున్న ఫుల్‌లెంగ్త్ ఎంటర్‌టైనర్ 'మర్యాద రామన్న' సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు ముస్తాబవుతోంది. ఈ సినిమా గురించి నిర్మాత ప్రసాద్ దేవినేని మాట్లాడుతూ.. "ఈ చిత్రంలో సైకిల్ ఓ ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. సినిమాలో ఓ క్యారెక్టర్‌లా సైకిల్ కంటిన్యూగా వుంటుంది. దీనికి క్రేజీస్టార్ రవితేజ వాయిస్ ఇవ్వడం విశేషం. సినిమాకి ఇదొక హైలైట్‌గా నిలుస్తుంది. ఈ నెల 23న విడుదలవుతున్న ఈ చిత్రం మా బేనర్‌కి పెద్ద హిట్‌గా నిలుస్తుంది" అన్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 13 Jul 2010 | 5:23 am అక్టోబరులో స్థానిక సంస్థల ఎన్నికలు: ఒమర్ అబ్దుల్లాజమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చే అక్టోబరు నెలలో నిర్వహిస్తామని ఒమర్ అబ్దుల్లా వెల్లడించారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లను చేస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో తుపాకీ పవర్‌ను వీలైనంత మేరకు తగ్గించేందుకు అన్ని రకాల కృషి చేస్తుందని ఆయన తెలిపారు. ప్రస్తుతం కాశ్మీర్ లోయలో నెలకొన్న పరిస్థితులపై చర్చించేందుకు సోమవారం అఖిలపక్ష సమావేశాని అబ్దుల్లా నిర్వహించారు.Source: జాతీయ | 13 Jul 2010 | 3:20 am ఇకపై రాత్రిపూట కూడా వంటగ్యాస్ సరఫరా: మంత్రి జితిన్వినియోగదారుల సౌకర్యార్థం ఇకపై రాత్రిపూట వంటగ్యాస్ సిలిండర్లను సరఫరా చేయనున్నట్టు కేంద్ర పెట్రోలియం శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద్ తెలిపారు. ఆయన న్యూఢిల్లీ మాట్లాడుతూ.. ప్రస్తుతం ఉదయం ఎనిమిది నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు వంటగ్యాస్ సిలిండర్లను సరఫరా చేస్తున్నామన్నారు.Source: జాతీయ | 13 Jul 2010 | 2:14 am జగన్‌కు సంఘీభావం ప్రకటించిన ఎంపీ ఉండవల్లి అరుణ్కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డికి రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సంఘీభావం ప్రకటించారు. ఈనెల 14వ తేదీన రాజానగరంలో జరిగే ఓదార్పు యాత్రలో పాల్గొంటానని ఉండవల్లి స్పష్టం చేశారు.Source: ఏపీ న్యూస్ | 13 Jul 2010 | 12:46 am డీఎస్.. పోటీ నుంచి తప్పుకో: అమరవీరుల కుటుంబాలు!నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ తక్షణం పోటీ నుంచి తప్పుకోవాలని తెలంగాణ అమరవీరుల కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో వచ్చే ఎన్నికల్లో ఆయనను చిత్తుగా ఓడిస్తామని వారు హెచ్చరించారు.Source: ఏపీ న్యూస్ | 13 Jul 2010 | 12:32 am చంద్రబాబుతో కుమ్మక్కైన సీనియర్ నేతలు: జగన్ వర్గంతమ పార్టీకి చెందిన కొంతమంది సీనియర్ నేతలు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో కుమ్మక్కయ్యారని వైఎస్.జగన్మోహన్ రెడ్డి వర్గానికి చెందిన కొంతమంది ఎమ్మెల్యేలు బహిరంగ ఆరోపణ చేశారు. ఇలాంటి వారంతా వైఎస్‌ఆర్ పరువు ప్రతిష్టలను మంటగలపటమే ధ్యేయంగా మాట్లాడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.Source: ఏపీ న్యూస్ | 13 Jul 2010 | 12:19 am అడ్డుకట్ట వేయలేక పోతే తప్పుకుంటా: సీఎం యడ్యూరప్పరాష్ట్రంలోని సహజ సంపదను అక్రమంగా తరలి పోతుండటం పట్ల కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్.యడ్యూరప్ప తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇనుప ఖనిజం అక్రమ తరలింపును అడ్డుకోలేక పోతే తాను ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలుగుతానని ప్రకటించారు. ఈ విషయాన్ని మంగళవారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ప్రతిపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.Source: జాతీయ | 12 Jul 2010 | 11:56 pm తెలంగాణ వనరులు ఎవడబ్బ సొత్తు: ఎమ్మెల్యే శంకర్ రావుతెలంగాణ గడ్డలో నిక్షిప్తమై ఉన్న సహజ వనరులను అడ్డగోలుగా దోచుకునేందుకు ఎవడబ్బ సొత్తని సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శంకర్ రావు ఆగ్రహంతో ప్రశ్నించారు. ఆయన మంగళవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడుతూ.. గత ఆరేళ్ళ కాలంలో తెలంగాణ సహజ వనరులను వైఎస్ కుటుంబీకులు అడ్డగోలుగా దోచుకున్నారని ఆరోపించారు. దీనికి ప్రత్యక్ష సాక్ష్యమే బయ్యారం గనుల లీజు అని ఆయన అన్నారు.Source: ఏపీ న్యూస్ | 12 Jul 2010 | 11:35 pm త్వరలో ప్రవాస భారతీయులకు ఓటు హక్కు: మొయిలీప్రవాస భారతీయులకు త్వరలోనే ఓటు హక్కు కల్పిస్తామని కేంద్ర న్యాయశాఖామంత్రి వీరప్ప మొయిలీ చెప్పారు. లండన్ పర్యటనను ముగించుకుని న్యూఢిల్లీకి చేరుకున్న ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా 2.20 కోట్ల మంది భారతీయులు విదేశాల్లో నివశిస్తున్నారన్నారు.Source: జాతీయ | 12 Jul 2010 | 10:30 pm ఘనంగా జగన్నాథ రథ యాత్ర వేడుకలు ప్రారంభం!ఒరిస్సా రాష్ట్రంలోని పూరిలో జగన్నాథుని వార్షిక రథయాత్ర వేడుకలు మంగళవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. దేవతలకు, మానవులకు మధ్య సారూప్యతలను సూచిస్తూనే.. లౌకికవాదానికి, సామరస్యానికి ప్రతీకగా చెప్పుకునే ఈ రథయాత్రకు దేశంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది.Source: జాతీయ | 12 Jul 2010 | 10:15 pm వైఎస్.జగన్ వ్యవహారం అంతర్గతం: మనీష్ తివారీకడప ఎంపీ వైఎస్.జగన్మోహన్ రెడ్డి కొనసాగిస్తున్న ఓదార్పు యాత్రపై అత్యుత్సాహం ప్రదర్శించవద్దని మీడియాకు కాంగ్రెస్ అధికార ప్రతినిధి మనీష్ తివారీ చురక అంటించారు. జగన్ వ్యవహారం తమ పార్టీ అంతర్గత వ్యవహారమన్నారు. అందువల్ల ఈ విషయంపై పెద్దగా దృష్టి సారించవద్దని ఆయన హితవు పలికారు.Source: ఏపీ న్యూస్ | 12 Jul 2010 | 8:58 am ఏడింటిలో ఈవీఎం.. ఐదింటిలో బ్యాలెట్ పద్దతి: ఐవీతెలంగాణ ప్రాంతంలో జరిగే ఉప ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఏడు స్థానాల్లో ఈవీఎంలతోనూ, ఐదు సెగ్మెంట్‌లలో బ్యాలెట్ పద్దతిలో ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నట్టు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఐవీ.సుబ్బారావు తెలిపారు. ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడుతూ నామినేషన్ల ఉపసంహరణ గడువు సోమవారంతో ముగిసింది. మొత్తం 278 మంది అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో ఎన్నికల బరిలో 435 మంది ఉన్నారని ఆయన తెలిపారు.Source: ఏపీ న్యూస్ | 12 Jul 2010 | 7:15 am జాన్‌ను పెళ్లాడను.. డేటింగ్ వరకే: బిపాసబాలీవుడ్ తారల మైండ్ సెట్ విభిన్నంగా ఉంటుందనడానికి తాజా ఉదాహరణ సెక్సీ బాంబ్ బిపాసా బసు. గత కొన్ని సవంత్సరాలుగా బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహాంతో డేటింగ్ చేస్తున్న ఈ సెక్సీ తార వద్ద పెళ్లి విషయాన్ని ప్రస్తావిస్తే దాటవేస్తూ వచ్చింది. చివరికి తన పెళ్లి విషయంపై నోరు తెరిచింది. అయితే తన బాయ్‌ఫ్రెండ్ జాన్ అబ్రహాంను వివాహమాడబోననీ, అతను జస్ట్ బాయ్‌ఫ్రెండ్ మాత్రమేననీ, డేటింగ్ వరకే అతడు పరిమితమని వెల్లడించింది. అంటే భవిష్యత్తులో జాన్ అబ్రహాంను వదిలిపెట్టి మరొకర్ని చేసుకుంటారా.. ఏంటీ...? అని ప్రశ్నిస్తే, ఆ ప్రశ్నకు తానిపుడు సమాధానం చెప్పనంది. అయితే జాన్‌ను మాత్రం పెళ్లి చేసుకోనని తెగేసి చెప్పింది. ఇలా చెబితే జాన్ అబ్రహాంను కాకుండా మరో మగాడ్ని పెళ్లి చేసుకుంటుందనే కదా అర్థం. కానీ అలా కాదంటోందాయే బిపాస. చూద్దాం ఏం జరుగుతుందో..!!Source: Yahoo! Telugu: Entertainment | 12 Jul 2010 | 6:52 am ఆ పాటలో నటించేటపుడు ఏడ్చేశాను: పవన్ కల్యాణ్పవర్స్టార్ పవన్ కల్యాణ్ నిజంగానే ఏడ్చిన సంఘటన కొమరం పులి చిత్రీకరణలో చోటుచేసుకుందట. ఈ విషయాన్ని పవన్ కల్యాణే వివరించాడు. కొమరం పులి చిత్రం ఆడియో కార్యక్రమం సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ... తాను రికార్డులు కోసం ఏ సినిమాను ఇంతవరకూ చేయలేదనీ, కొన్ని సినిమాలు అనుకోకుండా సక్సెస్‌లు సాధించాయని చెప్పుకొచ్చారు. అదేవిధంగా తన తాజా చిత్రం కొమరం పులిలో గుండెను పిండేసే ఓ పాట ఉందన్నాడు.Source: Yahoo! Telugu: Entertainment | 12 Jul 2010 | 6:22 am బాంబు దాడిలో తీవ్రంగా గాయపడిన యూపీ మంత్రి!ఉత్తరప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ మంత్రి ఒకరు సోమవారం జరిగిన బాంబు దాడిలో తీవ్రంగా గాయపడ్డారు. తన నివాసం వెలుపల ఈ పేలుడు జరిగింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆయనను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.Source: జాతీయ | 12 Jul 2010 | 5:51 am జగన్ వర్గ తీవ్రవాదిగా పుల్లా పద్మావతి: శంకర్ రావు!కడప ఎంపీ వైఎస్.జగన్ వర్గానికి చెందిన తీవ్రవాదిగా ఎమ్మెల్సీ పుల్లా పద్మావతి వ్యవహిస్తున్నారని కంటోన్మెంట్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి శంకర్ రావు ధ్వజమెత్తారు. ఆయన సోమవారం అసెంబ్లీలో విలేకరులతో మాట్లాడుతూ పద్మావతి వంటి మరికొంతమంది కారణంగానే జగన్ పెట్రేగి పోతున్నారని ఆయన ఆరోపించారు.Source: ఏపీ న్యూస్ | 12 Jul 2010 | 3:42 am జై జగన్.. జోహార్ వైఎస్సార్: అంబటి రాంబాబుముఖ్యమంత్రి రోశయ్యపై వివాదాస్పద వ్యాఖ్యలకు పాల్పడిన ఎమ్మెల్యే అంబటి రాంబాబు మరోసారి మీడియా ముందు తన స్వరాన్ని హెచ్చు చేసి వినిపించారు. క్రమశిక్షణా సంఘం ముందు హాజరు కావాలని అతి తక్కువ సమయాన్ని నిర్దేశించడం కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాలకు సంబంధించి న్యాయ విరుద్ధమనీ, అందువల్ల తనకు మరో పక్షం రోజులు గడువు ఇవ్వాలని కోరానన్నారు.Source: ఏపీ న్యూస్ | 12 Jul 2010 | 3:25 am మందుకి విషానికి తేడా....!మందుకు విషానికి ఉన్న తేడా ఏంట్రా అడిగాడు గిరీశం "ఏం లేదురా.. మందు తాగితే ప్రజల చుట్టూ నువ్వు నాట్యం చేస్తావ్..!" "అదే విషం తాగితే ప్రజలు నీ చట్టూ చేరి నాట్యం చేస్తార్రా" బదులిచ్చాడు సుందరీశం.Source: వినోదం | 12 Jul 2010 | 3:17 am అప్పగింతలప్పుడు అమ్మాయి ఏడిస్తే..!?టీచర్: "పెళ్లిలో అప్పగింతలప్పుడు అమ్మాయి ఏడుస్తుంది. అబ్బాయి నవ్వుతాడు ఎందుకు..?"విద్యార్థి: "అది అమ్మాయికి చివరి ఏడుపు... అబ్బాయికైతే చివరి నవ్వు టీచర్..!"Source: వినోదం | 12 Jul 2010 | 3:15 am వెస్ట్‌మిడ్నాపూర్‌లో అదుపులో 12 మంది మావోయిస్టులుపశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని వెస్ట్ మిడ్నాపూర్‌లో 12 మంది మావోయిస్టులను సీఆర్‌పీఎప్ బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. మావోయిస్టులను అదుపులోకి తీసుకున్న ప్రాంతంలోనే ఒక గ్రామస్తుని మృతదేహాన్ని కూడా కనుగొన్నారు. పరికతా అనే ప్రాంతం వద్ద ఉమాకాంత్ మహతో అనే వ్యక్తి మృతదేహాన్ని గుర్తించినట్టు, ఈ హత్యకు వెనుక గల కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదని పోలీసులు వెల్లడించారు.Source: జాతీయ | 12 Jul 2010 | 3:04 am
|