జగన్ వర్గ తీవ్రవాదిగా పుల్లా పద్మావతి: శంకర్ రావు!

కడప ఎంపీ వైఎస్.జగన్ వర్గానికి చెందిన తీవ్రవాదిగా ఎమ్మెల్సీ పుల్లా పద్మావతి వ్యవహిస్తున్నారని కంటోన్మెంట్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి శంకర్ రావు ధ్వజమెత్తారు. ఆయన సోమవారం అసెంబ్లీలో విలేకరులతో మాట్లాడుతూ పద్మావతి వంటి మరికొంతమంది కారణంగానే జగన్ పెట్రేగి పోతున్నారని ఆయన ఆరోపించారు.
Source: Yahoo! Telugu: News | 12 Jul 2010 | 9:07 am

లాభాల్లో స్టాక్ మార్కెట్: సెన్సెక్స్, నిఫ్టీల వృద్ధి!

బాంబే స్టాక్ మార్కెట్ సోమవారం లాభాల బాటలో కొనసాగుతోంది. సోమవారం మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచి సెన్సెక్స్ 105 పాయింట్లు లాభపడి, 17,939 పాయింట్ల మార్కును తాకింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేండ్ సూచి నిఫ్టీ కూడా 29 పాయింట్ల స్వల్ప లాభంతో 5,381 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.
Source: Yahoo! Telugu: News | 12 Jul 2010 | 8:58 am

జై జగన్.. జోహార్ వైఎస్సార్: అంబటి రాంబాబు

ముఖ్యమంత్రి రోశయ్యపై వివాదాస్పద వ్యాఖ్యలకు పాల్పడిన ఎమ్మెల్యే అంబటి రాంబాబు మరోసారి మీడియా ముందు తన స్వరాన్ని హెచ్చు చేసి వినిపించారు. క్రమశిక్షణా సంఘం ముందు హాజరు కావాలని అతి తక్కువ సమయాన్ని నిర్దేశించడం కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాలకు సంబంధించి న్యాయ విరుద్ధమనీ, అందువల్ల తనకు మరో పక్షం రోజులు గడువు ఇవ్వాలని కోరానన్నారు.
Source: Yahoo! Telugu: News | 12 Jul 2010 | 8:54 am

ప్రపంచ దేశాలతో అమెరికా సత్ సంబంధాలు: వైట్‌హౌస్

అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పాలనా యంత్రాంగం ప్రపంచ దేశాలతో సత్ సంబంధాలు ఉన్నాయని వైట్‌హౌస్ అభిప్రాయపడింది. అధ్యక్షుడు ఒబామా ప్రతి దేశంలో ఉన్న వాస్తవిక పరిస్థితులకు అనుగుణంగా తమ విధానాన్ని అనుసరిస్తుండటం వల్లే ఇది సాధ్యమైందని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ రాబర్ట్ గిబ్స్ తెలిపారు.
Source: Yahoo! Telugu: News | 12 Jul 2010 | 8:51 am

వెస్ట్‌మిడ్నాపూర్‌లో అదుపులో 12 మంది మావోయిస్టులు

పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని వెస్ట్ మిడ్నాపూర్‌లో 12 మంది మావోయిస్టులను సీఆర్‌పీఎప్ బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. మావోయిస్టులను అదుపులోకి తీసుకున్న ప్రాంతంలోనే ఒక గ్రామస్తుని మృతదేహాన్ని కూడా కనుగొన్నారు. పరికతా అనే ప్రాంతం వద్ద ఉమాకాంత్ మహతో అనే వ్యక్తి మృతదేహాన్ని గుర్తించినట్టు, ఈ హత్యకు వెనుక గల కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదని పోలీసులు వెల్లడించారు.
Source: Yahoo! Telugu: News | 12 Jul 2010 | 8:34 am

దీపావళి వరకు చక్కెర ఎగుమతులు లేనట్టే: కేంద్రం

పండుగ సమయాలలో చక్కెర ధరలు పెరుగుతాయనే ఉద్దేశ్యంతో దాదాపు 10 లక్షల టన్నుల చక్కెర ఎగుమతులను నవంబర్‌ (దీపావళి) వరకూ నిలిపి వేయాలని కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ అధికారులు యోచిస్తున్నారు. ఇప్పటికే కొన్ని చక్కెర మిల్లులు ఎగుమతులకు సంబంధించి అనుమతిని కోరగా, ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో కుదరదని, చెరకు పంట దిగుబడి ఇంకా సాగులోనే ఉండటం వల్ల వచ్చే సీజన్‌కు అందబాటులోకి వచ్చే అవకాశం లేదని, అందుకే ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు ఆ మంత్రిత్వ శాఖకు చెందిన అధికారి ఒకరు వెల్లడించారు.
Source: Yahoo! Telugu: News | 12 Jul 2010 | 7:29 am

విదేశీ మార్కెట్ల ప్రభావం: లాభాల్లో స్టాక్ మార్కెట్!

బాంబే స్టాక్ మార్కెట్ లాభాలను ఆర్జిస్తోంది. ట్రేడింగ్ ప్రారంభం నుంచే పురోగమనం వైపు ర్యాలీని కొనసాగిస్తున్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచి సెన్సెక్స్, 12.30 గంటల ప్రాంతంలో 64 పాయింట్లు లాభపడింది. దీంతో సెన్సెక్స్ సూచి 17,897 పాయింట్ల మార్కును తాకింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచి నిఫ్టీ కూడా 22 పాయింట్లు బలపడి, 5,375 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.
Source: Yahoo! Telugu: News | 12 Jul 2010 | 6:58 am

11 మంది గ్రామస్తులను కిడ్నాప్ చేసిన మావోయిస్టులు

మావోయిస్టులు మరో అఘాయిత్యానికి తెగబడ్డారు. బీహార్ రాష్ట్రంలోని కైమూర్ జిల్లా లోడా గ్రామానికి చెందిన 11 మంది గ్రామస్తులను సాయుధ మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. మొత్తం 60 మంది మావోయిస్టులు ఒక్కసారి గ్రామంలోకి వచ్చి 11 మందిని ఆదివారం రాత్రి కిడ్నాప్ చేసినట్టు డైరక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ నీల్మణి సోమవారం తెలిపారు.
Source: Yahoo! Telugu: News | 12 Jul 2010 | 6:56 am

జాన్‌ను పెళ్లాడను.. డేటింగ్ వరకే: బిపాస

బాలీవుడ్ తారల మైండ్ సెట్ విభిన్నంగా ఉంటుందనడానికి తాజా ఉదాహరణ సెక్సీ బాంబ్ బిపాసా బసు. గత కొన్ని సవంత్సరాలుగా బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహాంతో డేటింగ్ చేస్తున్న ఈ సెక్సీ తార వద్ద పెళ్లి విషయాన్ని ప్రస్తావిస్తే దాటవేస్తూ వచ్చింది. చివరికి తన పెళ్లి విషయంపై నోరు తెరిచింది. అయితే తన బాయ్‌ఫ్రెండ్ జాన్ అబ్రహాంను వివాహమాడబోననీ, అతను జస్ట్ బాయ్‌ఫ్రెండ్ మాత్రమేననీ, డేటింగ్ వరకే అతడు పరిమితమని వెల్లడించింది. అంటే భవిష్యత్తులో జాన్ అబ్రహాంను వదిలిపెట్టి మరొకర్ని చేసుకుంటారా.. ఏంటీ...? అని ప్రశ్నిస్తే, ఆ ప్రశ్నకు తానిపుడు సమాధానం చెప్పనంది. అయితే జాన్‌ను మాత్రం పెళ్లి చేసుకోనని తెగేసి చెప్పింది. ఇలా చెబితే జాన్ అబ్రహాంను కాకుండా మరో మగాడ్ని పెళ్లి చేసుకుంటుందనే కదా అర్థం. కానీ అలా కాదంటోందాయే బిపాస. చూద్దాం ఏం జరుగుతుందో..!!
Source: Yahoo! Telugu: Entertainment | 12 Jul 2010 | 6:52 am

1971 యుద్ధ నేరగాళ్లకు వీసాలు ఇవ్వొద్దు: బంగ్లాదేశ్

దేశ స్వాతంత్ర్యం కోసం 1971లో జరిగిన యుద్ధంలో నేరగాళ్ళుగా ముద్రపడిన వారికి వీసాలు మంజూరు చేయరాదని బంగ్లాదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. వీరంతా పాకిస్థాన్‌తో చేరి కుట్రపన్నినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అందువల్ల వీరికి వీసాలు ఇవ్వరాదని కోరినట్టు బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి దిపూ మోనీ ఢాకాలో వెల్లడించారు.
Source: Yahoo! Telugu: News | 12 Jul 2010 | 6:49 am

ప్రస్తుత పరిస్థితులతో ప్రభుత్వానికి నష్టమే: మంత్రి బొత్సా

రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు అటు పార్టీతో పాటు.. ఇటు ప్రభుత్వానికి నష్టమేనని రాష్ట్ర మంత్రులు బొత్స సత్యనారాయణ, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు అభిప్రాయపడ్డారు. సోమవారం వారు సచివాలయంలో మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ కడప ఎంపీ వైఎస్.జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ఓదార్పు యాత్రపై చెలరేగిన వివాదం త్వరలోనే సమసి పోతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
Source: Yahoo! Telugu: News | 12 Jul 2010 | 6:28 am

ఆ పాటలో నటించేటపుడు ఏడ్చేశాను: పవన్ కల్యాణ్

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ నిజంగానే ఏడ్చిన సంఘటన కొమరం పులి చిత్రీకరణలో చోటుచేసుకుందట. ఈ విషయాన్ని పవన్ కల్యాణే వివరించాడు. కొమరం పులి చిత్రం ఆడియో కార్యక్రమం సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ... తాను రికార్డులు కోసం ఏ సినిమాను ఇంతవరకూ చేయలేదనీ, కొన్ని సినిమాలు అనుకోకుండా సక్సెస్‌లు సాధించాయని చెప్పుకొచ్చారు. అదేవిధంగా తన తాజా చిత్రం కొమరం పులిలో గుండెను పిండేసే ఓ పాట ఉందన్నాడు.
Source: Yahoo! Telugu: Entertainment | 12 Jul 2010 | 6:22 am

జగన్ వర్గ తీవ్రవాదిగా పుల్లా పద్మావతి: శంకర్ రావు!

కడప ఎంపీ వైఎస్.జగన్ వర్గానికి చెందిన తీవ్రవాదిగా ఎమ్మెల్సీ పుల్లా పద్మావతి వ్యవహిస్తున్నారని కంటోన్మెంట్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి శంకర్ రావు ధ్వజమెత్తారు. ఆయన సోమవారం అసెంబ్లీలో విలేకరులతో మాట్లాడుతూ పద్మావతి వంటి మరికొంతమంది కారణంగానే జగన్ పెట్రేగి పోతున్నారని ఆయన ఆరోపించారు.
Source: ఏపీ న్యూస్ | 12 Jul 2010 | 3:42 am

జై జగన్.. జోహార్ వైఎస్సార్: అంబటి రాంబాబు

ముఖ్యమంత్రి రోశయ్యపై వివాదాస్పద వ్యాఖ్యలకు పాల్పడిన ఎమ్మెల్యే అంబటి రాంబాబు మరోసారి మీడియా ముందు తన స్వరాన్ని హెచ్చు చేసి వినిపించారు. క్రమశిక్షణా సంఘం ముందు హాజరు కావాలని అతి తక్కువ సమయాన్ని నిర్దేశించడం కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాలకు సంబంధించి న్యాయ విరుద్ధమనీ, అందువల్ల తనకు మరో పక్షం రోజులు గడువు ఇవ్వాలని కోరానన్నారు.
Source: ఏపీ న్యూస్ | 12 Jul 2010 | 3:25 am

వెస్ట్‌మిడ్నాపూర్‌లో అదుపులో 12 మంది మావోయిస్టులు

పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని వెస్ట్ మిడ్నాపూర్‌లో 12 మంది మావోయిస్టులను సీఆర్‌పీఎప్ బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. మావోయిస్టులను అదుపులోకి తీసుకున్న ప్రాంతంలోనే ఒక గ్రామస్తుని మృతదేహాన్ని కూడా కనుగొన్నారు. పరికతా అనే ప్రాంతం వద్ద ఉమాకాంత్ మహతో అనే వ్యక్తి మృతదేహాన్ని గుర్తించినట్టు, ఈ హత్యకు వెనుక గల కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదని పోలీసులు వెల్లడించారు.
Source: జాతీయ | 12 Jul 2010 | 3:04 am

11 మంది గ్రామస్తులను కిడ్నాప్ చేసిన మావోయిస్టులు

మావోయిస్టులు మరో అఘాయిత్యానికి తెగబడ్డారు. బీహార్ రాష్ట్రంలోని కైమూర్ జిల్లా లోడా గ్రామానికి చెందిన 11 మంది గ్రామస్తులను సాయుధ మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. మొత్తం 60 మంది మావోయిస్టులు ఒక్కసారి గ్రామంలోకి వచ్చి 11 మందిని ఆదివారం రాత్రి కిడ్నాప్ చేసినట్టు డైరక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ నీల్మణి సోమవారం తెలిపారు.
Source: జాతీయ | 12 Jul 2010 | 1:27 am

ప్రస్తుత పరిస్థితులతో ప్రభుత్వానికి నష్టమే: మంత్రి బొత్సా

రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు అటు పార్టీతో పాటు.. ఇటు ప్రభుత్వానికి నష్టమేనని రాష్ట్ర మంత్రులు బొత్స సత్యనారాయణ, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు అభిప్రాయపడ్డారు. సోమవారం వారు సచివాలయంలో మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ కడప ఎంపీ వైఎస్.జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ఓదార్పు యాత్రపై చెలరేగిన వివాదం త్వరలోనే సమసి పోతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
Source: ఏపీ న్యూస్ | 12 Jul 2010 | 1:00 am

సెప్టెంబరు 2వ తేదీన వైఎస్.జగన్ కొత్త పార్టీ ఖాయం!

దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి తొలి వర్థంతి రోజైన సెప్టెంబరు రెండో తేదీన కడప ఎంపీ వైఎస్.జగన్మోహన్ రెడ్డి కొత్త పార్టీ పేరును ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ఇందుకు సంబంధించిన ప్రణాళికలు జోరుగా సాగుతున్నట్టు తెలుస్తోంది. పార్టీ అధిష్టానం వద్దని చెపుతున్నప్పటికీ శ్రీకాకుళం ఓదార్పు యాత్రను జగన్ చేపట్టారు.
Source: ఏపీ న్యూస్ | 12 Jul 2010 | 12:50 am

17 తర్వాత ఉప ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు సిద్ధం!

ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఈనెల 17వ తేదీతో ముగియనున్నాయి. ఈ సమావేశాలు ముగిసిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఉప ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. ముఖ్యమంత్రి కె.రోశయ్య, ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి వంటి నేతలు ప్రచారానికి దూరంగా ఉంటున్నప్పటికీ.. చంద్రబాబు మాత్రం ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.
Source: ఏపీ న్యూస్ | 12 Jul 2010 | 12:12 am

నేటి నుంచి తూగోలో ఓదార్పు: పెరగనున్న జగన్ స్వరం!

తూర్పు గోదావరి జిల్లాలో ఓదార్పు యాత్ర సోమవారం నుంచి ప్రారంభంకానుంది. ఆదివారం రాత్రితో శ్రీకాకుళం యాత్రను ముగించుకున్న జగన్.. సోమవారం తూగోలో అడుగుపెట్టారు. ఆయనకు ఆ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక నేతలు ఘన స్వాగతం పలికారు. ఫలితంగా.. జగన్ స్వరం మరింత పెరిగే అవకాశం ఉంది.
Source: ఏపీ న్యూస్ | 11 Jul 2010 | 11:36 pm

పీఎస్ఎల్వీ సీ-15 రాకెట్ ప్రయోగం విజయవంతం: ఇస్రో

పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ సీ-15 ప్రయోగం విజయంతమైనట్టు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రకటించింది. నెల్లూరు జిల్లా, శ్రీహరికోటలోని సతీష్ థావన్ అంతరిక్ష పరీక్షా కేంద్రం (షార్) నుంచి ఈ ఉపగ్రహ వాహక నౌకను విజయవంతంగా ప్రయోగించారు. నాలుగు దశలను విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత.. ఐదు ఉప గ్రహాలను నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది.
Source: జాతీయ | 11 Jul 2010 | 11:12 pm

కాశ్మీర్‌ లోయలో కర్ఫ్యూ ఎత్తివేత: నేడు అఖిలపక్ష భేటీ!

గత కొన్ని రోజులుగా అల్లర్లతో అట్టుడికిన కాశ్మీర్ లోయలో ప్రశాంత వాతావరణం ఏర్పడుతున్నట్టు కనిపిస్తోంది. దీంతో ఇక్కడ అమలులో ఉన్న కర్ఫ్యూను ఎత్తివేశారు. అయినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో చెదురుముదురు సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ ప్రాంతాల్లో భద్రతా బలగాలను మొహరించారు.
Source: జాతీయ | 11 Jul 2010 | 9:42 pm

స్వైన్‌ఫ్లూకు హోమియో మందు ఆవిష్కరణ: సీసీఆర్‌ఎం

ప్రపంచ దేశాలను వణికించిన స్వైన్ ఫ్లూ వ్యాధిన నిరోధక టీకాను సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్స్ ఇన్ హోమియో సంస్థ ఆవిష్కరించింది. దేశంలో తొలిసారి నమోదైన ఈ టీకాను ఇకపై స్వైన్ ఫ్లూ వైరస్ బారిన పడే రోగులకు వాడాలని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సిఫార్సు చేసింది.
Source: జాతీయ | 11 Jul 2010 | 9:28 pm

తెలంగాణ కాంగ్రెస్ నేతలకు పిచ్చి: జగన్ వర్గం దాడి!

ఆరేళ్ల పాటు స్తబ్దుగా ఉన్న కాంగ్రెస్ అంతర్గత రాజకీయాలు ఒక్కసారి బహిర్గతమయ్యాయి. కడప ఎంపీ వైఎస్.జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ఓదార్పు యాత్ర పుణ్యమాని ఆ పార్టీలో అంతర్గత కలహాలు రచ్చకెక్కాయి. జగన్ ఏకంగా కాంగ్రెస్ హైకమాండ్, ముఖ్యమంత్రి రోశయ్యలను లక్ష్యంగా చేసుకుని అస్త్రాలు సంధిస్తున్నారు. దీంతో రోశయ్యకు సన్నిహితులుగా మెలుగుతున్న ఆ పార్టీ సీనియర్ నేతలు, వైఎస్ బద్ధ వ్యతిరేకులైన వి.హన్మంతరావు, కే.కేశవరావు, ఎమ్మెల్యే శంకర్ రావు, పాల్వాయి గోవర్ధన్ రెడ్డి వంటి వారు జగన్‌పై అవినీతి విమర్శలు సంధించారు.
Source: ఏపీ న్యూస్ | 11 Jul 2010 | 9:18 pm

ఆరునూరైనా.. జగన్మోహన్ వెంటే ఉంటాం: మేకపాటి

ఆరునూరైనా తాము కడప ఎంపీ వైఎస్.జగన్మోహన్ రెడ్డి వెంటే ఉంటామని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మేకపాటి చంద్రశేఖర రెడ్డి స్పష్టం చేశారు. తనతోపాటు తన సోదరుడు, నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి కూడా ఆయన వెంటే ఉంటామని ఆయన తెలిపారు.
Source: ఏపీ న్యూస్ | 11 Jul 2010 | 6:38 am

జగన్ యాత్రను రాజకీయం చేయవద్దు: జీవన్ రెడ్డి

కడప ఎంపీ వైఎస్.జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ఓదార్పు యాత్రను రాజకీయం చేయవద్దని తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి టి.జీవన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఆయన ఆదివారం కరీంనగర్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. జగన్ చేపట్టిన ఓదార్పుయాత్రను మానవీయ కోణంలో చూడాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
Source: ఏపీ న్యూస్ | 11 Jul 2010 | 6:31 am

భారత్‌ అమ్ముల పొదిలో చేరనున్న జలంతర్గాములు!

భారత్ అమ్ముల పొదిలో మరో ఆరు జలంతర్గాలు వచ్చి చేరనున్నాయి. మొత్తం యాభై వేల కోట్ల రూపాయల విలువ చేసే ఈ భారీ ఒప్పందం ద్వారా ఈ జలంతర్గాములు భారత్‌కు చేరనున్నాయి. ఈ భారీ ఒప్పందానికి కేంద్ర రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ నేతృత్వంలోని డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ (డీఏసీ) ఆదివారం ఆమోదం తెలిపింది. ఈ కమిటీ ఆదివారం న్యూఢిల్లీలో మంత్రి ఆంటోనీ నేతృత్వంలో సమావేశమైంది.
Source: జాతీయ | 11 Jul 2010 | 6:07 am

పరువు హత్యల ముసాయిదా బిల్లును ప్రవేశపెట్టాలి: కారత్

దేశంలో నానాటికీ పెరిగిపోతున్న పరువు హత్యలకు అడ్డుకట్ట వేసేలా సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకారత్ అభిప్రాయపడ్డారు. ఇందుకు సంబంధించిన బిల్లును త్వరలో ప్రారంభంకానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లోనే ప్రవేశపెట్టాలని ఆమె కోరారు.
Source: జాతీయ | 11 Jul 2010 | 3:57 am

సహనం కోల్పోయిన జగన్మోహన్ రెడ్డి: తులసి రెడ్డి

కడప ఎంపీ వైఎస్.జగన్మోహన్ రెడ్డి సహనం కోల్పోయి మాట్లాడుతున్నారని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి టి.తులసి రెడ్డి అభిప్రాయపడ్డారు. ఓదార్పు యాత్ర పూర్తిగా తన వ్యక్తిగతమని చెపుతున్నపుడు ఎమ్మెల్యేలు ఎందుకు వస్తారని ఆయన ప్రశ్నించారు.
Source: ఏపీ న్యూస్ | 11 Jul 2010 | 3:43 am