పరువు హత్యల ముసాయిదా బిల్లును ప్రవేశపెట్టాలి: కారత్

దేశంలో నానాటికీ పెరిగిపోతున్న పరువు హత్యలకు అడ్డుకట్ట వేసేలా సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకారత్ అభిప్రాయపడ్డారు. ఇందుకు సంబంధించిన బిల్లును త్వరలో ప్రారంభంకానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లోనే ప్రవేశపెట్టాలని ఆమె కోరారు.
Source: Yahoo! Telugu: News | 11 Jul 2010 | 9:26 am

సహనం కోల్పోయిన జగన్మోహన్ రెడ్డి: తులసి రెడ్డి

కడప ఎంపీ వైఎస్.జగన్మోహన్ రెడ్డి సహనం కోల్పోయి మాట్లాడుతున్నారని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి టి.తులసి రెడ్డి అభిప్రాయపడ్డారు. ఓదార్పు యాత్ర పూర్తిగా తన వ్యక్తిగతమని చెపుతున్నపుడు ఎమ్మెల్యేలు ఎందుకు వస్తారని ఆయన ప్రశ్నించారు.
Source: Yahoo! Telugu: News | 11 Jul 2010 | 9:12 am

తాను కూడా చిరంజీవి అభిమానిని: సీఎం రోశయ్య

ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య తన మనస్సులోని మాటను వెల్లడించారు. తాను కూడా ఒకపుడు చిరంజీవి అభిమానినేనన్నారు. అయితే, సినిమాలపై తనకు పెద్దగా అవగాహన లేదని, సినిమాలు కూడా పెద్దగా చూడబోన్నారు. అయినప్పటికీ.. తాను కూడా హీరో చిరంజీవి అభిమానినన్నారు.
Source: Yahoo! Telugu: News | 11 Jul 2010 | 9:04 am

దేశంలో మాయమైన పది రూపాయల నాణేలు!

భారత రిజర్వు బ్యాంకు విడుదల చేసిన పది రూపాయల నాణేలు చలామణిలో ఉన్నట్టు దేశంలో ఎక్కడా కనిపించడం లేదు. ఈ నాణేలు ఎక్కడకు వెళ్లాయన్న అంశంపై ఆర్బీఐ దృష్టి సారించింది. యేడాది క్రితం ఆర్బీఐ ఎనిమిది కోట్ల నాణేలను మార్కెట్‌లోకి విడుదల చేసింది. ప్రస్తుతం వీటిలో ఒక్క పది రూపాయల నాణెం కూడా కంటికి కనిపించడం లేదు. ఇది దేశంలో ఒక అద్భుతంగా ఉంది.
Source: Yahoo! Telugu: News | 11 Jul 2010 | 7:36 am

లోకాయుక్త జస్టీస్ సూచలనపై స్పందిస్తాం: ఎల్కే.అద్వానీ

కర్ణాటక లోకాయుక్త జస్టీస్ సంతోష్ హెగ్డే చేసిన సూచనలను కర్ణాటక ప్రభుత్వం పరిశీలిస్తుందని భారతీయ జనతా పార్టీ అగ్రనేత ఎల్కే.అద్వానీ అన్నారు. ఈ విషయాన్ని తన బ్లాగులో పేర్కొన్నారు. అంతేకాకుండా, తన విజ్ఞప్తి మేరకు రాజీనామా ఉపసంహరించుకున్నందుకు కర్ణాటక లోకాయుక్త జస్టిస్ సంతోష్ హెగ్డేకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తాను చేసిన విజ్ఞప్తికి హెగ్డే స్పందించిన తీరు పట్ల అద్వానీ హర్షం వ్యక్తం చేశారు.
Source: Yahoo! Telugu: News | 11 Jul 2010 | 7:19 am

2012లో అంతరిక్షానికి సునీతా విలియమ్స్ పయనం!

భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్ మరోమారు అంతరిక్షయానం చేయనున్నారు. వచ్చే 2012 జూన్ నెలలో ఆమె సాహస యాత్రకు వెళ్లనున్నట్టు శనివారం ప్రకటించారు. 44 ఏళ్ళ సునీతా విలియమ్స్‌ అంతరిక్షంలో 195 రోజులు గడిపిన రికార్డు ఉన్న విషయం తెల్సిందే.
Source: Yahoo! Telugu: News | 11 Jul 2010 | 6:30 am

యడ్యూరప్ప ప్రభుత్వాన్ని రద్దు చేయండి: దేవెగౌడ

కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాన్ని తక్షణం రద్దు చేయాలని మాజీ ప్రధాని హెచ్.డి.దేవెగౌడ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాడు. రాష్ట్రంలోని ముఖ్యమంత్రి యడ్యూరప్ప ప్రభుత్వం అసెంబ్లీలో అరాచకంగా, అప్రజాస్వామికంగా వ్యవహరించిందని ఆయన ఆరోపించారు. అందువల్ల రాష్ట్ర గవర్నర్ హెచ్.ఆర్.భరద్వాజ్ తక్షణం జోక్యం చేసుకుని రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేయాలని దేవెగౌడ కోరారు.
Source: Yahoo! Telugu: News | 11 Jul 2010 | 6:19 am

అమెరికాలో 7 నెలలో విఫలమైన 90 బ్యాంకులు

ప్రపంచ ఆర్థిక సంక్షోభం అమెరికా బ్యాంకులను పట్టిపీడిస్తోంది. గత ఏడు నెలల్లో 90 బ్యాంకులు పూర్తిగా విఫలమయ్యాయి. ఆర్థిక సంక్షోభంలో కూరుకున్న బ్యాంకులు పూర్తిగా కోలుకోని పరిస్థితి నెలకొని ఉన్న విషయం తెల్సిందే. దీంతో పాటు నిరుద్యోగ రేటు కూడా భారీగానే పెరుగుతోంది.
Source: Yahoo! Telugu: News | 11 Jul 2010 | 5:51 am

సీనియర్లకు బెదిరింపు ఫోన్‌కాల్స్: జగన్ వర్గం పనేనా?

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అంతర్గత రాజకీయాలు ముదిరి పాకాన పడుతున్నాయి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ తనయుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ఓదార్పు యాత్రం రాష్ట్ర కాంగ్రెస్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది.
Source: Yahoo! Telugu: News | 11 Jul 2010 | 5:33 am

పసికందుల మృతదేహాలతో వెళుతున్న వ్యక్తి అరెస్టు!

నైజీరియా రాజధాని లాగోస్‌లో 90 పసికందుల మృతదేహాలతో వెళుతున్న వ్యక్తిని ఆదేశ పోలీసులు అరెస్టు చేశారు. ఆయన చేతిలో ఉన్న సంచుల్లో 90 మృతశిశువుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు.
Source: Yahoo! Telugu: News | 11 Jul 2010 | 5:17 am

పరువు హత్యల ముసాయిదా బిల్లును ప్రవేశపెట్టాలి: కారత్

దేశంలో నానాటికీ పెరిగిపోతున్న పరువు హత్యలకు అడ్డుకట్ట వేసేలా సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకారత్ అభిప్రాయపడ్డారు. ఇందుకు సంబంధించిన బిల్లును త్వరలో ప్రారంభంకానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లోనే ప్రవేశపెట్టాలని ఆమె కోరారు.
Source: జాతీయ | 11 Jul 2010 | 3:57 am

సహనం కోల్పోయిన జగన్మోహన్ రెడ్డి: తులసి రెడ్డి

కడప ఎంపీ వైఎస్.జగన్మోహన్ రెడ్డి సహనం కోల్పోయి మాట్లాడుతున్నారని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి టి.తులసి రెడ్డి అభిప్రాయపడ్డారు. ఓదార్పు యాత్ర పూర్తిగా తన వ్యక్తిగతమని చెపుతున్నపుడు ఎమ్మెల్యేలు ఎందుకు వస్తారని ఆయన ప్రశ్నించారు.
Source: ఏపీ న్యూస్ | 11 Jul 2010 | 3:43 am

తాను కూడా చిరంజీవి అభిమానిని: సీఎం రోశయ్య

ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య తన మనస్సులోని మాటను వెల్లడించారు. తాను కూడా ఒకపుడు చిరంజీవి అభిమానినేనన్నారు. అయితే, సినిమాలపై తనకు పెద్దగా అవగాహన లేదని, సినిమాలు కూడా పెద్దగా చూడబోన్నారు. అయినప్పటికీ.. తాను కూడా హీరో చిరంజీవి అభిమానినన్నారు.
Source: ఏపీ న్యూస్ | 11 Jul 2010 | 3:35 am

లోకాయుక్త జస్టీస్ సూచలనపై స్పందిస్తాం: ఎల్కే.అద్వానీ

కర్ణాటక లోకాయుక్త జస్టీస్ సంతోష్ హెగ్డే చేసిన సూచనలను కర్ణాటక ప్రభుత్వం పరిశీలిస్తుందని భారతీయ జనతా పార్టీ అగ్రనేత ఎల్కే.అద్వానీ అన్నారు. ఈ విషయాన్ని తన బ్లాగులో పేర్కొన్నారు. అంతేకాకుండా, తన విజ్ఞప్తి మేరకు రాజీనామా ఉపసంహరించుకున్నందుకు కర్ణాటక లోకాయుక్త జస్టిస్ సంతోష్ హెగ్డేకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తాను చేసిన విజ్ఞప్తికి హెగ్డే స్పందించిన తీరు పట్ల అద్వానీ హర్షం వ్యక్తం చేశారు.
Source: జాతీయ | 11 Jul 2010 | 1:50 am

యడ్యూరప్ప ప్రభుత్వాన్ని రద్దు చేయండి: దేవెగౌడ

కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాన్ని తక్షణం రద్దు చేయాలని మాజీ ప్రధాని హెచ్.డి.దేవెగౌడ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాడు. రాష్ట్రంలోని ముఖ్యమంత్రి యడ్యూరప్ప ప్రభుత్వం అసెంబ్లీలో అరాచకంగా, అప్రజాస్వామికంగా వ్యవహరించిందని ఆయన ఆరోపించారు. అందువల్ల రాష్ట్ర గవర్నర్ హెచ్.ఆర్.భరద్వాజ్ తక్షణం జోక్యం చేసుకుని రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేయాలని దేవెగౌడ కోరారు.
Source: జాతీయ | 11 Jul 2010 | 12:50 am

సీనియర్లకు బెదిరింపు ఫోన్‌కాల్స్: జగన్ వర్గం పనేనా?

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అంతర్గత రాజకీయాలు ముదిరి పాకాన పడుతున్నాయి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ తనయుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ఓదార్పు యాత్రం రాష్ట్ర కాంగ్రెస్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది.
Source: ఏపీ న్యూస్ | 11 Jul 2010 | 12:04 am

దేశంలో వాణిజ్య కోర్టుల ఏర్పాటుకు యోచన: కపాడియా

దేశంలో నానాటికీ పేరుకుపోతున్న కేసుల సత్వర పరిష్కారానికి వాణిజ్య కోర్టులను ఏర్పాటు చేసే ఆలోచన ఉన్నట్టు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్.హెచ్.కపాడియా తెలిపారు. శనివారం న్యూఢిల్లీలో జరిగిన ఒక సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. మన దేశంలో కోర్టు వెలుపల వివాదాలు పరిష్కారం చేసుకునే సంస్కతి లేకపోవడమే పెండింగ్ కేసులు పెరిగిపోవడానికి ప్రధాన కారణంగా తెలుస్తోందన్నారు.
Source: జాతీయ | 10 Jul 2010 | 11:05 pm

బలవంతంగా గుండెను పిండేసే "భీమిలి కబడ్డీ జట్టు"!

గ్రామీణ వాతావరణంలో తీసిన సినిమాకు కెమెరామెన్ పనితనం బాగుంది. లోబడ్జెట్ సినిమా. భీమిలి ఊరు రాజమండ్రి ఊరు మాత్రమే కన్పిస్తాయి. ఇందులో పాత్రలంతా కొత్తవారే. జూనియర్ ఆర్టిస్టులతోనే ఎక్కువగా లాగించేశారు. జాతీయ క్రీడ కబడ్డీ నేపథ్యంగా ఎంచుకుని తీసిన ఈ సినిమా లగాన్ తరహాలో చూపించాలనే తాపత్రయంతో తీశారు. సూరిగా నాని సరిపోయాడు. మిగిలిన వారంతా తమ పాత్రకు న్యాయం చేశారు. పెద్దగా చెప్పుకోవాల్సిన పాత్రలు ఈ చిత్రంలో లేవు. గ్రామంలో మధ్యతరగతి కుటుంబాలు ఎలా ఉంటాయో వాటిని దర్శకుడు చక్కగా చూపాడు. శరణ్యామోహన్ కొద్దిసేపు కనిపిస్తుంది. సెకండాఫ్, క్లైమాక్స్‌లో వస్తుంది. మొదటి భాగమంతా సరదాగా కాస్త లాగినట్లుగా కథ సాగుతుంది. సెకండాఫ్ కబడ్డీ ఆట గురించి ఉంటుంది. రాష్ట్రస్థాయి కప్ ఎలా గెలుచుకున్నారన్నది చూపాడు. కానీ క్లైమాక్స్‌లో గుండెలు బలవంతంగా పిండినట్లు చేశాడు. సూరి పాత్రను సెంటిమెంట్ కోసం బలవంతంగా చంపేసినట్లైంది.
Source: Yahoo! Telugu: Entertainment | 10 Jul 2010 | 9:53 am

ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఈవీఎంలతో ఎన్నికలు: ఈసీ

తెలంగాణ ప్రాంతంలో జరుగనున్న 12 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను ఏడు సెగ్మెంట్లకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల ద్వారా ఎన్నికలు జరిగే అవకాశం ఉందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఐవీ సుబ్బారావు సూచన ప్రాయంగా వెల్లడించారు. ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్ల పరిశీలన శనివారంతో ముగిసింది.
Source: ఏపీ న్యూస్ | 10 Jul 2010 | 8:03 am

బొమ్మాళీ' ఛాన్సు కొట్టేసిన హాట్ గర్ల్ తాప్సీ..!

దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు "ఝమ్మంది నాదం" ద్వారా వెండితెరకు పరిచయమైన అందాల ముద్దుగుమ్మ "తాప్సీ"కి ఛాన్సులపై ఛాన్సులు వస్తున్నాయి. ఇటు టాలీవుడ్, అటు కోలీవుడ్‌లలో 'తాప్సీ' పేరు మారుమోగిపోతోంది. హీరోయిన్‌గా వచ్చే ఆఫర్లు ఒక ఎత్తైతే.. మరోవైపు యాడ్ ఫిలిమ్స్ చేయమని పలు వాణిజ్య సంస్థలకు చెందిన నిర్వాహకులు క్యూ కడుతున్నారట. తొలి సినిమాలో నటిస్తుండగానే, రెండు మూడు చిత్రాల్లో నటించేందుకు సంతకాలు చేసిన తాప్సీ, ఏకంగా 'అరుంధతి' బొమ్మాళీ అనుష్క ఛాన్సునే కొట్టేసిందట. ప్రముఖ దర్శకుడు ఆర్.బి.చౌదరి రీమేక్ హక్కులు పొందిన తమిళ "వేదం"లో తాప్సీ నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చెన్నై కోడంబాక్కం వర్గాల సమాచారం.
Source: Yahoo! Telugu: Entertainment | 10 Jul 2010 | 6:58 am

నేనేం పాపం చేశాను.. ఒంటరిని చేశారు: జగన్ ఆవేదన

వైఎస్.జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ఓదార్పు యాత్ర మెల్లగా రాజకీయ రంగు పులుముకుంటుంది. శ్రీకాకుళం జిల్లాలో చేపట్టిన తొలిరోజు యాత్ర చాలా చప్పగా సాగింది. రెండో రోజున సాగిన యాత్రలో భాగంగా నర్సన్నపేటలో జరిగిన బహిరంగ సభలో జగన్.. తొలి రాజకీయ అస్త్రం ప్రయోగించారు.
Source: ఏపీ న్యూస్ | 10 Jul 2010 | 5:53 am

చిదంబరంతో సమావేశమైన మంత్రి ఫరూక్ అబ్దుల్లా

కేంద్ర హోంశాకామంత్రి చిదంబరంతో కేంద్ర మంత్రి ఫరూక్ అబ్దుల్లా శనివారం భేటీ అయ్యారు. కాశ్మీర్ లోయలో చెలరేగిన అల్లర్ల కారణంగా తన కుమారుడైన ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వాన్ని రక్షించాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. ప్రస్తుత పరిస్థితుల్లో జమ్మూకాశ్మీర్‌లో కాంగ్రెస్ మద్దతుతో కొనసాగుతున్న నేషనల్ కాన్ఫరెన్స్ ప్రభుత్వానికి అవసరమైన సహాయక చర్యలు చేయాలని ఆయన ఈ సందర్భంగా కోరారు.
Source: జాతీయ | 10 Jul 2010 | 5:27 am

వైఎస్.జగన్‌పై మండిపడిన తెదేపా నేత దేవినేని

దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డిని మహాత్మాగాంధీతో పోల్చడాన్ని తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నేత మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వర రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన విజయవాడలో శనివారం విలేకరులతో మాట్లాడుతూ వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎన్నో అవినీతి, అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొన్నారని గుర్తు చేశారు. ఇలాంటి నేతను జాతిపితతో పోల్చడం సమంజసమేనా అని ఆయన ప్రశ్నించారు.
Source: ఏపీ న్యూస్ | 10 Jul 2010 | 5:12 am

సోనియా తలచుకుంటే బాబ్లీ పరిష్కారం: చంద్రబాబు

కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ తలచుకుంటే బాబ్లీ సమస్యకు పరిష్కార మార్గం లభిస్తుందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఆయన శనివారం రేణిగుంట విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడుతూ మహారాష్ట్ర ప్రభుత్వం అడ్డుగోలుగా నిర్మిస్తున్న అక్రమ సాగునీటి ప్రాజెక్టుల వల్ల రాష్ట్రంలోని పలు ప్రాంతాలు ఎడారిగా మారే ప్రమాదం పొంచివుందన్నారు.
Source: ఏపీ న్యూస్ | 10 Jul 2010 | 4:53 am

సీఎం పదవికి మరికొద్దికాలం ఆగుంటే బాగుండు: సీఎం

ముఖ్యమంత్రి పీఠం కోసం యువ ఎంపీ వైఎస్.జగన్మోహన్ రెడ్డి మరికొద్ది కాలం ఆగివుంటే బాగుండేదని ముఖ్యమంత్రి కె.రోశయ్య అభిప్రాయపడ్డారు. మహానేత వైఎస్ హఠాన్మరణం తర్వాత ముఖ్యమంత్రి పదవి కోసం జగన్ వెంపర్లాడినట్టు మీడియాలో కథనాలు వచ్చాయని ఆయన గుర్తు చేశారు. ఇలాంటి వార్తలు రాకుండా తండ్రి మరణానంతరం మరికొంతకాలం వేచిచూసే ధోరణిని అనుసరించి ఆ తర్వాత ముఖ్యమంత్రి పదవిని కోరివున్నట్టయితే బాగుండేదన్నారు.
Source: ఏపీ న్యూస్ | 10 Jul 2010 | 3:40 am