ఆర్ఐఎల్ ఎక్జిక్యూటివ్స్‌లకు సిబిఐ కోర్టు సమన్లు

రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన మనోజ్ మోడీతో పాటు మరో ఐదుగురికి కాల్‌రూటింగ్ కేసులో చెన్నై ప్రత్యేక సీబీఐ కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ కేసును జూన్ 25న సిబిఐ చార్జిషీట్‌ను ఫైల్ చేసింది. ఆగస్టు 3న ఈ ఎక్జిక్యూటివ్స్ కోర్టులో హాజరు కావల్సివుంటుంది. సిబిఐ ఈ ఎక్జిక్యూటివ్స్ క్రిమినల్ కాన్సిపిరసీకి పాల్పడినట్లు ఆరోపించింది.
Source: Yahoo! Telugu: News | 10 Jul 2010 | 9:17 am

సీఎం పదవికి మరికొద్దికాలం ఆగుంటే బాగుండు: సీఎం

ముఖ్యమంత్రి పీఠం కోసం యువ ఎంపీ వైఎస్.జగన్మోహన్ రెడ్డి మరికొద్ది కాలం ఆగివుంటే బాగుండేదని ముఖ్యమంత్రి కె.రోశయ్య అభిప్రాయపడ్డారు. మహానేత వైఎస్ హఠాన్మరణం తర్వాత ముఖ్యమంత్రి పదవి కోసం జగన్ వెంపర్లాడినట్టు మీడియాలో కథనాలు వచ్చాయని ఆయన గుర్తు చేశారు. ఇలాంటి వార్తలు రాకుండా తండ్రి మరణానంతరం మరికొంతకాలం వేచిచూసే ధోరణిని అనుసరించి ఆ తర్వాత ముఖ్యమంత్రి పదవిని కోరివున్నట్టయితే బాగుండేదన్నారు.
Source: Yahoo! Telugu: News | 10 Jul 2010 | 9:10 am

వచ్చే వారంలో భారత్‌కు రానున్న అమెరికా ఎన్ఎస్ఏ

అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జనరల్ (రిటైర్డ్) జేమ్స్ జోన్స్ వచ్చే వారంలో భారత్‌కు రానున్నారు. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వచ్చే నవంబరులో భారత్ పర్యటనకు రానున్నారు. ఈ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు చేసే నిమిత్తంలో భాగంగా ఆయన న్యూఢిల్లీకి వస్తున్నట్టు వైట్‌హౌస్ తెలిపింది.
Source: Yahoo! Telugu: News | 10 Jul 2010 | 8:11 am

కాశ్మీర్ లోయలో కర్ఫ్యూ సడలింపు: 20 మంది అరెస్టు

కర్ఫ్యూ నీడలో ఉన్న కాశ్మీర్ లోయ ప్రజలకు కాస్త ఉపశమనం లభించింది. ముస్లింల పవిత్ర పండుగల్లో ఒకటైన షాబ్ ఏ మెహ్రాజ్ పండుగను దృష్టిలో ఉంచుకుని కాశ్మీర్ లోయలో కర్ఫ్యూను సడలించారు. ఈ నిర్ణయం తీసుకున్న వెంటనే.. కొంతమంది అల్లరి మూక పోలీసులపై రాళ్లు రువ్వేందుకు ప్రయత్నించారు. ఇలాంటి వారిలో 20 మంది పోలీసులు అరెస్టు చేశారు.
Source: Yahoo! Telugu: News | 10 Jul 2010 | 7:41 am

అది ఓదార్పు కాదు.. రాజకీయ దండయాత్ర: ఎర్రం

కడప లోక్‌సభ సభ్యుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డి చేపట్టిన యాత్ర ఓదార్పు యాత్ర కాదని, రాజకీయ దండయాత్ర అని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఎర్రంన్నాయుడు అభిప్రాయపడ్డారు. ఆయన శనివారం ఢిల్లీలో మాట్లాడుతూ వైఎస్ హఠాన్మరణం అనంతరం చనిపోయిన వారిని పరామర్శించడంలో తప్పులేదన్నారు.
Source: Yahoo! Telugu: News | 10 Jul 2010 | 7:29 am

ఇండో-యూఎస్‌కు ధీటుగా పాక్-చైనా అణు ఒప్పందం!

గతంలో అమెరికా-భారత్‌లు కుదుర్చుకున్న అణు ఒప్పందానికి ధీటుగా పాకిస్థాన్-చైనాలు పౌర అణు సహకార ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందంలో భాగంగా పాక్‌లో చైనా రెండు అణు రియాక్టర్లను నిర్మించనుంది. అలాగే, 650 మెగావాట్ల సామర్ధ్యం కలిగిన రెండు అణు రియాక్టర్లను పాకిస్థాన్‌లో నిర్మించడానికి చైనా ఆమోదం తెలిపింది.
Source: Yahoo! Telugu: News | 10 Jul 2010 | 7:04 am

బొమ్మాళీ' ఛాన్సు కొట్టేసిన హాట్ గర్ల్ తాప్సీ..!

దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు "ఝమ్మంది నాదం" ద్వారా వెండితెరకు పరిచయమైన అందాల ముద్దుగుమ్మ "తాప్సీ"కి ఛాన్సులపై ఛాన్సులు వస్తున్నాయి. ఇటు టాలీవుడ్, అటు కోలీవుడ్‌లలో 'తాప్సీ' పేరు మారుమోగిపోతోంది. హీరోయిన్‌గా వచ్చే ఆఫర్లు ఒక ఎత్తైతే.. మరోవైపు యాడ్ ఫిలిమ్స్ చేయమని పలు వాణిజ్య సంస్థలకు చెందిన నిర్వాహకులు క్యూ కడుతున్నారట. తొలి సినిమాలో నటిస్తుండగానే, రెండు మూడు చిత్రాల్లో నటించేందుకు సంతకాలు చేసిన తాప్సీ, ఏకంగా 'అరుంధతి' బొమ్మాళీ అనుష్క ఛాన్సునే కొట్టేసిందట. ప్రముఖ దర్శకుడు ఆర్.బి.చౌదరి రీమేక్ హక్కులు పొందిన తమిళ "వేదం"లో తాప్సీ నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చెన్నై కోడంబాక్కం వర్గాల సమాచారం.
Source: Yahoo! Telugu: Entertainment | 10 Jul 2010 | 6:58 am

శ్రీహరికోటలో పీఎస్ఎల్వీ-15కు కౌంట్‌డౌన్ ప్రారంభం

నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ థావన్ అంతరిక్ష పరిశోధనా కేంద్రం (ఇస్రో) నుంచి పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పీఎస్ఎల్వీ) -15 కౌంట్‌డౌన్ ఆరంభమైంది. ఈనెల 12వ తేదీన ఉదయం 8.22 నిమిషాలకు కార్టోశాట్ 4బి ఉపగ్రహాన్ని దీని ద్వారా నింగిలోకి పంపనున్నారు.
Source: Yahoo! Telugu: News | 10 Jul 2010 | 6:46 am

అమెరికా-ఇజ్రాయేల్‌ల మధ్య పౌర అణు ఒప్పందం!

అమెరికా - ఇజ్రాయేల్‌ దేశాలు పౌర అణు ఒప్పంద సహకారం కుదుర్చుకునేందుకు అంగీకరించినట్టు ఇజ్రాయేల్ ఆర్మీ రేడియో స్పష్టం చేసింది. ఈ రెండు దేశాల మధ్య అణు సహకారానికి సంబంధించిన రహస్య టేపులు గత బుధవారం బయటపడిన నేపథ్యంలో.. ఆర్మీ రేడియో ఈ తరహా వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
Source: Yahoo! Telugu: News | 10 Jul 2010 | 6:14 am

దేశంలో ప్రధమ స్థానమే లక్ష్యం: ఆడి ఇండియా

జర్మనీకి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ "ఆడి" భారత మార్కెట్‌లో లగ్జరీ కార్ల విభాగంలో ప్రధమ స్థానమే లక్ష్యంగా ముందుగు సాగుతున్నట్లు ఆడి ఇండియా అధిపతి మైఖేల్ పెర్స్కే తెలిపారు. కోల్‌కతాలో జరిగిన ఆడి ఇండియా మొదటి షోరూమ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పెర్స్కే మాట్లాడుతూ ఈ సంవత్సరం మొదటి అర్ధ భాగంలో సంస్థ 1,400 కార్ల విక్రయాలతో 71శాతం వృద్ధిని నమోదు చేసుకుందని ఆయన పేర్కొన్నారు.
Source: Yahoo! Telugu: News | 10 Jul 2010 | 5:53 am

పదవికి గుడ్‌బై చెపుతా.. ఓదార్పులో పాల్గొంటా: పిల్లి

ఓదార్పు యాత్రలో పాల్గొననున్నట్టు రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖామంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ ప్రకటించారు. అవసరమైతే తన మంత్రిపదవికి సైతం రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఆయన ప్రకటించారు. ఈనెల 11వ తేదీ నుంచి తూర్పు గోదావరి జిల్లాలో వైఎస్.జగన్ చేపట్టిన ఓదార్పు యాత్ర ప్రారంభంకానుంది.
Source: Yahoo! Telugu: News | 10 Jul 2010 | 5:42 am

సీఎం పదవికి మరికొద్దికాలం ఆగుంటే బాగుండు: సీఎం

ముఖ్యమంత్రి పీఠం కోసం యువ ఎంపీ వైఎస్.జగన్మోహన్ రెడ్డి మరికొద్ది కాలం ఆగివుంటే బాగుండేదని ముఖ్యమంత్రి కె.రోశయ్య అభిప్రాయపడ్డారు. మహానేత వైఎస్ హఠాన్మరణం తర్వాత ముఖ్యమంత్రి పదవి కోసం జగన్ వెంపర్లాడినట్టు మీడియాలో కథనాలు వచ్చాయని ఆయన గుర్తు చేశారు. ఇలాంటి వార్తలు రాకుండా తండ్రి మరణానంతరం మరికొంతకాలం వేచిచూసే ధోరణిని అనుసరించి ఆ తర్వాత ముఖ్యమంత్రి పదవిని కోరివున్నట్టయితే బాగుండేదన్నారు.
Source: ఏపీ న్యూస్ | 10 Jul 2010 | 3:40 am

కాశ్మీర్ లోయలో కర్ఫ్యూ సడలింపు: 20 మంది అరెస్టు

కర్ఫ్యూ నీడలో ఉన్న కాశ్మీర్ లోయ ప్రజలకు కాస్త ఉపశమనం లభించింది. ముస్లింల పవిత్ర పండుగల్లో ఒకటైన షాబ్ ఏ మెహ్రాజ్ పండుగను దృష్టిలో ఉంచుకుని కాశ్మీర్ లోయలో కర్ఫ్యూను సడలించారు. ఈ నిర్ణయం తీసుకున్న వెంటనే.. కొంతమంది అల్లరి మూక పోలీసులపై రాళ్లు రువ్వేందుకు ప్రయత్నించారు. ఇలాంటి వారిలో 20 మంది పోలీసులు అరెస్టు చేశారు.
Source: జాతీయ | 10 Jul 2010 | 2:11 am

అది ఓదార్పు కాదు.. రాజకీయ దండయాత్ర: ఎర్రం

కడప లోక్‌సభ సభ్యుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డి చేపట్టిన యాత్ర ఓదార్పు యాత్ర కాదని, రాజకీయ దండయాత్ర అని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఎర్రంన్నాయుడు అభిప్రాయపడ్డారు. ఆయన శనివారం ఢిల్లీలో మాట్లాడుతూ వైఎస్ హఠాన్మరణం అనంతరం చనిపోయిన వారిని పరామర్శించడంలో తప్పులేదన్నారు.
Source: ఏపీ న్యూస్ | 10 Jul 2010 | 1:59 am

శ్రీహరికోటలో పీఎస్ఎల్వీ-15కు కౌంట్‌డౌన్ ప్రారంభం

నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ థావన్ అంతరిక్ష పరిశోధనా కేంద్రం (ఇస్రో) నుంచి పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పీఎస్ఎల్వీ) -15 కౌంట్‌డౌన్ ఆరంభమైంది. ఈనెల 12వ తేదీన ఉదయం 8.22 నిమిషాలకు కార్టోశాట్ 4బి ఉపగ్రహాన్ని దీని ద్వారా నింగిలోకి పంపనున్నారు.
Source: జాతీయ | 10 Jul 2010 | 1:16 am

పదవికి గుడ్‌బై చెపుతా.. ఓదార్పులో పాల్గొంటా: పిల్లి

ఓదార్పు యాత్రలో పాల్గొననున్నట్టు రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖామంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ ప్రకటించారు. అవసరమైతే తన మంత్రిపదవికి సైతం రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఆయన ప్రకటించారు. ఈనెల 11వ తేదీ నుంచి తూర్పు గోదావరి జిల్లాలో వైఎస్.జగన్ చేపట్టిన ఓదార్పు యాత్ర ప్రారంభంకానుంది.
Source: ఏపీ న్యూస్ | 10 Jul 2010 | 12:14 am

ఓదార్పాకు సై అంటున్న మంత్రులు.. ఎమ్మెల్యేలు!

జగన్ వర్గానికి చెందిన వారే కాకుండా.. ఇతర ఎమ్మెల్యేలు కూడా మేల్కొంటున్నారు. కడప ఎంపీ వైఎస్.జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన ఓదార్పుకు సై అంటున్నారు. యాత్రలో తాము పాల్గొనక పోతే.. తమ రాజకీయ భవిష్యత్ మనుగడ ప్రశ్నార్థంగా మారుతుందని గ్రహించారు. ఫలితంగా.. ఓదార్పులో పాల్గొనేందుకు సమాయత్తమవుతున్నారు. శని, ఆదివారాలు అసెంబ్లీకి సెలవు కావడంతో యాత్రలో పాల్గొనేందుకు పలువురు ఎమ్మెల్యేలు శ్రీకాకుళంకు చేరుకున్నారు. ఇదే అంశంపై ముఖ్యమంత్రి రోశయ్యతో వారు శుక్రవారం మంతనాలు నిర్వహించారు.
Source: ఏపీ న్యూస్ | 10 Jul 2010 | 12:03 am

డిసెంబరు 31 తర్వాత రాష్ట్రంలో భూకంపమే: కేసీఆర్

డిసెంబరు 31వ తేదీ తర్వాత కేంద్రం తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా ప్రకటన చేయకుంటే రాష్ట్రంలో భూకంపమే సృష్టిస్తామని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర రావు హెచ్చరించారు. ఈనెల 27వ తేదీన జరుగనున్న ఉప ఎన్నికల కోసం ఆయన శుక్రవారం రాత్రి కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గంలో ఉప ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.
Source: ఏపీ న్యూస్ | 9 Jul 2010 | 11:49 pm

పెట్రో ధరలకు నిరసనగా బీహార్‌లో సాగుతున్న బంద్!

పెట్రో ధరల పెంపునకు నిరసగా బీహార్‌లో రాష్ట్ర వ్యాప్త బంద్ శనివారం ఉదయం నుంచి ఆరంభమైంది. కేంద్ర మాజీ మంత్రులు లాలూ ప్రసాద్ యాదవ్, రామ్ విలాస్ పాశ్వాన్‌ నేతృత్వంలోని ఆర్జేడీ-ఎల్జేపీలు ఈ బంద్‌కు పిలుపునిచ్చాయి. శనివారం ఉదయం నుంచి ఆరంభమైన ఈ బంద్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకున్న సమాచారం అందలేదని ఆ రాష్ట్ర అధికార వర్గాలు వెల్లడించాయి.
Source: జాతీయ | 9 Jul 2010 | 11:35 pm

వైఎస్.జగన్‌కున్నది బలం కాదు.. వాపు: శంకర్ రావు

కడప ఎంపీ వైఎస్.జగన్మోహన్ రెడ్డికి ఉన్నది బలం కాదని, బలుపు మీద వాపు అని సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శంకర్ రావు అభిప్రాయపడ్డారు. ఆయన గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ అధిష్టానాన్ని జగన్ ఎపుడైతే ధిక్కరించాడో అపుడే.. అతని రాజకీయ జీవితం పతనం ఆరంభమైందన్నారు.
Source: ఏపీ న్యూస్ | 9 Jul 2010 | 10:52 pm

నేడు కాశ్మీర్‌ లోయలో దశలవారీగా కర్ఫ్యూ సడలింపు!

షాబ్-ఏ-మొహ్రాజ్ పండుగను పురస్కరించుకుని కాశ్మీర్ లోయలో దశల వారీగా కర్ఫ్యూను సడలించాలని భద్రాత సిబ్బంది భావిస్తోంది. ఈ లోయలో పెట్రేగిన హింస, అల్లర్లు కారణంగా గత కొన్ని రోజులుగా నిరవధిక కర్ఫ్యూను అమలు చేస్తున్న విషయం తెల్సిందే. అయితే, శుక్రవారం ప్రార్థనలు చేసుకోవడానికి వీలుగా కొద్ది సేపు కర్ఫ్యూను సడలించారు. ఇది ప్రశాంతంగా ముగియడంతో శనివారం షాబ్-ఏ-మెహ్రాజ్ పండుగ చేసుకోవడానికి వీలుగా కర్ఫ్యూను సడలించేందుకు కసరత్తు చేస్తున్నట్టు భద్రతా అధికారులు వెల్లడించారు.
Source: జాతీయ | 9 Jul 2010 | 10:29 pm

ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయనున్న ఒమర్!

కాశ్మీర్ లోయలో చెలరేగిన అల్లర్లు జమ్మూకాశ్మీర్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా పదవికి ఎసరు పెట్టేలా కనిపిస్తున్నాయి. అల్లర్లను అణిచి వేయడంలో ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కేంద్రం ఆరోపిస్తోంది. దీంతో ఒమర్‌కు ఇస్తున్న మద్దతును ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. దీన్ని పసిగట్టిన నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ.. కాంగ్రెస్‌ను దూరం చేసుకోవాలని భావిస్తోంది.
Source: జాతీయ | 9 Jul 2010 | 9:56 pm

"బృందావనం" గోవిందుడు అందరి వాడేలే...

కృష్ణునికి సంబంధించిన బృందావనంలో గోపికలతో ఆనందంగా పాటలు పాడుకుంటే ఎలా ఉంటుందో అంత ఆహ్లాదకరంగా ఎన్టీఆర్ జూనియర్ నటిస్తోన్న బృందావనంకోసం మూడు రోజులుగా పాటను చిత్రీకరిస్తున్నారు. చిత్రంలోని తారాగణమంతా పాల్గొన్న ఈ పాటను శంషాబాద్‌లోని సీతారామాంజనేయ స్వామి దేవాలయంలో గత మూడు రోజులుగా చిత్రీకరిస్తున్నారు. శనివారంతో పాట పూర్తవుతుంది. చిత్ర నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ... రేపటితో ఈ షెడ్యూల్ పూర్తవుతుంది. ఆగస్టులో చివరి షెడ్యూల్ చేస్తాం. అదే నెలలో ఆడియోను విడుదల చేస్తాం. సెప్టెంబరులో సినిమాను రిలీజ్ చేస్తాం అన్నారు. ఎన్టీఆర్‌కు బృందావనం అనే టైటిల్ పెట్టడం పట్ల చాలామంది ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పీటర్ హేన్స్, రామ్ లక్ష్మణ్‌ల ఆధ్వర్యంలో చేశాం. మా శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ వాల్యూను ఈ చిత్రం పెంచుతుంది అన్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 9 Jul 2010 | 1:07 pm

నగ్న వీపులు.. నాభీ కిందికి దిగిపోతున్న పొట్టి గౌన్లు...

బాలీవుడ్ హీరోయిన్లు రెచ్చిపోతున్నారు. నటించడంలో కాదు శరీరపు వంపులు చూపించడంలో. ఇటీవల ముగ్ధా గాడ్సే తనలోని లో అందాలన్నిటినీ తేటతెల్లం చేసేటట్లు తెల్లటి బికినీ వేసుకుని ఫోటో షూట్‌లో పాల్గొన్నది. ఆ ఫోటోలను చూసిన ఆమె తల్లి ముగ్ధాపై మండిపడింది. ఆ మాటకొస్తే అంతకు మించి బికినీల్లో తమ అందాలను చూపించిన బాలీవుడ్ ముద్దుగుమ్మలు చాలామందే ఉన్నారనుకోండి. అయితే ఇపుడు బికినీలు స్టేజి దాటి నగ్న వీపులు, పూర్తిగా తొడలను చూపించే స్థాయికి హీరోయిన్లు చేరుకున్నారు. పొట్టి గౌన్లు వేసుకుని తొడల అందాలను ఏ స్థాయి వరకు చూపించగలరో అక్కడి వరకూ ఎక్స్‌పోజ్ చేసేస్తున్నారు. ఇటువంటి భంగిమలతో ఇటీవల బాలీవుడ్ సెక్స్ బాంబ్ సాయాలి భగత్ నగ్న వీపుతో ఫోటో షూట్ చేసింది. ఈ పోటోలను చూసిన కుర్రకారు నెట్‌లకు అతుక్కుపోతున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 9 Jul 2010 | 9:59 am

చిరు దర్శకత్వంలో అల్లు అర్జున్ or మెగాస్టార్

ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన తర్వాత సినిమాలకు దాదాపు పూర్తిగా దూరమైపోయిన మెగాస్టార్ చిరంజీవి త్వరలో ఓ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నట్లు తెలిపారు. గురువారం అసెంబ్లీ హాలులో మంత్రి గీతారెడ్డితో మాట్లాడుతున్న సమయంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే మెగాస్టార్ ఏ హీరోను డైరెక్ట్ చేస్తారన్న దానిపై టాలీవుడ్‌లో అప్పుడే ఊహాగానాలు మొదలయ్యాయి. ఆయన తన కుమారుడు రామ్‌చరణ్ కాకుండా మేనల్లుడు అల్లు అర్జున్ హీరోగా సినిమా రూపొందించబోతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇదిలావుంటే మెగాస్టార్ దర్శకత్వ శాఖలోకి రాబోతున్నట్లు ప్రకటించడంతో ఇక ఆయన నటించే అవకాశం లేనట్లేనని కొందరు చెపుతున్నారు. అయితే ఆయనకోసమే ఓ సబ్జెక్టును సిద్ధం చేసుకున్నట్లు కోడి రామకృష్ణ ఇప్పటికే చెప్పారు కూడా. మరి మెగాస్టార్ నటించి దర్శకత్వం వహిస్తారో... లేదంటే స్వర్గీయ ఎన్టీఆర్‌లా ఆయనే హీరోగా రూపొందించే చిత్రానికి ఆయనే దర్శకత్వం వహిస్తారో వేచి చూడాల్సిందే.
Source: Yahoo! Telugu: Entertainment | 9 Jul 2010 | 6:38 am

కాశ్మీర్ అల్లర్ల వెనుక లష్కర్ : హురియత్ నేత అరెస్టు

కాశ్మీర్‌లో చోటు చేసుకుంటున్న అల్లర్ల వెనుక లష్కర్ తోయిబా తీవ్రవాదుల హస్తం ఉన్నట్టు వెల్లడైంది. కాశ్మీర్‌లోని యువకులకు తీవ్రవాదులు డబ్బులు ఇచ్చి అల్లర్లను ప్రోత్సహించాల్సిందిగా ప్రేరేపిస్తున్నట్టు కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈ అల్లర్లు పాల్పడాల్సిందిగా యువకులను ప్రోత్సహించినందుకు హురియత్‌ సంస్థకు చెందిన ఇద్దరు నేతల్లో ఒకరిని పోలీసులు అరెస్టు చేశారు. మరో నేత కోసం గాలిస్తున్నారు.
Source: జాతీయ | 9 Jul 2010 | 6:32 am

లేడీ ఓరియెంటెడ్ చిత్రంలో నటించనున్న ప్రియమణి

గ్లామర్, పెర్‌ఫార్మెన్స్ ఇలా రెండు రకాలైన పాత్రలు చేస్తూ అగ్రకథానాయికల్లో ఒకరిగా భాసిల్లుతున్న జాతీయ ఉత్తమ నటి ప్రియమణి త్వరలో తెలుగులో ఓ లేడీ ఓరియెంటెడ్ చిత్రాన్ని చేస్తున్నారు. ఆమె ప్రధాన పాత్రలో రూపొందుతోన్న ఈ చిత్రానికి శ్రీ బాలాజీ మూవీస్ పతాకంపై వైఎస్ ప్రతాప్ రెడ్డి సమర్పణలో జి. గోవిందరాజు నిర్మించనున్నారు. పలు చిత్రాల్లో నటుడిగా చేసి, ప్రముఖ దర్శకుల వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసిన తోట వేణుగోపాల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఈ సందర్భంగా నిర్మాత గోవింద రాజు మాట్లాడుతూ... నవ్యమైన కథ, కథనాలతో రూపొందనున్న చిత్రమిది. తొలిసారిగా ప్రియమణి నటిస్తున్న లేడీ ఓరియెంటెడ్ చిత్రమిది. అక్టోబరులో లాంఛనంగా షూటింగ్‌ను ప్రారంభించి నవంబర్‌లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం అన్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 9 Jul 2010 | 6:05 am

ఇప్పటి కాంగ్రెస్ మా నాన్న ఉన్నప్పుడు కాంగ్రెస్ కాదు

తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి మరణించిన తర్వాత ఈ తొమ్మిది నెలల కాలంలో రాష్ట్ర రాజకీయాలు, పరిస్థితులు పూర్తిగా అట్టడుగు స్థాయికి దిగజారి పోయాయని కడప ఎంపీ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లాలో సాగుతున్న ఓదార్పు యాత్రలో భాగంగా శుక్రవారం టెక్కలి, నర్సన్నపేటలలో పర్యటించారు.
Source: ఏపీ న్యూస్ | 9 Jul 2010 | 4:36 am

నగ్న వీపులు.. నాభీ కిందికి దిగిపోతున్న పొట్టి గౌన్లు...

బాలీవుడ్ హీరోయిన్లు రెచ్చిపోతున్నారు. నటించడంలో కాదు శరీరపు వంపులు చూపించడంలో. ఇటీవల ముగ్ధా గాడ్సే తనలోని లో అందాలన్నిటినీ తేటతెల్లం చేసేటట్లు తెల్లటి బికినీ వేసుకుని ఫోటో షూట్‌లో పాల్గొన్నది. ఆ ఫోటోలను చూసిన ఆమె తల్లి ముగ్ధాపై మండిపడింది. ఆ మాటకొస్తే అంతకు మించి బికినీల్లో తమ అందాలను చూపించిన బాలీవుడ్ ముద్దుగుమ్మలు చాలామందే ఉన్నారనుకోండి. అయితే ఇపుడు బికినీలు స్టేజి దాటి నగ్న వీపులు, పూర్తిగా తొడలను చూపించే స్థాయికి హీరోయిన్లు చేరుకున్నారు. పొట్టి గౌన్లు వేసుకుని తొడల అందాలను ఏ స్థాయి వరకు చూపించగలరో అక్కడి వరకూ ఎక్స్‌పోజ్ చేసేస్తున్నారు. ఇటువంటి భంగిమలతో ఇటీవల బాలీవుడ్ సెక్స్ బాంబ్ సాయాలి భగత్ నగ్న వీపుతో ఫోటో షూట్ చేసింది. ఈ పోటోలను చూసిన కుర్రకారు నెట్‌లకు అతుక్కుపోతున్నారు.
Source: వినోదం | 9 Jul 2010 | 4:34 am

నితిన్ గడ్కారీకి మానసిక వైద్యం చేయించాలి: కాంగ్రెస్

భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ గడ్కారీపై కాంగ్రెస్ తీవ్రంగా మండిపడింది. జాతీయ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగే గుణగణాలు, పరిపక్వత నితిన్ గడ్కారీలో ఏమాత్రం లేవని ఆ పార్టీ అధికార ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. అందువల్ల ఆయన తక్షణం మానసిక వైద్యం చేయించుకోవాలని సూచించారు. గురువారం రాత్రి భాజపా కార్యకర్తల ర్యాలీలో పాల్గొన్న గడ్కారీ.. అఫ్జల్ గురు కాంగ్రెస్ అల్లుడా అంటూ ప్రశ్నించారు.
Source: జాతీయ | 9 Jul 2010 | 4:08 am

రాములమ్మకు ఈసీ మందలింపు: ఎమ్మెల్సీ అరెస్టు

ఎన్నికల నిబంధలను ఉల్లంఘించినందుకు గాను తెరాస ఎంపీ విజయశాంతితో పాటు... కాంగ్రెస్ ఎమ్మల్యే జయప్రకాష్ రెడ్డిలను కేంద్ర ఎన్నికల సంఘం మందలించింది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున రెచ్చగొట్టే వ్యాఖ్యలు మరోమారు చేయరాదని సూచించింది.
Source: ఏపీ న్యూస్ | 9 Jul 2010 | 3:07 am