పాకిస్థాన్-చైనాల మధ్య రైలు మార్గం: భారత్ ఆందోళన

పాకిస్థాన్-చైనా దేశాల మధ్య రైలు మార్గం నిర్మాణం చేపట్టనున్నట్టు వచ్చిన వార్తలపై భారత్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. టిబెట్ పీఠభూమి మీదుగా భారత సరిహద్దు వరకు చైనాలోని పలు నగరాల నుంచి రైలు మార్గాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్థాన్-చైనాల మధ్య రైలు మార్గం నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీనిపై త్వరలోనే ఆ రెండు దేశాల మధ్య త్వరలోనే ఒప్పందం ఖారారు కానుంది.
Source: Yahoo! Telugu: News | 8 Jul 2010 | 9:29 am

ఏమిటమ్మాయ్.. ఆ బికినీలు.. పాడు: ముగ్ధా తల్లి

ముగ్ధా గాడ్సే టూపీస్ వస్త్రాలతో దాదాపు ముప్పావు వంతు శరీరాన్ని చూపెడుతూ బుల్లి బికినీలు వేసుకుని ఎడాపెడా ఫోటోగ్రాఫర్లకు ఫోజులిచ్చేసింది. ఆ ఫోజులను చూసిన కుర్రకారు కిందూమీదూ అవుతుంటే ముగ్ధా గాడ్సే తల్లికి మాత్రం చిర్రెత్తి పోతోందట. ముగ్ధా గాడ్సే ఇంటికీ రాగానే ఆమెపై ఇంతెత్తున లేచి దాదాపు కొట్టినంత పని చేసిందట. పనికిమాలిన బికినీలు వేసుకుని ఏంటా వేషాలని మండి పడిందట. అయితే బికినీలు వేసే నటీమణులందరూ చెప్పినట్లే ముగ్ధా కూడా తన తల్లివద్దే ఒక మాట చెప్పిందట. అదేమంటే... కథానుసారం బికినీలో కనిపించాల్సి ఉందనీ, ఆ చిత్రంలో తాను బికినీ వేసుకున్న సన్నివేశంతోనే కథ మలుపు తిరుగుతుందని తన బికినీ ఫోజులకు వివరణ ఇచ్చుకున్నదట. అయితే ముగ్ధా తల్లి మాత్రం బికినీ వేసుకోవడాన్ని సుతారమూ ఒప్పుకోననీ, మరోసారి ఇటువంటి వెర్రి వేషాలు వేయవద్దని గట్టిగా చెప్పిందట.
Source: Yahoo! Telugu: Entertainment | 8 Jul 2010 | 9:12 am

ముందస్తు ఎన్నికలకు అవకాశమే లేదు: లెఫ్ట్ పార్టీలు

పశ్చిమబెంగాల్‌ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు అవకాశమే లేదని అధికార వామపక్ష పార్టీల నేతలు స్పష్టం చేశారు. దీనిపై ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు బిమన్ బోస్ కోల్‌కతాలో విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర శాసనసభ ఎన్నికలు ముందస్తుగా జరిగే అవకాశమే లేదన్నారు. ముందస్తుపై మీడియాలో వస్తున్న వార్తలను ఆయన కొట్టిపారేశారు.
Source: Yahoo! Telugu: News | 8 Jul 2010 | 9:08 am

స్టాక్ మార్కెట్: సెన్సెక్స్ 207 పాయింట్ల వృద్ధి!

బాంబే స్టాక్ మార్కెట్ గురువారం లాభాల బాటలో కొనసాగుతోంది. ట్రేడింగ్ ప్రారంభం నుంచే ఊపందుకున్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచి సెన్సెక్స్, మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో 207 పాయింట్లు వృద్ధి చెంది, 17,678 పాయింట్ల మార్కును తాకింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచి నిఫ్టీ కూడా 65 పాయింట్లు బలపడి, 5,306 పాయింట్ల మార్కు వద్ద ర్యాలీని కొనసాగిస్తోంది.
Source: Yahoo! Telugu: News | 8 Jul 2010 | 8:48 am

సీఎంను చేస్తాం.. సమస్య పరిష్కరించు: రోశయ్య సవాల్

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు ముఖ్యమంత్రి కె.రోశయ్య ఒక ఆఫర్ ఇచ్చారు. పనిలో పనిగా సవాల్ కూడా విసిరారు. సీఎం రోశయ్య తలచుకుంటే బాబ్లీ సమస్యను పది నిమిషాల్లో పరిష్కరిస్తారని కేంద్ర జలవనరుల మంత్రి పీకే.బన్సల్ చెప్పినట్టు చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై రోశయ్య ఘాటుగానే స్పందించారు.
Source: Yahoo! Telugu: News | 8 Jul 2010 | 8:40 am

జగన్ సొంత పార్టీ ఊహాగానాలు మీడియా సృష్టే: దానం

కడప ఎంపీ వైఎస్.జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పేరుతో కొత్త రాజకీయ పార్టీ పెట్టనున్నట్టు వచ్చిన వార్తలు కేవలం మీడియా సృష్టేనని రాష్ట్ర ఆరోగ్య శాఖామంత్రి దానం నాగేందర్ అన్నారు. ఆయన గురువారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ జగన్ కాంగ్రెస్ పార్టీని వీడరని, కొత్త పార్టీ పెట్టబోరన్నారు.
Source: Yahoo! Telugu: News | 8 Jul 2010 | 8:25 am

పెరిగిన దేశీయ వాహనాల విక్రయాలు: ఎస్ఐఏఎమ్

దేశీయ ప్యాసింజర్ కార్ల విక్రయాలు జూన్ నెలలో 1,41,184 యూనిట్ల విక్రయాలను నమోదు చేసుకొని 20.79శాతం వృద్ధ నమోదు చేసుకోగా గతేడాది ఇదే సమయానికి 1,07,948 యూనిట్లను మాత్రమే నమోదు చేసుకున్నట్లు భారత ఆటోమొబైల్ తయారీదారుల సంఘం (ఎస్ఐఏఎమ్) తెలిపింది.
Source: Yahoo! Telugu: News | 8 Jul 2010 | 7:02 am

ఐష్.. నిన్ను నేను డైరెక్ట్ చేస్తా: సుహాసిని మణిరత్నం

ప్రముఖ తమిళ దర్శకుడు మణిరత్నం భార్య, తెలుగు నటి సుహాసిని మాజీప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్ కథానాయికగా ఓ చిత్రాన్ని దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం. రావణ్ బోర్లా పడిన తర్వాత కూడా ఐష్ సుహాసిని సినిమా తీస్తానంటే సరేనని ఆమె మాటకు ఐష్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందిట. "ఇద్దరు" సినిమా చిత్రీకరణ సమయం నుంచి సుహాసిని అంటే ఐశ్వర్యారాయ్‌కు ఎంతో గౌరవమనీ, ఆమెతో నెలకోమారైనా మాట్లాడకుండా ఉండలేదని ఐష్ సన్నిహితులు చెపుతుంటారు. వీళ్లద్దరి మధ్య ఉన్న ఈ చనువు కారణంగానే ప్రస్తుతం ఐష్ కథానాయికగా సుహాసిని దర్శకత్వంలో ఓ చిత్రాన్ని రూపొందించనున్నట్లు భోగట్టా.రావణ్ చిత్రాన్ని రూపొందించే సమయంలో ఐశ్వర్యారాయ్ వెంట ఉండి ఆమెకు భాషతో ఇబ్బంది లేకుండా ఎంతో సహాయపడిందట సుహాసిని. ఆ సమయంలోనే తనవద్ద మంచి కథ ఉందనీ, లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్ట్ అనీ ఐష్‌కు ఆ కథ వినిపించిందట. ఐష్ కూడా కథ చాలా బావుందని "చేద్దాం" అన్నదట.
Source: Yahoo! Telugu: Entertainment | 8 Jul 2010 | 6:55 am

ఊపందుకున్న ట్రేడింగ్: భారీ లాభాల్లో సెన్సెక్స్, నిఫ్టీ..!

దేశీయ వాటాల ట్రేడింగ్ ఊపందుకోవడంతో బాంబే స్టాక్ మార్కెట్ లాభాలను ఆర్జిస్తోంది. అంతర్జాతీయ స్టాక్ మార్కెట్ల ప్రభావంతో బాంబే స్టాక్ మార్కెట్ గురువారం భారీ వృద్ధిలో ర్యాలీని కొనసాగిస్తోంది. ఫలితంగా గురువారం మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో 246 పాయింట్లు భారీగా వృద్ధిచెంది, 17,717 పాయింట్ల మార్కు వద్ద పయనిస్తోంది. ఇదేవిధంగా నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచి నిఫ్టీ కూడా 74 పాయింట్లు పుంజుకుని, 5,315 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.
Source: Yahoo! Telugu: News | 8 Jul 2010 | 6:45 am

మెక్సికోలో విమాన ప్రమాదం: మంత్రి దుర్మరణం

మెక్సికోలో జరిగిన విమాన ప్రమాదంలో ప్రజాపనుల శాఖామంత్రి హొరాసియాతో పాటు మరో ఎనిమిది మంది దుర్మరణం పాలయ్యారు. మంత్రితో పాటు మరికొంతమంది చిన్నపాటి ప్రత్యేక విమానంలో నేకరాస్ అనే నగరానికి వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో మంత్రి హొరాసియాతో పాటు.. నగర మేయర్ జోస్మా సెబోస్, ఇతర అధికారులు మృత్యువాత పడ్డారు.
Source: Yahoo! Telugu: News | 8 Jul 2010 | 6:44 am

విదేశీ స్టాక్ మార్కెట్ల ప్రభావం: సెన్సెక్స్ వృద్ధి..!

అంతర్జాతీయ స్టాక్ మార్కెట్ల ప్రభావంతో బాంబే స్టాక్ మార్కెట్ భారీ వృద్ధిని నమోదు చేసుకుంటున్నాయి. ట్రేడింగ్ ప్రారంభం నుంచే ఊపందుకున్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచి సెన్సెక్స్ ఉదయం 11.30 గంటల ప్రాంతంలో 224 పాయింట్లు వృద్ధి చెంది, 17,695 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచి నిఫ్టీ కూడా 71 పాయింట్లు బలపడి, 5,312 పాయింట్ల మార్కు వద్ద పయనిస్తోంది.
Source: Yahoo! Telugu: News | 8 Jul 2010 | 6:22 am

కేంద్ర మంత్రివర్గంలో చేరను: ఎల్జేపీ అధినేత పాశ్వాన్

భవిష్యత్‌లో విస్తరణకు నోచుకునే కేంద్ర మంత్రివర్గంలో చేరబోనని కేంద్ర మాజీ మంత్రి, లోక్‌జన శక్తి అధ్యక్షుడు రామ్ విలాస్ పాశ్వాన్ స్పష్టం చేశారు. దీనిపై ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ.. పార్లమెంట్‌కు తాను మంత్రిగా అడుగుపెట్టాలనే ఆలోచన ఏమాత్రం లేదన్నారు.
Source: Yahoo! Telugu: News | 8 Jul 2010 | 6:12 am

జూలై 23న విడుదల కానున్న "బద్మాష్"

వందేమాతరం శ్రీనివాస్ దర్శకత్వంలో నాగసిద్ధార్థ్, ఏక్తా హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న బద్మాష్ చిత్రం ఈ నెల 23న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని నాగయ్య నిర్మించారు. ఆడియో విడుదల సందర్భంగా ఇటీవలే కొన్ని ప్రాంతాల్లో పర్యటించారు. అద్భుతమైన స్పందన లభించిందని హీరో చెప్పారు. ఇంకా ఆయన మాట్లాడుతూ... త్వరలో విజయవాడ, గుంటూరు, తెనాలి, రాజమండ్రి, వైజాగ్ ప్రాంతాలను పర్యటిస్తాం. ఇప్పటికే వరంగల్ తదితర ప్రాంతాల్లో పర్యటించాం. అక్కడ పాటలు విన్నవారంతా చాలా బావుందని అభినందిస్తున్నారు. సీనియర్ టెక్నీషియన్స్ పనిచేసిన ఈ చిత్రం త్వరలో విడుదలకానుంది అని అన్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 8 Jul 2010 | 5:50 am

వైభవంగా సాయికుమార్ తనయుడు ఆదిత్య తెరంగేట్రం

నటుడు సాయికుమార్ కుమారుడు ఆది హీరొగా తెరంగేట్రం చేస్తున్నాడు. కె. అచిరెడ్డి నిర్మిస్తున్న 'ప్రేమకావాలి' సినిమా బుధవారం అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైంది. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, అక్కినేని, విశ్వనాథ్, కృష్ణ, జయసుధ, కృష్ణంరాజుతోపాటు సినిమారంగంలో హేమాహేమీలు హాజరయ్యారు.మాక్స్ ఇండియా ప్రొడక్షన్ బ్యానర్‌పై ఈ చిత్రం రూపొందుతోంది. బ్యానర్‌ను డి.రామానాయుడు, టైటిల్‌ను హీరో శ్రీహరి విడుదల చేశారు. ఆదిపై ఒపెన్ షాట్‌కు చిరంజీవి క్లాప్ కొట్టారు. బాలకృష్ణ కెమారా స్విచాన్ చేశారు. నాగార్జున దర్శకత్వం వహించారు. ఆది డాన్స్ చేస్తూ స్టేజిపైకి వచ్చారు.
Source: Yahoo! Telugu: Entertainment | 8 Jul 2010 | 5:33 am

ముందస్తు ఎన్నికలకు అవకాశమే లేదు: లెఫ్ట్ పార్టీలు

పశ్చిమబెంగాల్‌ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు అవకాశమే లేదని అధికార వామపక్ష పార్టీల నేతలు స్పష్టం చేశారు. దీనిపై ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు బిమన్ బోస్ కోల్‌కతాలో విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర శాసనసభ ఎన్నికలు ముందస్తుగా జరిగే అవకాశమే లేదన్నారు. ముందస్తుపై మీడియాలో వస్తున్న వార్తలను ఆయన కొట్టిపారేశారు.
Source: జాతీయ | 8 Jul 2010 | 3:39 am

సీఎంను చేస్తాం.. సమస్య పరిష్కరించు: రోశయ్య సవాల్

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు ముఖ్యమంత్రి కె.రోశయ్య ఒక ఆఫర్ ఇచ్చారు. పనిలో పనిగా సవాల్ కూడా విసిరారు. సీఎం రోశయ్య తలచుకుంటే బాబ్లీ సమస్యను పది నిమిషాల్లో పరిష్కరిస్తారని కేంద్ర జలవనరుల మంత్రి పీకే.బన్సల్ చెప్పినట్టు చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై రోశయ్య ఘాటుగానే స్పందించారు.
Source: ఏపీ న్యూస్ | 8 Jul 2010 | 3:10 am

జగన్ సొంత పార్టీ ఊహాగానాలు మీడియా సృష్టే: దానం

కడప ఎంపీ వైఎస్.జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పేరుతో కొత్త రాజకీయ పార్టీ పెట్టనున్నట్టు వచ్చిన వార్తలు కేవలం మీడియా సృష్టేనని రాష్ట్ర ఆరోగ్య శాఖామంత్రి దానం నాగేందర్ అన్నారు. ఆయన గురువారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ జగన్ కాంగ్రెస్ పార్టీని వీడరని, కొత్త పార్టీ పెట్టబోరన్నారు.
Source: ఏపీ న్యూస్ | 8 Jul 2010 | 2:55 am

కేంద్ర మంత్రివర్గంలో చేరను: ఎల్జేపీ అధినేత పాశ్వాన్

భవిష్యత్‌లో విస్తరణకు నోచుకునే కేంద్ర మంత్రివర్గంలో చేరబోనని కేంద్ర మాజీ మంత్రి, లోక్‌జన శక్తి అధ్యక్షుడు రామ్ విలాస్ పాశ్వాన్ స్పష్టం చేశారు. దీనిపై ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ.. పార్లమెంట్‌కు తాను మంత్రిగా అడుగుపెట్టాలనే ఆలోచన ఏమాత్రం లేదన్నారు.
Source: జాతీయ | 8 Jul 2010 | 12:42 am

కడపకు వైఎస్ఆర్ జిల్లాగా నామకరణం: రెవెన్యూ శాఖ

రాయలసీమ ప్రాంతంలోని జిల్లాల్లో ఒకటైన కడప.. గురువారం నుంచి వైఎస్ఆర్ జిల్లాగా పేరు మారింది. ఈ మేరకు రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పేరు మార్పుపై పలు వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేక వచ్చింది. దీంతో ప్రభుత్వం 1974 ఆంధ్రప్రదేశ్ జిల్లాల చట్టానికి అనుగుణంగా మార్పులు చేర్పులు చేసి కడప జిల్లా పేరును మార్చుతూ ఉత్తర్వులు జారీ చేసింది.
Source: ఏపీ న్యూస్ | 8 Jul 2010 | 12:30 am

హర్యానాలో ఎన్.హెచ్-1ను దిగ్బంధించిన వరద బాధితులు

ఉత్తర భారతంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఫలితంగా దేశ వాణిజ్య రాజధాని ముంబైతో పాటు పలు రాష్ట్రాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. వరద బాధితులను వరద నీరు ముంచెత్తినా.. తాగేందుకు మాత్రం వారికి చుక్కనీరు లేదు. పైపెచ్చు.. ఆకలితో అలమటిస్తున్నారు. దీంతో ఆగ్రహించిన వరద బాధితులు హర్యానాలో ఒకటో నంబరు జాతీయ రహదారిని దిగ్బంధించారు.
Source: జాతీయ | 8 Jul 2010 | 12:16 am

సమయమొస్తే.. రోశయ్యను దించుతాం: జగన్ వర్గం

మహానేత వైఎస్.రాజశేఖర రెడ్డి హఠాన్మరణం అనంతరం ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొన్న రోశయ్య.. నక్కజిత్తులు ప్రదర్శిస్తున్నారని వైఎస్ తనయుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డి అనుచర వర్గం బాహాటంగా విమర్శలకు దిగింది. ఇప్పటికైనా ఆయన స్థాయికి.. హోదాకు తగినట్టు నడుచుకోకుంటే తగిన గుణపాఠం చెప్పక తప్పదని వారు హెచ్చరిస్తున్నారు.
Source: ఏపీ న్యూస్ | 7 Jul 2010 | 11:23 pm

అస్సోంలో రైల్వే ట్రాక్‌ను పేల్చి వేసిన మావోయిస్టులు

మావోయిస్టులు ఇచ్చిన 48 గంటల బంద్‌ రెండో రోజున నక్సలైట్లు రెచ్చిపోయారు. అస్సోంలో రైల్వే ట్రాక్‌ను పేల్చి వేశారు. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, మరో ఏడుగురు గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. అలాగే, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నేతకు సమీప బందువును హత్య చేశారు.
Source: జాతీయ | 7 Jul 2010 | 10:35 pm

ఆజాద్ ఎన్‌కౌంటర్ చర్చలకు విఘాతం: స్వామి అగ్నివేష్

మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి చెరుకూరి రాజ్‌కుమార్ అలియా్స్ ఆజాద్ మృతి మావోయిస్టులతో శాంతి చర్చలకు పెను విఘాతమని కేంద్ర ప్రభుత్వం మధ్యవర్తి స్వామి అగ్నివేష్ అభిప్రాయపడ్డారు. కేంద్రం, మావోయిస్టుల మధ్య జరిగే శాంతి చర్చలకు మధ్యవర్తిగా అగ్నివేష్ వ్యవహిస్తున్న విషయం తెల్సిందే. ఈయనను కేంద్ర హోం మంత్రి చిదంబరం ఎంపిక చేశారు.
Source: జాతీయ | 7 Jul 2010 | 10:23 pm

నేడు వైఎస్ జయంతి.. ఓదార్పు యాత్రా ప్రారంభం!

దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ యెడుగూరి సందింటి రాజశేఖర రెడ్డి తొలి జయంతి వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా గురువారం ఘనంగా జరుగనున్నాయి. ఈ వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నారు. ఇదే జయంతి రోజున ఆయన తనయుడు, కడ పార్లమెంట్ సభ్యుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళం జిల్లా నుంచి ఓదార్పు యాత్రను చేపడుతున్నారు.
Source: ఏపీ న్యూస్ | 7 Jul 2010 | 9:53 pm

అనుష్కకు షాక్... తాప్సీకి స్వీట్ ఇచ్చిన "మంచు"

మోహన్ బాబు కుమారుడు మంచు మనోజ్ "మాట" అంటే మాటలా..? మనోజ్ ఒకే ఒక్క మాట చెప్పాడంటే ఏ హీరోయిన్‌కైనా ఛాన్స్ తన్నుకుంటూ వస్తుంది. అదేమాట మరోసారి తిప్పి చెప్పాడంటే ఎంతటి అగ్రశ్రేణి హీరోయిన్‌కైనా వచ్చిన ఛాన్స్ వచ్చిన దారినే పారిపోతుంది. అసలు సంగతి ఏంటంటే...ఆమధ్య మంచు మనోజ్ అనుష్కతో కలిసి "వేదం" చిత్రంలో నటించాడు. ఆ సమయంలో అందగత్తె అనుష్కతో సన్నిహితంగా ఉండేందుకు "మంచు" తెగ తహతహలాడిపోయాడట. అయితే అనుష్క దాదాపు "ఛీ" కొట్టినంత పని చేయడంతో చేసేది లేక దూరంగా జరిగిపోయాడట.ఇదిలావుండగా ఇటీవల ఆర్‌బి చౌదరి బ్యానర్లో తమిళంలో నిర్మితమవుతున్న చిత్రంలో అనుష్కను హీరోయిన్‌గా తీసుకున్నారు. ఆ చిత్రంలో అనుష్క వేశ్య పాత్రలో నటించనుంది. కానీ మంచు మనోజ్ ఆ చిత్రంలో అనుష్కను తొలగించి, ఆ అవకాశాన్ని తాప్సీకి ఇవ్వాల్సిందిగా సిఫార్సు చేశాడట.
Source: Yahoo! Telugu: Entertainment | 7 Jul 2010 | 1:02 pm

"లోకమే కొత్తగా" కోసం మైసూరు వెళ్తోన్న అదితి

అదితి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోన్న చిత్రం "లోకమే కొత్తగా". భరత్ పారేపల్లి దర్శకుడు. రమేష్ బాధావత్, శోభన్ బాబు అక్కినపల్లి, పురుషోత్తమ కొమ్ము నిర్మిస్తున్నారు. ఇటీవలే బ్యాంకాక్‌లో మూడు పాటలను పూర్తి చేసుకుని వచ్చింది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాదులో కొంత టాకీ షూటింగ్ జరుగుతోంది. మూడు రోజుల అనంతంరం మైసూర్ వెళ్లి అక్కడ రెండు పాటలు, సీన్స్ తీస్తామన్నారు. హీరో శివాజీ మాట్లాడుతూ.. ఇది కన్నడంలో 150 రోజులు ప్రదర్శించబడిన "మొగ్గల మనస్సు" సినిమా రీమేక్. తెలుగులోకూడా అంతటి హిట్ అవుతుందనే నమ్మకముందని అన్నారు.దర్శకుడు భరత్ మాట్లాడుతూ... ఆర్తి అగర్వాల్ "నీలవేణి" చేస్తున్నప్పుడు అదిత అగర్వాల్ పరిచయం ఏర్పడింది. ఆమె అమెరికాలో ఉన్నా... ఈ పాత్ర ఆమెతోనే వేయించాలని తీసుక వచ్చాం. నిర్మాతలు కాంప్రమైజ్ కాకుండా నిర్మిస్తున్నారు. యువతకు, పెద్దలకు నచ్చే చక్కటి ప్రేమకుటుంబ కథా చిత్రం ఇది. ఆగస్టు నెలాఖరులో సినిమాను విడుదల చేస్తాం అన్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 7 Jul 2010 | 12:51 pm

ఝుమ్మంది నాదం ట్రెయిలర్

ఝుమ్మంది నాదం ట్రెయిలర్
Source: Yahoo! Telugu: Entertainment | 7 Jul 2010 | 12:37 pm

బ్రహ్మలోకం టు యమలోకం వయా భూలోకం ట్రెయిలర్

బ్రహ్మలోకం టు యమలోకం వయా భూలోకం ట్రెయిలర్
Source: Yahoo! Telugu: Entertainment | 7 Jul 2010 | 12:30 pm

రామ్‌దేవ్ చిత్రం ట్రెయిలర్

రామ్‌దేవ్ చిత్రం ట్రెయిలర్
Source: Yahoo! Telugu: Entertainment | 7 Jul 2010 | 12:22 pm

నిర్మాతలు లేరు.. అంతా బ్రోకర్సే ఉన్నారు: మోహన్ బాబు

ఇక్కడ అంతా బ్రోకర్స్ ఉన్నారు. అసలు నిర్మాతలు లేరు అని డా. మోహన్ బాబు విమర్శించారు. బుధవారం మీడియాతొ మాట్లాడుతూ.. మా అమ్మాయ్ తీసిన "ఝుమ్మంది నాదం" పైరసి వీడియోలను విజయావాడలో ఓ దుకాణంలొ నా ఫ్యాన్స్ పట్టుకున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 7 Jul 2010 | 9:56 am

"ఓదార్పు" జైత్రయాత్ర - దండయాత్రలా వద్దు: హైకమాండ్

అనేక విమర్శల మధ్య శ్రీకాకుళం ఓదార్పుకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బయలుదేరి వెళ్లారు. హైకమాండ్‌ను ధిక్కరించి వెళ్లిన జగన్‌పై అధిష్టానం వేటు వేయడం ఖాయమన్న వాదనలు వినపడ్డాయి. అయితే జగన్ రైలు బండెక్కిన మరుక్షణం ఢిల్లీలో సీన్ మారిపోయింది.
Source: ఏపీ న్యూస్ | 7 Jul 2010 | 8:30 am

అనుష్కకు షాక్... తాప్సీకి స్వీట్ ఇచ్చిన "మంచు"

మోహన్ బాబు కుమారుడు మంచు మనోజ్ "మాట" అంటే మాటలా..? మనోజ్ ఒకే ఒక్క మాట చెప్పాడంటే ఏ హీరోయిన్‌కైనా ఛాన్స్ తన్నుకుంటూ వస్తుంది. అదేమాట మరోసారి తిప్పి చెప్పాడంటే ఎంతటి అగ్రశ్రేణి హీరోయిన్‌కైనా వచ్చిన ఛాన్స్ వచ్చిన దారినే పారిపోతుంది. అసలు సంగతి ఏంటంటే...ఆమధ్య మంచు మనోజ్ అనుష్కతో కలిసి "వేదం" చిత్రంలో నటించాడు. ఆ సమయంలో అందగత్తె అనుష్కతో సన్నిహితంగా ఉండేందుకు "మంచు" తెగ తహతహలాడిపోయాడట. అయితే అనుష్క దాదాపు "ఛీ" కొట్టినంత పని చేయడంతో చేసేది లేక దూరంగా జరిగిపోయాడట.ఇదిలావుండగా ఇటీవల ఆర్‌బి చౌదరి బ్యానర్లో తమిళంలో నిర్మితమవుతున్న చిత్రంలో అనుష్కను హీరోయిన్‌గా తీసుకున్నారు. ఆ చిత్రంలో అనుష్క వేశ్య పాత్రలో నటించనుంది. కానీ మంచు మనోజ్ ఆ చిత్రంలో అనుష్కను తొలగించి, ఆ అవకాశాన్ని తాప్సీకి ఇవ్వాల్సిందిగా సిఫార్సు చేశాడట.
Source: వినోదం | 7 Jul 2010 | 7:33 am

హస్తినలో ఓదార్పుపై ప్లేటు ఫిరాయించిన సీఎం రోశయ్య

ఓదార్పు యాత్రపై ముఖ్యమంత్రి కె.రోశయ్య ప్లేటు ఫిరాయించారు. వైఎస్.జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ఓదార్పు యాత్రపై తమకెలాంటి అభ్యంతరం లేదన్నారు. అయితే, హంగు ఆర్భాటం లేకుండా ఉండాలన్నదే తమ అభిమతమని ఆయన స్పష్టం చేశారు.
Source: ఏపీ న్యూస్ | 7 Jul 2010 | 7:27 am

లవ్ లెటర్ల విశ్వాసంతో...

తన స్నేహితురాలు సుధ వెన్నంటి ఎప్పుడూ ఓ గాడిద రావడాన్ని గమనించిన సుమతి ఇలా అంటోందిసుమతి : "ఏమే సుధా..? ఎప్పుడూ నీ వెనకాలే ఆ గాడిద ఎందుకు వస్తోందే..?"సుధ...
Source: వినోదం | 7 Jul 2010 | 7:23 am

"లోకమే కొత్తగా" కోసం మైసూరు వెళ్తోన్న అదితి

అదితి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోన్న చిత్రం "లోకమే కొత్తగా". భరత్ పారేపల్లి దర్శకుడు. రమేష్ బాధావత్, శోభన్ బాబు అక్కినపల్లి, పురుషోత్తమ కొమ్ము నిర్మిస్తున్నారు. ఇటీవలే బ్యాంకాక్‌లో మూడు పాటలను పూర్తి చేసుకుని వచ్చింది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాదులో కొంత టాకీ షూటింగ్ జరుగుతోంది. మూడు రోజుల అనంతంరం మైసూర్ వెళ్లి అక్కడ రెండు పాటలు, సీన్స్ తీస్తామన్నారు. హీరో శివాజీ మాట్లాడుతూ.. ఇది కన్నడంలో 150 రోజులు ప్రదర్శించబడిన "మొగ్గల మనస్సు" సినిమా రీమేక్. తెలుగులోకూడా అంతటి హిట్ అవుతుందనే నమ్మకముందని అన్నారు.దర్శకుడు భరత్ మాట్లాడుతూ... ఆర్తి అగర్వాల్ "నీలవేణి" చేస్తున్నప్పుడు అదిత అగర్వాల్ పరిచయం ఏర్పడింది. ఆమె అమెరికాలో ఉన్నా... ఈ పాత్ర ఆమెతోనే వేయించాలని తీసుక వచ్చాం. నిర్మాతలు కాంప్రమైజ్ కాకుండా నిర్మిస్తున్నారు. యువతకు, పెద్దలకు నచ్చే చక్కటి ప్రేమకుటుంబ కథా చిత్రం ఇది. ఆగస్టు నెలాఖరులో సినిమాను విడుదల చేస్తాం అన్నారు.
Source: వినోదం | 7 Jul 2010 | 7:21 am

మా ఆవిడ ఊరెళితే..

"యజమాని సేవకుడు అనే తారతమ్యం లేకుండా ఉండాలంటారు. దాన్ని నేను ఆచరణలో పెట్టాను తెలుసా?" అన్నాడు వినోద్ "ఎలా..? అడిగాడు సురేష్"మా ఆవిడ...
Source: వినోదం | 7 Jul 2010 | 7:20 am

ఝుమ్మంది నాదం ట్రెయిలర్

ఝుమ్మంది నాదం ట్రెయిలర్
Source: వినోదం | 7 Jul 2010 | 7:09 am

రామ్‌దేవ్ చిత్రం ట్రెయిలర్

రామ్‌దేవ్ చిత్రం ట్రెయిలర్
Source: వినోదం | 7 Jul 2010 | 6:53 am

ఆ ఆరు కంపెనీలను బ్లాక్‌లిస్టులో ఉంచండి: సీబీఐ

ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు కుంభకోణం కేసులో నాలుగు విదేశీ కంపెనీతో సహా ఆరు కంపెనీలను బ్లాక్ లిస్టులో ఉంచాలని కేంద్ర నేర పరిశోధనా విభాగం (సీబీఐ) కేంద్ర రక్షణ శాఖను కోరింది. ఈ కుంభకోణంపై దర్యాప్తు చేపట్టిన సీబీఐ రక్షణ శాఖకు ఒక లేఖ రాసినట్టు అధికార వర్గాల సమాచారం.
Source: జాతీయ | 7 Jul 2010 | 6:37 am

బంజారాహిల్స్‌లో అమెరికా యువతిపై అత్యాచారం

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో నివసిస్తున్న అమెరికాకు చెందిన ఓ 30 ఏళ్ల విదేశీ యువతి అత్యాచారానికి గురైంది. ఈ సంఘటన మంగళవారం అర్థరాత్రి బంజారాహిల్స్ రోడ్ నెంబరు 11లో చోటు చేసుకున్నట్టు స్థానిక పోలీసులు వెల్లడించారు. గత ఏడాదిన్నరగా ఆమె బేగంపేటలోని క్లింటన్ ఫౌండేషన్‌లో ఉద్యోగం చేస్తున్నారు. ప్రస్తుతం ఈమెను వైద్య పరీక్షల నిమిత్తం అపోలో ఆస్పత్రికి తరలించారు.
Source: ఏపీ న్యూస్ | 7 Jul 2010 | 4:57 am

వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పేరుతో కొత్త రాజకీయ పార్టీ!

రాష్ట్రంలో మరో కొత్త ప్రాంతీయ రాజకీయ పార్టీ ఆవిర్భవించనుంది. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పేరుతో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు కానుంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘానికి బుధవారం ఒక వినతి పత్రం అందింది. రాయలసీమకు చెందిన కొండారెడ్డి అనే వ్యక్తి ఈ దరఖాస్తును సమర్పించారు. అయితే, దరఖాస్తు అసంపూర్తిగా భర్తీ చేసి ఉండటాన్ని గుర్తించిన ఈసీకి చెందిన సంబంధిత అధికారులు పూర్తి వివరాలను భర్తీ చేసి సమర్పించాలని తిరిగి సదరు వ్యక్తికే అందజేశారు.
Source: ఏపీ న్యూస్ | 7 Jul 2010 | 4:51 am

కాశ్మీర్ పరిస్థితి విషమం: శ్రీనగర్‌కు జీకె.పిళ్లై పయనం

జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో పరిస్థితి మరింత విషమంగా మారింది. దీంతో సైన్యాన్ని రాష్ట్ర వ్యాప్తంగా మొహరించారు. బుధవారం ఉదయం వివిధ ప్రాంతాలకు చేరుకున్న సైనిక బలగాలు కవాతు నిర్వహించాయి. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి జీకె.పిళ్లై హుటాహుటిన శ్రీనగర్‌కు బయలుదేరి వెళ్లనున్నారు.
Source: జాతీయ | 7 Jul 2010 | 4:45 am

ఉప ఎన్నికల ప్రచారానికి నేను సిద్ధం: చంద్రబాబు

ఈనెలలో జరుగనున్న ఉప ఎన్నికల ప్రచారానికి తాను సిద్ధంగా ఉన్నట్టు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఈ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులు సత్తా చాటడమే కాకుండా, అధిక స్థానాలను కైవసం చేసుకుంటారని ఆయన జోస్యం చెప్పారు.
Source: ఏపీ న్యూస్ | 7 Jul 2010 | 4:34 am

నిర్మాతలు లేరు.. అంతా బ్రోకర్సే ఉన్నారు: మోహన్ బాబు

ఇక్కడ అంతా బ్రోకర్స్ ఉన్నారు. అసలు నిర్మాతలు లేరు అని డా. మోహన్ బాబు విమర్శించారు. బుధవారం మీడియాతొ మాట్లాడుతూ.. మా అమ్మాయ్ తీసిన "ఝుమ్మంది నాదం" పైరసి వీడియోలను విజయావాడలో ఓ దుకాణంలొ నా ఫ్యాన్స్ పట్టుకున్నారు.
Source: వినోదం | 7 Jul 2010 | 4:27 am