మీరు చేతగాని చవటదద్దమ్మ కావడం వల్లే: రఘువీరా

మీరు చేతగాని చవటదద్దమ్మ. తొమ్మిదేళ్ళు ముఖ్యమంత్రిగా ఏం చేశారు. ఈ రాష్ట్రాన్ని సర్వం భ్రస్టు పట్టించి.. ఇపుడు నిందలు మాపై మోపుతారా. ఆల్మట్టి, బాబ్లీ ప్రాజెక్టుల నిర్మాణం అడ్డుకట్టకు ఎలాంటి చర్యలు చేపట్టారు అంటూ రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి ఎన్.రఘువీరా రెడ్డి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Source: Yahoo! Telugu: News | 7 Jul 2010 | 9:45 am

మంత్రి డెవలపర్స్ కొత్త సీఎమ్‌ఓగా భరత్ ధుప్పార్

రియల్ ఎస్టేట్ రంగంలో అగ్రగామి, బెంగుళూరుకు చెందిన "మంత్రి డెవలపర్స్" సంస్థ ఛీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్‌గా భరత్ ధుప్పార్ నియమితులయ్యారు. ఇతను మార్కెటింగ్, బ్రాండ్ విజబిలిటీ, సేల్స్, వాణిజ్య పెరుగుదలలో కీలక బాద్యత వహిస్తారు.
Source: Yahoo! Telugu: News | 7 Jul 2010 | 8:56 am

ప్రవాసీయుల్లో భారతీయులే అధికం: అమెరికా గణాంకాలు

అమెరికాకు వలస వచ్చి స్థిరపడిన ప్రవాసీయులలో భారతీయులే అధికులని తాజా గణాకాలు వెల్లడిస్తున్నాయి. 2008వ సంవత్సరంలో అమెరికాలో మొత్తం 1.83 మిలియన్ల మంది ప్రవాసీయులు ఉండగా అందులో 4,00,000 మంది భారతదేశ ప్రజలు మొదటి స్థానంలో ఉన్నారు. ఆ తర్వాత 1,50,000 మంది ప్రజలతో కెనడా, 1,40,000 మంది ప్రజలతో దక్షిణ కొరియాలు ద్వితీయ, తృతీయ స్థానాల్లో ఉన్నట్లు డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్ఎస్) తెలిపింది.
Source: Yahoo! Telugu: News | 7 Jul 2010 | 8:54 am

అమ్మకపు ఒత్తిడి: సెన్సెక్స్, నిఫ్టీల పతనం!

దేశీయ వాటాలు అమ్మకాల ఒత్తిడికి గురికావడంతో బాంబే స్టాక్ మార్కెట్ నష్టాల్లో కూరుకుపోయింది. దీంతో బుధవారం మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచి సెన్సెక్స్, 90 పాయింట్లు పతనమై, 17,523 పాయింట్ల మార్కును తాకింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచి నిఫ్టీ కూడా 32 పాయింట్లు క్షీణించి, 5,257 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.
Source: Yahoo! Telugu: News | 7 Jul 2010 | 7:59 am

రాష్ట్ర ప్రయోజనాలను ఢిల్లీలో తగలబెట్టిన కాంగ్రెస్: బాబు

తెలుగోడి ఆత్మగౌరవాన్ని రాష్ట్రంలోని రోశయ్య సర్కారు ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెట్టారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. బుధవారం నుంచి ప్రారంభమైన అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో భాగంగా మహారాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన బాబ్లీతో సహా ఇతర ప్రాజెక్టులపై అసెంబ్లీలో చర్చ జరిగింది.
Source: Yahoo! Telugu: News | 7 Jul 2010 | 7:59 am

పాఠశాల విద్యపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు: జేపీ

పాఠశాల విద్యపై రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని లోక్‌సత్తా పార్టీ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ్ విమర్శించారు. పేద పిల్లలను బడికి రప్పించి విద్యాదానం చేసేందుకు గత ఏడాది బడ్జెట్ లో రూ.1800 కోట్లు కేటాయించిన ప్రభుత్వం అందుకు తగినట్లుగా చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు.
Source: Yahoo! Telugu: News | 7 Jul 2010 | 7:58 am

యాత్ర క్రమశిక్షణా రాహిత్యం కిందకు రాదు: అంబటి

కడప ఎంపీ వైఎస్.జగన్మోహన్ రెడ్డి చేపట్టనున్న ఓదార్పు యాత్ర క్రమశిక్షణా రాహిత్యం కిందకు రాదని పీసీసీ ప్రధాన కార్యదర్శి అంబటి రాంబాబు అన్నారు. ఆయన బుధవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ లక్షలాది మంది ప్రజల సాక్షిగా ప్రజలకు ఇచ్చిన మాటను జగన్ నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. వైఎస్ అకాల మరణాన్ని తట్టుకోలేక మృతి చెందిన కుటుంబాలను పరామర్శిస్తానని వైఎస్.జగన్ పావురాల గుట్ట నల్లకాలువ వద్ద ప్రకటించారని అంబటి గుర్తు చేశారు.
Source: Yahoo! Telugu: News | 7 Jul 2010 | 7:44 am

దేశంలో రెండు పవన విద్యుత్ కేంద్రాల ఏర్పాటు: రైల్వే

పెరుగుతున్న విద్యత్ ఛార్జీలు, కర్బన వ్యర్ధాలను దృష్టిలో ఉంచుకొని భారత రైల్వే పవన విద్యత్‌పై దృష్టి సారించింది. వచ్చే ఏడాదికంతా 21 మెగా వాట్ల పవన విద్యుత్ లక్ష్యంతో రెండు పవన విద్యుత్ కేంద్రాలను నెలకొల్పనున్నట్లు ప్రకటించింది.
Source: Yahoo! Telugu: News | 7 Jul 2010 | 7:21 am

అనుమతి లేదు.. "ఓదార్పు"కు వెళ్లొద్దని చెప్పా: రోశయ్య

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శ్రీకాకుళంలో తలపెట్టిన ఓదార్పు యాత్రకు అనుమతి లేదని ఆయనే తన లేఖలో స్పష్టం చేశారు కనుక దానిపై తాను స్పందించబోనని ముఖ్యమంత్రి రోశయ్య అన్నారు. అదేసమయంలో జగన్ ఓదార్పు యాత్ర రాష్ట్ర రాజకీయాలపై ఎటువంటి ప్రభావం చూపబోదని జోస్యం చెప్పారు.
Source: Yahoo! Telugu: News | 7 Jul 2010 | 7:18 am

అమెరికా వివాదాస్పద నటి లిండ్సే లోహాన్‌కు జైలుశిక్ష!

అమెరికాకు చెందిన వివాదాస్పద నటి లిండ్సే లోహాన్‌కు 90 రోజుల జైలు శిక్ష విధిస్తూ స్థానిక కోర్టు తీర్పు ఇచ్చింది. మద్యం సేవించరాదనే నిబంధనను ఉల్లఘించినందుకు గాను ఆమెకు ఈశిక్షను ఖరారు చేసింది. ఈ శిక్ష తీర్పు వెలువడిన వెంటనే లోహాన్ జడ్జి మర్షా రెవెల్ ఎదుట కన్నీళ్ళపర్యంతమయ్యారు.
Source: Yahoo! Telugu: News | 7 Jul 2010 | 7:10 am

ఆ డైరెక్టర్ నన్ను నిద్రపోనివ్వడం లేదు: కత్రినా

బాలీవుడ్ హాట్ బేబీ కత్రినా కైఫ్ తనను దర్శకుడు జోయా అక్తర్ నిద్రపోనివ్వడం లేదని వాపోతోంది. రాత్రి పూట అవుతుంటే చాలు... భయమేస్తోందనీ, నిద్రకు మొహం వాయాల్సి వస్తోందని కత్రినా తెగ బాధపడిపోతోంది. ఇంతకీ ఆ డైరెక్టర్ ఏం చేస్తున్నాడేంటీ అని ప్రశ్నిస్తే... "ఇంకేం చేస్తాడూ...? రాత్రిపూట షూటింగ్‌లంటూ చంపుకు తింటున్నాడు. సాయంత్రం నాలుగు గంటలకు మొదలుపెట్టి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకూ ఒకటే పని చేయించుకుంటున్నాడు. రాత్రిపూట అదేపనిగా చేయాలంటే ఎంత కష్టమో రాత్రివేళల్లో మేలుకుని పనిచేసే వారికే తెలుసు" అంటూ నిష్టూరాలు పోతోందట. కానీ చిత్ర దర్శకుడు మాత్రం.... చిత్రానికి సంతకాలు చేసేటపుడు ఈ సంగతి తెలియదా...? డబ్బులు తేరగా వస్తాయా ఏంటీ..? అని ఎదురు ప్రశ్నలు వేస్తున్నాడట. రాత్రిపూట ఆమె ఒక్కర్తే కాదు.. ఆమెతోపాటు నేనూ కూడా మేలుకుంటున్నా అని జవాబిస్తున్నాడట. అంతేగామరి... ఒప్పుకుంటే ఖచ్చితంగా పని చేయాలి కదా...!!
Source: Yahoo! Telugu: Entertainment | 7 Jul 2010 | 6:10 am

వరుణ్ సందేశ్ - నిషా అగర్వాల్ చిత్రం షూటింగ్...

హ్యాపీడేస్, కొత్తబంగారులోకం వంటి సూపర్ హిట్ చిత్రాల కథానాయకుడు వరుణ్ సందేశ్ హీరోగా, అధినేత వంటి హిట్ చిత్రాన్ని నిర్మించిన ప్రముఖ నిర్మాత కేసన్నపల్లి రాధామోహన్ శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై అరిమిల్లి రామకృష్ణ సమర్పణలో నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెం.2 చిత్రం షూటింగ్ హైదరాబాదులో రెండు వారాలుగా జరుగుతోంది. ఈ సందర్భంగా నిర్మాత కేసన్నపల్లి రాధామోహన్ మాట్లాడుతూ... రెండు వారాలుగా ఈ చిత్రం షూటింగ్ హైదరాబాదులోని పలు లొకేషన్స్‌లో జరుగుతోంది. మియాపూర్‌లో వేసిన సెట్‌లో, పంజాగుట్టలో పెంట్ హౌస్ సెట్‌లో డెక్కన్ పార్క్, నానక్ రామ్ గూడలోని రామానాయుడు స్టూడియోలో చిత్రానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాల చిత్రీకరణ జరిగింది. ఎక్కడా బ్రేక్ లేకుండా కంటిన్యూగా ఈ తొలి షెడ్యూల్ షూటింగ్ జరుగుతుంది అన్నారు. వరుణ్ సందేశ్, నిషా అగర్వాల్, శశాంక్, నిషా షా, వెన్నెల కిషోర్, బ్రహ్మానందం తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. సంగీతం: చక్రి, ఫోటోగ్రఫీ: బుజ్జి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎంఎస్ కుమార్, నిర్మాత: కేసన్నపల్లి రాధామోహన్, కథ - మాటలు - స్క్రీన్ ప్లే - దర్శకత్వం: సంపత్ నంది
Source: Yahoo! Telugu: Entertainment | 7 Jul 2010 | 5:27 am

మీరు చేతగాని చవటదద్దమ్మ కావడం వల్లే: రఘువీరా

మీరు చేతగాని చవటదద్దమ్మ. తొమ్మిదేళ్ళు ముఖ్యమంత్రిగా ఏం చేశారు. ఈ రాష్ట్రాన్ని సర్వం భ్రస్టు పట్టించి.. ఇపుడు నిందలు మాపై మోపుతారా. ఆల్మట్టి, బాబ్లీ ప్రాజెక్టుల నిర్మాణం అడ్డుకట్టకు ఎలాంటి చర్యలు చేపట్టారు అంటూ రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి ఎన్.రఘువీరా రెడ్డి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Source: ఏపీ న్యూస్ | 7 Jul 2010 | 4:16 am

మహా అయితే పార్టీ నుంచి బహిష్కరిస్తారు: వైఎస్.జగన్

అధిష్టాన నిర్ణయాన్ని కాదని ఓదార్పు యాత్రను చేపట్టే తనపై మహా అయితే పార్టీ నుంచి బహిష్కరించడం మినహా మరేం చేస్తారని కడప ఎంపీ వైఎస్.జగన్మోహన్ రెడ్డి తన అనుచరులను ప్రశ్నించినట్టు సమాచారం. ఓదార్పు యాత్రపై అధిష్టానాన్ని ఒప్పించేందుకు తాను శాయశక్తులా ప్రయత్నించి విఫలమయ్యానని ఆయన వారివద్ద ఆవేదన వ్యక్తం చేశారు.
Source: ఏపీ న్యూస్ | 7 Jul 2010 | 3:12 am

రాష్ట్ర ప్రయోజనాలను ఢిల్లీలో తగలబెట్టిన కాంగ్రెస్: బాబు

తెలుగోడి ఆత్మగౌరవాన్ని రాష్ట్రంలోని రోశయ్య సర్కారు ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెట్టారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. బుధవారం నుంచి ప్రారంభమైన అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో భాగంగా మహారాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన బాబ్లీతో సహా ఇతర ప్రాజెక్టులపై అసెంబ్లీలో చర్చ జరిగింది.
Source: ఏపీ న్యూస్ | 7 Jul 2010 | 2:31 am

పాఠశాల విద్యపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు: జేపీ

పాఠశాల విద్యపై రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని లోక్‌సత్తా పార్టీ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ్ విమర్శించారు. పేద పిల్లలను బడికి రప్పించి విద్యాదానం చేసేందుకు గత ఏడాది బడ్జెట్ లో రూ.1800 కోట్లు కేటాయించిన ప్రభుత్వం అందుకు తగినట్లుగా చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు.
Source: ఏపీ న్యూస్ | 7 Jul 2010 | 2:29 am

యాత్ర క్రమశిక్షణా రాహిత్యం కిందకు రాదు: అంబటి

కడప ఎంపీ వైఎస్.జగన్మోహన్ రెడ్డి చేపట్టనున్న ఓదార్పు యాత్ర క్రమశిక్షణా రాహిత్యం కిందకు రాదని పీసీసీ ప్రధాన కార్యదర్శి అంబటి రాంబాబు అన్నారు. ఆయన బుధవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ లక్షలాది మంది ప్రజల సాక్షిగా ప్రజలకు ఇచ్చిన మాటను జగన్ నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. వైఎస్ అకాల మరణాన్ని తట్టుకోలేక మృతి చెందిన కుటుంబాలను పరామర్శిస్తానని వైఎస్.జగన్ పావురాల గుట్ట నల్లకాలువ వద్ద ప్రకటించారని అంబటి గుర్తు చేశారు.
Source: ఏపీ న్యూస్ | 7 Jul 2010 | 2:14 am

అనుమతి లేదు.. "ఓదార్పు"కు వెళ్లొద్దని చెప్పా: రోశయ్య

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శ్రీకాకుళంలో తలపెట్టిన ఓదార్పు యాత్రకు అనుమతి లేదని ఆయనే తన లేఖలో స్పష్టం చేశారు కనుక దానిపై తాను స్పందించబోనని ముఖ్యమంత్రి రోశయ్య అన్నారు. అదేసమయంలో జగన్ ఓదార్పు యాత్ర రాష్ట్ర రాజకీయాలపై ఎటువంటి ప్రభావం చూపబోదని జోస్యం చెప్పారు.
Source: ఏపీ న్యూస్ | 7 Jul 2010 | 1:50 am

కాశ్మీర్ అంశంపై కేంద్ర కేబినెట్ భద్రతా కమిటీ భేటీ!

కాశ్మీర్‌లో చెలరేగిన అల్లర్లపై చర్చించేందుకు భద్రతా వ్యవహారాల కేంద్ర కేబినెట్ బుధవారం భేటీ కానుంది. గత కొన్ని రోజులుగా ఈ ప్రాంతంలో అల్లర్లు జరుగుతున్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన చెలరేగిన అల్లర్లలో ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో పరిస్థితి ఒక్కసారి చేయి దాటిపోయింది.
Source: జాతీయ | 7 Jul 2010 | 1:17 am

ఉప ఎన్నికల ప్రచారానికి తాను సిద్ధం: చంద్రబాబు

ఈనెలలో జరుగనున్న ఉప ఎన్నికల ప్రచారానికి తాను సిద్ధంగా ఉన్నట్టు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఈ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులు సత్తా చాటడమే కాకుండా, అధిక స్థానాలను కైవసం చేసుకుంటారని ఆయన జోస్యం చెప్పారు.
Source: ఏపీ న్యూస్ | 6 Jul 2010 | 11:53 pm

మావోయిస్టుల భారత్ బంద్: జార్ఖండ్‌లో ఏడు రైళ్ళ రద్దు

మావోయిస్టుల ఇచ్చిన భారత్ బంద్ పిలుపు మేరకు జార్ఖండ్ రాష్ట్రంలో ఏడు ప్రధాన రైళ్లను రద్దు చేశారు. ఆ పార్టీకి చెందిన కేంద్ర కమిటీ సభ్యుడు ఆజాద్‌ను ఈనెల రెండో తేదీన ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఎన్‌కౌంటర్ చేసిన విషయం తెల్సిందే. ఈ హత్యకు నిరసనగా మావోయిస్టులు 48 గంటల భారత్‌ బంద్‌కు పిలుపునివ్వగా ఇది మంగళవారం అర్థరాత్రి నుంచి ప్రారంభమైంది.
Source: జాతీయ | 6 Jul 2010 | 11:34 pm

చెవులే కాదు మైండ్ కూడా సభలో ఉంచాలి: చంద్రబాబు

సభకు వచ్చే అధికార పార్టీ సభ్యులు చెవులే కాకుండా మైండ్‌ను కూడా సభలో ఉంచాలని తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రధాన ప్రతిపక్ష నేత ఎన్.చంద్రబాబు నాయుడు సూచించారు. దీనికి అధికార పార్టీ సభ్యులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభమైన సమయంలో చంద్రబాబు ఈ తరహా వ్యాఖ్యలు చేశారు.
Source: ఏపీ న్యూస్ | 6 Jul 2010 | 10:50 pm

భారత్-పాక్ చర్చల మధ్య తీవ్రవాదమే ప్రధానాంశం: కృష్ణ

ఈనెల 15వ తేదీ నుంచి జరుగనున్న ఇండో-పాక్ ద్వైపాక్షిక చర్చల్లో తీవ్రవాద నిర్మూలనే ప్రధాన అజెండాగా ఉంటుందని కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్.ఎం.కృష్ణ తేల్చి చెప్పారు. ఈ చర్చల సమయంలో పాకిస్థాన్ లేవనెత్తే అంశాలను చర్చలోకి తీసుకునే అవకాశం లేదని ఆయన చెప్పారు.
Source: జాతీయ | 6 Jul 2010 | 10:28 pm

మావోయిస్టుల 48 గంటల భారత్ బంద్ ప్రారంభం!

మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, అధికార ప్రతినిధి చెరుకూరి రాజ్‌కుమార్ అలియాస్ ఆజాద్ మృతికి సంతాపంగా మావోయిస్టు పార్టీ 48 గంటల భారత్ బంద్‌కు పిలుపునిచ్చింది. దీంతో నక్సల్ ప్రభావిత రాష్ట్రాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ ప్రాంతాల్లో రైళ్ళ రాకపోకలను మంగళవారం అర్థరాత్రి నుంచి నిలిపి వేయగా, మరికొన్నింటిని దారిమళ్లించారు.
Source: జాతీయ | 6 Jul 2010 | 9:50 pm

షెర్లిన్‌తో లెస్బియన్‌గా నటించాలనుంది: రాఖీ సావంత్

రాఖీ సావంత్ లెస్బియన్‌గా నటించాలనుందని చెపుతుంది. యుమన్‌తో రొమాన్స్ బాగుంటుందని ఇటీవలే ముంబైలో చెప్పింది. షెర్లిన్ చోప్రాతో కలిసి నటిస్తానని అంది. స్వయంవరంతో హాట్ టాపిక్‌గా మారిన ఆమె మరోసారి ఇలా జర్క్ ఇచ్చింది.
Source: Yahoo! Telugu: Entertainment | 6 Jul 2010 | 11:34 am

లారెన్స్ దర్శకత్వంలో ప్రభాస్ - అనుష్క

యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ హీరోగా మాస్ డైరెక్టర్ రాఘవ లారెన్స్ దర్శకత్వంలో శ్రీ బాలాజీ సినీ మీడియా పతాకంపై ప్రముఖ నిర్మాతలు జె.భగవాన్, జె.పుల్లారావు ఓ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. "బిల్లా" వంటి సూపర్ హిట్ చిత్రం తర్వాత ప్రభాస్, అనుష్క ఈ చిత్రంలో జంటగా నటిస్తున్నారు. దర్శకుడు రాఘవ లారెన్స్ ఈ చిత్రం గురించి చెపుతూ... ప్రభాస్ బాడీ లాంగ్వేజ్‌కి ఫర్‌ఫెక్ట్‌గా సూట్ అయ్యే సూపర్ సబ్జెక్ట్ రెడీ అయింది. ఈ సబ్జెక్ట్ విని ప్రభాస్ ఎంతో ఇన్‌స్పైర్ అయ్యారు. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే అంశాలతో పవర్‌ఫుల్ మాస్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందుతుంది. ప్రభాస్ కెరీర్‌లో ఓ సెన్సేషనల్ మూవీగా నిలిచిపోతుందని అన్నారు.ఈ చిత్రానికి నిర్మాతలు: జె.భగవాన్, జె.పుల్లారావు, కథ- స్క్రీన్ ప్లే- దర్శకత్వం: రాఘవ లారెన్స్
Source: Yahoo! Telugu: Entertainment | 6 Jul 2010 | 9:12 am

బుధవారం నుంచి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు

బుధవారం నుంచి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు ఏడు రోజులపాటు జరుగనున్నాయి. కేవలం ఏడంటే ఏడు రోజులపాటు అసెంబ్లీ సమావేశాలను నిర్వహించడంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.
Source: ఏపీ న్యూస్ | 6 Jul 2010 | 8:40 am

తెలంగాణా ఇవ్వకపోతే నక్సలైట్లు తయారవుతారు

తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకత గురించి మంగళవారం శ్రీకృష్ణ కమిటీ ముందు తెలంగాణా ప్రాంత కాంగ్రెస్ నాయకులు వినిపించారు. వనరులు, ఉద్యోగాలు వంటివాటిలో తెలంగాణా ఏ విధంగా దగాకు గురవుతుందో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కమిటికీ వివరించి చూపించారు.
Source: ఏపీ న్యూస్ | 6 Jul 2010 | 8:12 am

తాప్సీ "గుమ్మడి పండ్లు", "సొరకాయలు"

దర్శకేంద్రుడు చిత్రం అంటే హీరోయిన్ బొడ్డుపై రకరకాల పండ్లు నాట్యం చేస్తాయి. ఝుమ్మంది నాదం చిత్రంలో ఢిల్లీ పిల్ల తాప్సీ బొడ్డుపైనా ద్రాక్ష గుత్తులు, ఇంకా రకరకాల పండ్లతో గిలిగింతలు పెట్టించాడు. తన శరీరంపై మంచు మనోజ్ రకరకాల పండ్లను దొర్లిస్తుంటే చక్కిలిగింత పుట్టి కడుపుబ్బ నవ్వేదాన్నని తాప్సీ తన సన్నిహితులతో చెపుతోందట. ఝుమ్మంది నాదం చిత్రంలో తనను చూసి మరో ముగ్గురు నిర్మాతలు తనకు అవకాశాలను ఇచ్చారని అంటోందట. ఏం చూసి ఇచ్చారో తెలుసా...? అని అంటూ.. ద్రాక్ష గుత్తులు, పూలరేకులకు మించి సొరకాయలు, గుమ్మడి పండ్లతో తాను ఇచ్చిన ఫోజులు ఎంతో బావున్నాయనీ, వాటికితోడు నటన కూడా బావుందని మెచ్చుకున్నారని చెపుతోందట తాప్సీ. ప్రత్యేకించి కాయలతో నటించిన సీన్లే బావున్నాయని మెచ్చుకుంటున్న తమిళ దర్శకులు తాప్సీతో ఇంకా ఎటువంటి కాయలతో నటింపచేస్తారో చూడాలి మరి...
Source: Yahoo! Telugu: Entertainment | 6 Jul 2010 | 6:55 am

జగన్.. లక్ష్మణ రేఖను దాటొద్దు: అధిష్ఠానం హెచ్చరిక

కాంగ్రెస్ హైకమాండ్ మాటను ఖాతరు చేయకుండా గురువారం శ్రీకాకుళం నుంచి ఓదార్పు యాత్రను చేపట్టాలని జగన్ తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా పరిగణిస్తోంది. ఓదార్పు యాత్ర వద్దని వారిస్తున్నా పట్టుదలగా చేయడంపై జగన్‌కు హెచ్చరిక చేసింది.
Source: జాతీయ | 6 Jul 2010 | 6:33 am

షెర్లిన్‌తో లెస్బియన్‌గా నటించాలనుంది: రాఖీ సావంత్

రాఖీ సావంత్ లెస్బియన్‌గా నటించాలనుందని చెపుతుంది. యుమన్‌తో రొమాన్స్ బాగుంటుందని ఇటీవలే ముంబైలో చెప్పింది. షెర్లిన్ చోప్రాతో కలిసి నటిస్తానని అంది. స్వయంవరంతో హాట్ టాపిక్‌గా మారిన ఆమె మరోసారి ఇలా జర్క్ ఇచ్చింది.
Source: వినోదం | 6 Jul 2010 | 6:04 am

ఏసుక్రీస్తు జీవిత చరిత్ర నేపధ్యం చిత్రంలో పవన్ కల్యాణ్

పవన్ కల్యాణ్ ఈ నెల 15న ఇజ్రాయిల్ వెళ్లబోతున్నారు. తను ముఖ్య భూమికను పోషిస్తున్న ఆదిత్య ప్రొడక్షన్స్ చిత్రం షూటింగ్‌కోసం ఆయన అక్కడికి వెళుతున్నారు. విజయేంద్రవర్మ వంటి కమర్షియల్ చిత్రాన్ని, "శ్రీరామదాసు"లాంటి భక్తిరసాత్మక చిత్రాన్ని అందించిన తర్వాత ఆదిత్య ప్రొడక్షన్స్ పతాకంపై కొండా కృష్ణంరాజు నిర్మిస్తున్న తాజా చిత్రంలో పవన్ కల్యాణ్ నటిస్తున్నారు. ఏసు ప్రభువు జీవిత చరిత్రను ఆధారంగా చేసుకుని రూపొందిస్తున్న ఈ చిత్రానికి సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర విశేషాలను నిర్మాత కొండా కృష్ణంరాజు ఆదివారం విలేకరులకు తెలియజేస్తూ... ఇజ్రాయెల్‌లోని ముఖ్యమైన ప్రదేశాల్లో ఈ చిత్రం షూటింగ్ చేయనున్నాం.
Source: Yahoo! Telugu: Entertainment | 6 Jul 2010 | 6:00 am

లారెన్స్ దర్శకత్వంలో ప్రభాస్ - అనుష్క

యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ హీరోగా మాస్ డైరెక్టర్ రాఘవ లారెన్స్ దర్శకత్వంలో శ్రీ బాలాజీ సినీ మీడియా పతాకంపై ప్రముఖ నిర్మాతలు జె.భగవాన్, జె.పుల్లారావు ఓ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. "బిల్లా" వంటి సూపర్ హిట్ చిత్రం తర్వాత ప్రభాస్, అనుష్క ఈ చిత్రంలో జంటగా నటిస్తున్నారు. దర్శకుడు రాఘవ లారెన్స్ ఈ చిత్రం గురించి చెపుతూ... ప్రభాస్ బాడీ లాంగ్వేజ్‌కి ఫర్‌ఫెక్ట్‌గా సూట్ అయ్యే సూపర్ సబ్జెక్ట్ రెడీ అయింది. ఈ సబ్జెక్ట్ విని ప్రభాస్ ఎంతో ఇన్‌స్పైర్ అయ్యారు. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే అంశాలతో పవర్‌ఫుల్ మాస్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందుతుంది. ప్రభాస్ కెరీర్‌లో ఓ సెన్సేషనల్ మూవీగా నిలిచిపోతుందని అన్నారు.ఈ చిత్రానికి నిర్మాతలు: జె.భగవాన్, జె.పుల్లారావు, కథ- స్క్రీన్ ప్లే- దర్శకత్వం: రాఘవ లారెన్స్
Source: వినోదం | 6 Jul 2010 | 3:46 am

నిద్రావస్థలో ఉన్న యూపీఏను మేల్కొలిపాం: ఎల్కే.అద్వానీ

పెరిగిన ధరలతో దేశ ప్రజలు పడుతున్న కష్టాలను కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ సర్కారు దృష్టికి తీసుకెళ్ళడమే కాకుండా, నిద్రావస్థలో ఉన్న యూపీఏ పాలకుల కళ్లు తెరిపించామని భారతీయ జనతా పార్టీ అగ్రనేత ఎల్కే.అద్వానీ అన్నారు. భారత్ బంద్ వల్ల సాధించేమిటని కాంగ్రెస్ నేతలు వేసిన ప్రశ్నలపై ఆయన పైవిధంగా స్పందించారు.
Source: జాతీయ | 6 Jul 2010 | 3:28 am