|
లాభాల్లో స్టాక్ మార్కెట్: వృద్ధిబాటలో సెన్సెక్స్!బాంబే స్టాక్ మార్కెట్ లాభాలను నమోదు చేసుకుంటోంది. మంగళవారం లాభదాయకంగా ప్రారంభమైన బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచి సెన్సెక్స్, మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో 175 పాయింట్లు వృద్ధి చెందింది. దీంతో సెన్సెక్స్ 17,616 పాయింట్ల మార్కును తాకింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచి నిఫ్టీ కూడా 61 పాయింట్లు లాభపడి, 5,296 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.Source: Yahoo! Telugu: News | 6 Jul 2010 | 9:35 am ఇనుప ఖనిజం ఉత్పత్తికి 3,000 కోట్లు: ఎన్ఎమ్డీసీదేశీయ ఆధారిత సంస్థ ఎన్‌ఎమ్‌డీసీ ఇనుప ఖనిజం (ఐరన్ ఓర్) సరఫరాకు 3,000 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. ఛత్తీస్ఘడ్‌లో సంవత్సరానికి 12 మిలియన్ టన్నుల ఇనుప ఖనిజం (ఐరన్ ఓర్) దేశీయ వినియోగదారులకు సరఫరా చేసే పైపులైనును ప్రారంభించనుంది.Source: Yahoo! Telugu: News | 6 Jul 2010 | 9:25 am లారెన్స్ దర్శకత్వంలో ప్రభాస్ - అనుష్కయంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ హీరోగా మాస్ డైరెక్టర్ రాఘవ లారెన్స్ దర్శకత్వంలో శ్రీ బాలాజీ సినీ మీడియా పతాకంపై ప్రముఖ నిర్మాతలు జె.భగవాన్, జె.పుల్లారావు ఓ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. "బిల్లా" వంటి సూపర్ హిట్ చిత్రం తర్వాత ప్రభాస్, అనుష్క ఈ చిత్రంలో జంటగా నటిస్తున్నారు. దర్శకుడు రాఘవ లారెన్స్ ఈ చిత్రం గురించి చెపుతూ... ప్రభాస్ బాడీ లాంగ్వేజ్‌కి ఫర్‌ఫెక్ట్‌గా సూట్ అయ్యే సూపర్ సబ్జెక్ట్ రెడీ అయింది. ఈ సబ్జెక్ట్ విని ప్రభాస్ ఎంతో ఇన్‌స్పైర్ అయ్యారు. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే అంశాలతో పవర్‌ఫుల్ మాస్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందుతుంది. ప్రభాస్ కెరీర్‌లో ఓ సెన్సేషనల్ మూవీగా నిలిచిపోతుందని అన్నారు.ఈ చిత్రానికి నిర్మాతలు: జె.భగవాన్, జె.పుల్లారావు, కథ- స్క్రీన్ ప్లే- దర్శకత్వం: రాఘవ లారెన్స్Source: Yahoo! Telugu: Entertainment | 6 Jul 2010 | 9:12 am నిద్రావస్థలో ఉన్న యూపీఏను మేల్కొలిపాం: ఎల్కే.అద్వానీపెరిగిన ధరలతో దేశ ప్రజలు పడుతున్న కష్టాలను కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ సర్కారు దృష్టికి తీసుకెళ్ళడమే కాకుండా, నిద్రావస్థలో ఉన్న యూపీఏ పాలకుల కళ్లు తెరిపించామని భారతీయ జనతా పార్టీ అగ్రనేత ఎల్కే.అద్వానీ అన్నారు. భారత్ బంద్ వల్ల సాధించేమిటని కాంగ్రెస్ నేతలు వేసిన ప్రశ్నలపై ఆయన పైవిధంగా స్పందించారు.Source: Yahoo! Telugu: News | 6 Jul 2010 | 8:58 am స్టాక్ మార్కెట్: సెన్సెక్స్ 140 పాయింట్లు వృద్ధి!బాంబే స్టాక్ మార్కెట్ లాభాల బాటలో కొనసాగుతోంది. ట్రేడింగ్ ప్రారంభం నుంచి పురోగమనం వైపు ర్యాలీని పయనింపజేసిన బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచి సెన్సెక్స్, మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో 140 పాయింట్లు బలపడింది. దీంతో సెన్సెక్స్ సూచి 17,582 పాయింట్ల మార్కును తాకింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచి నిఫ్టీ కూడా 45 పాయింట్లు వృద్ధి చెంది, 5,281 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.Source: Yahoo! Telugu: News | 6 Jul 2010 | 8:16 am మిలిటెంట్ గ్రూపులతో చర్చల ప్రసక్తే లేదు: పాకిస్థాన్దేశంలో మారణహోమం సృష్టిస్తున్న తీవ్రవాద సంస్థలతో చర్చలకు ఆస్కారమే లేదని పాకిస్థాన్ తేల్చి చెప్పింది. ముఖ్యంగా, దర్గాలతో పాటు ఇతర ప్రార్థనా మందిరాలైన మసీదులపై దాడులకు తెగబడుతున్న సంస్థలతో చర్చలు జరిపే ప్రసక్తే లేదని పేర్కొంది. ఈ చర్చలు జరపాలంటే ముందుగా మిలిటెంట్లు తమ ఆయుధాలను అప్పగించాలని పాక్ అభిప్రాయపడింది.Source: Yahoo! Telugu: News | 6 Jul 2010 | 7:50 am ధిక్కరిస్తే కడప ఎంపీగా కూడా జగన్ ఉండడు: పాల్వాయిఅధిష్ఠానం చెప్పిన మాటను ఖాతరు చేయకుండా తన ఇష్టప్రకారం ఓదార్పు యాత్ర చేపడితే వైఎస్ జగన్ తీవ్రంగా నష్టపోతారని తెలంగాణా ప్రాంత కాంగ్రెస్ నాయకుడు పాల్వాయి గోవర్థన్ రెడ్డి అన్నారు. ఎన్ని చేసినా పార్టీకి లోబడి మాత్రమే ఉండాలన్నారు.Source: Yahoo! Telugu: News | 6 Jul 2010 | 7:21 am భారత్ బంద్ కారణంగా రూ.13 వేల కోట్ల నష్టం: కేంద్ర వర్గాలుపెట్రో ధరల పెంపునకు నిరసగా భారతీయ జనతా పార్టీ, వామపక్షాలతో సహా ఇతర ప్రతిపక్ష పార్టీలు ఇచ్చిన భారత్ బంద్ కారణంగా 13 వేల కోట్ల రూపాయల మేరకు నష్టం వాటిల్లినట్టు కేంద్ర వర్గాలు వెల్లడిస్తున్నాయి. పెట్రోల్, డీజల్, కిరోసిన్, వంటగ్యాస్ ధరలను పెంచుతూ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెల్సిందే.Source: Yahoo! Telugu: News | 6 Jul 2010 | 7:19 am లాభాల వైపు బాంబే స్టాక్ మార్కెట్ ర్యాలీ..!బాంబే స్టాక్ మార్కెట్ లాభాల వైపు ర్యాలీని కొనసాగిస్తోంది. మంగళవారం బాంబే స్టాక్ మార్కెట్ వృద్ధి బాటలో కొనసాగుతోంది. ట్రేడింగ్ ప్రారంభం నుంచే పురోగమనం వైపు ర్యాలీని కొనసాగించిన బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచి సెన్సెక్స్, ఉదయం 11.30 గంటల ప్రాంతంలో 88 పాయింట్ల మేర లాభపడింది. దీంతో సెన్సెక్స్, 17,529 పాయింట్ల మార్కును తాకింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచి నిఫ్టీ కూడా 27 పాయింట్లు వృద్ధి చెంది, 5,263 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.Source: Yahoo! Telugu: News | 6 Jul 2010 | 7:06 am ఉప ఎన్నికల సమరం: సరికొత్త ఎత్తుడగల్లో తెరాస!తెలంగాణ గడ్డపై జరుగనున్న 12 అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల పోరులో తెలంగాణ రాష్ట్ర సమితి సరికొత్త ఎత్తుడగను అనుసరించాలని భావిస్తోంది. ప్రధానంగా ఎన్నికల కోసం వాడే ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల స్థానంలో బ్యాలెట్ విధానంతో పోలింగ్ నిర్వహించాలని ఆ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇందుకోసం ఈవీఎంల వాడకాన్ని అడ్డుకునేందుకు ఆ పార్టీ నేతలు పలు వ్యూహాలు రచిస్తున్నారు. ఈ వ్యూహాల్లో తెరాస అధినేత కె.చంద్రశేఖర రావు తలమునకలై ఉన్నారు.Source: Yahoo! Telugu: News | 6 Jul 2010 | 7:01 am తాప్సీ "గుమ్మడి పండ్లు", "సొరకాయలు"దర్శకేంద్రుడు చిత్రం అంటే హీరోయిన్ బొడ్డుపై రకరకాల పండ్లు నాట్యం చేస్తాయి. ఝుమ్మంది నాదం చిత్రంలో ఢిల్లీ పిల్ల తాప్సీ బొడ్డుపైనా ద్రాక్ష గుత్తులు, ఇంకా రకరకాల పండ్లతో గిలిగింతలు పెట్టించాడు. తన శరీరంపై మంచు మనోజ్ రకరకాల పండ్లను దొర్లిస్తుంటే చక్కిలిగింత పుట్టి కడుపుబ్బ నవ్వేదాన్నని తాప్సీ తన సన్నిహితులతో చెపుతోందట. ఝుమ్మంది నాదం చిత్రంలో తనను చూసి మరో ముగ్గురు నిర్మాతలు తనకు అవకాశాలను ఇచ్చారని అంటోందట. ఏం చూసి ఇచ్చారో తెలుసా...? అని అంటూ.. ద్రాక్ష గుత్తులు, పూలరేకులకు మించి సొరకాయలు, గుమ్మడి పండ్లతో తాను ఇచ్చిన ఫోజులు ఎంతో బావున్నాయనీ, వాటికితోడు నటన కూడా బావుందని మెచ్చుకున్నారని చెపుతోందట తాప్సీ. ప్రత్యేకించి కాయలతో నటించిన సీన్లే బావున్నాయని మెచ్చుకుంటున్న తమిళ దర్శకులు తాప్సీతో ఇంకా ఎటువంటి కాయలతో నటింపచేస్తారో చూడాలి మరి...Source: Yahoo! Telugu: Entertainment | 6 Jul 2010 | 6:55 am సీమాంధ్ర ప్రజలతో ముందుకెళ్లలేం: తెలంగాణ కాంగ్రెస్సీమాంధ్ర ప్రజలు, రాజకీయ నేతలతో కలిసి ముందుకు వెళ్లలేమని తెలంగాణ కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడ్డారు. ఈ విషయాన్ని జస్టీస్ శ్రీకృష్ణ కమిటీకి వెల్లడించారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మినహా సమస్యకు మరో పరిష్కార మార్గం లేదని వారు తేల్చిచెప్పారు.Source: Yahoo! Telugu: News | 6 Jul 2010 | 6:37 am ఏసుక్రీస్తు జీవిత చరిత్ర నేపధ్యం చిత్రంలో పవన్ కల్యాణ్పవన్ కల్యాణ్ ఈ నెల 15న ఇజ్రాయిల్ వెళ్లబోతున్నారు. తను ముఖ్య భూమికను పోషిస్తున్న ఆదిత్య ప్రొడక్షన్స్ చిత్రం షూటింగ్‌కోసం ఆయన అక్కడికి వెళుతున్నారు. విజయేంద్రవర్మ వంటి కమర్షియల్ చిత్రాన్ని, "శ్రీరామదాసు"లాంటి భక్తిరసాత్మక చిత్రాన్ని అందించిన తర్వాత ఆదిత్య ప్రొడక్షన్స్ పతాకంపై కొండా కృష్ణంరాజు నిర్మిస్తున్న తాజా చిత్రంలో పవన్ కల్యాణ్ నటిస్తున్నారు. ఏసు ప్రభువు జీవిత చరిత్రను ఆధారంగా చేసుకుని రూపొందిస్తున్న ఈ చిత్రానికి సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర విశేషాలను నిర్మాత కొండా కృష్ణంరాజు ఆదివారం విలేకరులకు తెలియజేస్తూ... ఇజ్రాయెల్‌లోని ముఖ్యమైన ప్రదేశాల్లో ఈ చిత్రం షూటింగ్ చేయనున్నాం.Source: Yahoo! Telugu: Entertainment | 6 Jul 2010 | 6:00 am నిద్రావస్థలో ఉన్న యూపీఏను మేల్కొలిపాం: ఎల్కే.అద్వానీపెరిగిన ధరలతో దేశ ప్రజలు పడుతున్న కష్టాలను కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ సర్కారు దృష్టికి తీసుకెళ్ళడమే కాకుండా, నిద్రావస్థలో ఉన్న యూపీఏ పాలకుల కళ్లు తెరిపించామని భారతీయ జనతా పార్టీ అగ్రనేత ఎల్కే.అద్వానీ అన్నారు. భారత్ బంద్ వల్ల సాధించేమిటని కాంగ్రెస్ నేతలు వేసిన ప్రశ్నలపై ఆయన పైవిధంగా స్పందించారు.Source: జాతీయ | 6 Jul 2010 | 3:28 am ధిక్కరిస్తే కడప ఎంపీగా కూడా జగన్ ఉండడు: పాల్వాయిఅధిష్ఠానం చెప్పిన మాటను ఖాతరు చేయకుండా తన ఇష్టప్రకారం ఓదార్పు యాత్ర చేపడితే వైఎస్ జగన్ తీవ్రంగా నష్టపోతారని తెలంగాణా ప్రాంత కాంగ్రెస్ నాయకుడు పాల్వాయి గోవర్థన్ రెడ్డి అన్నారు. ఎన్ని చేసినా పార్టీకి లోబడి మాత్రమే ఉండాలన్నారు.Source: ఏపీ న్యూస్ | 6 Jul 2010 | 1:53 am భారత్ బంద్ కారణంగా రూ.13 వేల కోట్ల నష్టం: కేంద్ర వర్గాలుపెట్రో ధరల పెంపునకు నిరసగా భారతీయ జనతా పార్టీ, వామపక్షాలతో సహా ఇతర ప్రతిపక్ష పార్టీలు ఇచ్చిన భారత్ బంద్ కారణంగా 13 వేల కోట్ల రూపాయల మేరకు నష్టం వాటిల్లినట్టు కేంద్ర వర్గాలు వెల్లడిస్తున్నాయి. పెట్రోల్, డీజల్, కిరోసిన్, వంటగ్యాస్ ధరలను పెంచుతూ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెల్సిందే.Source: జాతీయ | 6 Jul 2010 | 1:50 am ఉప ఎన్నికల సమరం: సరికొత్త ఎత్తుడగల్లో తెరాస!తెలంగాణ గడ్డపై జరుగనున్న 12 అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల పోరులో తెలంగాణ రాష్ట్ర సమితి సరికొత్త ఎత్తుడగను అనుసరించాలని భావిస్తోంది. ప్రధానంగా ఎన్నికల కోసం వాడే ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల స్థానంలో బ్యాలెట్ విధానంతో పోలింగ్ నిర్వహించాలని ఆ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇందుకోసం ఈవీఎంల వాడకాన్ని అడ్డుకునేందుకు ఆ పార్టీ నేతలు పలు వ్యూహాలు రచిస్తున్నారు. ఈ వ్యూహాల్లో తెరాస అధినేత కె.చంద్రశేఖర రావు తలమునకలై ఉన్నారు.Source: ఏపీ న్యూస్ | 6 Jul 2010 | 1:33 am సీమాంధ్ర ప్రజలతో ముందుకెళ్లలేం: తెలంగాణ కాంగ్రెస్సీమాంధ్ర ప్రజలు, రాజకీయ నేతలతో కలిసి ముందుకు వెళ్లలేమని తెలంగాణ కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడ్డారు. ఈ విషయాన్ని జస్టీస్ శ్రీకృష్ణ కమిటీకి వెల్లడించారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మినహా సమస్యకు మరో పరిష్కార మార్గం లేదని వారు తేల్చిచెప్పారు.Source: ఏపీ న్యూస్ | 6 Jul 2010 | 1:08 am కాశ్మీర్‌లో మళ్లీ చెలరేగిన అల్లర్లు: ఇద్దరు యువకుల మృతిజమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో మళ్లీ అల్లర్లు చెలరేగాయి. ఆందోళనకారులపై పోలీసులు తుపాకీ కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో పరిస్థితి మరోమారు ఉద్రిక్తంగా మారింది.Source: జాతీయ | 6 Jul 2010 | 12:58 am సోనియా మౌనమే అంగీకారం: జగన్ అనుచర గణం!స్వర్గీయ ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి తనయుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన ఓదార్పు యాత్రకు పార్టీ అధినేత్రి సోనియా గాంధీ అనుమతి ఇచ్చి ఉంటారని జగన్ అనుచరులు అభిప్రాయపడున్నారు. అందువల్లే జగన్ ఓదార్పు యాత్రను ప్రారంభించాలనే నిర్ణయానికి వచ్చి ఉంటారని వారు అంటున్నారు.Source: ఏపీ న్యూస్ | 6 Jul 2010 | 12:22 am అన్నింటికీ సిద్ధపడే ముందుకు సాగుతున్నా: వైస్.జగన్కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డి అనుచరుల వద్ద మనస్సు విప్పి మాట్లాడినట్టు సమాచారం. ఇకపై ఓదార్పు యాత్రను వాయిదా వేయలేనని వారి వద్ద వాపోయినట్టు వినికిడి. పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో పాటు ఇతర నేతలు కూడా తాను చేపట్టిన యాత్రను ఓ నేరంగా చూడటం ఏమాత్రం జీర్ణించుకోలేక పోతున్నానని ఆవేదన వ్యక్తం చేసినట్టు జగన్ వర్గాలు చెపుతున్నాయి.Source: ఏపీ న్యూస్ | 5 Jul 2010 | 11:33 pm ఇన్ని శాఖల బాధ్యతలు నాకొద్దు: పీఎంకు పవార్ విన్నపం!కేంద్ర ఆహార, వ్యవసాయ, వినియోగదారుల వ్యవహారాల శాఖామంత్రి, నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ అధినేత, అంతర్జాతీయ క్రికెట్ మండలి అధ్యక్షుడు శరద్ పవార్ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్‌కు ఒక విజ్ఞప్తి చేశారు. సాధారణంగా తమకు అదనంగా మరిన్ని బాధ్యతలను కావాలని కోరుతుంటారు. అయితే, ఈ మరాఠా యోధుడు మాత్రం.. తనపై ఉంచిన భారాన్ని తగ్గించాలని కోరుతున్నారు.Source: జాతీయ | 5 Jul 2010 | 11:08 pm మావో సమస్య రూపుమాపేందుకు ఏడేళ్ల సమయం: పిళ్లైదేశ అంతర్గత భద్రతకు పెను ముప్పుగా మారిన నక్సల్స్ సమస్యను పూర్తిగా రూపుమాపేందుకు ఏడు సంవత్సరాల సమయం పడుతుందని కేంద్ర హోం శాఖామంత్రి జీకె.పిళ్లై అభిప్రాయపడ్డారు. ఇందుకోసం పక్కా ప్రణాళికలతో ముందుకు సాగితేనే ఇది సాధ్యమవుతుందని ఆయన అన్నారు.Source: జాతీయ | 5 Jul 2010 | 10:27 pm మర్యాద రామన్న ట్రెయిలర్సూపర్ సెన్సేషనల్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి, స్వరవాణి, ఎం.ఎం కీరవాణిల కాంబినేషన్‌లో వచ్చిన స్టూడెంట్ నెం.1, సింహాద్రి, సై, ఛత్రపతి, విక్రమార్కుడు, యమదొంగ, మగధీర చిత్రాలు బిగ్గెస్ట్ హిట్స్. ఇపుడు హాస్యనటుడు సునీల్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్‌పై ప్రసాద్ దేవినేని, శోభు యార్లగడ్డ నిర్మిస్తున్న మర్యాదరామన్న జూలైలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా నిర్మాతల్లో ఒకరైన శోభు యార్లగడ్డ మాట్లాడుతూ... మర్యాద రామన్న చిత్రంలో సునీల్ నటన విభిన్నంగా ఉంటుందని చెప్పారు.Source: Yahoo! Telugu: Entertainment | 5 Jul 2010 | 1:02 pm సోనియా గాంధీ మాట నేను వినను: వైఎస్ జగన్వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎట్టకేలకు కాంగ్రెస్ అధినాయత్వంపై తిరుగుబావుటా ఎగురవేశారు. తాను అనుకున్నట్లుగా జూలై 8 నుంచి ఓదార్పు యాత్రను కొనసాగిస్తున్నట్లు ఓ బహిరంగ లేఖ ద్వారా తెలియజేశారు.Source: ఏపీ న్యూస్ | 5 Jul 2010 | 9:41 am ఆ రానా ఎవరో నాకు తెలీదు.. ఇక లవ్ ఎక్కడ?:శ్రేయఇటీవల రానా - శ్రేయ ఇద్దరూ పీకల్లోతు ప్రేమలో కూరుక పోయారనీ, ఇద్దరూ హైదరాబాదులోని ఓ ఫైవ్ స్టార్ హోటల్‌లో పొద్దుపోయిన తర్వాత కూడా చర్చించుకుంటూ కనబడ్డారనీ టాలీవుడ్ తెగ గుసగుసలు పోయింది. ఇదే విషయంపై శ్రేయను కదిలిస్తే కళ్లు ఇంతంత లావు చేసింది. అసలు ఆ రానా ఎవరో తనకు తెలియదనీ, ఇంతవరకూ అతడిని చూడనే లేదని అంది. ఓ వ్యక్తిని చూడనపుడు అతడితో తిరగడమేంటీ...? అంతా నాన్సెన్స్. ఎవరో "గాలి" రాయుళ్లు కల్పించిన కట్టు కథలివన్నీ అని మండిపడింది. ప్రస్తుతం తాను షూటింగ్‌లతో బిజీగా ఉన్నాననీ, లండన్‌లో తన తాజా చిత్రం తాలూకు చిత్రీకరణ జరుగుతోందని చెప్పుకొచ్చింది. అయినా తాను ఇటువంటి గాసిప్స్‌ను పట్టించుకోనని చెప్పింది. ఏ పనీపాట లేనివారు, పొద్దుగడవనివారు ఇటువంటి రాతలు రాస్తుంటే మన పని ఆపుకుని వాటిని చూడటం శుద్ధ దండగ అని చెప్పింది సెక్సీ శ్రేయ.Source: Yahoo! Telugu: Entertainment | 5 Jul 2010 | 8:59 am ఎంత పొగరు.."మీ సర్వర్‌కు ఇంత పొగరు పనికిరాదండి" కోపంగా అన్నాడు రావు."ఏం చేశాడండి?" అడిగాడు మేనేజర్."నేను గవర్నమెంటు ఆఫీసులో పని చేస్తున్నానని తెలుసుకుని బిల్లును..Source: వినోదం | 5 Jul 2010 | 7:39 am పెళ్ళి చేసుకున్నాను...ఏం తప్పు చేశావు, రోజూ కాళ్ళకి దణ్ణం పెడుతున్నావు అడిగాడు భర్త.మిమ్మల్ని పెళ్ళి చేసుకున్నాను కదండీ అంది భార్య.Source: వినోదం | 5 Jul 2010 | 7:37 am ఉప ఎన్నికల పోరు: తెదేపా అభ్యర్థుల జాబితా వెల్లడితెలంగాణలో జరుగనున్న ఉప ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను తెలుగుదేశం పార్టీ సోమవారం విడుదల చేసింది. మొత్తం 12 సీట్లకు గాను తొమ్మిది స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను వెల్లడించింది. ఆభ్యర్థుల వివరాలు ఇలా ఉన్నాయి.Source: ఏపీ న్యూస్ | 5 Jul 2010 | 7:26 am గుంటూరులో ముగ్గురు వ్యక్తుల కాల్పులు: ఒకరి మృతిగుంటూరులోని ఫిరంగిపురం మాజీ జడ్పీటీసి సభ్యురాలి భర్త పాలపాటి సత్యనారాయణపై ముగ్గురు గుర్తు తెలియని దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో సత్యనారాయణ అక్కడికక్కడే మృతి చెందారు.Source: ఏపీ న్యూస్ | 5 Jul 2010 | 6:49 am ఉప ఎన్నికల పోరు: కేసీఆర్-కేటీఆర్‌కు ముచ్చెమటలుతెలంగాణ గడ్డపై ఉప ఎన్నికల సందడి ఊపందుకుంది. తెలంగాణ రాష్ట్ర సమితి తరపున రాజీనామా చేసిన అభ్యర్థులనే బరిలోకి దించనుంది. అధికార కాంగ్రెస్ పార్టీ కూడా 12 సీట్లకు గాను ఎనిమిది స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. అలాగే, తెదేపా కూడా అభ్యర్థులను ఖరారు చేసినప్పటికీ అధికారికంగా ప్రకటించాల్సి వుంది.Source: ఏపీ న్యూస్ | 5 Jul 2010 | 6:09 am మోహన్ బాబుతో ఆడుకున్న హాస్యనటుడు అలీఅవునండీ.. ఇది పచ్చి నిజం. మోహన్ బాబే అందరితో ఆటలాడుకుంటారు. సెటైర్లు, విసుర్లు వేస్తూ తనదే పైచేయిగా ఉండాలనుకుంటాడు. అలాంటి మోహన్ బాబుతో అలీ ఆడుకున్నాడు. కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన "ఝుమ్మంది నాదం"లో అలీ ఎస్ఐ రంజిత్ కుమార్‌గా నటించాడు. పోలీసు జీపును మోహన్ బాబు కారు ఢీకొనే సన్నివేశంలో.. "హలో దోస్త్.." అని మోహన్ బాబు అంటాడు. వెంటనే అలీ అందుకుని "దోస్త్.. ఏంట్రా.." అంటూ సంబోధిస్తాడు. దీంతో మోహన్ బాబు " నన్నే రా..." అంటావా అంటూ గొడవపడ్డాడు. దానికి అలీ.. ఇది "నేను అన్నది కాదు. దర్శకేంద్రుడు అనమంటే అన్నాను. మీకిష్టం లేకపోతే చెప్పండి. నేను షూటింగ్ మానేసి వెళ్లిపోతా" అని ఝలక్ ఇచ్చాడు. దీంతో మోహన్ బాబు చేసేది లేక.. ఆ సీన్‌ను మోనిటర్‌లో చూశాడట. ఆ తర్వాత సరే.. కానీ అంటూ సర్దుకున్నాడు. ఈ తతంగం చూసిన అక్కడి వారంతా లోలోపల బాగా ఎంజాయ్ చేశారట. అలాగే మంచు మనోజ్ చేత... మోహన్ బాబును తిట్టే సందర్భాలు ఉన్నాయి. అవన్నీ దర్శకేంద్రుడే కావాలని పెట్టాడని సమాచారం. ఇది తెలిసిన యూనిట్.. మోహన్ బాబుతో భలేగా ఆడుకున్నారు అని నవ్వుకున్నారటSource: Yahoo! Telugu: Entertainment | 5 Jul 2010 | 5:34 am ప్రభుత్వం నాకు క్షమాపణ చెప్పాలి: విజయశాంతివివాదాస్పద వ్యాఖ్యలకు పాల్పడి అరెస్టయిన తెరాస ఎంపీ విజయశాంతి సోమవారం ఎన్నికల ప్రధానాధికారి ఐవీ సుబ్బారావుతో సమావేశమయ్యారు. వివరాలను చెప్పమన్నప్పుడు... తాను ఈసీని మర్యాదపూర్వకంగానే కలిసినట్లు వెల్లడించారు.Source: ఏపీ న్యూస్ | 5 Jul 2010 | 5:30 am పూణే పేలుళ్ళలో కొన్ని ఆధారాలు సేకరణ: మంత్రి పాటిల్పూణేలోని జర్మన్ బేకరీ వద్ద జరిగిన బాంబు పేలుళ్ళ కేసులో దర్యాప్తు సంస్థలు కొన్ని ఆధారాలను సేకరించాయని మహారాష్ట్ర హోం మంత్రి ఆర్.ఆర్.పాటిల్ తెలిపారు. అదేసమయంలో ఈ కేసు దర్యాప్తు నత్తనడకన సాగుతుందని ఆయన అంగీకరించారు. దీనిపై ఆయన సోమవారం పూణేలో మాట్లాడుతూ ఈ నేరం వెనుక సంబంధం ఉన్న వారి వివరాలకు సంబంధించి కొన్ని ఆధారాలను లభ్యమయ్యాయని చెప్పారు. దీనిపై మరింత లోతుగా వివరణ ఇచ్చేందుకు ఆయన నిరాకరించారు.Source: జాతీయ | 5 Jul 2010 | 5:00 am దేశ వ్యాప్తంగా సాగుతున్న భారత్ బంద్: నేతల అరెస్టుపెట్రో ధరల పెంపునకు నిరసనగా భారతీయ జనతా పార్టీతో సహా ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ఇచ్చిన దేశ వ్యాప్త బంద్ ప్రశాంతంగా సాగుతోంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రాజధాని లక్నోలో మాత్రం ఆందోళనకారులు అసెంబ్లీ వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. వీరిని అదుపు చేసేందుకు పోలీసులు వాటర్ క్యాన్లను ప్రయోగించడమే కాకుండా లాఠీఛార్జ్ చేశారు. దీంతో ఇక్కడ ఉద్రిక్తత నెలకొంది.Source: జాతీయ | 5 Jul 2010 | 3:39 am ఆ రానా ఎవరో నాకు తెలీదు.. ఇక లవ్ ఎక్కడ?:శ్రేయఇటీవల రానా - శ్రేయ ఇద్దరూ పీకల్లోతు ప్రేమలో కూరుక పోయారనీ, ఇద్దరూ హైదరాబాదులోని ఓ ఫైవ్ స్టార్ హోటల్‌లో పొద్దుపోయిన తర్వాత కూడా చర్చించుకుంటూ కనబడ్డారనీ టాలీవుడ్ తెగ గుసగుసలు పోయింది. ఇదే విషయంపై శ్రేయను కదిలిస్తే కళ్లు ఇంతంత లావు చేసింది. అసలు ఆ రానా ఎవరో తనకు తెలియదనీ, ఇంతవరకూ...Source: వినోదం | 5 Jul 2010 | 3:31 am
|