ఆశాజనకంగా ట్రేడింగ్: సెన్సెక్స్, నిఫ్టీల వృద్ధి!

దేశీయ వాటాల ట్రేడింగ్ వృద్ధి చెందడంతో బాంబే స్టాక్ మార్కెట్ లాభాలను నమోదు చేసుకుంటోంది. ట్రేడింగ్ ప్రారంభంలో నష్టాలను చవిచూసిన బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచి సెన్సెక్స్, మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో కేవలం పది పాయింట్ల స్వల్పంగా లాభపడింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచి నిఫ్టీ కూడా కేవలం రెండు పాయింట్లు వృద్ధి చెంది, 5,239 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.
Source: Yahoo! Telugu: News | 5 Jul 2010 | 9:25 am

స్వల్ప లాభాల్లో బాంబే స్టాక్ మార్కెట్ ర్యాలీ!

బాంబే స్టాక్ మార్కెట్ స్వల్ప లాభాల వైపు ర్యాలీని కొనసాగిస్తోంది. ట్రేడింగ్ ప్రారంభంలో తిరోగమనం వైపు పయనించిన బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచి సెన్సెక్స్, కొద్దిసేపటికి లాభాలతో కోలుకుంది.ఫలితంగా సెన్సెక్స్ మధ్యాహ్నం 12.15 గంటల ప్రాంతంలో 31 పాయింట్లు బలపడి, 17,492 పాయింట్ల మార్కును తాకింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచి నిఫ్టీ కూడా 11 పాయింట్ల స్వల్ప వృద్ధితో 5,248 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.
Source: Yahoo! Telugu: News | 5 Jul 2010 | 9:14 am

దేశ వ్యాప్తంగా సాగుతున్న భారత్ బంద్: నేతల అరెస్టు

పెట్రో ధరల పెంపునకు నిరసనగా భారతీయ జనతా పార్టీతో సహా ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ఇచ్చిన దేశ వ్యాప్త బంద్ ప్రశాంతంగా సాగుతోంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రాజధాని లక్నోలో మాత్రం ఆందోళనకారులు అసెంబ్లీ వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. వీరిని అదుపు చేసేందుకు పోలీసులు వాటర్ క్యాన్లను ప్రయోగించడమే కాకుండా లాఠీఛార్జ్ చేశారు. దీంతో ఇక్కడ ఉద్రిక్తత నెలకొంది.
Source: Yahoo! Telugu: News | 5 Jul 2010 | 9:09 am

ఆ రానా ఎవరో నాకు తెలీదు.. ఇక లవ్ ఎక్కడ?:శ్రేయ

ఇటీవల రానా - శ్రేయ ఇద్దరూ పీకల్లోతు ప్రేమలో కూరుక పోయారనీ, ఇద్దరూ హైదరాబాదులోని ఓ ఫైవ్ స్టార్ హోటల్‌లో పొద్దుపోయిన తర్వాత కూడా చర్చించుకుంటూ కనబడ్డారనీ టాలీవుడ్ తెగ గుసగుసలు పోయింది. ఇదే విషయంపై శ్రేయను కదిలిస్తే కళ్లు ఇంతంత లావు చేసింది. అసలు ఆ రానా ఎవరో తనకు తెలియదనీ, ఇంతవరకూ అతడిని చూడనే లేదని అంది. ఓ వ్యక్తిని చూడనపుడు అతడితో తిరగడమేంటీ...? అంతా నాన్సెన్స్. ఎవరో "గాలి" రాయుళ్లు కల్పించిన కట్టు కథలివన్నీ అని మండిపడింది. ప్రస్తుతం తాను షూటింగ్‌లతో బిజీగా ఉన్నాననీ, లండన్‌లో తన తాజా చిత్రం తాలూకు చిత్రీకరణ జరుగుతోందని చెప్పుకొచ్చింది. అయినా తాను ఇటువంటి గాసిప్స్‌ను పట్టించుకోనని చెప్పింది. ఏ పనీపాట లేనివారు, పొద్దుగడవనివారు ఇటువంటి రాతలు రాస్తుంటే మన పని ఆపుకుని వాటిని చూడటం శుద్ధ దండగ అని చెప్పింది సెక్సీ శ్రేయ.
Source: Yahoo! Telugu: Entertainment | 5 Jul 2010 | 8:59 am

అమెరికాలో భారత వస్త్ర పరిశ్రమకు గడ్డుకాలం

భారతదేశ వస్త్ర పరిశ్రమ ఎగుమతిదారులకు అమెరికా మార్కెట్లో గట్టి పోటీ ఎదురవనుందని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ) నిర్వహించిన ఒకసర్వేలో వెల్లడైంది. ప్రధానంగా బంగ్లాదేశ్ వంటి చిన్నచిన్న దేశాలు భారతదేశ వస్త్ర పరిశ్రమకు గట్టి పోటీని ఇస్తుండటం గమనార్హం.
Source: Yahoo! Telugu: News | 5 Jul 2010 | 8:53 am

అసలే తెలంగాణ సెంటిమెంట్.. అయినా కనిపించని ఐక్యత

కాంగ్రెస్ పార్టీ గ్రూపు రాజకీయ సంస్కృతికి పెట్టింది పేరని మరోమారు రుజువైంది. తెలంగాణ ప్రాంతంలో జరుగనున్న ఉప ఎన్నికల కోసం 12 సీట్లకుగాను ఎనిమిది స్థానాలకు కాంగ్రెస్ హైకమాండ్ అభ్యర్థులను ప్రకటించింది. అలా ప్రకటించిన కొద్ది సేపటికే టిక్కెట్ ఆశిస్తున్నవారు, తమ వర్గం నేతకు సీటు రాని నేతలు భగ్గుమన్నారు.
Source: Yahoo! Telugu: News | 5 Jul 2010 | 8:01 am

ప్రజలను పీడిస్తే తగిన శాస్తి జరుగుతుంది: చంద్రబాబు

తమను ఎదిరించేవారెవరూ లేరనీ, చేతిలో అధికారం ఉన్నది కదా అని పన్నులు వేస్తూ ప్రజలను పీడిస్తే పాలకులకు తగిన శాస్తి జరుగుతుందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. పెట్రో ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా జరుగుతున్న భారత్ బంద్‌లో పాల్గొన్న ఆయన రోడ్డుపై బైఠాయించి తమ నిరసనను తెలిపారు.
Source: Yahoo! Telugu: News | 5 Jul 2010 | 7:52 am

అభ్యర్థిని మార్చకుంటే డిపాజిట్ దక్కనీయం: నేతలు

అదిలాబాద్ జిల్లా సిర్పూరు స్థానంలో పోటీ చేసే మాజీ ఎంపీ ఇంద్రకరణ్ రెడ్డిని మార్చకుంటే ఉప ఎన్నికల్లో డిపాజిట్ కూడా దక్కనీయమని ఆ స్థానం కాంగ్రెస్ నేతలు హెచ్చరించారు. ఈ మేరకు వారు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ ధర్మపురి శ్రీనివాస్‌ను సోమవారం కలిసి తమ అభిప్రాయాన్ని వెల్లడించారు.
Source: Yahoo! Telugu: News | 5 Jul 2010 | 7:52 am

రాయలవారు జనరంజకమైన నాయకుడు: రోశయ్య

శ్రీకృష్ణ దేవరాయలు పంచ శతాబ్ది ఉత్సవాలు సోమవారం హైదరాబాదులోని రవీంద్రభారతిలో ప్రారంభమయ్యాయి. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రోశయ్య మాట్లాడుతూ... చరిత్రలో ఎందరో రాజులు పాలించారనీ, అయితే జనరంజక పాలనను అందించిన రాజులు మాత్రమే ప్రజల మనసులను గెలుచుకుని రారాజులుగా వెలుగొందుతారన్నారు.
Source: Yahoo! Telugu: News | 5 Jul 2010 | 7:20 am

లాభాల్లో స్టాక్ మార్కెట్: సెన్సెక్స్, నిఫ్టీల వృద్ధి!

బాంబే స్టాక్ మార్కెట్ లాభాల బాటలో కొనసాగుతోంది. ట్రేడింగ్ ప్రారంభంలో నష్టాలను చవిచూసిన బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచి సెన్సెక్స్, ఉదయం 11.30 గంటల ప్రాంతంలో 27 పాయింట్లు లాభపడింది. ఫలితంగా సెన్సెక్స్, 17,488 పాయింట్స మార్కును తాకింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచి నిఫ్టీ కూడా తొమ్మిది పాయింట్ల స్వల్ప వృద్ధితో 5,246 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.
Source: Yahoo! Telugu: News | 5 Jul 2010 | 7:18 am

రష్యా-అమెరికా సంబంధాలు దెబ్బతినవు: మెద్వదేవ్

ఇటీవల చోటు చేసుకున్న పరిణామాల వల్ల రష్యా-అమెరికా సంబంధాలకు ఏమాత్రం విఘాతం కలుగబోదని రష్యా అధ్యక్షుడు ద్మిట్రీ మెద్వదేవ్ అన్నారు. అమెరికా స్వాతంత్ర్య (జులై 4) దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆ దేశ అధ్యక్షుడు బరాక్ ఒబామాను అభినందిస్తూ మెద్వదేవ్ ఒక లేఖ రాశారు.
Source: Yahoo! Telugu: News | 5 Jul 2010 | 7:10 am

మోహన్ బాబుతో ఆడుకున్న హాస్యనటుడు అలీ

అవునండీ.. ఇది పచ్చి నిజం. మోహన్ బాబే అందరితో ఆటలాడుకుంటారు. సెటైర్లు, విసుర్లు వేస్తూ తనదే పైచేయిగా ఉండాలనుకుంటాడు. అలాంటి మోహన్ బాబుతో అలీ ఆడుకున్నాడు. కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన "ఝుమ్మంది నాదం"లో అలీ ఎస్ఐ రంజిత్ కుమార్‌గా నటించాడు. పోలీసు జీపును మోహన్ బాబు కారు ఢీకొనే సన్నివేశంలో.. "హలో దోస్త్.." అని మోహన్ బాబు అంటాడు. వెంటనే అలీ అందుకుని "దోస్త్.. ఏంట్రా.." అంటూ సంబోధిస్తాడు. దీంతో మోహన్ బాబు " నన్నే రా..." అంటావా అంటూ గొడవపడ్డాడు. దానికి అలీ.. ఇది "నేను అన్నది కాదు. దర్శకేంద్రుడు అనమంటే అన్నాను. మీకిష్టం లేకపోతే చెప్పండి. నేను షూటింగ్ మానేసి వెళ్లిపోతా" అని ఝలక్ ఇచ్చాడు. దీంతో మోహన్ బాబు చేసేది లేక.. ఆ సీన్‌ను మోనిటర్‌లో చూశాడట. ఆ తర్వాత సరే.. కానీ అంటూ సర్దుకున్నాడు. ఈ తతంగం చూసిన అక్కడి వారంతా లోలోపల బాగా ఎంజాయ్ చేశారట. అలాగే మంచు మనోజ్ చేత... మోహన్ బాబును తిట్టే సందర్భాలు ఉన్నాయి. అవన్నీ దర్శకేంద్రుడే కావాలని పెట్టాడని సమాచారం. ఇది తెలిసిన యూనిట్.. మోహన్ బాబుతో భలేగా ఆడుకున్నారు అని నవ్వుకున్నారట
Source: Yahoo! Telugu: Entertainment | 5 Jul 2010 | 5:34 am

దేశ వ్యాప్తంగా సాగుతున్న భారత్ బంద్: నేతల అరెస్టు

పెట్రో ధరల పెంపునకు నిరసనగా భారతీయ జనతా పార్టీతో సహా ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ఇచ్చిన దేశ వ్యాప్త బంద్ ప్రశాంతంగా సాగుతోంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రాజధాని లక్నోలో మాత్రం ఆందోళనకారులు అసెంబ్లీ వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. వీరిని అదుపు చేసేందుకు పోలీసులు వాటర్ క్యాన్లను ప్రయోగించడమే కాకుండా లాఠీఛార్జ్ చేశారు. దీంతో ఇక్కడ ఉద్రిక్తత నెలకొంది.
Source: జాతీయ | 5 Jul 2010 | 3:39 am

అభ్యర్థిని మార్చకుంటే డిపాజిట్ దక్కనీయం: నేతలు

అదిలాబాద్ జిల్లా సిర్పూరు స్థానంలో పోటీ చేసే మాజీ ఎంపీ ఇంద్రకరణ్ రెడ్డిని మార్చకుంటే ఉప ఎన్నికల్లో డిపాజిట్ కూడా దక్కనీయమని ఆ స్థానం కాంగ్రెస్ నేతలు హెచ్చరించారు. ఈ మేరకు వారు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ ధర్మపురి శ్రీనివాస్‌ను సోమవారం కలిసి తమ అభిప్రాయాన్ని వెల్లడించారు.
Source: ఏపీ న్యూస్ | 5 Jul 2010 | 2:33 am

ప్రజలను పీడిస్తే తగిన శాస్తి జరుగుతుంది: చంద్రబాబు

తమను ఎదిరించేవారెవరూ లేరనీ, చేతిలో అధికారం ఉన్నది కదా అని పన్నులు వేస్తూ ప్రజలను పీడిస్తే పాలకులకు తగిన శాస్తి జరుగుతుందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. పెట్రో ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా జరుగుతున్న భారత్ బంద్‌లో పాల్గొన్న ఆయన రోడ్డుపై బైఠాయించి తమ నిరసనను తెలిపారు.
Source: ఏపీ న్యూస్ | 5 Jul 2010 | 2:24 am

రాయలవారు జనరంజకమైన నాయకుడు: రోశయ్య

శ్రీకృష్ణ దేవరాయలు పంచ శతాబ్ది ఉత్సవాలు సోమవారం హైదరాబాదులోని రవీంద్రభారతిలో ప్రారంభమయ్యాయి. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రోశయ్య మాట్లాడుతూ... చరిత్రలో ఎందరో రాజులు పాలించారనీ, అయితే జనరంజక పాలనను అందించిన రాజులు మాత్రమే ప్రజల మనసులను గెలుచుకుని రారాజులుగా వెలుగొందుతారన్నారు.
Source: ఏపీ న్యూస్ | 5 Jul 2010 | 1:50 am

ఘనంగా ప్రారంభమైన రాయల పంచ శతాబ్ది ఉత్సవాలు

శ్రీకృష్ణ దేవరాయల పంచశతాబ్ది ఉత్సవాలు భారత రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ చేతుల మీదుగా హైదరాబాదులోని రవీంద్ర భారతిలో అత్యంత ఘనంగా ప్రారంభమయ్యాయి. తెలుగుజాతికి, భాషకు రాయలవారు చేసిన సేవలకు గుర్తుగా, ఆయన పట్టాభిషిక్తులై 500 ఏళ్లు గడిచిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం రాయల పంచ శతాబ్ది ఉత్సవాలను నిర్వహిస్తోంది.
Source: ఏపీ న్యూస్ | 5 Jul 2010 | 1:26 am

కర్ఫ్యూ నీడలో కాశ్మీర్: ఆంక్షలు మరింత కఠినతరం

భూతలస్వర్గం కాశ్మీర్ లోయలో కర్ఫ్యూ కొనసాగుతోంది. దీనికితోడు కర్ఫ్యూ బాధిత ప్రాంతాల్లో అమలులో ఉన్న ఆంక్షలను మరింత కఠినతరం చేశారు. అనంతనాగ్‌కు వేర్పాటువాదులు తలపెట్టిన ర్యాలీని అడ్డుకునేందుకు వీలుగా ఈ ఆంక్షలను విధించారు.
Source: జాతీయ | 5 Jul 2010 | 1:22 am

ముంబై యువతి ఇష్రాత్ జాహన్ ఫిదాయిదానే: హెడ్లీ

ముంబైకు చెందిన ఇష్రాత్ జాహన్ ఫిదాయిదానే అని లష్కర్ తోయిబా తీవ్రవాది డేవిడ్ హెడ్లీ వెల్లడించారు. 2004లో గుజరాత్ రాష్ట్రంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇష్రాత్‌తో సహా మరో ముగ్గురు మరణించిన విషయం తెల్సిందే. ఇందులో ఇష్రాత్ లష్కర్ తోయిదా ఫిదాయిదా అని హెడ్లీ ప్రకటించడం గమనార్హం.
Source: జాతీయ | 5 Jul 2010 | 12:32 am

కోమాలో ప్రముఖ హాస్యనటుడు సుధాకర్..!

ప్రముఖ హాస్యనటుడు సుధాకర్ కోమాలో ఉన్నారు. తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన సుధాకర్‌ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. హైదరాబాద్‌లో బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రిలో సుధాకర్‌కు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. వెంటిలేటర్‌పై వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఇంకా అపస్మారక స్థితి (కోమా)లో ఉన్న ఆయన ఆరోగ్య పరిస్థితిపై 48 గంటల దాటితేగాని తామేమీ చెప్పలేమని వైద్యులు తెలిపారు.
Source: ఏపీ న్యూస్ | 5 Jul 2010 | 12:26 am

ముందు జాగ్రత్తగా జి.కిషన్ రెడ్డి గృహనిర్బంధం!

ధరల పెరుగుదలకు నిరసనగా భారతీయ జనతా పార్టీ ఇచ్చిన భారత్‌ బంద్‌లో పాల్గొనకుండా ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డిని హైదరాబాద్ నగర పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ చర్య చేపట్టినట్టు నగర పోలీసులు వెల్లడించారు. కిషన్ రెడ్డి ఇంటి నుంచి బయటకు రాకుండా 15 మంది సాయుధ పోలీసులు పహారా కాస్తున్నారు.
Source: ఏపీ న్యూస్ | 4 Jul 2010 | 11:54 pm

భారత్‌ బంద్‌తో ధరలు తగ్గవు: మంత్రి ప్రణబ్ ముఖర్జీ

ప్రతిపక్షాలు ఇచ్చిన భారత్ బంద్‌తో ధరలు తగ్గవని కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ స్పష్టం చేశారు. అదేసమయంలో పెంచిన పెట్రోల్ ధరలను తగ్గించే ప్రసక్తే లేదని కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ తేల్చి చెప్పింది. పెరిగిన నిత్యావసర ధరలు, ఇంధన ధరల పెంపుదలకు నిరసనగా సోమవారం దేశవ్యాప్త సమ్మెను ప్రతిపక్షాలు చేపట్టాయి. దీనిపై ప్రభుత్వం స్పందించింది. ఇంధన ధరల పెంపు చర్యను సమర్థించుకుంది. ఇలాంటి సమస్యలకు సమ్మెలు పరిష్కారం కావన్నారు. భారత్ బంద్‌ల వల్ల ప్రజలకు మరిన్ని కష్టాలు ఎదురవుతాయని పేర్కొంది.
Source: జాతీయ | 4 Jul 2010 | 10:28 pm

సాగుతున్న భారత్ బంద్: స్తంభించిన పౌర జీవనం

ధరల పెరుగుదలను నియంత్రించడంలో కేంద్రంలోని యూపీఏ సంకీర్ణ సర్కారు పూర్తిగా వైఫల్యం చెందడానికి నిరసనగా భారతీయ జనతా పార్టీతో సహా ప్రధాన ప్రతిపక్ష పార్టీలన్నీ సోమవారం దేశ వ్యాప్త బంద్‌ను పాటిస్తున్నాయి. ఈ బంద్‌ సందర్భంగా జనజీవనం స్తంభించి పోగా, వాహనరాకపోలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ బంద్‌ను భాజపా నేతృత్వంలోని ఎన్డీయేతో పాటు.. వామపక్షాలు, తెదేపా, అన్నాడీఎంకేలు పిలుపునిచ్చాయి. అయితే, ఆర్‌జెడీ, ఎస్‌పి, ఎల్‌జెపి, కొన్ని చిన్న పార్టీలు ఈ సమ్మెలో పాల్గొనడం లేదు.
Source: జాతీయ | 4 Jul 2010 | 10:19 pm

మావోయిస్టు నేత కామ్రేడ్ ఆజాద్‌కు కన్నీటి వీడ్కోలు

అదిలాబాద్ జిల్లా అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ప్రాణాలు కోల్పోయిన మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, అధికార ప్రతినిధి చెరుకూరి రాజ్‌కుమార్ అలియాస్ ఆజాద్ అంత్యక్రియలు ఆదివారం కన్నీటి వీడ్కోలు మధ్య ముగిశాయి. ఆజాద్‌కు అభిమానులు, ప్రజాసంఘాలు, విప్లవ సంఘాలు కన్నీటి వీడ్కోలు పలికారు.
Source: ఏపీ న్యూస్ | 4 Jul 2010 | 6:01 am

అధిష్టానంపై తిరుగుబాటు.. ఓదార్పుకే జగన్ మొగ్గు!

కాంగ్రెస్ పార్టీ హైకమాండ్‌ను ధిక్కరించాలని కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డి నిర్ణయించుకున్నారు. ఈనెల ఎనిమిదో తేదీ నుంచి తాను తలపెట్టిన ఓదార్పు యాత్రకు అధిష్టానం అనుమతి ఇచ్చే సూచనలు కనిపించడం లేదు. దీంతో ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం.. తాను యాత్రను చేపట్టాలనే కృత నిశ్చయంతో ఉన్నారు.
Source: ఏపీ న్యూస్ | 4 Jul 2010 | 5:54 am

ఉప ఎన్నికల పోరు: అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్

తెలంగాణ ప్రాంతంలో జరిగే 12 అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను కాంగ్రెస్ హైకమాండ్ ఆదివారం ప్రకటించింది. మొత్తం 12 సీట్లకు గాను ఎనిమిది చోట్ల పోటీ చేసే అభ్యర్థుల పేర్లను మాత్రమే వెల్లడించింది. మిగిలిన నాలుగు స్థానాల అభ్యర్థుల ఎంపికపై ఇంకా కసరత్తు జరుగుతోంది.
Source: జాతీయ | 4 Jul 2010 | 5:46 am

7న భారత్ బంద్‌కు పిలునిచ్చిన మావోయిస్టులు

మాయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు చెరుకూరి రాజ్‌కుమార్ అలియాస్ ఆజాద్ హత్యకు నిరసనగా సీపీఎం మావోయిస్టు పార్టీ ఈనెల 7వ తేదీ నుంచి 48 గంటల భారత్ బంద్‌కు పిలుపనిచ్చింది. ఆజాద్ హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామని ఆ పార్టీ ఆదివారం ప్రటించింది.
Source: జాతీయ | 4 Jul 2010 | 5:37 am

మధ్యప్రదేశ్ సీఎంపై విచారణ జరుపుతాం: లోకాయుక్త

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌పై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ జరుపుతామని ఆ రాష్ట్ర లోకాయుక్త ప్రకటించింది. వీటిపై విచారణ జరిపేందుకు లోకాయుక్త మెతకవైఖరి అనుసరిస్తుందని వచ్చిన ఆరోపణలపై లోకాయుక్త జస్టీస్ పీపీ.నావలేకర్ తోసిపుచ్చారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రితో పాటు ఆయన మంత్రివర్గంలోని ఎనిమిది సభ్యులపై భారీ కొనుగోళ్లకు సంబంధించి అవినీతి ఆరోపణలు వచ్చాయి. దీనిపై జస్టీస్ నావలేకర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రితో పాటు ఆయన మంత్రివర్గంలోని ఎనిమిది మంది సహచరులపై విచారణ జరుపుతామన్నారు.
Source: జాతీయ | 4 Jul 2010 | 2:36 am