|
2015కు 1.39 బిలియన్లకు చేరనున్న చైనా జనాభాపొరుగున ఉన్న చైనా జనాభా రోజురోజుకూ పెరిగిపోతోంది వచ్చే 2015 సంవత్సరానికి ఈ దేశ జనాభా 1.39 బిలియన్లకు చేరుకోనుంది. గ్రామీణ ప్రాంత ప్రజల కంటే పట్టణ ప్రాంత జనాభా సంఖ్య 700 మిలియన్ల ఎక్కువగా పెరగనుంది. ఇంత భారీ సంఖ్యలో పట్టణ ప్రాంత జనాభా పెరగడం దేశంలో ఇదే తొలిసారి కావడం గమనార్హం.Source: Yahoo! Telugu: News | 4 Jul 2010 | 9:44 am సద్దా హుస్సేన్ అనుచరునికి కువైట్ పౌరసత్వంఇరాక్ దివంగత మాజీ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్‌కు గూఢచారి (స్పై)గా పని చేసినట్టు భావిస్తున్నా కీలక అనుచరునికి కువైట్ పౌరసత్వం లభించింది. ఆయనతో పాటు.. ఆయన కుటుంబ సభ్యులకు కూడా ఈ పౌరసత్వాన్ని కువైట్ ప్రభుత్వం కల్పించింది.Source: Yahoo! Telugu: News | 4 Jul 2010 | 8:55 am మధ్యప్రదేశ్ సీఎంపై విచారణ జరుపుతాం: లోకాయుక్తమధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌పై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ జరుపుతామని ఆ రాష్ట్ర లోకాయుక్త ప్రకటించింది. వీటిపై విచారణ జరిపేందుకు లోకాయుక్త మెతకవైఖరి అనుసరిస్తుందని వచ్చిన ఆరోపణలపై లోకాయుక్త జస్టీస్ పీపీ.నావలేకర్ తోసిపుచ్చారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రితో పాటు ఆయన మంత్రివర్గంలోని ఎనిమిది సభ్యులపై భారీ కొనుగోళ్లకు సంబంధించి అవినీతి ఆరోపణలు వచ్చాయి. దీనిపై జస్టీస్ నావలేకర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రితో పాటు ఆయన మంత్రివర్గంలోని ఎనిమిది మంది సహచరులపై విచారణ జరుపుతామన్నారు.Source: Yahoo! Telugu: News | 4 Jul 2010 | 8:05 am భారత్ మాకు సహజ భాగస్వామి: ఆప్ఘనిస్థాన్ మంత్రితమ దేశంలో ఖనిజ నిల్వలు పుష్కలంగా ఉన్నాయని ఆప్ఘనిస్థాన్ గనుల శాఖామంత్రి వహీదుల్లా షహ్రాని అన్నారు. ఈ వనరుల అవకాశాన్ని అందిపుచ్చుకునేందుకు ప్రపంచ దేశాలు ఆసక్తి చూపుతున్నాయన్నారు. ఈ అవకాశాలను అందిపుచ్చుకునేందుకు తాము కూడా సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. అయితే, ఇలాంటి దేశాల్లో భారత్ అగ్రస్థానంలో ఉందన్నారు. ఎందుకంటే.. భారత్ తమకు సహజ మిత్రదేశమన్నారు.Source: Yahoo! Telugu: News | 4 Jul 2010 | 7:54 am ఈ యేడాది పదివేల మంది నియామకం: ఎల్ఐసీదేశంలో అతిపెద్ద ప్రభుత్వ బీమా రంగ సంస్థగా గుర్తింపు పొందిన భారత బీమా సంస్థ (ఎల్ఐసీ) ఈ యేడాది పది వేల మంది ఉద్యోగస్తులను నియమించనుంది. ఈ విషయాన్ని ఎల్ఐసీ మేనేజింగ్ డైరక్టర్ ఏకే.దాస్‌గుప్తా పీటీఐ వార్తా సంస్థతో అన్నారు. వివిధ శాఖల్లో దేశ వ్యాప్తంగా పది వేల మందిని నియమించాలని భావిస్తున్నట్టు ఆయన తెలిపారు.Source: Yahoo! Telugu: News | 4 Jul 2010 | 7:27 am పాకిస్థాన్ వైమానికి దాడుల్లో 20 మంది దుర్మరణంవాయువ్య పాకిస్థాన్, ఒరక్జాయ్ గిరిజన ప్రాంతాల్లోని తీవ్రవాద స్థావరాలపై జరిగిన వైమానిక దాడుల్లో 20 మంది దుర్మరణం పాలయ్యారు. ఆప్ఘనిస్థాన్ సరిహద్దు ప్రాంతంలోని ఒరక్జాయ్ రీజియన్‌లో దబోరీ, ఘిల్జో, ముల్లా పట్టి, మమోజయ్, ఖదేజాయ్ తదితర ప్రాంతాల్లో ఈ దాడులు జరిగాయి.Source: Yahoo! Telugu: News | 4 Jul 2010 | 7:17 am అది నినాదం కాదు...మీడియా వక్రీకరించింది: రాములమ్మ'తెలంగాణకు అడ్డొస్తే అడ్డంగా నరకుతాం' అనేది తెలంగాణ నినాదం కాదని తెలంగాణ రాష్ట్ర సమితి మహిళా నాయకురాలు, మెదక్ ఎంపీ విజయశాంతి అన్నారు. తన వ్యాఖ్యలను మీడియానే వక్రీకరించిందన్నారు. ఇదే విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి వివరణ ఇచ్చింది. ఈ మేరకు ఆమె ఆదివారం ఫ్యాక్స్ ద్వారా తన వివరణను ఈసీకి తెలియజేసింది.Source: Yahoo! Telugu: News | 4 Jul 2010 | 7:06 am అతిపెద్ద మురికివాడలో ఎస్‌బీఐ మైక్రోఫైనాన్స్ శాఖదేశ వాణిజ్య రాజధాని ముంబైలోని ధారవి అనే మురికివాడలో భారతీయ స్టేట్ బ్యాంకు ఒక మైక్రో ఫైనాన్స్ శాఖను ప్రారంభించింది. ఈ మురికివాడ ఆసియాలోనే అతిపెద్ద స్లమ్ ఏరియాగా గుర్తింపు పొందింది. ఇక్కడ స్పెషలైజ్‌డ్ మైక్రో ఫైనాన్స్ శాఖను ప్రారంభించినట్టు ఎస్బీఐ అధికారులు వెల్లడించారు.Source: Yahoo! Telugu: News | 4 Jul 2010 | 6:34 am జశ్వంత్ జిన్నా పుస్తకం ముగిసిన అధ్యాయం: గడ్కారీపాకిస్థాన్ వ్యవస్థాపకుడు మమ్మద్ అలీ జిన్నాను ప్రస్తుతిస్తూ పార్టీ సీనియర్ నేత జశ్వంత్ సింగ్ రాసిన పుస్తక వివాదం ముగిసిన అధ్యాయమని భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితన్ గడ్కారీ అన్నారు. ఆయన పార్టీలోకి తిరిగి రావడం పార్టీ పటిష్టతకు ఎంతగానో దోహదపడుతుందని ఆయన అన్నారు.Source: Yahoo! Telugu: News | 4 Jul 2010 | 6:29 am ధార్మిక సంస్థలకు బఫెట్ విరాళం రూ.8685 కోట్లుఅమెరిక కోటీశ్వరుడు వారెన్ బఫెట్ మరోమారు తనలోని దానగుణాన్ని చాటుకున్నారు. ధార్మిక సంస్థలకు ఆయన మారోరు భారీ మొత్తంలో విరాళం ప్రకటించారు. ఈ యేడాది 1.93 బిలియన్ డాలర్లను (సుమారు రూ.8685 కోట్లు) ప్రకటించారు. తన ఆస్తిలో 99 శాతాన్ని 2006లో ఆయన దానం చేయడం మొదలు పెట్టిన తర్వాత విరాళంగా ఇచ్చిన మూడో అతి పెద్ద మొత్తం ఇది. గురువారం నాడు తన ఇన్సూరెన్స్ కంపెనీ బెర్క్‌షైర్ హాతవే ఇన్‌కార్పోరేషన్ సంస్థలో తన వాటాగా ఉన్న షేర్లలో 2.454 కోట్ల షేర్లను ఆయన విరాళంగా ఇస్తున్నట్టు ప్రకటించారు.Source: Yahoo! Telugu: News | 4 Jul 2010 | 5:08 am మధ్యప్రదేశ్ సీఎంపై విచారణ జరుపుతాం: లోకాయుక్తమధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌పై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ జరుపుతామని ఆ రాష్ట్ర లోకాయుక్త ప్రకటించింది. వీటిపై విచారణ జరిపేందుకు లోకాయుక్త మెతకవైఖరి అనుసరిస్తుందని వచ్చిన ఆరోపణలపై లోకాయుక్త జస్టీస్ పీపీ.నావలేకర్ తోసిపుచ్చారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రితో పాటు ఆయన మంత్రివర్గంలోని ఎనిమిది సభ్యులపై భారీ కొనుగోళ్లకు సంబంధించి అవినీతి ఆరోపణలు వచ్చాయి. దీనిపై జస్టీస్ నావలేకర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రితో పాటు ఆయన మంత్రివర్గంలోని ఎనిమిది మంది సహచరులపై విచారణ జరుపుతామన్నారు.Source: జాతీయ | 4 Jul 2010 | 2:36 am అది నినాదం కాదు...మీడియా వక్రీకరించింది: రాములమ్మ'తెలంగాణకు అడ్డొస్తే అడ్డంగా నరకుతాం' అనేది తెలంగాణ నినాదం కాదని తెలంగాణ రాష్ట్ర సమితి మహిళా నాయకురాలు, మెదక్ ఎంపీ విజయశాంతి అన్నారు. తన వ్యాఖ్యలను మీడియానే వక్రీకరించిందన్నారు. ఇదే విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి వివరణ ఇచ్చింది. ఈ మేరకు ఆమె ఆదివారం ఫ్యాక్స్ ద్వారా తన వివరణను ఈసీకి తెలియజేసింది.Source: ఏపీ న్యూస్ | 4 Jul 2010 | 1:37 am జశ్వంత్ జిన్నా పుస్తకం ముగిసిన అధ్యాయం: గడ్కారీపాకిస్థాన్ వ్యవస్థాపకుడు మమ్మద్ అలీ జిన్నాను ప్రస్తుతిస్తూ పార్టీ సీనియర్ నేత జశ్వంత్ సింగ్ రాసిన పుస్తక వివాదం ముగిసిన అధ్యాయమని భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితన్ గడ్కారీ అన్నారు. ఆయన పార్టీలోకి తిరిగి రావడం పార్టీ పటిష్టతకు ఎంతగానో దోహదపడుతుందని ఆయన అన్నారు.Source: జాతీయ | 4 Jul 2010 | 12:59 am కులగణనపై రాజకీయ పార్టీల అభిప్రాయం సేకరణ2011 జనాభా లెక్కల ప్రక్రియలో భాగంగా కులగణనపై రాజకీయ పార్టీల అభిప్రాయ సేకరణ తెలుసుకుంటామని కేంద్ర ఆర్థిక మంత్రి, మంత్రివర్గ ఉప సంఘం కమిటీ ఛైర్మన్ ప్రణబ్ ముఖర్జీ స్పష్టం చేశారు. ఈ మేరకు అన్ని రాజకీయ పార్టీలకు లేఖలు రాయనున్నట్టు ఆయన తెలిపారు. ఈ అంశంపై ఆయన మీడియాతో మాట్లాడుతూ కులగణన అంశంపై మంత్రుల సాధికార బృందం సమావేశంలో చర్చకు వచ్చిన అంశాలను తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధికి వివరించినట్టు ఆయన చెప్పారు.Source: జాతీయ | 3 Jul 2010 | 11:16 pm బ్లూ ఫిలిమ్స్‌క్కూడా అవే ట్యూన్లు: కీరవాణిశ్రావ్యమైన సంగీతానికి మారుపేరు ఎం.ఎం.కీరవాణి. రాగాల్లో కీరవాణి రాగం ప్రశస్తమైనది. ఆ పేరును పెట్టుకుని సంగీత సామ్రాజ్యాన్ని ఏలుతున్న కీరవాణి సంగీతంలో ఉన్నవి కొన్ని ట్యూన్లే అనీ, అవి రిపీట్ అవుతుంటాయనీ, సినిమా సినిమాకూ కొత్తగా ట్యూన్లు అనేవీ ఉండవని తేల్చి చెప్పారు. కీరవాణి పుట్టిన రోజు జూలై 4. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన స్వరాలు సమకూర్చిన "మర్యాద రామన్న" చిత్రం ఆడియో శిల్పాకళా వేదికలో విడుదల కానుంది. పుట్టినరోజు సందర్భంగా ఇంటర్య్వూ ప్రత్యేకంగా మీకోసం...ఇండస్ట్రీకి వచ్చి ఎన్నాళ్లయింది...?ఎందుకు... డైరెక్టుగా చెపుతాను. నాకు 49 ఏళ్లు. ఇండస్ట్రీకి వచ్చి 27 ఏళ్లయింది.ఇన్నాళ్లలో మీరు చేసిన ప్రయోగాలు ఏమిటి..?ట్యూన్స్ అనేవి కొత్తగా పుట్టవు. ఉన్న రాగాలనే కొత్తగా చెప్పే ప్రయత్నం చేస్తాం.Source: Yahoo! Telugu: Entertainment | 3 Jul 2010 | 9:47 am నన్ను పిసినారి అనుకున్న ఫర్వాలేదు..!: సీఎం రోశయ్యప్రజలకు అనవసరమైన, ఆర్భాటమైన హామీలు ఇవ్వనని రాష్ట్ర ముఖ్యమంత్రి కె. రోశయ్య అన్నారు. ఆర్భాటమైన హామీలు, ప్రకటనలు చేయకపోవడంతో తనను ప్రజలు పిసినారి అనుకున్న ఫర్వాలేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. తన గురించి ఎవరేమన్నా తాను పట్టించుకోనని రోశయ్య చెప్పారు. గల్లీ రీజినల్ పార్టీలాగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరించదని, అభివృద్ధి సంక్షేమం కాంగ్రెస్ పార్టీ వల్లే సాధ్యమని రోశయ్య తెలిపారు.Source: ఏపీ న్యూస్ | 3 Jul 2010 | 8:34 am విజయశాంతి అరెస్టుతో కాంగ్రెస్‌కు చావుదెబ్బ ఖాయంముందూ వెనుకా ఆలోచించకుండా ఒక మహిళా ఎంపీని అరెస్టు చేయడం, అదీ తెరాసకు చెందిన నాయకురాలని జైల్లో పెట్టడం కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఎన్నికల్లో చావుదెబ్బ తీస్తుందని కాంగ్రెస్ పార్టీకి చెందిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శంకర రావు పేర్కొన్నారు.Source: ఏపీ న్యూస్ | 3 Jul 2010 | 7:49 am సిగ్గూ - లజ్జా ఉంటే కాంగ్రెస్, తెదేపా పోటీ చేయకూడదుఉపఎన్నికలు సమీపించే కొద్దీ తెలంగాణా రాష్ట్ర సమితిలో ఆందోళన పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకన్నా తెరాస విమర్శలలో ముందుటున్నది. తెరాస అధ్యక్షుడు కేసీఆర్ మరోసారి కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలపై విరుచక పడ్డారు.Source: ఏపీ న్యూస్ | 3 Jul 2010 | 7:17 am రోశయ్యా.. నీ చేతులు నువ్వే కాల్చుకున్నావ్.!: కేసీఆర్మెదక్ ఎంపీ విజయశాంతిని అరెస్టు చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి రోశయ్య.. తన చేతులు తనే కాల్చుకున్నారని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధినేత కె. చంద్రశేఖర రావు దుయ్యబట్టారు. ఒక మహిళా ఎంపీని నడీ రోడ్డు మీద అరెస్టు చేయడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. ఇకపై ఇలాంటి దుర్మార్గపు చర్యలు చెల్లవని ముఖ్యమంత్రికి కేసీఆర్ సవాలు విసిరారు.Source: ఏపీ న్యూస్ | 3 Jul 2010 | 7:04 am కర్ణాటక లోకాయుక్త సంతోష్ హెగ్డే రాజీనామా ఉపసంహరణ!ఎట్టకేలకు లోకాయుక్త సంతోష్ హెగ్డే రాజీనామాను ఉపసంహరించుకున్నారు. కర్ణాటక ప్రభుత్వం శుక్రవారం లోకాయుక్త రాజీనామాను వెనక్కి తీసుకోవాలని కోరడంతో సంతోష్ హెగ్డే తన రాజీనామాను శనివారం ఉపసంహరించుకున్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి బి.ఎస్. యడ్యూరప్ప మరియు బీజేపీ చీఫ్ నితిన్ గడ్కారీలు లోకాయుక్తతో సమావేశమై రాజీనామాను ఉపసంహరించుకోవాల్సిందిగా కోరారు. అలాగే బీజేపీ సీనియర్ నేత ఎల్.కె. అద్వానీ కూడా శనివారం రాజీనామాపై పునః పరిశీలన చేయాలని సూచించడంతో సంతోష్ హెగ్డే రాజీనామాను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు.Source: జాతీయ | 3 Jul 2010 | 6:43 am అన్నయ్య నచ్చజెప్పడంతో బెయిల్‌పై రాములమ్మ విడుదల!మెదక్ ఎంపీ విజయశాంతి అరెస్టు హై డ్రామాకు తెరపడింది. ఎట్టకేలకు శనివారం అరెస్టు అయిన తెరాస ఎంపీ విజయశాంతి బెయిల్‌పై విడుదలకావడానికి అంగీకరించారు. బెయిల్‌పై రానంటూ భీష్మించి కూర్చున్న విజయశాంతి, అన్నయ్య కేసీఆర్, తెరాస పార్టీ నేతలు ఒప్పించడంతో బెయిల్‌పై విడుదలైయ్యారు.Source: ఏపీ న్యూస్ | 3 Jul 2010 | 6:16 am సమంత ఛాన్స్‌ను ఎగరేసికెళ్లిన అనుష్కసీనియర్ హీరోయిన్లకు అవకాశాలు చేజారిపోవడం మామూలే. కొత్తగా వచ్చే హీరోయిన్లకు అది లక్ లాంటిదే. అయితే ఏం మాయ చేసావె ఫేం సమంతకు మాత్రం తమిళంలో ఇది రివర్స్ అయింది. వివరాల్లోకి వెళితే... అజిత్ హీరోగా 50వ చిత్రంలో నటించే అవకాశం సమంతకు వచ్చింది. అయితే ఆ ఆనందం ఆట్టే నిలువలేదు. ఆ ప్లేస్‌లో అనుష్కను పెట్టినట్లు సమాచారం. ఇటీవలే సూర్య సరసన సింగం( తెలుగులో యముడు)లో నటించిన అనుష్క అంటే కోలీవుడ్ కుర్రకారులో క్రేజ్ పెరిగిందట. ఈ క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు సమంతకు బదులు అనుష్కను తీసుకున్నట్లు తెలిసింది. అయితే ఈ చిత్రంలో ప్రముఖ తెలుగు హీరో కూడా నటిస్తున్నాడు. దాంతో అసలు కథ మొదలైంది. కొత్తలో ఇలాంటివి మామూలే. టేకిట్ ఈజీ సమంతా...Source: Yahoo! Telugu: Entertainment | 3 Jul 2010 | 6:08 am కత్తి పట్టని కత్తి కాంతారావుఅల్లరి నరేష్ కత్తి పట్టకుండా కత్తి కాంతారావు తరహాలో దొంగలపై పోరాడుతుంటాడు. తన ఇంటిపేరు కత్తి. తన పేరు కాంతారావు. కనుక దొంగల గుండెల్లో కత్తి కాంతారావుగా నిద్రపోతాను అంటాడు. రాజమౌళి సినిమాల్లాగా కత్తులు పట్టి బీభత్సాలు చేయను అని నరేష్ అన్నారు. గతంలో బురిడి సినిమాను తీసిన బిగ్ బి ప్రొడక్షన్స్ నిర్మాతలు ఈ సినిమాను తీస్తున్నారు. ఇ.వి.వి సత్యనారాయణ దర్శకుడు. శుక్రవారం రామానాయుడు స్టూడియోలో ఈ చిత్రం ఆరంభమైంది. మాగంటి బాబు స్విచాన్ చేయగా, రామానాయుడు గౌరవ దర్శకత్వం వహించారు.Source: Yahoo! Telugu: Entertainment | 3 Jul 2010 | 5:42 am అమర్నాథ్ యాత్రలో అపశృతి: ఆరుగురు భక్తులు దుర్మరణంజమ్ము - శ్రీనగర్ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో పంజాబ్‌కు చెందిన ఆరుగురు అమర్నాథ్ యాత్రికులు మృత్యువాత పడ్డారు. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వేగంగా వస్తున్న వాహనం రోడ్డుపై నుంచి అదుపుతప్పడంతో ఈ ప్రమాదం జరిగింది.Source: జాతీయ | 3 Jul 2010 | 5:09 am మేం జైళ్లలోనే ఉంటాం: రాములమ్మ - జయప్రకాష్వివాస్పద వ్యాఖ్యలు చేసి ఎన్నికల సంఘం ఆగ్రహానికి గురైన "రాములమ్మ"ను పోలీసులు శనివారం అరెస్టు చేసి చంచల్‌గూడ జైలుకు తరలించారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి సైతం ఇదే తరహా వ్యాఖ్యలకు పాల్పడటంతో ఆయనను కూడా పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. అనంతరం ఆయన్ను జైలుకు తరలించారు.Source: ఏపీ న్యూస్ | 3 Jul 2010 | 4:57 am రాజకీయ లబ్ధి కోసమే విజయశాంతి అరెస్టు: తెరాస ధ్వజంరాజకీయ లబ్ధి కోసమే మెదక్ ఎంపీ విజయశాంతిని అరెస్టు చేశారని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నేతలు, కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. మెదక్ ఎంపీ విజయశాంతి అరెస్టుపై వారు మండిపడుతున్నారు. తెలంగాణ కోసం ఉద్యమం చేస్తున్న ఓ మహిళా ఎంపీని అరెస్టు చేయడంలో కాంగ్రెస్ పార్టీ కుట్ర ఉందని తెరాస పార్టీ నేతలు ధ్వజమెత్తారు. పార్టీ సభలో విజయశాంతి వ్యాఖ్యానించిన మాటలను తీసుకుని కాంగ్రెస్ పెద్ద రాద్ధాంతం చేస్తుందని తెరాస ఆగ్రహం వ్యక్తం చేసింది.Source: ఏపీ న్యూస్ | 3 Jul 2010 | 4:33 am ఎంపీ విజయశాంతి అరెస్టు అప్రజాస్వామ్యకం: కేసీఆర్మెదక్ ఎంపీ విజయశాంతిని అరెస్టు చేయడం అప్రజాస్వామ్యకమని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె. చంద్రశేఖర రావు అన్నారు. మహిళా ఎంపీని రోడ్డుపై అరెస్టు చేయడం సముచితం కాదని కేసీఆర్ వ్యాఖ్యానించారు. మహిళా ఎంపీపై పోలీసులు దౌర్జన్యంగా వ్యవహరించడం సరికాదని కేసీఆర్ అన్నారు.Source: ఏపీ న్యూస్ | 3 Jul 2010 | 4:22 am నాకు బెయిల్ వద్దు... జైలులో పెట్టండి: "రాములమ్మ"వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఈసీ ఆగ్రహానికి గురైన మెదక్ ఎంపీ విజయశాంతిని ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేసి నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు. రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేసిన విజయశాంతిని పోలీసులు శనివారం బంజారాహిల్స్ రోడ్డు నెంబర్-3లో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం రాములమ్మను నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు. రాములమ్మ కేసుపై విచారణ జరిపిన నాంపల్లి కోర్టు విజయశాంతికి 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అనంతరం విజయశాంతిని చంచల్‌గూడ మహిళా జైలుకు పోలీసులు తరలించారు.Source: ఏపీ న్యూస్ | 3 Jul 2010 | 2:50 am
|