నాకు బెయిల్ వద్దు... జైలులో పెట్టండి: "రాములమ్మ"

వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఈసీ ఆగ్రహానికి గురైన మెదక్ ఎంపీ విజయశాంతిని ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేసి నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు. రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేసిన విజయశాంతిని పోలీసులు శనివారం బంజారాహిల్స్ రోడ్డు నెంబర్-3లో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం రాములమ్మను నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు. రాములమ్మ కేసుపై విచారణ జరిపిన నాంపల్లి కోర్టు విజయశాంతికి 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అనంతరం విజయశాంతిని చంచల్‌గూడ మహిళా జైలుకు పోలీసులు తరలించారు.
Source: Yahoo! Telugu: News | 3 Jul 2010 | 8:10 am

పాకిస్థాన్‌లో అణుకేంద్రాల ఏర్పాటుకు భారత్ వ్యతిరేకం..!?

పాకిస్థాన్‌లో ఇరు అణుకేంద్రాల ఏర్పాటుకు చైనా ప్రణాళికలు సిద్ధం చేయడంపై భారత్ వ్యతిరేకించనుంది. పాకిస్థాన్‌లో అణు కేంద్రాల ఏర్పాటుకు చైనా సుముఖత చూపడం పట్ల భారత్ మండిపడుతోంది. చైనా-పాకిస్థాన్‌ల ఒప్పందంతో పాక్‌లో అణుకేంద్రాల ఏర్పాటు కూడదని భారత్ నొక్కి చెప్పేందుకు రంగం సిద్ధం చేస్తోంది. దీనికోసం కేంద్ర భద్రతా సలహాదారు శివశంకర్ మీనన్ చైనా పర్యటన చేపట్టనున్నట్లు సమాచారం.
Source: Yahoo! Telugu: News | 3 Jul 2010 | 7:33 am

వడ్డీరేట్లను పెంచిన భారత రిజర్వు బ్యాంకు!

రోజురోజుకి పెరిగిపోతున్న ద్రవ్వోల్బణాన్ని కట్టడి చేయడానికి ఆర్‌బీఐ వడ్డీ రేట్లను పెంచే నిర్ణయం తీసుకుంది. స్వల్పకాలిక రుణాల విషయంలో ఆర్‌బీఐ తీసుకన్న నిర్ణయం సరైనదేనని ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ పేర్కొన్నారు. స్వల్పకాలిక రుణాలు ఇచ్చే, తీసుకునే రేట్లను 25 బేసిస్‌ పాయింట్లు పెంచుతున్నట్లు రిజర్వు బ్యాంకు ప్రకటించింది. అయితే పెంపు తక్షణం అమల్లోకి వస్తుందని బ్యాంకు తెలిపింది.
Source: Yahoo! Telugu: News | 3 Jul 2010 | 7:17 am

"అడ్డంగా నరకడం" స్లోగన్‌తో లాభమా..? నష్టమా...?

"హైదరాబాద్ గురించి మాట్లాడితే నాలుకలు కోస్తా"మని ఒకప్పుడు వ్యాఖ్యానించిన కేసీఆర్ ఈసారి మాత్రం కాస్త వెనకడుగు వేశారు. ఇపుడా స్థానాన్ని ఎంపీ విజయశాంతి ఆక్రమించినట్లు కనబడుతున్నారు. "తెలంగాణాకు అడ్డు తగిలితే అడ్డంగా నరకమ"ని సంచలన వ్యాఖ్య చేసి అందరి దృష్టినీ అటువైపు మరలించారు.
Source: Yahoo! Telugu: News | 3 Jul 2010 | 7:13 am

కారును ఢీకొన్న లారీ: ముగ్గురి సజీవ దహనం!

చంద్రగిరి మండలం అగరాల వద్ద శనివారం జరిగిన ఘోర ప్రమాదంలో ముగ్గురు సజీవ దహనమయ్యారు. అగరాల వద్ద కారును లారీ ఢీ కొనడంతో కారులోని ముగ్గురు ప్రయాణీకులు ప్రాణాలు కోల్పోయారు. కారు-లారీ ఢీకొనడంతో రెండు వాహనాల్లోని పెట్రోల్ ట్యాంకులు పేలి మంటలు వ్యాపించడంతో కారులోని ముగ్గురు ప్రయాణీకులు తప్పించుకోలేక దారుణంగా మరణించారని పోలీసులు తెలిపారు.
Source: Yahoo! Telugu: News | 3 Jul 2010 | 7:06 am

బీహార్ ఎన్నికల ప్రచారంలో నరేంద్ర మోడీ: బీజేపీ

బీహార్ శాసనసభ ఎన్నికల కోసం గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ప్రచార బరిలోకి దిగుతారని భారతీయ జనతా పార్టీ స్పష్టం చేసింది. అక్టోబర్‌లో జరిగే బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో గుజరాత్ సీఎం నరేంద్ర మోడీ ప్రచారం చేస్తారనే విషయాన్ని బీజేపీ ప్రధాన కార్యదర్శి ఆనంద్ కుమార్ ధ్రువీకరించారు.
Source: Yahoo! Telugu: News | 3 Jul 2010 | 6:42 am

ప్రపంచ 9వ స్థానంలో టీసీఎస్ : రతన్ టాటా

ప్రపంచపు 9వ అతి పెద్ద ఐటీ సంస్థ ఎదిగిన టాటా కన్సెల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ఈ ఆర్థిక సంవత్సరానికి గానూ 30,000 మంది ఉద్యోగులను నియమించనున్నట్లు సంస్థ ఛైర్మన్ రతన్ టాటా కంపెనీ ఐదవ వార్షిక సమావేశంలో ప్రకటించారు. ఇప్పటికే కంపెనీలో 1,60,000 మంది ఉండగా ముగిసిన గత ఆర్థక సంవత్సరం నాల్గొవ త్రైమాసికంలో 16,851 మందిని చేర్చనున్నట్లు తెలిపారు.
Source: Yahoo! Telugu: News | 3 Jul 2010 | 6:25 am

కాశ్మీర్‌లో రాజకీయ పరిష్కారమే అవసరం: అబ్ధుల్లా

కాశ్మీర్ సమస్యకు రాజకీయ పరిష్కారం అవసరమని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒమర్ అబ్ధుల్లా తెలిపారు. కాశ్మీర్‌లో చెలరేగుతున్న అల్లర్లను అదుపులోకి తీసుకోవడానికి రాజకీయ పరిష్కారం ఒకటే మార్గమని అబ్ధుల్లా అభిప్రాయం వ్యక్తం చేశారు. సక్రమమైన పరిపాలన, అభివృద్ధితో మాత్రమే కాశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితులు కొలిక్కి రావని ఒమర్ అన్నారు.
Source: Yahoo! Telugu: News | 3 Jul 2010 | 6:24 am

అడ్డంగా నరకడం.. అదే తెలంగాణా స్లోగన్: విజయశాంతి

తెలంగాణాకు అడ్డుతగిలేవారిని అడ్డంగా నరకడం అనేదే తెలంగాణా స్లోగన్ అనీ, తాను చేసిన ఈ వ్యాఖ్యల్లో తప్పు లేదని తెరాస ఎంపీ విజయశాంతి మరోసారి పునరుద్ఘాటించారు. తెలంగాణాలోని ప్రతి బిడ్డా ఇదే మాటను మాట్లాడతారని అన్నారు. తన తెలంగాణాకోసం ప్రాణాలు అర్పించడానికి కూడా సిద్ధంగా ఉన్నానని అన్నారు. తాను మహా మొండిదాన్నని, దేనికీ భయపడనని చెప్పుకొచ్చారు.
Source: Yahoo! Telugu: News | 3 Jul 2010 | 6:10 am

సమంత ఛాన్స్‌ను ఎగరేసికెళ్లిన అనుష్క

సీనియర్ హీరోయిన్లకు అవకాశాలు చేజారిపోవడం మామూలే. కొత్తగా వచ్చే హీరోయిన్లకు అది లక్ లాంటిదే. అయితే ఏం మాయ చేసావె ఫేం సమంతకు మాత్రం తమిళంలో ఇది రివర్స్ అయింది. వివరాల్లోకి వెళితే... అజిత్ హీరోగా 50వ చిత్రంలో నటించే అవకాశం సమంతకు వచ్చింది. అయితే ఆ ఆనందం ఆట్టే నిలువలేదు. ఆ ప్లేస్‌లో అనుష్కను పెట్టినట్లు సమాచారం. ఇటీవలే సూర్య సరసన సింగం( తెలుగులో యముడు)లో నటించిన అనుష్క అంటే కోలీవుడ్ కుర్రకారులో క్రేజ్ పెరిగిందట. ఈ క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు సమంతకు బదులు అనుష్కను తీసుకున్నట్లు తెలిసింది. అయితే ఈ చిత్రంలో ప్రముఖ తెలుగు హీరో కూడా నటిస్తున్నాడు. దాంతో అసలు కథ మొదలైంది. కొత్తలో ఇలాంటివి మామూలే. టేకిట్ ఈజీ సమంతా...
Source: Yahoo! Telugu: Entertainment | 3 Jul 2010 | 6:08 am

ఎడ్‌సెట్ ఫలితాల విడుదల: మ్యాథ్స్‌లో వీరబ్రహ్మం టాపర్!

ఎడ్‌సెట్ 2010 ప్రవేశ పరీక్ష ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో మ్యాథ్స్ సబ్జెక్టులో పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన వీరబ్రహ్మం 108 మార్కులతో టాపర్‌గా నిలిచాడు. శనివారం ఉదయం మంత్రి మోపీదేవి వెంకటరమణ ఎడ్‌సెట్ ఫలితాలను విడుదల చేశారు.
Source: Yahoo! Telugu: News | 3 Jul 2010 | 6:00 am

కత్తి పట్టని కత్తి కాంతారావు

అల్లరి నరేష్ కత్తి పట్టకుండా కత్తి కాంతారావు తరహాలో దొంగలపై పోరాడుతుంటాడు. తన ఇంటిపేరు కత్తి. తన పేరు కాంతారావు. కనుక దొంగల గుండెల్లో కత్తి కాంతారావుగా నిద్రపోతాను అంటాడు. రాజమౌళి సినిమాల్లాగా కత్తులు పట్టి బీభత్సాలు చేయను అని నరేష్ అన్నారు. గతంలో బురిడి సినిమాను తీసిన బిగ్ బి ప్రొడక్షన్స్ నిర్మాతలు ఈ సినిమాను తీస్తున్నారు. ఇ.వి.వి సత్యనారాయణ దర్శకుడు. శుక్రవారం రామానాయుడు స్టూడియోలో ఈ చిత్రం ఆరంభమైంది. మాగంటి బాబు స్విచాన్ చేయగా, రామానాయుడు గౌరవ దర్శకత్వం వహించారు.
Source: Yahoo! Telugu: Entertainment | 3 Jul 2010 | 5:42 am

నాకు బెయిల్ వద్దు... జైలులో పెట్టండి: "రాములమ్మ"

వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఈసీ ఆగ్రహానికి గురైన మెదక్ ఎంపీ విజయశాంతిని ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేసి నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు. రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేసిన విజయశాంతిని పోలీసులు శనివారం బంజారాహిల్స్ రోడ్డు నెంబర్-3లో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం రాములమ్మను నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు. రాములమ్మ కేసుపై విచారణ జరిపిన నాంపల్లి కోర్టు విజయశాంతికి 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అనంతరం విజయశాంతిని చంచల్‌గూడ మహిళా జైలుకు పోలీసులు తరలించారు.
Source: ఏపీ న్యూస్ | 3 Jul 2010 | 2:50 am

కారును ఢీకొన్న లారీ: ముగ్గురి సజీవ దహనం!

చంద్రగిరి మండలం అగరాల వద్ద శనివారం జరిగిన ఘోర ప్రమాదంలో ముగ్గురు సజీవ దహనమయ్యారు. అగరాల వద్ద కారును లారీ ఢీ కొనడంతో కారులోని ముగ్గురు ప్రయాణీకులు ప్రాణాలు కోల్పోయారు. కారు-లారీ ఢీకొనడంతో రెండు వాహనాల్లోని పెట్రోల్ ట్యాంకులు పేలి మంటలు వ్యాపించడంతో కారులోని ముగ్గురు ప్రయాణీకులు తప్పించుకోలేక దారుణంగా మరణించారని పోలీసులు తెలిపారు.
Source: ఏపీ న్యూస్ | 3 Jul 2010 | 1:36 am

బీహార్ ఎన్నికల ప్రచారంలో నరేంద్ర మోడీ: బీజేపీ

బీహార్ శాసనసభ ఎన్నికల కోసం గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ప్రచార బరిలోకి దిగుతారని భారతీయ జనతా పార్టీ స్పష్టం చేసింది. అక్టోబర్‌లో జరిగే బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో గుజరాత్ సీఎం నరేంద్ర మోడీ ప్రచారం చేస్తారనే విషయాన్ని బీజేపీ ప్రధాన కార్యదర్శి ఆనంద్ కుమార్ ధ్రువీకరించారు.
Source: జాతీయ | 3 Jul 2010 | 1:13 am

కాశ్మీర్‌లో రాజకీయ పరిష్కారమే అవసరం: అబ్ధుల్లా

కాశ్మీర్ సమస్యకు రాజకీయ పరిష్కారం అవసరమని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒమర్ అబ్ధుల్లా తెలిపారు. కాశ్మీర్‌లో చెలరేగుతున్న అల్లర్లను అదుపులోకి తీసుకోవడానికి రాజకీయ పరిష్కారం ఒకటే మార్గమని అబ్ధుల్లా అభిప్రాయం వ్యక్తం చేశారు. సక్రమమైన పరిపాలన, అభివృద్ధితో మాత్రమే కాశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితులు కొలిక్కి రావని ఒమర్ అన్నారు.
Source: జాతీయ | 3 Jul 2010 | 12:54 am

అడ్డంగా నరకడం.. అదే తెలంగాణా స్లోగన్: విజయశాంతి

తెలంగాణాకు అడ్డుతగిలేవారిని అడ్డంగా నరకడం అనేదే తెలంగాణా స్లోగన్ అనీ, తాను చేసిన ఈ వ్యాఖ్యల్లో తప్పు లేదని తెరాస ఎంపీ విజయశాంతి మరోసారి పునరుద్ఘాటించారు. తెలంగాణాలోని ప్రతి బిడ్డా ఇదే మాటను మాట్లాడతారని అన్నారు. తన తెలంగాణాకోసం ప్రాణాలు అర్పించడానికి కూడా సిద్ధంగా ఉన్నానని అన్నారు. తాను మహా మొండిదాన్నని, దేనికీ భయపడనని చెప్పుకొచ్చారు.
Source: ఏపీ న్యూస్ | 3 Jul 2010 | 12:41 am

ఎడ్‌సెట్ ఫలితాల విడుదల: మ్యాథ్స్‌లో వీరబ్రహ్మం టాపర్!

ఎడ్‌సెట్ 2010 ప్రవేశ పరీక్ష ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో మ్యాథ్స్ సబ్జెక్టులో పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన వీరబ్రహ్మం 108 మార్కులతో టాపర్‌గా నిలిచాడు. శనివారం ఉదయం మంత్రి మోపీదేవి వెంకటరమణ ఎడ్‌సెట్ ఫలితాలను విడుదల చేశారు.
Source: ఏపీ న్యూస్ | 3 Jul 2010 | 12:31 am

మావోయిస్టు నేత ఆజాద్ మృతదేహానికి పోస్టుమార్టం!

ఆదిలాబాద్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన మావోయిస్టు అగ్రనేత చెరుకూరి రాజ్ కుమార్ అలియాస్ ఆజాద్ మృతదేహానికి శనివారం మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించనున్నారు. దీనికోసం హైదరాబాద్ నుండి ప్రత్యేక వైద్య బృందం మంచిర్యాల చేరుకున్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు పోస్టుమార్టం నిర్వహంచకముందే ఆజాద్ తల్లి కరుణకు మృతదేహాన్ని చూసేందుకు వీలు కల్పించింది. ఆజాద్ తల్లితో పాటు విప్లవ రచయితల సంఘం రాష్ట్ర నేత వరవరరావు కూడా మంచిర్యాల చేరుకున్నారు.
Source: ఏపీ న్యూస్ | 3 Jul 2010 | 12:12 am

ఢిల్లీ ఎయిర్‌పోర్టు టెర్మినల్ 3ని ప్రారంభించిన ప్రధాని

ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించి టెర్మినల్ 3ని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, యూపీఎ ఛైర్ పర్సన్ సోనియా గాంధీ శనివారం ప్రారంభించారు. ఈ టెర్మినల్ ఈ నెల 16 నుంచి వాణిజ్యపరంగా అందుబాటులోకి రానుంది.
Source: జాతీయ | 3 Jul 2010 | 12:07 am

సిగ్గూ - లజ్జా ఉంటే కాంగ్రెస్, తెదేపా పోటీ చేయకూడదు

ఉపఎన్నికలు సమీపించే కొద్దీ తెలంగాణా రాష్ట్ర సమితిలో ఆందోళన పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకన్నా తెరాస విమర్శలలో ముందుటున్నది. తెరాస అధ్యక్షుడు కేసీఆర్ మరోసారి కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలపై విరుచక పడ్డారు.
Source: ఏపీ న్యూస్ | 2 Jul 2010 | 11:26 pm

విజయశాంతిని తప్పకుండా అరెస్టు చేస్తాం..!: పోలీసులు

వివాదస్పద వ్యాఖ్యలు చేయడంతో చిక్కుల్లో పడ్డ మెదక్ జిల్లా ఎంపీ విజయశాంతి అరెస్టుకు రంగం సిద్దమైంది. శుక్రవారమే ఆమెను అరెస్టు చేయాల్సి ఉండగా, ఆమె ఇంట్లో లేని కారణంగా పోలీసులు వెనుదిరిగారు. కానీ శనివారం విజయశాంతిని పోలీసులు అదుపులోకి తీసుకుని, న్యాయస్థానం ముందే హాజరుపరిచే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే ఎన్నికల సంఘం ఆదేశం మేరకు పోలీసు శాఖ తన కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వర్తిస్తుందని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు.
Source: ఏపీ న్యూస్ | 2 Jul 2010 | 11:20 pm

సోనియా గాంధీ జాతికి వివరణ ఇవ్వాలి..!: నితిన్ గడ్కారీ

ధరల పెరుగుదల, ఆహార భద్రతపై యూపీఏ ప్రభుత్వం ఘోరంగా విఫలమవడానికి గల కారణాలపై యూపీఏ ఛైర్ పర్సన్, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ జాతికి వివరణ ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు నితిన్ గడ్కారీ డిమాండ్ చేశారు. ఆర్థిక రంగ నిర్వహణలో యూపీఏ ప్రభుత్వం పూర్తిగా విఫలం కావడానికి దారితీసిన పరిస్థితులపై సోనియా గాంధీ జాతికి వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందని నితిన్ చెప్పారు.
Source: జాతీయ | 2 Jul 2010 | 10:28 pm

భారత్ బంద్‌కు మద్దతివ్వండి: శరద్ యాదవ్ పిలుపు!

చమురు ధరల పెంపును నిరసిస్తూ ఈ నెల ఐదో తేదీన విపక్షాలు తలపెట్టిన భారత్ బంద్‌కు మద్దతివ్వాలని జేడీ(యు) అధ్యక్షుడు శరద్ యాదవ్ పిలుపు నిచ్చారు. పెట్రోలియం ఉత్పత్తుల ధరల పెంపునకు నిరసనగా తలపెట్టిన భారత్ బంద్‌కు కార్మిక సంఘాలు, వాణిజ్య సంఘాలు, యువజన సంఘాలు మద్దతును కోరుతున్నట్లు శరద్ యాదవ్ చెప్పారు.
Source: జాతీయ | 2 Jul 2010 | 10:26 pm

నవదీప్‌ నాకు కాబోయే ఆయన: ఓ టీవీ యాంకర్

హీరో నవదీప్ ఎంజాయ్‌మెంట్‌కు చెక్ పెట్టాలని అతని ఇంటి పెద్దలు నిర్ణయించినట్లు సమాచారం. రాత్రిళ్లు పబ్‌ల్లో ఎక్కువగా గడపడంతో ఇటీవలే కారును వేగంగా నడిపి పోలీసుకు దొరికిపోయాడు. దానికితోడు ప్రముఖ నటుని కుమార్తెతోనూ ఆయనకు సంబంధాలున్నాయని ఫిలిం నగర్ టాక్.ఈ విషయంలో ఇరు కుటుంబాల మధ్య పెద్ద గొడవే జరిగినట్లు తెలిసింది. దీంతో నవదీప్‌ను ఇంటివాడిని చేయాలని అతడి తల్లిదండ్రులు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఇదిలా నడుస్తుండగానే లేటెస్ట్‌గా ఓ ఛానల్‌లో యాంకర్‌గా ఉన్న అమ్మడి వెంట చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నాడట. అంతేకాదు ఆమెను కల్యాణం చేసుకుంటానని ఒట్టు కూడా వేశాడట. దీంతో సదరు యాంకర్ "నవదీప్ నా కాబోయే భర్త" అంటూ ఛానల్లో ప్రచారం చేసుకుంటోందట. ఈ విషయం తెలిసిన నవదీప్ తల్లిదండ్రులు ఆమెను తమ కోడలుగా అంగీకరించేది లేదని తేల్చి చెప్పినట్లు భోగట్టా.
Source: Yahoo! Telugu: Entertainment | 2 Jul 2010 | 10:52 am

ఎన్ని "కోడ్‌"లున్నా మా మాటలకు పదును తగ్గదు

తెలంగాణాకు అడ్డువచ్చేవారిని అడ్డంగా నరకండి అని వ్యాఖ్యానించిన విజయశాంతి మాటలను తెలంగాణా జాగృతి సమితి అధ్యక్షురాలు కవిత సమర్థించుకున్నారు. తాము ఏం అనుకుంటామో అదే మాట్లాడతామన్నారు. తెలంగాణా బిడ్డలు మనసులో ఒక మాట, పైకి ఒక మాట రాదనీ, అనుకున్నదేదో బయటకు అనేస్తామని ఆమె విజయశాంతిని వెనకేసుకొచ్చారు.
Source: ఏపీ న్యూస్ | 2 Jul 2010 | 8:18 am

హైదరాబాద్‌లో లవ్ స్టార్ కపుల్ "రానా - శ్రియ.."?

లీడర్‌తో సంచలన విజయాన్ని కైవసం చేసుకున్న యువనటుడు, స్టార్ ప్రొడ్యూసర్ రామానాయుడు మనవడు అయిన జూనియర్ రామానాయుడు (రానా) సెక్సీ నటి శ్రియలిద్దరూ పీకల్లోతు ప్రేమలో కూరుకుపోయారని టాలీవుడ్ సినీజనం గుసగుసలుపోతున్నారు.లీడర్ చిత్రం తర్వాత రానా 'దమ్మరే దమ్' హిందీ చిత్రంలో నటిస్తున్నాడు. అదేవిధంగా తెలుగు - తమిళ భాషల్లో ఏకకాలంలో ఓ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలకు సంబంధించిన షూటింగ్‌ల్లో బిజీగా ఉన్న రానాకు ఓ సినీ ఫంక్షన్లో శ్రేయ తారస పడిందట. తొలుత 'హాయ్' చెప్పుకున్న ఇద్దరూ ఆ తర్వాత 'హలో' అనుకుని అటు పిమ్మట గంటలకొద్దీ మాటలతో గడిపేయడం మొదలుపెట్టారు. ఈ బంధమే ప్రేమబంధంగా మారిపోయిందని టాలీవుడ్ సినీవర్గాల టాక్. అంతేకాదు ఇటీవల వీళ్లద్దరూ కలిసి హైదరాబాదులోని ఓ ఫైవ్ స్టార్ హోటల్‌లో కలిసి ఎంజాయ్ చేయడం చాలామంది చూశారట కూడా. మరి ఇది నిజమో.. కాదో తెలియాలంటే మరికొంతకాలం ఆగాల్సిందే.
Source: Yahoo! Telugu: Entertainment | 2 Jul 2010 | 7:46 am

"అడ్డంగా నరకడం" అనేది తెలంగాణా స్లోగన్: విజయశాంతి

పోలీసుల కంటికి కనబడకుండా తిరుగుతున్న మెదక్ ఎంపీ విజయశాంతి ఎట్టకేలకు తన స్వగృహం ముందు ప్రత్యక్షమయ్యారు. తెలంగాణాకు అడ్డుపడేవారిని అడ్డంగా నరకండి అనే వ్యాఖ్యల్లో తప్పులేదనీ, అది తెలంగాణా స్లోగన్ అనీ ఆమె అన్నారు.
Source: ఏపీ న్యూస్ | 2 Jul 2010 | 7:45 am

మోడీ, వరుణ్ ప్రచారంపై త్వరలో నిర్ణయం: గడ్కారీ

ఈ యేడాది ఆఖరులో జరుగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించే ప్రచారాంశంపై తమ పార్టీ సొంతగా ఓ నిర్ణయం తీసుకుంటుందని భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ గడ్కారీ అన్నారు. ముఖ్యంగా ఈ ఎన్నికల్లో గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ లేదా వివాదాస్పద యువ ఎంపీ వరుణ్ గాంధీలు ప్రచారంలో భాగస్వాములు కావాలా వద్దా అనేదానిపై కూడా నిర్ణయం తీసుకుంటామన్నారు.
Source: జాతీయ | 2 Jul 2010 | 5:59 am

ఒత్తిడితో సతమతమవుతున్నారా...? నా దగ్గరకు రండి: షెర్లిన్

ఆయా వృత్తుల్లో ఒత్తిడికి సతమతమైపోయేవారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. అయితే దాని నుంచి బయటపడేస్తానని చెపుతోందట షెర్లిన్ చోప్రా. నీకది ఎలా సాధ్యం అని ప్రశ్నిస్తే... షెర్లిన్ ఇలా చెప్పుకొచ్చింది. "నా సినిమాలు, ఆల్బమ్‌లు అంతగా పాపులర్ కాక మునుపు కెరీర్ గురించి బాగా డిప్రెస్ అయ్యేదాన్ని. ఒక దశలో ఒంటరిగా కూచుని ఏడ్చేదాన్ని.అలా ఏడిస్తే మాత్రం జరిగేది జరుగకుండా ఆపగలమా...? దేవుడు మనిషికి ఓ జన్మ ఇచ్చాడు. ఈ జన్మలో మనం చేసే పనులను బట్టి ఫలితాలు మారుతుంటాయి. పాజిటివ్ ఫలితాలొచ్చినప్పుడు ఎగిరి గంతేయడం, వ్యతిరేక ఫలితాలు వచ్చినప్పుడు కుంగిపోవడం కూడదన్న సంగతి నేను తెలుసుకున్నాను. అన్నిటికీ మించి తల్లిదండ్రులు లేని, దిక్కులేని అనాధల్లా బతికే పిల్లల ధైర్యాన్ని చూసినప్పుడు నా కెరీర్ విషయంలో నేను పడుతున్న బాధ అర్థం లేనిదనిపించింది. అంతే.. అప్పటినుంచి దేన్నైనా సాధించేవరకూ నిద్రపోయేదాన్ని కాదు. ఒకవేళ 100 శాతం ప్రయత్నం చేసినప్పటికీ దక్కాల్సింది దక్కకపోతే పెద్దగా ఫీలవనవసరం లేదు. దేవుడు నిర్ణయించిందే మనకు దొరుకుతుంది.
Source: Yahoo! Telugu: Entertainment | 2 Jul 2010 | 5:54 am

దానికీ.. దీనికి లింకు పెట్టకండయ్యా బాబూ: రోశయ్య

కడప ఎంపీ వైఎస్.జగన్మోహన్ రెడ్డి చేపట్టే ఓదార్పు యాత్రకు, అసెంబ్లీ సమావేశాలకు లింకు పెట్టకండని మీడియా మిత్రులను ముఖ్యమంత్రి కె.రోశయ్య కోరారు. ఆయన పని ఆయనదే.. మా పని మాదేనంటూ ఆయన శుక్రవారం ఢిల్లీలో వ్యాఖ్యానించారు.
Source: ఏపీ న్యూస్ | 2 Jul 2010 | 4:42 am

వాడివేడిగా సాగనున్న పార్లమెంట్ వర్షకాల సమావేశాలు

ఈనెలాఖరు నుంచి జరుగనున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు వాడివేడిగా సాగడం ఖాయమని భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు ఎం.వెంకయ్య నాయుడు జోస్యం చెప్పారు. ఆయన శుక్రవారం చెన్నయ్‌లో విలేకరులతో మాట్లాడుతూ ధరల పెరుగుదలతో పాటు పెట్రో వడ్డనపై ఇతర విపక్షాలను కూడా కలుపుని ప్రభుత్వంపై దాడికి దిగుతామన్నారు.
Source: జాతీయ | 2 Jul 2010 | 3:51 am