వాడివేడిగా సాగనున్న పార్లమెంట్ వర్షకాల సమావేశాలు

ఈనెలాఖరు నుంచి జరుగనున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు వాడివేడిగా సాగడం ఖాయమని భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు ఎం.వెంకయ్య నాయుడు జోస్యం చెప్పారు. ఆయన శుక్రవారం చెన్నయ్‌లో విలేకరులతో మాట్లాడుతూ ధరల పెరుగుదలతో పాటు పెట్రో వడ్డనపై ఇతర విపక్షాలను కూడా కలుపుని ప్రభుత్వంపై దాడికి దిగుతామన్నారు.
Source: Yahoo! Telugu: News | 2 Jul 2010 | 9:20 am

యూఎస్ఏఐడీ అడ్మినిస్ట్రేటర్‌గా నిషా దేశాయ్ బిశ్వాల్

అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పాలనా యంత్రాంగంలో మరో భారతీయ సంతతిరాలు కీలక బాధ్యతల్లో నియమితులయ్యారు. యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ (యూఎస్ఏఐడీ) ఆసియా విభాగానికి అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటర్‌గా నియమితులయ్యారు. ప్రస్తుతం ఈ బాధ్యతలను ఇండో అమెరికన్ పౌరుడు రాజ్ షా నిర్వహిస్తున్నారు. ఒబామా పాలనా యంత్రాంగంలో ఇదే అత్యున్నత పదవి కావడం గమనార్హం.
Source: Yahoo! Telugu: News | 2 Jul 2010 | 8:55 am

స్వల్ప నష్టాల్లో బాంబే స్టాక్ మార్కెట్!

బాంబే స్టాక్ మార్కెట్ నష్టాల్లో కూరుకుపోయింది. ట్రేడింగ్ ప్రారంభం నుంచి హెచ్చుతగ్గులతో ర్యాలీని కొనసాగిస్తున్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచి సెన్సెక్స్, మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో కేవలం రెండు పాయింట్ల నష్టంతో 17,507 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచి నిఫ్టీ కూడా కేవలం రెండు పాయింట్లు క్షీణించి, 5,249 పాయింట్ల వద్ద ర్యాలీని పయనింపజేస్తోంది.
Source: Yahoo! Telugu: News | 2 Jul 2010 | 8:45 am

అడ్డొస్తే అడ్డంగా నరకమన్న విజయశాంతి పత్తాలేదు!

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అడ్డుపడే వారిని అడ్డంగా నరకమన్న తెలంగాణ రాష్ట్ర సమితి మహిళా నేత విజయశాంతి పత్తాలేకుండా పోయారు. రాములమ్మ చేసిన వ్యాఖ్యలను ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించి, సుమోటాగా స్వీకరించింది. అనతరం ఈ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని ఆమెకు ఈసీ నోటీసు జారీ చేసింది. అంతేకాకండా, ఆమెపై కేసు నమోదు చేయాల్సిందిగా హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ ఏకే.ఖాన్‌ను ఈసీ ఆదేశించింది.
Source: Yahoo! Telugu: News | 2 Jul 2010 | 8:44 am

స్వల్ప ఒడిదుడుకుల్లో బాంబే స్టాక్ మార్కెట్

బాంబే స్టాక్ మార్కెట్ శుక్రవారం స్వల్ప ఒడిదుడుకుల మధ్య ర్యాలీని కొనసాగిస్తోంది. ట్రేడింగ్ ప్రారంభం నుంచే లాభనష్టాలు, మిశ్రమ ఫలితాలను నమోదు చేసుకుంటున్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచి సెన్సెక్స్, మధ్యాహ్నం 1.45 గంటల ప్రాంతంలో కేవలం ఆరు పాయింట్లు స్వల్పంగా లాభపడింది. దీంతో సెన్సెక్స్ సూచి 17,515 పాయింట్ల మార్కును తాకింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచి నిఫ్టీ కూడా కేవలం మూడు పాయింట్లు స్వల్పంగా పడిపోయి, 5,255 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.
Source: Yahoo! Telugu: News | 2 Jul 2010 | 7:52 am

హైదరాబాద్‌లో లవ్ స్టార్ కపుల్ "రానా - శ్రియ.."?

లీడర్‌తో సంచలన విజయాన్ని కైవసం చేసుకున్న యువనటుడు, స్టార్ ప్రొడ్యూసర్ రామానాయుడు మనవడు అయిన జూనియర్ రామానాయుడు (రానా) సెక్సీ నటి శ్రియలిద్దరూ పీకల్లోతు ప్రేమలో కూరుకుపోయారని టాలీవుడ్ సినీజనం గుసగుసలుపోతున్నారు.లీడర్ చిత్రం తర్వాత రానా 'దమ్మరే దమ్' హిందీ చిత్రంలో నటిస్తున్నాడు. అదేవిధంగా తెలుగు - తమిళ భాషల్లో ఏకకాలంలో ఓ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలకు సంబంధించిన షూటింగ్‌ల్లో బిజీగా ఉన్న రానాకు ఓ సినీ ఫంక్షన్లో శ్రేయ తారస పడిందట. తొలుత 'హాయ్' చెప్పుకున్న ఇద్దరూ ఆ తర్వాత 'హలో' అనుకుని అటు పిమ్మట గంటలకొద్దీ మాటలతో గడిపేయడం మొదలుపెట్టారు. ఈ బంధమే ప్రేమబంధంగా మారిపోయిందని టాలీవుడ్ సినీవర్గాల టాక్. అంతేకాదు ఇటీవల వీళ్లద్దరూ కలిసి హైదరాబాదులోని ఓ ఫైవ్ స్టార్ హోటల్‌లో కలిసి ఎంజాయ్ చేయడం చాలామంది చూశారట కూడా. మరి ఇది నిజమో.. కాదో తెలియాలంటే మరికొంతకాలం ఆగాల్సిందే.
Source: Yahoo! Telugu: Entertainment | 2 Jul 2010 | 7:46 am

బీహార్‌లో నదిలో పడవ బోల్తా: 60 మంది గల్లంతు

బీహార్‌లోని చంపారణ్ జిల్లా గండక్ నదిలో శుక్రవారం ఉదయం ఒక పడవ ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 60 మంది గల్లంతైయ్యారు. గల్లంతైన వారంతా జలసమాధి అయినట్టు భావిస్తున్నారు. గల్లంతైన వారిలో ఇప్పటి వరకు మూడు మృతదేహాలను బయటపడినట్టు అధికారులు వెల్లడించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు, అధికారులు, స్థానికులు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు.
Source: Yahoo! Telugu: News | 2 Jul 2010 | 7:44 am

అమెరికా ఉత్తమ అధ్యక్షుల జాబితాలో ఒబామాకు చోటు

శ్వేతసౌథంలో అడుగుపెట్టిన నల్లాజతి సూరీడు బరాక్ ఒబామా అగ్రరాజ్యం అమెరికా ఉత్తమ అధ్యక్షుల జాబితాలో 15వ స్థానాన్ని దక్కించుకున్నారు. తాజాగా విడుదల చేసిన ఈ జాబితాలో మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్‌ కంటే రెండు స్థానాలు వెనుకబడి పోయారు. ఫ్రాంక్లిన్ డి రూస్‌వెల్ట్ అనే సంస్థ ఒక పోలింగ్ నిర్వహించింది. మొత్తం 43 మంది అమెరికా అధ్యక్షులకు రేటింగ్ ఇవ్వాల్సిందిగా ఈ సర్వే స్కాలర్స్‌కు విజ్ఞప్తి చేసింది.
Source: Yahoo! Telugu: News | 2 Jul 2010 | 7:26 am

మిశ్రమ ఫలితాల్లో బాంబే స్టాక్ మార్కెట్

వారాంతమైన శుక్రవారం బాంబే స్టాక్ మార్కెట్ మిశ్రమ ఫలితాలను నమోదు చేసుకుంటోంది. విదేశీ స్టాక్ మార్కెట్ల ప్రభావంతో బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచి సెన్సెక్స్, శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంటకు కేవలం 15 పాయింట్ల స్వల్ప లాభంతో 17,524 పాయింట్ల మార్కును తాకింది. అయితే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచి నిఫ్టీ మాత్రం -0.50 పాయింట్ల కనిష్ఠ నష్టంతో, 5,250 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది
Source: Yahoo! Telugu: News | 2 Jul 2010 | 7:10 am

స్వల్ప లాభాల్లో బాంబే స్టాక్ మార్కెట్ ర్యాలీ!

బాంబే స్టాక్ మార్కెట్ శుక్రవారం స్వల్ప పాటి ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. ట్రేడింగ్ ప్రారంభంలో లాభాలను ఆర్జించిన బాంబే స్టాక్ మార్కెట్ హెచ్చు తగ్గులతో ర్యాలీని కొనసాగిస్తోంది. ఈ క్రమంలో మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో బాంబే స్టాక్ ఎక్చేంజ్ (సెన్సెక్స్) కేవలం ఆరు పాయింట్ల స్వల్ప వృద్ధితో 17,515 పాయింట్ల మార్కును తాకింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచి నిఫ్టీ కూడా కేవలం 9 పాయింట్ల లాభంతో, 5,261 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.
Source: Yahoo! Telugu: News | 2 Jul 2010 | 6:42 am

ఐటీఏ సాఫ్ట్‌వేర్‌ను కొనుగోలు చేసిన గూగుల్

అంతర్జాల దిగ్గజం గూగుల్ ఇప్పుడు ఆన్‌లైన్ ట్రావెల్ మార్కెట్‌లోనూ అడుగుపెట్టనుంది. మస్సాచుసెట్స్‌కు చెందిన ఐటీఏ సాఫ్ట్‌వేర్‌ను కొనడం ద్వారా గూగుల్ ఈ రంగంలో అడుగు పెట్టనుంది. ఇందుకోసం 700 మిలియన్ డాలర్లను వెచ్చించనున్నట్లు గూగుల్ ఓ ప్రకటనలో తెలిపింది.
Source: Yahoo! Telugu: News | 2 Jul 2010 | 6:39 am

ఒత్తిడితో సతమతమవుతున్నారా...? నా దగ్గరకు రండి: షెర్లిన్

ఆయా వృత్తుల్లో ఒత్తిడికి సతమతమైపోయేవారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. అయితే దాని నుంచి బయటపడేస్తానని చెపుతోందట షెర్లిన్ చోప్రా. నీకది ఎలా సాధ్యం అని ప్రశ్నిస్తే... షెర్లిన్ ఇలా చెప్పుకొచ్చింది. "నా సినిమాలు, ఆల్బమ్‌లు అంతగా పాపులర్ కాక మునుపు కెరీర్ గురించి బాగా డిప్రెస్ అయ్యేదాన్ని. ఒక దశలో ఒంటరిగా కూచుని ఏడ్చేదాన్ని.అలా ఏడిస్తే మాత్రం జరిగేది జరుగకుండా ఆపగలమా...? దేవుడు మనిషికి ఓ జన్మ ఇచ్చాడు. ఈ జన్మలో మనం చేసే పనులను బట్టి ఫలితాలు మారుతుంటాయి. పాజిటివ్ ఫలితాలొచ్చినప్పుడు ఎగిరి గంతేయడం, వ్యతిరేక ఫలితాలు వచ్చినప్పుడు కుంగిపోవడం కూడదన్న సంగతి నేను తెలుసుకున్నాను. అన్నిటికీ మించి తల్లిదండ్రులు లేని, దిక్కులేని అనాధల్లా బతికే పిల్లల ధైర్యాన్ని చూసినప్పుడు నా కెరీర్ విషయంలో నేను పడుతున్న బాధ అర్థం లేనిదనిపించింది. అంతే.. అప్పటినుంచి దేన్నైనా సాధించేవరకూ నిద్రపోయేదాన్ని కాదు. ఒకవేళ 100 శాతం ప్రయత్నం చేసినప్పటికీ దక్కాల్సింది దక్కకపోతే పెద్దగా ఫీలవనవసరం లేదు. దేవుడు నిర్ణయించిందే మనకు దొరుకుతుంది.
Source: Yahoo! Telugu: Entertainment | 2 Jul 2010 | 5:54 am

వాడివేడిగా సాగనున్న పార్లమెంట్ వర్షకాల సమావేశాలు

ఈనెలాఖరు నుంచి జరుగనున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు వాడివేడిగా సాగడం ఖాయమని భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు ఎం.వెంకయ్య నాయుడు జోస్యం చెప్పారు. ఆయన శుక్రవారం చెన్నయ్‌లో విలేకరులతో మాట్లాడుతూ ధరల పెరుగుదలతో పాటు పెట్రో వడ్డనపై ఇతర విపక్షాలను కూడా కలుపుని ప్రభుత్వంపై దాడికి దిగుతామన్నారు.
Source: జాతీయ | 2 Jul 2010 | 3:51 am

అడ్డొస్తే అడ్డంగా నరకమన్న విజయశాంతి పత్తాలేదు!

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అడ్డుపడే వారిని అడ్డంగా నరకమన్న తెలంగాణ రాష్ట్ర సమితి మహిళా నేత విజయశాంతి పత్తాలేకుండా పోయారు. రాములమ్మ చేసిన వ్యాఖ్యలను ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించి, సుమోటాగా స్వీకరించింది. అనతరం ఈ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని ఆమెకు ఈసీ నోటీసు జారీ చేసింది. అంతేకాకండా, ఆమెపై కేసు నమోదు చేయాల్సిందిగా హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ ఏకే.ఖాన్‌ను ఈసీ ఆదేశించింది.
Source: ఏపీ న్యూస్ | 2 Jul 2010 | 3:15 am

"శ్రీకృష్ణ"కు సీమాంధ్రలో ఏం పని...?: కేసీఆర్ ప్రశ్న

తెలంగాణా ప్రజల హక్కులను, ప్రయోజనాలను కొల్లగొడుతున్న సీమాంధ్ర నాయకుల జులుం నుంచి తెలంగాణాను విముక్తం చేయాలని ఒకవైపు నాలుగుకోట్లమంది తెలంగాణావాసులు అడుగుతుంటే అందుకు విరుద్ధంగా కేంద్రం పనులు చేసుకుంటూ పోతోందని తెరాస అధినేత కేసీఆర్ మండిపడ్డారు.
Source: ఏపీ న్యూస్ | 2 Jul 2010 | 2:21 am

బీహార్‌లో నదిలో పడవ బోల్తా: 60 మంది గల్లంతు

బీహార్‌లోని చంపారణ్ జిల్లా గండక్ నదిలో శుక్రవారం ఉదయం ఒక పడవ ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 60 మంది గల్లంతైయ్యారు. గల్లంతైన వారంతా జలసమాధి అయినట్టు భావిస్తున్నారు. గల్లంతైన వారిలో ఇప్పటి వరకు మూడు మృతదేహాలను బయటపడినట్టు అధికారులు వెల్లడించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు, అధికారులు, స్థానికులు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు.
Source: జాతీయ | 2 Jul 2010 | 2:15 am

రాములమ్మ నోటికి తాళం వేసిన ఎన్నికల సంఘం!

రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీల్లో కొందరు మాత్రమే తమ నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటారు. కాంగ్రెస్, తెదేపా, తెరాస, ప్రజారాజ్యం పార్టీలలో అతికొద్ది మంది మాత్రమే ఉన్నారు. ఇలాంటి వారిలో లగడపాటి రాజగోపాల్, ఉండవల్లి అరుణ్ కుమార్ (కాంగ్రెస్), గాలిముద్దుకృష్ణమ నాయుడు (తెదేపా), కేసీఆర్, విజయశాంతి (తెరాస), శోభారాణి (ప్రరాపా)లు ప్రముఖులు.
Source: ఏపీ న్యూస్ | 2 Jul 2010 | 1:17 am

ధర్మపురిపై రోశయ్యకు తెలంగాణ రెడ్డి కోటరీ ఫిర్యాదు!

ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్‌పై తెలంగాణ ప్రాంతానికి చెందిన రెడ్డి కోటరీ ముఖ్యమంత్రి కె.రోశయ్యకు ఫిర్యాదు చేశారు. నిజామాబాద్ గ్రామీణ స్థానం నుంచి పోటీ చేయనున్న డీఎస్.. తాను ఎన్నికల్లో గెలిస్తే ఉప ముఖ్యమంత్రిని అవుతానని సొంత ప్రచారం చేసుకోవడం పట్ల ఈ కోటరీ ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతటితో ఆగని రెడ్డి కోటరీకి చెందిన జానారెడ్డి, దామోదర్ రెడ్డి, వెంకటరెడ్డి తదితరులు ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు.
Source: ఏపీ న్యూస్ | 2 Jul 2010 | 12:54 am

మధ్యంతర ఎన్నికల నివారణకే మద్దతు: రామ్ గోపాల్

దేశంలో మధ్యంతర ఎన్నికలు జరుగకుండా నివారించేందుకు, మతవాదశక్తులు అధికారంలోకి రాకుండా అడ్డుకునేందుకే కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ సర్కారుకు మద్దతు ఇస్తున్నట్టు సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ తనయుడు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ గోపాల్ యాదవ్ అభిప్రాయపడ్డారు. కేంద్ర అమలు చేస్తున్న కొన్ని విధానాలు ప్రజా సంక్షేమానికి వ్యతిరేకంగా ఉన్నప్పటికీ పై రెండు కారణాల వల్ల బయట నుంచి మద్దతు ఇస్తున్నట్టు ఆయన తెలిపారు.
Source: జాతీయ | 2 Jul 2010 | 12:13 am

హస్తినకు రోశయ్య-పీసీసీ చీఫ్: అభ్యర్థుల ఎంపికపై చర్చ!

ముఖ్యమంత్రి రోశయ్య, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్‌లు శుక్రవారం ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. వారు రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖామంత్రి పొన్నాల లక్ష్మయ్యను కూడా వెంటబెట్టుకుని వెళ్లారు. ఈనెల 27వ తేదీన జరుగనున్న 12 అసెంబ్లీ నియోజకవర్గాల స్థానాలకు జరిగే ఉప ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ఖరారు చేసే అంశంపై వీరు ప్రధానంగా చర్చిస్తారు. ఇందుకోసం పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌లతో భేటీ అవుతారు.
Source: ఏపీ న్యూస్ | 2 Jul 2010 | 12:01 am

నివేదిక ఇవ్వండి.. పోటీ నుంచి తప్పుకుంటాం: కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావుకు ఓటమి భయం పట్టుకున్నట్టుగా ఉంది. ఈ మధ్య కాలంలో ఆయన చేస్తున్న ప్రకటనలే ఈ అనుమానాన్ని మరింత నిజం చేస్తున్నాయి. ఎన్నికల్లో ఒంటికాలిపై "సై" అనే కేసీఆర్.. ఈనెలాఖరులో జరుగనున్న ఉప ఎన్నికలపై మాత్రం ఆయన తీవ్ర ఆందోళనకు గురవుతున్నట్టు కనిపిస్తోంది.
Source: ఏపీ న్యూస్ | 1 Jul 2010 | 11:46 pm

అదిలాబాద్‌లో ఎదురుకాల్పులు: ఇద్దరు మావోల మృతి!

అదిలాబాద్ జిల్లా వాకిండి మండలం వెలిగి-సర్కేపల్లి అటవీ ప్రాంతంలో శుక్రవారం తెల్లవారుజామున పోలీసులకు మావోయిస్టులకు ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు నక్సలైట్లు హతమయ్యారు. వీరిలో సీపీఎం మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు చెరుకూరి రాజ్‌కుమార్ అలియాస్ ఆజాద్ ఉన్నారు. మావోయిస్టు అగ్రనేత మల్లోజుల కోటేశ్వర రావు తర్వాతి స్థానంలో ఆజాద్ ఉన్నారు. ఈ విషయాన్ని ఆ జిల్లా ఎస్పీ ప్రాథమికంగా నిర్ధారించారు.
Source: ఏపీ న్యూస్ | 1 Jul 2010 | 11:33 pm

ఉప ఎన్నికల పోరు: నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ

రాష్ట్రంలో ఉప ఎన్నికల సందడి ఆరంభమైంది. ఉప ఎన్నికలు జరిగే 12 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికల కమిషన్ శుక్రవారం అధికారపూర్వకంగా నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో 11 గంటల నుంచి నామినేషన్ల స్వీకరణ ఘట్టం ఆరంభమైంది. ఉప ఎన్నికలు జరిగే నియోజకవర్గాలకు ఈనెల రెండో తేదీ నుంచి తొమ్మిదో తేదీ వరకు నామినేషన్లను స్వీకరిస్తారు.
Source: ఏపీ న్యూస్ | 1 Jul 2010 | 11:11 pm

పైలట్ల తప్పిదమే వైఎస్ హెలికాఫ్టర్ ప్రమాదానికి కారణం!

దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి ప్రయాణించిన హెలికాఫ్టర్ ప్రమాదానికి గురికావడం వెనుక ఎలాంటి కుట్ర లేదని కేంద్ర నేర పరిశోధనా సంస్థ (సీబీఐ) స్పష్టం చేసింది. పైలట్లు తప్పిదం వల్లే ఈ ఘోరం చోటు చేసుకున్నట్టు ఈ ప్రమాదంపై దర్యాప్తు జరిపిన సీబీఐ గురువారం రాత్రి ఢిల్లీలో విడుదల చేసింది. హెలికాఫ్టర్ ఘటనలో కుట్ర కోణంపై విస్తృత దర్యాప్తు జరిపి నివేదిక సమర్పించిన సీబీఐ.. ఆ నివేదికను ఆధారంగా చేసుకుని 17 నిమిషాల నిడివి కలిగిన డాక్యుమెంటరీ వీడియోను కూడా రూపొందించింది.
Source: జాతీయ | 1 Jul 2010 | 10:36 pm

వచ్చే నెలలో స్వదేశీ క్షిపణి రక్షక వ్యవస్థ పాటవ పరీక్ష

వచ్చే నెలలో స్వదేశీ క్షిపణి రక్షక వ్యవస్థ పాటవ పరీక్షను నిర్వహించనున్నట్టు రక్షణ రంగ పరిశోధన, అభివృద్ధి సంస్థ చీఫ్ వి.కె.సారస్వత్ వెల్లడించారు. ఇది పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసినట్టు ఆయన తెలిపారు. ఈ క్షిపణి రక్షక వ్వయస్థ పాటవ పరీక్ష విజయవంతమైతే ఈ వ్యవస్థను కలిగిన ఏడు ప్రపంచ దేశాల జాబితాలో భారత్ కూడా చోటు దక్కించుకుంటుంది.
Source: జాతీయ | 1 Jul 2010 | 10:14 pm

"ఝుమ్మంది నాదం" వింటే బావుంటుంది. మరి చూస్తేనో...

సినిమాలు సిన్సియర్‌గా తీయడం, సరదాగా తీయడం రెండు రకాలు. రెండో రకానికి చెందిన సినిమానే "ఝుమ్మంది నాదం". కథలో బలం లేకపోవడం, మోహన్ బాబు మరీ ఓవర్‌గా చేయడం వెరసి "ఝుమ్మంది నాదం" ప్రేక్షకుల చెవుల్లో 'ఢామ్' అనే నాదం అనిపిస్తుంది. పాటలుపరంగా కీరవాణి, రాఘవేంద్రరావు కాంబినేషన్ తరహాలో విజువలైజేషన్, వినడానికి వినసొంపుగా ఉన్నాయి. కథానాయిక తాప్సీ అందాలతో కేవలం పాటలవరకే ప్రాధాన్యతనిచ్చి మాస్ జేబులు కొట్టాలని చూసే ప్రయత్నమనే చెప్పాలి.
Source: Yahoo! Telugu: Entertainment | 1 Jul 2010 | 11:53 am

జూలై 4,5 తేదీలలో హైదరాబాద్ షార్ట్ ఫిలిమ్ ఫెస్టివల్

హైదరాబాద్ షార్ట్ ఫిలిమ్ ఫెస్టివల్ ప్రారంభోత్సవం ఈ నెల 3,4 తేదీలలో జూబ్లిహిల్స్‌లోని స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో జరుగనుంది. సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి శ్రీమతి గీతారెడ్డి చేతుల మీదుగా ఈ వేడుక ఆరంభం కానుంది. దేశ విదేశాల నుంచి 285 చిత్రాలు ఎంట్రీకి రాగా.. అందులో ఫైనల్‌గా 50 చిత్రాలను ఎంపిక చేశారు. 3,4న ఈ చిత్రాల ప్రదర్శన జరుగుతుంది. ఈ వేడుకకు ఎంవీయస్ స్టూడియో ఆధ్వర్యంలో ప్రముఖ రచయిత దివాకర్ బాబు ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా, శ్రీచైతన్య చీఫ్ కో-ఆర్డినేటర్‌గా వ్యవహరిస్తున్నారు. ఉత్తమ ఫిక్షన్, ఉత్తమ యానిమేషన్, ఉత్తమ డైరెక్టర్, ఉత్తమ కాన్సెప్ట్, ఉత్తమ ఫోటోగ్రఫీ, ఉత్తమ ఎడిటర్, జ్యూరీ అవార్డ్... ఈ ఎనిమిది విభాగాలకు బహుమతి ప్రదానం చేయనున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 1 Jul 2010 | 10:34 am

తెలంగాణ నేతలు సన్నాసులు: తెరాస అధినేత కేసీఆర్

తెలంగాణ ప్రాంతంలో ఉన్న రాజకీయ నేతలు సన్నాసులు, చవటదద్దమ్మలని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర రావు మరోమారు ధ్వజమెత్తారు. గురువారం మధ్యాహ్నం ఆయన తెలంగాణ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీమాంధ్ర నేతలతో పోల్చుకుంటే తెలంగాణ నేతలు ఎందుకు పనికిరాని సన్నాసులు అని చెప్పారు.
Source: ఏపీ న్యూస్ | 1 Jul 2010 | 6:52 am

అర్థనగ్నం అయిపోయింది..! ఇక నగ్నమే మిగిలి ఉంది..!!

కంగనా రనౌత్ పేరు చెబితే బాలీవుడ్ కుర్రాళ్లు ఊగిపోతారు. ఆమెకు అక్కడున్న క్రేజ్ అటువంటిది మరి. కుర్రాళ్లలో తన పట్ల అదే ఊపును కొనసాగించాలంటే ఏం చేయాలీ...? అని కంగనా అనుక్షణం ఆలోచిస్తుంటుందట. తీరిక దొరికినపుడల్లా తను ఇప్పటికే నటించిన సినిమాలను మళ్లీ మళ్లీ చూస్తోందట. ఆ సినిమాల్లో తను ఎలాంటి తప్పులు చేశాననే సమీక్ష నిర్వహించుకుంటుందట.ఆ సమీక్షలో తను ఇప్పటివరకూ కిస్సింగ్ సీన్లు, అర్థనగ్నంగా నటించిన సీన్లు అన్నీ దాదాపుగా వచ్చేశాయట. ఇక మిగిలింది నగ్నంగా నటించటమేనని కంగనా తన సన్నిహితుల వద్ద చెప్పిందట. కావాలని నగ్నంగా నటించినట్లు కాకుండా కథానుసారంగా నగ్నంగా నటించాలని కంగనా ఉవ్విళ్లూరుతోందట. అయితే అది సందర్భానుసారంగా మాత్రమే ఉండాలని కండిషన్లు పెడుతోందట.హాలీవుడ్ దర్శకుల వద్ద బోలెడన్న "నగ్న" కథలు ఉంటాయన్న సంగతిని కంగనాకు ఎవరూ చెప్పలేదేమో..!!
Source: Yahoo! Telugu: Entertainment | 1 Jul 2010 | 6:31 am

ముగ్గురు గ్రామస్తులను హతమార్చిన నక్సల్స్

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో నక్సల్స్ మరో దారుణానికి ఒడిగట్టారు. నారాయణపూర్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఎక్డా సీఆర్‌పీఎఫ్ క్యాంపుకు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న వల్ హితుల్వాడా అనే గ్రామానికి చెందిన ముగ్గురు గ్రామస్తులను హత్య చేశారు. పోలీసులు సమాచారం చేరవేస్తున్నారన్న ప్రధాన ఆరోపణపై వీరిని హతమార్చినట్టు పోలీసులు వెల్లడించారు. గ్రామస్తులను హత్యచేసిన మావోయిస్టుల కోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
Source: జాతీయ | 1 Jul 2010 | 6:16 am

గమ్మత్తు "ముద్దు"లతో పెరుగుతున్న సెలబ్రిటీల స్టేటస్!

చుంబనం ధూర్తలక్షణం కాకపోవచ్చు. కానీ.. బహిరంగ ప్రదేశాల్లో (పబ్లిక్‌ ప్లేస్)లలో మాత్రం ఇది నిషిద్ధం. పాశ్చాత్య దేశాల్లో ఈ నిషేధాజ్ఞలు కూడా లేవు. విచ్చలవిడికి మారుపేరు పేరైనా హాలీవుడ్‌ చిత్రరంగానికి చెందిన సెలబ్రిటీలు ఈ అవకాశాన్ని బాగా ఉపయోగించుకుంటున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 1 Jul 2010 | 5:23 am

ఉప సమరం: ఐదు జిల్లాల్లో ఎన్నికల సంఘం కొరడా

ఉప ఎన్నికలు జరిగే ఐదు తెలంగాణ జిల్లాల్లో ఎన్నికల కమిషన్ కొరడా ఝుళిపించింది. ఐదు జిల్లాల్లో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పక్కాగా అమలు చేసేలా చర్యలు చేపట్టింది. ఇందులోభాగంగా, అక్రమంగా నిర్వహిస్తున్న 1629 బెల్టు షాపులను మూసి వేసినట్టు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఐ.వి.సుబ్బారావు వెల్లడించారు.
Source: ఏపీ న్యూస్ | 1 Jul 2010 | 5:10 am

జూలై 4,5 తేదీలలో హైదరాబాద్ షార్ట్ ఫిలిమ్ ఫెస్టివల్

హైదరాబాద్ షార్ట్ ఫిలిమ్ ఫెస్టివల్ ప్రారంభోత్సవం ఈ నెల 3,4 తేదీలలో జూబ్లిహిల్స్‌లోని స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో జరుగనుంది. సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి శ్రీమతి గీతారెడ్డి చేతుల మీదుగా ఈ వేడుక ఆరంభం కానుంది. దేశ విదేశాల నుంచి 285 చిత్రాలు ఎంట్రీకి రాగా.. అందులో ఫైనల్‌గా 50 చిత్రాలను ఎంపిక చేశారు. 3,4న ఈ చిత్రాల ప్రదర్శన జరుగుతుంది. ఈ వేడుకకు ఎంవీయస్ స్టూడియో ఆధ్వర్యంలో ప్రముఖ రచయిత దివాకర్ బాబు ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా, శ్రీచైతన్య చీఫ్ కో-ఆర్డినేటర్‌గా వ్యవహరిస్తున్నారు. ఉత్తమ ఫిక్షన్, ఉత్తమ యానిమేషన్, ఉత్తమ డైరెక్టర్, ఉత్తమ కాన్సెప్ట్, ఉత్తమ ఫోటోగ్రఫీ, ఉత్తమ ఎడిటర్, జ్యూరీ అవార్డ్... ఈ ఎనిమిది విభాగాలకు బహుమతి ప్రదానం చేయనున్నారు.
Source: వినోదం | 1 Jul 2010 | 5:05 am

వరుస హత్యలు: ముంబైలో సైకో కిల్లర్‌ను అరెస్టు

ముగ్గురు బాలికలను కిడ్నాప్ చేసి హత్య చేసిన కేసులో ముంబై మహానగర పోలీసులు గురువారం ఒక సైకో కిల్లర్‌ను అరెస్టు చేశారు. ముంబై, కుర్లాకు చెందిన ముగ్గురు మైనర్ బాలికలు గత ఫిబ్రవరిలో కిడ్నాప్‌కు గురయ్యారు. ఆ తర్వాత వీరిపై అత్యాచారం, హత్య చేసిన కేసులో ఈ సైకో కిల్లర్‌ను అరెస్టు చేసినట్టు ముంబై పోలీసులు వెల్లడించారు. ఈ అరెస్టుతో కేసుల్లో ఐదు నెలలుగా ఉన్న మిస్టరీ వీడిపోయిందన్నారు.
Source: జాతీయ | 1 Jul 2010 | 4:35 am