నష్టాల్లో కూరుకుపోయిన విదేశీ స్టాక్ మార్కెట్లు

అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లు గురువారం నష్టాల్లో కూరుకుపోయాయి. బాంబే స్టాక్ మార్కెట్‌తో పాటు ఆసియా, అమెరికా, యూరప్ స్టాక్ మార్కెట్లు నష్టాలను చవిచూశాయి. ట్రేడింగ్ బలహీనత కారణంగా విదేశీ మార్కెట్లు భారీగా క్షీణించాయి. ఈ క్రమంలో బాంబే స్టాక్ మార్కెట్ కూడా గురువారం నష్టాలతో ర్యాలీని ముగించింది.
Source: Yahoo! Telugu: News | 1 Jul 2010 | 9:29 am

శ్రీవారికి శఠగోపం.. శిక్ష తప్పదంటున్న చంద్రబాబు!

భక్తుల కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామికి శఠగోపం పెట్టే వారికి శ్రీనివాసుడు తప్పకుండా శిక్షిస్తారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు జోస్యం చెప్పారు. శ్రీవారికి శ్రీకృష్ణ దేవరాయలు సమర్పించిన ఆభరణాలు మాయమైన అంశంపై చంద్రబాబు గురువారం విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ సర్కారుపై నిప్పులు చెరిగారు. పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కాంగ్రెస్ నేతలు భ్రష్టుపట్టించారని ఆరోపించారు.
Source: Yahoo! Telugu: News | 1 Jul 2010 | 9:29 am

ఆపిల్‌కు దీటుగా కిస్కో టాబ్లెట్ కంప్యూటర్‌!

ఆపిల్‌కు దీటుగా కిస్కో టాబ్లెట్ కంప్యూటర్‌ను తయారు చేయనుంది. దీనికి "కిస్కో సీఅస్" అనే పేరును ఖరారు చేసింది. ఇది గూగుల్ ఓపెన్ సోర్స్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. దీని బ్యాటరీ కాలం మన్నిక 8 గంటలు. ఈ సంవత్సరంలో కస్టమర్ ట్రైల్స్ ప్రారంభించనున్నట్లు కిస్కో తెలిపింది. అయితే వచ్చే సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఈ పరికరాన్ని అందుబాటులోకి తీసుకు వస్తున్నట్లు సంస్థ తెలిపింది.
Source: Yahoo! Telugu: News | 1 Jul 2010 | 9:08 am

ఉప ముఖ్యమంత్రి చేపట్టేందుకు సిద్ధం: ధర్మపురి శ్రీనివాస్

నిజామాబాద్ గ్రామీణ అసెంబ్లీ స్థానం నుంచి తాను గెలుపొందితే ఉప ముఖ్యమంత్రి పదవిని చేపడుతానని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ ప్రచారం చేసుకుంటున్నారు. తన సొంత నియోజకవర్గంలో ఆయన ఉప ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరంగా సాగిస్తున్న విషయం తెల్సిందే.
Source: Yahoo! Telugu: News | 1 Jul 2010 | 9:01 am

ఉప ఎన్నికల్లో తెరాసకు మద్దతు ఇవ్వం: మంద కృష్ణ

తెలంగాణ ప్రాంతంలో జరుగనున్న 12 అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితికి మద్దతు ఇవ్వబోమని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) అధ్యక్షుడు మందా కృష్ణ మాదిగ ప్రకటించారు. కాకతీయ యూనివర్శిటీలో తనపై జరిగిన దాడిని తెరాస అధినేత కేసీఆర్ మాటమాత్రానికైనా ఖండించలేదని ఆయన ఆరోపించారు. అందువల్లే ఉప ఎన్నికల్లో ఆ పార్టీకి మద్దతు ఇవ్వకూడదని నిర్ణయించుకున్నట్టు ఆయన తెలిపారు.
Source: Yahoo! Telugu: News | 1 Jul 2010 | 8:46 am

నష్టాల్లో స్టాక్ మార్కెట్: తిరోగమనంలో సెన్సెక్స్ ర్యాలీ!

దేశీయ వాటాలు అమ్మకాల ఒత్తిడికి గురికావడంతో బాంబే స్టాక్ మార్కెట్ గురువారం నష్టాల్లో కూరుకుపోయింది. ట్రేడింగ్ ప్రారంభం నుంచే తిరోగమనం వైపు పయనిస్తున్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచి సెన్సెక్స్, మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో 180 పాయింట్లు కోల్పోయింది. దీంతో సెన్సెక్స్ సూచి 17,520 పాయింట్ల మార్కును తాకింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచి నిఫ్టీ కూడా 69 పాయింట్లు పతనమై, 5,243 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.
Source: Yahoo! Telugu: News | 1 Jul 2010 | 8:43 am

తెరాసకు షాక్: ఉప పోరులో అమరవీరుల కుటుంబాలు!

ఊహించినట్టుగానే తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర రావు ఒంటెద్దు పోకడలకు బ్రేక్ పడనుంది. ఇప్పటికే ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు ఉప ఎన్నికల బరిలో అభ్యర్థులను దింపాలని నిర్ణయించుకున్నాయి. తాజాగా, తెలంగాణ డెమొక్రాటిక్ ఫ్రంట్‌తో పాటు.. తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరుల కుటుంబాలకు చెందిన వారిని బరిలోకి దించాలని విద్యార్థి సంఘాల నేతలు నిర్ణయించారు.
Source: Yahoo! Telugu: News | 1 Jul 2010 | 8:34 am

స్టాక్ మార్కెట్: సెన్సెక్స్ 154 పాయింట్ల పతనం!

బాంబే స్టాక్ మార్కెట్ గురువారం నష్టాల్లో కూరుకుపోయింది. ట్రేడింగ్ ప్రారంభం నుంచే తిరోగమనం వైపు ర్యాలీని కొనసాగించిన బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచి సెన్సెక్స్, గురువారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో 154 పాయింట్లు పతనమై, 17,546 పాయింట్ల మార్కును తాకింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచి నిఫ్టీకూడా 48 పాయింట్లు క్షీణించి, 5,264 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.
Source: Yahoo! Telugu: News | 1 Jul 2010 | 8:07 am

పెరుగుదల సరైన దారిలోనే ఉంది : ఒబామా

అమెరికా ఆర్థిక వ్యవస్థ సరైన దారిలోనే పయనిస్తోందని అయితే, ఆశించినంత త్వరగా కోలుకోవడం లేదని ఆ దేశ అధ్యక్షుడు బరాక్ ఒబామా అన్నారు. రేసిన్‌లోని టౌన్‌హాల్లో జరిగిన ఓ సదస్సులో ప్రధాని బరాక్ ఒబామా అన్నారు. ఈ రోజు ఆర్థిక వ్యవస్థ మళ్లీ పెరుగుతుందని, ప్రైవేట్ సెక్టార్‌లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని దాని కారణంగా దేశ ఆర్థిక వ్వవస్థ పెరుగుతుందని ఈ పెరుగుదల సరైన దారిలోనే కొనసాగుతుందని ఒబామా అన్నారు.
Source: Yahoo! Telugu: News | 1 Jul 2010 | 7:52 am

విదేశీ స్టాక్ మార్కెట్ల ప్రభావం: నష్టాల్లో సెన్సెక్స్, నిఫ్టీ!

అంతర్జాతీయ స్టాక్ మార్కెట్ల ప్రభావంతో బాంబే స్టాక్ మార్కెట్ నష్టాలను చవిచూసింది. ట్రేడింగ్ ప్రారంభం నుంచే తిరోగమనం వైపు పయనిస్తోన్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచి సెన్సెక్స్, గురువారం మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో 218 పాయింట్లు పతనమైంది. దీంతో సెన్సెక్స్ సూచి 17,482 పాయింట్ల మార్కును తాకింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచి నిఫ్టీ కూడా 68 పాయింట్లు పడిపోయి, 5,243 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.
Source: Yahoo! Telugu: News | 1 Jul 2010 | 7:33 am

అర్థనగ్నం అయిపోయింది..! ఇక నగ్నమే మిగిలి ఉంది..!!

కంగనా రనౌత్ పేరు చెబితే బాలీవుడ్ కుర్రాళ్లు ఊగిపోతారు. ఆమెకు అక్కడున్న క్రేజ్ అటువంటిది మరి. కుర్రాళ్లలో తన పట్ల అదే ఊపును కొనసాగించాలంటే ఏం చేయాలీ...? అని కంగనా అనుక్షణం ఆలోచిస్తుంటుందట. తీరిక దొరికినపుడల్లా తను ఇప్పటికే నటించిన సినిమాలను మళ్లీ మళ్లీ చూస్తోందట. ఆ సినిమాల్లో తను ఎలాంటి తప్పులు చేశాననే సమీక్ష నిర్వహించుకుంటుందట.ఆ సమీక్షలో తను ఇప్పటివరకూ కిస్సింగ్ సీన్లు, అర్థనగ్నంగా నటించిన సీన్లు అన్నీ దాదాపుగా వచ్చేశాయట. ఇక మిగిలింది నగ్నంగా నటించటమేనని కంగనా తన సన్నిహితుల వద్ద చెప్పిందట. కావాలని నగ్నంగా నటించినట్లు కాకుండా కథానుసారంగా నగ్నంగా నటించాలని కంగనా ఉవ్విళ్లూరుతోందట. అయితే అది సందర్భానుసారంగా మాత్రమే ఉండాలని కండిషన్లు పెడుతోందట.హాలీవుడ్ దర్శకుల వద్ద బోలెడన్న "నగ్న" కథలు ఉంటాయన్న సంగతిని కంగనాకు ఎవరూ చెప్పలేదేమో..!!
Source: Yahoo! Telugu: Entertainment | 1 Jul 2010 | 6:31 am

గమ్మత్తు "ముద్దు"లతో పెరుగుతున్న సెలబ్రిటీల స్టేటస్!

చుంబనం ధూర్తలక్షణం కాకపోవచ్చు. కానీ.. బహిరంగ ప్రదేశాల్లో (పబ్లిక్‌ ప్లేస్)లలో మాత్రం ఇది నిషిద్ధం. పాశ్చాత్య దేశాల్లో ఈ నిషేధాజ్ఞలు కూడా లేవు. విచ్చలవిడికి మారుపేరు పేరైనా హాలీవుడ్‌ చిత్రరంగానికి చెందిన సెలబ్రిటీలు ఈ అవకాశాన్ని బాగా ఉపయోగించుకుంటున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 1 Jul 2010 | 5:23 am

శ్రీవారికి శఠగోపం.. శిక్ష తప్పదంటున్న చంద్రబాబు!

భక్తుల కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామికి శఠగోపం పెట్టే వారికి శ్రీనివాసుడు తప్పకుండా శిక్షిస్తారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు జోస్యం చెప్పారు. శ్రీవారికి శ్రీకృష్ణ దేవరాయలు సమర్పించిన ఆభరణాలు మాయమైన అంశంపై చంద్రబాబు గురువారం విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ సర్కారుపై నిప్పులు చెరిగారు. పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కాంగ్రెస్ నేతలు భ్రష్టుపట్టించారని ఆరోపించారు.
Source: ఏపీ న్యూస్ | 1 Jul 2010 | 4:00 am

ఉప ముఖ్యమంత్రి చేపట్టేందుకు సిద్ధం: ధర్మపురి శ్రీనివాస్

నిజామాబాద్ గ్రామీణ అసెంబ్లీ స్థానం నుంచి తాను గెలుపొందితే ఉప ముఖ్యమంత్రి పదవిని చేపడుతానని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ ప్రచారం చేసుకుంటున్నారు. తన సొంత నియోజకవర్గంలో ఆయన ఉప ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరంగా సాగిస్తున్న విషయం తెల్సిందే.
Source: ఏపీ న్యూస్ | 1 Jul 2010 | 3:32 am

ఉప ఎన్నికల్లో తెరాసకు మద్దతు ఇవ్వం: మంద కృష్ణ

తెలంగాణ ప్రాంతంలో జరుగనున్న 12 అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితికి మద్దతు ఇవ్వబోమని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) అధ్యక్షుడు మందా కృష్ణ మాదిగ ప్రకటించారు. కాకతీయ యూనివర్శిటీలో తనపై జరిగిన దాడిని తెరాస అధినేత కేసీఆర్ మాటమాత్రానికైనా ఖండించలేదని ఆయన ఆరోపించారు. అందువల్లే ఉప ఎన్నికల్లో ఆ పార్టీకి మద్దతు ఇవ్వకూడదని నిర్ణయించుకున్నట్టు ఆయన తెలిపారు.
Source: ఏపీ న్యూస్ | 1 Jul 2010 | 3:17 am

ఉప సమరం: ఏడు స్థానాల్లో వీరుల కుటుంబ సభ్యులు!

తెలంగాణ ప్రాంతంలో జరుగనున్న 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏడింటిలో అమర వీరుల కుటుంబాలకు చెందిన అభ్యర్థులు పోటీ చేయనున్నారు. ఈ విషయాన్ని తెలంగాణ యూత్ ఫోర్స్ వెల్లడించింది. ఇందులోభాగంగా, ఇప్పటికే మూడు నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఖరారు చేసినట్టు తెలిపింది.
Source: ఏపీ న్యూస్ | 1 Jul 2010 | 1:57 am

ఈనెలలో రాష్ట్రానికి రానున్న రాష్ట్రపతి - ప్రధానమంత్రి

దేశాధ్యక్షురాలు, దేశ ప్రధానమంత్రి ఐదురోజుల వ్యవధిలో రాష్ట్రానికి రానున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనున్న శ్రీకృష్ణదేవరాయల పంచ శతాబ్ధి ఉత్సవాల్లో పాల్గొనేందుకు రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ భాగ్యనగరానికి వస్తున్నారు. ఆ తర్వాత మన్నవరంలో నిర్మించే విద్యుత్ ఉవకరణాల ప్రాజెక్టు శంకుస్థాపన కోసం ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్‌లు తిరుపతికి వస్తున్నారు. వీరిద్దరి పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ఖరారైంది.
Source: ఏపీ న్యూస్ | 1 Jul 2010 | 1:21 am

ఉప ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి: సుబ్బారావు

ఈనెల 27వ తేదీన జరుగనున్న ఉప ఎన్నికల కోసం ఏర్పాట్లన్నీ పూర్తయినట్టు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఐవీ.సుబ్బారావు వెల్లడించారు. ఈ ఎన్నికలకు సంబంధించి అధికార పూర్వక నోటిఫికేషన్‌ను శుక్రవారం విడుదల చేస్తామని ఆయన తెలిపారు.
Source: ఏపీ న్యూస్ | 1 Jul 2010 | 1:15 am

కులగణనపై నేడు మంత్రివర్గ ఉప సంఘం భేటీ!

2011 జనాభా లెక్కల్లో భాగంగా కులగణనకు అనుమతి ఇచ్చే అంశంపై తుది నిర్ణయం తీసుకునేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గ ఉపసంఘం భేటీ కానుంది. ప్రస్తుతం సాగుతున్న జనాభాలెక్కల సేకరణను కులాలవారీగా చేపట్టాలని లాలూ ప్రసాద్ యాదవ్ (ఆర్జేడీ), శరద్ యాదవ్ (జేడీయూ), ములాయం సింగ్ యాదవ్ (ఎస్పీ)లు డిమాండ్ చేస్తున్న విషయం తెల్సిందే.
Source: జాతీయ | 1 Jul 2010 | 12:51 am

పూర్తిగా నిరాశపరిచిన మన్మోహన్ సింగ్: సీఎం చౌహాన్

భోపాల్ దుర్ఘటనలో యూనియన్ కార్బైడ్ మాజీ అధినేత వారెన్ ఆండర్సన్ అప్పగింత వ్యవహారం, బాధితులకు నష్టపరిహారం చెల్లింపు అంశాలపై ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ పూర్తిగా నిరాశపరిచారని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అభిప్రాయపడ్డారు. టొరంటో సదస్సుకు హాజరైన అమెరికా అధ్యక్షుడు ఒబామాతో భేటీ అయిన ప్రధాని మన్మోహన్ ఈ అంశాలను మాటమాత్రమైన ప్రస్తావించక పోవడం పట్ల చౌహాన్ అసంతృప్తి వ్యక్తం చేశాడు.
Source: జాతీయ | 1 Jul 2010 | 12:24 am

జమ్మూకాశ్మీర్‌లో యధావిధిగా సాగుతున్న అల్లర్లు

జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో గత వారం రోజులుగా చెలరేగిన అల్లర్లు, హింసాకాండ యధావిధిగా కొనసాగుతోంది. అల్లరి మూకలను అదుపు చేసేందుకు సమస్యాత్మక ప్రాంతాల్లో భారీ ఎత్తున సాయుధ బలగాలను మొహరించారు. ఇదిలావుండగా, ఈ హింసాకాండ మరికొన్ని ప్రాంతాలకు విస్తరించింది. దీంతో కర్ఫ్యూను ఆయా ప్రాంతాలకు కూడా పొడగించారు.
Source: జాతీయ | 1 Jul 2010 | 12:13 am

తెలంగాణకు అడ్డొస్తే అడ్డంగా నరకండి: విజయశాంతి

తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) మహిళా నేత, మెదక్ లోక్‌సభ సభ్యురాలు విజయశాంతి కూడా ఆ పార్టీ అధినేత కె.చంద్రశేఖర రావు పంథాను ఎంచుకున్నారు. సీమాంధ్ర నేతలపై మాటల తూటాలు పేల్చుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఎవరైనా అడ్డొస్తే అడ్డంగా నరకాలని ఆమె పిలుపునిచ్చారు.
Source: ఏపీ న్యూస్ | 30 Jun 2010 | 11:04 pm

కాశ్మీర్‌లో ఆందోళనలు: అమర్‌నాథ్ యాత్ర ప్రారంభం!

కాశ్మీర్ లోయలో ఒకవైపు ఆందోళనలు కొనసాగుతున్నప్పటికీ మరోవైపు అమర్‌నాథ్ యాత్ర బుధవారం ప్రారంభమైంది. కాశ్మీర్‌లోయలోని అమర్‌నాథ్ గుహను సందర్శించేందుకు వచ్చే యాత్రికులు, భక్తులకు పటిష్ట భద్రత కల్పించే దిశగా కాశ్మీర్ పోలీసు యంత్రాంగం తగిన ఏర్పాట్లు చేసింది.
Source: జాతీయ | 30 Jun 2010 | 10:05 pm

తాప్సీ నవ్వుకే "పడిపోతున్న" దర్శకనిర్మాతలు

ఇపుడు టాలీవుడ్ సినీ పరిశ్రమ తాప్సీ జపం చేస్తోందనే చెప్పాలి. "ఝుమ్మంది నాదం" చిత్రంతో తెరంగేంట్రం చేస్తున్న ఈ ఢిల్లీ పిల్ల తన తొలి చిత్రం విడుదలకు ముందే ఎందరి హృదయాలనో కొల్లగొడుతోంది. ముఖ్యంగా ఆమె నవ్వును చూస్తే ఎవ్వరైనా "ఇదై" పోవడం ఖాయమంటున్నారట తమిళ దర్శకనిర్మాతలు.తాప్సీ నటించిన చిత్రం "ఝుమ్మంది నాదం" ప్రొమోలలో కేవలం ఆమె నవ్వును చూసి ఇద్దరు నిర్మాతలు ఆమెకు తమ చిత్రాల్లో ఆఫర్ ఇచ్చారంటే ఆ నవ్వుకున్న పవర్ ఏమిటో అర్థమవుతుంది. అన్నట్లు తమిళంలో త్రిష హీరోయిన్‌గా రూపొందనున్న ఓ చిత్రంలో ఆమెను నెట్టేసి ఆ స్థానంలో తాప్సీని బుక్ చేసుకున్నారట. మొదటి సినిమాతోనే త్రిషకు ఎసరు పెట్టింది. ఇక చిత్ర పరిశ్రమలో పూర్తిస్థాయిలో నిలదొక్కుకుంటే ఎంతమంది బూట్లలో కాళ్లు పెడుతుందో ఏమో...!! తాప్సీ నవ్వా.. మజాకానా..!!
Source: Yahoo! Telugu: Entertainment | 30 Jun 2010 | 2:23 pm

"సరదాగా కాసేపు" సెట్లో నరేష్ పుట్టినరోజు

లేడీస్ టైలర్ నుంచి "గోపి గోపిక గోదావరి" చిత్రం వరకూ తనదైన శైలిలో తీసిన వంశీ దర్శకత్వంలో అల్లరి నరేష్, అష్టాచమ్మా ఫేమ్ అవసరాల శ్రీను కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రం "సరదాగా కాసేపు". బుధవారం అల్లరి నరేష్ పుట్టినరోజు సందర్భంగా అక్కడే కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ.. నా చిన్నతనం నుంచి వంశీ చిత్రాలంటే ఇష్టం. మద్రాసులో మా పక్కనే ఉండేవారు. అంకుల్ అని పిలిచేవాడిని. ఇప్పుడు కూడా దర్శకుడిగా కాకుండా అంకుల్ అంటాను. ఆయన దర్శకత్వంలో చేయడం చాలా ఆనందంగా ఉంది అన్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 30 Jun 2010 | 1:52 pm

చిన్ని కృష్ణను డైరెక్టర్‌ని చేస్తా: అల్లు అరవింద్

మా గీతా ఆర్ట్స్‌లో చిన్నికృష్ణను దర్శకుడిగా చేయాలనే మా ఇద్దరి మధ్య ఒప్పందమనీ, అది త్వరలో నెరవేరుస్తాననీ అల్లు అరవింద్ అన్నారు. "అల్లు అర్జున్ చిన్నతనం నుంచి చిన్నికృష్ణకు తెలుసు. బన్నీ హీరోగా అవ్వాలనీ, అది కూడా తన కథతో చేయాలని చిన్నికృష్ణ అనేవాడు. అలాగే గంగోత్రి చేశాడు. హిట్ ఇచ్చాడు. చిరంజీవికి ఇంద్ర వంటి పవర్‌ఫుల్ కథను కూడా ఇచ్చింది చిన్నికృష్ణే. ఆ చిత్ర కథను చిరంజీవిగారు మూడుగంటలపాటు విని... వెంటనే అశ్వనీదత్‌తో ఈ సినిమా చేస్తున్నాం అన్నారు. అసలు చిరంజీవిగారు కథలు అంతసేపు వినడమే గొప్ప... అలా చిన్నికృష్ణ మెప్పించాడు. అందుకే ఆయనలో దర్శకుడు ఉన్నాడు. ప్రస్తుతం బన్నీతో మరో హిట్ ఇవ్వాలని బద్రినాథ్‌కు మంచి కథ ఇచ్చాడు" అన్నారు
Source: Yahoo! Telugu: Entertainment | 30 Jun 2010 | 10:27 am

కాశ్మీర్ అల్లర్లలో లష్కరే హస్తం ఉన్నది: చిదంబరం

కాశ్మీర్ అల్లర్లలో 11 మంది పౌరులు ప్రాణాలు కోల్పోవడం పట్ల హోంమంత్రి చిదంబరం విచారం వ్యక్తం చేశారు. ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడుతూ.. కాశ్మీర్‌లో కొద్ది రోజులుగా జరుగుతున్న ఘర్షణలు వెనుక లష్కరే తొయిబా హస్తం ఉన్నదన్నారు.
Source: జాతీయ | 30 Jun 2010 | 8:00 am

"రావణ్" విడుదల తర్వాత పత్తాలేని "రాగిణి"

ఎన్నో భారీ అంచనాలతో విడుదలైన మణిరత్నం "రావణ్" బాక్సాఫీసు వద్ద బోర్లా పడటంతోపాటు ఆ సినిమాపై అనేక విమర్శలు వెల్లువెత్తాయి. రావణ్ సినిమా చిత్రీకరణ పూర్తిగా హిందూ సంప్రదాయాలను మంటగలిపేటట్లుగా ఉన్నదని హిందూత్వ వాదులు ధ్వజమెత్తారు.అదలావుంచితే సినిమా విడుదలకు ముందు అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యారాయ్ కనబడినచోటల్లా "ఆహా రావణ్... ఓహో రావణ్" అంటూ గప్పాలు కొట్టారు. అభిషేక్ అయితే తన కెరీర్‌లో అటువంటి పాత్రను పోషించనే లేదని గొప్పలు పోయాడు. చివరికి సినిమా విడుదలైన తర్వాత ప్రేక్షకులు రావణ్ ముఖం చూడకపోవడంతో ఏం చేయాలో తెలియని అభిషేక్ - ఐష్ జంట మీడియా ముందుకు రావడానికి సాహసం చేయడం లేదు. అభిషేక్ బచ్చన్ అప్పుడప్పుడూ మీడియా ముందుకు వస్తున్నా... రావణ్ విషయం అడిగితే, ఆ సినిమాతో తనకు సంబంధం లేనట్లుగా వ్యవహరిస్తున్నట్లు తెలిసింది. ఇక అందాల సుందరి ఐశ్వర్యారాయ్ అయితే మీడియా ముందు తన ముఖాన్ని చూపించడానికే ఇష్టపడటం లేదు. ఈ "రాగిణి" ఎఫెక్ట్ ఆమెపై ఎంతకాలం ఉంటుందో... ఏమో..!!
Source: Yahoo! Telugu: Entertainment | 30 Jun 2010 | 6:49 am

మరోసారి ఒత్తిడి చేస్తే కళాశాల గుర్తింపు రద్దు: మంత్రులు

ఫీజుల బకాయీలు చెల్లించాలని మరోమారు కార్పొరేట్ కళాశాలలు ఒత్తిడి చెస్తే వాటి గుర్తింపు రద్దు చేస్తామని రాష్ట్ర మంత్రులు శ్రీధర్ బాబు, మోపిదేవి వెంకటరమణ హెచ్చరించారు. ప్రస్తుతం ఫీజుల రీయంబర్స్‌మెంట్ కోసం చేసిన ఆందోళన వెనుక బడాబాబుల హస్తం ఉందని వారు ఆరోపించారు. సమయం వచ్చినపుడు పూర్తి వివరాలు వెల్లడిస్తామని మంత్రులు తెలిపారు.
Source: ఏపీ న్యూస్ | 30 Jun 2010 | 6:09 am

సింహా హిట్‌తో కొమ్ములొచ్చాయా...?: గర్జించిన "సింహా"

సక్సెస్ అనేది కొంతమందిని ఒదిగిపోయేటట్లు చేస్తే మరికొంతమందిని రెచ్చిపోయేటట్లు చేస్తుంది. ఇదే సింహా సహనిర్మాత విషయంలోనూ జరిగినట్లు సమాచారం. ఇటీవల సింహా 50 రోజుల ఫంక్షన్లో సహనిర్మాత మహేంద్ర మీడియా ప్రతినిధుల పట్ల కఠినమైన ధోరణిని ప్రదర్శించారు. ఈ విషయాన్ని వేదిక కింద ఉన్న సింహా బాలకృష్ణ గమనించారు. అంతే..!! వెంటనే సదరు నిర్మాతను కిందకు పిలిపించారు.మీడియా పట్ల తన ప్రవర్తన ఏమాత్రం బాగాలేదని ఆయనకు చీవాట్లు వేశారు. మీడియా ప్రతినిధులపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవలసిందిగా బాలయ్య కోరారు. బాలయ్య సూచనతో మహేంద్ర మీడియాకు క్షమాపణలు చెప్పారు.
Source: Yahoo! Telugu: Entertainment | 30 Jun 2010 | 5:37 am

ధర్మపురికి జనమే బుద్ధి చెపుతారు: కేసీఆర్ జోస్యం

ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఉవ్విళ్ళూరుతున్న ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్‌కు జనమే తగిన బుద్ధి చెపుతారని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర రావు జోస్యం చెప్పారు. ఆయన బుధవారం తెలంగాణ భవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. తన ఆమరణ నిరాహార దీక్ష తర్వాత కేంద్రం దిగివచ్చి తెలంగాణ ఇస్తున్నట్టు ప్రకటన చేసిందన్నారు.
Source: ఏపీ న్యూస్ | 30 Jun 2010 | 4:41 am

జగన్.. ఇందిరా కుటుంబ ఏజెంటుగా ఉండు: నేదురుమల్లి

తాను నాటి నుంచి నేటి వరకు ఇందిరాగాంధీ కుటుంబ ఏజెంటుగా ఉన్నానని అందుకే తనను పార్టీ అన్ని రకాలుగా ఆదుకుందని మాజీ ముఖ్యమంత్రి, రాజ్యసభ సభ్యుడు నేదరుమల్లి జనార్ధన్ రెడ్డి అన్నారు. ఇదే సూత్రాన్ని కడప ఎంపీ వైఎస్.జగన్మోహన్ రెడ్డి కూడా తూచ తప్పకుండా పాటించాలని ఈ వృద్ధనేత సూచించారు.
Source: ఏపీ న్యూస్ | 30 Jun 2010 | 4:20 am

జమ్మూకాశ్మీర్ పరిస్థితులపై ప్రధాని అత్యవసర భేటీ!

జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ బుధవారం సాయంత్రం అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. సాయంత్రం ఐదు గంటలకు జరిగే ఈ సమావేశానికి కేంద్ర హోం మంత్రి చిదంబరంతో పాటు రక్షణ మంత్రి ఏకే.ఆంటోనీ, జాతీయ భద్రతా సలహాదారు ఎంకే.నరసింహన్ తదితర ఉన్నతాధికారులు హాజరుకానున్నారు.
Source: జాతీయ | 30 Jun 2010 | 4:06 am

ఐదు రాష్ట్రాల్లో మావోయిస్టుల బంద్: పలు రైళ్ళ మళ్లింపు

మావోయిస్టులు బంద్ కారణంగా ఐదు రాష్ట్రాల్లో రైళ్ల రాకపోలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ రాష్ట్రాల గుండా ప్రయాణించే దూరప్రాంత రైళ్లను కూడా ఇతర ప్రాంతాల మీదుగా మళ్లించారు. బంద్ ప్రభావిత రాష్ట్రాలైన జార్ఖండ్, బెంగాల్, ఒరిస్సా, బీహార్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో సాధారణ జనజీవనానికి ఆటంకం ఏర్పడింది.
Source: జాతీయ | 30 Jun 2010 | 3:37 am