యూరప్ స్టాక్ మార్కెట్ ప్రభావం: సెన్సెక్స్ వృద్ధి!

యూరప్ స్టాక్ మార్కెట్ ప్రభావంతో బాంబే స్టాక్ మార్కెట్ లాభాలను ఆర్జిస్తోంది. ఫలితంగా బుధవారం మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచి సెన్సెక్స్, 75 పాయింట్లు పుంజుకుని, 17,610 పాయింట్ల మార్కును తాకింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచి నిఫ్టీ కూడా 19 పాయింట్లు స్వల్పంగా బలపడి, 5,275 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.
Source: Yahoo! Telugu: News | 30 Jun 2010 | 9:16 am

ఐదు రాష్ట్రాల్లో మావోయిస్టుల బంద్: పలు రైళ్ళ మళ్లింపు

మావోయిస్టులు బంద్ కారణంగా ఐదు రాష్ట్రాల్లో రైళ్ల రాకపోలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ రాష్ట్రాల గుండా ప్రయాణించే దూరప్రాంత రైళ్లను కూడా ఇతర ప్రాంతాల మీదుగా మళ్లించారు. బంద్ ప్రభావిత రాష్ట్రాలైన జార్ఖండ్, బెంగాల్, ఒరిస్సా, బీహార్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో సాధారణ జనజీవనానికి ఆటంకం ఏర్పడింది.
Source: Yahoo! Telugu: News | 30 Jun 2010 | 9:07 am

ఖాట్మండులో డబ్బుకట్టలతో పట్టుబడిన నాగా మంత్రి

నేపాల్ రాజధాని ఖాట్మండులో నాగాలాండ్ రాష్ట్ర హోంమంత్రి ఇంకాంగ్ ఎల్ ఇంచెన్ డబ్బు సూట్‌కేసుతో బుధవారం పట్టుబడ్డారు. భారతీయ కరెన్సీతో కూడిన సూట్‌కేసుతో ఎయిర్‌పోర్టులో అడుగుపెట్టిన మంత్రిని విమానాశ్రయ అధికారులు తనిఖీ చేశారు. ఆ సమయంలో సూట్‌కేసులో 500, 100 రూపాయల నోట్ల కట్టలతో కూడిన తొమ్మిది లక్షల రూపాయలను ఉన్నట్టు గుర్తించారు.
Source: Yahoo! Telugu: News | 30 Jun 2010 | 8:51 am

లాభాల్లో స్టాక్ మార్కెట్: సెన్సెక్స్ 67 పాయింట్ల వృద్ధి!

బాంబే స్టాక్ మార్కెట్ లాభాల బాటలో కొనసాగుతోంది. ట్రేడింగ్ ప్రారంభంలో నష్టాలు చవిచూసిన బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచి సెన్సెక్స్, మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో 67 పాయింట్లు పుంజుకుని, 17,601 పాయింట్ల మార్కును తాకింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచి నిఫ్టీ కూడా 24 పాయింట్లు బలపడి, 5,280 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది.
Source: Yahoo! Telugu: News | 30 Jun 2010 | 8:20 am

డీజిల్ భగ్గు: పడిపోయిన డీజిల్ కార్ల డిమాండ్

కేంద్రం డీజిల్ ధరలను దాదాపు పెట్రోల్ ధరలతో సమానం పెంచడంతో ఇపుడు ఆ ప్రభావం డీజిల్‌తో నడిచే కార్లపై పడనుంది. తాజాగా డీజిల్‌తో నడిచే కార్లను కొనుగోలు చేసేందుకు వినియోగదారులు ఆసక్తి చూపడం లేదని పలు కార్ల కంపెనీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
Source: Yahoo! Telugu: News | 30 Jun 2010 | 7:48 am

స్టాక్ మార్కెట్: లాభాల్లో సెన్సెక్స్, నిఫ్టీ..!

బాంబే స్టాక్ మార్కెట్ బుధవారం లాభాలను ఆర్జిస్తోంది. ట్రేడింగ్ ప్రారంభంలో నష్టాల్లో కూరుకుపోయిన బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచి సెన్సెక్స్, మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో 57 పాయింట్లు లాభపడి, 17,591 పాయింట్ల మార్కును తాకింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచి నిఫ్టీ కూడా 28 పాయింట్లు పుంజుకుని, 5,284 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది.
Source: Yahoo! Telugu: News | 30 Jun 2010 | 7:44 am

ఆల్మట్టి ప్రాజెక్టుపై రీ సర్వేకు కృష్ణా ట్రిబ్యునల్ నిరాకరణ

ఆల్మట్టి ప్రాజెక్టు వ్యవహారంలో రాష్ట్రానికి చుక్కెదురైంది. ఈ ప్రాజెక్టు ఎత్తుపై రీ సర్వే చేయాలని రాష్ట్ర ప్రభుత్వ వాదనను కృష్ణా జలాల ట్రిబ్యునల్ తోసిపుచ్చింది. డ్యామ్ ఎత్తు, ఇతరాత్రా విషయాలు సక్రమంగానే ఉన్నాయని ట్రిబ్యునల్ స్పష్టం చేసింది. దీంతో ఖంగుతిన్న ప్రభుత్వం.. తదుపరి చర్యలపై అఖిలపక్ష నేతలతో చర్చలు జరపే దిశగా యోచన చేస్తోంది.
Source: Yahoo! Telugu: News | 30 Jun 2010 | 7:15 am

నన్ను గెలిపిస్తే తెలంగాణ ఇప్పిస్తా: ధర్మపురి శ్రీనివాస్

త్వరలో జరుగనున్న ఉప ఎన్నికల్లో నిజామాబాద్ గ్రామీణ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తాను బరిలోకి దిగుతున్నట్టు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ ప్రకటించారు. ఈ నియోజకవర్గ ఓటర్లందరూ ఏకమై తనను గెలిపిస్తే తాను పీసీసీ అధ్యక్షుడి హోదాలో ఢిల్లీకి వెళ్లి తెలంగాణ రాష్ట్రాన్ని ఇప్పిస్తానని డీఎస్ ప్రచారం చేస్తున్నారు.
Source: Yahoo! Telugu: News | 30 Jun 2010 | 7:02 am

"రావణ్" విడుదల తర్వాత పత్తాలేని "రాగిణి"

ఎన్నో భారీ అంచనాలతో విడుదలైన మణిరత్నం "రావణ్" బాక్సాఫీసు వద్ద బోర్లా పడటంతోపాటు ఆ సినిమాపై అనేక విమర్శలు వెల్లువెత్తాయి. రావణ్ సినిమా చిత్రీకరణ పూర్తిగా హిందూ సంప్రదాయాలను మంటగలిపేటట్లుగా ఉన్నదని హిందూత్వ వాదులు ధ్వజమెత్తారు.అదలావుంచితే సినిమా విడుదలకు ముందు అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యారాయ్ కనబడినచోటల్లా "ఆహా రావణ్... ఓహో రావణ్" అంటూ గప్పాలు కొట్టారు. అభిషేక్ అయితే తన కెరీర్‌లో అటువంటి పాత్రను పోషించనే లేదని గొప్పలు పోయాడు. చివరికి సినిమా విడుదలైన తర్వాత ప్రేక్షకులు రావణ్ ముఖం చూడకపోవడంతో ఏం చేయాలో తెలియని అభిషేక్ - ఐష్ జంట మీడియా ముందుకు రావడానికి సాహసం చేయడం లేదు. అభిషేక్ బచ్చన్ అప్పుడప్పుడూ మీడియా ముందుకు వస్తున్నా... రావణ్ విషయం అడిగితే, ఆ సినిమాతో తనకు సంబంధం లేనట్లుగా వ్యవహరిస్తున్నట్లు తెలిసింది. ఇక అందాల సుందరి ఐశ్వర్యారాయ్ అయితే మీడియా ముందు తన ముఖాన్ని చూపించడానికే ఇష్టపడటం లేదు. ఈ "రాగిణి" ఎఫెక్ట్ ఆమెపై ఎంతకాలం ఉంటుందో... ఏమో..!!
Source: Yahoo! Telugu: Entertainment | 30 Jun 2010 | 6:49 am

బ్రెజిల్ మహిళపై అత్యాచారం కేసులో భూస్వామి అరెస్టు

బ్రెజిల్ మహిళపై జరిగిన అత్యాచార కేసులో ఢిల్లీ నగర పోలీసులు ఒక భూస్వామిని అరెస్టు చేశారు. ఆ భూస్వామి వివరాలను వెల్లడించేందుకు పోలీసులు నిరాకరించారు. అత్యాచారానికి గురైన మహిళకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో మహిళ రేప్‌కు గురైనట్టు వైద్యులు నిర్ధారించారని ఢిల్లీ (సౌత్ ఈస్ట్) అడిషినల్ కమిషనర్ ఆఫ్ పోలీసు విరేందర్ ఛాహల్ బుధవారం ఢిల్లీలో వెల్లడించారు.
Source: Yahoo! Telugu: News | 30 Jun 2010 | 6:46 am

కేంద్ర మందబుద్ధి విధానాలే ధరల పెరుగుదలకు కారణం!

కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ సర్కారు అనుసరిస్తున్న అనుభవరహిత, మందబుద్ధి విధానాలే ధరల పెరుగుదలకు ప్రధాన కారణమని గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ఆరోపించారు. దేశంలోని సామాన్య ప్రజల అవసరాలను తెలుసుకోవడంలో కేంద్రం పూర్తిగా విఫలమైందని ఆయన ఆరోపించారు.
Source: Yahoo! Telugu: News | 30 Jun 2010 | 6:34 am

సింహా హిట్‌తో కొమ్ములొచ్చాయా...?: గర్జించిన "సింహా"

సక్సెస్ అనేది కొంతమందిని ఒదిగిపోయేటట్లు చేస్తే మరికొంతమందిని రెచ్చిపోయేటట్లు చేస్తుంది. ఇదే సింహా సహనిర్మాత విషయంలోనూ జరిగినట్లు సమాచారం. ఇటీవల సింహా 50 రోజుల ఫంక్షన్లో సహనిర్మాత మహేంద్ర మీడియా ప్రతినిధుల పట్ల కఠినమైన ధోరణిని ప్రదర్శించారు. ఈ విషయాన్ని వేదిక కింద ఉన్న సింహా బాలకృష్ణ గమనించారు. అంతే..!! వెంటనే సదరు నిర్మాతను కిందకు పిలిపించారు.మీడియా పట్ల తన ప్రవర్తన ఏమాత్రం బాగాలేదని ఆయనకు చీవాట్లు వేశారు. మీడియా ప్రతినిధులపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవలసిందిగా బాలయ్య కోరారు. బాలయ్య సూచనతో మహేంద్ర మీడియాకు క్షమాపణలు చెప్పారు.
Source: Yahoo! Telugu: Entertainment | 30 Jun 2010 | 5:37 am

ఐదు రాష్ట్రాల్లో మావోయిస్టుల బంద్: పలు రైళ్ళ మళ్లింపు

మావోయిస్టులు బంద్ కారణంగా ఐదు రాష్ట్రాల్లో రైళ్ల రాకపోలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ రాష్ట్రాల గుండా ప్రయాణించే దూరప్రాంత రైళ్లను కూడా ఇతర ప్రాంతాల మీదుగా మళ్లించారు. బంద్ ప్రభావిత రాష్ట్రాలైన జార్ఖండ్, బెంగాల్, ఒరిస్సా, బీహార్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో సాధారణ జనజీవనానికి ఆటంకం ఏర్పడింది.
Source: జాతీయ | 30 Jun 2010 | 3:37 am

ఆల్మట్టి ప్రాజెక్టుపై రీ సర్వేకు కృష్ణా ట్రిబ్యునల్ నిరాకరణ

ఆల్మట్టి ప్రాజెక్టు వ్యవహారంలో రాష్ట్రానికి చుక్కెదురైంది. ఈ ప్రాజెక్టు ఎత్తుపై రీ సర్వే చేయాలని రాష్ట్ర ప్రభుత్వ వాదనను కృష్ణా జలాల ట్రిబ్యునల్ తోసిపుచ్చింది. డ్యామ్ ఎత్తు, ఇతరాత్రా విషయాలు సక్రమంగానే ఉన్నాయని ట్రిబ్యునల్ స్పష్టం చేసింది. దీంతో ఖంగుతిన్న ప్రభుత్వం.. తదుపరి చర్యలపై అఖిలపక్ష నేతలతో చర్చలు జరపే దిశగా యోచన చేస్తోంది.
Source: ఏపీ న్యూస్ | 30 Jun 2010 | 1:45 am

నన్ను గెలిపిస్తే తెలంగాణ ఇప్పిస్తా: ధర్మపురి శ్రీనివాస్

త్వరలో జరుగనున్న ఉప ఎన్నికల్లో నిజామాబాద్ గ్రామీణ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తాను బరిలోకి దిగుతున్నట్టు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ ప్రకటించారు. ఈ నియోజకవర్గ ఓటర్లందరూ ఏకమై తనను గెలిపిస్తే తాను పీసీసీ అధ్యక్షుడి హోదాలో ఢిల్లీకి వెళ్లి తెలంగాణ రాష్ట్రాన్ని ఇప్పిస్తానని డీఎస్ ప్రచారం చేస్తున్నారు.
Source: ఏపీ న్యూస్ | 30 Jun 2010 | 1:34 am

కేంద్ర మందబుద్ధి విధానాలే ధరల పెరుగుదలకు కారణం!

కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ సర్కారు అనుసరిస్తున్న అనుభవరహిత, మందబుద్ధి విధానాలే ధరల పెరుగుదలకు ప్రధాన కారణమని గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ఆరోపించారు. దేశంలోని సామాన్య ప్రజల అవసరాలను తెలుసుకోవడంలో కేంద్రం పూర్తిగా విఫలమైందని ఆయన ఆరోపించారు.
Source: జాతీయ | 30 Jun 2010 | 1:05 am

యధాతథంగా ఓదార్పు యాత్ర: అంబటి రాంబాబు

కడప ఎంపీ వైఎస్.జగన్మోహన్ రెడ్డి వచ్చే నెల ఎనిమిదో తేదీ నుంచి తలపెట్టనున్న ఓదార్పు యాత్ర యధావిధిగా కొనసాగుతుందని ఏఐసీసీ కార్యదర్శి అంబటి రాంబాబు అభిప్రాయపడ్డారు. ఇదే అంశంపై పార్టీ అధినేత్రి సోనియా గాంధీతే జగన్ కుటుంబ సభ్యులు భేటీ అయ్యారని గుర్తు చేశారు. ఈ భేటీ అనంతరం జగన్ మీడియాతో ఏం మాట్లాడకపోయినప్పటికీ తాను మాత్రం ఓదార్పు యాత్ర యధావిధిగా కొనసాగుతుందని భావిస్తున్నట్టు చెప్పారు.
Source: ఏపీ న్యూస్ | 30 Jun 2010 | 12:13 am

రాష్ట్రం సమైక్యంగా ఉంచాల్సిందే: ఎమ్మెల్సీ వైఎస్ వివేకా

రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ, సీనియర్ నేత వైఎస్.వివేకానంద రెడ్డి అభిప్రాయపడ్డారు. విద్య, వ్యాపార, పారిశ్రామికపరంగా అభివృద్ధి చెందిన హైదరాబాద్‌ వంటి నగరాన్ని మళ్లీ ఏర్పాటు చేసుకోవడం కష్టమని అందువల్ల రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరారు. ఈ మేరకు కడప జిల్లాలో పర్యటిస్తున్న జస్టీస్ శ్రీకృష్ణ కమిటీ సభ్యులకు విజ్ఞప్తి చేశారు.
Source: ఏపీ న్యూస్ | 30 Jun 2010 | 12:06 am

దేవెగౌడ బకాయిల కోసం కోర్టును అశ్రయించిన ఐఏఎఫ్

మాజీ ప్రధాని దేవెగౌడ ఇండియన్ ఎయిర్‌ఫోర్సుకు 54 లక్షల రూపాయల మేరకు బాకాయిపడ్డారు. ఈ మొత్తాన్ని వసూలు చేసుకునేందుకు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఢిల్లీ కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. ఈ విషయం సమాచార హక్కు చట్టం కింద దాఖలైన ఒక పిటీషన్‌కు ఐఏఎఫ్‌ సమాధానం ఇచ్చింది. దేవెగౌడ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ఆయన వ్యక్తిగత పనుల కోసం విమానాలను వాడినందుకు గాను ఈ మొత్తం చెల్లించాల్సి ఉందని ఐఏఎఫ్ పేర్కొంది.
Source: జాతీయ | 29 Jun 2010 | 11:10 pm

జగన్.. కాస్త ఓపికతో వ్యవహరించు: సోనియా సూచన!

దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర రెడ్డి తనయుడు, కడప ఎంపీ వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి, ఆయన తల్లి, పులివెందుల ఎమ్మెల్యే విజయలక్ష్మి, సోదరి షర్మిళలు మంగళవారం సాయంత్రం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిశారు. వారు అధినేత్రిలో 40 నిమిషాల పాటు మనస్సు విప్పి మాట్లాడారు. వచ్చే నెల ఎనిమిదో తేదీ నుంచి చేపట్టనున్న ఓదార్పు యాత్రపై చర్చలు జరిపారు.
Source: ఏపీ న్యూస్ | 29 Jun 2010 | 10:39 pm

ఛత్తీస్‌గఢ్‌లో మావోల దాడి: 27కు చేరిన మృతులు

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో మావోయిస్టులు జరిపిన దాడిలో ప్రాణాలు కోల్పోయిన జవాన్ల సంఖ్య బుధవారానికి 27కు చేరుకుంది. ఈ దాడి, కాల్పుల్లో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జవాన్లలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని సీఆర్‌పీఎఫ్ వర్గాలు పేర్కొంటున్నాయి.
Source: జాతీయ | 29 Jun 2010 | 10:06 pm

కాంగ్రెస్‌లో విలీనమా.. ఆ మాట ప్రసక్తే లేదు: పవార్

12 సంవత్సరాల కిందట స్థాపించిన నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్.సి.పి)ని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయనున్నట్టు వస్తున్న వార్తలను ఆ పార్టీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి శరద్ పవార్ తోసిపుచ్చారు. విలీనం అనే మాట ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు.
Source: జాతీయ | 29 Jun 2010 | 9:56 pm

రాత్రిపూట డిస్కషన్స్‌తో నమిత ఫుల్ బిజీ

సింహా తెచ్చిన హిట్‌తో నమిత రేంజ్ ఒక్కసారిగా ఎక్కడికో వెళ్లిపోయింది. ఇపుడామె కాల్షీట్లకోసం టాలీవుడ్ దర్శకనిర్మాతలు క్యూ కడుతున్నారట. కొంతమందైతే తమ తదుపరి చిత్రాల్లో నటించాలని నమితపై ఒత్తిడి తీసుక వస్తున్నారు. ఇంకొంతమంది... తాము తీయబోయే సినిమాలో నమితకు ఎటువంటి పాత్రను ఇవ్వబోతున్నారో విడమరిచి చెప్పేందకు రాత్రిపూట కథా చర్చలకు నమితను ఆహ్వానిస్తున్నారట. దీంతో నమిత సంతోషానికి పట్టపగ్గాల్లేకుండా పోయిందట. అడిగినవారిని నొప్పించడం ఇష్టం లేక రాత్రిపూట కథా చర్చలకు వెళుతోందట. సుదీర్ఘమైన చర్చలు ఫలితమో... ఏమోగానీ రాత్రంతా నైట్ అవుట్ చేస్తుండటంతో నమిత ఒళ్లు అలసి పోయి కళ్లు కాస్త గుంటలు పడి నీరసం కనిపిస్తోందట.
Source: Yahoo! Telugu: Entertainment | 29 Jun 2010 | 1:55 pm

బ్రహ్మలోకం టు యమలోకం వయా భూలోకం ఆడియో

డాక్టర్ రాజేంద్రప్రసాద్, శివాజీ, సోనియా, ఆర్తీ అగర్వాల్, కల్యాణి ప్రధాన తారాగణంగా రూపొందుతున్న బ్రహ్మలోకం టు యమలోకం వయా భూలోకం ఆడియో విడుదల కార్యక్రమం సోమవారం రాత్రి జూబ్లిహిల్స్‌లోని రావి నారాయణ రెడ్డి ఆడిటోరియంలో జరిగింది.ఈ కార్యక్రమంలో మాడుగుల నాగఫణిశర్మ, దైవజ్ఞశర్మ, అల్లరి నరేష్, వేణు మాధవ్, గీత రచయిత భాస్కరభట్ల రవి, సంగీత దర్శకురాలు ఎం.ఎం శ్రీలేఖ, సింహా నిర్మాత పరుచూరి ప్రసాద్, హీరో రామ్, అనుష్క, భూమిక దంపతులు, కోన వెంకట్ తదితరులు హాజరయ్యారు. ముందుగా చిత్రంలోని ఒక్కోపాటను ఒక్కో అతిథి విడుదల చేశారు. అనంతరం సీడీని హీరో రామ్ ఆవిష్కరించి భూమిక, అనుష్కలకు సీడీని అందించారు.
Source: Yahoo! Telugu: Entertainment | 29 Jun 2010 | 1:45 pm

యముడు ట్రెయిలర్

యముడు ట్రెయిలర్
Source: Yahoo! Telugu: Entertainment | 29 Jun 2010 | 1:35 pm

వేదం ట్రెయిలర్

వేదం ట్రెయిలర్
Source: Yahoo! Telugu: Entertainment | 29 Jun 2010 | 1:30 pm

సింహా ట్రెయిలర్

సింహా ట్రెయిలర్
Source: Yahoo! Telugu: Entertainment | 29 Jun 2010 | 1:20 pm

రామరామ కృష్ణకృష్ణ ట్రెయిలర్

రామరామ కృష్ణకృష్ణ ట్రెయిలర్
Source: Yahoo! Telugu: Entertainment | 29 Jun 2010 | 1:17 pm

పాపి ట్రెయిలర్

పాపి ట్రెయిలర్
Source: Yahoo! Telugu: Entertainment | 29 Jun 2010 | 1:13 pm

పంచాక్షరి ట్రెయిలర్

పంచాక్షరి ట్రెయిలర్
Source: Yahoo! Telugu: Entertainment | 29 Jun 2010 | 1:09 pm

ఛత్తీస్‌గఢ్‌లో మావో పంజా: 18మంది జవాన్ల మృతి

ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి మావోయిస్టులు విరుచుక పడ్డారు. ఆ రాష్ట్రంలోని నారాయణ్ పూర్ జిల్లా దౌడాయి వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో 18మంది జవాన్లు మృతి చెందారు. ముగ్గురి జవాన్ల పరిస్థితి విషమంగా ఉన్నట్లు ప్రాధమిక సమాచారం.
Source: జాతీయ | 29 Jun 2010 | 9:17 am

కుట్రదారులెవరో నాకు తెలుసు.. కానీ చెప్పను: సీఎం

బోధనా ఫీజులు, ఉపకార వేతనాలపై మంగళవారం ముఖ్యమంత్రి అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశం కాస్తంత వాడివేడిగా జరిగింది. ఫీజుల చెల్లింపు ఆందోళన వెనుక కుట్ర ఉందని ముఖ్యమంత్రి రోశయ్య పునరుద్ఘాటించడంతో విపక్షాలు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశాయి.
Source: ఏపీ న్యూస్ | 29 Jun 2010 | 8:45 am

జగన్ ఓదార్పు యాత్రకు అనుమతి ఇవ్వాలి: పొన్నం

కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డి చేపట్టనున్న ఓదార్పుయాత్రకు తమ పార్టీ అధిష్టానం అనుమతి ఇవ్వాలని కాంగ్రెస్ రాష్ట్ర ఎంపీల ఫోరం కన్వీనర్ పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. ఆయన మంగళవారం కరీంనగర్‌లో విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఇక్కడ ఓదార్పు యాత్రను వద్దని చెప్పామన్నారు. అదే సమయంలో సీమాంధ్రలో పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని అందువల్ల జగన్ యాత్రకు అనుమతి ఇవ్వాలని తాము అధిష్టానానికి విజ్ఞప్తి చేసినట్టు ఆయన తెలిపారు.
Source: ఏపీ న్యూస్ | 29 Jun 2010 | 6:32 am

కేసీఆర్.. ఓ రాజకీయ బచ్చా: పీసీసీ ప్రతినిధి తులసిరెడ్డి

తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు ఒక రాజకీయ బచ్చాతో సమానమని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి తులసి రెడ్డి అభిప్రాయపడ్డారు. తమ పార్టీ అధినేత్రి సోనియా గాంధీపై కేసీఆర్ విమర్శలు చేయడం.. ఆంజనేయ స్వామి ఎదుట పిల్లకోతి గంతులు వేసిన చందంగా ఉందన్నారు.
Source: ఏపీ న్యూస్ | 29 Jun 2010 | 6:24 am

మగాళ్లూ.. ఆడవారితో మర్ధనలు వద్దు: ఏకే.ఖాన్

హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ ఏకే.ఖాన్ మరింత కఠినంగా వ్యవహరిస్తున్నారు. నగరంలో జరుగుతున్న అసాంఘీక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలని నగర పోలీసు యంత్రాంగం నిర్ణయం తీసుకున్నారు. ఇందులోభాగంగా హైదరాబాద్‌ సిటీలో ఉన్న మసాజ్ సెంటర్లలో యువతలతో మసాజ్ చేయడంపై నిషేధం విధించారు.
Source: ఏపీ న్యూస్ | 29 Jun 2010 | 6:04 am

పోలవరం డిజైనింగ్‌ మార్పు ప్రశ్నే లేదు: మంత్రి బన్సల్

పోలవరం ప్రాజెక్టు డిజైనింగ్‌లో మార్పులు చేసే ప్రసక్తే లేదని కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ తేల్చి చెప్పింది. పోలవరంకు జాతీయ హోదా కల్పించే అంశాన్ని ఆర్థిక వ్యవహారాల కమిటీ పరిశీలిస్తోందని ఆయన ఒక ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.
Source: జాతీయ | 29 Jun 2010 | 5:19 am

ఆండర్సన్ అప్పగించాలని అమెరికాను కోరుతాం: పీఎం

భోపాల్ గ్యాస్ లీకేజీ దుర్ఘటన కేసులో కీలక నిందితునిగా భావిస్తున్న యూనియన్ కార్బైడ్ కార్పొరేషన్ మాజీ సీఈఓ వారెన్ ఆండర్సన్‌ను భారత్‌కు రప్పించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ అభిప్రాయపడ్డారు. ఇందుకోసం అమెరికాతో చర్చిస్తామని ఆయన తెలిపారు.
Source: జాతీయ | 29 Jun 2010 | 3:53 am