తాప్సీ "సెక్సీ బొడ్డు" మైకంలో మంచు మనోజ్

కె. రాఘవేంద్ర రావు "ఝుమ్మంది నాదం" చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమవుతున్న తాప్సీ కేవలం సెక్సీ తార మాత్రమే కాదు.. మహా తెలివిగల పిల్ల. గ్లామర్ పరిశ్రమ అంటే ఇష్టమైనప్పటికీ చదువంటే తాప్సీకి ప్రాణమట. సినీ పరిశ్రమలోకి అడుగెట్టక ముందు న్యూఢిల్లీలోని గురు టెఘ్ బహదూర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో కంప్యూటర్ సైన్స్ విద్యార్థిని అయిన తాప్సీ అక్కడే గోల్డ్ మెడల్ సాధించిందట. అయితే చిన్ననాటి నుంచి సినిమాలంటే ఇష్టం ఏర్పడటంతో రాఘవేంద్రరావు కంట్లో పడటంతో ఝుమ్మంది నాదం ఛాన్స్ కొట్టేసింది. అన్నట్లు ఝుమ్మంది నాదం చిత్రీకరణ సమయంలో తాప్సీ బొడ్డుపై రాఘవేంద్రుడు తనదైన దృష్టి పెట్టి "మంచు" చేత ద్రాక్ష పండ్లు, పూలగుత్తులు వేయించిన సన్నివేశాలు వేడిక్కించే రీతిలో ఉన్నాయట.
Source: Yahoo! Telugu: Entertainment | 28 Jun 2010 | 8:35 am

తాలిబన్ తీవ్రవాదుల తదుపరి లక్ష్యం భారత్: పాకిస్థాన్

తాలిబన్ తీవ్రవాదుల తదుపరి లక్ష్యం భారత్ అని పాకిస్థాన్ అభిప్రాయపడింది. తమ దేశాన్ని తాలిబన్‌లు వశం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని పాకిస్థాన్ అంతర్గత భద్రతా శాఖామంత్రి రెహ్మాన్ మాలిక్ అభిప్రాయపడ్డారు.
Source: Yahoo! Telugu: News | 28 Jun 2010 | 8:30 am

కేటీఆర్ రాజకీయ ఎదుగుదలను ఓర్వలేని హరీష్ రావు!

తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర రావు తనయుడు, సిరిసిల్ల మాజీ ఎమ్మెల్యే కె.తారక రామారావు (కేటీఆర్) రాజకీయ ఎదుగుదలను ఆయన బావ, సిద్ధిపేట మాజీ ఎమ్మెల్యే హరీష్ రావు ఓర్వలేక పోతున్నారని కాంగ్రెస్ ఎంపీల ఫోరం కన్వీనర్ పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. సిరిసిల్ల, వేములవాడ అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికలు వాయిదా పడటానికి హరీష్ రావే ప్రధాన కారకులని పొన్నం ఆరోపించారు.
Source: Yahoo! Telugu: News | 28 Jun 2010 | 8:16 am

రాజీవ్ హంతకురాలు నళిని పుళల్ జైలుకు తరలింపు

దివంగత మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ హత్య కేసులో ప్రధాన నిందితురాలు నళినిని సోమవారం తమిళనాడు రాజధాని చెన్నై జైలుకు తరలించారు. రాజీవ్ గాంధీ హత్య కేసులో గత 19 సంవత్సరాలుగా జీవిత కారాగార శిక్ష అనుభవిస్తున్న నళినికి ప్రాణాపాయ ముప్పు పొంచి ఉందని సమాచారం అందడంతో, నళిళిని వేలూరు జైలు నుంచి చెన్నై జైలుకు తరలించారు.
Source: Yahoo! Telugu: News | 28 Jun 2010 | 7:50 am

ఆర్.కృష్ణయ్య బాటలో కిషన్ రెడ్డి ఆమరణ నిరాహార దీక్ష!

వెనుకబడిన విద్యార్థుల బోధనా ఫీజులు, ఉపకార వేతనాలు చెల్లింపుపై ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని వ్యతిరేకిస్తూ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఆమరణ నిరాహార దీక్షను ప్రారంభించారు.
Source: Yahoo! Telugu: News | 28 Jun 2010 | 7:40 am

స్టాక్ మార్కెట్: వృద్ధిబాటలో సెన్సెక్స్, నిఫ్టీ!

బాంబే స్టాక్ మార్కెట్ సోమవారం లాభాలను ఆర్జిస్తోంది. ట్రేడింగ్ ప్రారంభం నుంచే ఊపందుకున్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచి సెన్సెక్స్ మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో 80 పాయింట్లు బలపడి, 17,654 పాయింట్ల మార్కును తాకింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచి నిఫ్టీకూడా 20 పాయింట్ల లాభంతో, 5,289 పాయింట్ల మార్కును తాకింది
Source: Yahoo! Telugu: News | 28 Jun 2010 | 7:18 am

జీ-20 సదస్సు: ఒబామా, మన్మోహన్‌ల మధ్య సుదీర్ఘ చర్చ!

కెనడా రాజధాని నగరమైన టొరొంటాలో జరుగుతున్న జీ-20 సదస్సును పురస్కరించుకుని.. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో దేశ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ సుదీర్ఘ చర్చ జరిపారు. ప్రపంచ ఆర్థికమాంద్యం, తీవ్రవాదం వంటి కీలక అంశాలపై ఒబామా-మన్మోహన్ సింగ్‌లు చర్చ జరిగినట్లు సమాచారం.
Source: Yahoo! Telugu: News | 28 Jun 2010 | 7:11 am

జీటీఎల్‌లో విలీనమైన రిలయన్స్ ఇన్‌ఫ్రాటెల్!

ప్రముఖ పారిశ్రామిక వేత్త అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ అనుబంధ సంస్థ రిలయన్స్ ఇన్‌ఫ్రాటెల్ మరో ప్రముఖ సంస్థ జీటీఎల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌తో విలీనం కానున్నట్లు ఆర్‌కామ్ ఆదివారం ప్రకటించింది. ఈ ప్రకటన అనంతరం ఆర్‌కామ్ షేర్ విలువలు 6శాతం పెరగగా, జీటీఎల్ ఇన్‌ఫ్రా షేర్ విలువలు 20శాతం పెరిగాయి.
Source: Yahoo! Telugu: News | 28 Jun 2010 | 6:54 am

వృద్ధి బాటలో బాంబే స్టాక్ మార్కెట్!

బాంబే స్టాక్ మార్కెట్ లాభాల బాటలో కొనసాగుతోంది. ట్రేడింగ్ ప్రారంభం నుంచే పురోగమనం దిశగా ర్యాలీని కొనసాగిస్తున్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచి సెన్సెక్స్, మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో 110 పాయింట్లు బలపడి, 17,685 పాయింట్ల మార్కును తాకింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచి నిఫ్టీ కూడా 41 పాయింట్లు లాభపడి, 5,310 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.
Source: Yahoo! Telugu: News | 28 Jun 2010 | 6:50 am

జులై రెండో వారంలో "మన్మథ కామరాజులు"

యస్‌సిసి క్రియేషన్స్ పతాకంపై రవి.కె పట్వా - సంజయ్ దర్శకత్వంలో వై.పి.శెట్టి నిర్మాతగా హిందీలో విజయవంతమైన వాత్సాయన కామసూత్ర ఆధారంగా తెలుగులో రూపొందిస్తున్న మన్మథ కామరాజులు చిత్రం ఈ వారంలో సెన్సార్ పూర్తి చేసుకుని, జులై రెండో వారంలో విడుదలకు సిద్ధమవుతుంది. ఈ సందర్భంగా నిర్మాత వై.పి.శెట్టి చిత్ర విశేషాలను తెలియజేస్తూ... కామసూత్రాలు అంటే ఏమిటి..? అనే ఇతివృత్తంతో ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందిన వాత్సాయన కామసూత్రాలు భారతదేశం శృంగార కథలలో ఎంతో వైవిధ్యమైనవిగా చెప్పుకుంటారు.
Source: Yahoo! Telugu: Entertainment | 28 Jun 2010 | 6:35 am

హైదరాబాదులో మరో 2 నెలల్లో ఫేస్‌బుక్ కార్యాలయం!

ప్రముఖ సోషల్ నెట్‌వర్కింగ్ సంస్థ ఫేస్‌బుక్ మరో రెండు నెలల్లో హైదరాబాద్‌ కేంద్రంగా తన కార్యకలాపాలను ప్రారంభించనుంది. రహేజా మైండ్‌స్పేస్ ఐటి పార్క్‌లో సంబంధిత యూనిట్‌ను నెలకొల్పటానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఫేస్‌బుక్ తొలుత సెజ్‌లోని ఇంక్యుబేషన్ సెంటర్ నుంచి తాత్కాలిక కార్యకలాపాలు ప్రారంభించటంతోపాటు 500 మంది ఉద్యోగులను నియమించుకోనుంది. ఇప్పటికే నియామకాలు మొదలైనట్లు ఆ సంస్థ తెలిపింది.
Source: Yahoo! Telugu: News | 28 Jun 2010 | 6:27 am

జూలై మొదటి వారంలో "ఏం పిల్లో ఏం పిల్లడో"

తెలుగు ప్రేక్షకులు మెచ్చినటువంటి ఆణిముత్యాల్లాంటి ఎన్నో చిత్రాలను అందించిన ఈతరం అధినేత పోకూరి బాబూరావు తాజాగా ఎఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో తనీష్, ప్రణీత జంటగా నిర్మించిన "ఏం పిల్లో ఏం పిల్లడో" చిత్రం అన్ని కార్యక్రమాలను పూర్తి కావించుకుని ప్రస్తుతం డీటిఎస్ మిక్సింగ్ ఫైనల్ స్టేజిలో ఉంది. జూలై మొదటి వారంలో ఫస్ట్ కాపీ రాబోతున్న ఈ చిత్రాన్ని జులై రెండో వారంలో విడుదల చేసేందుకు నిర్మాత పోకూరి బాబూరావు సర్వసన్నాహాలు చేస్తున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 28 Jun 2010 | 6:13 am

లాభాల్లో స్టాక్ మార్కెట్: సెన్సెక్స్, నిఫ్టీల వృద్ధి!

బాంబే స్టాక్ మార్కెట్ సోమవారం లాభాల బాటలో కొనసాగుతోంది. ట్రేడింగ్ ప్రారంభం నుంచే పురోగమనం దిశగా ర్యాలీని కొనసాగిస్తున్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచి సెన్సెక్స్, సోమవారం ఉదయం 10.30 గంటల ప్రాంతంలో 102 పాయింట్లు లాభపడి, 17,677 పాయింట్ల మార్కును తాకింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచి నిఫ్టీ కూడా 31 పాయింట్లు పుంజుకుని, 17,677 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.
Source: Yahoo! Telugu: News | 28 Jun 2010 | 6:07 am

కేటీఆర్ రాజకీయ ఎదుగుదలను ఓర్వలేని హరీష్ రావు!

తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర రావు తనయుడు, సిరిసిల్ల మాజీ ఎమ్మెల్యే కె.తారక రామారావు (కేటీఆర్) రాజకీయ ఎదుగుదలను ఆయన బావ, సిద్ధిపేట మాజీ ఎమ్మెల్యే హరీష్ రావు ఓర్వలేక పోతున్నారని కాంగ్రెస్ ఎంపీల ఫోరం కన్వీనర్ పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. సిరిసిల్ల, వేములవాడ అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికలు వాయిదా పడటానికి హరీష్ రావే ప్రధాన కారకులని పొన్నం ఆరోపించారు.
Source: ఏపీ న్యూస్ | 28 Jun 2010 | 2:47 am

రాజీవ్ హంతకురాలు నళిని పుళల్ జైలుకు తరలింపు

దివంగత మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ హత్య కేసులో ప్రధాన నిందితురాలు నళినిని సోమవారం తమిళనాడు రాజధాని చెన్నై జైలుకు తరలించారు. రాజీవ్ గాంధీ హత్య కేసులో గత 19 సంవత్సరాలుగా జీవిత కారాగార శిక్ష అనుభవిస్తున్న నళినికి ప్రాణాపాయ ముప్పు పొంచి ఉందని సమాచారం అందడంతో, నళిళిని వేలూరు జైలు నుంచి చెన్నై జైలుకు తరలించారు.
Source: జాతీయ | 28 Jun 2010 | 2:37 am

ఆర్.కృష్ణయ్య బాటలో కిషన్ రెడ్డి ఆమరణ నిరాహార దీక్ష!

వెనుకబడిన విద్యార్థుల బోధనా ఫీజులు, ఉపకార వేతనాలు చెల్లింపుపై ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని వ్యతిరేకిస్తూ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఆమరణ నిరాహార దీక్షను ప్రారంభించారు.
Source: ఏపీ న్యూస్ | 28 Jun 2010 | 2:12 am

ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు: బాలికలదే పైచేయి!

ఇంటర్ ద్వితీయ సంవత్సర సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. ఈ పరీక్షల్లో 37.3 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులు కాగా, బాలికలే పైచేయిగా నిలిచారు. బాలురు 36 శాతం ఉత్తీర్ణులు కాగా, బాలికలు 39శాతం ఉత్తీర్ణత సాధించారు. మొత్తం సప్లిమెంటరీ పరీక్షల్లో 37.3 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.
Source: ఏపీ న్యూస్ | 28 Jun 2010 | 12:30 am

2014లో రాహుల్‌ను ప్రధానిగా చూడాలి: డాక్టర్ కేవీపీ

వచ్చే 2014 సంవత్సరంలో కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీని దేశ ప్రధానిగా చూడాలని రాజ్యసభ సభ్యుడు, రాష్ట్ర ప్రజాభద్రతా కమిటి ఛైర్మన్ డాక్టర్ కేవీపీ.రామచంద్ర రావు అభిప్రాయపడ్డారు. ఇందుకోసం ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త చిత్తశుద్ధితో పని చేయాలని ఆయన చెప్పారు.
Source: ఏపీ న్యూస్ | 28 Jun 2010 | 12:14 am

ఏమయ్యా.. మీరైనా చెప్పొచ్చుగా ముద్దుకృష్ణకు: రోశయ్య

తనపైనా కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీపైనా అనుచిత వ్యాఖ్యలు చేసిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి, గాలి ముద్దుకృష్ణమ నాయుడు పట్ల ముఖ్యమంత్రి కె.రోశయ్య ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక సీనియర్ నేతగా ఉన్న గాలి అలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమన్నారు. గాలికి ఏమైనా మతిభ్రమించిందా.. నోటికి ఎంత మాట వస్తే అంత మాట్లాడేందుకు అని తనను కలిసిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలతో రోశయ్య వాపోయారు.
Source: ఏపీ న్యూస్ | 28 Jun 2010 | 12:08 am

సీఎం రోశయ్య అబ్బ సొమ్మేమన్నా ఇస్తుండ్రా: కేసీఆర్

రాష్ట్రంలోని విద్యార్థులకు ముఖ్యమంత్రి కె.రోశయ్య అబ్బ సొమ్మేమన్నా ఇస్తుండ్రా అని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర రావు ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన మరుక్షణమే ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అందిస్తామని ఆయన ప్రకటించారు.
Source: ఏపీ న్యూస్ | 27 Jun 2010 | 11:58 pm

చంద్రబాబు - శ్రీనివాస్‌లిద్దరూ.. చవటదద్దమ్మలే: కేసీఆర్

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, పీసీసీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్‌లిద్దరూ చవట దద్దమ్మలతో సమానమని అని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకున్న వ్యక్తుల్లో చంద్రబాబు మొదటి వ్యక్తి కాగా, డీఎస్ రెండో వ్యక్తిగా చెప్పుకోవచ్చన్నారు.
Source: ఏపీ న్యూస్ | 27 Jun 2010 | 11:58 pm

పశ్చిమ బెంగాల్ సీపీఎంలో ఎన్నికల ఓటమి భయం

పశ్చిమబెంగాల్ రాష్ట్ర సీపీఎం పార్టీలో ఇటీవల ఎదురైన ఎన్నికల ఓటమి భయం పట్టిపీడిస్తోంది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఆ పార్టీ నేతల్లో ఎన్నికల వణుకు ప్రారంభమైంది. దీంతో చేసిన తప్పులను సరిదిద్దుకునే దిశగా దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఇందులోభాగంగా, గత శని, ఆదివారాల్లో ఆ పార్టీ నేతలు సమీక్షా సమావేశం నిర్వహించారు.
Source: జాతీయ | 27 Jun 2010 | 11:49 pm

తమిళంలో విద్యాభ్యాసం చేస్తే ఉద్యోగం ఖాయం: కరుణానిధి

తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆదివారం కోయంబత్తూరు నగర కేంద్రంగా జరిగిన ప్రపంచ తమిళ సదస్సులో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎం.కరుణానిధి కీలక నిర్ణయం ప్రకటించారు. తమిళంలో విద్యాభ్యాసం పూర్తి చేసిన వారికి విధిగా ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇందుకోసం త్వరలోనే ఒక చట్టాన్ని ప్రవేశపెట్టనున్నట్టు ఆయన ఈ సందర్భంగా ప్రకటించారు. అలాగే, తమిళంను జాతీయ స్థాయిలో అధికార భాష హోదా కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.
Source: జాతీయ | 27 Jun 2010 | 11:07 pm

ఎంపీల వేతనాల పెంపుపై నిర్ణయం తీసుకోలేదు: కేంద్రం

పార్లమెంట్ సభ్యుల వేతనాల పెంపుపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖామంత్రి పీకె.బన్సల్ అభిప్రాయపడ్డారు. పార్లమెంటరీ కమిటీ చేసిన సిఫార్సులను కేంద్ర మంత్రివర్గం ముందు ఉంచి, కూలంకుషంగా చర్చించిన తర్వాతే ఓ నిర్ణయానికి వస్తామని ఆయన తెలిపారు.
Source: జాతీయ | 27 Jun 2010 | 10:16 pm

ఆదాయం కోసమే మద్యం విక్రయాలు: సీఎం రోశయ్య

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వివిధ రకాల సంక్షేమ పథకాలను కొనసాగించాలంటే కోట్లాది రూపాయల నిధులను వెచ్చించాల్సి ఉందని ముఖ్యమంత్రి కె.రోశయ్య అన్నారు. ఈ నిధులను ఎక్కడ నుంచి సమకూర్చాలని ఆయన ప్రశ్నించారు. అందువల్లే రాష్ట్రంలో మద్యాన్ని విక్రయిస్తూ ఆదాయాన్ని సమకూర్చుతున్నట్టు ఆయన చెప్పారు.
Source: ఏపీ న్యూస్ | 27 Jun 2010 | 5:28 am

పెట్రో మంట: భారత్ బంద్‌కు ప్రతిపక్షాల సన్నాహాలు!

దేశీయంగా పెట్రోల్, డీజల్, వంటగ్యాస్, కిరోసిన్ ధరలను పెంచుతూ కేంద్రంలోని యూపీఏ సర్కారు తీసుకున్న నిర్ణయం పట్ల దేశ వ్యాప్తంగా తారా స్థాయిలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. పెట్రో ధరలను పెంచడాన్ని ఏ ఒక్క ప్రతిపక్ష పార్టీ సమర్థించడం లేదు. ముఖ్యంగా, యూపీఏ సంకీర్ణ కూటమిలోని కొన్ని మిత్రపక్షాలు సైతం పెట్రో వడ్డనను వ్యతిరేకిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి దేశ వ్యాప్త బంద్‌ను నిర్వహించేందుకు సిద్ధమవుతున్నాయి.
Source: జాతీయ | 27 Jun 2010 | 4:36 am

బెంగాల్ పీసీసీ చీఫ్ పదవికి ప్రణబ్ ముఖర్జీ రాజీనామా!

పశ్చిమబెంగాల్ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) అధ్యక్ష బాధ్యతల నుంచి కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ తప్పుకున్నారు. కేంద్ర ప్రభుత్వ బాధ్యతలు ఎక్కువగా ఉండటాన్ని కారణంగా చూపి ఆ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు ఆయన తన రాజీనామాలేఖలో పేర్కొన్నారు.
Source: జాతీయ | 27 Jun 2010 | 4:12 am

సోనియా.. పేదల రక్తం తాగడం మరిగారు: గాలి ముద్దు

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ దేశంలోని పేద ప్రజల రక్తం తాగడం బాగా మరిగారని తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు, సీనియర్ నేత, మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమ నాయుడు ధ్వజమెత్తారు. అలాగే, ముఖ్యమంత్రి కె.రోశయ్య రాష్ట్రంలో రాక్షసుడి అవతారం ఎత్తారని ఆయన ధ్వజమెత్తారు.
Source: ఏపీ న్యూస్ | 27 Jun 2010 | 3:49 am