|
ఉగ్రవాద నిర్మూలనకు సమిష్టిగా కృషి చేద్దాం: పాకిస్థాన్తమతమ దేశాల భద్రతకు పెను సవాల్ విసురుతున్న ఉగ్రవాదాన్ని అణిచివేసేందుకు సమిష్టిగా పోరాటం చేద్దామని పాకిస్థాన్ పిలుపునిచ్చింది. అలాగే, ముంబై ముట్టడి దర్యాప్తును కూడా వేగిరం చేసేందుకు చర్యలు చేపడుతామని హామీ ఇచ్చింది.Source: Yahoo! Telugu: News | 27 Jun 2010 | 9:32 am వైమానిక రంగంలో పెట్టుబడులు పెట్టనున్న మహీంద్రాదేశ వైమానిక రంగంలో మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించింది. వాహనాల ఉత్పత్తిలో అగ్రగామి సంస్థగా వెలుగొందుతున్న ఈ సంస్థ వైమానిక రంగంలో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకునేలా ప్రణాళికలు రచిస్తోంది. ఇందులోభాగంగా, ఈ వ్యాపారంలో 250 కోట్ల రూపాయల మేరకు పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించింది.Source: Yahoo! Telugu: News | 27 Jun 2010 | 9:24 am సోనియా.. పేదల రక్తం తాగడం మరిగారు: గాలి ముద్దుకాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ దేశంలోని పేద ప్రజల రక్తం తాగడం బాగా మరిగారని తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు, సీనియర్ నేత, మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమ నాయుడు ధ్వజమెత్తారు. అలాగే, ముఖ్యమంత్రి కె.రోశయ్య రాష్ట్రంలో రాక్షసుడి అవతారం ఎత్తారని ఆయన ధ్వజమెత్తారు.Source: Yahoo! Telugu: News | 27 Jun 2010 | 9:18 am పాక్‌తో జరిపే చర్చల వల్ల ప్రయోజనం శూన్యం: భాజపాపాకిస్థాన్తో జరిగే చర్చల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండబోదని భారతీయ జనతా పార్టీ అభిప్రాయపడింది. ఆ దేశం సీమాంతర ఉగ్రవాదాన్ని, భారత్ వ్యతిరేక చర్యలను ప్రోత్సహిస్తున్నంత కాలం పరిస్థితిలో ఎలాంటి మార్పు రాబోదని ఆ పార్టీ అధికార ప్రతినిధి ప్రకాష్ జావ్‌దేకర్ అభిప్రాయపడ్డారు.Source: Yahoo! Telugu: News | 27 Jun 2010 | 7:41 am రాష్ట్ర మార్కెట్‌లోకి వచ్చిన హ్యూండాయ్ వెర్నా మోడల్రాష్ట్ర కార్ల మార్కెట్‌లోకి మరో హ్యూండాయ్ సంస్థకు చెందిన సరికొత్త మోడల్ వచ్చింది. చిన్న కార్ల తయారీలో రెండో అతిపెద్ద కంపెనీగా పేరుగాంచిన హ్యూండాయ్ సంస్థ వెర్నా ట్రాన్స్‌ఫామ్ పేరుతో సరికొత్త మోడల్‌ను ప్రవేశపెట్టింది.Source: Yahoo! Telugu: News | 27 Jun 2010 | 7:35 am భద్రతామండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వానికి మద్దతు!ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం కల్పించేందుకు బ్రిటన్, ఫ్రాన్స్ కూడా సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. భారత్‌తో మరింతగా ద్వౌపాక్షిక సంబంధాలను మెరుగు పరుచుకోవాలన్న ఏకైక లక్ష్యంతోనే ఆ దేశాలు మద్దతు ప్రకటించినట్టు తెలుస్తోంది.Source: Yahoo! Telugu: News | 27 Jun 2010 | 7:28 am టొరంటో జి-20 శిఖరాగ్ర సదస్సుకు నిరసనల సెగ!కెనడా రాజధాని టొరంటోలో జరుగుతున్న జి-20 దేశాల శిఖరాగ్ర సదస్సుకు నిరసనలు భారీ ఎత్తున వెల్లువెత్తాయి. సుమారు రెండు వేల మందికి పైగా ప్రదర్శకులు టొరంటో వీధుల్లో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. పేదరిక నిర్మూలనకు జి-20 దేశాలు మరింత ఆర్థిక సాయం అందించాలని ఈ నిరసనలో పాల్గొన్న సామాజిక, కార్మిక సంఘాల కార్యకర్తలు పాల్గొన్నారు.Source: Yahoo! Telugu: News | 27 Jun 2010 | 7:16 am కుల ప్రాతిపదికన జనాభా సేకరణ చేపట్టాలి: ఎస్పీ2011 జనాభా లెక్కల్లో భాగంగా కుల ప్రాతిపదికన జనగణన చేపట్టాలని ములాయం సింగ్ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ హెచ్చరించింది. తమ డిమాండ్‌కు తలొగ్గని పక్షంలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను స్తంభింపజేస్తామని ఆ పార్టీ హెచ్చరించింది.Source: Yahoo! Telugu: News | 27 Jun 2010 | 6:48 am డీఎస్ గెలిస్తే ముఖ్యమంత్రి కావడం తథ్యం: మంత్రి సునీత!ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ ఉప ఎన్నికల్లో విజయం సాధిస్తే ముఖ్యమంత్రి కావడం తథ్యమని మంత్రి సునీతా లక్ష్మారెడ్డి జోస్యం చెప్పారు. ఆమె మెదక్ జిల్లాలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ.. తెలంగాణలో పది అసెంబ్లీ స్థానాలకు జరిగే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించడం తథ్యమన్నారు. పార్టీ అభ్యర్థుల విజయం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు.Source: Yahoo! Telugu: News | 27 Jun 2010 | 5:16 am ప్రైవేటు సంస్థలతో కుమ్మక్కైన ట్రాయ్: బీఎస్ఎన్ఎల్కొత్త లైసెన్స్‌ల కేటాయింపుల వ్యవహారంలో ప్రైవేట్ టెలికాం ఆపరేట్ సంస్థలతో టెలికాం రెగ్యులేటరీ అథారిటీ (ట్రాయ్) కుమ్మక్కైందని భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) ఆరోపించింది. ప్రైవేట్ టెలికామ్ సంస్థలకు ప్రయోజనం చేకూర్చేలా ట్రాయ్ అధికారులు నడుచుకుంటున్నారని విమర్శిస్తూ బీఎస్ఎన్ఎల్ లేఖ రాసింది.Source: Yahoo! Telugu: News | 27 Jun 2010 | 5:07 am సోనియా.. పేదల రక్తం తాగడం మరిగారు: గాలి ముద్దుకాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ దేశంలోని పేద ప్రజల రక్తం తాగడం బాగా మరిగారని తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు, సీనియర్ నేత, మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమ నాయుడు ధ్వజమెత్తారు. అలాగే, ముఖ్యమంత్రి కె.రోశయ్య రాష్ట్రంలో రాక్షసుడి అవతారం ఎత్తారని ఆయన ధ్వజమెత్తారు.Source: ఏపీ న్యూస్ | 27 Jun 2010 | 3:49 am పాక్‌తో జరిపే చర్చల వల్ల ప్రయోజనం శూన్యం: భాజపాపాకిస్థాన్తో జరిగే చర్చల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండబోదని భారతీయ జనతా పార్టీ అభిప్రాయపడింది. ఆ దేశం సీమాంతర ఉగ్రవాదాన్ని, భారత్ వ్యతిరేక చర్యలను ప్రోత్సహిస్తున్నంత కాలం పరిస్థితిలో ఎలాంటి మార్పు రాబోదని ఆ పార్టీ అధికార ప్రతినిధి ప్రకాష్ జావ్‌దేకర్ అభిప్రాయపడ్డారు.Source: జాతీయ | 27 Jun 2010 | 2:11 am కుల ప్రాతిపదికన జనాభా సేకరణ చేపట్టాలి: ఎస్పీ2011 జనాభా లెక్కల్లో భాగంగా కుల ప్రాతిపదికన జనగణన చేపట్టాలని ములాయం సింగ్ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ హెచ్చరించింది. తమ డిమాండ్‌కు తలొగ్గని పక్షంలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను స్తంభింపజేస్తామని ఆ పార్టీ హెచ్చరించింది.Source: జాతీయ | 27 Jun 2010 | 1:19 am డీఎస్ గెలిస్తే ముఖ్యమంత్రి కావడం తథ్యం: మంత్రి సునీత!ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ ఉప ఎన్నికల్లో విజయం సాధిస్తే ముఖ్యమంత్రి కావడం తథ్యమని మంత్రి సునీతా లక్ష్మారెడ్డి జోస్యం చెప్పారు. ఆమె మెదక్ జిల్లాలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ.. తెలంగాణలో పది అసెంబ్లీ స్థానాలకు జరిగే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించడం తథ్యమన్నారు. పార్టీ అభ్యర్థుల విజయం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు.Source: ఏపీ న్యూస్ | 26 Jun 2010 | 11:46 pm దేశంలోని మెట్రో నగరాలపై లష్కర్ గురి: ఇంటెలిజెన్స్దేశంలోని మెట్రో నగరాలపై లష్కర్ తోయిబా తీవ్రవాద సంస్థ దాడులకు తెగబడవచ్చని కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈ మేరకు ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలకుసమాచారం చేరవేసింది. కేంద్ర హోం మంత్రి చిదంబరం తన పాకిస్థాన్ పర్యటన అనంతరం ఈ విషయాన్ని వెల్లడించడం గమనార్హం.Source: జాతీయ | 26 Jun 2010 | 11:11 pm ఇప్పుడు భయం లేదు.. అందుకే కథ చెపుతున్నా: రాజమౌళిసినిమా విడుదలయ్యే వరకూ గోప్యంగా కథను ఉంచే రాజమౌళి సునీల్‌తో మర్యాద రామన్న చిత్రాన్ని తీస్తూ షూటింగ్ పూర్తయ్యాక కథ ఇదిగో అంటూ చెప్పారు. శనివారం ఆయన పాత్రికేయులతో మాట్లాడారు. రాయలసీమ కక్షలు, కార్పణ్యాలు, ప్రతీకారాలతో రగిలే మనుషుల్నే సినిమాల్లో చూశాం. వారిలో మరో కోణం ఉంది. అతిథులను గౌరవించడం. ఈ రెండింటి మధ్య హాస్యాన్ని ప్రధానంగా తీసుకుని కథ తయారు చేశాం. 30 ఏళ్ల క్రితం రాయలసీమలో ఉండే విలన్ తమ్ముడిని హీరో తండ్రి చంపేస్తాడు. కాలక్రమంలో హీరో వీటన్నింటికీ దూరంగా సిటీలో ఉంటాడు. తండ్రి కూడా చనిపోతాడు. తన బతుకు బతకాలంటే ఊరిలో ఉన్న పొలాన్ని అమ్మాలి. అందుకు హీరో వస్తాడు. విలన్ ఇంటికే అతిథిగా వస్తాడు హీరో. విలన్‌కు తన ప్రత్యర్థి కొడుకు అని తెలీదు. తర్వాత విషయం ఇద్దరికీ తెలుస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి..? అతిథిగా వచ్చాడు కాబట్టి చంపకూడదు. విలన్ ఆచారం ప్రకారం గుమ్మం దాటితే శత్రువు, లోపల ఉంటే అతిథి. ఆ దశలో హీరో సునీల్ ఏం చేశాడు..? అన్నది సినిమా. అంటూ దర్శకుడు రాజమౌళి చెప్పారు.Source: Yahoo! Telugu: Entertainment | 26 Jun 2010 | 1:11 pm బిగ్ బి మార్కుల కోసం చిత్రాలు తీయలేదు: మణిరత్నంబాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ నుంచి వచ్చే ప్రశంసలు, వేసే మార్కుల కోసం ఆశపడి తాను చిత్రాలు నిర్మించడం లేదని ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు మణిరత్నం ఘాటుగా స్పందించారు. దర్శకుడిగా తాను అనుకున్నది స్క్రీన్‌పై ఉండేలా చూడటమే తన ధ్యేయమన్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 26 Jun 2010 | 11:48 am సిగరెట్టుకు బానిస మనీషా: పెళ్లిలో కూడా దమ్ము కొట్టిన వైనంసహజంగా మగాళ్లలోనే చైన్ స్మోకర్లను చూస్తుంటాం. స్త్రీలలో దమ్ము కొట్టే వారు చాలా అరుదు. అయితే బాలీవుడ్ తార, నేపాలి ప్రౌఢ సుందరి మనీషా కొయిరాలా ఇటీవల తన పెళ్లి వేడుకలో కూడా దమ్ముకొడుతూ కనిపించిందట. పెళ్లైపోయిన తర్వాతైతే ఫర్వాలేదు. ఏకంగా పెళ్లికూతురుగా ఉన్నప్పుడే తన గదిలోకి వెళ్లి పొగను రింగులు రింగులుగా వదులుతూ దమ్ముకొట్టడంలో నిమగ్నమైందిట. అలా గుండెల నిండా పొగ పీలుస్తుంటే ఫోటోగ్రాఫర్ ఊరుకుంటాడా ఏంటీ...? టపటపా కెమేరాను క్లిక్ మనిపించాడట. ఇపుడా ఫోటోలను నెట్‌లో పెట్టి వీక్షకులకు అందుబాటులో ఉంచాడట. మనీషా కొయిరాలా పొగకు తీవ్రంగా బానిసరాలైనట్లు ఆమె సన్నిహితులు చెపుతున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాతైనా మానేస్తుందిలే అనుకుంటే.. పెళ్లిలోనే తాగుతుండే... ఏం చేస్తాం... అని నిట్టూరుస్తున్నారట. అంతే.. పాడు పొగ ఒక్కసారి అలవాటైందంటే.. దీని సిగ తరగ వదిలిపెట్టదు. ఆ టైముకి నాలుక పీకుతుంది, పళ్లు జిల్లుమంటాయ్.. అని పొగరాయుళ్లు చెప్పే మాట. మనీషా పరిస్థితీ బహుశాః ఇదే అయి ఉండవచ్చు. ఏం చేస్తుంది నాలుక పీకుతుంటే.. సిగరెట్ పీల్చక!!Source: Yahoo! Telugu: Entertainment | 26 Jun 2010 | 10:47 am "ఝుమ్మంది నాదం" ట్రెయిలర్ మీకోసంశ్రీలక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ పతాకంపై మంచు లక్ష్మీ ప్రసన్న నిర్మిస్తోన్న చిత్రం "ఝుమ్మంది నాదం". కె.రాఘవేంద్రరావు దర్శకుడు. ఈ చిత్రం ఇటీవలే విడుదలై ఆడియో హిట్ అయిందని సమర్పకుడు మోహన్ బాబు బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలియజేశారు.Source: Yahoo! Telugu: Entertainment | 26 Jun 2010 | 10:42 am గోలీమార్ ట్రెయిలర్ మీకోసంగోలీమార్ ట్రెయిలర్ మీకోసంSource: Yahoo! Telugu: Entertainment | 26 Jun 2010 | 10:36 am బద్మాష్ ట్రెయిలర్ మీకోసంబద్మాష్ ట్రెయిలర్ మీకోసంSource: Yahoo! Telugu: Entertainment | 26 Jun 2010 | 10:34 am గుడుగుడు గుంజం ట్రెయిలర్ మీకోసంగుడుగుడు గుంజం ట్రెయిలర్ మీకోసంSource: Yahoo! Telugu: Entertainment | 26 Jun 2010 | 10:32 am కిరణ్ బేడీ ట్రెయిలర్ మీకోసంకిరణ్ బేడీ ట్రెయిలర్ మీకోసంSource: Yahoo! Telugu: Entertainment | 26 Jun 2010 | 10:29 am తెలంగాణాకు సోనియా అనుకూలమే: డీఎస్ లేఖతెలంగాణా ఏర్పాటుకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అనుకూలమేనని తెలంగాణా ప్రజలకు చెప్పాల్సిందిగా సీనియర్ నేతలకు పీసీసీ చీఫ్ డి. శ్రీనివాస్ ఓ లేఖ రాశారు. కొంతమంది సోనియా గాంధీ తెలంగాణాకు వ్యతిరేకమని ప్రచారం చేయడాన్ని తిప్పి కొట్టాలని డీఎస్ ఆ లేఖలో కోరారు.Source: ఏపీ న్యూస్ | 26 Jun 2010 | 8:20 am ప్రభాస్, కాజల్, తాప్సీల కాంబినేషన్ అదుర్స్..!: దిల్రాజుశ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు నిర్మిస్తున్న తాజా చిత్రం షూటింగ్ హైదరాబాదులో జరుగుతోంది. ఈ చిత్రానికి దశరథ్ దర్శకుడు. కాజల్, అగర్వాల్, ఝమ్మంది నాదం హీరోయిన్ తాప్సీ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రం గురించి నిర్మాత మాట్లాడుతూ.. మా బేనర్‌లో ప్రొడక్షన్ నెం.12గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. ప్రభాస్‌కు మాస్ ఇమేజ్ ఉంది. అందుచేత ఆయన బాడీ లాంగ్వేజ్‌కు సరిపడా కథతో, లవ్, ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు యాక్షన్ ఉండే చిత్రాన్ని నిర్మిస్తున్నాం అన్నారు. ఇంకా దిల్‌రాజ్ మాట్లాడుతూ.. "కాజల్, తాప్సీ కాంబినేషన్‌కు ఈ సినిమాలో ప్రత్యేక క్రేజ్ ఏర్పడింది. మా పతాకంపై ఇప్పటివరకు విధంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. ఇందులో చాలామంది నటీనటులుంటారు. అందులో కొంతమంది కొత్తవారిని కూడా తీసుకోవాలనుకుంటున్నాం. ఇందులో ట్విన్స్ పాత్ర కీలకం. 40 ఏళ్ళలోపు వారు కావాలి. వారితో పాటు మరికొంతమంది ఆర్టిస్టులు కావాలి. మా చిత్రంలో నటించాలనుకునేవారు dilrajusvc@gmail.com అనే ఈ-మెయిల్‌కు తమ ఫోటోలను పంపగలరు" అని కోరారు.Source: Yahoo! Telugu: Entertainment | 26 Jun 2010 | 7:15 am 26/11 దాడుల వెనుక పలువురి పాత్ర: మంత్రి చిదంబరంముంబై మారణహోమం వెనుక పాకిస్థాన్‌లోని పలువురి పాత్ర ఉందని కేంద్ర హోం మంత్రి చిదంబరం అభిప్రాయపడ్డారు. వీరిందరిపై పాకిస్థాన్ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. 2008 నవంబరు 26వ తేదీన దేశ ఆర్థిక రాజధాని ముంబైలో పాక్ తీవ్రవాదులు మారణహోమం సృష్టించగా, ఇందులో 166 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెల్సిందే.Source: జాతీయ | 26 Jun 2010 | 6:32 am హ్యాపీ బర్త్ డే టు యంగ్ హీరో "ఉదయ్ కిరణ్"!"చిత్రం" సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన యంగ్ హీరో "ఉదయ్ కిరణ్". నువ్వు నేను, మనసంతా నువ్వే, కలుసుకోవాలని వంటి సినిమాల ద్వారా మాస్‌తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్న ఉదయ్ కిరణ్‌కు నేడే పుట్టినరోజు (జూన్-26). ఉదయ్ కిరణ్ పర్సనల్ టచ్.పూర్తి పేరు: వాజ్‌పేయాజుల ఉదయ్ కిరణ్. పుట్టిన తేదీ: జూన్ 26, 1980 (1980-06-26). వయస్సు: 29 సంవత్సరాలు. జన్మస్థలం: ఆంధ్రప్రదేశ్. తొలి తెలుగు చిత్రం: చిత్రంనటించిన చిత్రాలు: 14 చిత్రాలకు పైగా.Source: Yahoo! Telugu: Entertainment | 26 Jun 2010 | 5:33 am గుడుగుడు గుంజం ట్రెయిలర్ మీకోసంగుడుగుడు గుంజం ట్రెయిలర్ మీకోసంSource: వినోదం | 26 Jun 2010 | 5:04 am కిరణ్ బేడీ ట్రెయిలర్ మీకోసంకిరణ్ బేడీ ట్రెయిలర్ మీకోసంSource: వినోదం | 26 Jun 2010 | 5:00 am జులై 17న బీహార్ రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చిన ఆర్జేడీనిత్యావసర వస్తు ధరలను అరికట్టడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమైనందుకు నిరసగా వచ్చే నెల 17వ తేదీన బీహార్ రాష్ట్ర బంద్‌కు రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) పిలుపునిచ్చింది. ఈ విషయాన్ని ఆ పార్టీ అధినేత, కేంద్ర మాజీ మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ వెల్లడించారు.Source: జాతీయ | 26 Jun 2010 | 5:00 am అరెస్టు చేసి జైల్లో పడేయండి..!"సార్ నన్ను అరెస్టు చేసి జైల్లో పడేయండి..!" అన్నాడు తప్పతాగిన సుందరీశం ఎస్సైతో "ఎందుకు..?" ఆశ్చర్యంగా అడిగాడు ఎస్సై"నా భార్య తలకు తగిలేలా పెద్ద రాయి విసిరాను అందుకే..!?""అయితే నీ భార్యకు పెద్ద దెబ్బ తగిలిందా..?"...Source: వినోదం | 26 Jun 2010 | 4:59 am పారిపోయిన నా భర్తను...!"పారిపోయిన నా భర్తను కనిపెట్టి ఇవ్వండి ఎస్సైగారూ..!" వేడుకుంది సరోజమ్మ "పారిపోయిన మీ ఆనవాళ్లు చెప్పండి..!" అడిగాడు ఎస్సై "చెబుతాను రాసుకోండి.. పప్పుగుత్తితో గుద్దినప్పుడు పగిలిన..Source: వినోదం | 26 Jun 2010 | 4:58 am ప్రజలపై భారం పడకుండా చూస్తాం: సీఎం రోశయ్యపెరిగిన పెట్రో ధరల ప్రభావం రాష్ట్ర ప్రజానీకంపై పడకుండా చూస్తామని ముఖ్యమంత్రి కె.రోశయ్య సూచన ప్రాయంగా వెల్లడించారు. దీనిపై తుది నిర్ణయాన్ని వచ్చే మంత్రిమండలి సమావేశంలో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు.Source: ఏపీ న్యూస్ | 26 Jun 2010 | 4:40 am గ్యాస్ ధర పెంపును ప్రభుత్వమే భరించాలి: చిరంజీవికేంద్ర ప్రభుత్వం పెంచిన వంటగ్యాస్ ధరను రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి విజ్ఞప్తి చేశారు. పెట్రో వడ్డనకు నిరసనగా ఆ పార్టీ ఆధ్వర్యంలో విజయవాడలో నిరసన కార్యక్రమం జరిగింది. ఇందులో చిరంజీవితో పాటు ఆ పార్టీ నేతలు పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాన్య ప్రజల కష్టాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. అందువల్లే ఇష్టానుసారంగా పెట్రో ధరలను పెంచుతోందని ఆయన ఆరోపించారు.Source: ఏపీ న్యూస్ | 26 Jun 2010 | 4:17 am ఆ చర్చల్లో ఆండర్సన్ వ్యవహారం ప్రస్తావనకు రాదు!కెనడా రాజధాని టొరంటోలో భేటీ అయ్యే భారత ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాల మధ్య భోపాల్ గ్యాస్ కేసులో ప్రధాన నిందితుడైన వారెన్ ఆండర్సన్ వ్యవహారం ప్రస్తావనకు రాదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు సూచన ప్రాయంగా వెల్లడించాయి. భోపాల్ విషవాయువు లీకేజీ కేసులో యూనియన్ కార్బైడ్ ఇండియా కార్పొరేషన్ మాజీ సీఈఓ వారెన్ ఆండర్సన్‌ను అప్పగించాలని భారత్ డిమాండ్ చేస్తున్న విషయం తెల్సిందే.Source: జాతీయ | 26 Jun 2010 | 4:06 am రాష్ట్రంలో ప్రబలుతున్న స్వైన్‌ఫ్లూ: నలుగురి మృతిరాష్ట్రంలో స్వైన్‌ఫ్లూ మహమ్మారి రోజురోజుకు విస్తరిస్తోంది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 23 స్వైన్‌ఫ్లూ కేసులు నమోదైనట్లు, వీరిలో నలుగురు మృతి చెందినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు శనివారం ఒక ప్రకటనలో పేర్కొంది. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా స్వైన్‌ఫ్లూ మాత్రలు వాడవద్దని, వైద్యుడి సలహాను తీసుకున్న తర్వాతే మాత్రలు మింగాలని శాఖ విజ్ఞప్తి చేసింది.Source: ఏపీ న్యూస్ | 26 Jun 2010 | 3:28 am విద్యార్థులూ.. మిమ్మల్ని చూస్తే ఢిల్లీ గడగడ.. ఉరుకుండ్రి!!గత ఏడాది డిసెంబరులో విద్యార్థుల గర్జన చూసి ఢిల్లీ పీఠం గడగడ వణికిందనీ, ఇపుడు కూడా అదే ఊపుతో విద్యార్థులు ముందుకు ఉరకాలని తెలంగాణా రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు.Source: ఏపీ న్యూస్ | 26 Jun 2010 | 3:26 am ప్రస్తుతానికి నేను తెలంగాణ ఓటరునే: సీఎం రోశయ్యప్రస్తుతానికి తాను కూడా తెలంగాణ ప్రాంతానికి చెందిన ఓటరునే అని ముఖ్యమంత్రి కె.రోశయ్య అన్నారు. గత కొన్ని దశాబ్దాలుగా హైదరాబాద్‌లో ఉంటున్నట్టు, నగర ఓటర్ల జాబితాలో తన పేరు కూడా ఉందన్నారు. అందువల్ల తాను కూడా తెలంగాణ ఓటరునే అని ఆయన అభిప్రాయపడ్డారు.Source: ఏపీ న్యూస్ | 26 Jun 2010 | 3:04 am
|