|
రాష్ట్రంలో ప్రబలుతున్న స్వైన్‌ఫ్లూ: నలుగురి మృతిరాష్ట్రంలో స్వైన్‌ఫ్లూ మహమ్మారి రోజురోజుకు విస్తరిస్తోంది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 23 స్వైన్‌ఫ్లూ కేసులు నమోదైనట్లు, వీరిలో నలుగురు మృతి చెందినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు శనివారం ఒక ప్రకటనలో పేర్కొంది. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా స్వైన్‌ఫ్లూ మాత్రలు వాడవద్దని, వైద్యుడి సలహాను తీసుకున్న తర్వాతే మాత్రలు మింగాలని శాఖ విజ్ఞప్తి చేసింది.Source: Yahoo! Telugu: News | 26 Jun 2010 | 8:57 am విద్యార్థులూ.. మిమ్మల్ని చూస్తే ఢిల్లీ గడగడ.. ఉరుకుండ్రి!!గత ఏడాది డిసెంబరులో విద్యార్థుల గర్జన చూసి ఢిల్లీ పీఠం గడగడ వణికిందనీ, ఇపుడు కూడా అదే ఊపుతో విద్యార్థులు ముందుకు ఉరకాలని తెలంగాణా రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు.Source: Yahoo! Telugu: News | 26 Jun 2010 | 8:55 am పెరుగుతున్న తీవ్రవాదమే అతిపెద్ద ఛాలెంజ్: చిదంబరందక్షిణాసియాలో నానాటికీ పెరుగుతున్న తీవ్రవాదం అతిపెద్ద ఛాలెంజ్‌గా మారిందని కేంద్ర హోం మంత్రి చిదంబరం అభిప్రాయపడ్డారు. పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో శనివారం ప్రారంభమైన సార్క్ దేశాల హోం మంత్రుల స్థాయి సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దక్షిణాసియాలో శాంతిభద్రతలను కాపాడటం, ఈ ప్రాంతంలో ఆర్థికాభివృద్ధిని కాపాడటం పెరుగుతున్న తీవ్రవాదంతో పెను సవాల్‌గా మారిందన్నారు.Source: Yahoo! Telugu: News | 26 Jun 2010 | 8:47 am ఎంఐఏ ఆధునికీకరణ పనులు దక్కించుకున్న జిఎమ్ఆర్జీఎంఆర్కు విమానాశ్రయాల వ్యాపారం బాగా కలిసి వచ్చినట్టుంది. మాలే అంతర్జాతీయ విమానాశ్రాయం (ఎంఐఎ) ఆధునికీకరణ కోసం జీఎంఆర్ ఇన్‌ఫ్రా సంస్థ 400 మిలియన్ డాలర్ల కాంట్రాక్టు పనులను చేజిక్కించుకుంది. అయితే ఈ ఎయిర్‌పోర్టు విస్తరణకు నాలుగేళ్ళ వరకు సమయం పట్ట వచ్చని, విస్తరణ పనుల కోసం 400 మిలియన్ డాలర్ల పెట్టుబడులను పెడుతున్నట్టు జీఎంఆర్ సంస్థ చీఫ్ జీఎం.రావు తెలియజేశారు.Source: Yahoo! Telugu: News | 26 Jun 2010 | 8:34 am మార్కట్‌లో రెండింతల అభివృద్దే లక్ష్యం : తోషిబాప్రముఖ అంతర్జాతీయ లాప్‌టాప్‌ల తయారీ సంస్థ తోషిబా ఇండియా ఈ ఆర్థిక సంవత్సరంలో లాప్‌టాప్ మార్కెట్ వాటాను రెండింతలు పెంచుకోవాలని భావిస్తోంది. గత ఏడాది నమోదైన నాలుగు శాతం వాటా కంటే ఈ సంవత్సరం రెండింతల వ్యాపారాన్ని నమోదు చేయడమే తమ లక్ష్యమని తోషిబా సంస్థ ఇండియా డైరక్టర్ (పిసి విభాగం) తెంగూ వూ తెలిపారు.Source: Yahoo! Telugu: News | 26 Jun 2010 | 8:28 am ఎడిబుల్ ఆయిల్ ఎగుమతులపై నిషేదం ఎత్తివేయాలిఎడిబుల్ ఆయిల్ ఎగుమతులపై ఉన్న నిషేదాన్ని పూర్తిగా ఎత్తివేయాలని ఎడిబుల్ ఆయిల్ సంస్థ శనివారం ప్రభుత్వాన్ని కోరింది. 2008 మార్చిలో ప్రభుత్వం ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచటానికి గానూ ఎడిబుల్ ఆయిల్ ఎగుమతులపై నిషేధం విధించింది. అయితే ఆ తర్వాత సంవత్సరానికి 10,000 టన్నుల వరకూ 5 కేజీల కన్స్యూమర్ ప్యాకెట్లలో ఎగుమతి చేసుకోవచ్చునని ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.Source: Yahoo! Telugu: News | 26 Jun 2010 | 8:26 am అమెరికా మిలిటరీ చీఫ్ పర్యటన: కాబూల్‌లో భారీ పేలుడుఆప్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌లో శనివారం భారీ పేలుడు సంభవించింది. అమెరికా ఆర్మీ చీఫ్ కాబూల్ పర్యటన సందర్భంగా ఈ పేలుడు చోటు చేసుకోవడం గమనార్హం. ఈ పేలుడు ధాటికి వాటిల్లిన నష్టం వివరాలు తెలియాల్సి వుంది.Source: Yahoo! Telugu: News | 26 Jun 2010 | 7:24 am ప్రభాస్, కాజల్, తాప్సీల కాంబినేషన్ అదుర్స్..!: దిల్రాజుశ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు నిర్మిస్తున్న తాజా చిత్రం షూటింగ్ హైదరాబాదులో జరుగుతోంది. ఈ చిత్రానికి దశరథ్ దర్శకుడు. కాజల్, అగర్వాల్, ఝమ్మంది నాదం హీరోయిన్ తాప్సీ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రం గురించి నిర్మాత మాట్లాడుతూ.. మా బేనర్‌లో ప్రొడక్షన్ నెం.12గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. ప్రభాస్‌కు మాస్ ఇమేజ్ ఉంది. అందుచేత ఆయన బాడీ లాంగ్వేజ్‌కు సరిపడా కథతో, లవ్, ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు యాక్షన్ ఉండే చిత్రాన్ని నిర్మిస్తున్నాం అన్నారు. ఇంకా దిల్‌రాజ్ మాట్లాడుతూ.. "కాజల్, తాప్సీ కాంబినేషన్‌కు ఈ సినిమాలో ప్రత్యేక క్రేజ్ ఏర్పడింది. మా పతాకంపై ఇప్పటివరకు విధంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. ఇందులో చాలామంది నటీనటులుంటారు. అందులో కొంతమంది కొత్తవారిని కూడా తీసుకోవాలనుకుంటున్నాం. ఇందులో ట్విన్స్ పాత్ర కీలకం. 40 ఏళ్ళలోపు వారు కావాలి. వారితో పాటు మరికొంతమంది ఆర్టిస్టులు కావాలి. మా చిత్రంలో నటించాలనుకునేవారు dilrajusvc@gmail.com అనే ఈ-మెయిల్‌కు తమ ఫోటోలను పంపగలరు" అని కోరారు.Source: Yahoo! Telugu: Entertainment | 26 Jun 2010 | 7:15 am ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన కామసూత్ర మోడల్!ఇండియా మాజీ సూపర్‌మోడల్, కామసూత్ర ఫేమ్ వివేక్ బాబాజీ శుక్రవారం రాత్రి ఆత్మాహత్యాయత్నానికి పాల్పడింది. దేశ వాణిజ్య రాజధాని ముంబై శివార్లలో ఉన్న తన నివాసంలో ఈ చర్యకు పాల్పడినట్టు ఆమె కుటుంబ స్నేహితులు వెల్లడించారు. దీనిపై ముంబై పశ్చిమ రీజియన్ అడిషినల్ కమిషనర్ ఆఫ్ పోలీసు అమితాబ్ గుప్తా మాట్లాడుతూ.. వివేకా ఆత్మాహత్యాయత్నానికి పాల్పడిన మాట వాస్తవమేనన్నారు. అయితే, ఈ చర్యకు గల కారణాలు తెలియ రావాల్సి ఉందన్నారు.Source: Yahoo! Telugu: News | 26 Jun 2010 | 7:11 am పెట్రో ధరలకు వ్యతిరేకంగా ప్రరాపా ఆందోళన: చిరంజీవిపెట్రో ధరలను పెంచుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయం పట్ల ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి మండిపడ్డారు. ఇప్పటికే చుక్కలను తాకిన నిత్యావసర వస్తు ధరలతో ప్రజలు సతమతమవుతుంటే.. కేంద్రం మళ్లీ భారం మోపిందని ఆయన ఆరోపించారు.Source: Yahoo! Telugu: News | 26 Jun 2010 | 6:57 am ప్రస్తుతానికి నేను తెలంగాణ ఓటరునే: సీఎం రోశయ్యప్రస్తుతానికి తాను కూడా తెలంగాణ ప్రాంతానికి చెందిన ఓటరునే అని ముఖ్యమంత్రి కె.రోశయ్య అన్నారు. గత కొన్ని దశాబ్దాలుగా హైదరాబాద్‌లో ఉంటున్నట్టు, నగర ఓటర్ల జాబితాలో తన పేరు కూడా ఉందన్నారు. అందువల్ల తాను కూడా తెలంగాణ ఓటరునే అని ఆయన అభిప్రాయపడ్డారు.Source: Yahoo! Telugu: News | 26 Jun 2010 | 5:47 am హ్యాపీ బర్త్ డే టు యంగ్ హీరో "ఉదయ్ కిరణ్"!"చిత్రం" సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన యంగ్ హీరో "ఉదయ్ కిరణ్". నువ్వు నేను, మనసంతా నువ్వే, కలుసుకోవాలని వంటి సినిమాల ద్వారా మాస్‌తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్న ఉదయ్ కిరణ్‌కు నేడే పుట్టినరోజు (జూన్-26). ఉదయ్ కిరణ్ పర్సనల్ టచ్.పూర్తి పేరు: వాజ్‌పేయాజుల ఉదయ్ కిరణ్. పుట్టిన తేదీ: జూన్ 26, 1980 (1980-06-26). వయస్సు: 29 సంవత్సరాలు. జన్మస్థలం: ఆంధ్రప్రదేశ్. తొలి తెలుగు చిత్రం: చిత్రంనటించిన చిత్రాలు: 14 చిత్రాలకు పైగా.Source: Yahoo! Telugu: Entertainment | 26 Jun 2010 | 5:33 am రాష్ట్రంలో ప్రబలుతున్న స్వైన్‌ఫ్లూ: నలుగురి మృతిరాష్ట్రంలో స్వైన్‌ఫ్లూ మహమ్మారి రోజురోజుకు విస్తరిస్తోంది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 23 స్వైన్‌ఫ్లూ కేసులు నమోదైనట్లు, వీరిలో నలుగురు మృతి చెందినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు శనివారం ఒక ప్రకటనలో పేర్కొంది. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా స్వైన్‌ఫ్లూ మాత్రలు వాడవద్దని, వైద్యుడి సలహాను తీసుకున్న తర్వాతే మాత్రలు మింగాలని శాఖ విజ్ఞప్తి చేసింది.Source: ఏపీ న్యూస్ | 26 Jun 2010 | 3:28 am విద్యార్థులూ.. మిమ్మల్ని చూస్తే ఢిల్లీ గడగడ.. ఉరుకుండ్రి!!గత ఏడాది డిసెంబరులో విద్యార్థుల గర్జన చూసి ఢిల్లీ పీఠం గడగడ వణికిందనీ, ఇపుడు కూడా అదే ఊపుతో విద్యార్థులు ముందుకు ఉరకాలని తెలంగాణా రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు.Source: ఏపీ న్యూస్ | 26 Jun 2010 | 3:26 am ప్రస్తుతానికి నేను తెలంగాణ ఓటరునే: సీఎం రోశయ్యప్రస్తుతానికి తాను కూడా తెలంగాణ ప్రాంతానికి చెందిన ఓటరునే అని ముఖ్యమంత్రి కె.రోశయ్య అన్నారు. గత కొన్ని దశాబ్దాలుగా హైదరాబాద్‌లో ఉంటున్నట్టు, నగర ఓటర్ల జాబితాలో తన పేరు కూడా ఉందన్నారు. అందువల్ల తాను కూడా తెలంగాణ ఓటరునే అని ఆయన అభిప్రాయపడ్డారు.Source: ఏపీ న్యూస్ | 26 Jun 2010 | 3:04 am ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన కామసూత్ర మోడల్!ఇండియా మాజీ సూపర్‌మోడల్, కామసూత్ర ఫేమ్ వివేక్ బాబాజీ శుక్రవారం రాత్రి ఆత్మాహత్యాయత్నానికి పాల్పడింది. దేశ వాణిజ్య రాజధాని ముంబై శివార్లలో ఉన్న తన నివాసంలో ఈ చర్యకు పాల్పడినట్టు ఆమె కుటుంబ స్నేహితులు వెల్లడించారు. దీనిపై ముంబై పశ్చిమ రీజియన్ అడిషినల్ కమిషనర్ ఆఫ్ పోలీసు అమితాబ్ గుప్తా మాట్లాడుతూ.. వివేకా ఆత్మాహత్యాయత్నానికి పాల్పడిన మాట వాస్తవమేనన్నారు. అయితే, ఈ చర్యకు గల కారణాలు తెలియ రావాల్సి ఉందన్నారు.Source: జాతీయ | 26 Jun 2010 | 1:42 am పెట్రో ధరలకు వ్యతిరేకంగా ప్రరాపా ఆందోళన: చిరంజీవిపెట్రో ధరలను పెంచుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయం పట్ల ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి మండిపడ్డారు. ఇప్పటికే చుక్కలను తాకిన నిత్యావసర వస్తు ధరలతో ప్రజలు సతమతమవుతుంటే.. కేంద్రం మళ్లీ భారం మోపిందని ఆయన ఆరోపించారు.Source: ఏపీ న్యూస్ | 26 Jun 2010 | 1:28 am గాంధీ ఆస్పత్రిలో కొనసాగుతున్న ఆర్.కృష్ణయ్య దీక్షవిద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉపకారవేతనాల బకాయిలను విడుదల చేయాలని కోరుతూ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య చేపట్టిన ఆమరణ దీక్షను పోలీసులు శుక్రవారం రాత్రి భగ్నం చేశారు. అనంతరం ఆయనను హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అయినప్పటికీ.. ఆయన వైద్యం చేయించుకునేందుకు నిరాకరించిన కృష్ణయ్య ఆస్పత్రిలోనే దీక్ష కొనసాగిస్తున్నారు.Source: ఏపీ న్యూస్ | 26 Jun 2010 | 12:10 am పెట్రో-డీజల్ ధరల పెంపునకు నిరసనగా కేరళలో బంద్పెట్రోల్, డీజల్, వంటగ్యాస్, కిరోసిన్ ధరలను పెంచుతూ కేంద్రం తీసుకున్న చర్య పట్ల అన్ని ప్రతిపక్ష పార్టీలు ముక్తకంఠంతో ఖండిస్తున్నాయి. వామపక్ష పాలిత రాష్ట్రాల్లో శనివారం పూర్తి స్థాయి బంద్‌కు అధికార లెఫ్ట్ కూటమి పిలుపునిచ్చింది. దీంతో సాధారణ జనజీవనం స్తంభించిపోయింది.Source: జాతీయ | 25 Jun 2010 | 11:43 pm ఉప ఎన్నికల సమరం: తెరాసకు రెబెల్స్ బెడదతెలంగాణ రాష్ట్ర సమితికి రెబెల్స్ బెడద పట్టుకుంది. దీంతో పాటు ఖరీఫ్ సీజన్ సాగు పనుల భయం ఏర్పడింది. సంస్థాగత నిర్మాణం అంతగా లేని తెరాస ఈ ఎన్నికల్లో కేవలం తెలంగాణ సెంటిమెంట్‌నే నమ్ముకుని పోటీ చేస్తోంది. మరోవైపు సాంప్రదాయక బలమైన ఓటు బ్యాంకు, పటిష్టమైన పార్టీ నిర్మాణం ఉన్న కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలను ఢీకొనడం తెరాసలకు అంత సులభమైన అంశంగా కనిపించడం లేదు.Source: ఏపీ న్యూస్ | 25 Jun 2010 | 11:13 pm 'ఆమ్ ఆద్మీ' పేరుతో ప్రజల నడ్డి విరుస్తున్న కాంగ్రెస్: భాజపాఆమ్ ఆద్మీ పేరుతో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ సంకీర్ణ సర్కారు ప్రజల నడ్డి విరుస్తోందని ప్రధాన ప్రతిపక్షం భారతీయ జనతా పార్టీ మండిపడింది. తాజాగా కేంద్రం పెట్రో ధరల పెంపుపై భాజపా తీవ్రంగా మండిపడింది. దీనిపై ఆ పార్టీ ప్రతినిధి ప్రకాష్ జావ్‌దేకర్ స్పందిస్తూ ధరలు ఆకాశాన్ని తాకుతున్న నేపథ్యంలో కేంద్రం తాజాగా తీసుకున్న చర్య ప్రజలపై మరింత భారం పడుతుందన్నారు.Source: జాతీయ | 25 Jun 2010 | 10:32 pm మహిళా బిల్లులో మార్పులు చేయాల్సిందే: లాలూ ప్రసాద్రాజ్యసభలో ప్రవేశపెట్టిన మహిళా బిల్లులో సవరణలు చేయాల్సిందేనని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ మారు గట్టిగా డిమాండ్ చేశారు. ఇప్పుడున్న రూపంలో మహిళా బిల్లును ప్రవేశపెడితే బిల్లును వ్యతిరేకిస్తామని ఆయన స్పష్టం చేశారు.Source: జాతీయ | 25 Jun 2010 | 9:33 pm పప్పు.. పెద్ద శనిగాడు... ఎలాగంటారా...?!!కృష్ణుడు సినిమాలంటేనే వినోదభరితంగా ఉంటాయి. వినాయకుడు, విలేజ్‌లో వినాయకుడు, ఏ మాయ చేశావె వంటి చిత్రాల్లో అమాయకత్వంతో కూడిన భావ ప్రకటనలతో యువతుల మనసు దోచే క్యారక్టర్లలో నటించాడు కృష్ణుడు. అటువంటి తరహాలోనే వచ్చిన మరో చిత్రం "పప్పు". దర్శకుడు కొత్తగా తీయకపోయినా టెక్నిక్ వేల్యూస్ బాగున్నాయి. సగటు ప్రేక్షకుడికి కాస్త ఆటవిడుపుగా ఉంటుంది.Source: Yahoo! Telugu: Entertainment | 25 Jun 2010 | 12:33 pm "రావణు"డి వెంట వెళ్లిన సీత: అందుకే ప్రేక్షకుల వాతమణిరత్నం స్టయిలే వేరు. ఆయన ఏ చిత్రం తీసినా ఓ మాస్టర్ పీస్ అంటారు. కానీ ఎందుకనో ఈసారి పురాణాల నేపధ్యాన్ని రివర్స్ గేర్‌లో తీసి ప్రయోగం చేశాడంటున్నారు సినీ విశ్లేషకులు. టేకింగ్, మేకింగ్ అంతా భారీగా సాగిన విలన్ ప్రేక్షకుల మదిని మాత్రం గెలుచుకోలేక పోయింది. ఆరాధ్య దైవమైన శ్రీరాముడు, సీత బ్యాక్‌డ్రాప్‌తో చుట్టిన పాత్రలు నెగటివ్ టచ్‌తో చూపించడమే ఇందుకు కారణమని కొందరు అంటుంటే, మరికొందరు సీత క్యారెక్టర్ చివరికి రావణ్ వెంట నడిచి వెళ్లిపోవడం జీర్ణించుకోలేని విషయమైందని అంటున్నారు.ఏదైతేనేం.. మొత్తమ్మీద విలన్ చిత్రాన్ని మణిరత్నం ఒక రకంగా ఆలోచిస్తే.. ప్రేక్షకులు మాత్రం మరో రకంగా ఆలోచించారు. ఫలితం ఫ్లాప్. ఏం చేస్తాం. విలన్ అన్నా రావణ్ అన్నా ఏదన్నా పురాణాలను టచ్ చేసే సబ్జెక్టులతో జాగ్రత్త అన్నా అంటున్నారు. అంతే కదా మరి..!!Source: Yahoo! Telugu: Entertainment | 25 Jun 2010 | 10:31 am డీఎస్ గెలిస్తే తెలంగాణా రాదు - అందుకే చిత్తుగా ఓడించండిపీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ తాను ఎన్నికల్లో గెలిస్తే తెలంగాణా తెస్తానని చెప్పటం అంతా బూటకమని తెలంగాణా రాష్ట్ర సమితి నాయకుడు వినోద్ అన్నారు. ఇలా బూటకపు మాటలు చెప్పీ చెప్పీ కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేస్తూ వస్తోందన్నారు.Source: ఏపీ న్యూస్ | 25 Jun 2010 | 9:20 am ఊఁ.. అంకుల్ కాదు.. ఫ్రెండ్ అని పిలువ్: మోహన్ బాబుతన కుమారుడు సరసన నటించిన తాప్సీని తదుపరి చిత్రంలో హీరోయిన్‌గా పెట్టుకుంటున్నానని మోహన్ బాబు అన్నారు. అసలు కుర్ర హీరోలకంటే తాను ఎందులోనూ తక్కువ కాదని అందుకే ఆమెను తన చిత్రంలో హీరోయిన్‌గా కమిట్ చేయించానని చెప్పాడు. షూటింగ్‌లో తనను మొదట్లో అంకుల్ అని పిలిచేదనీ, అది తనకు గిట్టదనీ ఫ్రెండ్ అని సంబోధించమని చెప్పానన్నారు. "సరదాగా సాగిన సంభాషణ అనుకుంటే పొరపాటే.. నేను ఇప్పటివరకూ నాలుగేళ్ల నుంచి నటుడిగా ఏమీ చేయడం లేదు. ఏదో ఒకటి, అర చిత్రాల్లో నటిస్తున్నాను. కానీ తాప్సీని చూశాక ఆమెతో జోడీగా నటించాలనే కుతూహలం నాలో పెరిగిపోయింది. అందుకే ఆమెతో కలిసి ఓ చిత్రం చేద్దామన్న నిర్ణయానికి వచ్చానని చెప్పారు. దీనికి తాప్సీ కూడా అడ్డు చెప్పలేదు. ఓకే ఫ్రెండ్ అలాగే చేద్దాం అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.Source: Yahoo! Telugu: Entertainment | 25 Jun 2010 | 8:04 am జూలై 1న విడుదల కానున్న "ఝుమ్మంది నాదం"శ్రీలక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ పతాకంపై మంచు లక్ష్మీ ప్రసన్న నిర్మిస్తోన్న చిత్రం "ఝుమ్మంది నాదం". కె.రాఘవేంద్రరావు దర్శకుడు. ఈ చిత్రం ఇటీవలే విడుదలై ఆడియో హిట్ అయిందని సమర్పకుడు మోహన్ బాబు బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలియజేశారు. బిడ్డ పుట్టగానే వీడు ప్రయోజకుడవుతాడని తెలిసిపోతోంది. అలాగే బ్యానర్ స్థాపించినప్పుడు అలాగే అనిపించింది. ఈ చిత్ర కథ విన్నప్పుడు అలాగే అనిపించింది. తప్పకుండా ఈ చిత్రం గొప్ప సక్సెస్ అవుతుందని మోహన్ బాబు చెప్పారు. ఈ సినిమాను అనుకున్న బడ్జెట్ తీశాం. తొమ్మిది పాటలున్నాయి. వేటికవే గొప్పగా ఉన్నాయి. సహజంగా సినిమాలో రెండు, మూడు పాటలు బాగున్నాయని అంటారు. కానీ ఇందులో అన్ని పాటలు బాగున్నాయని రిపోర్ట్ రావడం చాలా ఆనందాన్ని కల్గించింది. జూలై 1న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం.Source: Yahoo! Telugu: Entertainment | 25 Jun 2010 | 7:31 am స్థానిక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు: చిరంజీవిస్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు ఉంటుందని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి స్పష్టం చేశారు. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నప్పటికీ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తామని చిరంజీవి వెల్లడించారు. ఉభయ గోదావరి జిల్లాలోని పోలవరం నిర్వాసితుల సమస్యలను దేశ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ దృష్టికి తీసుకెళతామని చిరంజీవి తెలిపారు.Source: ఏపీ న్యూస్ | 25 Jun 2010 | 7:20 am సామాన్యుడి బతుకుపై కాంగ్రెస్ చావుదెబ్బ: చంద్రబాబుఒకవైపు ప్రజలు ఆహార పదార్థాల ధరల పెరుగుదలతో బెంబేలెత్తిపోతుంటే.. అది చాలదన్నట్లు కాంగ్రెస్ సర్కార్ పెట్రోలు ధరలు పెంచి వారి జీవితంపై చావుదెబ్బ కొట్టిందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు.Source: ఏపీ న్యూస్ | 25 Jun 2010 | 6:40 am విబేధాలకు తెర: విశ్వాసయాత్రలో పాల్గొన్న సుశీల్-నితీష్!భారత జనతా పార్టీ- జేడీయుల మధ్య తలెత్తిన విభేదాలు కూడా ఈ భేటీ ద్వారా కొలిక్కి వచ్చాయి. దీనిని ధ్రువీకరించే రీతిలో శుక్రవారం గయా జిల్లాలో బీహార్ సీఎం నితీష్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన విశ్వాస యాత్రలో బీజేపీకి చెందిన ఉపముఖ్యమంత్రి సుశీల్ మోడీ హాజరయ్యారు. వీరిద్దరూ పాట్నాకు వేర్వేరు వాహనాల ద్వారా చేరుకుని అక్కడ నుంచి కలిసి విశ్వాస యాత్రలో పాల్గొన్నారు.Source: జాతీయ | 25 Jun 2010 | 6:26 am పెట్రో ధరలపై మండిపడిన రైల్వేశాఖ మంత్రి మమతా బెనర్జీ!యూపీఏ ప్రభుత్వం ప్రకటించిన పెట్రో ధరలపై సర్వత్రా నిరసనలు వెలువెత్తుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కొత్త పెట్రోధరల పెరుగుదలపై రైల్వే శాఖ మంత్రి మమతా బెనర్జీ మండిపడ్డారు. పెట్రో ధరలపై కేంద్ర మంత్రుల సాధికారిక కమిటీ భేటీలో తాను పాల్గొనలేదని బెనర్జీ చెప్పారు. పెట్రో ధరల పెంపును తాను పూర్తిగా వ్యతిరేకిస్తున్నానని మమత అన్నారు.Source: జాతీయ | 25 Jun 2010 | 5:58 am ఉపఎన్నికల్లో 5 స్థానాల్లో గెలవడమే ధ్యేయం: కోమటిరెడ్డితెలంగాణాలో జరుగనున్న ఉపఎన్నికల్లో మొత్తం పది స్థానాలకుగాను 5 స్థానాలు దక్కించుకోవడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు.Source: ఏపీ న్యూస్ | 25 Jun 2010 | 4:37 am లోకాయుక్త హెగ్డే రాజీనామాపై పునరాలోచించాలి: చిదంబరంలోకాయుక్త హెగ్డే తన రాజీనామాపై పునరాలోచించాలని కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం సూచించారు. ఆయన రాజీనామా చేయడం ద్వారా రాష్ట్రంలో కొన్ని అవినీతి శక్తులకు తావిచ్చినట్లవుతుందని కేంద్ర హోం మంత్రి పేర్కొన్నారు.Source: జాతీయ | 25 Jun 2010 | 4:26 am
|