సహారా ఎడారిలో అల్‌ఖైదా భూగర్భ రక్షణ గృహాలు!

సహారా ఎడారిలో అల్‌ఖైదా భూగర్భ రక్షణ గృహాలను ఏర్పాటు చేసుకుంటున్నట్లు నిఘా సంస్థల నుంచి సమాచారం అందింది. అల్జీరియా మరియు సహారా ఎడారి ప్రాంతాల్లో ప్రముఖ ఉగ్రవాద సంస్థ అల్‌ఖైదా భూగర్భ రక్షణ గృహాలను ఏర్పాటు చేసుకుంటున్నట్లు నిఘా సంస్థలు హెచ్చరించాయి.
Source: Yahoo! Telugu: News | 25 Jun 2010 | 9:40 am

ఆప్ఘన్‌లో అమెరికా బలగాల ఉపసంహరణ లేదు: ఒబామా

ఆప్ఘనిస్థాన్‌లో అమెరికా బలగాలను ఇప్పట్లో ఉపసంహరించుకునేది లేదని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పేర్కొన్నారు. ప్రస్తుతం ఆప్ఘనిస్థాన్‌లోని పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని బలగాలను ఉపసంహరించుకునే యోచన లేదని ఒబామా తేల్చి చెప్పారు.
Source: Yahoo! Telugu: News | 25 Jun 2010 | 9:28 am

మధ్యతరగతి ప్రజలపై గ్యాస్ "బండ" - కిరోసిన్ "మంట"

పెట్రోలు, డీజిల్ ధరల పెంపుపై కేంద్ర మంత్రుల సాధికార కమిటీ మధ్యతరగతి ప్రజల నడ్డి విరిచే చర్య తీసుకుంది. వంటగ్యాస్ ధరను ఏకంగా రూ. 35 పెంచి మధ్యతరగతి ప్రజలపై మోయలేని భారాన్ని ఉంచింది.
Source: Yahoo! Telugu: News | 25 Jun 2010 | 8:59 am

లోకాయుక్త రాజీనామాపై పునరాలోచించాలి: చిదంబరం

లోకాయుక్త రాజీనామాపై పునరాలోచించాలని కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం సూచించారు. లోకాయుక్త రాజీనామా చేయడం ద్వారా రాష్ట్రంలో కొన్ని అవినీతి శక్తులకు తావిచ్చినట్లవుతుందని కేంద్ర హోం మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో న్యాయపరమైన పరిష్కారాలకు లోకాయుక్త తన సేవలను కొనసాగించాలని చిదంబరం తెలిపారు. కాబట్టి తన పదవికి రాజీనామా చేసే విషయంలో లోకాయుక్త మరోసారి ఆలోచించాలని కేంద్ర హోం మంత్రి వెల్లడించారు.
Source: Yahoo! Telugu: News | 25 Jun 2010 | 8:16 am

ఊఁ.. అంకుల్ కాదు.. ఫ్రెండ్ అని పిలువ్: మోహన్ బాబు

తన కుమారుడు సరసన నటించిన తాప్సీని తదుపరి చిత్రంలో హీరోయిన్‌గా పెట్టుకుంటున్నానని మోహన్ బాబు అన్నారు. అసలు కుర్ర హీరోలకంటే తాను ఎందులోనూ తక్కువ కాదని అందుకే ఆమెను తన చిత్రంలో హీరోయిన్‌గా కమిట్ చేయించానని చెప్పాడు. షూటింగ్‌లో తనను మొదట్లో అంకుల్ అని పిలిచేదనీ, అది తనకు గిట్టదనీ ఫ్రెండ్ అని సంబోధించమని చెప్పానన్నారు. "సరదాగా సాగిన సంభాషణ అనుకుంటే పొరపాటే.. నేను ఇప్పటివరకూ నాలుగేళ్ల నుంచి నటుడిగా ఏమీ చేయడం లేదు. ఏదో ఒకటి, అర చిత్రాల్లో నటిస్తున్నాను. కానీ తాప్సీని చూశాక ఆమెతో జోడీగా నటించాలనే కుతూహలం నాలో పెరిగిపోయింది. అందుకే ఆమెతో కలిసి ఓ చిత్రం చేద్దామన్న నిర్ణయానికి వచ్చానని చెప్పారు. దీనికి తాప్సీ కూడా అడ్డు చెప్పలేదు. ఓకే ఫ్రెండ్ అలాగే చేద్దాం అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Source: Yahoo! Telugu: Entertainment | 25 Jun 2010 | 8:04 am

నష్టాల్లో కూరుకుపోయిన బాంబే స్టాక్ మార్కెట్

దేశీయ వాటాల ట్రేడింగ్ నిరాశజనకంగా కొనసాగడంతో బాంబే స్టాక్ మార్కెట్ క్షీణించింది. వారాంతమైన శుక్రవారం తిరోగమనం వైపు పయనిస్తున్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచి సెన్సెక్స్, మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో 81 పాయింట్లు నష్టపోయింది. దీంతో సెన్సెక్స్ సూచి 17,648 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచి నిఫ్టీ కూడా 27 పాయింట్లు పతనమై, 5,292 పాయింట్ల వద్ద పయనిస్తోంది.
Source: Yahoo! Telugu: News | 25 Jun 2010 | 7:56 am

విదేశీ స్టాక్ మార్కెట్ల ప్రభావం: నష్టాల్లో సెన్సెక్స్!

బాంబే స్టాక్ మార్కెట్ శుక్రవారం తిరోగమనం వైపు ర్యాలీని కొనసాగిస్తోంది. ట్రేడింగ్ ప్రారంభం నుంచే నష్టాల బాట పట్టిన బాంబే స్టాక్ మార్కెట్ సూచీలు మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో క్షీణించాయి. అమెరికా, ఆసియా స్టాక్ మార్కెట్లు నష్టాల వైపు ర్యాలీని కొనసాగించడం బాంబే స్టాక్ మార్కెట్ నష్టానికి కారణమని ఆర్థిక నిపుణులు అంటున్నారు.
Source: Yahoo! Telugu: News | 25 Jun 2010 | 7:45 am

నష్టాల్లో స్టాక్ మార్కెట్: సెన్సెక్, నిఫ్టీల పతనం!

బాంబే స్టాక్ మార్కెట్ నష్టాల్లో కూరుకుపోయింది. ట్రేడింగ్ ప్రారంభం నుంచే నష్టాలను చవిచూసిన బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచి సెన్సెక్స్, ఉదయం 10.30 గంటల ప్రాంతంలో 122 పాయింట్లు పతనమై, 17,607 పాయింట్ల మార్కును తాకింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచి నిఫ్టీ కూడా 38 పాయింట్లు పడిపోయి, 5,282 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.
Source: Yahoo! Telugu: News | 25 Jun 2010 | 7:36 am

జూలై 1న విడుదల కానున్న "ఝుమ్మంది నాదం"

శ్రీలక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ పతాకంపై మంచు లక్ష్మీ ప్రసన్న నిర్మిస్తోన్న చిత్రం "ఝుమ్మంది నాదం". కె.రాఘవేంద్రరావు దర్శకుడు. ఈ చిత్రం ఇటీవలే విడుదలై ఆడియో హిట్ అయిందని సమర్పకుడు మోహన్ బాబు బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలియజేశారు. బిడ్డ పుట్టగానే వీడు ప్రయోజకుడవుతాడని తెలిసిపోతోంది. అలాగే బ్యానర్ స్థాపించినప్పుడు అలాగే అనిపించింది. ఈ చిత్ర కథ విన్నప్పుడు అలాగే అనిపించింది. తప్పకుండా ఈ చిత్రం గొప్ప సక్సెస్ అవుతుందని మోహన్ బాబు చెప్పారు. ఈ సినిమాను అనుకున్న బడ్జెట్ తీశాం. తొమ్మిది పాటలున్నాయి. వేటికవే గొప్పగా ఉన్నాయి. సహజంగా సినిమాలో రెండు, మూడు పాటలు బాగున్నాయని అంటారు. కానీ ఇందులో అన్ని పాటలు బాగున్నాయని రిపోర్ట్ రావడం చాలా ఆనందాన్ని కల్గించింది. జూలై 1న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం.
Source: Yahoo! Telugu: Entertainment | 25 Jun 2010 | 7:31 am

"సత్యం" రామకృష్ణా.. కంప్యూటర్ వాడుకో..!: నాంపల్లి కోర్టు

ఎట్టకేలకు సత్యం కేసు నిందితుడు రామకృష్ణకు కంప్యూటర్ వినియోగానికి ప్రత్యేక కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జైలులో కంప్యూటర్ వినియోగించుకునేందుకు రామకృష్ణ కోర్టును విజ్ఞప్తి చేశారు. సత్యం కంప్యూటర్స్ కుంభకోణంలో కీలక నిందితుడైన ఇంటర్నల్ ఆడిటర్ రామకృష్ణ అభ్యర్థన మేరకు చంచల్ గూడ జైల్లో కంప్యూటర్ వాడుకునేందుకు నాంపల్లి ప్రత్యేక కోర్టు శుక్రవారం అనుమతి ఇచ్చింది.
Source: Yahoo! Telugu: News | 25 Jun 2010 | 7:27 am

బోధనా ఫీజుల చెల్లింపుకై కృష్ణయ్య ఆమరణ దీక్ష

రాష్ట్ర ప్రభుత్వం బోధనా ఫీజులు, ఉపకార వేతనాలు చెల్లించకుండా ఎగనామం పెట్టేందుకు ప్రణాళికలు రచిస్తోందనీ, దీనిని వ్యతిరేకిస్తూ బీసీ సంఘం నాయకుడు ఆర్ కృష్ణయ్య ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. బీసీ సంక్షేమ శాఖ వద్ద నిరాహార దీక్ష చేపట్టిన ఆయనకు విపక్షాలన్నీ మద్దతు పలికాయి.
Source: Yahoo! Telugu: News | 25 Jun 2010 | 7:19 am

రాజీనామా చేసిన నేతలు నిబద్ధత చాటుకోవాలి: జేఏసీ

ప్రత్యేక తెలంగాణ కోసం రాజీనామా చేసిన తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు తెలంగాణ ప్రజల పట్ల తమ నిబద్ధతను చాటుకోవాలని జేఏసీ పిలుపు నిచ్చింది. తెలంగాణ వాదానికి, తెలంగాణ వ్యతిరేక వాదానికి జరుగుతున్న పోటీలో తెరాస నేతలు గెలిచి తీరాలని ప్రొఫెసర్ జయశంకర్ చెప్పారు.
Source: Yahoo! Telugu: News | 25 Jun 2010 | 7:17 am

లోకాయుక్త రాజీనామాపై పునరాలోచించాలి: చిదంబరం

లోకాయుక్త రాజీనామాపై పునరాలోచించాలని కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం సూచించారు. లోకాయుక్త రాజీనామా చేయడం ద్వారా రాష్ట్రంలో కొన్ని అవినీతి శక్తులకు తావిచ్చినట్లవుతుందని కేంద్ర హోం మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో న్యాయపరమైన పరిష్కారాలకు లోకాయుక్త తన సేవలను కొనసాగించాలని చిదంబరం తెలిపారు. కాబట్టి తన పదవికి రాజీనామా చేసే విషయంలో లోకాయుక్త మరోసారి ఆలోచించాలని కేంద్ర హోం మంత్రి వెల్లడించారు.
Source: జాతీయ | 25 Jun 2010 | 2:46 am

బోధనా ఫీజుల చెల్లింపుకై కృష్ణయ్య ఆమరణ దీక్ష

రాష్ట్ర ప్రభుత్వం బోధనా ఫీజులు, ఉపకార వేతనాలు చెల్లించకుండా ఎగనామం పెట్టేందుకు ప్రణాళికలు రచిస్తోందనీ, దీనిని వ్యతిరేకిస్తూ బీసీ సంఘం నాయకుడు ఆర్ కృష్ణయ్య ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. బీసీ సంక్షేమ శాఖ వద్ద నిరాహార దీక్ష చేపట్టిన ఆయనకు విపక్షాలన్నీ మద్దతు పలికాయి.
Source: ఏపీ న్యూస్ | 25 Jun 2010 | 1:50 am

రాజీనామా చేసిన నేతలు నిబద్ధత చాటుకోవాలి: జేఏసీ

ప్రత్యేక తెలంగాణ కోసం రాజీనామా చేసిన తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు తెలంగాణ ప్రజల పట్ల తమ నిబద్ధతను చాటుకోవాలని జేఏసీ పిలుపు నిచ్చింది. తెలంగాణ వాదానికి, తెలంగాణ వ్యతిరేక వాదానికి జరుగుతున్న పోటీలో తెరాస నేతలు గెలిచి తీరాలని ప్రొఫెసర్ జయశంకర్ చెప్పారు.
Source: ఏపీ న్యూస్ | 25 Jun 2010 | 1:47 am

మావోయిస్టులు దాడులు జరపొచ్చు: నిఘా హెచ్చరిక

ఛత్తీస్‌గఢ్‌లో అవకాశం దొరికినపుడల్లా విరుచుక పడుతున్న మావోయిస్టులు ఆంధ్రప్రదేశ్‌పై టార్గెట్ పెట్టినట్లు నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. ఈసారి మావోయిస్టులు తమ లక్ష్యాన్ని పట్టణ ప్రాంతాలపై పెట్టినట్లు వారు హెచ్చరించారు.
Source: ఏపీ న్యూస్ | 25 Jun 2010 | 1:15 am

ప్రపంచ తమిళ మహానాడులో అపశృతి: సుదర్శనం మృతి!

ప్రపంచ తమిళ మహానాడులో అపశృతి చోటు చేసుకుంది. ఈ మహాసభలకు హాజరైన తమిళనాడు శాసనసభ పక్షనేత పి. సుదర్శనం నాయుడు శుక్రవారం గుండెపోటుతో మరణించారు. కోయంబత్తూరులో జరుగుతున్న ప్రపంచ తమిళ మహాసభల్లో పాల్గొన్న సుదర్శనం శుక్రవారం ఉన్నట్టుండి కూలిపోయారు. దాంతో ఆయన్ని చికిత్స నిమిత్రం ఆస్పత్రికి తరలించారు. అయితే సుదర్శనం చికిత్స ఫలించక మరణించినట్లు వైద్యులు తెలిపారు.
Source: జాతీయ | 25 Jun 2010 | 12:43 am

పాక్‌లో పర్యటించనున్న కేంద్ర హోం మంత్రి చిదంబరం!

కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం పాకిస్థాన్‌లో పర్యటించనున్నారు. దీనికోసం శుక్రవారం కేంద్ర హోం మంత్రి పాకిస్థాన్‌కు బయలుదేరి వెళ్లనున్నారు. ముంబై పేలుళ్ల తర్వాత హోం మంత్రి పి. చిదంబరం పాకిస్థాన్ పర్యటనకు వెళ్లడం ఇదే మొదటి సారి. రెండు రోజుల పర్యటన నిమిత్తం పాకిస్థాన్‌కు వెళ్లే కేంద్ర హోం మంత్రి, ఇస్లామాబాద్‌లో ప్రారంభం కానున్న సార్క్ సభ్య దేశాల అంతర్గత భద్రత శాఖ మంత్రుల సమావేశంలో పాల్గొంటారు.
Source: జాతీయ | 25 Jun 2010 | 12:12 am

ఉగ్రవాదంపై బషీర్‌తో చర్చించిన నిరుపమారావు!

భారత్-పాకిస్థాన్ విదేశాంగ కార్యదర్శుల సమావేశం గురువారం జరిగింది. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల మెరుగు, ఉగ్రవాదమే ప్రధాన ఎజెండాగా జరిగిన ఈ సమావేశంలో భారత్, పాకిస్థాన్ విదేశాంగ కార్యదర్శులు పాల్గొన్నారు. ఇందులో రెండు దేశాలకు సంబంధించిన అన్ని అంశాలకు ప్రస్తావనకు వచ్చాయి.
Source: జాతీయ | 24 Jun 2010 | 11:48 pm

లోకాయుక్త రాజీనామా చేస్తే నేనేమీ చేయను.!?: సీఎం

లోకాయుక్త మద్దతుగా కర్ణాటకలో ఆందోళనలు వెలువెత్తిన నేపథ్యంలో కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప ఈ విషయంపై స్పందించారు. రాజీనామాను వెనక్కు తీసుకోవాలని లోకాయుక్త సంతోష్ హెగ్డేను తాను కోరేది లేదని సీఎం స్పష్టం చేశారు. లోకాయుక్త కోరిన డిమాండ్లను నెరవేర్చామని, ప్రభుత్వం తరపున ఎంతో సహకరించినా, రాజీనామా చేశారని ముఖ్యమంత్రి అన్నారు. కాబట్టి ఇకపై రాజీనామాను ఉపసంహరించుకోమని తాను కోరేది లేదని యడ్యూరప్ప స్పష్టం చేశారు.
Source: జాతీయ | 24 Jun 2010 | 11:45 pm

ఆదిలాబాద్‌లో విరుచుకపడిన మరో ప్రేమోన్మాది!

రాష్ట్రంలో ప్రేమోన్మాదుల దుశ్చర్యలు పెచ్చరిల్లిపోతున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో ప్రేమోన్మాదుల బెడదకు అంతులేకుండా పోతుంది. ఇదే జిల్లాలో గురువారం ఇద్దరు యువతుల గొంతుకోసి ఓ ప్రేమోన్మాది ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మరవక ముందే మరో ప్రేమోన్మాది విరుచుకుపడ్డాడు.
Source: ఏపీ న్యూస్ | 24 Jun 2010 | 11:43 pm

జూలై 2న వస్తున్న సూర్య, అనుష్కల "యముడు"

"గజిని"తో సూపర్ హిట్ కొట్టిన సూర్య ఇప్పుడు యముడుగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. తమిళంలో "సింగం" పేరుతో విడుదలై సన్సేషనల్ హిట్ అయిన చిత్రాన్ని తెలుగులో "యముడు"గా విడుదల చేస్తున్నారు. స్టూడియో గ్రీన్ పతాకంపై హరి దర్శకత్వంలో కె.ఇ.జ్ఞానవేల్ రాజా నిర్మించిన ఈ చిత్రం జూలై 2న తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత, స్టూడియో గ్రీన్ సంస్థ అధినేత రాజా మాట్లాడుతూ... తమిళంలో ఈ చిత్రం దాదాపు 85 కోట్ల రూపాయలకు పైగా కలెక్ట్ చేసి బిగ్గెస్ట్ హిట్‌గా బాక్సాఫీసును షేక్ చేస్తోంది. తమిళంలో ఇంత పెద్ద విజయాన్ని సాధించిన ఈ చిత్రం తెలుగులో కూడా సూపర్ హిట్ అవుతుందన్న నమ్మకం ఉంది.
Source: Yahoo! Telugu: Entertainment | 24 Jun 2010 | 1:29 pm

ప్రభుత్వంపై కొన్ని శక్తులు కుట్ర చేస్తున్నాయి: సీఎం

ఫీజులు, ఉపకార వేతనాలు ప్రభుత్వం ఇవ్వట్లేదని కొందరు కుట్రపూరిత ప్రచారం చేస్తున్నారని ముఖ్యమంత్రి రోశయ్య పేర్కొన్నారు. ఈ కుట్రలు చేసేవారికి వెనుక నుంచి కొంతమంది డీజిలు, పెట్రోలు అందించి మంటను మరింత పెద్దది చేసేందుకు దోహదపడుతున్నారని అన్నారు.
Source: ఏపీ న్యూస్ | 24 Jun 2010 | 8:55 am

పది నెలల తర్వాత సొంతగూటికి చేరుకున్న జశ్వంత్ సింగ్!

భారతీయ జనతా పార్టీ బహిష్కృత నేత జశ్వంత్ సింగ్ తిరిగి ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. పార్లమెంట్ సభ్యుడు, మాజీ విదేశాంగ మంత్రి అయిన జశ్వంత్ సింగ్, గురువారం బీజేపీలో చేరారు. పాకిస్థాన్ ఫాదర్ అని పిలువబడే మొహమ్మద్ అలీ జిన్నాపై పుస్తకం రాసిన జశ్వంత్ సింగ్‌ను గత ఏడాది ఆగస్టు నెలలో భారతీయ జనతా పార్టీ వెలివేసిన సంగతి తెలిసిందే.
Source: జాతీయ | 24 Jun 2010 | 8:01 am

"బన్నీ" హీరోయిన్ గౌరీ ముంజల్ పెద్ద వ్యాపారం..?

అల్లు అర్జున్ బన్నీ చిత్రంలో హీరోయిన్‌గా నటించిన గౌరీ ముంజల్ అంతకుముందు కొన్ని చిత్రాల్లో నటించినా పెద్దగా లాభం లేకపోయింది. ఆ తర్వాత రామానాయుడు చిత్రంలో కూడా నటించింది. ఆమె సెట్లో ఉంటే అంతా ముంజలాంటిదానివని మెచ్చుకొనేవారు. కానీ అవేవీ ఆమె కడుపు నింపలేదు. హిట్ ఉంటేనే అవకాశాలు రావడం ఇండస్ట్రీ నైజం. అలా అని గొప్ప హిట్లు వచ్చినా కొంతమందికి అవకాశాలు రావు. అదంతా అదృష్టంపై ఆధారపడి ఉంటుందని గౌరీ ముంజల్ చెపుతోంది. అయితే తాజాగా ముంజల్‌పై ఇండస్ట్రీలో ఓ వార్త ప్రచారంలో ఉంది. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు కేంద్రాలుగా గౌరి వ్యాపారం చేస్తుందని ఫిలిమ్ నగర్ టాక్. ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు ఏర్పరుచుకుని వారిని తనకు అనుకూలంగా మార్చుకుందని సమాచారం. వేదంలో వేశ్య పాత్ర వేసిన అనుష్కలాగా తను ప్రవర్తిస్తోందని కాస్త మాస్‌గా ఆమె గురించి చర్చించుకుంటున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 24 Jun 2010 | 7:48 am

చల్లని సాయంత్రం..

చల్లని సాయంత్రం.. ఎవరూ లేని ఏకాంతం.. సన్నగా మొదలైన వర్షం.. నీకేమనిపిస్తుంది. సుజాత అడిగాడు భర్త.మేడమీద ఎండబెట్టిన వడియాలు తడిసిపోతాయేమోనని కంగారుగా ఉందండి చెప్పింది భార్య బాధగా.
Source: వినోదం | 24 Jun 2010 | 7:43 am

తలమీదికి ఎక్కదు

"బ్రాందీ గొప్పదా? భార్య గొప్పదా?"అడిగాడు చంటి"బ్రాందీయే గొప్పది" చెప్పాడు"అదేంటి అలా అన్నావు""అవునురా... బ్రాంది తలకు మాత్రమే ఎక్కతుంది. భార్యలా తలమీదకి ఎక్కదు"
Source: వినోదం | 24 Jun 2010 | 7:37 am

తెలంగాణాకు సోనియా అనుకూలం కాదు: అనంత

సోనియా గాంధీ తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలమని ధర్మపురి శ్రీనివాస్ చెప్పడాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకుడు అనంత వెంకట్రామి రెడ్డి వ్యతిరేకించారు. సోనియా గాంధీ తెలంగాణాకు అనుకూలమైతే శ్రీకృష్ణ కమిటీ ఎందుకు ఏర్పాటు చేస్తారని ప్రశ్నించారు..?
Source: ఏపీ న్యూస్ | 24 Jun 2010 | 6:59 am

సింహా.. ఆహా.. ఓహా.. శభాష్.. 50 రోజులు..!!

నందమూరి బాలకృష్ణ నటించిన "సింహా" చిత్రం 50 రోజుల వేడుక హైదరాబాదులోని మారెట్ హోటల్‌లో ఘనంగా జరిగింది. ముఖ్య అతిథి దాసరి నారాయణరావు నటీనటులకు, సాంకేతిక సిబ్బందికి షీల్డులు అందజేశారు.
Source: Yahoo! Telugu: Entertainment | 24 Jun 2010 | 6:50 am

తెలంగాణా ఏర్పాటుపై గ్యారంటీ ఇవ్వగలరా..?|: డీఎస్ ప్రశ్న

తెలంగాణా ఉపఎన్నికల్లో ఓడిపోతామన్న భయం తెలంగాణా రాష్ట్ర సమితి కె. చంద్రశేఖరరావుకు పట్టుకున్నట్లు కన్పిస్తోందని పీసీసీ చీఫ్ డి.శ్రీనివాస్ అన్నారు. ఈ భయంతోనే తనపై లేనిపోని ఆరోపణలకు తెరాస నాయకులు దిగుతున్నారన్నారు.
Source: ఏపీ న్యూస్ | 24 Jun 2010 | 4:14 am

మాజీ కేంద్రమంత్రి దిగ్విజయ్ సింగ్ కన్నుమూత!

పార్లమెంట్ సభ్యుడు, మాజీ కేంద్ర మంత్రి దిగ్విజయ్ సింగ్ కన్నుమూశారు. మెదడు సంబంధిత వ్యాధితో బాధపడిన దిగ్విజయ్ సింగ్ లండన్‌లో గురువారం తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుటుంబీకులు తెలిపారు. 54 సంవత్సరాల దిగ్విజయ్ సింగ్ లండన్‌లోని సెయింట్ థామస్ ఆస్పత్రిలో చికిత్స ఫలించక మరణించినట్లు దిగ్విజయ్ వ్యక్తిగత అధికారి ఎస్.కె. మిశ్రా వెల్లడించారు.
Source: జాతీయ | 24 Jun 2010 | 4:13 am

కాంగ్రెస్ - తెదేపాలు దొంగాట ఆడుతున్నాయి: పీఆర్పీ

తెలంగాణా ఉపఎన్నికల్లో తాము పోటీ చేయబోవడం లేదని ప్రజారాజ్యం పార్టీ ప్రకటించింది. పార్టీ కార్యాలయంలో పీఆర్పీ నాయకుడు కోటగిరి విద్యాధర రావు ఈ ప్రకటన చేస్తూ కాంగ్రెస్ - తెలుగుదేశం పార్టీలు తెలంగాణా ప్రజలతో దొంగాట ఆడుతున్నాయని విమర్శించారు.
Source: ఏపీ న్యూస్ | 24 Jun 2010 | 2:43 am

ప్రేమించలేదని గొంతు కోసిన ప్రేమోన్మాది: ఆపై.. ఆత్మహత్య!

రాష్ట్రంలో ప్రేమోన్మాదుల దుశ్చర్యలు రోజు రోజుకి పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా ఓ యువతి తనను ప్రేమించడం లేదని అనిల్ అనే యువకుడు ఆమె గొంతు కోసి, తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదిలాబాద్‌ జిల్లా మంచిర్యాల మండలం శ్రీరాంపూర్‌కు చెందిన ఓ యువతిని తనను ప్రేమించాల్సిందిగా అనిల్ వేధించాడు.
Source: ఏపీ న్యూస్ | 24 Jun 2010 | 2:32 am