|
20 శాతం కొనుగోలుకు నిర్ణయం: పెరిగిన ఇన్‌ఫ్రా షేర్!సౌదీ అరేబియా కేంద్రంగా పని చేస్తున్న సౌదీ బిన్‌లాడిన్ గ్రూప్ మేటాస్ ఇన్‌ఫ్రా నుంచి 20 శాతం షేర్లను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం దేశ స్టాక్ మార్కెట్‌లోని ఇన్‌ఫ్రా షేర్లపై ప్రభావం చూపింది. ఫలితంగా ఈ కంపెనీ షేర్ల విలువ 20 శాతం మేరకు పెరిగాయి. ఇన్‌ఫ్రా ధర ఈ మేరకు పెరగడం ఒక యేడాదిలో ఇదే తొలిసారి కావడం గమనార్హం.Source: Yahoo! Telugu: News | 21 Jun 2010 | 9:41 am ఒంటరితనాన్ని తట్టుకోలేక పోతున్నా: సమీరబాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న సమీరా రెడ్డి ఒంటరితనాన్ని తట్టుకోలేక పోతున్నానని చెపుతోంది. అందుకనే సాయంత్రం పూట ఆరు గంటల నుంచి తెల్లవారు ఝాము 3 గంటల వరకూ షూటింగ్‌లో పాల్గొనేందుకు ఉత్సాహాన్ని చూపుతున్నట్లు చెప్పుకొచ్చింది.ఇక ఇటీవల కోలీవుడ్‌పై దృష్టి సారించాననీ, అక్కడి నడిగర్ సంఘం అంటే తనకు ఎంతగానో ఇష్టమని అంటోంది. నడిగర్ సంఘంలోని సభ్యులు తనను పిలిచి మరీ అవకాశాలు ఇస్తారని వారిపై పొగడ్తలు కురిపించింది. పెళ్లి గురించి ప్రస్తావన తెచ్చినప్పుడు నవ్వుతూ... తాను ఒంటరిగానే ఉన్నాననీ, అయితే ఈ వంటరితనాన్ని తట్టుకోలేక పోతున్నానని అంటోంది. మనసుకు నచ్చిన పురుషుడు తగిలినపుడు వెంటనే పెళ్లి చేసుకుంటానని సెలవిచ్చింది. మరి సమీర మనసు దోచే మగాడెవరో చూడాల్సిందే...!!Source: Yahoo! Telugu: Entertainment | 21 Jun 2010 | 9:33 am జేడీయూ పొత్తు కొనసాగింపుపై గడ్కారీదే తుది నిర్ణయంబీహార్ అధికార జనతాదళ్ (యు)తో పొత్తు కొనసాగించే విషయంపై పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ గడ్కారీయే తుది నిర్ణయం తీసుకుంటారని ఆపార్టీకి చెందిన పలువుర సీనియర్ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఇదే అంశంపై ఆ పార్టీ అగ్రనేత ఎల్కే.అద్వానీతో బీహార్ రాష్ట్ర భాజపా శాఖ అధ్యక్షుడు సి.పి.ఠాగూర్ సోమవారం ఉదయం సమావేశమయ్యారు.Source: Yahoo! Telugu: News | 21 Jun 2010 | 9:32 am విదేశీ మార్కెట్ల ప్రభావం: భారీ లాభాల్లో సెన్సెక్స్!అంతర్జాతీయ స్టాక్ మార్కెట్ల ప్రభావంతో బాంబే స్టాక్ మార్కెట్ పుంజుకుంది. ట్రేడింగ్ ప్రారంభం నుంచే ఊపందుకున్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచి సెన్సెక్సె మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో 316 పాయింట్లు భారీగా పుంజుకుంది. దీంతో సెన్సెక్స్ సూచి 17,887 పాయింట్ల మార్కును తాకింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచి నిఫ్టీ కూడా 91 పాయింట్లు బలపడి, 5,354 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.Source: Yahoo! Telugu: News | 21 Jun 2010 | 9:07 am కడప జిల్లా మళ్లీ బాంబుల మోత: ఇద్దరి మృతి!కడప జిల్లాలో మళ్లీ బాంబుల సంస్కృతి ఆరంభమైంది. గత ఐదు సంవత్సరాలుగా బాంబు శబ్దం వినిపించకుండా వస్తున్న కడపలో సోమవారం బాంబుల మోత వినిపించింది. తెలుగుదేశం పార్టీ నేత వెంకటరెడ్డిని లక్ష్యంగా చేసుకుని కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఈ దాడికి పాల్పడ్డారు.Source: Yahoo! Telugu: News | 21 Jun 2010 | 9:05 am స్టాక్ మార్కెట్: సెన్సెక్స్ 344 పాయింట్ల భారీ వృద్ధి!దేశీయ వాటాల ట్రేడింగ్ ఊపందుకోవడంతో బాంబే స్టాక్ మార్కెట్ భారీ లాభాలను ఆర్జించింది. సోమవారం ట్రేడింగ్ ప్రారంభం నుంచే ఊపందుకున్న బాంబే స్టాక్ మార్కెట్, మధ్యాహ్నం 12.30 గంటలకు 344 పాయింట్లు భారీగా లాభపడింది. దీంతో సెన్సెక్స్ సూచి 17,914 పాయింట్ల మార్కును తాకింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచి నిఫ్టీ కూడా వంద పాయింట్లు పుంజుకుని 5,363 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.Source: Yahoo! Telugu: News | 21 Jun 2010 | 8:27 am బలగాలు ఉపసంహరించక పోతే దాడులు: అల్ఖైదాఆప్ఘనిస్థాన్తో సహా ఇతర ముస్లిం దేశాల్లో మొహరించిన బలగాలను తక్షణం ఉపసంహరించక పోతే దాడులు చేస్తామని అల్‌ఖైదా అంతర్జాతీయ తీవ్రవాద సంస్థ హెచ్చరించింది. ఈ దాడులు సెప్టెంబరు తొమ్మిది తరహాలో ఉంటాయని అల్‌ఖైదా నేతలు హెచ్చరించారు.Source: Yahoo! Telugu: News | 21 Jun 2010 | 8:04 am తెలంగాణా ఉపఎన్నికలు: బాబుపై టి.నేతలు గరం గరంఆగస్టులో తెలంగాణా ప్రాంతంలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరుగనున్న ఉపఎన్నికలలో అనుసరించాల్సిన వ్యూహంపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కసరత్తు చేస్తున్నారు. అయితే తెలంగాణాలో పోటీ చేయవద్దని గట్టిగా వాదిస్తున్న ఎర్రబెల్లి దయాకర్ రావు, కడియం శ్రీహరి వంటి నాయకులు ఈ సమావేశానికి డుమ్మా కొట్టారు.Source: Yahoo! Telugu: News | 21 Jun 2010 | 7:45 am కోట శ్రీనివాసరావు తనయుడి అంత్యక్రియలు పూర్తి!ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు తనయుడు కోట ఆంజనేయ ప్రసాద్ అంత్యక్రియలు సోమవారం పూర్తయ్యాయి. ఎర్రగడ్డలోని స్మశాన వాటికలో సోమవారం మధ్యాహ్నం కోట ప్రసాద్ మృతదేహానికి అంత్యక్రియలు జరిగాయి. పుత్రశోకంలో మునిగిపోయిన కోట శ్రీనివాసరావు.. కుమారుడు కోటప్రసాద్ చితికి నిప్పంటిస్తూ భోరున విలపించారు. సంప్రదాయంగా జరిగిన కోటప్రసాద్ అంత్యక్రియల్లో సినీ ప్రముఖులు, బంధువులు పాల్గొని, కోట శ్రీనివాసరావును ఓదార్చారు.Source: Yahoo! Telugu: News | 21 Jun 2010 | 7:36 am రిటైల్ వ్యాపారానికి స్థలం కావలెను: రిలయన్స్ముఖేష్ అంబానీ ఆధ్వర్యంలో లాభాలతో ముందుకు దూసుక వెళుతున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ రిటైల్ మార్కెట్ కార్యకలాపాలను మరింత విస్తృతపరచాలని నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా దేశంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఓ ప్రకటన విడుదల చేసింది.Source: Yahoo! Telugu: News | 21 Jun 2010 | 7:20 am కారుణ్య మరణాలపై కఠినంగా వ్యవహరించాలి: సుప్రీం ఆదేశం!కారుణ్య మరణాలపై అత్యున్నత న్యాయస్థానం సీరియస్ అయ్యింది. కుల సంఘాల నుంచి యువ దంపతులను కాపాడటంలో రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాలని అత్యున్నత న్యాయస్థానం సూచించింది. ఇంకా కారుణ్య మరణాలపై రాష్ట్ర ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.Source: Yahoo! Telugu: News | 21 Jun 2010 | 7:12 am ఆర్పీ పట్నాయక్ "బ్రోకర్" సరసన లక్స్ పాపలక్స్ పాప... లక్స్ పాప లంచ్ కొస్తావా..? అని బాలయ్యతో అనిపించుకున్న ఆషాశైనీ సడెన్‌గా తన సెక్సీ ఇమేజ్‌కు కట్ కొట్టి పూర్తి సంప్రదాయ చీరకట్టులో దర్శనమిస్తోంది. మరో విశేషమేమిటంటే... హీరోగాని హీరో ఆర్పీ పట్నాయక్ సరసన నటించడం. తొలుత సెక్సీ పాత్రలతో కుర్రకారు గుండెల్ని గుల్ల చేసిన ఆషాకు అనుకున్నంత స్థాయిలో అవకాశాలు తలుపు తట్టలేదు. అయినప్పటికీ కొన్నాళ్లపాటు సెక్సీ పాత్రలే చేస్తాననీ, గ్లామర్ పాత్రల్లో విరగదీస్తానని తెగ రెచ్చిపోయింది. కానీ ఎంత గింజుకున్నా అవకాశాలు మాత్రం ఆమె తలుపు తట్టలేదు. దీంతో విసిగిపోయిన ఆషా.. చివరికి ఇలా చిన్నచిన్న క్యారెక్టర్ ఆర్టిస్టుల సరసన చేసేందుకు సై అంటోంది. ఆర్పీ పట్నాయక్ హీరోగా "బ్రోకర్" అనే పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఈ ఏడాది అక్టోబరు నెలలో విడుదల చేస్తామని దర్శకనిర్మాతలు అంటున్నారు. చూద్దాం... సంప్రదాయ పాత్రల్లో ఆషా శైనీ ఎంతవరకు సక్సెస్ అవగలదో...!!Source: Yahoo! Telugu: Entertainment | 21 Jun 2010 | 6:02 am జేడీయూ పొత్తు కొనసాగింపుపై గడ్కారీదే తుది నిర్ణయంబీహార్ అధికార జనతాదళ్ (యు)తో పొత్తు కొనసాగించే విషయంపై పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ గడ్కారీయే తుది నిర్ణయం తీసుకుంటారని ఆపార్టీకి చెందిన పలువుర సీనియర్ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఇదే అంశంపై ఆ పార్టీ అగ్రనేత ఎల్కే.అద్వానీతో బీహార్ రాష్ట్ర భాజపా శాఖ అధ్యక్షుడు సి.పి.ఠాగూర్ సోమవారం ఉదయం సమావేశమయ్యారు.Source: జాతీయ | 21 Jun 2010 | 4:02 am కడప జిల్లా మళ్లీ బాంబుల మోత: ఇద్దరి మృతి!కడప జిల్లాలో మళ్లీ బాంబుల సంస్కృతి ఆరంభమైంది. గత ఐదు సంవత్సరాలుగా బాంబు శబ్దం వినిపించకుండా వస్తున్న కడపలో సోమవారం బాంబుల మోత వినిపించింది. తెలుగుదేశం పార్టీ నేత వెంకటరెడ్డిని లక్ష్యంగా చేసుకుని కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఈ దాడికి పాల్పడ్డారు.Source: ఏపీ న్యూస్ | 21 Jun 2010 | 3:35 am తెలంగాణా ఉపఎన్నికలు: బాబుపై టి.నేతలు గరం గరంఆగస్టులో తెలంగాణా ప్రాంతంలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరుగనున్న ఉపఎన్నికలలో అనుసరించాల్సిన వ్యూహంపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కసరత్తు చేస్తున్నారు. అయితే తెలంగాణాలో పోటీ చేయవద్దని గట్టిగా వాదిస్తున్న ఎర్రబెల్లి దయాకర్ రావు, కడియం శ్రీహరి వంటి నాయకులు ఈ సమావేశానికి డుమ్మా కొట్టారు.Source: ఏపీ న్యూస్ | 21 Jun 2010 | 2:23 am కోట శ్రీనివాసరావు తనయుడి అంత్యక్రియలు పూర్తి!ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు తనయుడు కోట ఆంజనేయ ప్రసాద్ అంత్యక్రియలు సోమవారం పూర్తయ్యాయి. ఎర్రగడ్డలోని స్మశాన వాటికలో సోమవారం మధ్యాహ్నం కోట ప్రసాద్ మృతదేహానికి అంత్యక్రియలు జరిగాయి. పుత్రశోకంలో మునిగిపోయిన కోట శ్రీనివాసరావు.. కుమారుడు కోటప్రసాద్ చితికి నిప్పంటిస్తూ భోరున విలపించారు. సంప్రదాయంగా జరిగిన కోటప్రసాద్ అంత్యక్రియల్లో సినీ ప్రముఖులు, బంధువులు పాల్గొని, కోట శ్రీనివాసరావును ఓదార్చారు.Source: ఏపీ న్యూస్ | 21 Jun 2010 | 2:06 am కోట శ్రీనివాసరావును పరామర్శించిన చంద్రబాబు నాయుడు!ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు పుత్రశోకంతో విషాదంలో మునిగిపోయారు. నగర శివారులోని ఔటరింగ్ రింగ్ రోడ్డుపై ఆదివారం జరిగిన ప్రమాదంలో కోట శ్రీనివాసరావు తనయుడు కోట ప్రసాద్ మృతి చెందడంతో పలువురు ప్రముఖులు ఆయనను పరామర్శిస్తున్నారు. విషాదంలో మునిగిపోయిన కోటశ్రీనివాసరావు కుటుంబీకులను సినీ ప్రముఖులతో పాటు, రాజకీయ నాయకులు పరామర్శిస్తున్నారు. ఇందులో భాగంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కోట శ్రీనివాసరావును సోమవారం పరామర్శించారు. పుత్రశోకంతో విలపిస్తున్న కోటను ఓదార్చారు. అలాగే టాలీవుడ్ అగ్ర నటలు బాలకృష్ణ, చిరంజీవి తదితరులు కోట శ్రీనివాసరావును పరామర్శించారు.Source: ఏపీ న్యూస్ | 21 Jun 2010 | 2:01 am కారుణ్య మరణాలపై కఠినంగా వ్యవహరించాలి: సుప్రీం ఆదేశం!కారుణ్య మరణాలపై అత్యున్నత న్యాయస్థానం సీరియస్ అయ్యింది. కుల సంఘాల నుంచి యువ దంపతులను కాపాడటంలో రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాలని అత్యున్నత న్యాయస్థానం సూచించింది. ఇంకా కారుణ్య మరణాలపై రాష్ట్ర ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.Source: జాతీయ | 21 Jun 2010 | 1:43 am తెలంగాణలో ముఖ్యమంత్రి పర్యటన ఆగదు: రాంరెడ్డితెలంగాణలో రాష్ట్ర ముఖ్యమంత్రి రోశయ్య పర్యటన ఎలాంటి పరిస్థితుల్లోనూ ఆగదని మంత్రి రాంరెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రోశయ్య తెలంగాణలో పర్యటించడాన్ని అంగీకరించమని ఓయూఐకాస వ్యాఖ్యానించడం సబబు కాదని రాంరెడ్డి అన్నారు.Source: ఏపీ న్యూస్ | 21 Jun 2010 | 1:23 am సెంటిమెంట్ల ప్రకారం పాలనంటే గ్రామం ఓ రాజ్యం: జేసీతెలంగాణా సెంటిమెంట్ ప్రజల్లో బలంగా ఉంది కనుక రాష్ట్రాన్ని విభజించాలని వాదించడం సమంజసం కాదనీ, అలా విభజించుకుంటూ పోతే గ్రామాన్నో రాజ్యంగా విభజించి రాజుల పాలనలా మార్చాల్సి వస్తుందని మాజీమంతి జేసీ దివాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు.Source: ఏపీ న్యూస్ | 21 Jun 2010 | 1:18 am 26న కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం పాకిస్థాన్ పర్యటన!కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం ఈ నెల 26న పాకిస్థాన్ పర్యటన చేపట్టనున్నారు. 26న పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ చేరుకునే హోం మంత్రి, ఆ దేశ విదేశాంగ మంత్రి రెహ్మాన్ మాలిక్‌తో భేటీ అవుతారని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇందులో తీవ్రవాదంపై ఉక్కుపాదం, ముంబై దాడులకు పాల్పడిన తీవ్రవాదులపై పాక్ ప్రభుత్వం తీసుకున్న చర్యలు వంటి పలు అంశాలపై హోం మంత్రి చర్చిస్తారని తెలిసింది.Source: జాతీయ | 21 Jun 2010 | 12:53 am మత్య్సకారులకు మద్దతు తెలిపిన ప్రరాపా అధినేతఅనకాపల్లిలో నేవీ బేస్ నిర్మాణానికి వ్యతిరేకంగా ఆ ప్రాంత జాలర్లు ఉద్యమం చేపట్టారు. వీరికి నైతిక మద్దతు తెలిపే నిమిత్తం ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి ఆదివారం అనకాపల్లికి చేరుకోనున్నారు. ఈ విషయాన్ని ఆ పార్టీ స్థానిక ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు వెల్లడించారు.Source: ఏపీ న్యూస్ | 20 Jun 2010 | 11:35 pm ఉమాభారతి స్వగృహ ప్రవేశంపై చర్చ సాగలేదు: భాజపామహిళా ఫైర్‌బ్రాండ్, భారతీయ జనశక్తి అధ్యక్షురాలు, మాజీ ముఖ్యమంత్రి ఉమాభారతిని తిరిగి పార్టీలోకి తీసుకునే అంశంపై ఎలాంటి చర్చ సాగలేదని భారతీయ జనతా పార్టీ అధిష్టానం అభిప్రాయపడింది. దీనిపై మధ్యప్రదేశ్‌కు ఆ పార్టీ సీనియర్ నేత ప్రభాత్ ప్రభాత్ మాట్లాడుతూ.. సొంత పార్టీలోకి ఉమాభారతి వచ్చే అంశంపై జాతీయ లేదా రాష్ట్ర స్థాయిలో ఎలాంటి చర్చ సాగలేదన్నారు.Source: జాతీయ | 20 Jun 2010 | 11:18 pm ఆగస్టు నుంచి ప్రరాపాలో క్రీయాశీలక పాత్ర: అరవింద్వచ్చే ఆగస్టు నుంచి ప్రజారాజ్యం పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించనున్నట్టు ఆ పార్టీ నేత, సినీ నిర్మాత అల్లు అరవింద్ అన్నారు. ఆయన ఆదివారం మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల అనంతరం కొన్ని కారణాల వల్ల పార్టీ కార్యక్రమాల్లో చురుక్కా పాల్గొనలేక పోయానన్నారు. అదేసమయంలో తమ పార్టీపై ప్రత్యర్థులు ఇష్టానుసారంగా ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. వీటివల్ల ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్ళే అవకాశముందన్నారు. అందువల్ల తాను మళ్లీ పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించనున్నట్టు అరవింద్ తెలిపారు.Source: ఏపీ న్యూస్ | 20 Jun 2010 | 10:40 pm పోలీసు కాల్పులకు నిరసనగా నేడు కాశ్మీర్ బంద్ఆదివారం జరిగిన పోలీసు కాల్పులకు నిరసనగా జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని వేర్పాటువాదులు సోమవారం కాశ్మీర్ బంద్‌కు పిలుపునిచ్చారు. హురియత్ కాన్ఫరెన్స్ అతివాద, మితవాద వర్గాలకు చెందిన నేతలు సయ్యద్ అలీషా జిలాని, మీర్వాయిజ్ ఉమర్ ఫరూక్‌లు వేర్వేరుగా రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చారు.Source: జాతీయ | 20 Jun 2010 | 10:20 pm ఆండర్సన్‌ను వెనక్కి పిలిపించాలి: మంత్రుల ఉప సంఘం!భోపాల్ గ్యాస్ దుర్ఘటనకు మూల కారకుడిగా భావిస్తున్న యూనియన్ కార్బైడ్ కార్పొరేన్ మాజీ సీఈఓ వారెన్ ఆండర్సన్‌ను అమెరికా నుంచి భారత్‌కు రప్పించాలని భోపాల్ గ్యాస్ దుర్ఘటనపై ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉప సంఘం అభిప్రాయపడింది.Source: జాతీయ | 20 Jun 2010 | 10:12 pm రోశయ్యా.. నీ భరతం పడుతాం: నాగం జనార్ధన్ రెడ్డిరోశయ్యా.. నీ భరతం పడుతామని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే నాగం జనార్ధన్ రెడ్డి హెచ్చరించారు. ఆయన ఆదివారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడుతూ జలయజ్ఞంలో భారీగా నిధుల కుంభకోణం జరుగుతున్నట్టు తాము ఆది నుంచి ఆరోపిస్తున్నామన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలో దీని బయటకు తెస్తున్నారు. ఈ అవినీతి రహస్యాన్ని ముఖ్యమంత్రి రోశయ్య బయటకు చెప్పాలని డిమాండ్ చేశారు.Source: ఏపీ న్యూస్ | 20 Jun 2010 | 6:17 am భాజపాతో పొత్తు కొనసాగుతుంది: శరద్ యాదవ్భారతీయ జనతా పార్టీతో పొత్తు కొనసాగుతుందని జనతాదళ్ యు అధ్యక్షుడు శరద్ యాదవ్ స్పష్టం చేశారు. బీహార్, గుజరాత్ రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య ఏర్పడిన మనస్పర్థలు సర్దుకుంటాయని ఆయన జోస్యం చెప్పారు. అయితే, ఈ ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య ఈ వివాదం చెలరేగడం దురదృష్టకరమన్నారు.Source: జాతీయ | 20 Jun 2010 | 5:24 am బీహార్ సర్కారులో ముసలం: సుశీల్ యాత్ర రద్దుబీహార్ రాష్ట్రంలోని అధికార జనతాదళ్ (యు)-భారతీయ జనతా పార్టీ సంకీర్ణ ప్రభుత్వంలో ముసలం రాజుకుంది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌తో ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోడీ తలపెట్టిన విశ్వాస్ యాత్రను రద్దు అయింది. ఈ విషయాన్ని ఉప ముఖ్యమంత్రి సుశీల్ ఆదివారం ప్రకటించారు.Source: జాతీయ | 20 Jun 2010 | 4:24 am ఆండర్సన్ పరారీపై పీవీపై నిందలు బాధాకరం: వెంకయ్యభోపాల్ గ్యాస్ దుర్ఘటనకు మూలకారకుడిగా భావిస్తున్న యూనియన్ కార్బైడ్ కార్పొరేషన్ మాజీ సీఈఓ వారెన్ ఆండర్సన్ దేశం విదిలి వెళ్లిపోయిన వ్యవహారంలో మాజీ ప్రధాని పీవీ.నరసింహారావుపై నిందలు వేయడం చాలా బాధాకరమని ఎం.వెంకయ్య నాయుడు అన్నారు. ఆయన ఆదివారం విజయవాడలో మాట్లాడుతూ అండర్సన్ ఎపీసోడ్‌లో దివంగత ప్రధాని పీవీ నరసింహారావుపై నిందలు వేయడం తగదని హితవు పలికారు.Source: ఏపీ న్యూస్ | 20 Jun 2010 | 2:52 am
|