|
ఆండర్సన్ పరారీపై పీవీపై నిందలు బాధాకరం: వెంకయ్యభోపాల్ గ్యాస్ దుర్ఘటనకు మూలకారకుడిగా భావిస్తున్న యూనియన్ కార్బైడ్ కార్పొరేషన్ మాజీ సీఈఓ వారెన్ ఆండర్సన్ దేశం విదిలి వెళ్లిపోయిన వ్యవహారంలో మాజీ ప్రధాని పీవీ.నరసింహారావుపై నిందలు వేయడం చాలా బాధాకరమని ఎం.వెంకయ్య నాయుడు అన్నారు. ఆయన ఆదివారం విజయవాడలో మాట్లాడుతూ అండర్సన్ ఎపీసోడ్‌లో దివంగత ప్రధాని పీవీ నరసింహారావుపై నిందలు వేయడం తగదని హితవు పలికారు.Source: Yahoo! Telugu: News | 20 Jun 2010 | 8:22 am భారత్‌లో లష్కర్ తోయిబా లక్ష్యాలు వంద: డేవిడ్ హెడ్లీభారత్లోని వంద ప్రాంతాల్లో దాడులు చేయాలని లష్కర్ తోయిబా తీవ్రవాద సంస్థ లక్ష్యాలుగా పెట్టుకున్నట్టు ఆ సంస్థ తీవ్రవాది డేవిడ్ హెడ్లీ వెల్లడించాడు. ఈ ప్రాంతాల్లో లష్కర్ తీవ్రవాదులు సర్వే కూడా నిర్వహించినట్టు వెల్లడించారు.Source: Yahoo! Telugu: News | 20 Jun 2010 | 7:44 am జ్ఞానేశ్వరి ఎక్స్‌ప్రెస్ ప్రమాదం: మరో వ్యక్తి అరెస్టుజ్ఞానేశ్వరి ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదంలో అత్యంత కీలక నిందితునిగా భావిస్తున్న వ్యక్తిని ఆదివారం జార్ఖండ్ రాష్ట్రంలో పోలీసులు అరెస్టు చేశారు. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో జ్ఞానేశ్వరి ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పిన ప్రమాదంలో 148 మంది దుర్మరణం పాలైన విషయం తెల్సిందే.Source: Yahoo! Telugu: News | 20 Jun 2010 | 7:28 am కెనడాలో భేటీ కానున్న ఒబామా-మన్మోహన్ సింగ్‌లు!కెనడా రాజధాని టొరంటోలో జి-20 దేశాల శిఖరాగ్ర సదస్సు జరుగనుంది. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌లు భేటీ కానున్నారు. ఇటీవల వాషింగ్టన్‌లో భారత్-అమెరికా దేశాల మధ్య వ్యూహాత్మక చర్చలు జరుగగా, ఈ చర్చల్లో ఇరు దేశాల విదేశాంగ మంత్రులు ఎస్.ఎం.కృష్ణ, హిల్లరీ క్లింటన్‌లు పాల్గొన్నారు.Source: Yahoo! Telugu: News | 20 Jun 2010 | 7:10 am యునెస్కో సభకు హాజరుకానున్న పురంధేశ్వరి!యునెస్కో-నైజీరియా సంయుక్త ఆధ్వర్యంలో జరుగనున్న అంతర్జాతీయ సదస్సుకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ సహాయ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి నేతృత్వంలో ఒక ప్రతినిధి బృందం హాజుకానుంది. ఈ మేరకు యునెస్కో శనివారం ఒక ప్రటన విడుదల చేసింది.Source: Yahoo! Telugu: News | 20 Jun 2010 | 6:59 am ప్రపంచంలో మూడో అతిపెద్ద స్టాక్ మార్కెట్ చైనాప్రపంచంలో మూడో అతిపెద్ద స్టాక్ మార్కెట్‌గా చైనా అవతరించింది. ఈ విషయాన్ని చైనా సెక్యూరిటీస్ రెగ్యులేటర్ ఒక ప్రకటనలో వెల్లడించింది. గత మే నెలాఖరు నాటికి షాంఘై, షాంజెన్ మార్కెట్ల విలువ రూ.3.07 ట్రిలియన్ డాలర్లకు చేరినట్టు ఆ సంస్థ పేర్కొంది.Source: Yahoo! Telugu: News | 20 Jun 2010 | 6:33 am దేశాభివృద్ధికి వ్యవసాయమే అత్యంత కీలకం: మాంటెక్దేశ వృద్ధి రేటు రెండంకెలకు చేరాలంటే వ్యవసాయ రంగం ఎంతో కీలకమని, ఈ రంగంలో వృద్ధిపాటలో పయనిస్తేనే రెండంకెల వృద్ధిరేటును చేరుకోవచ్చని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లువాలియా అభిప్రాయపడ్డారు.Source: Yahoo! Telugu: News | 20 Jun 2010 | 6:24 am విదేశీ కరెన్సీ రేట్లువిదేశీ కరెన్సీ రేట్లు ఈ విధంగా ఉన్నాయిఅమెరికా డాలరు కొనుగోలు రేటు (థామస్ కుక్) 43.50 అమ్మకపు రేటు (రూ.లలో) రూ. 48.60.యూరో కరెన్సీ కొనుగోలు రేటు (థామస్ కుక్) 53.70 అమ్మకపు రేటు (రూ.లలో) రూ. 59.90.జపాన్ యెన్ కొనుగోలు రేటు (థామస్ కుక్) 47.55, అమ్మకపు రేటు (రూ.లలో) రూ.47.55 బ్రిటన్ పౌండ్ కొనుగోలు రేటు (థామస్ కుక్) 64.77. అమ్మకపు రేటు రూ.71.80.Source: Yahoo! Telugu: News | 20 Jun 2010 | 5:17 am దేశంలోని ప్రధాన మార్కెట్‌లలో కోడిగుడ్లు ధరలురాష్ట్రంలోని ప్రధాన మార్కెట్‌లలో ఆదివారం కోడిగుడ్ల ధరలు కింది విధంగా ఉన్నాయి. హైదరాబాద్ మార్కెట్‌లో వంద కోడిగుడ్లు ధర రూ.252గా ఉండగా, చిల్లరగా ఒక్క గుడ్డు ధర రూ.2.70గా ఉంది. అలాగే.. వరంగల్ మార్కెట్‌లో రూ.254గాను, విజయవాడలో రూ.249, విశాఖపట్నంలో రూ.265, గోదావరి మార్కెట్‌లో రూ.249, తూర్పుగోదావరిలో రూ.249, చిత్తూరులో 273 రూపాయలుగా ఉంది. ఇకపోతే.. పొరుగు రాష్ట్రమైన తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో వంద కోడిగుడ్లు ధర రూ.280 పలుకగా, కోళ్ళ పరిశ్రమకు ఆయువుపట్టుగా ఉన్న నామక్కల్‌లో 275 రూపాయలుగా పలుకుతోంది.Source: Yahoo! Telugu: News | 20 Jun 2010 | 5:15 am నేటి బులియన్ మార్కెట్ ధరలునేటి బులియన్ మార్కెట్‌లో బంగారు, వెండి ధరలు ఇలా ఉన్నాయి.ముంబై మార్కెట్‌లో 99.9 రకం బంగారం 10 గ్రాములు ధర రూ.18,875. అలాగే 99.5 రకం బంగారం ధర రూ. 18,790 ఉంది. కిలో వెండి ధర 29,895 రూపాయలుగా ఉంది. విజయవాడ మార్కెట్‌లో బంగారం (24 క్యారెట్లు) 18,950 రూపాయలుగా ఉంది. 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 17,500 రూపాయలుగా ఉంది. కిలో వెండి ధర 29,800 రూపాయలుగా ఉంది.చెన్నై మార్కెట్‌లో 24 క్యారెట్లు బంగారం ధర 18,800 రూపాయలుగా ఉంది. అలాగే 22 క్యారెట్ల బంగారం గ్రాము ధర 1,748 రూపాయలుగా ఉంది. కిలో వెండి ధర 30,335 రూపాయలుగా పలుకుతోంది.Source: Yahoo! Telugu: News | 20 Jun 2010 | 5:14 am ఆండర్సన్ పరారీపై పీవీపై నిందలు బాధాకరం: వెంకయ్యభోపాల్ గ్యాస్ దుర్ఘటనకు మూలకారకుడిగా భావిస్తున్న యూనియన్ కార్బైడ్ కార్పొరేషన్ మాజీ సీఈఓ వారెన్ ఆండర్సన్ దేశం విదిలి వెళ్లిపోయిన వ్యవహారంలో మాజీ ప్రధాని పీవీ.నరసింహారావుపై నిందలు వేయడం చాలా బాధాకరమని ఎం.వెంకయ్య నాయుడు అన్నారు. ఆయన ఆదివారం విజయవాడలో మాట్లాడుతూ అండర్సన్ ఎపీసోడ్‌లో దివంగత ప్రధాని పీవీ నరసింహారావుపై నిందలు వేయడం తగదని హితవు పలికారు.Source: ఏపీ న్యూస్ | 20 Jun 2010 | 2:52 am జ్ఞానేశ్వరి ఎక్స్‌ప్రెస్ ప్రమాదం: మరో వ్యక్తి అరెస్టుజ్ఞానేశ్వరి ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదంలో అత్యంత కీలక నిందితునిగా భావిస్తున్న వ్యక్తిని ఆదివారం జార్ఖండ్ రాష్ట్రంలో పోలీసులు అరెస్టు చేశారు. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో జ్ఞానేశ్వరి ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పిన ప్రమాదంలో 148 మంది దుర్మరణం పాలైన విషయం తెల్సిందే.Source: జాతీయ | 20 Jun 2010 | 1:59 am యునెస్కో సభకు హాజరుకానున్న పురంధేశ్వరి!యునెస్కో-నైజీరియా సంయుక్త ఆధ్వర్యంలో జరుగనున్న అంతర్జాతీయ సదస్సుకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ సహాయ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి నేతృత్వంలో ఒక ప్రతినిధి బృందం హాజుకానుంది. ఈ మేరకు యునెస్కో శనివారం ఒక ప్రటన విడుదల చేసింది.Source: జాతీయ | 20 Jun 2010 | 1:30 am భోపాల్ దుర్ఘటన: సుప్రీంను ఆశ్రయించనున్న కేంద్రంభోపాల్ విష వాయువు లీకేజీ కేసులో దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ కేసుకు సంబంధించి నిందితులపై నమోదు చేసిన అభియోగాలను గతంలో సుప్రీంకోర్టు నీరు గార్చింది. ప్రస్తుతం మళ్లీ సుప్రీంకోర్టులోనే క్యూరేటివ్ పిటీషన్ దాఖలు చేయాలనే తలంపులో ఉన్నట్టు తెలుస్తోంది.Source: జాతీయ | 19 Jun 2010 | 11:21 pm ఈజిప్ట్‌లో ఎన్టీఆర్, ఇలియానాల "శక్తి" షూటింగ్!యంగ్‌టైగర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా "కంత్రి" ఫేమ్ మెహర్ రమేష్ దర్శకత్వంలో మెగా ప్రొడ్యూసర్ సి. అశ్వనీదత్ వైజయంతీ మూవీస్ పతాకంపై నిర్మిస్తున్న భారీ ప్రతిష్టాత్మక చిత్రం "శక్తి" షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఈ చిత్రం గురించి నిర్మాత సి. అశ్వనీదత్ మాట్లాడుతూ.. "ఈ నెల 22 నుంచి 30వరకు ఈజిప్ట్‌లో విలన్స్‌కు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాల్ని జాకీష్రాఫ్, సోనూసూద్‌లతో పాటు 25 మంది ఫారిన్ ఆర్టిస్టులతో చిత్రీకరించడం జరుగుతుంది. జూలై 10 నుంచి ఎన్టీఆర్, ఇలియానాలతో పాటు ప్రధాన తారాగణం అంతా పాల్గొనే కొన్ని సన్నివేశాల్ని లడక్, శ్రీనగర్, కాశ్మీర్, హరిద్వార్‌లలో ఆగస్టు 8వ తేదీ వరకు చిత్రీకరిస్తాం. తెలుగు చలనచిత్ర చరిత్రలో అత్యధిక లొకేషన్స్, ఖర్చుతో కూడిన చిత్రంగా "శక్తి" నిర్మాణం జరుగుతోంది" అన్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 19 Jun 2010 | 11:43 am విజయదశమికి వస్తోన్న శ్రీకాంత్, ఛార్మిల "సేవకుడు"శత చిత్ర కథానాయకుడు శ్రీకాంత్ హీరోగా సక్సెస్‌ఫుల్ డైరక్టర్ వి. సముద్ర దర్శకత్వాన, సీనియర్ ఛాయాగ్రహకుడు కమ్ నిర్మాత అయిన ఎం. సుధాకర్ శ్రీ మహాగణపతి ఫిలింస్ పతాకంపైన నిర్మిస్తున్న "సేవకుడు" చిత్రం మే 20 నుంచి 30వరకు జరిగిన షూటింగ్‌తో మూడు షెడ్యూల్స్‌ను పూర్తిచేసుకుంది.అలాగే జూన్ నుంచి జూలై 10వరకు జరిగే షెడ్యూల్‌తో టాకీ పూర్తవుతుంది. ఇంకా జూలై 16 నుంచి నెలాఖరు వరకు, ఆగస్టు నెలలో పాటల చిత్రీకరణతో మొత్తం చిత్రం పూర్తవుతుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విజయదశమికి ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు నిర్మాత యం. సుధాకర్ సన్నాహాలు చేస్తున్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 19 Jun 2010 | 11:37 am అలనాటి మహానటి 'సావిత్రి' మనుమడా..!? మజాకా..!?సినీ ఇండస్ట్రీలో కొత్తగా ప్రవేశించే నటీనటులు నిలదొక్కుకోవడం కష్టం. బ్యాక్‌గ్రౌండ్ ఉండికూడా నిలబడాలంటే చాలా కృషి చేయాలి. ప్రేక్షకుల్ని మెప్పించాలి. గతతరం నటీమణుల వారసులు సినీ రంగంలో అరుదు. అటువంటి అలనాటి నటి సావిత్రి మనుమడు అభినయ్ వడ్డి తనెవరో తెలీయకుండా దాసరి దర్శకత్వంలో "యంగ్ ఇండియా"కు ఎంపికై, నలుగురు హీరోల్లో ఒకరిగా పనిచేశాడు.ఈ సందర్భంగా తన కెరీర్‌గురించి అభినయ్ చెపుతూ.. "దాసరి చాలా మంచివారు. ఆయన్ను దూరంగా చూస్తేనే చాలామంది భయపడతారు. నేను ఆయన్నుంచి చాలా నేర్చుకున్నాను. మా అమ్మమ్మ సావిత్రి నటనను ఆయన మెచ్చుకునేవారు. క్లోజ్‌షాట్‌లో కెమెరా పెట్టి సినిమానే తీయవచ్చునని ప్రశసించారు. సావిత్రి వారసునిగా ఆమె పేరు నిలబెట్టాలని హితవు పలికారు.తమిళంలో జెమినీగణేష్ ద్వారా కూడా చాలా ఆఫర్లు వచ్చాయి. బాలీవుడ్‌లోనూ మా అమ్మ, అక్క రేఖ నుంచి ఆఫర్లు వచ్చాయి. బొంబాయి వచ్చేయ్ నేను చూసుకుంటానంది. కానీ అమ్మమ్మను ఆదరించిన టాలీవుడ్‌లోనే హీరోగా గుర్తింపు పొందాక ఇతర ఫీల్డులకు వెళతాను" అభినయ్ చెప్పారు.Source: Yahoo! Telugu: Entertainment | 19 Jun 2010 | 11:32 am పశ్చిమ మిడ్నాపూర్‌లో గాయపడిన మావో అగ్రనేతమావోయిస్టు అగ్రనేత కిషన్ జీ పశ్చిమ మిడ్నాపూర్ జిల్లాలో పోలీసులు చేపట్టిన కూంబింగ్ ఆపరేషన్‌లో గాయపడినట్టు స్థానిక పోలీసులు వెల్లడించారు. కిషన్‌తో పాటు ఆయన ప్రధాన సహచరుడు, మరో మహిళ కూడా గాయపడ్డారని జిల్లా ఎస్పీ మనోజ్ వర్మా తెలిపారు.Source: జాతీయ | 19 Jun 2010 | 7:11 am బన్నీకి నేను నచ్చడంతోనే.. ఆ ఛాన్సొచ్చింది..!: వైశాలి!ధనవంతుల అమ్మాయిగా "వేదం"లో నటించిన దీక్షసేథ్ అసలు పేరు వైశాలి. ఇంట్లో అంతా అలానే పిలుస్తారు. మిస్ ఇండియా 2009 పోటీల్లో పాల్గొని "మిస్‌ప్రెస్‌ఫేస్ అవార్డు"ను గెలుచుకుంది. తర్వాత సౌత్‌స్కోప్ అవార్డు కార్యక్రమంలో ఆమెను చూసిన దర్శకుడు క్రిష్ వేదంలో పాత్ర గురించి చెప్పారట.కానీ "వేదం"లో ధనవంతుల అమ్మాయిగా నటించే ఛాన్సు బన్నీ ద్వారానే తనకు వచ్చిందని వైశాలి అంటోంది. "సౌత్‌స్కోప్ అవార్డు కార్యక్రమంలో నన్ను చూసిన క్రిష్ వేదంలో పాత్ర గురించి చెప్పారు. ఆ తర్వాత బన్నీకి పరిచయం చేశారు. ఆయనకూ నేను నచ్చడంతోనే.., వేదంలో నటించే ఛాన్సు నాకు వచ్చింది.' అని వైశాలి చెప్పింది. ఇంకా వైశాలి మాట్లాడుతూ.. 'బన్నీ సెట్లో ఉంటే అందరినీ నవ్విస్తూ ఉత్సాహపరుస్తారు. ఆయనతో ఉంటే కొత్త ఉత్సాహం వస్తుంది. అనుష్క చాలా అందంగా ఉంటుంది. వేదంలో సరోజ పాత్రలో లీనమైపోయింది" అని ఈ పంజాబీ భామ కితాబిచ్చింది. ఇంకేముంది..? వైశాలి మాటలను బట్టి చూస్తే.. బన్నీకి నచ్చితేనే హీరోయిన్ సెలక్షన్ జరుగుతుందన్నమాట నిజంచేసినట్లుందని సినీ పండితులు గుసగుసలాడుకుంటున్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 19 Jun 2010 | 6:44 am త్వరలో ప్రేక్షకుల ముందుకు సూర్య, అనుష్కల "యముడు"!"గజిని"గా తెలుగు ప్రేక్షకుల మదిలో నిలిచిపోయిన సూర్య "యముడు"గా వస్తున్నాడు. తమిళంలో 'సింగం' పేరుతో విడుదలై సెన్సేషనల్ హిట్టైన ఈ చిత్రాన్ని తెలుగులో "యముడు"గా అనువదిస్తున్నారు. నిర్మాత మాట్లాడుతూ.. "బాలయ్యబాబు "లక్ష్మీనరసింహా" చిత్రానికి ఒరిజినల్ తమిళ చిత్రం సామికి దర్శకత్వం వహించిన హరి "యముడి"కి దర్శకత్వం వహించారు. అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు సూర్య "యముడు" ప్రేక్షకుల ముందుకు వస్తాడు. యముడు చిత్రానికి బిజినెస్‌పరంగా చాలా పెద్ద క్రేజ్ వచ్చింది. తప్పకుండా సూర్యకు తెలుగులో 'గజిని'ని మించిన ఘన విజయాన్ని 'యముడు' సాధిస్తుంది" అని చెప్పారు. సూర్య, అనుష్క జంట ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుంది. అలాగే విలన్‌గా ప్రకాష్ రాజ్ నటన ఈ చిత్రానికి హైలైట్ అవుతుంది. దేవీశ్రీప్రసాద్ మ్యూజిక్ ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది." అని నిర్మాత అన్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 19 Jun 2010 | 6:26 am ఈజిప్ట్‌లో ఎన్టీఆర్, ఇలియానాల "శక్తి" షూటింగ్!యంగ్‌టైగర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా "కంత్రి" ఫేమ్ మెహర్ రమేష్ దర్శకత్వంలో మెగా ప్రొడ్యూసర్ సి. అశ్వనీదత్ వైజయంతీ మూవీస్ పతాకంపై నిర్మిస్తున్న భారీ ప్రతిష్టాత్మక చిత్రం "శక్తి" షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఈ చిత్రం గురించి నిర్మాత సి. అశ్వనీదత్ మాట్లాడుతూ.. "ఈ నెల 22 నుంచి 30వరకు ఈజిప్ట్‌లో విలన్స్‌కు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాల్ని జాకీష్రాఫ్, సోనూసూద్‌లతో పాటు 25 మంది ఫారిన్ ఆర్టిస్టులతో చిత్రీకరించడం జరుగుతుంది. జూలై 10 నుంచి ఎన్టీఆర్, ఇలియానాలతో పాటు ప్రధాన తారాగణం అంతా పాల్గొనే కొన్ని సన్నివేశాల్ని లడక్, శ్రీనగర్, కాశ్మీర్, హరిద్వార్‌లలో ఆగస్టు 8వ తేదీ వరకు చిత్రీకరిస్తాం. తెలుగు చలనచిత్ర చరిత్రలో అత్యధిక లొకేషన్స్, ఖర్చుతో కూడిన చిత్రంగా "శక్తి" నిర్మాణం జరుగుతోంది" అన్నారు.Source: వినోదం | 19 Jun 2010 | 6:14 am విజయదశమికి వస్తోన్న శ్రీకాంత్, ఛార్మిల "సేవకుడు"శత చిత్ర కథానాయకుడు శ్రీకాంత్ హీరోగా సక్సెస్‌ఫుల్ డైరక్టర్ వి. సముద్ర దర్శకత్వాన, సీనియర్ ఛాయాగ్రహకుడు కమ్ నిర్మాత అయిన ఎం. సుధాకర్ శ్రీ మహాగణపతి ఫిలింస్ పతాకంపైన నిర్మిస్తున్న "సేవకుడు" చిత్రం మే 20 నుంచి 30వరకు జరిగిన షూటింగ్‌తో మూడు షెడ్యూల్స్‌ను పూర్తిచేసుకుంది.అలాగే జూన్ నుంచి జూలై 10వరకు జరిగే షెడ్యూల్‌తో టాకీ పూర్తవుతుంది. ఇంకా జూలై 16 నుంచి నెలాఖరు వరకు, ఆగస్టు నెలలో పాటల చిత్రీకరణతో మొత్తం చిత్రం పూర్తవుతుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విజయదశమికి ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు నిర్మాత యం. సుధాకర్ సన్నాహాలు చేస్తున్నారు.Source: వినోదం | 19 Jun 2010 | 6:08 am అలనాటి మహానటి 'సావిత్రి' మనుమడా..!? మజాకా..!?సినీ ఇండస్ట్రీలో కొత్తగా ప్రవేశించే నటీనటులు నిలదొక్కుకోవడం కష్టం. బ్యాక్‌గ్రౌండ్ ఉండికూడా నిలబడాలంటే చాలా కృషి చేయాలి. ప్రేక్షకుల్ని మెప్పించాలి. గతతరం నటీమణుల వారసులు సినీ రంగంలో అరుదు. అటువంటి అలనాటి నటి సావిత్రి మనుమడు అభినయ్ వడ్డి తనెవరో తెలీయకుండా దాసరి దర్శకత్వంలో "యంగ్ ఇండియా"కు ఎంపికై, నలుగురు హీరోల్లో ఒకరిగా పనిచేశాడు.ఈ సందర్భంగా తన కెరీర్‌గురించి అభినయ్ చెపుతూ.. "దాసరి చాలా మంచివారు. ఆయన్ను దూరంగా చూస్తేనే చాలామంది భయపడతారు. నేను ఆయన్నుంచి చాలా నేర్చుకున్నాను. మా అమ్మమ్మ సావిత్రి నటనను ఆయన మెచ్చుకునేవారు. క్లోజ్‌షాట్‌లో కెమెరా పెట్టి సినిమానే తీయవచ్చునని ప్రశసించారు. సావిత్రి వారసునిగా ఆమె పేరు నిలబెట్టాలని హితవు పలికారు.తమిళంలో జెమినీగణేష్ ద్వారా కూడా చాలా ఆఫర్లు వచ్చాయి. బాలీవుడ్‌లోనూ మా అమ్మ, అక్క రేఖ నుంచి ఆఫర్లు వచ్చాయి. బొంబాయి వచ్చేయ్ నేను చూసుకుంటానంది. కానీ అమ్మమ్మను ఆదరించిన టాలీవుడ్‌లోనే హీరోగా గుర్తింపు పొందాక ఇతర ఫీల్డులకు వెళతాను" అభినయ్ చెప్పారు.Source: వినోదం | 19 Jun 2010 | 6:03 am ఆ నగదుపై తెదేపా నేతలే సమాధానం చెప్పాలి: చిరుఅనంతపురం జిల్లా కదిరిలో పోలీసులకు స్వాధీనం చేసుకున్న ఏడు కోట్ల రూపాయల వ్యవహారంపై తెలుగుదేశం పార్టీ నేతలే సమాధానం చెప్పాలని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి వ్యాఖ్యానించారు. ఆయన హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ కదిరి ఘటన గురించి ప్రస్తావించగా చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు.Source: ఏపీ న్యూస్ | 19 Jun 2010 | 5:37 am రాష్ట్రంలో బలీయమైన శక్తిగా భాజపా: ఎం.వెంకయ్యవచ్చే 2014 సార్వత్రిక ఎన్నికల నాటికి రాష్ట్రంలో బలీయమైన శక్తిగా ఎదగాలని, ఇందుకోసం ప్రతి ఒక్కరూ కంకణబద్ధులై కృషి చేయాలని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత ఎం.వెంకయ్య నాయుడు పిలుపునిచ్చా రు. ఆయన మూడోసారి వరుసగా రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు హైదరాబాద్‌లో ఆ పార్టీ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ఘన సన్మానం జరిగింది. అనంతరం ఆయన మాట్లాడుతూ భోపాల్ దుర్ఘటనలో కీలక నిందితుడైన వారెన్ ఆండర్సన్ దేశం వదిలి వెళ్లిపోయేందుకు దివంగత మాజీ ప్రధాని పీవీ.నరసింహారావు సాయపడ్డారని మీడియాలో వచ్చిన వార్తలను ఆయన తోసిపుచ్చారు.Source: ఏపీ న్యూస్ | 19 Jun 2010 | 4:06 am యువతకు ఆదర్శం రాహుల్ గాంధీ: సీఎం రోశయ్యదేశంలోని యువతకు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, అమేథీ ఎంపీ రాహుల్ గాంధీ ఆదర్శమని ముఖ్యమంత్రి కె.రోశయ్య అభిప్రాయపడ్డారు. కేంద్ర కేబినెట్‌లో చేరాలని స్వయంగా ప్రధాని మన్మోహన్ సింగ్ ఆహ్వానించినా.. సున్నితంగా మంత్రిపదవిని తిరస్కరించిన ఆదర్శ యువనేత రాహుల్ అని ఆయన అన్నారు.Source: ఏపీ న్యూస్ | 19 Jun 2010 | 3:51 am మహారాష్ట్రలో మట్టిపెళ్లలు పడి 10 మంది దుర్మరణంమహారాష్ట్రలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో పది మంది మృతి చెందారు. మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో మట్టిపెళ్లలు విరిగిపడి 10 మంది మరణించారు. రత్నగిరి జిల్లాలోని హర్నే గ్రామంలో భారీ వర్షాల కారణంగా మట్టిపెళ్లలు విరిగిపడ్డాయని పోలీసులు తెలిపారు.Source: జాతీయ | 19 Jun 2010 | 2:43 am మోడీగారూ.. మీ సాయం మాకొద్దు: బీహార్ సీఎం నితీష్గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ కోసీ నది వరద సాయంగా ఇచ్చిన ఐదు కోట్ల రూపాయలను బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ శనివారం వెనక్కి ఇచ్చారు. ఆయన సాయం మాకొద్దంటూ నితీష్ ఘాటుగా విమర్శించారు. 2008లో సంభవించిన కోసి నదీ వరదల సందర్భంగా గుజరాత్ సీఎం మోడీ వరదసాయంగా ఇచ్చిన చెక్కును నితీష్‌కే తిరిగి పంపినట్లు మీడియాలో కథనాలు పేర్కొంటున్నాయి.Source: జాతీయ | 19 Jun 2010 | 2:42 am భాగ్యనగరంలో రెండు స్వైన్ ఫ్లూ కేసుల నమోదు!రాష్ట్రంలో స్వైన్‌ఫ్లూ మహమ్మారి విజృంభిస్తోంది. గత ఏడాది ప్రపంచదేశాలను వణికించిన స్వైన్ ఫ్లూ, మళ్లీ ప్రజలను భయాందోళనలకు గురిచేస్తోంది. ఫలితంగా రాష్ట్ర రాజధాని నగరంలో శనివారం రెండు స్వైన్ ఫ్లూ కేసులు నమోదయ్యాయి. ఎర్రగడ్డ ఛాతి ఆస్పత్రిలో ఒకరికి, గాంధీ ఆస్పత్రిలో మరొకరికి స్వైన్ ఫ్లూ మహమ్మారి సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రస్తుతం వీరికి తగిన చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు.Source: ఏపీ న్యూస్ | 19 Jun 2010 | 2:36 am
|