|
యువతకు ఆదర్శం రాహుల్ గాంధీ: సీఎం రోశయ్యదేశంలోని యువతకు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, అమేథీ ఎంపీ రాహుల్ గాంధీ ఆదర్శమని ముఖ్యమంత్రి కె.రోశయ్య అభిప్రాయపడ్డారు. కేంద్ర కేబినెట్‌లో చేరాలని స్వయంగా ప్రధాని మన్మోహన్ సింగ్ ఆహ్వానించినా.. సున్నితంగా మంత్రిపదవిని తిరస్కరించిన ఆదర్శ యువనేత రాహుల్ అని ఆయన అన్నారు.Source: Yahoo! Telugu: News | 19 Jun 2010 | 9:20 am ఐక్యరాజ్యసమితి ఆంక్షలపై మండిపడుతున్న ఇరాన్ఐక్యరాజ్యసమితి భద్రతామండలి విధించిన ఆంక్షలపై ఇరాన్ మండిపడుతోంది. తమ దేశంపై ఆంక్షలు విధించే నిమిత్తం 1929 తీర్మానాన్ని సవరించాలని లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉండాలని ఐరాసను ఇరాన్ హెచ్చరించడం గమనార్హం. ఈ విషయంపై ఇరాన్ సర్వోన్నత జాతీయ భద్రతా మండలి ఒక ప్రకటనను విడుదల చేసింది.Source: Yahoo! Telugu: News | 19 Jun 2010 | 9:01 am మోడీగారూ.. మీ సాయం మాకొద్దు: బీహార్ సీఎం నితీష్గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ కోసీ నది వరద సాయంగా ఇచ్చిన ఐదు కోట్ల రూపాయలను బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ శనివారం వెనక్కి ఇచ్చారు. ఆయన సాయం మాకొద్దంటూ నితీష్ ఘాటుగా విమర్శించారు. 2008లో సంభవించిన కోసి నదీ వరదల సందర్భంగా గుజరాత్ సీఎం మోడీ వరదసాయంగా ఇచ్చిన చెక్కును నితీష్‌కే తిరిగి పంపినట్లు మీడియాలో కథనాలు పేర్కొంటున్నాయి.Source: Yahoo! Telugu: News | 19 Jun 2010 | 8:12 am భాగ్యనగరంలో రెండు స్వైన్ ఫ్లూ కేసుల నమోదు!రాష్ట్రంలో స్వైన్‌ఫ్లూ మహమ్మారి విజృంభిస్తోంది. గత ఏడాది ప్రపంచదేశాలను వణికించిన స్వైన్ ఫ్లూ, మళ్లీ ప్రజలను భయాందోళనలకు గురిచేస్తోంది. ఫలితంగా రాష్ట్ర రాజధాని నగరంలో శనివారం రెండు స్వైన్ ఫ్లూ కేసులు నమోదయ్యాయి. ఎర్రగడ్డ ఛాతి ఆస్పత్రిలో ఒకరికి, గాంధీ ఆస్పత్రిలో మరొకరికి స్వైన్ ఫ్లూ మహమ్మారి సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రస్తుతం వీరికి తగిన చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు.Source: Yahoo! Telugu: News | 19 Jun 2010 | 7:29 am బన్నీకి నేను నచ్చడంతోనే.. ఆ ఛాన్సొచ్చింది..!: వైశాలి!ధనవంతుల అమ్మాయిగా "వేదం"లో నటించిన దీక్షసేథ్ అసలు పేరు వైశాలి. ఇంట్లో అంతా అలానే పిలుస్తారు. మిస్ ఇండియా 2009 పోటీల్లో పాల్గొని "మిస్‌ప్రెస్‌ఫేస్ అవార్డు"ను గెలుచుకుంది. తర్వాత సౌత్‌స్కోప్ అవార్డు కార్యక్రమంలో ఆమెను చూసిన దర్శకుడు క్రిష్ వేదంలో పాత్ర గురించి చెప్పారట.కానీ "వేదం"లో ధనవంతుల అమ్మాయిగా నటించే ఛాన్సు బన్నీ ద్వారానే తనకు వచ్చిందని వైశాలి అంటోంది. "సౌత్‌స్కోప్ అవార్డు కార్యక్రమంలో నన్ను చూసిన క్రిష్ వేదంలో పాత్ర గురించి చెప్పారు. ఆ తర్వాత బన్నీకి పరిచయం చేశారు. ఆయనకూ నేను నచ్చడంతోనే.., వేదంలో నటించే ఛాన్సు నాకు వచ్చింది.' అని వైశాలి చెప్పింది. ఇంకా వైశాలి మాట్లాడుతూ.. 'బన్నీ సెట్లో ఉంటే అందరినీ నవ్విస్తూ ఉత్సాహపరుస్తారు. ఆయనతో ఉంటే కొత్త ఉత్సాహం వస్తుంది. అనుష్క చాలా అందంగా ఉంటుంది. వేదంలో సరోజ పాత్రలో లీనమైపోయింది" అని ఈ పంజాబీ భామ కితాబిచ్చింది. ఇంకేముంది..? వైశాలి మాటలను బట్టి చూస్తే.. బన్నీకి నచ్చితేనే హీరోయిన్ సెలక్షన్ జరుగుతుందన్నమాట నిజంచేసినట్లుందని సినీ పండితులు గుసగుసలాడుకుంటున్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 19 Jun 2010 | 6:44 am త్వరలో ప్రేక్షకుల ముందుకు సూర్య, అనుష్కల "యముడు"!"గజిని"గా తెలుగు ప్రేక్షకుల మదిలో నిలిచిపోయిన సూర్య "యముడు"గా వస్తున్నాడు. తమిళంలో 'సింగం' పేరుతో విడుదలై సెన్సేషనల్ హిట్టైన ఈ చిత్రాన్ని తెలుగులో "యముడు"గా అనువదిస్తున్నారు. నిర్మాత మాట్లాడుతూ.. "బాలయ్యబాబు "లక్ష్మీనరసింహా" చిత్రానికి ఒరిజినల్ తమిళ చిత్రం సామికి దర్శకత్వం వహించిన హరి "యముడి"కి దర్శకత్వం వహించారు. అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు సూర్య "యముడు" ప్రేక్షకుల ముందుకు వస్తాడు. యముడు చిత్రానికి బిజినెస్‌పరంగా చాలా పెద్ద క్రేజ్ వచ్చింది. తప్పకుండా సూర్యకు తెలుగులో 'గజిని'ని మించిన ఘన విజయాన్ని 'యముడు' సాధిస్తుంది" అని చెప్పారు. సూర్య, అనుష్క జంట ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుంది. అలాగే విలన్‌గా ప్రకాష్ రాజ్ నటన ఈ చిత్రానికి హైలైట్ అవుతుంది. దేవీశ్రీప్రసాద్ మ్యూజిక్ ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది." అని నిర్మాత అన్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 19 Jun 2010 | 6:26 am వర్జీనియా పొగాకు మార్కెట్ కష్టాలు తీర్చుతాం: పిళ్లైరాష్ట్రంలోని వర్జీనియా పొగాకు మార్కెట్‌లో తలెత్తిన సంక్షోభాన్ని నివారిస్తామని కేంద్ర పొగాకు బోర్డు ఎగ్జిక్యూటివ్ బోర్డు డైరెక్టర్ మంజుపిళ్లై హామీ ఇచ్చారు. జంగారెడ్డి గూడెం-2 వేలం కేంద్రంలో ఆక్షన్ సూపరింటెండెంట్ గ్రేడులను మార్చాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ కేంద్రాన్ని ఆమె శుక్రవారం సందర్శించారు.Source: Yahoo! Telugu: News | 19 Jun 2010 | 6:19 am మహారాష్ట్రలో మట్టిపెళ్లలు పడి 10 మంది దుర్మరణంమహారాష్ట్రలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో పది మంది మృతి చెందారు. మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో మట్టిపెళ్లలు విరిగిపడి 10 మంది మరణించారు. రత్నగిరి జిల్లాలోని హర్నే గ్రామంలో భారీ వర్షాల కారణంగా మట్టిపెళ్లలు విరిగిపడ్డాయని పోలీసులు తెలిపారు.Source: Yahoo! Telugu: News | 19 Jun 2010 | 5:53 am మౌనం వీడిన అర్జున్: వారెన్ విడుదల నాకు తెలియదు!ఎట్టకేలకు కాంగ్రెస్ వృద్ధనేత, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అర్జున్ సింగ్ మౌనం వీడారు. భోపాల్ విషవాయువు లీకేజీ వ్యవహారానికి సంబంధించి ఆయనపై వస్తున్న ఆరోపణలను తోసిపుచ్చారు. యూనియన్ కార్బైడ్ కార్పొరేషన్ మాజీ సీఈఓ వారెన్ ఆండర్సన్‌ను దేశం నుంచి తప్పించే చర్యలతో తనకెలాంటి ప్రమేయం లేదని తేల్చి చెప్పారు.Source: Yahoo! Telugu: News | 19 Jun 2010 | 5:44 am కొలంబియా బొగ్గు గనిలో పేలుడు: 70 మంది మృతికొలంబియాలోని ఒక బొగ్గు గనిలో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి 70 మంది మృతిచెందారు. మరికొంతమంది గాయపడ్డారు. వాయువ్య మధ్య కొలంబియాలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కార్మికులు షిప్టు మారుతున్న సమయంలో ఈ పేలుడు జరిగడం వల్ల ప్రాణ నష్టం ఎక్కువగా ఉన్నట్టు సంబంధిత అధికారులు వెల్లడించారు.Source: Yahoo! Telugu: News | 19 Jun 2010 | 5:34 am కొత్త సీఎన్‌జీ వర్షన్‌ను విడుదల చేయనున్న మారుతిదేశంలో కార్ల ఉత్పత్తి అగ్రగామి కంపెనీల్లో ఒకటైన మారుతీ సుజుకి త్వరలోనే సరికొత్త సీఎన్జీ రకం మోడల్‌ను విడుదల చేయనుంది. ఈ కారు ధర ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులో ఉన్న వాగన్ ఆర్ ధర కంటే రూ.75 నుంచి లక్ష రూపాయల వరకు ఎక్కువగా ఉంటుందన్నారు. వచ్చే మూడు నెలల్లో మొత్తం ఐదు మోడళ్ళను విడుదల చేయనున్నట్టు ఆ సంస్థ తాజాగా వెల్లడించింది.Source: Yahoo! Telugu: News | 19 Jun 2010 | 5:25 am శాంభవి వ్యవహారంపై ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందంబాలదేవతగా ప్రచారం చేసుకుంటున్న శాంభవి వ్యవహారంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపేందుకు ప్రత్యేకంగా టాస్క్‌ఫోర్స్ బృందాన్ని ఏర్పాటు చేసినట్టు కర్నూలు జిల్లా కలెక్టర్ ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. శాంభవి కేసులో ఇటీవల రాష్ట్ర మానవహక్కుల కమిషన్ కీలక తీర్పు ఇచ్చిన విషయం తెల్సిందే.Source: Yahoo! Telugu: News | 19 Jun 2010 | 5:15 am యువతకు ఆదర్శం రాహుల్ గాంధీ: సీఎం రోశయ్యదేశంలోని యువతకు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, అమేథీ ఎంపీ రాహుల్ గాంధీ ఆదర్శమని ముఖ్యమంత్రి కె.రోశయ్య అభిప్రాయపడ్డారు. కేంద్ర కేబినెట్‌లో చేరాలని స్వయంగా ప్రధాని మన్మోహన్ సింగ్ ఆహ్వానించినా.. సున్నితంగా మంత్రిపదవిని తిరస్కరించిన ఆదర్శ యువనేత రాహుల్ అని ఆయన అన్నారు.Source: ఏపీ న్యూస్ | 19 Jun 2010 | 3:51 am మహారాష్ట్రలో మట్టిపెళ్లలు పడి 10 మంది దుర్మరణంమహారాష్ట్రలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో పది మంది మృతి చెందారు. మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో మట్టిపెళ్లలు విరిగిపడి 10 మంది మరణించారు. రత్నగిరి జిల్లాలోని హర్నే గ్రామంలో భారీ వర్షాల కారణంగా మట్టిపెళ్లలు విరిగిపడ్డాయని పోలీసులు తెలిపారు.Source: జాతీయ | 19 Jun 2010 | 2:43 am మోడీగారూ.. మీ సాయం మాకొద్దు: బీహార్ సీఎం నితీష్గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ కోసీ నది వరద సాయంగా ఇచ్చిన ఐదు కోట్ల రూపాయలను బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ శనివారం వెనక్కి ఇచ్చారు. ఆయన సాయం మాకొద్దంటూ నితీష్ ఘాటుగా విమర్శించారు. 2008లో సంభవించిన కోసి నదీ వరదల సందర్భంగా గుజరాత్ సీఎం మోడీ వరదసాయంగా ఇచ్చిన చెక్కును నితీష్‌కే తిరిగి పంపినట్లు మీడియాలో కథనాలు పేర్కొంటున్నాయి.Source: జాతీయ | 19 Jun 2010 | 2:42 am భాగ్యనగరంలో రెండు స్వైన్ ఫ్లూ కేసుల నమోదు!రాష్ట్రంలో స్వైన్‌ఫ్లూ మహమ్మారి విజృంభిస్తోంది. గత ఏడాది ప్రపంచదేశాలను వణికించిన స్వైన్ ఫ్లూ, మళ్లీ ప్రజలను భయాందోళనలకు గురిచేస్తోంది. ఫలితంగా రాష్ట్ర రాజధాని నగరంలో శనివారం రెండు స్వైన్ ఫ్లూ కేసులు నమోదయ్యాయి. ఎర్రగడ్డ ఛాతి ఆస్పత్రిలో ఒకరికి, గాంధీ ఆస్పత్రిలో మరొకరికి స్వైన్ ఫ్లూ మహమ్మారి సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రస్తుతం వీరికి తగిన చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు.Source: ఏపీ న్యూస్ | 19 Jun 2010 | 2:36 am మౌనం వీడిన అర్జున్: వారెన్ విడుదల నాకు తెలియదు!ఎట్టకేలకు కాంగ్రెస్ వృద్ధనేత, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అర్జున్ సింగ్ మౌనం వీడారు. భోపాల్ విషవాయువు లీకేజీ వ్యవహారానికి సంబంధించి ఆయనపై వస్తున్న ఆరోపణలను తోసిపుచ్చారు. యూనియన్ కార్బైడ్ కార్పొరేషన్ మాజీ సీఈఓ వారెన్ ఆండర్సన్‌ను దేశం నుంచి తప్పించే చర్యలతో తనకెలాంటి ప్రమేయం లేదని తేల్చి చెప్పారు.Source: జాతీయ | 19 Jun 2010 | 12:14 am శాంభవి వ్యవహారంపై ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందంబాలదేవతగా ప్రచారం చేసుకుంటున్న శాంభవి వ్యవహారంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపేందుకు ప్రత్యేకంగా టాస్క్‌ఫోర్స్ బృందాన్ని ఏర్పాటు చేసినట్టు కర్నూలు జిల్లా కలెక్టర్ ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. శాంభవి కేసులో ఇటీవల రాష్ట్ర మానవహక్కుల కమిషన్ కీలక తీర్పు ఇచ్చిన విషయం తెల్సిందే.Source: ఏపీ న్యూస్ | 18 Jun 2010 | 11:45 pm మత్స్యుకారులకు మద్దతు తెలిపిన ప్రరాపా అధినేతఅనకాపల్లిలో నేవీ బేస్ నిర్మాణానికి వ్యతిరేకంగా ఆ ప్రాంత జాలర్లు ఉద్యమం చేపట్టారు. వీరికి నైతిక మద్దతు తెలిపే నిమిత్తం ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి ఆదివారం అనకాపల్లికి చేరుకోనున్నారు. ఈ విషయాన్ని ఆ పార్టీ స్థానిక ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు వెల్లడించారు.Source: ఏపీ న్యూస్ | 18 Jun 2010 | 11:27 pm జలయజ్ఞం అవినీతి ఆరోపణలపై ఆరా తీస్తున్న సోనియారాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జలయజ్ఞం ప్రాజెక్టుల్లో అవినీతి భారీగా చోటు చేసుకున్నట్టు ఆ పార్టీకి చెందిన నేతలో ఆరోపణలు చేస్తున్నారు. దీనిపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆరా తీస్తున్నారు. జలయజ్ఞంలో చోటు చేసుకున్న అవినీతిపై అంతర్గత దర్యాప్తుకు ఆమె ఆదేశించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.Source: జాతీయ | 18 Jun 2010 | 11:19 pm బీసీలను అణగదొక్కే విధంగా అగ్రవర్ణాల కుట్ర: ధర్మపురిరాష్ట్రంలో బలహీన వర్గాల (బీసీ) ప్రజలను అణగదొక్కేలా అగ్రవర్ణాల నేతలు నడుచుకుంటున్నారని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ ఆరోపించారు. శుక్రవారం రాత్రి బీసీ సంఘాల ప్రతినిధుల సమావేశం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సమావేశానికి డీఎస్ ముఖ్యఅతిధిగా హాజరై సంచలన వ్యాఖ్యలు చేశారు. అక్రవర్ణాలకు చెందిన నేతలు బీసీలపై ఆధిపత్యం, పెత్తనం చెలాయించేందుకు చూస్తున్నారన్నారు. ఇలాంటి వారికి తగిన గుణపాఠం చెప్పాలని డీఎస్ పిలునిచ్చారు.Source: ఏపీ న్యూస్ | 18 Jun 2010 | 11:05 pm ఆర్.ఆర్.బి ప్రవేశ పరీక్ష రద్దుకు రైల్వే శాఖ యోచన!ఈనెల 6, 13వ తేదీల్లో దేశ వ్యాప్తంగా నిర్వహించిన రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ప్రవేశపరీక్షను రద్దు చేసే దిశగా రైల్వే శాఖ ఆలోచన చేస్తోంది. ముంబై ఆర్ఆర్‌బి నిర్వహించిన పరీక్షకు ముందే ప్రశ్నపత్రాలు లీక్ అయిన విషయం తెల్సిందే. ఈ లీకేజీ వ్యవహారంలో ముంబై ఆర్.ఆర్.బి ఛైర్మన్ ఎంఎస్ శర్మ తనయుడు భరద్వాజ్ ప్రమేయం ఉందని సీబీఐ నిర్ధారించింది.Source: జాతీయ | 18 Jun 2010 | 10:54 pm యూపీలో కాంగ్రెస్ యువరాజు జన్మదిన వేడుకలు!కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. రాహుల్ గాంధీ 41వ సంవత్సర పుట్టినరోజు వేడుకలను కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహిస్తున్నాయి. రాహుల్ పుట్టిన రోజు వేడుకలను ఉత్తరప్రదేశ్‌లో జరిపేందుకు కాంగ్రెస్ పార్టీ సన్నాహాలు చేస్తున్నట్లు యూపీసీసీ అధ్యక్షురాలు రీటా బహుగుణ వెల్లడించారు.Source: జాతీయ | 18 Jun 2010 | 10:36 pm చెల్లెల్ని చంపినోడి పెళ్లానెత్తుకుపోయే "విలన్"!రామాయణం బేస్ కథ. రావణాసురుడిలాంటి ఓ వ్యక్తిని పట్టే క్రమంలో అతని చెల్లెల్ని పోలీసు అధికారి మట్టుబెడతాడు. దాంతో కోపోద్రిక్తుడైన "విలన్" ఆ పోలీసు అధికారి భార్యను తనవద్దే ఉంచుకుంటాడు.బిజినెస్ టెక్నిక్‌ను ఉపయోగించి దర్శకుడు మణిరత్నం రామాయణానికి, విలన్‌కు సంబంధంలేదని పలుసార్లు స్టేట్‌మెంట్లు ఇచ్చి, ఇదేదో కొత్త కథనే భ్రమకల్పించాడు. అసలు రామాయణానికి సంబంధమేలేదని చెబుతూ పేరు మాత్రం రావణ్స రావణన్, విలన్ అంటూ మూడు భాషల్లో ఆర్టిస్టుల్ని అటూఇటూ మార్చి తీసి కోట్ల రూపాయల వ్యాపారం చేసుకున్నాడు. "చేయితిరిగిన రచయిత ఒకాయన అంటుంటేవాడు.. రాజు, ఏడుచేపల కథే అయినా దాన్ని చెప్పే విధానం కొత్తగా ఉంటే.. ఎన్ని సినిమాలైనా తీయవచ్చునని". అది తెలిసిన మణిరత్నం చేసిన ప్రయోగమే విలన్. మొదటి భాగం సప్పగా పెద్దగా ఆకట్టుకోలేకపోయినా రెండో భాగంలో కాస్త ఆసక్తి కలుగజేశాడు. పేరు పొందిన నటీనటులు ఉండటం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ.Source: Yahoo! Telugu: Entertainment | 18 Jun 2010 | 11:51 am 338 కేంద్రాల్లో బాలయ్య "సింహా" కలెక్షన్స్ అదుర్స్!"నటసింహా" బాలకృష్ణ కథానాయకుడిగా, నమిత, నయనతార స్నేహాఉల్లాల్ కథానాయికలుగా నటించిన చిత్రం "సింహా". హిట్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో యునైటెడ్ మూవీస్ పతాకంపై యువనిర్మాత పరుచూరి కిరిటీ నిర్మించిన "సింహా" విడుదలైన అన్ని కేంద్రాల్లో రికార్డు కలెక్షన్స్‌తో 50 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా నిర్మాత పరుచూరి కిరీటి మాట్లాడుతూ.. 338 కేద్రాల్లో సరికొత్త రికార్డులు సృష్టిస్తూ అర్థ శతదినోత్సవం జరుపుకుని దిగ్విజయంగా శతదినోత్సవానికి చేరువవడం చాలా ఆనందంగా ఉంది.బాలయ్యబాబు అద్భుతమైన పెర్‌ఫార్మెన్స్, బోయపాటి శ్రీను ఎక్సెలెంట్ టేకింగ్, చక్రి సూపర్ మ్యూజిక్ "సింహా" చిత్ర విజయాన్ని చాలా పెద్ద రేంజ్‌కి తీసుకెళ్లాయి. 78 ఏళ్ళ తెలుగు చలనచిత్ర చరిత్రలో "సింహా"కు సంచలన విజయాన్ని అందించిన ప్రేక్షకులకు, బాలయ్యబాబుకు, అభిమానులకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను" అని అన్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 18 Jun 2010 | 11:08 am సరైన మార్గంలో వెళుతున్న మంత్రుల ఉపసంఘం: పీసీభోపాల్ గ్యాస్ దుర్ఘటన వ్యవహారంపై అన్ని అంశాలను పరిశీలించేందుకు ఏర్పాటు చేసిన మంత్రుల ఉప సంఘం శుక్రవారం తొలిసారి భేటీ అయింది. కేంద్ర హోంమంత్రి చిదంబరం నేతృత్వంలో ఏర్పాటైన ఈ కమిటీలో తొమ్మిది మంది సభ్యులు ఉండగా, ఈ కమిటీ మొదటిసారి సమావేశమై అన్ని కోణాల్లో చర్చించింది.Source: జాతీయ | 18 Jun 2010 | 9:12 am 33 ఏళ్ల వరునితో 41 ఏళ్ల మనీషా కొయిరాలా పెళ్లిబాలీవుడ్ ప్రౌఢసుందరి మనీషా కొయిరాలా ఓ ఇంటిది కాబోతోంది. నిన్నటితో 41 ఏళ్లు నిండిన మనీషా కొయిరాలా సమ్రాట్ దహల్ అనే కుర్రాడిని నేపాల్ లోని ఖాట్మాండులో వివాహమాడబోతోంది. ఆమె వివాహానికి నేపాల్ అధ్యక్షుడు రామ్ బరన్ యాదవ్, ప్రధాని మాధవ్ కుమార్, మావోయిస్ట్ చీఫ్ ప్రచండ, జ్ఞానేంద్రతోపాటు బాలీవుడ్ నటుడు గోవింద కూడా హాజరవుతారని సమాచారం.కాగా తన పెళ్లి నేపాలి సంప్రదాయాలను అనుసరించి చేసుకోబోతున్నట్లు మనీషా వెల్లడించింది. ఇక రిసెప్షన్‌కు సుమారు 3వేల మంది అతిథులను ఆహ్వానించినట్లు తెలిపింది. ఇదిలావుంటే మనీషా కొయిరాలా ఇంతకుముందే ఒకరిని వివాహం చేసుకోవాలనుకుని నిశ్చితార్థం వరకూ వెళ్లిందట. కానీ ఇద్దరి అభిప్రాయాలు వేరు కావడంతో ఆ నిశ్చితార్థం రద్దయిందని సమాచారం. ఏదైతేనేం.. కనీసం ఇప్పటికైనా మనీషా పెళ్లి చేసుకుంటున్నందుకు తాము ఎంతో సంతోషంగా ఉన్నామని ఆమె కుటుంబ సభ్యులు వెల్లడించారు.Source: Yahoo! Telugu: Entertainment | 18 Jun 2010 | 8:00 am జులై 7 నుంచి అసెంబ్లీ : జగన్ యాత్రకు రోశయ్య చెక్!కడప ఎంపీ వైఎస్.జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన ఓదార్పు యాత్రకు ముఖ్యమంత్రి రోశయ్య చెక్ పెట్టేలా వ్యవహరించారు. జులై ఎనిమిదో తేదీ నుంచి శ్రీకాకుళంలో ఓదార్పు యాత్రను చేపట్టేందుకు జగన్ సిద్ధమవుతున్నారు. ఈ యాత్రలో ఎమ్మెల్యేలను పాల్గొనకుండా రోశయ్య కీలక నిర్ణయం తీసుకున్నారు.Source: ఏపీ న్యూస్ | 18 Jun 2010 | 7:27 am కేసీఆర్ వెన్నులో ఉపఎన్నికల భయం: రాయపాటితెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావుకు వెన్నులో ఉప ఎన్నికల ఓటమి భయం పట్టుకుందని గుంటూరు ఎంపి, కాంగ్రెస్ సీనియర్ నేత రాయపాటి సాంబశివరావు అన్నారు. అందువల్లే ఆయన నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారని రాయపాటి ఆరోపించారు.Source: ఏపీ న్యూస్ | 18 Jun 2010 | 7:07 am చెల్లెల్ని చంపినోడి పెళ్లానెత్తుకుపోయే "విలన్"!రామాయణం బేస్ కథ. రావణాసురుడిలాంటి ఓ వ్యక్తిని పట్టే క్రమంలో అతని చెల్లెల్ని పోలీసు అధికారి మట్టుబెడతాడు. దాంతో కోపోద్రిక్తుడైన "విలన్" ఆ పోలీసు అధికారి భార్యను తనవద్దే ఉంచుకుంటాడు.బిజినెస్ టెక్నిక్‌ను ఉపయోగించి దర్శకుడు మణిరత్నం రామాయణానికి, విలన్‌కు సంబంధంలేదని పలుసార్లు...Source: వినోదం | 18 Jun 2010 | 6:48 am ఆర్ఆర్‌బి ప్రశ్నపత్రం లీకేజీ: ఎనిమిది మంది అరెస్టుముంబై రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (ఆర్ఆర్‌బి) ప్రవేశ పరీక్ష ప్రశ్నపత్రం లీకేజీ కేసులో ఎనిమిది మంది ముఠాను సీబీఐ శుక్రవారం అరెస్టు చేసింది. అరెస్టు అయిన వారిలో ముంబై ఆర్.ఆర్.బి. ఛైర్మన్ కుమారుడు భరద్వాజ్ ఒకరు కావడం గమనార్హం. ప్రశ్నపత్రం లీక్ చేసినందుకు వీరి కుటుంబ బ్యాంకు అకౌంట్ ఖాతాల్లోకి 60 లక్షల రూపాయలు జమ అయినట్టు సీబీఐ నిర్ధారించింది.Source: ఏపీ న్యూస్ | 18 Jun 2010 | 6:04 am వచ్చే నెల 7 నుంచి వర్షాకాల అసెంబ్లీ సమావేశాలువర్షాకాల రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు వచ్చే ఏడో తేదీ నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ మేరకు శుక్రవారం ముఖ్యమంత్రి కరుణానిధి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. ఈ విషయాన్ని రాష్ట్ర మంత్రి గీతారెడ్డి మీడియాకు వెల్లడించింది.Source: ఏపీ న్యూస్ | 18 Jun 2010 | 5:22 am వైజాగ్‌లో స్వైన్ ఫ్లూ కేసు నమోదు: ప్రజల ఆందోళన!కోస్తాతీర ప్రాంతమైన విశాఖపట్నంలో ఒక స్వైన్ ఫ్లూ కేసు నమోదైంది. విశాఖ నగరంలోని న్యూ కాలనీకి చెందిన అప్పన్న అనే వ్యక్తికి ఈ వ్యాధి లక్షణాలు ఉన్నట్టు వైద్య పరీక్షల్లో నిర్ధారణ అయింది. దీంతో ఆయనను ప్రత్యేక గదిలో ఉంచి వైద్యం అందిస్తున్నారు. కానీ, రోగి బంధువులు మాత్రం అప్పన్న పరిస్థితి విషమంగా ఉన్నట్టు ఆయన తెలిపారు.Source: ఏపీ న్యూస్ | 18 Jun 2010 | 5:20 am రాజీవ్‌పై ఆరోపణలు అసత్యం: తోసిపుచ్చిన కాంగ్రెస్!భోపాల్ గ్యాస్ లీకేజీ వ్యవహారంలో దివంగత మహానేత రాజీవ్‌గాంధీపై వెలువెత్తిన ఆరోపణలను కాంగ్రెస్ పార్టీ తోసిపుచ్చింది. భోపాల్ గ్యాస్ లీకేజీ నిందితుడు యూనియన్ కార్బైడ్ సంస్థ అధ్యక్షుడు ఆండర్సన్ పారిపోవడానికి, అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వమే కారణమంటూ వస్తున్న ఆరోపణలను కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది.Source: జాతీయ | 18 Jun 2010 | 4:27 am ముగ్గురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసిన నితిన్ గడ్కారీపార్టీ విప్‌ను ధిక్కరించి రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేసిన ముగ్గురు శాసనసభ్యులను భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ గడ్కారీ సస్పెండ్ చేశారు. సస్పెండ్‌కు గురైన వారిలో బీహార్‌కు చెందిన బన్వారీలాల్, ఒరిస్సాకు చెందిన భీమ్‌సేన్ చౌదరీ, జార్ఖండ్‌కు చెందిన రామ్‌చంద్రలు ఉన్నారు.Source: జాతీయ | 18 Jun 2010 | 3:41 am
|