ఉజ్బెకిస్థాన్‌కు తరలి వెళ్లిపోయిన ఉజ్బెక్ వాసులు

కిర్గిజిస్థాన్‌లో చోటు చేసుకున్న జాతి కలహాల కారణంగా ఆ దేశంలోని ఉజ్బెక్ తెగకు చెందిన నాలుగు లక్షల మంది ప్రజలు పక్కనే ఉన్న ఉజ్బెకిస్థాన్‌కు తరలి పోయారు. అలాగే, ఈ కలహాల వల్ల మృత్యువాత పడిన వారి సంఖ్య రెండు వేలకు పైగానే ఉంటుందని ఆ దేశ ఆపద్ధర్మ ప్రధాని రోజా ఒతుంబయోవా ఒక ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వెల్లడించారు.
Source: Yahoo! Telugu: News | 18 Jun 2010 | 9:30 am

ముగ్గురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసిన నితిన్ గడ్కారీ

పార్టీ విప్‌ను ధిక్కరించి రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేసిన ముగ్గురు శాసనసభ్యులను భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ గడ్కారీ సస్పెండ్ చేశారు. సస్పెండ్‌కు గురైన వారిలో బీహార్‌కు చెందిన బన్వారీలాల్, ఒరిస్సాకు చెందిన భీమ్‌సేన్ చౌదరీ, జార్ఖండ్‌కు చెందిన రామ్‌చంద్రలు ఉన్నారు.
Source: Yahoo! Telugu: News | 18 Jun 2010 | 9:11 am

స్వల్పంగా పుంజుకున్న బాంబే స్టాక్ మార్కెట్

శుక్రవారం బాంబే స్టాక్ మార్కెట్ మిశ్రమ ఫలితాలను నమోదు చేసుకుంటోంది. ట్రేడింగ్ ప్రారంభం నుంచి లాభనష్టాలతో ర్యాలీని కొనసాగిస్తున్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచి సెన్సెక్స్, మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో 14 పాయింట్లు స్వల్పంగా లాభపడి, 17,630 పాయింట్ల మార్కును తాకింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచి నిఫ్టీ కూడా కేవలం ఒక్క పాయింట్ బలపడి, 5,276 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.
Source: Yahoo! Telugu: News | 18 Jun 2010 | 8:22 am

33 ఏళ్ల వరునితో 41 ఏళ్ల మనీషా కొయిరాలా పెళ్లి

బాలీవుడ్ ప్రౌఢసుందరి మనీషా కొయిరాలా ఓ ఇంటిది కాబోతోంది. నిన్నటితో 41 ఏళ్లు నిండిన మనీషా కొయిరాలా సమ్రాట్ దహల్ అనే కుర్రాడిని నేపాల్ లోని ఖాట్మాండులో వివాహమాడబోతోంది. ఆమె వివాహానికి నేపాల్ అధ్యక్షుడు రామ్ బరన్ యాదవ్, ప్రధాని మాధవ్ కుమార్, మావోయిస్ట్ చీఫ్ ప్రచండ, జ్ఞానేంద్రతోపాటు బాలీవుడ్ నటుడు గోవింద కూడా హాజరవుతారని సమాచారం.కాగా తన పెళ్లి నేపాలి సంప్రదాయాలను అనుసరించి చేసుకోబోతున్నట్లు మనీషా వెల్లడించింది. ఇక రిసెప్షన్‌కు సుమారు 3వేల మంది అతిథులను ఆహ్వానించినట్లు తెలిపింది. ఇదిలావుంటే మనీషా కొయిరాలా ఇంతకుముందే ఒకరిని వివాహం చేసుకోవాలనుకుని నిశ్చితార్థం వరకూ వెళ్లిందట. కానీ ఇద్దరి అభిప్రాయాలు వేరు కావడంతో ఆ నిశ్చితార్థం రద్దయిందని సమాచారం. ఏదైతేనేం.. కనీసం ఇప్పటికైనా మనీషా పెళ్లి చేసుకుంటున్నందుకు తాము ఎంతో సంతోషంగా ఉన్నామని ఆమె కుటుంబ సభ్యులు వెల్లడించారు.
Source: Yahoo! Telugu: Entertainment | 18 Jun 2010 | 8:00 am

స్వల్ప నష్టాల్లో కూరుకుపోయిన సెన్సెక్స్!

బాంబే స్టాక్ మార్కెట్ శుక్రవారం స్వల్పపాటి ఒడిదుడుకులను ఎదుర్కోంటోంది. ట్రేడింగ్ ప్రారంభంలో లాభాలతో ఊపందుకున్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచి సెన్సెక్స్, మధ్యాహ్నం 12.45 గంటల ప్రాంతంలో నాలుగు పాయింట్లు స్వల్పంగా క్షీణించింది. దీంతో సెన్సెక్స్ సూచి 17,612 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచి నిఫ్టీ కూడా 10 పాయింట్లు స్వల్పంగా పడిపోయి, 5,264 పాయింట్ల వద్ద పయనిస్తోంది.
Source: Yahoo! Telugu: News | 18 Jun 2010 | 7:54 am

స్టాక్ మార్కెట్: స్వల్ప లాభాల్లో సెన్సెక్స్, నిఫ్టీ!

వారాంతమైన శుక్రవారం బాంబే స్టాక్ మార్కెట్ స్వల్ప ఒడిదుడుకులను నమోదు చేసుకుంటోంది. ట్రేడింగ్ ప్రారంభం నుంచే ఊపందుకున్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచి సెన్సెక్స్, ఉదయం 11.30 గంటల ప్రాంతంలో స్వల్ప లాభాలను నమోదు చేసుకుంది. ఫలితంగా సెన్సెక్స్ 30 పాయింట్ల స్వల్ప లాభంతో 17,646 పాయింట్ల మార్కును తాకింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచి నిఫ్టీ కూడా కేవలం ఐదు పాయింట్లు స్వల్పంగా వృద్ధి చెంది, 5,280 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.
Source: Yahoo! Telugu: News | 18 Jun 2010 | 7:29 am

లంక వ్యవహారంపై త్వరలో ఐరాస బృందం నియామకం!

ప్రముఖ ఉగ్రవాద సంస్థ ఎల్టీటీఈపై శ్రీలంక ప్రభుత్వం జరిపిన యుద్ధంలో మానవ హక్కులను ఉల్లఘించినట్లు వెలువెత్తిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపేందుకు ఐక్యరాజ్యసమితి నిపుణుల బృందం త్వరలో ఎంపిక కానుంది. ఎల్టీటీఈపై దాడి పేరిట శ్రీలంక తమిళులపై జరిపిన దాడికి సంబంధించి తగిన చర్యలు తీసుకునేందుకుగాను త్వరలో ఐరాస నిపుణుల బృందాన్ని నియమించనున్నట్లు ఐరాస ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్ ప్రకటించారు.
Source: Yahoo! Telugu: News | 18 Jun 2010 | 7:22 am

కలిసే వెళతాం.. కానీ విడివిడిగా వెల్లడిస్తాం: కాంగ్రెస్

శ్రీకృష్ణ కమిటీ నుంచి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి పిలుపు వచ్చింది. దీంతో పీసీసీ చీఫ్ డి. శ్రీనివాస్ రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో తెలంగాణా - సీమాంధ్రకు చెందిన నాయకులు తమ తమ అభిప్రాయాలను డీఎస్ ముందు వుంచారు.
Source: Yahoo! Telugu: News | 18 Jun 2010 | 7:15 am

భోపాల్ గ్యాస్ లీకేజీ దుర్ఘటనపై ఉపసంఘం భేటీ నేడే!

భోపాల్ గ్యాస్ లీకేజీ దుర్ఘటనపై మంత్రుల ఉప సంఘం శుక్రవారం భేటీ కానుంది. కేంద్ర హోంశాఖామంత్రి పి.చిదంబరం నేతృత్వంలో జరిగే ఈ సమావేశంలో భోపాల్ గ్యాస్ లీకేజీ దుర్ఘటనపై ఇటీవల సీబీఐ కోర్టు తుది తీర్పుకు ప్రజల ఆగ్రహం, ప్రధాన నిందితుడు ఆండర్సన్ పరారీ వంటి అంశాలపై ప్రస్తావన జరిగే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇప్పటికే
Source: Yahoo! Telugu: News | 18 Jun 2010 | 7:04 am

స్టాక్ మార్కెట్: 18వేల మార్కును తాకనున్న సెన్సెక్స్!

శుక్రవారం బాంబే స్టాక్ మార్కెట్ లాభాలను నమోదు చేసుకుంటోంది. అంబానీ సోదరుల మధ్య కుదిరిన ఒప్పందాల ప్రభావంతో బాంబే స్టాక్ మార్కెట్ వృద్ధి బాటన కొనసాగుతోంది. ఫలితంగా శుక్రవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచి 18వేల మార్కును తాకే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.
Source: Yahoo! Telugu: News | 18 Jun 2010 | 6:28 am

"తెలంగాణా" పొన్నాలకు "సీమాంధ్ర" ఆనం మద్దతు

భారీనీటి పారుదల శాఖామంత్రి పొన్నాల లక్ష్మయ్యపై తెలంగాణా సీనియర్ కాంగ్రస్ నాయకులు చేసిన ఆరోపణలను తాను ఖండిస్తున్నట్లు సీమాంధ్ర కాంగ్రెస్ నాయకుడు మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి అన్నారు. ఏదైనా చెప్పదలుచుకుంటే అధిష్ఠానానికి చెప్పవచ్చనీ, ఇలా బహిరంగ వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు.
Source: Yahoo! Telugu: News | 18 Jun 2010 | 6:20 am

కలిసే వెళతాం.. కానీ విడివిడిగా వెల్లడిస్తాం: కాంగ్రెస్

శ్రీకృష్ణ కమిటీ నుంచి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి పిలుపు వచ్చింది. దీంతో పీసీసీ చీఫ్ డి. శ్రీనివాస్ రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో తెలంగాణా - సీమాంధ్రకు చెందిన నాయకులు తమ తమ అభిప్రాయాలను డీఎస్ ముందు వుంచారు.
Source: ఏపీ న్యూస్ | 18 Jun 2010 | 3:42 am

ముగ్గురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసిన నితిన్ గడ్కారీ

పార్టీ విప్‌ను ధిక్కరించి రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేసిన ముగ్గురు శాసనసభ్యులను భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ గడ్కారీ సస్పెండ్ చేశారు. సస్పెండ్‌కు గురైన వారిలో బీహార్‌కు చెందిన బన్వారీలాల్, ఒరిస్సాకు చెందిన భీమ్‌సేన్ చౌదరీ, జార్ఖండ్‌కు చెందిన రామ్‌చంద్రలు ఉన్నారు.
Source: జాతీయ | 18 Jun 2010 | 3:41 am

భోపాల్ గ్యాస్ లీకేజీ దుర్ఘటనపై ఉపసంఘం భేటీ నేడే!

భోపాల్ గ్యాస్ లీకేజీ దుర్ఘటనపై మంత్రుల ఉప సంఘం శుక్రవారం భేటీ కానుంది. కేంద్ర హోంశాఖామంత్రి పి.చిదంబరం నేతృత్వంలో జరిగే ఈ సమావేశంలో భోపాల్ గ్యాస్ లీకేజీ దుర్ఘటనపై ఇటీవల సీబీఐ కోర్టు తుది తీర్పుకు ప్రజల ఆగ్రహం, ప్రధాన నిందితుడు ఆండర్సన్ పరారీ వంటి అంశాలపై ప్రస్తావన జరిగే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇప్పటికే
Source: జాతీయ | 18 Jun 2010 | 1:35 am

"తెలంగాణా" పొన్నాలకు "సీమాంధ్ర" ఆనం మద్దతు

భారీనీటి పారుదల శాఖామంత్రి పొన్నాల లక్ష్మయ్యపై తెలంగాణా సీనియర్ కాంగ్రస్ నాయకులు చేసిన ఆరోపణలను తాను ఖండిస్తున్నట్లు సీమాంధ్ర కాంగ్రెస్ నాయకుడు మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి అన్నారు. ఏదైనా చెప్పదలుచుకుంటే అధిష్ఠానానికి చెప్పవచ్చనీ, ఇలా బహిరంగ వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు.
Source: ఏపీ న్యూస్ | 18 Jun 2010 | 12:51 am

భోపాల్ మృతులకు రూ.10లక్షలు చెల్లించాలి..!: ఎంపీ కాంగ్రెస్

భోపాల్ గ్యాస్ లీకేజీ సంఘటనలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు రూ.పదిలక్షలను కేంద్ర ప్రభుత్వం నష్టపరిహారంగా చెల్లించాలని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు యూపీఏ ఛైర్‌ పర్సన్ సోనియా గాంధీకి మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ఓ లేఖ రాసింది. ఈ లేఖలో 1984వ సంవత్సరం జరిగిన భోపాల్ గ్యాస్ దుర్ఘటనలో మృతిచెందిన కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం చేయూత నివ్వాలని కోరింది.
Source: జాతీయ | 18 Jun 2010 | 12:01 am

కిర్గిజిస్థాన్ అల్లర్లు: సురక్షితంగా ఢిల్లీ చేరిన భారత విద్యార్థులు!

కిర్గిజిస్థాన్‌లో జరుగుతున్న అల్లర్ల నుంచి భారతీయులను రక్షించడంలో కేంద్ర ప్రభుత్వం సఫలమైంది. కిర్గిజిస్థాన్‌లో అల్లర్లు చెలరేగడంతో 149 మంది భారతీయ విద్యార్థులను స్వదేశానికి సురక్షింతంగా రప్పించింది. ఈ క్రమంలో కిర్గిజిస్థాన్‌లో చదువుతున్న భారతీయ విద్యార్థులు ప్రత్యేక విమానం ద్వారా దేశ రాజధాని నగరం ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీకి చేరుకున్న విద్యార్థుల్లో 65 మందికిపైగా తెలుగు విద్యార్థులుండటం గమనార్హం.
Source: జాతీయ | 17 Jun 2010 | 11:50 pm

తెలంగాణా ఉపఎన్నికల ప్రచారంలో "బాబు" ఏం చెపుతారో..?

ఆగస్టు నెలలో తెలంగాణా ప్రాంతంలో 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరుగనున్న ఉపఎన్నికల ప్రచారానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వెళ్లాలని నిశ్చయించుకున్నట్లు సమాచారం. అయితే ఉపఎన్నికల ప్రచారానికి ప్రజల ముందుకు వెళ్లిన ఆయన ప్రజలకు ఎటువంటి హామీ ఇస్తారన్న దానిపై కసరత్తు చేస్తున్నారు
Source: ఏపీ న్యూస్ | 17 Jun 2010 | 10:41 pm

మంగళూరు ప్రమాదం: తాత్కాలిక నష్ట పరిహారం రూ.14కోట్లు!

మంగళూరు విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలను ఆదుకునేందుకు దిశగా తాత్కాలిక పరిహారంగా రూ. 14 కోట్లకు పైగా చెల్లించినట్లు ఎయిర్‌ ఇండియా తెలిపింది. గత నెల 22వ తేదీన మంగళూరులో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో మొత్తం 159 మంది బాధితులకు ఈ నెల 11వ తేదీ నాటికి 16.06 కోట్ల రూపాయలను తాత్కాలిక నష్ట పరిహారంగా చెల్లించినట్లు ఎయిర్ ఇండియా ఓ ప్రకటనలో తెలిపింది.
Source: జాతీయ | 17 Jun 2010 | 9:46 pm

చాందీపూర్‌లో పృథ్వీ-2 క్షిపణి ప్రయోగం విజయవంతం!

పృథ్వీ-2 క్షిపణి ప్రయోగం విజయవంతమైంది. భారత మధ్యశ్రేణి క్షిపణి అయిన పృథ్వీ-2ను ఒడిషాలోని చాందీపూర్ క్షిపణి ప్రయోగ కేంద్రం నుంచి ప్రయోగించారు. ఈ క్షిపణిని శుక్రవారం విజయవంతంగా ప్రయోగించినట్లు అంతరిక్ష శాస్త్రవేత్తలు తెలిపారు. పూర్తిగా దేశీయ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన పృథ్వీ-2 క్షిపణి 350 కి.మీ దూరంలోని లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యం కలిగి వుంటుందని శాస్త్రవేత్తలు తెలియజేశారు.
Source: జాతీయ | 17 Jun 2010 | 9:38 pm

టాప్‌లెస్‌గా నటించేందుకు పోటీపడుతున్న సెలెబ్స్

నాభీ భాగాన్ని ముందుకూ వెనుకకూ ఊపుతూ.. అటూ ఇటూ తిప్పుతూ నాట్యం చేయడం ఓల్డ్ ఫ్యాషన్ అయిపోయింది. ఇప్పుడు టాప్‌లెస్‌గా నటించడం లేటెస్ట్ ట్రెండ్ అని చాటిచెపుతున్నారు బాలీవుడ్ తారలు. వీలుచిక్కినపుడల్లా బికినీలు వేస్తూ వీపు భాగాన్ని పూర్తి నగ్నంగా చూపుతూ టీనేజ్ కుర్రాళ్లను ఆకట్టుకునేందుకు మహా యత్నిస్తున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 17 Jun 2010 | 1:29 pm

స్నేహా... శ్రేయకు తల్లిగా నటిస్తావా...?

ముద్దందాల తార స్నేహ తను అమ్మ పాత్ర పోషించబోతున్నట్లు వచ్చిన వార్తలను తోసిపుచ్చింది. అమ్మ పాత్రల్లో కనిపించేటంత వయసుకు తానింకా చేరుకోలేదని చెపుతోంది. కానీ మలయాళ చిత్రంలో అమ్మలా నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయే అని అడిగితే... అదంతా శుద్ధ అబద్ధమని కొట్టి పారేసింది. అయితే మోహన్‌లాల్ హీరోగా షికార్ అనే చిత్రంలో ప్రేమించి పెళ్లి చేసుకునే అమ్మాయి పాత్రలో నటిస్తున్నానంది. ఆ చిత్రంలో మోహన్ లాల్‌ ఓ అమ్మాయిని దత్తత తీసుకుంటాడు... అది కూడా సినిమాలో నా పాత్ర మరణించిన తర్వాత మాత్రమే. కనుక ఆ అమ్మాయికి అమ్మగా నటించే అవకాశమే లేదని తేల్చి చెపుతోంది. ఇదిలావుంటే ఇటీవల దర్శకుడు కె.ఎస్.రవికుమార్ స్నేహను సంప్రదించి శ్రేయకు అమ్మగా నటించమని అడిగాడట. రవి కుమార్ మాటలకు కట్టలు తెంచుకునే కోపం వచ్చినప్పటికీ దాన్ని అదిమిపట్టి మర్యాదగానే తను తల్లి పాత్రలో నటించనని చెప్పేసిందట.
Source: Yahoo! Telugu: Entertainment | 17 Jun 2010 | 8:27 am

జ్ఞానేశ్వరి ఘోరప్రమాదం: నిందితులను గుర్తించిన సీబీఐ!

జ్ఞానేశ్వరి రైలు దుర్ఘటనకు కారణమైన ముగ్గురు నిందితులను సీబీఐ గుర్తించింది. మావోయిస్టులతో సంబంధమున్న పీసీపీఏకు చెందిన ఉమాకాంత్ మహ్తో (బక్సోల్ గ్రామస్తుడు), మనోజ్ అలియాస్ బాపి మహ్తో (రసువా గ్రామస్తుడు) మరియు అసిత్ మహ్తో (కృష్ణానగర్ గ్రామస్తుడు)లే జ్ఞానేశ్వరి ప్రమాదానికి కారణమని సీబీఐ అనుమానిస్తోంది. వీరి ముఖ చిత్రాలను కూడా సీబీఐ గురువారం విడుదల చేసింది.
Source: జాతీయ | 17 Jun 2010 | 7:53 am

రాజ్యసభకు పాశ్వాన్, ప్రతాప్ రూడీ, విజయ్ మాల్యా

లోక్‌ జనశక్తి పార్టీ చీఫ్ రామ్‌విలాస్ పాశ్వాన్, భాజపా నాయకుడు రాజీవ్ ప్రతాప్ రూడి, కర్నాటక నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన విజయ మాల్యా రాజ్యసభకు ఎన్నికయ్యారు.
Source: జాతీయ | 17 Jun 2010 | 7:18 am

మొయిలీ బెదిరింపులకు బెదిరేవారెవరూ లేరిక్కడ: పాల్వాయి

పోలవరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందని ధ్వజమెత్తిన కాంగ్రెస్ సీనియర్లు తమ రూటు మార్చుకుని డిజైన్ గురించి మాట్లాడటం మొదలుపెట్టారు. కాంగ్రెస్ హైకమాండ్ మొట్టికాయలు వేయడంతో నోటికి తాళం పడిందా... అని విలేకరులు అడిగిన ప్రశ్నకు, తమను మొయిలీ బెదిరించలేదని పాల్వాయి గోవర్థన రెడ్డి అన్నారు. ఒకవేళ పోలవరం విషయంలో మొయిలీనే కాదు ఎవరు బెదిరించినా తాము బెదరబోమని అన్నారు.
Source: ఏపీ న్యూస్ | 17 Jun 2010 | 6:56 am

నా వల్లే నువ్ అంతమవుతావ్... విధి ఎన్నడో నిర్ణయించింది

క్రియేటివ్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో విక్రమ్, ఐశ్వర్యారాయ్ హీరోహీరోయిన్లుగా మద్రాస్ టాకీస్, రిలయన్స్ బిగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రూపొందిన విలన్ చిత్రం జూన్ 18న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రంలో ఐశ్వర్యారాయ్ అద్భుతమైన నటనను ప్రదర్శించిందని మణిరత్నం కితాబిస్తున్నారు. ఇక ఐశ్వర్యారాయ్ సైతం తను ఇప్పటి వరకూ ఇటువంటి పాత్ర చేయలేదనీ, తన కెరీర్‌లో ఇది గుర్తిండిపోతుందని చెపుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన ట్రెయిలర్ మీకోసం....
Source: Yahoo! Telugu: Entertainment | 17 Jun 2010 | 5:48 am

భోపాల్ గ్యాస్ బాధితులకు రూ.10 లక్షలు ఇవ్వాలి: ఎంపీ

భోపాల్ గ్యాస్ లీకేజీ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాల పిల్లలకు రూ.10 లక్షల చొప్పున చెల్లించాలని మధ్యప్రదేశ్‌కు కాంగ్రెస్ ఎంపీలు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన యూపీఏ ఛైర్‌పర్సన్‌కు లేఖ రాశారు. దీనిపై ఆ రాష్ట్ర కాంగ్రెస్ ప్రతినిధి అరిఫ్ మసూద్ మాట్లాడుతూ.. భోపాల్ గ్యాస్ దుర్ఘటనలో మృత్యువాతపడిన ఒక్కో వ్యక్తి కుటుంబానికి చెందిన పిల్లలకు రూ.10 లక్షలు ఇవ్వాలని కోరినట్టు తెలిపారు.
Source: జాతీయ | 17 Jun 2010 | 5:27 am

ఏడుకొండల వాడా.. ఏమిటీ ఈ కుల రాజకీయాలు!

శ్రీవారి ఆలయం కుల రాజకీయాలకు నిలయంగా మారుతోంది. శ్రీవారికి సపర్యలు చేసే అర్చకులకు ఆలయ నిర్వహణ బాధ్యతలను చూసే అధికారులకు ఏమాత్రం పొసగడం లేదు. ఒకరు రెడ్డి రాజకీయాలు నిర్వహిస్తుండగా.. మరొకరు బ్రహ్మణ కుల రాజకీయాలు సాగిస్తూ తమ ప్రత్యేకతను చాటుతున్నారు. ఆలయం పరిపాలనలో చేటు చేసుకున్న తప్పొప్పులను సరిదిద్దుకుని ముందుకు సాగాల్సిన ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. దీంతో శ్రీవారి ఆలయ ప్రతిష్ట మంటగలుస్తోంది.
Source: ఏపీ న్యూస్ | 17 Jun 2010 | 5:03 am

చంద్రబాబుతోనూ భేటీ అవుతాం: జస్టీస్ శ్రీకృష్ణ వెల్లడి

రాష్ట్రంలోని పరిస్థితుల అధ్యయనంలో భాగంగా వివిధ పార్టీల అభిప్రాయాలను సేకరణలో భాగంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతోనూ సమావేశం అవుతామని జస్టీస్ శ్రీకృష్ణ కమిటీ వెల్లడించింది. అలాగే, వచ్చే నెల ఐదు, ఆరు తేదీల్లో కాంగ్రెస్ పార్టీతో భేటీ కానున్నట్టు ఆయన తెలిపారు.
Source: ఏపీ న్యూస్ | 17 Jun 2010 | 4:59 am

జగన్‌ యాత్రకు అనుమతి లేదు: వీరప్ప మొయిలీ

రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా కడప ఎంపీ వైఎస్.జగన్మోహన్ రెడ్డికి మాత్రమే కాకుండా ఎలాంటి యాత్రలకు కూడా అనుమతి ఇచ్చే ప్రసక్తే లేదని కేంద్ర న్యాయశాఖామంత్రి, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ వీరప్ప మొయిలీ తేల్చి చెప్పారు. ఈ విషయంలో పునరాలోచన చేసే ప్రసక్తే లేదని, తేల్చుకోవాల్సింది జగనేనని ఆయన తేల్చి చెప్పారు.
Source: ఏపీ న్యూస్ | 17 Jun 2010 | 3:46 am

స్నేహా... శ్రేయకు తల్లిగా నటిస్తావా...?

ముద్దందాల తార స్నేహ తను అమ్మ పాత్ర పోషించబోతున్నట్లు వచ్చిన వార్తలను తోసిపుచ్చింది. అమ్మ పాత్రల్లో కనిపించేటంత వయసుకు తానింకా చేరుకోలేదని చెపుతోంది. కానీ మలయాళ చిత్రంలో అమ్మలా నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయే అని అడిగితే... అదంతా శుద్ధ అబద్ధమని కొట్టి పారేసింది. అయితే మోహన్‌లాల్ హీరోగా షికార్ అనే చిత్రంలో ప్రేమించి పెళ్లి చేసుకునే...
Source: వినోదం | 17 Jun 2010 | 2:59 am

గ్రీన్‌హంట్ ఆపరేషన్: ఆర్మీ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ?

దేశ అంతర్గత భద్రతకు పెను ముప్పుగా మారిన నక్సలిజాన్ని అణిచి వేసే అంశంపై కేంద్రం మల్లగుల్లాలు పడుతోంది. అయితే, మావోయిస్టుల ఏరివేతకు ఆర్మీని వినియోగించాలన్న ప్రతిపాదనపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కానీ ఆర్మీ మాత్రం కొంతమంది మెరికల్లాంటి సైనికులను ఎంపిక చేసి వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది.
Source: జాతీయ | 17 Jun 2010 | 2:40 am