జగన్‌ యాత్రకు అనుమతి లేదు: వీరప్ప మొయిలీ

రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా కడప ఎంపీ వైఎస్.జగన్మోహన్ రెడ్డికి మాత్రమే కాకుండా ఎలాంటి యాత్రలకు కూడా అనుమతి ఇచ్చే ప్రసక్తే లేదని కేంద్ర న్యాయశాఖామంత్రి, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ వీరప్ప మొయిలీ తేల్చి చెప్పారు. ఈ విషయంలో పునరాలోచన చేసే ప్రసక్తే లేదని, తేల్చుకోవాల్సింది జగనేనని ఆయన తేల్చి చెప్పారు.
Source: Yahoo! Telugu: News | 17 Jun 2010 | 9:15 am

విదేశీ స్టాక్ మార్కెట్ల ప్రభావం: సెన్సెక్స్ వృద్ధి!

అమెరికా, యూరప్ స్టాక్ మార్కెట్లు వృద్ధిని నమోదు చేసుకోవడం ద్వారా బాంబే స్టాక్ మార్కెట్ మళ్లీ పుంజుకుంది. ఆసియా స్టాక్ మార్కెట్ మిశ్రమ ఫలితాలను ఆర్జించినప్పటికీ, యూరప్, అమెరికా స్టాక్ మార్కెట్ల ట్రేడింగ్‌ ప్రభావంతో సెన్సెక్స్, నిఫ్టీలు లాభాలను ఆర్జించాయి. ఫలితంగా గురువారం మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 46 పాయింట్లు బలపడి, 17,509 పాయింట్ల మార్కును తాకింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచి నిఫ్టీ కూడా 30 పాయింట్లు పుంజుకుని, 5,263 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది.
Source: Yahoo! Telugu: News | 17 Jun 2010 | 9:13 am

స్టాక్ మార్కెట్: సెన్సెక్స్ అప్, నిఫ్టీ డౌన్!

బాంబే స్టాక్ మార్కెట్ స్వల్ప ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. ట్రేడింగ్ ప్రారంభం నుంచే లాభనష్టాలతో ర్యాలీని కొనసాగిస్తున్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచి సెన్సెక్స్, మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో 11 పాయింట్లు స్వల్పంగా లాభపడింది. దీంతో సెన్సెక్స్ సూచి 17,473 పాయింట్ల మార్కును తాకింది. కానీ నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచి నిఫ్టీ మాత్రం మూడు పాయింట్లు స్వల్పంగా క్షీణించి, 5,230 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది.
Source: Yahoo! Telugu: News | 17 Jun 2010 | 8:52 am

స్నేహా... శ్రేయకు తల్లిగా నటిస్తావా...?

ముద్దందాల తార స్నేహ తను అమ్మ పాత్ర పోషించబోతున్నట్లు వచ్చిన వార్తలను తోసిపుచ్చింది. అమ్మ పాత్రల్లో కనిపించేటంత వయసుకు తానింకా చేరుకోలేదని చెపుతోంది. కానీ మలయాళ చిత్రంలో అమ్మలా నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయే అని అడిగితే... అదంతా శుద్ధ అబద్ధమని కొట్టి పారేసింది. అయితే మోహన్‌లాల్ హీరోగా షికార్ అనే చిత్రంలో ప్రేమించి పెళ్లి చేసుకునే అమ్మాయి పాత్రలో నటిస్తున్నానంది. ఆ చిత్రంలో మోహన్ లాల్‌ ఓ అమ్మాయిని దత్తత తీసుకుంటాడు... అది కూడా సినిమాలో నా పాత్ర మరణించిన తర్వాత మాత్రమే. కనుక ఆ అమ్మాయికి అమ్మగా నటించే అవకాశమే లేదని తేల్చి చెపుతోంది. ఇదిలావుంటే ఇటీవల దర్శకుడు కె.ఎస్.రవికుమార్ స్నేహను సంప్రదించి శ్రేయకు అమ్మగా నటించమని అడిగాడట. రవి కుమార్ మాటలకు కట్టలు తెంచుకునే కోపం వచ్చినప్పటికీ దాన్ని అదిమిపట్టి మర్యాదగానే తను తల్లి పాత్రలో నటించనని చెప్పేసిందట.
Source: Yahoo! Telugu: Entertainment | 17 Jun 2010 | 8:27 am

బహిరంగ ప్రదేశంలో వ్యక్తిని కాల్చిచంపిన తాలిబన్లు

పాకిస్థాన్‌లోని గిరిజన ప్రాబల్య ప్రాంతమైన ఉత్తర వజీరిస్థాన్‌లో తాలిబన్ల దుశ్చర్యలు అడ్డూ అదుపులేకుండా సాగుతున్నాయి. తాజాగా ఒక వ్యక్తిని బహిరంగ ప్రదేశంలో కాల్చి చంపారు. ఈ తరహా హత్య చేయడం ఈనెలలో రెండోది కావడం గమనార్హం. ఉత్తర వజీరిస్థాన్‌ ప్రాంతానికి చెందిన వహీద్ ఖాన్ (28)పై ఒక గిరిజన వ్యక్తిని హత్య చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి.
Source: Yahoo! Telugu: News | 17 Jun 2010 | 8:23 am

గ్రీన్‌హంట్ ఆపరేషన్: ఆర్మీ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ?

దేశ అంతర్గత భద్రతకు పెను ముప్పుగా మారిన నక్సలిజాన్ని అణిచి వేసే అంశంపై కేంద్రం మల్లగుల్లాలు పడుతోంది. అయితే, మావోయిస్టుల ఏరివేతకు ఆర్మీని వినియోగించాలన్న ప్రతిపాదనపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కానీ ఆర్మీ మాత్రం కొంతమంది మెరికల్లాంటి సైనికులను ఎంపిక చేసి వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది.
Source: Yahoo! Telugu: News | 17 Jun 2010 | 8:09 am

మళ్లీ నష్టాల్లో కూరుకుపోయిన సెన్సెక్స్, నిఫ్టీ!

బాంబే స్టాక్ మార్కెట్ నష్టాల్లో కూరుకుపోయింది. ఆసియా స్టాక్ మార్కెట్ల ట్రేడింగ్ క్షీణించడంతో బాంబే స్టాక్ మార్కెట్ తిరోగమనం బాట పట్టింది. ఫలితంగా గురువారం మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచి సెన్సెక్స్, 45 పాయింట్లు పతనమై, 17,417 పాయింట్ల మార్కును తాకింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచి నిఫ్టీ కూడా కేవలం రెండు పాయింట్ల నష్టంతో 5,230 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.
Source: Yahoo! Telugu: News | 17 Jun 2010 | 7:26 am

బ్యాంకర్లూ... అదనపు కష్టాలు కొని తెచ్చుకోవద్దు: రంగరాజన్

బ్యాంకులు ఉన్న కష్టాలకు తోడుగా అదనపు కష్టాలను కొని తెచ్చుకోవద్దని ప్రధానమంత్రి ఆర్థిక సలహామండలి ఛైర్మన్ సి. రంగరాజన్ సూచించారు.
Source: Yahoo! Telugu: News | 17 Jun 2010 | 7:07 am

అంబానీ సోదరుల మధ్య వచ్చే వారం ఒప్పందం!

దేశ పారిశ్రామికరంగ దిగ్గజాలైన అంబానీ సోదరుల మధ్య వచ్చే వారం కీలక ఒప్పందం కుదిరే అవకాశాలు ఉన్నట్టు ఆ రంగానికి చెందిన నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కృష్ణా గోదావరి (కేజీ) బేసిన్ గ్యాస్ వివాదంపై దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుకు అంబానీ బ్రదర్స్ సానుకూలంగా స్పందించిన విషయం తెల్సిందే. దేశ ప్రయోజనాలకు విఘాతం కలిగించకుండా, దేశ సంపదపై వారిరువురే సయోధ్యకు రావాలని సుప్రీంకోర్టు సూచించింది.
Source: Yahoo! Telugu: News | 17 Jun 2010 | 6:58 am

అల్లర్ల అదుపునకు కృషి చేస్తున్న కిర్గిజిస్థాన్ ఆర్మీ

జాతుల కలహాలతో అట్టుడికి పోతున్న ఓష్ నగరాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు కిర్గిజిస్థాన్ ఆర్మీ శక్తి మేరకు కృషి చేస్తోంది. ఆప్ఘనిస్థాన్‌ హెరాయిన్‌ అక్రమ రవాణాకు, జాతుల కలహాలకు కేంద్ర బిందువుగా ఈ ప్రాంతం మారింది. ఇటీవలి కాలంలో ఇక్కడ ఉజ్బెక్ తెగ ప్రజల సంఖ్య ఎక్కువైంది.
Source: Yahoo! Telugu: News | 17 Jun 2010 | 6:30 am

రాజకీయ నేతలూ.. చదరంగం నేర్చుకోండి: మోడీ పిలుపు

దేశంలోని రాజకీయ నేతలంతా చదరంగం నేర్చుకోవాలని గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. చదరంగం ఆడటం వల్ల మానసికోల్లాసనం కలుగుతుందని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా, ప్రత్యర్థి వేసే ఎత్తుగడలను ముందుగానే పసిగట్టవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
Source: Yahoo! Telugu: News | 17 Jun 2010 | 6:14 am

నా వల్లే నువ్ అంతమవుతావ్... విధి ఎన్నడో నిర్ణయించింది

క్రియేటివ్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో విక్రమ్, ఐశ్వర్యారాయ్ హీరోహీరోయిన్లుగా మద్రాస్ టాకీస్, రిలయన్స్ బిగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రూపొందిన విలన్ చిత్రం జూన్ 18న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రంలో ఐశ్వర్యారాయ్ అద్భుతమైన నటనను ప్రదర్శించిందని మణిరత్నం కితాబిస్తున్నారు. ఇక ఐశ్వర్యారాయ్ సైతం తను ఇప్పటి వరకూ ఇటువంటి పాత్ర చేయలేదనీ, తన కెరీర్‌లో ఇది గుర్తిండిపోతుందని చెపుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన ట్రెయిలర్ మీకోసం....
Source: Yahoo! Telugu: Entertainment | 17 Jun 2010 | 5:48 am

జగన్‌ యాత్రకు అనుమతి లేదు: వీరప్ప మొయిలీ

రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా కడప ఎంపీ వైఎస్.జగన్మోహన్ రెడ్డికి మాత్రమే కాకుండా ఎలాంటి యాత్రలకు కూడా అనుమతి ఇచ్చే ప్రసక్తే లేదని కేంద్ర న్యాయశాఖామంత్రి, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ వీరప్ప మొయిలీ తేల్చి చెప్పారు. ఈ విషయంలో పునరాలోచన చేసే ప్రసక్తే లేదని, తేల్చుకోవాల్సింది జగనేనని ఆయన తేల్చి చెప్పారు.
Source: ఏపీ న్యూస్ | 17 Jun 2010 | 3:46 am

గ్రీన్‌హంట్ ఆపరేషన్: ఆర్మీ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ?

దేశ అంతర్గత భద్రతకు పెను ముప్పుగా మారిన నక్సలిజాన్ని అణిచి వేసే అంశంపై కేంద్రం మల్లగుల్లాలు పడుతోంది. అయితే, మావోయిస్టుల ఏరివేతకు ఆర్మీని వినియోగించాలన్న ప్రతిపాదనపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కానీ ఆర్మీ మాత్రం కొంతమంది మెరికల్లాంటి సైనికులను ఎంపిక చేసి వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది.
Source: జాతీయ | 17 Jun 2010 | 2:40 am

ఉపఎన్నికల "స్టంట్"కింకా టైముందిగా: చిరంజీవి

ఉపఎన్నికలపై కాంగ్రెస్ - తెదేపాలు నిర్ణయం వెలువరించినా ప్రజారాజ్యం పార్టీ మాత్రం వేచి చూసే ధోరణి అవలంభిస్తోంది. ఎన్నికల నోటిఫికేషన్ తర్వాత పోటీ చేయాలా...? వద్దా...? అనే విషయంపై ఒక నిర్ణయానికి వస్తామని పీఆర్పీ అధినేత చిరంజీవి వ్యాఖ్యానించారు.
Source: ఏపీ న్యూస్ | 17 Jun 2010 | 12:46 am

రాజకీయ నేతలూ.. చదరంగం నేర్చుకోండి: మోడీ పిలుపు

దేశంలోని రాజకీయ నేతలంతా చదరంగం నేర్చుకోవాలని గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. చదరంగం ఆడటం వల్ల మానసికోల్లాసనం కలుగుతుందని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా, ప్రత్యర్థి వేసే ఎత్తుగడలను ముందుగానే పసిగట్టవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
Source: జాతీయ | 17 Jun 2010 | 12:45 am

మీ మాట వాళ్లు వినలేదుగా.. నేనెందుకు వినాలి: జగన్

కడప ఎంపీ వైఎస్.జగన్మోహన్ రెడ్డి చేతికి బ్రహ్మాస్త్రం చిక్కింది. ఓదార్పు యాత్రను నిర్వహించాలా వద్దా అనే అంశంపై అతర్మథనం చెందుతున్న జగన్‌కు తెలంగాణ సీనియర్ నేతలు మంచి చేశారు. జలయజ్ఞంలో చోటు చేసుకున్న అవినీతి అక్రమాలపై రాష్ట్ర మంత్రి పొన్నాల లక్ష్మయ్యపై వారు గవర్నర్‌కు ఓ వినతి పత్రం (అనధికారికంగా ఫిర్యాదు) చేశారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ వీరప్ప మొయిలీ గవర్నర్‌ను కలువవద్దని స్వయంగా ఆదేశించినా వారు పెడచెవిన పెట్టారు.
Source: ఏపీ న్యూస్ | 17 Jun 2010 | 12:31 am

అక్రమ నగదు రవాణా: తెదేపా రామకృష్ణయ్య అరెస్టు!

అక్రమ నగదు రవాణా కేసులో చిత్తూరు జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ నేతతో ఆయన అనుచరులను పోలీసులు అరెస్టు చేసినట్టు సమాచారం. చంద్రగిరి నియోజకవర్గం తెదేపా ఇన్‌ఛార్జ్, తెలుగు యువత రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి పేరం హరిబాబు తండ్రి రామకృష్ణయ్య ప్రయాణిస్తున్న కారు నుంచి బుధవారం రాత్రి అనంతపురం జిల్లా కదిరిలో రూ.7.5 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్న విషయం తెల్సిందే.
Source: ఏపీ న్యూస్ | 16 Jun 2010 | 11:42 pm

ధర్మపురిలో ప్రమాదం: 16 మంది పెళ్లిబృందం దుర్మరణం

తమిళనాడు జిల్లా ధర్మపురిలో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో 16 మందితో కూడిన పెళ్లి బృందం మృత్యువాత పడింది. వీరిలో 13 మంది మహిళలు ఉన్నారు. పెళ్లి కుమార్తెతో కలిసి ఒక వ్యానులో 27 మంది బృందం వెళుతోంది. ఈ వ్యాను ధర్మపురి జిల్లా బెల్రామ్‌పట్టి-బొమ్మిడి ప్రాంతాల మధ్య ఎదురుగా వస్తున్న లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో 16 మంది మృత్యువత పడ్డారు. పెళ్లి కుమార్తె కూడా తీవ్రంగా గాయపడగా, ఆమె తల్లిదండ్రులు మాత్రం ప్రాణాపాయం నుంచి తప్పింకుచున్నారు.
Source: జాతీయ | 16 Jun 2010 | 11:09 pm

డీఎస్‌గారూ.. మీరు పోటీ చేయాల్సిందే: ఢిల్లీ పెద్దలు!

ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ ధర్మసంకటాన్ని ఎదుర్కోనున్నారు. తెలంగాణ ప్రాంతంలో జరుగనున్న ఉప ఎన్నికల బరిలోకి దూకాల్సిందేనని ఆయనకు కాంగ్రెస్ హైకమాండ్‌కు చెందిన పెద్దలు తేల్చి చెప్పారు. తెలంగాణ సెంటిమెంట్‌పై జరుగుతున్న ఈ ఎన్నికల్లో పోటీ చేయడం ఏ మేరకు సత్‌ఫలితాన్ని ఇస్తుందోననే భయం ఆయనను వెంటాడుతోంది.
Source: ఏపీ న్యూస్ | 16 Jun 2010 | 10:48 pm

మళ్లీ సొంత గూటికి రానున్న మహిళా ఫైర్‌బ్రాండ్

భారతీయ జనతా పార్టీ బహిష్కృత మహిళా ఫైర్‌బ్రాండ్ ఉమాభారతి తిరిగి సొంత గూటికి చేరుకోనున్నారు. ఇప్పటికే ఆ పార్టీ సీనియర్ నేత బహిష్కృత నేత, మాజీ ఆర్థిక మంత్రి జశ్వంత్ సింగ్ సొంత పార్టీ తీర్థం పుచ్చుకున్న విషయం తెల్సిందే. ఇదేబాటలో ఉమాభారతి కూడా పయనించనున్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే గురువారమే ఆమె భాజపా తీర్థం పుచ్చుకోవచ్చని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి.
Source: జాతీయ | 16 Jun 2010 | 10:36 pm

భోపాల్ కేసుకు-అణు బిల్లుకు సంబంధం: ప్రకాష్ కారత్

భోపాల్ గ్యాస్ దుర్ఘటనకు అణు పరిహార బిల్లుకు సంబంధం ఉందని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్ ఆరోపించారు. అందువల్ల అణు పరిహార బిల్లును తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు ఆయన ప్రకటించారు.
Source: జాతీయ | 16 Jun 2010 | 9:45 pm

చిరంజీవిగారు నన్ను గుర్తు పట్టలేదు: అనుష్క

పంచాక్షరి చిత్రంతో తెలుగు ప్రేక్షకులను మరోసారి పలుకరించిన అనుష్క ఈ చిత్రాన్ని మూడు రోజుల అనంతరం ఐమాక్స్ థియేటర్‌లో తన సినిమా పంచాక్షరిని చూసుకున్నదట. ఈ చిత్రంపై తన ఫీలింగ్స్‌ను వెబ్‌దునియా తెలుగుతో పంచుకున్నది. ఆ విశేషాలు మీకోసం...పంచాక్షరి ఎలా ఉంది...?నేను ప్రతి సినిమాను మెయిన్ థియేటర్లో మొదటి రోజే చూస్తాను. కానీ ఈ సినిమాను షూటింగ్ బిజీతో మూడు రోజుల తర్వాత చూశాను. బి, సి సెంటర్లలో టాక్ బాగానే ఉంది.పంచాక్షరిలో రెండు పాత్రలు పోషించారు. వాటిలో మీకు నచ్చిన పాత్ర ఏది..?పల్లెటూరి పిల్ల పాత్ర నాకు బాగా నచ్చింది. రెండు జడలు వేసుకుని లంగా - ఓణిలో నటించడం చాలా నచ్చింది. ఈ పాత్రలో ఎలా నటించాలన్నదానిపై దర్శకుడు నాకు చాలా సూచనలు చేశారు.
Source: Yahoo! Telugu: Entertainment | 16 Jun 2010 | 11:30 am

డిసెంబరు 31 తర్వాత "ఆంధ్ర"లో "తెలంగాణా" యుద్ధం

తెలంగాణా ఐకాస గొడుగు కిందకు చేరి ఆ తర్వాత క్రమంగా బయటకు జారుకున్న ఊసరవెల్లులు కొన్ని తెలంగాణా ప్రజలకు ద్రోహం చేసేందుకు తమ రంగులు మార్చుకుని వస్తున్నాయని తెరాస చీఫ్ కేసీఆర్ ధ్వజమెత్తారు.
Source: ఏపీ న్యూస్ | 16 Jun 2010 | 9:19 am

అండర్సన్ దొరికితే భోపాల్ జనం చంపివేసేవారే: కాంగ్రెస్

భోపాల్ విషవాయువు ఘోర కలి వ్యవహారంపై విపక్షాల ఎదురుదాడిని నిలువరించేందుకు కొత్తగా ఓ అంతర్జాతీస్థాయి పత్రం వెలికి వచ్చింది.
Source: జాతీయ | 16 Jun 2010 | 8:32 am

ప్రపంచంలోనే అత్యంత సెక్సీ ఫిగర్ - దీపికా పదుకొనే

దీపికా పదుకునే పేరు చెబితే టీనేజ్ కుర్రకారు గుండెల్లో అలజడి ఉవ్వెత్తున ఎగిసిపడుతుంది. ఆ సుందరి నటించిన సినిమా వస్తే ఒకటి పదిసార్లు చూసే యువకులున్నారంటే ఆమెకున్న ఆకర్షణ ఎంతటిదో అర్థం చేసుకోవచ్చు. ఇటీవల ప్రపంచవ్యాప్తంగా అత్యంత సెక్సీగా ఉన్న సుందరాంగి ఎవరా అని సుప్రసిద్ధ పత్రిక "ఫర్ హిమ్" ఓ సర్వే చేపట్టింది. ఈ సర్వేలో తేలిందేటయా అంటే... ప్రపంచంలో సూపర్ సెక్సీ ఫిగర్ దీపికా పదుకొనేదనే సంగతి. యాంజెలీనా జోలీ, బ్రిట్ని స్పియర్స్.. ఇలా ఎందరెందరో హాలీవుడ్ నటీమణులున్నప్పటికీ దీపికా పదుకొనే అంటే తాము పడి ఛస్తామని సర్వేలో పాల్గొన్న యువకులు ఘంటాపథంగా చెప్పారట. దీపికా పదుకునే అందాల్ని చూసి భారతీయ యువతే గుల్లవుతుందనుకుంటుంటే కొత్తగా ఈ జాబితాలోకి ప్రపంచంలోని యూత్ కూడా చేరుతోందన్నమాట.
Source: Yahoo! Telugu: Entertainment | 16 Jun 2010 | 8:30 am

మహారాష్ట్రలో భారీ వర్షాలు: థానేలో 8 మంది మృతి!

భారీ వర్షాలతో మహారాష్ట్ర అతలాకుతలమైంది. ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షంతో రోడ్లంతా జలమయ్యాయి. దీంతో రైళ్ల, వాహన రాకపోకలతో పాటు విమాన సేవలకు కూడా అంతరాయం కలిగింది. మహారాష్ట్రలోని థానే నగరంలో భారీ వర్షానికి గోడకూలి 8 మంది మరణించారు. వర్షపు నీటితో తడిసిన గోడ కూలిపోవడంతో ఆ ప్రాంత నివాసితులు 8 మంది ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు.
Source: జాతీయ | 16 Jun 2010 | 8:26 am

రాష్ట్ర విభజన వల్ల అద్భుతాలేవీ జరుగవు: జయప్రకాష్

రాష్ట్రాన్ని రెండుగా విభజించడం వల్ల అద్భుతాలేమీ జరుగవని లోక్ సత్తా పార్టీ అధినేత జయప్రకాష్ నారాయణ అన్నారు. బుధవారం శ్రీకృష్ణ కమిటీ ముందు తమ పార్టీ వాదనలను వినిపించారు.
Source: ఏపీ న్యూస్ | 16 Jun 2010 | 7:10 am

రాజేంద్రప్రసాద్ సరసన నటిస్తున్న సుహాసిని!

సుప్రసిద్ధ నటుడు డాక్టర్. రాజేంద్రప్రసాద్, సుహాసిని నాయికా నాయికలుగా ఉషాచరణ్ క్రియేషన్స్ కొత్త చిత్రం రూపొందించనుంది. ఉషాచరణ్ క్రియేషన్స్ పతాకంపై రాజేంద్రప్రసాద్-సుహాసిని జోడీగా నటించబోయే ప్రథమ చిత్రాన్ని జొన్నాడ రమణ మూర్తి నిర్మిస్తున్నారు.తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సినీ రంగాల్లో దాదాపు 32 చిత్రాలకు పైగా దర్శకత్వం, వందకు పైగా చిత్రాలకు ఛాయాగ్రహణ దర్శకత్వం నెరపిన "దినేష్‌బాబు" ఈ చిత్రానికి డైరక్షన్ వహిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా షూటింగ్ హైదరాబాదులో ప్రారంభమైంది. ప్రస్తుతం సన్నివేశాల చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం గురించి దర్శకుడు దినేష్‌బాబు మాట్లాడుతూ.. వినోదభరితంగా రూపుదిద్దుకునే ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందన్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 16 Jun 2010 | 6:28 am

వాళ్లు కిరాతకులు... పోటీ చేసి తీరుతారు: కేసీఆర్

తెలంగాణా లక్ష్య సాధనకు మీకంటే మేము ముందున్నామని ప్రగల్భాలు పలికిన పార్టీలు నేడు సిగ్గుమాలిన, నీతిమాలిన పనులకు పూనుకుంటున్నాయని తెరాస అధినేత కేసీఆర్ ధ్వజమెత్తారు.
Source: ఏపీ న్యూస్ | 16 Jun 2010 | 5:11 am

మళ్లీ బీజేపీ తీర్థం పుచ్చుకోనున్న జశ్వంత్ సింగ్!?

బీజేపీ బహిష్కృత సీనియర్ నేత జశ్వంత్ సింగ్ మళ్లీ భారతీయ జనతా పార్టీలో చేరనున్నారని తెలిసింది. పాకిస్థాన్ వ్యస్థాపకుడు మొహమ్మద్ అలీ జిన్నాను ప్రశంసిస్తూ పుస్తకం రాసిన కారణంగా భాజపా నుంచి వెలివేయబడిన జశ్వంత్ సింగ్ తిరిగి ఆ పార్టీలో త్వరలో చేరనున్నారని సమాచారం.
Source: జాతీయ | 16 Jun 2010 | 3:30 am

మావో సమస్యకు కేంద్ర ప్రభుత్వామే కారణం: మాయావతి

మావోయిస్టుల సమస్యకు కేంద్ర ప్రభుత్వాల పరిపాలన తీరే ప్రధాన కారణమని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మాయావతి ఆరోపించారు. వరుసగా అధికారంలోకి వచ్చిన కేంద్ర ప్రభుత్వాలు చేపట్టిన సామాజిక ఆర్థిక విధానాలే ప్రజలను మావోయిస్టులుగా మార్చాయని మాయవతి ధ్వజమెత్తారు.దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన పిమ్మట అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, బీజేపీలతో పాటు తదితర పార్టీలు తమ హయాంలో చేపట్టిన ఆర్థిక విధానాలతోనే దేశంలో మావోయిస్టుల సమస్య ఉద్భవించిందని మాయావతి అన్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు తమ పరిపాలన హయంలో చేపట్టిన ఆర్థిక విధానాలపై తిరగబడిన ప్రజలే.. న్యాయం కోసం మావోయిస్టుల బాట పట్టారని మాయావతి వ్యాఖ్యానించారు.
Source: జాతీయ | 16 Jun 2010 | 3:13 am

1995 సంవత్సరం తర్వాత ఉరిశిక్ష పొందిన 59వ ఖైదీ కసబ్!

మహారాష్ట్రలో గత 1995 ఏడాదికి తర్వాత ఉరిశిక్షకు గురైన 59వ ఖైదీ అజ్మల్ కసబ్ అని తెలియవచ్చింది. ముంబై మారణ హోమంలో ప్రధాన నిందితుడైన అజ్మల్ కసబ్‌, మహారాష్ట్రలో 15 సంవత్సరాల తర్వాత ఉరిశిక్షకు గురైయ్యాడు. 1995 సంవత్సరం ఆగస్టులో అలిబాగ్ నగరానికి చెందిన సుధాకర్ జోషికి ఉరిశిక్షను అమలు చేశారు. ఇతని తర్వాత కసబ్ ఉరికంబం ఎక్కనున్నాడని తెలిసింది.
Source: జాతీయ | 16 Jun 2010 | 3:12 am