|
స్వల్ప లాభాల్లో బాంబే స్టాక్ మార్కెట్బాంబే స్టాక్ మార్కెట్ స్వల్ప లాభాల బాటలో కొనసాగుతోంది. బుధవారం ట్రేడింగ్ ప్రారంభం నుంచి పుంజుకున్న బాంబే స్టాక్ మార్కెట్, మధ్యాహ్నానికి స్వల్ప లాభాలతో ర్యాలీని పయనింపజేస్తోంది. ఫలితంగా బుధవారం మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచి సెన్సెక్స్, 15 పాయింట్లు స్వల్పంగా బలపడి 17,428 పాయింట్ల గరిష్ఠ స్థాయికి చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచి నిఫ్టీ కూడా 13 పాయింట్వ స్వల్ప వృద్ధితో 5,235 పాయింట్ల వద్ద పయనిస్తోంది.Source: Yahoo! Telugu: News | 16 Jun 2010 | 9:19 am లాభాల్లో స్టాక్ మార్కెట్: సెన్సెక్స్, నిఫ్టీల వృద్ధిబాంబే స్టాక్ మార్కెట్ బుధవారం లాభాల బాటలో కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో బాంబే స్టాక్ మార్కెట్ లాభాలను నమోదు చేసుకుంటోంది. ఫలితంగా మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచి సెన్సెక్స్, 37 పాయింట్లు వృద్ధి చెంది, 17,450 పాయింట్ల మార్కును తాకింది. అయితే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచి నిఫ్టీ మాత్రం ఒక్క పాయింట్లు మాత్రమే స్వల్పంగా పుంజుకుని, 5,223 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.Source: Yahoo! Telugu: News | 16 Jun 2010 | 9:09 am మళ్లీ బీజేపీ తీర్థం పుచ్చుకోనున్న జశ్వంత్ సింగ్!?బీజేపీ బహిష్కృత సీనియర్ నేత జశ్వంత్ సింగ్ మళ్లీ భారతీయ జనతా పార్టీలో చేరనున్నారని తెలిసింది. పాకిస్థాన్ వ్యస్థాపకుడు మొహమ్మద్ అలీ జిన్నాను ప్రశంసిస్తూ పుస్తకం రాసిన కారణంగా భాజపా నుంచి వెలివేయబడిన జశ్వంత్ సింగ్ తిరిగి ఆ పార్టీలో త్వరలో చేరనున్నారని సమాచారం.Source: Yahoo! Telugu: News | 16 Jun 2010 | 8:59 am 1995 సంవత్సరం తర్వాత ఉరిశిక్ష పొందిన 59వ ఖైదీ కసబ్!మహారాష్ట్రలో గత 1995 ఏడాదికి తర్వాత ఉరిశిక్షకు గురైన 59వ ఖైదీ అజ్మల్ కసబ్ అని తెలియవచ్చింది. ముంబై మారణ హోమంలో ప్రధాన నిందితుడైన అజ్మల్ కసబ్, మహారాష్ట్రలో 15 సంవత్సరాల తర్వాత ఉరిశిక్షకు గురైయ్యాడు. 1995 సంవత్సరం ఆగస్టులో అలిబాగ్ నగరానికి చెందిన సుధాకర్ జోషికి ఉరిశిక్షను అమలు చేశారు. ఇతని తర్వాత కసబ్ ఉరికంబం ఎక్కనున్నాడని తెలిసింది.Source: Yahoo! Telugu: News | 16 Jun 2010 | 8:39 am ప్రపంచంలోనే అత్యంత సెక్సీ ఫిగర్ - దీపికా పదుకొనేదీపికా పదుకునే పేరు చెబితే టీనేజ్ కుర్రకారు గుండెల్లో అలజడి ఉవ్వెత్తున ఎగిసిపడుతుంది. ఆ సుందరి నటించిన సినిమా వస్తే ఒకటి పదిసార్లు చూసే యువకులున్నారంటే ఆమెకున్న ఆకర్షణ ఎంతటిదో అర్థం చేసుకోవచ్చు. ఇటీవల ప్రపంచవ్యాప్తంగా అత్యంత సెక్సీగా ఉన్న సుందరాంగి ఎవరా అని సుప్రసిద్ధ పత్రిక "ఫర్ హిమ్" ఓ సర్వే చేపట్టింది. ఈ సర్వేలో తేలిందేటయా అంటే... ప్రపంచంలో సూపర్ సెక్సీ ఫిగర్ దీపికా పదుకొనేదనే సంగతి. యాంజెలీనా జోలీ, బ్రిట్ని స్పియర్స్.. ఇలా ఎందరెందరో హాలీవుడ్ నటీమణులున్నప్పటికీ దీపికా పదుకొనే అంటే తాము పడి ఛస్తామని సర్వేలో పాల్గొన్న యువకులు ఘంటాపథంగా చెప్పారట. దీపికా పదుకునే అందాల్ని చూసి భారతీయ యువతే గుల్లవుతుందనుకుంటుంటే కొత్తగా ఈ జాబితాలోకి ప్రపంచంలోని యూత్ కూడా చేరుతోందన్నమాట.Source: Yahoo! Telugu: Entertainment | 16 Jun 2010 | 8:30 am కుక్కలు చింపిన విస్తరి రాష్ట్ర కాంగ్రెస్: అధిష్ఠానం అయోమయంరాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కుక్కలు చింపిన విస్తరి చందంగా మారిపోయింది. అధిష్ఠానం మాటను తలకెక్కించుకోని నేతలు డజన్ల సంఖ్యలో తయారయ్యారు. ఎవరిష్టం వచ్చినట్లు వారు మాట్లాడటం అలవాటై పోయింది. అదేమంటే... మా పార్టీలో వ్యక్తులకు స్వాతంత్రం ఎక్కువ అని నాయకులు సర్దుకుంటున్నప్పటికీ లోలోన తీవ్రంగా మధనపడుతున్నట్లు సమాచారంSource: Yahoo! Telugu: News | 16 Jun 2010 | 8:13 am ఇండోనేషియాలో భూకంపం: నేలమట్టమైన భవనాలు!ఇండోనేషియాలో బుధవారం ఉదయం భారీ భూకంపం ఏర్పడింది. ఇండోనేషియాలోని పపువా ప్రాంతంలో భూమి కంపించింది. ఈ కంపనం రిక్టర్ స్కేలుపై 7.1గా నమోదైనట్లు భూగోళ శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ భూకంపంతో ఇండోనేషియాలోని పపువాలో పలు భవనాలు నేలమట్టమయ్యాయి. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలుస్తోంది.Source: Yahoo! Telugu: News | 16 Jun 2010 | 6:33 am రాజేంద్రప్రసాద్ సరసన నటిస్తున్న సుహాసిని!సుప్రసిద్ధ నటుడు డాక్టర్. రాజేంద్రప్రసాద్, సుహాసిని నాయికా నాయికలుగా ఉషాచరణ్ క్రియేషన్స్ కొత్త చిత్రం రూపొందించనుంది. ఉషాచరణ్ క్రియేషన్స్ పతాకంపై రాజేంద్రప్రసాద్-సుహాసిని జోడీగా నటించబోయే ప్రథమ చిత్రాన్ని జొన్నాడ రమణ మూర్తి నిర్మిస్తున్నారు.తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సినీ రంగాల్లో దాదాపు 32 చిత్రాలకు పైగా దర్శకత్వం, వందకు పైగా చిత్రాలకు ఛాయాగ్రహణ దర్శకత్వం నెరపిన "దినేష్‌బాబు" ఈ చిత్రానికి డైరక్షన్ వహిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా షూటింగ్ హైదరాబాదులో ప్రారంభమైంది. ప్రస్తుతం సన్నివేశాల చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం గురించి దర్శకుడు దినేష్‌బాబు మాట్లాడుతూ.. వినోదభరితంగా రూపుదిద్దుకునే ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందన్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 16 Jun 2010 | 6:28 am విదేశీ స్టాక్ మార్కెట్ల ప్రభావం: లాభాల్లో సెన్సెక్స్!అంతర్జాతీయ స్టాక్ మార్కెట్ల ట్రేడింగ్ ఊపందుకోవడంతో బాంబే స్టాక్ మార్కెట్ లాభాలను నమోదు చేసుకుంటోంది. ట్రేడింగ్ ప్రారంభం నుంచే పురోగమనం వైపు ర్యాలీని కొనసాగిస్తున్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచి సెన్సెక్స్, మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో 58 పాయింట్ల లాభపడి, 17,471 పాయింట్ల గరిష్ఠ స్థాయికి చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచి నిఫ్టీ కూడా 19 పాయింట్ల స్వల్ప లాభంతో 5,241 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.Source: Yahoo! Telugu: News | 16 Jun 2010 | 6:20 am పోలవరం "అవినీతి" దొంగలెవరో తేలాల్సిందే: పాల్వాయిపోలవరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందని ధ్వజమెత్తిన తెలంగాణా ప్రాంత సీనియర్ కాంగ్రెస్ నాయకులు బుధవారం రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌తో భేటీ అయ్యారు. పోలవరం ప్రాజెక్టు ప్రస్తుత డిజైన్ వల్ల ప్రజలకు తీరన నష్టం వాటిల్లుతుందనీ, కనుక డిజైన్ మార్పుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించినట్లు తెలిసింది.Source: Yahoo! Telugu: News | 16 Jun 2010 | 6:18 am మానవ హక్కుల ఉల్లంఘన: శ్రీలంకకు ఐరాస బృందం!ఎల్టీటీఈపై యుద్ధం సందర్భంగా శ్రీలంక ప్రభుత్వం మానవ హక్కులను ఉల్లంఘించినట్లు వచ్చిన ఆరోపణలపై పరిశీలన జరిపేందుకు ఐక్యరాజ్యసమతి శ్రీలంకకు చేరుకుంది. ఎల్టీటీఈ పోరు సందర్భంగా శ్రీలంక ప్రభుత్వం వేలాది మంది తమిళులను పొట్టన బెట్టుకుందని వెలువెత్తిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపేందుకు ఐరాస రాజకీయ అధిపతి బి లిన్ పాస్కోతో కూడిన ప్రతినిధుల బృందం పరిశీలన జరుపనుంది.Source: Yahoo! Telugu: News | 16 Jun 2010 | 5:41 am కాంగ్రెస్ ఓడుతుంది... తెరాస గెలుస్తుంది: దామోదర్ రెడ్డితెలంగాణా ప్రాంతంలో ఆగస్టు నెలలో జరుగనున్న ఉపఎన్నికల్లో తెలంగాణా రాష్ట్ర సమితి విజయ ఢంకా మోగించడం ఖాయమని కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడు రాంరెడ్డి దామోదర్ రెడ్డి జోస్యం చెప్పారు.Source: Yahoo! Telugu: News | 16 Jun 2010 | 5:32 am మళ్లీ బీజేపీ తీర్థం పుచ్చుకోనున్న జశ్వంత్ సింగ్!?బీజేపీ బహిష్కృత సీనియర్ నేత జశ్వంత్ సింగ్ మళ్లీ భారతీయ జనతా పార్టీలో చేరనున్నారని తెలిసింది. పాకిస్థాన్ వ్యస్థాపకుడు మొహమ్మద్ అలీ జిన్నాను ప్రశంసిస్తూ పుస్తకం రాసిన కారణంగా భాజపా నుంచి వెలివేయబడిన జశ్వంత్ సింగ్ తిరిగి ఆ పార్టీలో త్వరలో చేరనున్నారని సమాచారం.Source: జాతీయ | 16 Jun 2010 | 3:30 am మావో సమస్యకు కేంద్ర ప్రభుత్వామే కారణం: మాయావతిమావోయిస్టుల సమస్యకు కేంద్ర ప్రభుత్వాల పరిపాలన తీరే ప్రధాన కారణమని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మాయావతి ఆరోపించారు. వరుసగా అధికారంలోకి వచ్చిన కేంద్ర ప్రభుత్వాలు చేపట్టిన సామాజిక ఆర్థిక విధానాలే ప్రజలను మావోయిస్టులుగా మార్చాయని మాయవతి ధ్వజమెత్తారు.దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన పిమ్మట అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, బీజేపీలతో పాటు తదితర పార్టీలు తమ హయాంలో చేపట్టిన ఆర్థిక విధానాలతోనే దేశంలో మావోయిస్టుల సమస్య ఉద్భవించిందని మాయావతి అన్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు తమ పరిపాలన హయంలో చేపట్టిన ఆర్థిక విధానాలపై తిరగబడిన ప్రజలే.. న్యాయం కోసం మావోయిస్టుల బాట పట్టారని మాయావతి వ్యాఖ్యానించారు.Source: జాతీయ | 16 Jun 2010 | 3:13 am 1995 సంవత్సరం తర్వాత ఉరిశిక్ష పొందిన 59వ ఖైదీ కసబ్!మహారాష్ట్రలో గత 1995 ఏడాదికి తర్వాత ఉరిశిక్షకు గురైన 59వ ఖైదీ అజ్మల్ కసబ్ అని తెలియవచ్చింది. ముంబై మారణ హోమంలో ప్రధాన నిందితుడైన అజ్మల్ కసబ్, మహారాష్ట్రలో 15 సంవత్సరాల తర్వాత ఉరిశిక్షకు గురైయ్యాడు. 1995 సంవత్సరం ఆగస్టులో అలిబాగ్ నగరానికి చెందిన సుధాకర్ జోషికి ఉరిశిక్షను అమలు చేశారు. ఇతని తర్వాత కసబ్ ఉరికంబం ఎక్కనున్నాడని తెలిసింది.Source: జాతీయ | 16 Jun 2010 | 3:12 am పోలవరం "అవినీతి" దొంగలెవరో తేలాల్సిందే: పాల్వాయిపోలవరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందని ధ్వజమెత్తిన తెలంగాణా ప్రాంత సీనియర్ కాంగ్రెస్ నాయకులు బుధవారం రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌తో భేటీ అయ్యారు. పోలవరం ప్రాజెక్టు ప్రస్తుత డిజైన్ వల్ల ప్రజలకు తీరన నష్టం వాటిల్లుతుందనీ, కనుక డిజైన్ మార్పుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించినట్లు తెలిసింది.Source: ఏపీ న్యూస్ | 16 Jun 2010 | 12:49 am కాంగ్రెస్ ఓడుతుంది... తెరాస గెలుస్తుంది: దామోదర్ రెడ్డితెలంగాణా ప్రాంతంలో ఆగస్టు నెలలో జరుగనున్న ఉపఎన్నికల్లో తెలంగాణా రాష్ట్ర సమితి విజయ ఢంకా మోగించడం ఖాయమని కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడు రాంరెడ్డి దామోదర్ రెడ్డి జోస్యం చెప్పారు.Source: ఏపీ న్యూస్ | 16 Jun 2010 | 12:03 am తెరాసను మట్టి కరిపించండి: కాంగ్రెస్ హైకమాండ్ఉపఎన్నికల్లో తెలంగాణా రాష్ట్ర సమితిని నామరూపాల్లేకుండా చేయాలని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ పీసీసీ చీఫ్ డి. శ్రీనివాస్‌కు స్పష్టమైన ఆదేశాలను జారీ చేసినట్లు సమాచారం.Source: ఏపీ న్యూస్ | 15 Jun 2010 | 11:09 pm ఎంసెట్ ఫలితాలు: మెడిసన్‌లో బాలికలదే పైచేయి!ఎంసెట్ ఫలితాలను రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ బుధవారం విడుదల చేసింది. ఈ ఫలితాల్లో విజయవాడకు చెందిన విద్యార్థిని బోయపాటి పల్లవి 159 మార్కులతో ఇంజనీరింగ్ విభాగంలో ప్రథమ స్థానం సాధించగా, విశాఖకు చెందిన మహ్మద్ గౌస్, గుంటూరుకు చెందిన జనార్థన్ ద్వితీయ, తృతీయ స్థానంలో నిలిచారు.Source: ఏపీ న్యూస్ | 15 Jun 2010 | 10:23 pm రాజీవ్‌గాంధీ ఓ నిందితుడిని తప్పించారా..?: నితీష్ తివారీదేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోన్న భోపాల్ గ్యాస్ వివాదంలో దివంగత మహానేత రాజీవ్‌గాంధీకి, ఆయన ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి మనీష్ తివారీ స్పష్టం చేశారు. భోపాల్ విషవాయువుల లీక్ ప్రమాదంలో రాజీవ్ గాంధీపై వస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని తివారీ తేల్చి చెప్పారు.Source: జాతీయ | 15 Jun 2010 | 9:48 pm పశ్చిమ బెంగాల్‌లో ఎన్‌కౌంటర్: 8 మంది మావోల హతం!పశ్చిమబెంగాల్‌లో మావోయిస్టులు, కోబ్రా దళాలకు మధ్య జరిగిన కాల్పుల్లో 8 మంది మావోయిస్టులు హతమయ్యారు. మిడ్నాపూర్‌లో కూంబింగ్ నిర్వహిస్తుండగా మావోయిస్టులు ఒక్కసారిగా విరుచుకుపడటంతో కోబ్రా దళాలు ఎదురుకాల్పులు చేశాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో కోబ్రా దళాలతో పాటు బెంగాల్ రాష్ట్ర పోలీసులు కూడా పాల్గొన్నారు. ఈ కాల్పుల్లో 8 మంది మావోలు మృతి చెందారని పోలీసులు తెలిపారు.Source: జాతీయ | 15 Jun 2010 | 9:36 pm క్లైమాక్స్ మినహా థ్రిల్లర్ మూవీ 'మంగళ' షూటింగ్ పూర్తి!"మంత్ర" ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ఛార్మింగ్ గాళ్ ఛార్మి ప్రధాన పాత్ర పోషిస్తున్న చిత్రం "మంగళ". ఓషో తులసీరామ్ స్వీయదర్శకత్వంలో రూపొందుతున్న విభిన్న థ్రిల్లర్ "మంగళ".. ఇటీవలే అన్నపూర్ణ స్టూడియోలో పాటల చిత్రీకరణ జరుపుకుంది. క్లైమాక్స్ మినహా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం గురించి చిత్ర దర్శకనిర్మాత ఓషో తులసీరామ్ మాట్లాడుతూ.. "ఇదొక విభిన్న చిత్రం. ఛార్మి నటన ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. గతంలో మా కాంబినేషన్‌లో వచ్చిన 'మంత్ర' ఎంతటి విజయంసాధించింతో, అంతకు మించిన విజయం ఈ 'మంగళ' సాధిస్తుందని ఆశిస్తున్నాను. పాటలతో సహా టాకీ పార్టుతో పాటు షూటింగ్ పూర్తయింది. క్లైమాక్స్ సన్నివేశాలను త్వరలో చిత్రీకరించనున్నాం" అన్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 15 Jun 2010 | 1:27 pm రాజశేఖర్‌కు "బంగారం"లాంటి సినిమా అవుతుంది..!: పరుచూరిడాక్టర్. రాజశేఖర్, కమలిని ముఖర్జీ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న "మా అన్నయ్య బంగారం" చిత్రం వచ్చేనెల 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. జొన్నలగడ్డ శ్రీను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బ్రహ్మానందం, రోహిత్, రాజ్‌కళ్యాణ్, పింగ్‌పాంగ్ తదితరులు నటిస్తున్నారు. ప్రస్తుతం చలపతిరావు, తార నృత్యదర్శకత్వంలో పాట చిత్రీకరణ జరుగుతోంది. ఈ చిత్రం గురించి మంగళవారం నానక్‌రామ్‌గూడా సినీ విలేజ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పరుచూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. "ఇందులో రాజశేఖర్ అద్భుతంగా నటించారు. ఇటువంటి కథలకు ఆయనే చక్కగా సూటవుతారు. కమిలినీ ముఖర్జీ పాత్రకు సరిపోయింది రాజశేఖర్‌తో కథలు రాసిన చిత్రాలన్నీ హిట్టయ్యాయి. పక్కా స్క్రిప్ట్‌తో సినిమాను సెట్‌పైకి తీసుకెళ్లాం. రాఘవేంద్రరావు శిష్యుడు బి. గోపాల్ ఏదైనా స్క్రిప్ట్ ఇస్తే అందులో తలెత్తిన అనుమానాలు అడుగుతుంటారు. అదే కోవలో జొన్నలగడ్డకూడా కొన్ని అనుమానాలను నివృత్తిచేసుకుంటారు. మంచి దర్శకునికి గల లక్షణాలు జొన్నలగడ్డలో ఉన్నాయి. రాజశేఖర్‌కు నిజంగా బంగారంలాంటి సినిమా అవుతుంది. జయప్రకాష్‌రెడ్డి పాత్ర కామెడీని అద్భుతంగా పండిస్తుంది" అని అన్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 15 Jun 2010 | 1:11 pm మమతాతో దేవి క్లోజ్..! గుర్రుగా ఉన్న మనోరమ..!టాలీవుడ్‌లో సరైన హిట్ సినిమాలు లేక అల్లాడిపోతున్న ఛార్మింగ్ గాళ్ ఛార్మీకి కొత్త సమస్య వచ్చిపడింది. మనోరమ, మంత్ర, అనుకోకుండా ఒకరోజు వంటి లేడిఓరియెంటెడ్ సినిమాల్లో నటించిన ఛార్మీ తాజాగా 'సై ఆట', 'మంగళ' అనే చిత్రాల్లో కీలక పాత్ర పోషిస్తోంది. సరైన హిట్ కోసం ప్రతి సన్నివేశాన్ని ఇన్‌వాల్వ్‌మెంట్‌తో చేస్తున్న ఛార్మికి.. తన బాయ్‌ఫ్రెండ్, గాయకుడు దేవీశ్రీప్రసాద్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరిగేందుకు టైమ్‌లేదట. దీంతో పాటు టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్‌లో మంచి ఛాన్సులు కొట్టేసిన దేవీశ్రీప్రసాద్ "ఆకలేస్తే అన్నంపెడతా" పాట పాడిన అందాల ముద్దుగుమ్మ మమతాతో పార్టీలకు షికార్లకు తిరుగుతున్నట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న ఛార్మి దేవిశ్రీప్రసాద్‌పై గుర్రుగా ఉందని ఫిలిమ్ నగర్ వర్గాల టాక్. టాలీవుడ్‌లో ఛాన్సులు దొరక్క కోలీవుడ్ వైపు కన్నేసిన మమతా మోహన్‌దాస్.. ప్రస్తుతం చెన్నైలో మకాం వేసింది.Source: Yahoo! Telugu: Entertainment | 15 Jun 2010 | 10:22 am ఉప ఎన్నికల్లో పోటీ చేస్తే రాళ్లతో కొట్టిస్తాం: కోదండరామ్తెలంగాణ ప్రాంతంలో జరిగే ఉప ఎన్నికల్లో పోటీ చేసే వారికి గుణపాఠం తప్పదని తెలంగాణ ఐక్య కార్యాచరణ కమిటీ కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. ముఖ్యంగా, ఈ ఎన్నికల ప్రచారం కోసం గ్రామాలకు వచ్చే తెలంగాణ వ్యతిరేక శక్తులను రాళ్ళతో కొడతామని ఆయన హెచ్చరించారు.Source: ఏపీ న్యూస్ | 15 Jun 2010 | 8:53 am జగన్ ఓదార్పు యాత్రకు అనుమతి తప్పనిసరి: శైలజానాథ్కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డి చేపట్టే ఓదార్పు యాత్రకు అధిష్టానం అనుమతి తప్పకుండా పొందాలని కాంగ్రెస్ పార్టీ శానససభ్యుడు, ప్రభుత్వ విప్ శైలజానాథ్ అభిప్రాయపడ్డారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ జగన్ ఓదార్పు యాత్ర విషయంలో పార్టీ పెద్దలు కూడా ఆలోచించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.Source: ఏపీ న్యూస్ | 15 Jun 2010 | 8:44 am పొన్నాలపై ఆరోపణలు నిజమే: పాల్వాయి గోవర్థన్రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖామంత్రి పొన్నాల లక్ష్మయ్యపై తాము చేసిన ఆరోపణలు నిజమైనవేనని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పాల్వాయి గోవర్థన్ రెడ్డి స్పష్టం చేశారు. ఆయన మంగళవారం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ జలయజ్ఞం అక్రమాలకు సంబంధించి తాము నిరాధార ఆరోపణలు చేయడం లేదన్నారు. ముఖ్యంగా, సొంత పార్టీకి చెందిన నేతలను చులకన చేయాలన్న ఉద్దేశ్యం తమకెంతమాత్రం లేదన్నారు.Source: ఏపీ న్యూస్ | 15 Jun 2010 | 6:56 am భోపాల్ దుర్ఘటన: 18న మంత్రుల ఉప సంఘం భేటీ!భోపాల్ గ్యాస్ లీకేజీ దుర్ఘటనపై ఈనెల 18వ తేదీన మంత్రుల ఉప సంఘం భేటీకానున్నట్టు కేంద్ర హోంశాఖామంత్రి పి.చిదంబరం తెలిపారు. ఆర్థిక వ్యవహారాలపై కేంద్ర కేబినెట్ సమావేశం మంగళవారం జరిగింది. ఈ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. భోపాల్ గ్యాస్ లీకేజీ దుర్ఘటనపై ఇటీవల సీబీఐ కోర్టు తుది తీర్పును వెలువరించిన విషయం తెల్సిందే. ఈ తీర్పులో దోషులుగా తేలిన వారికి రెండేళ్ళ జైలుశిక్షను విధించింది. అయితే, ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న యూనియన్ కార్బైడ్ కార్పొరేషన్ మాజీ సీఈవో వారెన్ ఆండర్సన్ పేరును మాటమాత్రం కూడా ప్రస్తావించలేదు.Source: జాతీయ | 15 Jun 2010 | 6:29 am మమతాతో దేవి క్లోజ్..! గుర్రుగా ఉన్న మనోరమ..!టాలీవుడ్‌లో సరైన హిట్ సినిమాలు లేక అల్లాడిపోతున్న ఛార్మింగ్ గాళ్ ఛార్మీకి కొత్త సమస్య వచ్చిపడింది. మనోరమ, మంత్ర, అనుకోకుండా ఒకరోజు వంటి లేడిఓరియెంటెడ్ సినిమాల్లో నటించిన ఛార్మీ తాజాగా 'సై ఆట', 'మంగళ' అనే చిత్రాల్లో కీలక పాత్ర పోషిస్తోంది. సరైన హిట్ కోసం ప్రతి సన్నివేశాన్ని ఇన్‌వాల్వ్‌మెంట్‌తో చేస్తున్న...Source: వినోదం | 15 Jun 2010 | 4:53 am ఆరోపణలు చేయడం సీనియర్లకు సరదాగా మారింది: జేసీమంత్రులపై సొంత పార్టీకి చెందిన కొంతమంది సీనియర్లు ఆరోపణలు చేయడం సరదాగా మారిందని మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జె.సి.దివాకర్ రెడ్డి అన్నారు. అలాగే, రాజీనామా చేయమని డిమాండ్ చేయడం ఓ ఫ్యాషన్‌గా మారిందని ఆయన అన్నారు.Source: ఏపీ న్యూస్ | 15 Jun 2010 | 4:11 am ఎన్నికలు వాయిదా వేస్తే మంచిది: ప్రరాపా నేత కోటగిరిప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ ప్రాంతంలో ఉప ఎన్నికలు నిర్వహించే వాతావరణం లేదని ప్రజారాజ్యం పార్టీ సీనియర్ నేత కోటగిరి విద్యాధర రావు అభిప్రాయపడ్డారు. అందువల్ల ఈ ఎన్నికలను మరికొన్ని నెలల పాటు వాయిదా వేస్తేనే మంచిదని ఆయన అన్నారు.Source: ఏపీ న్యూస్ | 15 Jun 2010 | 4:11 am కుడ్కో గ్రామస్తుల హత్య కేసు: శిబూ సోరేన్‌కు విముక్తిజార్ఖండ్ రాష్ట్రంలోని కుడ్కో గ్రామంలో జంట హత్య కేసులో ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శిబూ సొరేన్‌కు విముక్తి లభించింది. ఈ కేసుతో తుది తీర్పు మంగళవారం వెలువడగా, స్థానిక కోర్టు సొరేన్‌ను నిర్ధోషిగా విడుదల చేసింది. ఈ కేసు విచారణ 36 సంవత్సరాల పాటు సాగడం గమనార్హం.Source: జాతీయ | 15 Jun 2010 | 3:16 am ఉప ఎన్నికల సమరంపై వ్యూహ ప్రతివ్యూహాల్లో కేసీఆర్ఉప ఎన్నికల సమరం సమీపిస్తున్న కొద్ది తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు వ్యూహప్రతివ్యూహాల్లో నిమగ్నమవుతున్నారు. పార్టీకి చెందిన సీనియర్ నేతలతో తరచుగా మంతనాలు నిర్వహిస్తున్నారు. పనిలోపనిగా ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయకు చెందిన జేఏసీ నేతలతో పాటు తెలంగాణ జేఏసీ నేతలతోనూ ఆయన చర్చలు జరుపుతున్నారు.Source: ఏపీ న్యూస్ | 15 Jun 2010 | 2:48 am
|