కుడ్కో గ్రామస్తుల హత్య కేసు: శిబూ సోరేన్‌కు విముక్తి

జార్ఖండ్ రాష్ట్రంలోని కుడ్కో గ్రామంలో జంట హత్య కేసులో ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శిబూ సొరేన్‌కు విముక్తి లభించింది. ఈ కేసుతో తుది తీర్పు మంగళవారం వెలువడగా, స్థానిక కోర్టు సొరేన్‌ను నిర్ధోషిగా విడుదల చేసింది. ఈ కేసు విచారణ 36 సంవత్సరాల పాటు సాగడం గమనార్హం.
Source: Yahoo! Telugu: News | 15 Jun 2010 | 8:45 am

చైనా-పాక్ అణు ఒప్పందానికి అమెరికా వ్యతిరేకం

చైనా - పాకిస్థాన్ దేశాల మధ్య కుదిరిన అణు ఒప్పందాన్ని అమెరికా వ్యతిరేకించనుంది. ఈ ఒప్పందం మేరకు పాకిస్థాన్‌లో రెండు అణు రియాక్టర్లను చైనా నిర్మించనుంది. ఈ నిర్ణయం అంతర్జాతీయ అణు నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుందని అమెరికా భావిస్తోంది. అందువల్ల వచ్చే న్యూజిలాండ్‌లో అణు సరఫరా సభ్య దేశాల (న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూపు) సదస్సులో తన వ్యతిరేకతను వెల్లడించనుంది.
Source: Yahoo! Telugu: News | 15 Jun 2010 | 8:32 am

ఉప ఎన్నికల సమరంపై వ్యూహ ప్రతివ్యూహాల్లో కేసీఆర్

ఉప ఎన్నికల సమరం సమీపిస్తున్న కొద్ది తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు వ్యూహప్రతివ్యూహాల్లో నిమగ్నమవుతున్నారు. పార్టీకి చెందిన సీనియర్ నేతలతో తరచుగా మంతనాలు నిర్వహిస్తున్నారు. పనిలోపనిగా ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయకు చెందిన జేఏసీ నేతలతో పాటు తెలంగాణ జేఏసీ నేతలతోనూ ఆయన చర్చలు జరుపుతున్నారు.
Source: Yahoo! Telugu: News | 15 Jun 2010 | 8:18 am

చెన్నయ్‌లో 17 నుంచి ఏస్‌మీ-2010 ఇంజనీరింగ్ ప్రదర్శన

తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నయ్‌లో ఈనెల 17వ తేదీ నుంచి 21వ తేదీ వరకు ఇంటర్నేషనల్ మెషన్ టూల్స్ అండ్ ఆటో కంపోనెంట్స్ ఎగ్జిబిషన్ (ఏస్‌మీ-2010) జరుగనుంది. చెన్నయ్ శివారు ప్రాంతమైన నందంబాక్కంలోని చెన్నయ్ ట్రేడ్ సెంటర్‌లో ఈ ప్రదర్శన జరుగనుంది. ఈ విషయంపై ఏస్‌మీ - 2010 ఛైర్మన్ డి.రవి మంగళవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ ఈ ప్రదర్శనలో 420 ఎగ్జిబిటర్లు పాల్గొంటారన్నారు.
Source: Yahoo! Telugu: News | 15 Jun 2010 | 7:55 am

అమెరికాకు వెళ్ళనున్న కేంద్ర మంత్రుల బృందం!

అగ్రదేశమైన అమెరికాకు నలుగురు కేంద్ర మంత్రులతో కూడిన బృందం ప్రయాణం కానుంది. అమెరికాలో జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకుగాను ఈ బృందం వచ్చేవారం అమెరికాకు చేరుకోనుందని కాంగ్రెస్ పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఈ బృందంలో కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ, కేంద్ర వాణిజ్య శాఖా మంత్రి ఆనంద్ శర్మ, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్‌ తదితరులు ఉన్నారు.
Source: Yahoo! Telugu: News | 15 Jun 2010 | 7:46 am

రాష్ట్ర రాజకీయాలను చక్కబెట్టడంపై అధిష్టానం దృష్టి!

రాష్ట్ర రాజకీయ పరిస్థితులను చక్కబెట్టడంపై అధిష్టానం దృష్టి పెట్టింది. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులపై బుధవారం హస్తినలో ఉన్నత స్థాయి సమావేశం జరుగనుంది. రాష్ట్ర పరిస్థితులపై అనుసరించాల్సిన వ్యూహం, విధానాలపై అధిష్టానం సరైన నిర్ణయం తీసుకోనుంది.
Source: Yahoo! Telugu: News | 15 Jun 2010 | 6:58 am

భోపాల్ గ్యాస్ వివాదం: అర్జున్ సింగ్‌పై కేసు నమోదు!

వారన్ ఆండర్సన్‌ దేశం వదిలిపెట్టి వెళ్ళడంలో కీలక భూమికను పోషించిన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి అర్జున్ సింగ్‌పై కోర్టులో కేసు నమోదైంది. దేశంలో సంచలనం సృష్టిస్తోన్న భోపాల్ గ్యాస్ కేసులో యూనియన్ కార్బైడ్ మాజీ సిఇఓ వారన్ ఆండర్సన్ పారిపోవడంలో కీలక ప్రమేయమున్నట్లు ఆరోపణలు ఎదుర్కుంటున్న మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి అర్జున్ సింగ్‌పై స్థానిక కోర్టులో క్రిమినల్ కేసు నమోదైంది.
Source: Yahoo! Telugu: News | 15 Jun 2010 | 6:43 am

నిబంధనలు పాటించక పోతే కఠిన చర్యలు: పురంధేశ్వరి

రాష్ట్రంలో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ఇంజనీరింగ్ కళాశాలు నిబంధనలు పాటించక పోతే కఠిన చర్యలు తప్పవని కేంద్ర మానవవనరుల శాఖ సహాయ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి హెచ్చరించారు. దీనిపై ఆమె మాట్లాడుతూ నిబంధనలు పాటించని ఇంజనీరింగ్‌ కళాశాలలపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ఇంజనీరింగ్‌ కళాశాలలు ఏర్పాటవుతున్నాయన్నారు.
Source: Yahoo! Telugu: News | 15 Jun 2010 | 5:44 am

నష్టాల్లో కూరుకుపోయిన బాంబే స్టాక్ మార్కెట్

మంగళవారం బాంబే స్టాక్ మార్కెట్ నష్టాల్లో కూరుకుపోయింది. ట్రేడింగ్ ప్రారంభంలో స్వల్ప లాభాలను ఆర్జించిన బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచి సెన్సెక్స్, ఉదయం 10.30 గంటల ప్రాంతంలో నష్టాలను చవిచూసింది. అలాగే నిఫ్టీ కూడా నష్టాలను నమోదు చేసుకుంటోంది.
Source: Yahoo! Telugu: News | 15 Jun 2010 | 5:31 am

భాగ్యనగరిలో పంజాబ్ టెక్నికల్ వర్సిటీ సెంటర్

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో పంజాబ్ విశ్వవిద్యాలయం ప్రాంతీయ కేంద్రాన్ని (రీజినల్ సెంటర్‌) ప్రారంభించింది. ఈ యూనివర్శిటీ నిర్వహించే కోర్సులకు అధ్యయన కేంద్రంగా, ఆన్‌లైన్‌, దూర విద్య ప్రవేశాలకు సహాయకరంగా ఈ సెంటర్‌ పనిచేస్తుందని ఆ వర్శిటీ జాయింట్‌ సెక్రటరీ ఆర్‌పిఎస్‌ బేడీ వెల్లడించారు.
Source: Yahoo! Telugu: News | 15 Jun 2010 | 5:27 am

కుడ్కో గ్రామస్తుల హత్య కేసు: శిబూ సోరేన్‌కు విముక్తి

జార్ఖండ్ రాష్ట్రంలోని కుడ్కో గ్రామంలో జంట హత్య కేసులో ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శిబూ సొరేన్‌కు విముక్తి లభించింది. ఈ కేసుతో తుది తీర్పు మంగళవారం వెలువడగా, స్థానిక కోర్టు సొరేన్‌ను నిర్ధోషిగా విడుదల చేసింది. ఈ కేసు విచారణ 36 సంవత్సరాల పాటు సాగడం గమనార్హం.
Source: జాతీయ | 15 Jun 2010 | 3:16 am

ఉప ఎన్నికల సమరంపై వ్యూహ ప్రతివ్యూహాల్లో కేసీఆర్

ఉప ఎన్నికల సమరం సమీపిస్తున్న కొద్ది తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు వ్యూహప్రతివ్యూహాల్లో నిమగ్నమవుతున్నారు. పార్టీకి చెందిన సీనియర్ నేతలతో తరచుగా మంతనాలు నిర్వహిస్తున్నారు. పనిలోపనిగా ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయకు చెందిన జేఏసీ నేతలతో పాటు తెలంగాణ జేఏసీ నేతలతోనూ ఆయన చర్చలు జరుపుతున్నారు.
Source: ఏపీ న్యూస్ | 15 Jun 2010 | 2:48 am

రాష్ట్ర రాజకీయాలను చక్కబెట్టడంపై అధిష్టానం దృష్టి!

రాష్ట్ర రాజకీయ పరిస్థితులను చక్కబెట్టడంపై అధిష్టానం దృష్టి పెట్టింది. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులపై బుధవారం హస్తినలో ఉన్నత స్థాయి సమావేశం జరుగనుంది. రాష్ట్ర పరిస్థితులపై అనుసరించాల్సిన వ్యూహం, విధానాలపై అధిష్టానం సరైన నిర్ణయం తీసుకోనుంది.
Source: ఏపీ న్యూస్ | 15 Jun 2010 | 1:29 am

భోపాల్ గ్యాస్ వివాదం: అర్జున్ సింగ్‌పై కేసు నమోదు!

వారన్ ఆండర్సన్‌ దేశం వదిలిపెట్టి వెళ్ళడంలో కీలక భూమికను పోషించిన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి అర్జున్ సింగ్‌పై కోర్టులో కేసు నమోదైంది. దేశంలో సంచలనం సృష్టిస్తోన్న భోపాల్ గ్యాస్ కేసులో యూనియన్ కార్బైడ్ మాజీ సిఇఓ వారన్ ఆండర్సన్ పారిపోవడంలో కీలక ప్రమేయమున్నట్లు ఆరోపణలు ఎదుర్కుంటున్న మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి అర్జున్ సింగ్‌పై స్థానిక కోర్టులో క్రిమినల్ కేసు నమోదైంది.
Source: జాతీయ | 15 Jun 2010 | 1:14 am

నిబంధనలు పాటించక పోతే కఠిన చర్యలు: పురంధేశ్వరి

రాష్ట్రంలో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ఇంజనీరింగ్ కళాశాలు నిబంధనలు పాటించక పోతే కఠిన చర్యలు తప్పవని కేంద్ర మానవవనరుల శాఖ సహాయ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి హెచ్చరించారు. దీనిపై ఆమె మాట్లాడుతూ నిబంధనలు పాటించని ఇంజనీరింగ్‌ కళాశాలలపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ఇంజనీరింగ్‌ కళాశాలలు ఏర్పాటవుతున్నాయన్నారు.
Source: ఏపీ న్యూస్ | 15 Jun 2010 | 12:15 am

ఈనెల 30వ తేదీ నుంచి అమర్‌నాథ యాత్ర ప్రారంభం

ఈనెల 30వ తేదీన అమర్‌నాథ్ యాత్ర తొలి బ్యాచ్ ప్రారంభంకానుంది. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను అమర్‌నాథ్ ఆలయ బోర్డు పూర్తి చేసింది. దీనిపై ఆలయ సీఈఓ రాజ్‌ కుమర్ గోయల్ మీడియాతో మాట్లాడుతూ దక్షిణ కాశ్మీర్‌లో హిమాలయాల్లో వెలసిన అమర్‌నాథ్ క్షేత్రాన్ని సందర్శించేందుకు ఈనెల 30వ తేదీన మొదటి జట్టు భక్తుల బృందం బయలుదేరి వెళుతుందన్నారు.
Source: జాతీయ | 14 Jun 2010 | 11:36 pm

భోపాల్ కేసులో రాజీవ్ ప్రస్తావన ఎందుకు..?: అమర్

దేశంలో సంచలనం సృష్టిస్తోన్న భోపాల్ విషవాయువు సంబంధించిన కేసులో దివంగత కాంగ్రెస్ అగ్రనేత రాజీవ్‌గాంధీ ప్రస్తావన ఎందుకని సమాజ్‌వాది పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి అమర్‌సింగ్ ప్రశ్నించారు.అప్పటి పౌర విమానయాన శాఖ మంత్రి సోది, ఎస్పీ సుభాష్ పురి, భోపాల్ కలెక్టర్ మోతిసింగ్‌లు ఆండర్సన్‌ను అమెరికా పంపేందుకు వీలుగా విమానాన్ని ఏర్పాటు చేయాలని, నాటి ముఖ్యమంత్రి అర్జున్ సింగ్ ఆదేశించినట్లు స్పష్టం చేస్తున్న నేపథ్యంలో, మధ్యలో రాజీవ్ గాంధీ ప్రస్తావన అనవసరమని అమర్ సింగ్ వ్యాఖ్యానించారు.
Source: జాతీయ | 14 Jun 2010 | 10:29 pm

బీహార్ సీఎం నితీష్ కుమార్‌పై ధ్వజమెత్తిన కాంగ్రెస్!

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌పై కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ, నితీష్ కుమార్‌ల అడ్వర్టైజ్‌మెంట్ వ్యవహారంపై కాంగ్రెస్ మండిపడింది. బీజేపీ, గుజరాత్ ముఖ్యమంత్రికి మధ్య ఎటువంటి తేడాలేదని, ఈ వివాదం కేవలం రాష్ట్ర ప్రజలను మాయచేసేందుకేనని కాంగ్రెస్ పార్టీ విమర్శనాస్త్రాలు సంధించింది.
Source: జాతీయ | 14 Jun 2010 | 9:56 pm

"విలన్"లో రాగిణి పాత్రకు ఆ శక్తి ఉంది: ఐశ్వర్యారాయ్

ప్రముఖ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపొందిన చిత్రం "విలన్". తమిళంలో "రావణన్", హిందీలో "రావణ్"గా షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 18వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇందులో మాజీ ప్రపంచ సుందరి, అభిషేక్ బచ్చన్ సతీమణి ఐశ్వర్యారాయ్ మూడు విభిన్న పాత్రల్ని పోషించారు.ఈ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా నటీనటులతో మణిరత్నం రాష్ట్ర రాజధాని నగరం హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్‌లో జరిగిన "విలన్" ప్రమోషన్ కార్యక్రమంలో నిర్మాత సుహాసిని మణిరత్నం విలేకరి బాధ్యతను తీసుకుని విక్రమ్‌ను, ఐశ్వర్యారాయ్, ప్రియమణిలపై ప్రశ్నలు సంధించారు. ఇందులో సుహాసిని అడిగిన ప్రశ్నలు మీ కోసం..ప్రశ్న: విలన్‌లో రాగిణి పాత్రకు ఎంతవరకు న్యాయం చేశారు.?జ: విలన్‌లోని రాగిణి పాత్రకు దేనినైనా ఎదుర్కొనే శక్తి ఉంటుంది. మంచి చెడు గురించి ఆలోచించే పాత్ర అది. కోపం వస్తే పులిగా విజృంభిస్తుంది. మరికొన్ని సన్నివేశాల్లో సాఫ్ట్‌గా ఉంటుంది.
Source: Yahoo! Telugu: Entertainment | 14 Jun 2010 | 12:27 pm

అన్నవరంలో సిద్ధార్థ్, ప్రణీతల "బావ" సినిమా షూటింగ్!

సిద్ధార్థ్, ప్రణీత జంటగా నటిస్తున్న చిత్రం "బావ". రాంబాబుని దర్శకునిగా పరిచయం చేస్తూ శ్రీ కీర్తి కంబైన్స్ పతాకంపై ఎం.ఎల్. పద్మకుమార్ చౌదరి నిర్మిస్తున్న ఈ చిత్రంలో డాక్టర్. రాజేంద్రప్రసాద్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రం గురించి దర్శకుడు రాంబాబు మాట్లాడుతూ.. "రాముడు, సీతలాంటి బావామరదళ్ల మధ్య రావణాసురుడి లాంటి ఒక పాత్ర ప్రవేశిస్తాడు. అతను పెట్టే సమస్యలను, ఆ అవరోధాలను హీరో ఎలా అధిగమించి తన మరదలను దక్కించుకుంటాడన్నదే ఈ చిత్ర ప్రధాన కథాంశం. ఇందులో తండ్రీ కొడుకులుగా డాక్టర్. రాజేంద్రప్రసాద్, సిద్ధార్థ్ నటిస్తున్నారు. తన కొడుక్కి స్నేహితునిలా, తండ్రిలా, గురువులా ఉంటూ, తన కుమారుడి ప్రేమకోసం రాజేంద్రప్రసాద్ ఏం చేశారన్నది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఈ సినిమా చూసిన తర్వాత పత్రి తండ్రీ, కొడుకు ఇలాగే ఉండాలని కోరుకుంటారు" అని చెప్పారు.
Source: Yahoo! Telugu: Entertainment | 14 Jun 2010 | 11:12 am

శాంభవిని దేవతగా చిత్రీకరించవద్దు: హెచ్.ఆర్.సి ఆదేశం

శాంభవిని దేవతగా చిత్రీకరించవద్దని రాష్ట్ర మానవహక్కుల సంఘం ఛైర్మన్ జస్టీస్ సుభాషణ్ రెడ్డి హెచ్చరించారు. శాంభవిలో అతీత శక్తులు ఉన్నాయని ప్రచారం చేయరాదని హుకుం జారీ చేశారు. శాంభవికి సంబంధించి నమోదైన కేసులో హెచ్.ఆర్.సి సోమవారం సాయంత్రం కీలక తీర్పు ఇచ్చింది.
Source: ఏపీ న్యూస్ | 14 Jun 2010 | 10:58 am

పోలీస్ వ్యవస్థ, సమాజంలో మార్పు కోసం పోరాడే "భైరవ"

రియల్‌స్టార్ శ్రీహరి హీరోగా విశాఖ టాకీస్ పతాకంపై ప్రారంభమైన "భైరవ" చిత్రం షూటింగ్ ఈ నెల నాలుగో తేదీ నుంచి హైదరాబాద్‌లోని వివిధ లొకేషన్‌లలో జరిగింది. ఈ నెల 14 నుంచి రామోజీ ఫిలింసిటీలో వరుసగా ఐదురోజుల పాటు షూటింగ్ జరుపుకుని, వచ్చేనెల మొదటివారంతో హైదరాబాద్ షూటింగ్ పూర్తవుతుంది.
Source: Yahoo! Telugu: Entertainment | 14 Jun 2010 | 10:56 am

మలయాళంలో నటించబోతున్న 'పవర్ స్టార్' పవన్ కళ్యాణ్!

తెలుగులో అగ్రకథానాయకుడిగా వెలుగుతున్న "పవర్ స్టార్" పవన్ కళ్యాణ్ తొలిసారి మలయాళంలో నటించబోతున్నారు. ఇంతవరకు ఇతర భాషలకు చెందిన అగ్రహీరోలు మన తెలుగు సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా మలయాళ అగ్రనటులైన మమ్ముట్టి, మోహన్ లాల్ తెలుగులో సినిమాలు చేసిన సంగతి విదితమే.
Source: Yahoo! Telugu: Entertainment | 14 Jun 2010 | 10:25 am

24న ప్రేక్షకుల ముందుకు "భీమిలి కబడ్డీ జట్టు"

నాని, విలేజ్‌లో వినాయకుడు ఫేమ్ శరణ్యమోహన్ జంటగా నటిస్తున్న "భీమిలి కబడ్డీ జట్టు" ఈ నెల 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. సుప్రసిద్ధ నిర్మాత ఆర్.బి. చౌదరి మెగాసూపర్‌గుడ్ ఫిలింస్ ప్రై. లిమెటెడ్ పతాకంపై నూతన దర్శకుడు తాతినేని సత్యను పరిచయం చేస్తూ నిర్మించిన "భీమిలి కబడ్డీ జట్టు" అన్ని కార్యక్రమాల్ని పూర్తి చేసుకుని త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా గురించి చిత్ర సమర్పకులు ఆర్.బి.చౌదరి మాట్లాడుతూ.. "భీమిలి కబడ్డీ జట్టు" ద్వారా తాతినేని ప్రకాశరావుగారి మనుమడు తాతినేని సత్యను దర్శకుడిగా పరిచయం చేస్తున్నాం. సత్య తండ్రి దర్శకులు తాతినేని కూడా తెలుగు, హిందీ, బెంగాలీ భాషల్లో పలు విజయవంతమైన చిత్రాల్ని అందించారు. యువదర్శకుడు సత్య "భీమిలి కబడ్డీ జట్టు"ను అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే రీతిలో తెరకెక్కించారు. నిర్మాణపరంగా ఎక్కడా రాజీపడకుండా ఈ చిత్రాన్ని రూపొందించాం. ఈ చిత్రం ద్వారా కెమెరామెన్‌గా కె. చిట్టిబాబుని, సంగీత దర్శకుడిగా సెల్వగణేష్‌ని పరిచయం చేస్తున్నాం." అని చెప్పారు.
Source: Yahoo! Telugu: Entertainment | 14 Jun 2010 | 10:08 am

పుట్టింటికి అల్లుడిని తీసుకొచ్చా..!: సుహాసిని

ప్రముఖ దర్శకుడు మణిరత్నం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన "విలన్" సినిమా ప్రమోషన్‌‌లో భాగంగా ఆ చిత్ర యూనిట్ హైదరాబాద్‌లోని తాజ్‌కృష్ణ నక్షత్ర హోటల్‌లో సందడి చేసింది. తెలుగులో విలన్, హిందీలో రావణ్, తమిళంలో రావణన్‌గా తెరకెక్కుతోంది. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో హైదరాబాద్ తాజ్ కృష్ణలో సోమవారం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ నటి సుహాసిని వ్యాఖ్యతగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తన భర్త రూపొందించిన "విలన్" ఈ నెల 18వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుందని చెప్పారు. మంచి - చెడు రెండు కలిస్తేనే మనిషని ఇదే పాయింట్‌తో విలన్ కథాంశం ప్రేక్షకుల ముందుకు రానుందని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లో పుట్టిన తాను 22 ఏళ్ల తర్వాత అల్లుడిని పుట్టింటికి తీసుకొచ్చినట్టు మీడియా ప్రతినిధులకు సుహాసిని తెలిపారు.
Source: Yahoo! Telugu: Entertainment | 14 Jun 2010 | 6:36 am

'వేదం'లో నా వేశ్య పాత్రకు అంత సీన్‌లేదు..!: సరోజ

"నేను వేశ్య పాత్ర వేసినంత మాత్రనా వారి దగ్గరకు వెళ్ళి పరిశీలించిరాలేదు" అని అందాల బొమ్మ అనుష్క అంటోంది. ఏవో కొన్ని ఇంటర్నేషనల్ అవార్డుల కోసం వెళ్ళే చిత్రాలైతే అలా హార్డ్ హోమ్‌వర్క్ చేయొచ్చు.'కానీ "వేదం"లో నా పాత్రకు అంత సీన్‌లేదు. దర్శకుడు రాధాకృష్ణ చెప్పిన వరకే చేశాను. బహుశా ఆయనకు ఆ అనుభవం ఉందేమోనని అనుష్క నవ్వుతూ చెప్పింది. నా పాత్రను దర్శకుడు తీర్చిదిద్దడంలో పలు జాగ్రత్త తీసుకున్నారని తెలిపింది. అందం గురించి చెబుతూ.. ఇది పుట్టుకతో రావాలి. యోగా అనే దాన్ని మెరుగులు దిద్దడానికి సరిపోతుంది' అని సెలవిచ్చింది. మరోవైపు.. ఆదివారం జరిగిన టాలీవుడ్ క్రికెట్ మ్యాచ్‌ల్లో పాల్గొన్న అనుష్క అభిమానుల్ని అలరించింది. ఇప్పటికే చాలా చోట్ల సరోజ అని ఆమెను పిలుస్తున్నారు. అలాగే స్టేడియంలోనూ అనుష్కను సరోజ అనే పేరుతో అభిమానులు పిలిచారు. కానీ దేన్నైనా స్పోర్టివ్‌గా తీసుకుంటున్నానని ఈ బిల్లా సుందరి చెప్పింది.
Source: Yahoo! Telugu: Entertainment | 14 Jun 2010 | 5:52 am

కిర్గిజ్‌లో ఉన్న భారతీయులను రక్షిస్తాం: విదేశాంగ శాఖ

మత కలహాలతో అట్టుడికి పోతున్న కిర్జిజిస్థాన్‌లో ఉన్న వందలాది మంది భారతీయులను స్వదేశానికి రప్పిస్తామని కేంద్ర ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. ఇందుకోసం ప్రత్యేక చర్యలు చేపట్టనున్నట్టు ప్రభుత్వం తెలిపింది.
Source: జాతీయ | 14 Jun 2010 | 5:35 am

తితిదే ప్రత్యేక అధికారిపై అర్చకుల సీఎంకు ఫిర్యాదు!

తిరుమల తిరుపతి దేవస్థాన (తితిదే) ప్రత్యేక అధికారి ధర్మారెడ్డిపై తితిదే అర్చకుల సంఘం ముఖ్యమంత్రి కె.రోశయ్యకు సోమవారం ఫిర్యాదు చేశారు. వారసత్వ చట్టాన్ని గౌరవించకుండా తమను వేధిస్తున్నారని వారు ఆరోపించారు. ఒక విధంగా చెప్పాలంటే ధర్మారెడ్డి బెదిరింపు ధోరణితో వ్యవహరిస్తున్నారని వారు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. అందువల్ల ఆయనపై తగిన చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో ఆందోళనకు దిగుతామని తితిదే అర్చకుల సంఘం హెచ్చరించింది.
Source: ఏపీ న్యూస్ | 14 Jun 2010 | 5:17 am

పొన్నాలను కేబినెట్ నుంచి తొలగించాలి: కాంగ్రెస్ నేతలు

జలయజ్ఞం పేరుతో కోట్లాది రూపాయల మేరకు అవినీతికి పాల్పడిన రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖామంత్రి పొన్నాల లక్ష్మయ్యను తక్షణం కేబినెట్ నుంచి తొలగించాలని కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు సీనియర్ నేతలు డిమాండ్ చేశారు. జలయజ్ఞం ప్రాజెక్టుల కాంట్రాక్టులను అయిన వారికి కట్టబెట్టి కోట్లాది రూపాయల మేరకు దోచుకున్నారని వారు ఆరోపిస్తున్నారు. అందువల్ల ఆయనను తక్షణం మంత్రి పదవి నుంచి తప్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
Source: ఏపీ న్యూస్ | 14 Jun 2010 | 4:28 am

భోపాల్ గ్యాస్ అంశంపై స్పందించిన పీఎం మన్మోహన్

భోపాల్‌ ఘటనపై తక్షణం మంత్రివర్గ ఉప సంఘం భేటీ కావాలని ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆదేశించారు. ఈ అంశంపై వారం పది రోజుల్లో ఓ నివేదిక సమర్పించాలని ఆయన మంత్రివర్గ ఉప సంఘాన్ని కోరారు. ఇప్పటికే ఈ వ్యవహారంలో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో అసలు ఎంజరిగిందో తేల్చాలని మంత్రివర్గ ఉప సంఘాన్ని ఆయన ఆదేశించారు.
Source: జాతీయ | 14 Jun 2010 | 3:29 am