|
భోపాల్ గ్యాస్ అంశంపై స్పందించిన పీఎం మన్మోహన్భోపాల్ ఘటనపై తక్షణం మంత్రివర్గ ఉప సంఘం భేటీ కావాలని ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆదేశించారు. ఈ అంశంపై వారం పది రోజుల్లో ఓ నివేదిక సమర్పించాలని ఆయన మంత్రివర్గ ఉప సంఘాన్ని కోరారు. ఇప్పటికే ఈ వ్యవహారంలో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో అసలు ఎంజరిగిందో తేల్చాలని మంత్రివర్గ ఉప సంఘాన్ని ఆయన ఆదేశించారు.Source: Yahoo! Telugu: News | 14 Jun 2010 | 8:59 am స్టాక్ మార్కెట్: 238 పాయింట్లు సెన్సెక్స్ వృద్ధి!బాంబే స్టాక్ మార్కెట్ భారీ లాభాల దిశగా ర్యాలీని కొనసాగిస్తోంది. ట్రేడింగ్ ప్రారంభం నుంచే ఊపందుకున్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచి సెన్సెక్స్, మధ్యాహ్నం 2.45 గంటల ప్రాంతంలో 238 పాయింట్లు పుంజుకుంది. దీంతో సెన్సెక్స్ సూచి 17,303 పాయింట్ల మార్కును తాకింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచి నిఫ్టీ కూడా 67 పాయింట్లు బలపడి, 5,186 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.Source: Yahoo! Telugu: News | 14 Jun 2010 | 8:49 am లాభాల్లో స్టాక్ మార్కెట్: ఆశాజనకంగా సెన్సెక్స్!బాంబే స్టాక్ మార్కెట్ లాభాలతో కొనసాగుతోంది. సోమవారం ట్రేడింగ్ ప్రారంభం నుంచే ఊపందుకున్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచి సెన్సెక్స్, మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో 119 పాయింట్లు పుంజుకుని, 17,184 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచి నిఫ్టీ కూడా 29 పాయింట్లు బలపడి, 5,149 పాయింట్ల వద్ద పయనిస్తోంది.Source: Yahoo! Telugu: News | 14 Jun 2010 | 8:11 am విదేశీ స్టాక్ మార్కెట్ల ప్రభావం: లాభాల్లో సెన్సెక్స్!అంతర్జాతీయ స్టాక్ మార్కెట్ల ప్రభావంతో బాంబే స్టాక్ మార్కెట్ లాభాలను నమోదు చేసుకుంటోంది. ఆసియా, అమెరికా, యూరప్ స్టాక్ మార్కెట్లు పురోగమనం దిశగా ర్యాలీని కొనసాగించడంతో బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచి సెన్సెక్స్, మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో 166 పాయింట్లు పుంజుకుని, 17,231 పాయింట్ల మార్కును తాకింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచి నిఫ్టీ కూడా 49 పాయింట్లు బలపడి, 5,168 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది.Source: Yahoo! Telugu: News | 14 Jun 2010 | 7:53 am లాభాల్లో స్టాక్ మార్కెట్: సెన్సెక్స్, నిఫ్టీల వృద్ధి!బాంబే స్టాక్ మార్కెట్ లాభాలతో కొనసాగుతోంది. ట్రేడింగ్ ప్రారంభం నుంచి ఊపందుకున్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచి సెన్సెక్స్, ఉదయం 11.30 గంటల ప్రాంతంలో 162 పాయింట్లు పుంజుకుని, 17,227 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచి నిఫ్టీ కూడా 52 పాయింట్లు బలపడి, 5,171 పాయింట్ల వద్ద పయనిస్తోంది.Source: Yahoo! Telugu: News | 14 Jun 2010 | 7:19 am పాకిస్థాన్‌కు గట్టి షరతు విధించిన అమెరికాపాకిస్థాన్కు అమెరికా గట్టి షరతు విధించింది. భవిష్యత్‌లో ఏదైనా యుద్ధ వాతారణం నెలకొంటే తాము సరఫరా చేసే అత్యాధునిక ఎఫ్-16ఎస్ ఫైటర్ జట్లను భారత్‌కు వ్యతిరేకంగా ఉపయోగించకూడదని తేల్చి చెప్పింది. ఈ విషయాన్ని ఆ దేశం నుంచి విడుదలయ్యే కొన్ని పత్రికలు పేర్కొన్నాయి. ఈ నెలాఖరు నాటికి ఎఫ్-16ఎస్ రకానికి చెందిన 18 యుద్ధ విమానాలను పాక్‌కు అమెరికా సరఫరా చేయనుంది.Source: Yahoo! Telugu: News | 14 Jun 2010 | 6:59 am ఆండర్సన్‌ను అప్పగించండి: ఒబామాకు బాధితుల లేఖభోపాల్ గ్యాస్ లీకేజీ దుర్ఘటనకు ప్రధాన కారకుడైన యూనియన్ కార్బైడ్ కార్పొరేషన్ మాజీ ముఖ్య కార్యనిర్వహణాధికారి వారెన్ ఆండర్సన్‌ను అప్పగించాలని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు భోపాల్ గ్యాస్ లీకేజీ బాధితులు విజ్ఞప్తి చేశారు. అమెరికా పౌరుడైన ఆండర్సన్ న్యూయార్క్‌లో నివశిస్తున్నారు.Source: Yahoo! Telugu: News | 14 Jun 2010 | 6:48 am పుంజుకున్న ట్రేడింగ్: లాభాల్లో స్టాక్ మార్కెట్!దేశీయ వాటాల ట్రేడింగ్ పుంజుకోవడంతో బాంబే స్టాక్ మార్కెట్ లాభాల బాటలో కొనసాగుతోంది. ట్రేడింగ్ ప్రారంభం నుంచే ఊపందుకున్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచి సెన్సెక్స్, ఉదయం 10.30 గంటల ప్రాంతంలో 146 పాయింట్లు బలపడి, 17,071 పాయింట్ల మార్కును తాకింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచి నిఫ్టీ కూడా 40 పాయింట్లు పుంజుకుని 5,159 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది.Source: Yahoo! Telugu: News | 14 Jun 2010 | 6:39 am పుట్టింటికి అల్లుడిని తీసుకొచ్చా..!: సుహాసినిప్రముఖ దర్శకుడు మణిరత్నం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన "విలన్" సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఆ చిత్ర యూనిట్ హైదరాబాద్‌లోని తాజ్‌కృష్ణ నక్షత్ర హోటల్‌లో సందడి చేసింది. తెలుగులో విలన్, హిందీలో రావణ్, తమిళంలో రావణన్‌గా తెరకెక్కుతోంది. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో హైదరాబాద్ తాజ్ కృష్ణలో సోమవారం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ నటి సుహాసిని వ్యాఖ్యతగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తన భర్త రూపొందించిన "విలన్" ఈ నెల 18వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుందని చెప్పారు. మంచి - చెడు రెండు కలిస్తేనే మనిషని ఇదే పాయింట్‌తో విలన్ కథాంశం ప్రేక్షకుల ముందుకు రానుందని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లో పుట్టిన తాను 22 ఏళ్ల తర్వాత అల్లుడిని పుట్టింటికి తీసుకొచ్చినట్టు మీడియా ప్రతినిధులకు సుహాసిని తెలిపారు.Source: Yahoo! Telugu: Entertainment | 14 Jun 2010 | 6:36 am టిబెట్‌కు స్వయంప్రతిపత్తా: మండిపడిన చైనా!టిబెట్‌కు స్వయంప్రతిపత్తి కల్పించాలని ఆ దేశ ఆధ్యాత్మిక మత గురువు దలైలామా చేసిన డిమాండ్‌పై చైనా మండిపడింది. టిబెట్‌కు స్వయంప్రతిపత్తి కల్పించాలని డిమాండ్ చేసే అర్హత ఆయనకు ఎక్కడ ఉందని చైనా ప్రశ్నించింది. టిబెట్‌లో నివశిస్తున్న 60 లక్షల మంది ప్రజల గురించి మాట్లాడే అర్హత దలైలామాకు ఉందా అని చైనా ప్రశ్నించింది.Source: Yahoo! Telugu: News | 14 Jun 2010 | 6:22 am 'వేదం'లో నా వేశ్య పాత్రకు అంత సీన్‌లేదు..!: సరోజ"నేను వేశ్య పాత్ర వేసినంత మాత్రనా వారి దగ్గరకు వెళ్ళి పరిశీలించిరాలేదు" అని అందాల బొమ్మ అనుష్క అంటోంది. ఏవో కొన్ని ఇంటర్నేషనల్ అవార్డుల కోసం వెళ్ళే చిత్రాలైతే అలా హార్డ్ హోమ్‌వర్క్ చేయొచ్చు.'కానీ "వేదం"లో నా పాత్రకు అంత సీన్‌లేదు. దర్శకుడు రాధాకృష్ణ చెప్పిన వరకే చేశాను. బహుశా ఆయనకు ఆ అనుభవం ఉందేమోనని అనుష్క నవ్వుతూ చెప్పింది. నా పాత్రను దర్శకుడు తీర్చిదిద్దడంలో పలు జాగ్రత్త తీసుకున్నారని తెలిపింది. అందం గురించి చెబుతూ.. ఇది పుట్టుకతో రావాలి. యోగా అనే దాన్ని మెరుగులు దిద్దడానికి సరిపోతుంది' అని సెలవిచ్చింది. మరోవైపు.. ఆదివారం జరిగిన టాలీవుడ్ క్రికెట్ మ్యాచ్‌ల్లో పాల్గొన్న అనుష్క అభిమానుల్ని అలరించింది. ఇప్పటికే చాలా చోట్ల సరోజ అని ఆమెను పిలుస్తున్నారు. అలాగే స్టేడియంలోనూ అనుష్కను సరోజ అనే పేరుతో అభిమానులు పిలిచారు. కానీ దేన్నైనా స్పోర్టివ్‌గా తీసుకుంటున్నానని ఈ బిల్లా సుందరి చెప్పింది.Source: Yahoo! Telugu: Entertainment | 14 Jun 2010 | 5:52 am ఏఐబీసీ వైస్ ఛైర్మన్‌గా రవి భాటియా నియామకంఆస్ట్రేలియా ఇండియా బిజినెస్ కౌన్సిల్ ఇండస్ట్రీ బాడీ వైస్ ఛైర్మన్‌గా రవి భాటియా నియమితులయ్యారు. భారత్, ఆస్ట్రేలియా దేశాల మధ్య వాణిజ్య పెట్టుబడులను ప్రోత్సహించేందుకు గాను ఈ పరిశ్రమల సమాఖ్యను ఏర్పాటు చేశారు.Source: Yahoo! Telugu: News | 14 Jun 2010 | 5:48 am భోపాల్ గ్యాస్ అంశంపై స్పందించిన పీఎం మన్మోహన్భోపాల్ ఘటనపై తక్షణం మంత్రివర్గ ఉప సంఘం భేటీ కావాలని ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆదేశించారు. ఈ అంశంపై వారం పది రోజుల్లో ఓ నివేదిక సమర్పించాలని ఆయన మంత్రివర్గ ఉప సంఘాన్ని కోరారు. ఇప్పటికే ఈ వ్యవహారంలో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో అసలు ఎంజరిగిందో తేల్చాలని మంత్రివర్గ ఉప సంఘాన్ని ఆయన ఆదేశించారు.Source: జాతీయ | 14 Jun 2010 | 3:29 am ఆండర్సన్‌ను అప్పగించండి: ఒబామాకు బాధితుల లేఖభోపాల్ గ్యాస్ లీకేజీ దుర్ఘటనకు ప్రధాన కారకుడైన యూనియన్ కార్బైడ్ కార్పొరేషన్ మాజీ ముఖ్య కార్యనిర్వహణాధికారి వారెన్ ఆండర్సన్‌ను అప్పగించాలని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు భోపాల్ గ్యాస్ లీకేజీ బాధితులు విజ్ఞప్తి చేశారు. అమెరికా పౌరుడైన ఆండర్సన్ న్యూయార్క్‌లో నివశిస్తున్నారు.Source: జాతీయ | 14 Jun 2010 | 1:19 am ఉప ఎన్నికల సమరానికి దూరం.. కాంగ్రెస్‌కు మద్దతు!తెలంగాణ ప్రాంతంలో జరుగనున్న ఉప ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని ప్రజారాజ్యం పార్టీ నిర్ణయించింది. సమైక్యాంధ్రకు సంపూర్ణ మద్దతు ప్రకటించిన చిరంజీవి.. ఎన్నికల సమయంలో తెలంగాణ ప్రాంతంలో పర్యటిస్తే ఉద్రిక్త పరిస్థితిలు నెలకొనే అవకాశం ఉంది. పైపెచ్చు.. తెంలగాణ ఉద్యమం సెంటిమెంట్ ఆధారంగా జరుగుతున్న ఈ ఎన్నికల్లో ప్రరాపా తరపున పోటీ చేసేందుకు అభ్యర్థులు కూడా ఎవరూ ముందుకు రాకపోవచ్చు.Source: ఏపీ న్యూస్ | 13 Jun 2010 | 11:50 pm గంగానదిలో పడవ మునక: 50మంది దుర్మణం..!పవిత్ర గంగానదిలో సోమవారం పడవ మునిగిపోయింది. ఉత్తరప్రదేశ్ బలియా వద్ద గంగానదిలో పడవ మునిగిపోయింది. ఈ ప్రమాదంలో 50 మంది దారుణంగా మరణించారు. మొత్తం 70 మంది ప్రయాణీకులు ఈ పడవలో ప్రయాణం చేసినట్లు పోలీసులు తెలిపారు.Source: జాతీయ | 13 Jun 2010 | 11:42 pm ఓదార్పు యాత్రకు అంతా సిద్ధం చేయండి: వైఎస్.జగన్వచ్చే నెల ఎనిమిదో తేదీన చేపట్టనున్న ఓదార్పు యాత్రకు అంతా సిద్ధం చేయాలని కడప పార్లమెంట్ సభ్యుడు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి తనయుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళం జిల్లా నేతలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన జిల్లా అధ్యక్షురాలు శిమ్మ ఉషారాణికి స్వయంగా ఫోన్ చేసి చెప్పారు.Source: ఏపీ న్యూస్ | 13 Jun 2010 | 11:37 pm జార్ఖండ్‌లో గ్రీన్ హంట్: 12 మంది మావోలు హతం!జార్ఖండ్ రాష్ట్రంలో గ్రీన్ హంట్ ఆపరేషన్ ఆరంభమైంది. సింఘ్‌భూమ్ జిల్లాలోని బోహ్రాట్ అడవుల్లో పోలీసులకు మావోయిస్టులకు జరిగిన కాల్పుల్లో 12 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. అలాగే, ఎనిమిది మావో క్యాంపులను పోలీసులు ధ్వంసం చేశారు. ఈ ఆపరేషన్‌లో రెండు వేల మంది పోలీసులు పాల్గొన్నట్టు సమాచారం. ఇందులో స్థానిక జిల్లా పోలీసులతో పాటు.. సీఆర్‌పీఎఫ్, స్పెషల్ టాస్క్ ఫోర్స్ బలగాలు ఉన్నాయి.Source: జాతీయ | 13 Jun 2010 | 11:21 pm సిగ్గూ-లజ్జా-నీతి లేనివారే ఎన్నికల్లో పోటీ చేస్తారు: కేసీఆర్తెలంగాణ గడ్డపై త్వరలో జరుగనున్న ఉప ఎన్నికల్లో సిగ్గూ, లజ్జా, నీతి లేనివారే పోటీ చేసేందుకు సిద్ధపడతారని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర రావు అన్నారు. రాజీనామాలు చేయమని తెలంగాణ ప్రజలంతా ముక్తకంఠంతో కోరినా పట్టించుకోని కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ నేతలు.. ఇపుడు ఏ ముఖంపెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటిస్తారని ఆయన ప్రశ్నించారు.Source: ఏపీ న్యూస్ | 13 Jun 2010 | 11:04 pm భోపాల్ దుర్ఘటన తీర్పుపై హైకోర్టులో రిట్ దాఖలు..!?భోపాల్ గ్యాస్ సంఘటనపై దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ మధ్యప్రదేశ్ ప్రభుత్వం యత్నాలు సాగిస్తోంది. దిగువ కోర్టు ఇచ్చిన తీర్పు పెను దుమారం సృష్టించిన నేపథ్యంలో మధ్యప్రదేశ్ ఈ కేసులోని లోతుపాట్లను తిరిగి వెలికితీసే దిశగా న్యాయ నిపుణులతో సంప్రదింపులు కొనసాగిస్తోంది.Source: జాతీయ | 13 Jun 2010 | 10:33 pm మేం సెక్స్ వర్కర్లు కాము: నటి స్నేహ ఘాటు జవాబుసినిమాల్లో నటిస్తున్నంత మాత్రాన తాము సెక్స్ వర్కర్లు కాదంటూ సినీ నటి స్నేహ ఘాటుగా సమాధానం ఇచ్చింది. పలు తమిళ పత్రికలు పలువురు హీరోయిన్లు, దర్శకులు, నిర్మాతలకు అక్రమ సంబంధాలు అంటగడుతూ ఇష్టానుసారంగా వార్తలను రాస్తున్నాయి. ముఖ్యంగా, అవకాశాల కోసం హీరోయిన్లు దర్శకులకు సెక్స్‌వర్కర్లుగా మారారంటూ ఈ పత్రికలు పేర్కొన్నాయి. దీనిపై స్నేహ తీవ్రంగా మండిపడింది. తమది అందాల ప్రపంచమే.Source: Yahoo! Telugu: Entertainment | 13 Jun 2010 | 7:34 am జలయజ్ఞంలో అవినీతికి బాధ్యుడు పొన్నాలే: పాల్వాయిజలయజ్ఞంలో చోటు చేసుకున్న అవినీతి అక్రమాలకు రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖామంత్రి పొన్నాల లక్ష్మయ్యే బాధ్యత వహించాలని కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత పాల్వాయి గోవర్ధన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ ఆయన తక్షణం తన పదవికి రాజీనామా చేయాలని పాల్వాయి డిమాండ్ చేశారు.Source: ఏపీ న్యూస్ | 13 Jun 2010 | 6:03 am బహిరంగ లేఖాస్త్రాలకు చిరునామా నందమూరి హరికృష్ణఎవరైనా ఒక రాజకీయ నాయకుడు తన మనస్సులోని అభిప్రాయలను వెల్లడించాలంటే మీడియా సమావేశం ఏర్పాటు చేసి చెప్పటం నేటి రాజకీయాల్లో పరిపాటి. అయితే, తెలుగుదేశం పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ అలియాస్ సీతయ్య రూటేవేరు.Source: ఏపీ న్యూస్ | 13 Jun 2010 | 5:43 am త్వరలోనే మత ఘర్షణలకు బిల్లు: మంత్రి చిదంబరందేశంలో త్వరలోనే మత ఘర్షణలకు సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టనున్నట్టు కేంద్ర హోంమంత్రి పి.చిదంబరం చెప్పారు. సొంత నియోజకవర్గమైన కారైక్కుడిలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ మత కలహాలను అరికట్టేందుకు ఓ బిల్లును ప్రవేశపెట్టనున్నట్టు తెలిపారు.Source: జాతీయ | 13 Jun 2010 | 5:09 am శాంతిభద్రతల పరిరక్షణకే వారెన్‌ను వదిలిపెట్టారు: ప్రణబ్భోపాల్ గ్యాస్ దుర్ఘటన అనంతరం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో శాంతిభద్రతలను పరిరక్షించేందుకే యూనియన్ కార్బైడ్ కార్పొరేషన్ మాజీ సీఈఓ వారెన్ ఆండర్సన్‌ను అప్పటి ముఖ్యమంత్రి అర్జున్ సింగ్ వదిలిపెట్టాల్సి వచ్చిందని కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ అన్నారు.Source: జాతీయ | 13 Jun 2010 | 4:01 am
|