మూడు కంపెనీలతో విశాఖ పోర్టుకు ఒప్పందాల ఖరారు

విశాఖపట్నం ఓడరేవు తాజాగా మూడు కంపెనీలతో కీలక ఒప్పందాలను కుదుర్చుకుంది. కార్గో హ్యాండ్లింగ్, మెకనైజేషన్, ఎగ్జిమ్ పార్కుల ఏర్పాటు, జనరల్ కార్గో బెర్తుల ఆధునకీకరణ వంటి ఒప్పందాలు ఉన్నాయి. ఈ ఒప్పందాలలో రెండింటిని ముంబైకు చెందిన స్టెరిలైట్ ఇండస్ట్రీస్, బామర్ లారరీ అండ్ కంపెనీ మరో ఒప్పందాన్ని దక్కించుకుంది.
Source: Yahoo! Telugu: News | 13 Jun 2010 | 9:41 am

శాంతిభద్రతల పరిరక్షణకే వారెన్‌ను వదిలిపెట్టారు: ప్రణబ్

భోపాల్ గ్యాస్ దుర్ఘటన అనంతరం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో శాంతిభద్రతలను పరిరక్షించేందుకే యూనియన్ కార్బైడ్ కార్పొరేషన్ మాజీ సీఈఓ వారెన్ ఆండర్సన్‌ను అప్పటి ముఖ్యమంత్రి అర్జున్ సింగ్ వదిలిపెట్టాల్సి వచ్చిందని కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ అన్నారు.
Source: Yahoo! Telugu: News | 13 Jun 2010 | 9:31 am

బ్రిటన్ ప్రధానితో ఫోనులో మాట్లాడిన బరాక్ ఒబామా

బ్రిటన్ కొత్త ప్రధానమంత్రి డేవిడ్ కామెరాన్‌తో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆదివారం ఫోనులో మాట్లాడారు. ఆ సమయంలో ఇరు దేశాల ద్వైపాక్షిక, అంతర్జాతీయ అంశాలతో పాటు దక్షిణాఫ్రికా గడ్డపై జరుగుతున్న ప్రపంచ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌పై మాట్లాడుకున్నారు.
Source: Yahoo! Telugu: News | 13 Jun 2010 | 8:06 am

ఎయిర్‌క్రాఫ్ట్‌ల డెలవరీపై ఏఐతో బోయింగ్ బృందం చర్చలు!

అమెరికాకు చెందిన బోయింగ్ విమానయాన సంస్థకు ప్రతినిధి బృందం దేశ వాణిజ్య రాజధాని ముంబైకు చేరుకుంది. ఈ బృందం ఎయిర్‌క్రాఫ్ట్‌ల డెలివరీపై ఎయిర్ ఇండియా ఉన్నతాధికారులతో చర్చలు జరుపనుంది. ఈ చర్చల్లో ఎయిర్‌క్రాఫ్ట్‌లతో పాటు 27 డ్రీమ్‌లైనర్స్ సరఫరా అంశం కూడా చోటు చేసుకోనుంది. ఈ డ్రీమ్‌లైనర్స్‌ డెలివరీలో తీవ్రజాప్యం నెలకొన్న విషయం తెల్సిందే.
Source: Yahoo! Telugu: News | 13 Jun 2010 | 7:59 am

మేం సెక్స్ వర్కర్లు కాము: నటి స్నేహ ఘాటు జవాబు

సినిమాల్లో నటిస్తున్నంత మాత్రాన తాము సెక్స్ వర్కర్లు కాదంటూ సినీ నటి స్నేహ ఘాటుగా సమాధానం ఇచ్చింది. పలు తమిళ పత్రికలు పలువురు హీరోయిన్లు, దర్శకులు, నిర్మాతలకు అక్రమ సంబంధాలు అంటగడుతూ ఇష్టానుసారంగా వార్తలను రాస్తున్నాయి. ముఖ్యంగా, అవకాశాల కోసం హీరోయిన్లు దర్శకులకు సెక్స్‌వర్కర్లుగా మారారంటూ ఈ పత్రికలు పేర్కొన్నాయి. దీనిపై స్నేహ తీవ్రంగా మండిపడింది. తమది అందాల ప్రపంచమే.
Source: Yahoo! Telugu: Entertainment | 13 Jun 2010 | 7:34 am

ఉప ఎన్నికలపై జోరుగా టి కాంగ్రెస్ నేతలు మంతనాలు

తెలంగాణ ప్రాంతంలో జరుగనున్న ఉప ఎన్నికలపై ఆ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ నేతలు ఎడతెరిపి లేకుండా మంతనాలు జరుపుతున్నారు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ జిల్లాల వారీగా నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎవరైనా.. విజయం కోసం ఐక్యంగా కృషి చేయాలని ఆయన ఈ సందర్భంగా నేతలకు విజ్ఞప్తి చేస్తున్నారు. అదేసమయంలో నియోజకవర్గాల్లో నెలకొన్న పరిస్థితులపై కూడా ఆయన ఆరా తీస్తున్నారు.
Source: Yahoo! Telugu: News | 13 Jun 2010 | 7:11 am

ప్రవాస భారతీయులకు ఓటింగ్ హక్కు కల సాకారం

విదేశాలలో నివశిస్తున్న భారతీయులకు దేశంలో ఓటు హక్కు కల త్వరలోనే సాకారం కానుంది. ఇందుకు సంబంధించిన ముసాయిదా బిల్లుపై కేంద్ర రక్షణ మంత్రి ఏకే.ఆంటోనీ నేతృత్వంలోని మంత్రుల సాధికారికా బృందం ఆమోదముద్ర వేసింది. దీంతో ఈ బిల్లును త్వరలోనే కేంద్ర కేబినెట్‌ ముందు ప్రవేశపెట్టనున్నారు.
Source: Yahoo! Telugu: News | 13 Jun 2010 | 7:00 am

తాలిబన్ ఉద్యమంలో పాక్ ఐఎస్ఐ ప్రధాన భూమిక!

ఆప్ఘనిస్థాన్‌లో తాలిబన్ల ఉద్యమంలో పాకిస్థాన్ గూఢచారి సంస్థ ఐఎస్ఐ కీలక పాత్ర పోషిస్తున్నట్టు ఓ నివేదిక వెల్లడించింది. తాలిబన్ తీవ్రవాదులకు కేవలం నిధులను మాత్రమే కాకుండా, శిక్షణతో పాటు.. తాలిబన్ల ఉద్యమంలో కీలక భూమిక పోషిస్తోందని బ్రిటీష్‌కు చెందిన లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ ప్రచురించిన ఒక నివేదికలో పేర్కొంది.
Source: Yahoo! Telugu: News | 13 Jun 2010 | 6:42 am

భాగ్యనగరిలో టయోటా సెకండ్ హ్యాండ్ కార్ల షోరూమ్

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో టయోటా కార్ల సంస్థ సెకండ్ హ్యాండ్ కార్ల షోరూమ్‌ను ప్రారంభించింది. ఈ సంస్థ ఇలాంటి షోరూమ్‌ను రాష్ట్రంలో ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. టయోటా కిర్లోస్కర్ మోటార్స్ (టీకేఎం) సంస్థ రాధాకృష్ణ టొయోటా మోటార్స్‌లో ఉపయోగించిన కార్ల విక్రయాలు, కొనుగోళ్ళు, ఎక్స్చేంజ్‌ను ప్రారంభించినట్టు ఆ సంస్థ మార్కెటింగ్ విభాగం డిప్యూటీ మేనేజింగ్ డైరక్టర్ సందీప్ సింగ్ వెల్లడించారు.
Source: Yahoo! Telugu: News | 13 Jun 2010 | 5:48 am

ఆగ్నేయ చైనాలో భారీ వరదలు: 160 మంది దుర్మరణం

ఆగ్నేయ చైనాలో సంభవించిన అకాల వర్షాల కారణంగా భారీ వరదలు ఏర్పడ్డాయి. ఈ వర్షాలు, వరదలకు 160 మంది మృత్యువాత పడ్డారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. అనేక ఇళ్లు నేలమట్టమైనట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
Source: Yahoo! Telugu: News | 13 Jun 2010 | 5:45 am

పెదవి విప్పని అర్జున్ సింగ్: పెరుగుతున్న విమర్శలు!

భోపాల్ గ్యాస్ దుర్ఘటనకు కారకుడిగా భావిస్తున్న యూనియన్ కార్బైడ్ కార్పొరేషన్ మాజీ సీఈఓ వారెన్ ఆండర్సన్‌ దేశం విడిచి వెళ్లిన వ్యవహారంలో కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అర్జున్ సింగ్ పెదవి విప్పడం లేదు. దీంతో ఆయనను లక్ష్యంగా చేసుకున్న ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు ఎక్కువయ్యాయి.
Source: Yahoo! Telugu: News | 13 Jun 2010 | 5:33 am

శాంతిభద్రతల పరిరక్షణకే వారెన్‌ను వదిలిపెట్టారు: ప్రణబ్

భోపాల్ గ్యాస్ దుర్ఘటన అనంతరం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో శాంతిభద్రతలను పరిరక్షించేందుకే యూనియన్ కార్బైడ్ కార్పొరేషన్ మాజీ సీఈఓ వారెన్ ఆండర్సన్‌ను అప్పటి ముఖ్యమంత్రి అర్జున్ సింగ్ వదిలిపెట్టాల్సి వచ్చిందని కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ అన్నారు.
Source: జాతీయ | 13 Jun 2010 | 4:01 am

ఉప ఎన్నికలపై జోరుగా టి కాంగ్రెస్ నేతలు మంతనాలు

తెలంగాణ ప్రాంతంలో జరుగనున్న ఉప ఎన్నికలపై ఆ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ నేతలు ఎడతెరిపి లేకుండా మంతనాలు జరుపుతున్నారు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ జిల్లాల వారీగా నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎవరైనా.. విజయం కోసం ఐక్యంగా కృషి చేయాలని ఆయన ఈ సందర్భంగా నేతలకు విజ్ఞప్తి చేస్తున్నారు. అదేసమయంలో నియోజకవర్గాల్లో నెలకొన్న పరిస్థితులపై కూడా ఆయన ఆరా తీస్తున్నారు.
Source: ఏపీ న్యూస్ | 13 Jun 2010 | 1:42 am

ప్రవాస భారతీయులకు ఓటింగ్ హక్కు కల సాకారం

విదేశాలలో నివశిస్తున్న భారతీయులకు దేశంలో ఓటు హక్కు కల త్వరలోనే సాకారం కానుంది. ఇందుకు సంబంధించిన ముసాయిదా బిల్లుపై కేంద్ర రక్షణ మంత్రి ఏకే.ఆంటోనీ నేతృత్వంలోని మంత్రుల సాధికారికా బృందం ఆమోదముద్ర వేసింది. దీంతో ఈ బిల్లును త్వరలోనే కేంద్ర కేబినెట్‌ ముందు ప్రవేశపెట్టనున్నారు.
Source: జాతీయ | 13 Jun 2010 | 1:30 am

పెదవి విప్పని అర్జున్ సింగ్: పెరుగుతున్న విమర్శలు!

భోపాల్ గ్యాస్ దుర్ఘటనకు కారకుడిగా భావిస్తున్న యూనియన్ కార్బైడ్ కార్పొరేషన్ మాజీ సీఈఓ వారెన్ ఆండర్సన్‌ దేశం విడిచి వెళ్లిన వ్యవహారంలో కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అర్జున్ సింగ్ పెదవి విప్పడం లేదు. దీంతో ఆయనను లక్ష్యంగా చేసుకున్న ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు ఎక్కువయ్యాయి.
Source: జాతీయ | 13 Jun 2010 | 12:04 am

టాలీవుడ్ టీ-20: బాలయ్య లయన్స్‌తో వెంకీ వారియర్స్ ఢీ!

ఎల్బీ స్టేడియంలో టాలీవుడ్ ట్వంటీ-20 సమరం వైభవంగా ప్రారంభమైంది. ప్రేక్షకులు, అభిమానుల కోలాహాలంతో ప్రారంభమైన సినీ తారల టీ-20 క్రికెట్ ట్రోఫీ తొలి మ్యాచ్‌లో బాలయ్య లయన్స్‌తో వెంకీ వారియర్స్ ఢీకొననుంది. తొలుత టాస్ గెలిచిన వెంకీ వారియర్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన బాలయ్య లయన్స్‌‌కు ప్రారంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఫలితంగా ఒకే ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయింది. లయన్స్ ఓపెనర్లను ఆదర్శ అవుట్ చేయడంతో బాలయ్య జట్టు మూడు పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం కెప్టెన్ బాలయ్య, బాలాదిత్యలు క్రీజులో ఉన్నారు.
Source: ఏపీ న్యూస్ | 12 Jun 2010 | 10:48 pm

భోపాల్ గ్యాస్ వివాదం: కాంగ్రెస్ పార్టీపై బీజేపీ ధ్వజం!

భోపాల్‌ గ్యాస్ వివాదంలో కాంగ్రెస్ పార్టీపై భారతీయ జనతా పార్టీ మండిపడింది. యూనియన్ కార్బైడ్ అప్పటి అధిపతి వారెన్ ఆండర్సన్ సురక్షితంగా దేశం విడిచిపోవడంలో తన పాత్ర లేదని కాంగ్రెస్ నిరూపించుకోవాలని బీజేపీ సవాలు విసిరింది. 20వేల మంది మృతిచెందిన భోపాల్ సంఘటనలో ప్రధాన దోషి ఆండర్సన్ తప్పించుకోవడానికి ప్రభుత్వమే సహకరించడం దారుణమని బీజేపీ ఆందోళన వ్యక్తం చేసింది.
Source: జాతీయ | 12 Jun 2010 | 10:30 pm

తారల టి-20 క్రికెట్‌కు తెలంగాణావాదులు అడ్డయితే...?

టాలీవుడ్ టి-20 సజావుగా జరుగుతుందా..? లేదా..? అనే సందేహం నిర్వాహకుల్లో కలుగుతోంది. ఇప్పటికే రెండ్రోజులుగా నిర్వాహకులు ఎల్బీ స్టేడియంను పరిశీలిస్తున్నారు. ఎ.కె.ఖాన్ ఆధ్వర్యంలో పూర్తి రక్షణ ఏర్పాట్లు అప్పుడే ప్రారంభించారు. తెలంగాణా వాదులు క్రికెట్‌కు అంతరాయం కలిగించవచ్చనే సమాచారం మేరకు పోలీసు కమీషనర్ అదనపు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పుడే ఏర్పాటైన సమావేశంలో రేపు మ్యాచ్ ఎలాంటి పరిణామాల్లో జరుగుతుందనే దానిపై చర్చ జరుగుతోంది. ఇప్పటికే కమిషనర్ అభిమానులకు కొన్ని సూచనలు చేశారు. ఒక్కసారి ఎల్బీ స్టేడియంలోకి వచ్చినవారు మళ్లీ బయటకు వెళితే.. తిరిగి లోనికి రావడం కష్టమవుతుందని చెప్పారు. కనుక ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.
Source: Yahoo! Telugu: Entertainment | 12 Jun 2010 | 1:36 pm

మా ఆయనకు 4, నాకు 9 కుక్కపిల్లలు: రంభ

పుట్టిన రోజుకని కెనడా నుంచి చెన్నై వచ్చిన రంభ, ప్రస్తుతం ఇంట్లో ఏమీ తోచక కుక్కపిల్లలతో ఆడుకుంటూ కనిపిస్తోందట. తన ఇంట్లో ఎప్పుడూ 9కి తగ్గకుండా కుక్కపిల్లలుంటాయంటోంది రంభ. చిన్నప్పట్నుంచి తనకు కుక్క పిల్లలంటే ఎంతో ఇష్టమనీ, బుజ్జి కుక్కపిల్లలను చూస్తే వదలలేనని చెప్పుకొచ్చింది. అదిసరే ఈ కుక్కపిల్లలతో ఆడుకోవడాన్ని చూస్తే మీ ఆయన ఊరుకుంటాడా...? ఏమన్నా అనడూ...? అని ప్రశ్నిస్తే, పగలబడి నవ్వుతూ... నేనూ మీలాగే అనుకున్నా. కానీ నా భర్తతో కెనడాకు వెళ్లి వారి ఇంటి ముందు కారు దిగేసరికి, మా ముందు నాలుగు కుక్కపిల్లలు వచ్చి నిలుచున్నాయి. అంతే..! మా ఆయన వాటిని ఎంతో ముద్దాడుతూ ఇంట్లోకి తీసుక వెళ్లారు. అందుకే అంటారు... ఇద్దరి అభిరుచులు ఒక్కటైనప్పుడే పెళ్లి కుదురుతుందని చెప్పి ఫినిషింగ్ టచ్ ఇచ్చింది రంభ. అంటే కుక్కపిల్లల విషయంలోనని మనం అనుకోవాలా...?!
Source: Yahoo! Telugu: Entertainment | 12 Jun 2010 | 10:26 am

ఆట-5 జూనియర్స్‌పై నిషేధం: డాక్టర్ సుభాషణ్ రెడ్డి

రాష్ట్ర మానవ హక్కుల సంఘం ఛైర్మన్ డాక్టర్ సభాషణ్ రెడ్డి అత్యంత కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రముఖ తెలుగు టీవీ ఛానల్ జీ తెలుగులో ప్రతి వారం ప్రసారమయ్యే ఆట-5 జూనియర్స్‌పై నిషేధం విధించారు. ఇందులో ముక్కు పచ్చలారని చిన్నారులతో అసభ్య నృత్యప్రదర్శనలు చేయించడం మానవ హక్కుల ఉల్లంఘన కిందకే వస్తుందని ఆయన తేల్చి చెప్పారు. అందువల్లే వీటిపై నిషేధం విధించినట్టు తెలిపారు.
Source: ఏపీ న్యూస్ | 12 Jun 2010 | 7:26 am

బొట్టుపెట్టి పాసులివ్వాలా...?: మీడియాపై మురళీమోహన్ చిందులు

జూన్ 13.. అంటే రేపు టాలీవుడ్ టి-20 క్రికెట్ మ్యాచ్ జరుగుబోతోంది. ఈ నేపధ్యంలో ప్రింట్ మీడియాకు చెందిన కొందరు పాత్రికేయులు మ్యాచ్ కవర్ చేయాడానికి తమకు పాసులివ్వాల్సిందిగా "మా" అధ్యక్షుడు మురళీమోహన్‌ను అడిగారట. అయితే దీనికి మురళీ మోహన్ సరిగా స్పందించకపోగా వారిపై చిందులేసినట్లు తెలిసింది. "మీకు బొట్టుపెట్టి పాసులివ్వాలా...? ఎప్పుడివ్వాలో మాకు తెలుసు..?" అంటూ చిర్రుబుర్రులాడినట్లు సమాచారం. దీంతో పాత్రికేయులు తీవ్ర అసంతృప్తిని తెలిపారు. మొన్నటివరకూ తమను పూర్తి స్థాయిలో ఉపయోగించుకుని ఇపుడు తన ఇష్టం వచ్చినట్లు మాట్లాడటంపై ధ్వజమెత్తుతున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 12 Jun 2010 | 6:19 am

భారత్ కోరితే సానుకూలంగా స్పందిస్తాం: అమెరికా వెల్లడి

భోపాల్ గ్యాస్ లీకేజీ దుర్ఘటనకు ప్రధానకారకుడుగా భావిస్తున్న యూనియన్ కార్బైడ్ కార్పొరేషన్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి వారెన్ ఆండర్సన్‌ అంశంపై అమెరికా సానుకూలంగా స్పందించింది. వారెన్‌ను అప్పగించాలని భారత ప్రభుత్వం కోరితే సానుకూలంగా స్పందిస్తామని ఆ దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి పీజే.క్రౌలీ తెలిపారు.
Source: జాతీయ | 12 Jun 2010 | 6:01 am

బుద్ధిలేని మూర్ఖులే పోటీకి సిద్ధమంటున్నారు: కేసీఆర్

త్వరలో జరుగనున్న ఉప ఎన్నికల్లో కేంద్రంలోని యూపీఏ సర్కారుతో పాటు సమైక్యవాదుల దిమ్మదిరిగేలా ప్రజలు తీర్పు ఇస్తారని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర రావు జోస్యం చెప్పారు. కరీంనగర్‌లో ప్రజలు ఇప్పటికే ఉప ఎన్నికల కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారన్నారు.
Source: ఏపీ న్యూస్ | 12 Jun 2010 | 3:53 am

ప్రభుత్వాన్ని కాదు.. న్యాయ వ్యవస్థను నిందించాలి!

భోపాల్ గ్యాస్ లీకేజీ దుర్ఘటనపై కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడం మాని న్యాయ వ్యవస్థను నిందించాలని కేంద్ర న్యాయ శాఖామంత్రి వీరప్ప మొయిలీ మండిపడ్డారు. గ్యాస్ దుర్ఘటన కేసులో తుది తీర్పు వెలువడటంలో చోటు చేసుకున్న తీవ్ర జాప్యంతో పాటు యూనియన్ కార్బైడ్ కంపెనీ మాజీ సీఈఓ వారెన్ ఆండర్సన్ పేరు లేకపోవడానికి న్యాయ వ్యవస్థను తప్పుపట్టాలన్నారు.
Source: జాతీయ | 12 Jun 2010 | 3:28 am