బుద్ధిలేని మూర్ఖులే పోటీకి సిద్ధమంటున్నారు: కేసీఆర్

త్వరలో జరుగనున్న ఉప ఎన్నికల్లో కేంద్రంలోని యూపీఏ సర్కారుతో పాటు సమైక్యవాదుల దిమ్మదిరిగేలా ప్రజలు తీర్పు ఇస్తారని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర రావు జోస్యం చెప్పారు. కరీంనగర్‌లో ప్రజలు ఇప్పటికే ఉప ఎన్నికల కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారన్నారు.
Source: Yahoo! Telugu: News | 12 Jun 2010 | 9:22 am

కరాచీలో నివశిస్తున్న దావూద్ ఇబ్రహీం: ముహ్రుఖ్

భారత్ మోస్ట్ వాంటెంట్ నిందితుడు, అండర్ వరల్డ్ డాన్, డి కంపెనీ యజమాని దావూద్ ఇబ్రహీం ఇప్పటికీ పాకిస్థాన్‌లోని కరాచీలో నివశిస్తున్నట్టు ఆయన కుమార్తె ముహ్రుఖ్ తాజాగా తన ఫేస్‌బుక్‌లో పేర్కొంది. గత నెల ఐదో తేదీన ఈ విషయాన్ని ఆమె ఫేస్‌బుక్ ప్రొఫైల్‌లో పేర్కొన్నట్టు శనివారం వార్తలు వెలువడ్డాయి.
Source: Yahoo! Telugu: News | 12 Jun 2010 | 9:12 am

ప్రభుత్వాన్ని కాదు.. న్యాయ వ్యవస్థను నిందించాలి!

భోపాల్ గ్యాస్ లీకేజీ దుర్ఘటనపై కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడం మాని న్యాయ వ్యవస్థను నిందించాలని కేంద్ర న్యాయ శాఖామంత్రి వీరప్ప మొయిలీ మండిపడ్డారు. గ్యాస్ దుర్ఘటన కేసులో తుది తీర్పు వెలువడటంలో చోటు చేసుకున్న తీవ్ర జాప్యంతో పాటు యూనియన్ కార్బైడ్ కంపెనీ మాజీ సీఈఓ వారెన్ ఆండర్సన్ పేరు లేకపోవడానికి న్యాయ వ్యవస్థను తప్పుపట్టాలన్నారు.
Source: Yahoo! Telugu: News | 12 Jun 2010 | 8:58 am

ఎన్నికలకు ఎలా వెళతామో... డీఎస్‌నడగండి: వీహెచ్

ఆగస్టులో జరుగనున్న ఉపఎన్నికలకు ఎలా వెళతామోనన్న విషయాన్ని పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌ను అడగండని రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు చెప్పారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తరపున హైకమాండ్ డి.శ్రీనివాస్‌ను నియమించిందనీ, పార్టీకి సంబంధించిన ఏ నిర్ణయాన్నయినా ఆయనే ప్రకటిస్తారని వీహెచ్ తెలిపారు.
Source: Yahoo! Telugu: News | 12 Jun 2010 | 7:23 am

ఉప ఎన్నికల సమరంపై తెలంగాణ ఐకాస నేతల చర్చలు!

త్వరలో జరుగనున్న ఉప ఎన్నికలపై తెలంగాణ ఐక్య కార్యాచరణ కమిటీ నేతలు శనివారం భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని ఏవీ కాలేజ్ ఆడిటోరియంలో జరుగుతున్న ఈ చర్చలకు ఐకాస కన్వీనర్ ఆచార్య కోదండరామ్ నేతృత్వం వహిస్తున్నారు. ఉప ఎన్నికల్లో అనుసరించాల్సి వ్యూహాలు, ఇతర పార్టీల పోటీ, రాజీనామా చేసిన అభ్యర్థులకే టిక్కెట్లు కేటాయింపు తదితర అంశాలపై చర్చించనున్నారు.
Source: Yahoo! Telugu: News | 12 Jun 2010 | 7:22 am

రేపు ఎడ్‌సెట్ పరీక్ష: అన్ని ఏర్పాట్లూ పూర్తి!

ఎడ్‌సెట్ ప్రవేశ పరీక్ష ఈనెల 13వ తేదీ ఆదివారం జరుగనుంది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసినట్టు ఎడ్‌సెట్ కన్వీనర్ వెల్లడించారు. ఈ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు అర్థగంట ఆలస్యమైనా పరీక్ష రాసేందుకు అనుమతించనున్నట్టు తెలిపారు.
Source: Yahoo! Telugu: News | 12 Jun 2010 | 7:15 am

రోశయ్యకు "సాక్షి" వ్యతిరేకం..? ఈనాడు అనుకూలం..?

ముఖ్యమంత్రి రోశయ్య గద్దెనెక్కిన తర్వాత సీన్ పూర్తిగా మారిపోయింది. పాలన సంగతేమోగానీ మీడియా ప్రవర్తనలో మాత్రం గణనీయమైన మార్పులు వచ్చినట్లు కనబడుతోంది.
Source: Yahoo! Telugu: News | 12 Jun 2010 | 7:07 am

కిర్గిస్థాన్‌లో రెండు తెగల అల్లర్లు: 49కు చేరిన మృతులు!

కిర్గిస్థాన్‌లో రెండు ప్రధాన తెగలకు చెందిన ప్రజల మధ్య అల్లర్లు చెలరేగాయి. ఈ అల్లర్లల్లో ఇప్పటి వరకు 49 మంది మృత్యు వాత పడగా, మరో వంద మందికి పైగా గాయపడ్డారు. ఈ అల్లర్లు శనివారానికి రెండో రోజుకు చేరుకున్నాయి. దీనిపై ఆ దేశ అంతర్గత మంత్రిత్వ శాఖ ప్రతినిధి రెఖ్‌మాతిల్లో అక్మదేవ్ మాట్లాడుతూ అల్లర్లు చెలరేగిన అన్ని వీధులు మంటలు చెలరేగినట్టు చెప్పారు. పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉందన్నారు.
Source: Yahoo! Telugu: News | 12 Jun 2010 | 6:52 am

దమ్ముంటే తెలంగాణా ఇస్తామని పోటీకి దిగండి: తెరాస

దమ్ముంటే తెలంగాణా రాష్ట్రాని ఇస్తామని చెప్పి ఉపఎన్నికల్లో పోటీకి దిగాలని తెలంగాణా రాష్ట్ర సమితి కాంగ్రెస్ పార్టీకి సవాల్ విసిరింది. దీనిపై పీసీసీ చీఫ్ డీఎస్ స్పందిస్తూ ఉపఎన్నికల్లో ఏ నినాదంతో ప్రజల వద్దకు వెళ్లాలో తమకు తెలుసుననీ, ఒకరు తమకు చెప్పాల్సిన పని లేదన్నారు.
Source: Yahoo! Telugu: News | 12 Jun 2010 | 6:41 am

ఐదుగురు కూతుళ్ళను నరికి చంపిన కసాయి తండ్రి!

అనారోగ్యంతో బాధపడుతున్న కూతుళ్ళకు వైద్యం చేయించలేక ఓ కన్న తండ్రి వారిని పాశవికంగా నరికి చంపారు. ఇది మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని శహోర్ జిల్లా కనారియా గ్రామంలో చోటు చేసుకున్నట్టు శనివారం వెలుగులోకి వచ్చింది.
Source: Yahoo! Telugu: News | 12 Jun 2010 | 6:35 am

బొట్టుపెట్టి పాసులివ్వాలా...?: మీడియాపై మురళీమోహన్ చిందులు

జూన్ 13.. అంటే రేపు టాలీవుడ్ టి-20 క్రికెట్ మ్యాచ్ జరుగుబోతోంది. ఈ నేపధ్యంలో ప్రింట్ మీడియాకు చెందిన కొందరు పాత్రికేయులు మ్యాచ్ కవర్ చేయాడానికి తమకు పాసులివ్వాల్సిందిగా "మా" అధ్యక్షుడు మురళీమోహన్‌ను అడిగారట. అయితే దీనికి మురళీ మోహన్ సరిగా స్పందించకపోగా వారిపై చిందులేసినట్లు తెలిసింది. "మీకు బొట్టుపెట్టి పాసులివ్వాలా...? ఎప్పుడివ్వాలో మాకు తెలుసు..?" అంటూ చిర్రుబుర్రులాడినట్లు సమాచారం. దీంతో పాత్రికేయులు తీవ్ర అసంతృప్తిని తెలిపారు. మొన్నటివరకూ తమను పూర్తి స్థాయిలో ఉపయోగించుకుని ఇపుడు తన ఇష్టం వచ్చినట్లు మాట్లాడటంపై ధ్వజమెత్తుతున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 12 Jun 2010 | 6:19 am

బుద్ధిలేని మూర్ఖులే పోటీకి సిద్ధమంటున్నారు: కేసీఆర్

త్వరలో జరుగనున్న ఉప ఎన్నికల్లో కేంద్రంలోని యూపీఏ సర్కారుతో పాటు సమైక్యవాదుల దిమ్మదిరిగేలా ప్రజలు తీర్పు ఇస్తారని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర రావు జోస్యం చెప్పారు. కరీంనగర్‌లో ప్రజలు ఇప్పటికే ఉప ఎన్నికల కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారన్నారు.
Source: ఏపీ న్యూస్ | 12 Jun 2010 | 3:53 am

ప్రభుత్వాన్ని కాదు.. న్యాయ వ్యవస్థను నిందించాలి!

భోపాల్ గ్యాస్ లీకేజీ దుర్ఘటనపై కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడం మాని న్యాయ వ్యవస్థను నిందించాలని కేంద్ర న్యాయ శాఖామంత్రి వీరప్ప మొయిలీ మండిపడ్డారు. గ్యాస్ దుర్ఘటన కేసులో తుది తీర్పు వెలువడటంలో చోటు చేసుకున్న తీవ్ర జాప్యంతో పాటు యూనియన్ కార్బైడ్ కంపెనీ మాజీ సీఈఓ వారెన్ ఆండర్సన్ పేరు లేకపోవడానికి న్యాయ వ్యవస్థను తప్పుపట్టాలన్నారు.
Source: జాతీయ | 12 Jun 2010 | 3:28 am

ఎన్నికలకు ఎలా వెళతామో... డీఎస్‌నడగండి: వీహెచ్

ఆగస్టులో జరుగనున్న ఉపఎన్నికలకు ఎలా వెళతామోనన్న విషయాన్ని పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌ను అడగండని రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు చెప్పారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తరపున హైకమాండ్ డి.శ్రీనివాస్‌ను నియమించిందనీ, పార్టీకి సంబంధించిన ఏ నిర్ణయాన్నయినా ఆయనే ప్రకటిస్తారని వీహెచ్ తెలిపారు.
Source: ఏపీ న్యూస్ | 12 Jun 2010 | 1:55 am

ఉప ఎన్నికల సమరంపై తెలంగాణ ఐకాస నేతల చర్చలు!

త్వరలో జరుగనున్న ఉప ఎన్నికలపై తెలంగాణ ఐక్య కార్యాచరణ కమిటీ నేతలు శనివారం భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని ఏవీ కాలేజ్ ఆడిటోరియంలో జరుగుతున్న ఈ చర్చలకు ఐకాస కన్వీనర్ ఆచార్య కోదండరామ్ నేతృత్వం వహిస్తున్నారు. ఉప ఎన్నికల్లో అనుసరించాల్సి వ్యూహాలు, ఇతర పార్టీల పోటీ, రాజీనామా చేసిన అభ్యర్థులకే టిక్కెట్లు కేటాయింపు తదితర అంశాలపై చర్చించనున్నారు.
Source: ఏపీ న్యూస్ | 12 Jun 2010 | 1:52 am

రోశయ్యకు "సాక్షి" వ్యతిరేకం..? ఈనాడు అనుకూలం..?

ముఖ్యమంత్రి రోశయ్య గద్దెనెక్కిన తర్వాత సీన్ పూర్తిగా మారిపోయింది. పాలన సంగతేమోగానీ మీడియా ప్రవర్తనలో మాత్రం గణనీయమైన మార్పులు వచ్చినట్లు కనబడుతోంది.
Source: ఏపీ న్యూస్ | 12 Jun 2010 | 1:38 am

దమ్ముంటే తెలంగాణా ఇస్తామని పోటీకి దిగండి: తెరాస

దమ్ముంటే తెలంగాణా రాష్ట్రాని ఇస్తామని చెప్పి ఉపఎన్నికల్లో పోటీకి దిగాలని తెలంగాణా రాష్ట్ర సమితి కాంగ్రెస్ పార్టీకి సవాల్ విసిరింది. దీనిపై పీసీసీ చీఫ్ డీఎస్ స్పందిస్తూ ఉపఎన్నికల్లో ఏ నినాదంతో ప్రజల వద్దకు వెళ్లాలో తమకు తెలుసుననీ, ఒకరు తమకు చెప్పాల్సిన పని లేదన్నారు.
Source: ఏపీ న్యూస్ | 12 Jun 2010 | 1:12 am

ఐదుగురు కూతుళ్ళను నరికి చంపిన కసాయి తండ్రి!

అనారోగ్యంతో బాధపడుతున్న కూతుళ్ళకు వైద్యం చేయించలేక ఓ కన్న తండ్రి వారిని పాశవికంగా నరికి చంపారు. ఇది మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని శహోర్ జిల్లా కనారియా గ్రామంలో చోటు చేసుకున్నట్టు శనివారం వెలుగులోకి వచ్చింది.
Source: జాతీయ | 12 Jun 2010 | 1:05 am

రైల్వే ట్రాక్‌ను పేల్చి వేసిన ఎల్టీటీఈ అనుకూల శక్తులు!

తమిళనాడు రాష్ట్రంలో నిషేధిత ఎల్టీటీఈ తీవ్రవాద సంస్థ అనుకూల శక్తులు దుశ్చర్యలకు శ్రీకారం చుట్టాయి. తాజాగా విల్లుపురం జిల్లా పెరని రైల్వే స్టేషన్‌ వద్ద రైల్వే ట్రాక్‌ను పేల్చి వేశారు. దీంతో తిరుచ్చి-చెన్నయ్‌ల మధ్య నడిచే రాక్‌ఫోర్ట్ ఎక్స్‌ప్రెస్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. ఈ సంఘటన శనివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది.
Source: జాతీయ | 11 Jun 2010 | 11:50 pm

రాజీవ్ ఆదేశం మేరకు ఆండర్సన్ విడుదల: అలెగ్జాండర్

భోపాల్ గ్యాస్ దుర్ఘటనలో ప్రధాన నిందితుడిగా భావించే యూనియన్ కార్బైడ్ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ వారెన్ ఆండర్సన్ దేశం వదిలి పారిపోయేందుకు అప్పటి ప్రధాని రాజీవ్‌ గాంధే కారణమని ఆయన వద్ద ప్రిన్సిపల్ సెక్రటరీ పని చేసిన పీసీ.అలెగ్జాండర్ అభిప్రాయపడ్డారు. రాజీవ్ ఆదేశం మేరకు అప్పట్లో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న అర్జున్ సింగ్.. వారెన్‌ను సురక్షితంగా భోపాల్ నుంచి న్యూఢిల్లీకి పంపి అక్కడ నుంచి దేశం వదిలి వెళ్లిపోయేలా చేసి ఉంటారన్నారు.
Source: జాతీయ | 11 Jun 2010 | 10:55 pm

మధుకోడా అవినీతి కేసులపై సీబీఐ విచారణ: భాజపా

జార్ఖండ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మధుకోడాపై వచ్చిన కోట్లాది రూపాయల అవినీతి ఆరోపణలపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని ప్రధాన ప్రతిపక్షమైన భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేసింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మధుకోడా కోట్లాది రూపాయల కుంభకోణానికి పాల్పడినట్టు ఆరోపణలు వచ్చిన విషయం తెల్సిందే. దీనిపై ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ అధికారులు ఇప్పటికే పలు రకాల ఆధారాలను సేకరించారు.
Source: జాతీయ | 11 Jun 2010 | 10:30 pm

అనుష్క "పంచాక్షరి".. ఏం సాగదీతరా బాబూ...!!

కష్టపడ్డా దానికి తగిన ఫలితం ఉంటేనే ఆనందం. ఎంతో కష్టపడి చేసిన "పంచాక్షరి" కూడా అలానే ఉంది. దేవుడు - దెయ్యం, మంచి - చెడుల మధ్య జరిగే పోరాటాల నేపథ్యంలో వచ్చిన చిత్రమే పంచాక్షరి. అరుంధతి తర్వాత అనుష్క చేసిన ఈ పాత్రకు క్రేజ్ ఏర్పడింది. దానిని నాగార్జున మేకప్‌మేన్ చంద్ర వినియోగించుకుని నిర్మాతగా మారాడు. కాకపోతే ఈ సినిమా చూశాక అమ్మోరు గుర్తుకు వస్తుంది. అందులో సౌందర్యకు అమ్మవారు పూనికతో పలికించే రౌద్రం ఆకట్టుకుంది. కానీ పంచాక్షరిలో మాత్రం అనుష్క అంతటి రౌద్రాన్ని పలికించలేకపోయింది.
Source: Yahoo! Telugu: Entertainment | 11 Jun 2010 | 11:23 am

అల్లు అర్జున్‌కి హీరోయిన్ సహకరించకపోతే.. అంతేనట!!

సినిమా రంగంలో సహకారం ఎంతో అవసరం. ముఖ్యంగా హీరోయిన్లు హీరోలకు బాగా సహకరించాలి. లేదంటే అవకాశాలు ఎగిరిపోతాయ్. ప్రస్తుతం కుర్ర హీరోల హవా నడుస్తోంది. ప్రధానంగా అల్లు అర్జున్ తనకు కంఫర్టబుల్‌గా ఉండే నటిని ఎంపిక చేసుకుంటున్నట్లు భోగట్టా. "వేదం"లో కూడా దర్శకుడు ఎంపిక చేసినవారిని కాకుండా దీక్షా సేథ్ అనే అమ్మాయిని అల్లు అర్జునే సెలెక్ట్ చేశాడట. తాజాగా గీతాఆర్ట్స్‌లో రూపుదిద్దుకుంటోన్న "బద్రినాథ్"లో ముందుగా హన్సికను అనుకున్నారట. అయితే ఆమె పారితోషకం ఎక్కువ డిమాండ్ చేయడంతో షీనాను ఎంపిక చేసినట్లు తెలిసింది. షీనా మంచుమనోజ్ నటించిన బిందాస్‌లో నటించింది. వివి వినాయక్ దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ చిత్రంలో అవకాశం రావడం చాలా హ్యాపీగా ఫీలవుతున్నట్లు చెపుతోంది. హన్సిక కూడా మొదట్లో అలాగే ఫీలయ్యేది. దేశముదురులో సహకరించినంతగా తర్వాత సహకరించలేదని పారితోషికం డిమాండ్ అనే నెపంతో ఆమెను తప్పించినట్లు సమాచారం.
Source: Yahoo! Telugu: Entertainment | 11 Jun 2010 | 6:35 am

మక్కా మసీదు పేలుళ్ళలో హిందూ తీవ్రవాదుల హస్తం!

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని మక్కా మసీదులో జరిగిన బాంబు పేలుళ్ళ వెనుక హిందూ తీవ్రవాదుల హస్తం ఉన్నట్టు సీబీఐ ప్రాథమికంగా గుర్తించింది. అలాగే, ఆజ్మీర్‌లో జరిగిన పేలుళ్ళకు మక్కా మసీదు పేలుళ్ళకు సారూప్యత ఉందని సీబీఐ అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం నాంపల్లి కోర్టుకు నివేదికను సమర్పించింది.
Source: ఏపీ న్యూస్ | 11 Jun 2010 | 5:52 am

నమ్ముకున్న వారిని నట్టేట ముంచిన చిరు: హరికృష్ణ

తెలుగు చిత్ర సీమలో మెగాస్టార్‌గా ఓ వెలుగు వెలిగిన చిరంజీవి.. ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటుతో రాజకీయాల్లోకి ప్రవేశించిన తర్వాత ఉన్నది కాస్త పోగొట్టుకున్నారని తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ విమర్శించారు. ముఖ్యంగా, ఎన్నికల సమయంలో తనను నమ్ముకున్న వారిని చిరంజీవి నట్టేట ముంచారని ఆయన ఆరోహించారు.
Source: ఏపీ న్యూస్ | 11 Jun 2010 | 5:43 am

మీరు మాత్రం బరువు తగ్గొద్దు..!: నమిత హితవు!

నమిత తన గ్లామర్ రహస్యాన్ని వెల్లడించింది. భారీ శరీర ఆకృతులు కలిగిన నమిత.. వీటి కారణంగానే చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సంతరించుకుంది. ఈ ముద్దుగుమ్మ ఇటీవల విడుదలైన సింహా చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు మరిత దగ్గరైంది. పనిలోపనిగా.. ట్విట్టర్‌లో తన అకౌంట్‌ను ఓపెన్ చేసింది. ఇందులో తన బాడీ అందాల రహస్యాలను ఒక్కొక్కటిగా వివరిస్తోంది. తనకున్న భారీ పాలిండ్లు, శరీరాకృతి వల్లే గుర్తింపు వచ్చిందని చెప్పుకొచ్చిన ఈ భామ.. ఇటీవలి కాలంలో ఆ సైజులను తగ్గించుకుని బాగా సన్నబడ్డారు. అయితే, తన అభిమానులకు మాత్రం సన్నబడేందుకు ఎలాంటి ప్రయోగాలు చేయవద్దని చెపుతోంది. దేవుడిచ్చిన శరీరాకృతితోనే ఉండాలని కోరుతోంది. ఇందుకోసం తాను చెప్పే చిట్కాల కోసం తన పర్సనల్ ట్విట్టర్ అంకౌంట్‌ను ప్రతి రోజూ చూడాలని కోరుతోంది.
Source: Yahoo! Telugu: Entertainment | 11 Jun 2010 | 5:37 am

భోపాల్ దోషులను శిక్షించాల్సిందే: ఏబీ.బర్ధన్ డిమాండ్

భోపాల్ విష వాయువు లీకేజీ ప్రమాదానికి కారణభూతులుగా భావించే దోషులందరినీ శిక్షించాల్సిందేనని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి ఏబీ బర్ధన్ తెలిపారు. ఆయన శుక్రవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ దేశ పారిశ్రామిక రంగంలో జరిగిన అతిపెద్ద ప్రమాదంగా భోపాల్ గ్యాస్ లీకేజీ అని అయన చెప్పుకొచ్చారు.
Source: జాతీయ | 11 Jun 2010 | 5:01 am

మళ్ళీ రాజీనామా చేయరని నమ్మకమేంటి: దానం ప్రశ్న

తెలంగాణ ప్రాంతంలో జరిగే ఉప ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)కి చెందిన అభ్యర్థులు పోటీ చేసి గెలుపొందితే మళ్లీ రాజీనామా చేయరని నమ్మకమేమిటని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి దానం నాగేందర్ ప్రశ్నించారు. ఆయన శుక్రవారం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఒక్క కాంగ్రెస్ వల్లే సాధ్యమవుతుందన్నారు. ఇదే నినాదంతోనే తాము ఎన్నికల్లో పోటీ చేస్తామని ఆయన స్పష్టం చేశారు.
Source: ఏపీ న్యూస్ | 11 Jun 2010 | 4:33 am

అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టుపై టెర్రర్ గురి: భద్రత అప్రమత్తం!

గుజరాత్ రాష్ట్ర రాజధాని అహ్మాదాబాద్‌లోని సర్దార్ వల్లాభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంపై దాడులు చేసేందుకు తీవ్రవాదులు కుట్ర పన్నినట్టు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ హెచ్చరించింది. దీంతో ఎయిర్‌పోర్టులో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.
Source: జాతీయ | 11 Jun 2010 | 4:08 am

వాతావరణం చల్లబడితే అన్నీ నిరూపిస్తా: చిరంజీవి

తెలంగాణ ప్రాంత ప్రజల్లో తనపై ఉన్న అభిమానం ఏమాత్రం చెక్కు చెదరలేదని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి జోస్యం చెప్పారు. ఈ విషయం ఆ ప్రాంతంలో వాతావరణం చల్లబడిన తర్వాత నిరూపిస్తానన్నారు. ఆయన ఒక ప్రైవేట్టీవీ ఛానల్ ప్రతినిధితో మాట్లాడుతూ తెలంగాణ ప్రజల్లో రాష్ట్ర విభజన భావం లేదన్నారు. రాజకీయ నేతలే పదవుల కోసం ప్రత్యేక వాదన తెరపైకి తెచ్చారన్నారు.
Source: ఏపీ న్యూస్ | 11 Jun 2010 | 3:02 am

తెలంగాణ నేతల వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి అసహనం!

ఉప ఎన్నికల అంశంపై తెలంగాణ నేతలు చేస్తున్న వివిధ రకాల వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి కె.రోశయ్య ఒకింత అసహనం వ్యక్తం చేశారు. ఉప ఎన్నికల పోటీపై వ్యక్తిగత అభిప్రాయలు ఎలా ఉన్నప్పటికీ.. తుది నిర్ణయాన్ని మాత్రం అధిష్టానం దృష్టికి వదిలి పెట్టాలని ఆయన హితవు పలికారు.
Source: ఏపీ న్యూస్ | 11 Jun 2010 | 2:52 am