|
ముగిసిన స్పెక్ట్రమ్ వేలం: ప్రభుత్వానికి రూ.38,300 కోట్లుబ్రాడ్బాండ్ వైర్‌లెస్ యాక్సెస్ స్పెక్ట్రమ్ వేలం పాటలు శుక్రవారంతో ముగిశాయి. 16 రోజుల పాటు సాగిన ఈ వేలం పాటల ద్వారా ప్రభుత్వానికి 38,300 కోట్ల రూపాయలు సమకూరాయి. బీడబ్ల్యూఏ యాక్షన్ విజేతల వివరాలను టెలీ కమ్యూనికేషన్ శాఖ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.Source: Yahoo! Telugu: News | 11 Jun 2010 | 9:16 am రెహ్మాన్ చేపట్టనున్న "ది జర్నీ హోమ్ వరల్డ్ టూర్"ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ విజేత ఏఆర్.రెహ్మాన్ 'ది జర్నీ హోమ్ వరల్డ్ టూర్' ప్రారంభమైంది. శుక్రవారం నుంచి ప్రారంభమైన ఈ పర్యటన మొత్తం 45 రోజుల పాటు ఈ పర్యటన సాగనుంది. అమెరికాలోని న్యూజెర్సీ, వాషింగ్టన్ డీసీ, చికాగో, డెట్రాయిట్, శాన్‌ఫ్రాన్సిస్కో, లాస్ ఏంజెలీస్, అట్లాంటా, బ్రిటన్, హాలాండ్, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్, కెనడా, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో ఆయన పర్యటించనున్నారు.Source: Yahoo! Telugu: News | 11 Jun 2010 | 8:49 am వాతావరణం చల్లబడితే అన్నీ నిరూపిస్తా: చిరంజీవితెలంగాణ ప్రాంత ప్రజల్లో తనపై ఉన్న అభిమానం ఏమాత్రం చెక్కు చెదరలేదని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి జోస్యం చెప్పారు. ఈ విషయం ఆ ప్రాంతంలో వాతావరణం చల్లబడిన తర్వాత నిరూపిస్తానన్నారు. ఆయన ఒక ప్రైవేట్టీవీ ఛానల్ ప్రతినిధితో మాట్లాడుతూ తెలంగాణ ప్రజల్లో రాష్ట్ర విభజన భావం లేదన్నారు. రాజకీయ నేతలే పదవుల కోసం ప్రత్యేక వాదన తెరపైకి తెచ్చారన్నారు.Source: Yahoo! Telugu: News | 11 Jun 2010 | 8:31 am తెలంగాణ నేతల వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి అసహనం!ఉప ఎన్నికల అంశంపై తెలంగాణ నేతలు చేస్తున్న వివిధ రకాల వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి కె.రోశయ్య ఒకింత అసహనం వ్యక్తం చేశారు. ఉప ఎన్నికల పోటీపై వ్యక్తిగత అభిప్రాయలు ఎలా ఉన్నప్పటికీ.. తుది నిర్ణయాన్ని మాత్రం అధిష్టానం దృష్టికి వదిలి పెట్టాలని ఆయన హితవు పలికారు.Source: Yahoo! Telugu: News | 11 Jun 2010 | 8:22 am సరికొత్త టెక్నాలజీతో ఆపిల్ ఐఫోన్ - 4 విడుదలఅత్యాధునిక టెక్నాలజీతో ఆపిల్ కంపెనీ ఐఫోన్-4ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఇటీవల శాన్‌ఫ్రాన్సిస్కోలో జరిగిన ప్రపంచ డెవలపర్స్ కాన్ఫరెన్స్‌లో ఈ ఫోనును ఆవిష్కరించింది. ఈ హ్యాండ్‌సెట్ వీడియో కాల్స్, వీడియో కాన్ఫరెన్సింగ్‌లో కస్టమర్లకు సరికొత్త అనుభూతిని అందిస్తుందని ఈ సదస్సులో పాల్గొన్న మెజారిటీ ప్రతినిధులు అభిప్రాయపడ్డారు.Source: Yahoo! Telugu: News | 11 Jun 2010 | 7:38 am రిమ్స్ నుంచి 3జి వెర్షన్‌తో సరికొత్త పెర్ట్ ఫోన్బ్లాక్బెర్రీ స్మార్ట్ ఫోన్ల ఉత్పత్తి కంపెనీ రీసెర్చ్ ఇన్ మోషన్ (రిమ్) భారత మార్కెట్లోకి సరికొత్త 3జి వెర్షన్ పెర్ల్ మొబైల్ ఫోన్‌ను గురువారం మార్కెట్‌లోకి విడుదల చేసింది. దేశీయంగా పలు టెలికాం కంపెనీలు 3జి సర్వీసులను ప్రారంభించడానికి సన్నద్ధమవుతున్న నేపథ్యంలో ఈ అత్యాధునిక 3జి మొబైల్‌ను రిమ్ మార్కెట్లోకి ప్రవేశపెట్టడం గమనార్హం.Source: Yahoo! Telugu: News | 11 Jun 2010 | 7:37 am భోపాల్ ప్రమాదంపై అన్ని అంశాలపై పరిశీలన: అంబికాభోపాల్ గ్యాస్ లీకేజీ కేసు వ్యవహారంలో అన్ని అంశాలను పరిశీలిస్తామని కేంద్ర మంత్రి అంబికా సోనీ తెలిపారు. ఇందుకోసం మంత్రుల సాధికారికా బృందాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, ఈ బృందం అన్ని అంశాలు, కోణాలపై పరిశీలిస్తుందని ఆమె వెల్లడించారు.Source: Yahoo! Telugu: News | 11 Jun 2010 | 7:17 am విదేశీ స్టాక్ మార్కెట్ల ప్రభావం: లాభాల్లో సెన్సెక్స్!అంతర్జాతీయ స్టాక్ మార్కెట్ల ట్రేడింగ్ ఊపందుకోవడంతో బాంబే స్టాక్ మార్కెట్ లాభాలను ఆర్జిస్తోంది. ట్రేడింగ్ ప్రారంభం నుంచే పురోగమనం దిశగా ర్యాలీని కొనసాగిస్తున్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచి సెన్సెక్స్, మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో 156 పాయింట్లు లాభపడి, 17,078 మార్కును తాకింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచి నిఫ్టీ కూడా 50 పాయింట్లు బలపడి, 5,128 మార్కు వద్ద ర్యాలీని కొనసాగిస్తోంది.Source: Yahoo! Telugu: News | 11 Jun 2010 | 7:01 am కారు ప్రమాదంలో మండేలా ముని మనుమరాలు మృతిదక్షిణాఫ్రికాలో సాకర్ 2010 సమరం ఆరంభానికి ముందు ఒక విషాద సంఘటన చోటు చేసుకుంది. ఆ దేశ మాజీ అధ్యక్షుడు, నల్లజాతి సూరీడు నెల్సన్ మండేలా ముని మనుమరాలు కారు ప్రమాదంలో మృతి చెందింది. ఈమె వయస్సు 13 సంవత్సరాలు. సొవేటో నుంచి తన నివాసానికి తిరిగి వస్తుండగా ఈ కారు ప్రమాదం చోటు చేసుకుంది.Source: Yahoo! Telugu: News | 11 Jun 2010 | 6:59 am లాభాల్లో స్టాక్ మార్కెట్: సెన్సెక్స్ 205 పాయింట్ల వృద్ధి!వారాంతమైన శుక్రవారం బాంబే స్టాక్ మార్కెట్ లాభాలను నమోదు చేసుకుంటోంది. ట్రేడింగ్ ప్రారంభం నుంచే ఊపందుకున్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచి సెన్సెక్స్, ఉదయం 11.45 గంటల ప్రాంతంలో 205 పాయింట్లు లాభపడి, 17,127 పాయింట్ల మార్కును తాకింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచి నిఫ్టీ కూడా 58 పాయింట్లు పుంజుకుని, 5,137 పాయింట్ల వద్ద పయనిస్తోంది.Source: Yahoo! Telugu: News | 11 Jun 2010 | 6:53 am అల్లు అర్జున్‌కి హీరోయిన్ సహకరించకపోతే.. అంతేనట!!సినిమా రంగంలో సహకారం ఎంతో అవసరం. ముఖ్యంగా హీరోయిన్లు హీరోలకు బాగా సహకరించాలి. లేదంటే అవకాశాలు ఎగిరిపోతాయ్. ప్రస్తుతం కుర్ర హీరోల హవా నడుస్తోంది. ప్రధానంగా అల్లు అర్జున్ తనకు కంఫర్టబుల్‌గా ఉండే నటిని ఎంపిక చేసుకుంటున్నట్లు భోగట్టా. "వేదం"లో కూడా దర్శకుడు ఎంపిక చేసినవారిని కాకుండా దీక్షా సేథ్ అనే అమ్మాయిని అల్లు అర్జునే సెలెక్ట్ చేశాడట. తాజాగా గీతాఆర్ట్స్‌లో రూపుదిద్దుకుంటోన్న "బద్రినాథ్"లో ముందుగా హన్సికను అనుకున్నారట. అయితే ఆమె పారితోషకం ఎక్కువ డిమాండ్ చేయడంతో షీనాను ఎంపిక చేసినట్లు తెలిసింది. షీనా మంచుమనోజ్ నటించిన బిందాస్‌లో నటించింది. వివి వినాయక్ దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ చిత్రంలో అవకాశం రావడం చాలా హ్యాపీగా ఫీలవుతున్నట్లు చెపుతోంది. హన్సిక కూడా మొదట్లో అలాగే ఫీలయ్యేది. దేశముదురులో సహకరించినంతగా తర్వాత సహకరించలేదని పారితోషికం డిమాండ్ అనే నెపంతో ఆమెను తప్పించినట్లు సమాచారం.Source: Yahoo! Telugu: Entertainment | 11 Jun 2010 | 6:35 am మీరు మాత్రం బరువు తగ్గొద్దు..!: నమిత హితవు!నమిత తన గ్లామర్ రహస్యాన్ని వెల్లడించింది. భారీ శరీర ఆకృతులు కలిగిన నమిత.. వీటి కారణంగానే చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సంతరించుకుంది. ఈ ముద్దుగుమ్మ ఇటీవల విడుదలైన సింహా చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు మరిత దగ్గరైంది. పనిలోపనిగా.. ట్విట్టర్‌లో తన అకౌంట్‌ను ఓపెన్ చేసింది. ఇందులో తన బాడీ అందాల రహస్యాలను ఒక్కొక్కటిగా వివరిస్తోంది. తనకున్న భారీ పాలిండ్లు, శరీరాకృతి వల్లే గుర్తింపు వచ్చిందని చెప్పుకొచ్చిన ఈ భామ.. ఇటీవలి కాలంలో ఆ సైజులను తగ్గించుకుని బాగా సన్నబడ్డారు. అయితే, తన అభిమానులకు మాత్రం సన్నబడేందుకు ఎలాంటి ప్రయోగాలు చేయవద్దని చెపుతోంది. దేవుడిచ్చిన శరీరాకృతితోనే ఉండాలని కోరుతోంది. ఇందుకోసం తాను చెప్పే చిట్కాల కోసం తన పర్సనల్ ట్విట్టర్ అంకౌంట్‌ను ప్రతి రోజూ చూడాలని కోరుతోంది.Source: Yahoo! Telugu: Entertainment | 11 Jun 2010 | 5:37 am వాతావరణం చల్లబడితే అన్నీ నిరూపిస్తా: చిరంజీవితెలంగాణ ప్రాంత ప్రజల్లో తనపై ఉన్న అభిమానం ఏమాత్రం చెక్కు చెదరలేదని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి జోస్యం చెప్పారు. ఈ విషయం ఆ ప్రాంతంలో వాతావరణం చల్లబడిన తర్వాత నిరూపిస్తానన్నారు. ఆయన ఒక ప్రైవేట్టీవీ ఛానల్ ప్రతినిధితో మాట్లాడుతూ తెలంగాణ ప్రజల్లో రాష్ట్ర విభజన భావం లేదన్నారు. రాజకీయ నేతలే పదవుల కోసం ప్రత్యేక వాదన తెరపైకి తెచ్చారన్నారు.Source: ఏపీ న్యూస్ | 11 Jun 2010 | 3:02 am తెలంగాణ నేతల వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి అసహనం!ఉప ఎన్నికల అంశంపై తెలంగాణ నేతలు చేస్తున్న వివిధ రకాల వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి కె.రోశయ్య ఒకింత అసహనం వ్యక్తం చేశారు. ఉప ఎన్నికల పోటీపై వ్యక్తిగత అభిప్రాయలు ఎలా ఉన్నప్పటికీ.. తుది నిర్ణయాన్ని మాత్రం అధిష్టానం దృష్టికి వదిలి పెట్టాలని ఆయన హితవు పలికారు.Source: ఏపీ న్యూస్ | 11 Jun 2010 | 2:52 am భోపాల్ ప్రమాదంపై అన్ని అంశాలపై పరిశీలన: అంబికాభోపాల్ గ్యాస్ లీకేజీ కేసు వ్యవహారంలో అన్ని అంశాలను పరిశీలిస్తామని కేంద్ర మంత్రి అంబికా సోనీ తెలిపారు. ఇందుకోసం మంత్రుల సాధికారికా బృందాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, ఈ బృందం అన్ని అంశాలు, కోణాలపై పరిశీలిస్తుందని ఆమె వెల్లడించారు.Source: జాతీయ | 11 Jun 2010 | 1:47 am వారెన్ పరారీ వెనుక ఉన్న వ్యక్తి పేరు వెల్లడించాలి: చౌహాన్యూనియన్ కార్బైడ్ కార్పొరేషన్ ఛైర్మన్ వారెన్ ఆండర్సన్ దేశ విడిచి వెళ్లి పోయేందుకు సహకరించిన వ్యక్తి పేరును మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత అర్జున్ సింగ్ వెల్లడించాలని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన కాంగ్రెస్ వృద్ధ నేతకు లేఖ రాశారు.Source: జాతీయ | 10 Jun 2010 | 11:31 pm నేను మహా చెడ్డ గవర్నర్‌ను: ఈఎస్ఎల్ నరసింహన్నేను మహా చెడ్డ గవర్నర్‌ను. ఏ విషయం అంత సులభంగా మరచిపోను. మీరంతా గ్రామాలకు సర్పంచ్‌లు అయితే నేను రాష్ట్రానికి సర్పంచ్‌ను. ఈ మాటలు అన్నది ఎవరో కాదు. రాష్ట్ర ప్రథమ పౌరుడు, గవర్నర్ ఈఎస్.ఎల్.నరసింహన్.Source: ఏపీ న్యూస్ | 10 Jun 2010 | 11:22 pm 2014 నాటికి నాయకత్వ మార్పు తథ్యం: నేదురుమల్లివచ్చే 2014 నాటికి రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకత్వ మార్పు తథ్యమని మాజీ ముఖ్యమంత్రి, రాజ్యసభ సభ్యుడు నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి జోస్యం చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ హఠాన్మరణం తర్వాత పార్టీ బలహీన పడిన మాట వాస్తవమేనన్నారు. అయితే, ప్రస్తుత సమయానికి రోశయ్య తగిన సమర్థవంతమైన వ్యక్తి అని రోశయ్య కితాబిచ్చారు.Source: ఏపీ న్యూస్ | 10 Jun 2010 | 11:05 pm వారెన్ ఆండర్సన్ వ్యవహారం: కాంగ్రెస్‌పై విమర్శల బాణాలు!భోపాల్ విష వాయువు గ్యాస్ లీకేజీ ప్రమాదానికి ప్రధాన కారకుడిగా భావిస్తున్న యూనియన్ కార్బైడ్ సంస్థ మాజీ ఛైర్మన్ వారెన్ ఆండర్సన్ దేశం నుంచి తప్పించుకుని పోయిన వ్యవహారంలో అధికార కాంగ్రెస్ పార్టీ ఇంటా.. బయటా తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొంటోంది.Source: జాతీయ | 10 Jun 2010 | 10:26 pm రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన 30 మంది సభ్యులు!రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల్లో వివిధ రాష్ట్రాల నుంచి పోటీ చేసిన 30 మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికలకు నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం గురువారంతో ముగిసింది. దీంతో ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులంతా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే, వీరి ఎన్నికను ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.Source: జాతీయ | 10 Jun 2010 | 10:06 pm కొత్త హీరోకు ముద్దు రుచి చూపించిన మీరాజాస్మిన్మీరా జాస్మిన్ కూడా ప్రేక్షకుల్లో వేడి పుట్టించే పనిలో పడింది. తాజాగా ఓ తమిళ చిత్రంలో లిప్ టు లిప్ ముద్దు సన్నివేశంలో నటించింది. పైగా ఈ ముద్దును కమల్ హాసన్ లాంటి హీరోకు కాకుండా అప్పుడే చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టిన హీరోకి ఇచ్చిందట. ఇంకేం సదరు కుర్ర హీరో గాల్లో తేలిపోతున్నాడట. ఎక్కడపడితే అక్కడ మీరా జాస్మిన్ ముద్దు సంగతిని పూసగుచ్చినట్లు చెప్పడమే కాక సినిమాలో ఆ ముద్దును చూడండని ప్రచారం చేస్తున్నాడట. ఈ వార్త ఆ చెవికీ.. ఈ చెవికీ చేరి చివరికి మీరా జాస్మిన్ చెవిన పడిందట. దీంతో మీరాజాస్మిన్ సదరు చిత్ర దర్శకుడిని కలిసి షూటింగ్‌లో చిత్రీకరించిన ముద్దు సన్నివేశాన్ని కుదించి చూపాలని కోరిందట. కానీ దర్శకుడు మాత్రం ఆ ముద్దు చాలా బాగా వచ్చింది మేడం.. ఇప్పటివరకూ అటువంటి జీవమున్న ముద్దు సన్నివేశాన్ని తాను చూడలేదని పొగడ్తల వర్షం కురిపిస్తున్నాడట. ఆ పొగడ్తలతో మీరా "ఐస్" అయిపోయిందట.Source: Yahoo! Telugu: Entertainment | 10 Jun 2010 | 3:09 pm "పరమవీరచక్ర" డ్రెస్ అదిరింది.. పోస్టరూ అదిరింది...బాలకృష్ణ 50వ పుట్టినరోజు వేడుకతోపాటు దాసరి నారాయణరావు "పరమవీరచక్ర" సినిమా ప్రారంభోత్సవం కూడా మొదలైంది. ఈ కార్యక్రమంలో బాలయ్య మెరిసేటి దుస్తుల్లో తళతళలాడారు. దీంతోపాటే ఆయన వెనుక ఉన్న "పరమవీరచక్ర" సైనికుడి గెటప్ కూడా "సింహా" మీసకట్టుతో అలరించింది. అయితే సింహా అవతారాన్నే పరమవీరచక్రలో కూడా దాసరి నారాయణరావు ఫాలో అవుతారా...? అనే మాటలు ఆ పోస్టరు చూసినవారు అనుకోవడం వినిపించింది. ఏదేమైనా పరమవీరచక్ర లాంఛింగ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు, నందమూరి కుటుంబం, ఆ కుటుంబం అభిమానుల సమక్షంలో అదిరిపోయింది.Source: Yahoo! Telugu: Entertainment | 10 Jun 2010 | 1:02 pm సత్యరాజ్ "పెరియార్ రామస్వామి నాయకర్"సామాజిక న్యాయంకోసం నిరంతర పోరాటం చేసిన గొప్ప రాజకీయ నాయకుడు పెరియార్ రామస్వామి. ఆయన జీవిత చరిత్రతో తమిళంలో రూపొందిన పెరియార్ చిత్రాన్ని "పెరియార్ రామస్వామి నాయకర్" పేరుతో నాగ్ ఎంటర్‌ప్రైజెస్ పతాకంపై నిర్మాత సునీల్. పి తెలుగులోకి అనువదిస్తున్నారు. దాదాపు 300 చిత్రాలకు డబ్బింగ్ చెప్పిన ప్రముఖ డబ్బింగ్ కళాకారుడు రవిశంకర్ ఈ చిత్రానికి డబ్బింగ్ చెప్పారు. ఈ సందర్భంగా రవిశంకర్ మాట్లాడుతూ... డాక్టర్ అంబేద్కర్ చిత్రం తర్వాత పెరియార్ రామస్వామి నాయకర్ డబ్బింగ్ ఆర్టిస్టుగా నాకు మంచి పేరు తెస్తుంది. శంకర్ దాదా ఎంబీబీఎస్, విక్రమార్కుడు, పోకిరి, అరుంధతిలాంటి కొన్ని చిత్రాలే నాకు జాబ్ శాటిస్‌ఫ్యాక్షన్ ఇచ్చాయి. ఈ పెరియార్ రామస్వామి నాయకర్ చిత్రం కూడా ఆ కోవలోకి చేరుతుంది అన్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 10 Jun 2010 | 12:39 pm ఇకపై ఓదార్పు కాదు.. పరామర్శ యాత్ర: వైఎస్.జగన్కడప ఎంపీ వైఎస్.జగన్మోహన్ రెడ్డి పంథాలో మార్పు వచ్చింది. ఆయన తన తనదైన శైలిలో ముందుకు సాగాలని నిర్ణయించుకున్నారు. ఒక వైపు అధిష్టానం మాటను గౌరవిస్తూనే మరోవైవు.. తాను తలపెట్టిన యాత్రను యధావిధిగా కొనసాగించాలని గట్టి పట్టుదలతో ఉన్నారు.Source: ఏపీ న్యూస్ | 10 Jun 2010 | 7:41 am ప్రేక్షకుల మైండ్ సెట్ సరిగ్గా లేదు: "ఆర్య" సుకుమార్యువతను కొత్త మార్గంలో చూపిస్తున్నట్లు ఆర్య సినిమా ద్వారా ప్రేక్షకులకు సందేశాన్ని పంపిన దర్శకుడు సుకుమార్. అప్పట్లో ఆర్య హిట్ అయితే యూత్ బాగా మారిపోయారనీ అందుకే అంతటి హిట్ వచ్చిందన్న స్టేట్‌మెంట్ ఇచ్చాడు. అయితే తాజాగా ప్లేట్ ఫిరాయించాడు. జగడం, ఆర్య-2 చిత్రాలు బాక్సాఫీసు వద్ద మోకాళ్లు చీరుకుపోతూ బోర్లా పడటంతో ప్రేక్షకుల మీద మండి పడుతున్నాడు. ఎలాగోలా తిరిగి గీతా ఆర్ట్స్‌లో నాగచైతన్యతో మరో చిత్రానికి సిద్ధమయ్యాడు. రెండు ఫ్లాప్‌ల తర్వాత మళ్లీ ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు..? ఫ్లాప్‌లకు కారణం ఏమిటని భావిస్తున్నారు...? అని అడిగితే.. ప్రతి సినిమా హిట్ కావాలనే తీస్తాం. పోతే చేసేదేముంది అన్నాడు. మీ అంచనాలకు ప్రేక్షకులు రీచ్ కాలేదా...? అని ప్రశ్నిస్తే... నేను తీసింది కరక్టే. ప్రేక్షకులే మారాలి. వారు మారకపోతే ఏం చేస్తాం... అంటూ స్పందించారు.Source: Yahoo! Telugu: Entertainment | 10 Jun 2010 | 5:55 am అభిమానం డబ్బిచ్చి కొంటే రాదు: నందమూరి బాలకృష్ణతమ కుటుంబ పట్ల కోట్లాది మంది ప్రజలు చూపిస్తున్న అభిమానం డబ్బిచ్చి కొంటే వచ్చింది కాదని, ప్రజల హృదయాల్లో నుంచి పెల్లుబికి వచ్చిందని నందమూరి బాలకృష్ణ అన్నారు. తన తండ్రి స్వర్గీయ ఎన్టీఆర్ తనకు అభిమానులను వారసులుగా ఇచ్చి వెళ్లారని గుర్తు చేశారు.Source: Yahoo! Telugu: Entertainment | 10 Jun 2010 | 5:53 am భారత్‌లో శాంతికి విఘాతం కలిగిస్తున్న ఘర్షణలు!భారత్‌లో నెలకొన్న అంతర్గత ఘర్షణలు ఆ దేశ శాంతికి విఘాతం కలిగిస్తున్నట్టు ప్రపంచ శాంతి సూచి (జీపీఐ) పట్టిక వెల్లడించింది. ఫలితంగా జీపీఐలో భారత్ 128 స్థానంలో నిలిచింది. అంతేకాకుండా, ఉగ్రవాదం, మానవ హక్కుల ఉల్లంఘన కూడా నానాటికీ పెరుగుతున్నట్టు ఈ పత్రిక పేర్కొంది.Source: జాతీయ | 10 Jun 2010 | 5:18 am ముఖ్యమంత్రి రోశయ్య వ్యాఖ్యలు సిగ్గుచేటు: చంద్రబాబుడబ్బులు ఎక్కువైనందు వల్లే ప్రజలు మద్యాన్ని సేవిస్తున్నారని ముఖ్యమంత్రి కె.రోశయ్య స్థాయి నేత వ్యాఖ్యానించడం సిగ్గుచేటన్నారు. ఈయన కంటే ముందుగా మంత్రులు బాధ్యతారహితంగా నడుచుకోవడం అంతకంటే బాధాకరమన్నారు.Source: ఏపీ న్యూస్ | 10 Jun 2010 | 4:19 am జగన్‌పై కక్షకట్టి మీడియా తప్పుడు ప్రచారం: కేశవరావుకడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డిపై రాష్ట్ర మీడియా కక్ష కట్టిందని రాజ్యసభ సభ్యుడు, సీడబ్ల్యూసీ సభ్యుడు కె.కేశవరావు ఆరోపించారు. జగన్‌ను బ్లాక్ మెయిల్ చేస్తూ.. రోజుకో కొత్త కథనంతో పత్రికలు పాఠకులను ఆకర్షిస్తున్నాయన్నారు.Source: ఏపీ న్యూస్ | 10 Jun 2010 | 4:11 am శస్త్ర చికిత్స తర్వాత కోలుకుంటున్న శరద్ పవార్చిన్నపాటి శస్త్ర చికిత్స తర్వాత కేంద్ర వ్యవసాయ శాఖామంత్రి శరద్ పవార్ నెమ్మదిగా కోలుకుంటున్నారు. ఆయన మరో రెండు రోజుల పాటు ఆస్పత్రిలో వైద్యుల పర్యవేక్షణలోనే ఉంటారని వైద్యులు వెల్లడించారు. నోటి కేన్సర్‌తో బాధపడుతున్న పవార్‌కు తాజాగా మరో శస్త్ర చికిత్స చేశారు. ఈ ఆపరేషన్ ముంబైలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో బుధవారం విజయవంతంగా పూర్తి చేశారు. ఈ ఆపరేషన్‌కు సుమారు గంట సమయం వరకు పట్టింది.Source: జాతీయ | 10 Jun 2010 | 3:40 am వారెన్ ఆండర్సన్ పరారీకి అర్జున్ సింగ్ సహకారం!భోపాల్ విషవాయువు లీకేజీ ప్రమాదానికి ప్రధాన కారకుడైన యూనియన్ కార్బైడ్ లిమిటెడ్ కంపెనీ ఛైర్మన్ వారెన్ ఆండర్సన్ దేశం నుంచి తప్పించుకుని పోవడానికి అప్పటి మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అర్జున్ సింగే కారణమని ఆ రాష్ట్ర ఏవియేషన్ మాజీ డైరక్టర్ తాజాగా ఆరోపించారు. వారెన్ దేశం నుంచి తప్పించుకుని పోయేలా చూడాల్సిందిగా అర్జున్ సింగ్ కోరారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.Source: జాతీయ | 10 Jun 2010 | 2:31 am
|