|
వన్ స్టాప్ షాప్ రీటైల్స్‌ను ఏర్పాటు చేసిన ఎల్ఐసీదేశంలో అతిపెద్ద ప్రభుత్వ బీమా రంగ సంస్థ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) తన ఖాతాదారుల నుంచి ప్రీమియం మొత్తాన్ని వసూలు చేసేందుకు వీలుగా ఒన్ స్టాఫ్ షాప్‌ను ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం ఒన్ స్టాఫ్ షాప్ రీటైల్స్ సంస్థను ఎల్ఐసీ సంప్రదించింది. ఎల్ఐసీలో సుమారు 25 లక్ష మంది ఖాతాదారులు వివిధ రకాల బీమా పాలసీలను పొందివున్నారు. వీరి నుంచి ప్రీమియం రూపంలో కోట్లాది రూపాయలు వసూలవుతోంది. ఈ ప్రీమియంను వసూలు చేసేందుకు, ఖాతాదారులకు సౌలభ్యంగా ఉండేందుకు గాను వీటిని ఏర్పాటు చేస్తున్నారు.Source: Yahoo! Telugu: News | 10 Jun 2010 | 9:24 am లాభాల్లో స్టాక్ మార్కెట్: సెన్సెక్స్, నిఫ్టీల వృద్ధి!దేశీయ వాటాల ట్రేడింగ్ పుంజుకోవడంతో బాంబే స్టాక్ మార్కెట్ లాభాలను నమోదు చేసుకుంటోంది. ట్రేడింగ్ ప్రారంభం నుంచే ఊపందుకున్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచి సెన్సెక్స్, మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో 109 పాయింట్లు బలపడింది. దీంతో సెన్సెక్స్ సూచి, 16,767 పాయింట్ల మార్కును తాకింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 25 పాయింట్ల స్వల్ప లాభంతో ఐదువేల మార్కు వద్ద ర్యాలీని కొనసాగిస్తోంది.Source: Yahoo! Telugu: News | 10 Jun 2010 | 9:12 am శస్త్ర చికిత్స తర్వాత కోలుకుంటున్న శరద్ పవార్చిన్నపాటి శస్త్ర చికిత్స తర్వాత కేంద్ర వ్యవసాయ శాఖామంత్రి శరద్ పవార్ నెమ్మదిగా కోలుకుంటున్నారు. ఆయన మరో రెండు రోజుల పాటు ఆస్పత్రిలో వైద్యుల పర్యవేక్షణలోనే ఉంటారని వైద్యులు వెల్లడించారు. నోటి కేన్సర్‌తో బాధపడుతున్న పవార్‌కు తాజాగా మరో శస్త్ర చికిత్స చేశారు. ఈ ఆపరేషన్ ముంబైలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో బుధవారం విజయవంతంగా పూర్తి చేశారు. ఈ ఆపరేషన్‌కు సుమారు గంట సమయం వరకు పట్టింది.Source: Yahoo! Telugu: News | 10 Jun 2010 | 9:10 am అమెరికాలో పెరుగుతున్న భారతీయుల సంఖ్య!అమెరికాలో నివశించే భారతీయుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ప్రస్తుతం అమెరికా గడ్డ 1.6 మిలియన్ల భారతీయులకు ఆవాసం ఇస్తోంది. అమెరికాలో నివశిస్తున్న వారిలో భారతీయులు మూడో స్థానాన్ని ఆక్రమించింది. వాషింగ్టన్ కేంద్రంగా పని చేసే థిక్ టాంక్ సర్వే నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. మెక్సికన్లు, ఫిలిప్పైన్ల తర్వాత భారతీయులు ఉన్నారు.Source: Yahoo! Telugu: News | 10 Jun 2010 | 9:00 am పుంజుకున్న ట్రేడింగ్: లాభాల్లో స్టాక్ మార్కెట్దేశీయ వాటాల ట్రేడింగ్ పుంజుకోవడంతో బాంబే స్టాక్ మార్కెట్ లాభాలను ఆర్జిస్తోంది. ట్రేడింగ్ ప్రారంభం నుంచే ఊపందుకున్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచి సెన్సెక్స్ ఉదయం 11 గంటల ప్రాంతంలో వృద్ధి చెందింది. రియాల్టీ, ఆటో, హెల్త్‌కేర్ వాటాల ట్రేడింగ్ పుంజుకోవడం ద్వారా బాంబే స్టాక్ మార్కెట్ లాభాలను నమోదు చేసుకుంటోంది.Source: Yahoo! Telugu: News | 10 Jun 2010 | 8:29 am వారెన్ ఆండర్సన్ పరారీకి అర్జున్ సింగ్ సహకారం!భోపాల్ విషవాయువు లీకేజీ ప్రమాదానికి ప్రధాన కారకుడైన యూనియన్ కార్బైడ్ లిమిటెడ్ కంపెనీ ఛైర్మన్ వారెన్ ఆండర్సన్ దేశం నుంచి తప్పించుకుని పోవడానికి అప్పటి మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అర్జున్ సింగే కారణమని ఆ రాష్ట్ర ఏవియేషన్ మాజీ డైరక్టర్ తాజాగా ఆరోపించారు. వారెన్ దేశం నుంచి తప్పించుకుని పోయేలా చూడాల్సిందిగా అర్జున్ సింగ్ కోరారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.Source: Yahoo! Telugu: News | 10 Jun 2010 | 8:00 am వారెన్ ఆండర్సన్ అప్పంగింతను తోసిపుచ్చిన అమెరికాభోపాల్ గ్యాస్ లీకేజీ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్ మాజీ ఛైర్మన్ వారెన్ ఆండర్సన్‌ను అప్పగించే ప్రసక్తే లేదని అమెరికా తేల్చి చెప్పింది. ఈ మేరకు కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖకు అమెరికా సమాచారం పంపించింది.Source: Yahoo! Telugu: News | 10 Jun 2010 | 7:40 am చిరూ.. కాంగ్రెస్‌తో ఎలా పొత్తు పెట్టుకుంటావ్: నాగం ప్రశ్నప్రజారాజ్యం పార్టీ-కాంగ్రెస్ పార్టీల పొత్తుపై తెలుగుదేశం పార్టీ నేతలు మండిపడుతున్నారు. ఈ రెండు పార్టీల మధ్య ఏర్పడిన పొత్తు అవగాహన అనైతికమైనదిగా ఆ పార్టీ సీనియర్ నేత నాగం జనార్ధన్ అభివర్ణించారు. కరుడుగట్టిన సమైక్యవాది అయిన చిరంజీవి.. ద్వంద వైఖరిని అవలంభిస్తున్న కాంగ్రెస్‌తో ఎలా పొత్తు పెట్టుకుంటారని ఆయన ప్రశ్నించారు.Source: Yahoo! Telugu: News | 10 Jun 2010 | 7:20 am ఊత కర్రగా ఉంటే తప్పేంటి: చిరంజీవి సూటి ప్రశ్న!కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వంతో పాటు రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారు పలు మంచి కార్యక్రమాలను చేపడుతోందని, అలాంటి ప్రభుత్వాలకు ఊత కర్రగా ఉంటే తప్పేంటని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి ప్రశ్నించారు. ఆయన గురువారం న్యూఢిల్లీలో ఒక ప్రైవేటు టీవీ ఛానల్‌తో మాట్లాడారు. రాష్ట్ర భవిష్యత్ ఇక సంకీర్ణ సర్కార్ల మయం కానుందని ఆయన జోస్యం చెప్పారు. ఏక పార్టీ ప్రభుత్వాలు ఏర్పాటు కావడం అసాధ్యమన్నారు.Source: Yahoo! Telugu: News | 10 Jun 2010 | 7:10 am స్టాక్ మార్కెట్: సెన్సెక్స్ 105 పాయింట్ల వృద్ధి!బాంబే స్టాక్ మార్కెట్ లాభాల బాటలో కొనసాగుతోంది. ట్రేడింగ్ ప్రారంభం నుంచి ఊపందుకున్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచి సెన్సెక్స్, ఉదయం 10.30 గంటల ప్రాంతంలో 105 పాయింట్లు లాభపడింది. దీంతో సెన్సెక్స్ సూచి 16,763 పాయింట్ల మార్కును తాకింది. ఇదేవిధంగా నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచి నిఫ్టీ కూడా 31 పాయింట్లు పుంజుకుని, 5,031 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.Source: Yahoo! Telugu: News | 10 Jun 2010 | 6:44 am ప్రేక్షకుల మైండ్ సెట్ సరిగ్గా లేదు: "ఆర్య" సుకుమార్యువతను కొత్త మార్గంలో చూపిస్తున్నట్లు ఆర్య సినిమా ద్వారా ప్రేక్షకులకు సందేశాన్ని పంపిన దర్శకుడు సుకుమార్. అప్పట్లో ఆర్య హిట్ అయితే యూత్ బాగా మారిపోయారనీ అందుకే అంతటి హిట్ వచ్చిందన్న స్టేట్‌మెంట్ ఇచ్చాడు. అయితే తాజాగా ప్లేట్ ఫిరాయించాడు. జగడం, ఆర్య-2 చిత్రాలు బాక్సాఫీసు వద్ద మోకాళ్లు చీరుకుపోతూ బోర్లా పడటంతో ప్రేక్షకుల మీద మండి పడుతున్నాడు. ఎలాగోలా తిరిగి గీతా ఆర్ట్స్‌లో నాగచైతన్యతో మరో చిత్రానికి సిద్ధమయ్యాడు. రెండు ఫ్లాప్‌ల తర్వాత మళ్లీ ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు..? ఫ్లాప్‌లకు కారణం ఏమిటని భావిస్తున్నారు...? అని అడిగితే.. ప్రతి సినిమా హిట్ కావాలనే తీస్తాం. పోతే చేసేదేముంది అన్నాడు. మీ అంచనాలకు ప్రేక్షకులు రీచ్ కాలేదా...? అని ప్రశ్నిస్తే... నేను తీసింది కరక్టే. ప్రేక్షకులే మారాలి. వారు మారకపోతే ఏం చేస్తాం... అంటూ స్పందించారు.Source: Yahoo! Telugu: Entertainment | 10 Jun 2010 | 5:55 am అభిమానం డబ్బిచ్చి కొంటే రాదు: నందమూరి బాలకృష్ణతమ కుటుంబ పట్ల కోట్లాది మంది ప్రజలు చూపిస్తున్న అభిమానం డబ్బిచ్చి కొంటే వచ్చింది కాదని, ప్రజల హృదయాల్లో నుంచి పెల్లుబికి వచ్చిందని నందమూరి బాలకృష్ణ అన్నారు. తన తండ్రి స్వర్గీయ ఎన్టీఆర్ తనకు అభిమానులను వారసులుగా ఇచ్చి వెళ్లారని గుర్తు చేశారు.Source: Yahoo! Telugu: Entertainment | 10 Jun 2010 | 5:53 am శస్త్ర చికిత్స తర్వాత కోలుకుంటున్న శరద్ పవార్చిన్నపాటి శస్త్ర చికిత్స తర్వాత కేంద్ర వ్యవసాయ శాఖామంత్రి శరద్ పవార్ నెమ్మదిగా కోలుకుంటున్నారు. ఆయన మరో రెండు రోజుల పాటు ఆస్పత్రిలో వైద్యుల పర్యవేక్షణలోనే ఉంటారని వైద్యులు వెల్లడించారు. నోటి కేన్సర్‌తో బాధపడుతున్న పవార్‌కు తాజాగా మరో శస్త్ర చికిత్స చేశారు. ఈ ఆపరేషన్ ముంబైలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో బుధవారం విజయవంతంగా పూర్తి చేశారు. ఈ ఆపరేషన్‌కు సుమారు గంట సమయం వరకు పట్టింది.Source: జాతీయ | 10 Jun 2010 | 3:40 am వారెన్ ఆండర్సన్ పరారీకి అర్జున్ సింగ్ సహకారం!భోపాల్ విషవాయువు లీకేజీ ప్రమాదానికి ప్రధాన కారకుడైన యూనియన్ కార్బైడ్ లిమిటెడ్ కంపెనీ ఛైర్మన్ వారెన్ ఆండర్సన్ దేశం నుంచి తప్పించుకుని పోవడానికి అప్పటి మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అర్జున్ సింగే కారణమని ఆ రాష్ట్ర ఏవియేషన్ మాజీ డైరక్టర్ తాజాగా ఆరోపించారు. వారెన్ దేశం నుంచి తప్పించుకుని పోయేలా చూడాల్సిందిగా అర్జున్ సింగ్ కోరారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.Source: జాతీయ | 10 Jun 2010 | 2:31 am చిరూ.. కాంగ్రెస్‌తో ఎలా పొత్తు పెట్టుకుంటావ్: నాగం ప్రశ్నప్రజారాజ్యం పార్టీ-కాంగ్రెస్ పార్టీల పొత్తుపై తెలుగుదేశం పార్టీ నేతలు మండిపడుతున్నారు. ఈ రెండు పార్టీల మధ్య ఏర్పడిన పొత్తు అవగాహన అనైతికమైనదిగా ఆ పార్టీ సీనియర్ నేత నాగం జనార్ధన్ అభివర్ణించారు. కరుడుగట్టిన సమైక్యవాది అయిన చిరంజీవి.. ద్వంద వైఖరిని అవలంభిస్తున్న కాంగ్రెస్‌తో ఎలా పొత్తు పెట్టుకుంటారని ఆయన ప్రశ్నించారు.Source: ఏపీ న్యూస్ | 10 Jun 2010 | 1:51 am ఊత కర్రగా ఉంటే తప్పేంటి: చిరంజీవి సూటి ప్రశ్న!కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వంతో పాటు రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారు పలు మంచి కార్యక్రమాలను చేపడుతోందని, అలాంటి ప్రభుత్వాలకు ఊత కర్రగా ఉంటే తప్పేంటని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి ప్రశ్నించారు. ఆయన గురువారం న్యూఢిల్లీలో ఒక ప్రైవేటు టీవీ ఛానల్‌తో మాట్లాడారు. రాష్ట్ర భవిష్యత్ ఇక సంకీర్ణ సర్కార్ల మయం కానుందని ఆయన జోస్యం చెప్పారు. ఏక పార్టీ ప్రభుత్వాలు ఏర్పాటు కావడం అసాధ్యమన్నారు.Source: ఏపీ న్యూస్ | 10 Jun 2010 | 1:41 am 'పరమ వీర చక్ర' సాక్షిగా నందమూరి హీరోల్లో విభేదాలు!?నందమూరి కుటుంబ హీరోల మధ్య విభేదాలు ఉన్నాయా? ఉన్నాయనే అంటున్నాయి ఫిలిమ్ నగర్ వర్గాలు. ఇవి బాలకృష్ణ కొత్త చిత్రం పరమ వీర చక్ర సాక్షిగా బయటపడ్డాయి. బాలకృష్ణ 50వ పుట్టిన రోజు వేడుకలతో పాటు కొత్త చిత్రం పరమ వీర చక్ర ప్రారంభోత్సవ వేడుకలు గురువారం హైదరాబాద్‌లో జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు హాజరయ్యారు.Source: ఏపీ న్యూస్ | 10 Jun 2010 | 12:39 am నక్సల్స్‌పై సైనిక ప్రయోగం: సీసీఎస్ భేటీలో నిర్ణయం!దేశ అంతర్గత భద్రతకు పెను ముప్పుగా పరిణమించిన మావోయిస్టులను అణిచి వేసేందుకు ఆర్మీని రంగంలోకి దింపానే అంశంపై గురువారం జరిగే భద్రతా వ్యవరాహాల కేంద్ర కేబినెట్‌లో తుది నిర్ణయం తీసుకోనుంది. ఈ సమావేశం ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ అధ్యక్షతన జరుగనుంది. ఈ సమావేశంలో నక్సల్స్ దుశ్యర్యలపై కేంద్ర హోం మంత్రి చిదంబరం ప్రత్యేకంగా వివరించి, సైన్యం ప్రయోగానికి గల కాణాలను ఆయన వివరించే అవకాశం ఉంది.Source: జాతీయ | 9 Jun 2010 | 11:56 pm ఈ దఫాకు పోటీకి దూరంగా ఉందాం: చిరుకు నేతలు!తెలంగాణ ఉప ఎన్నికల సమరంపై ప్రజారాజ్యం పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సమైక్యాంధ్రకు కట్టుబడి ముందుకు సాగుతున్నందున ఉప ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండటం ఎంతైనా మంచిదని పలువురు నేతలు అభిప్రాయపడుతున్నారు. ఇంకొందరు మాత్రం తెలంగాణవాదంపై జరుగుతున్న ఎన్నికలైనందున అనుకూలమైన పార్టీకి మద్దతు ఇవ్వడం మంచిగా ఉంటుందన్నారు.Source: ఏపీ న్యూస్ | 9 Jun 2010 | 10:52 pm భారత్-శ్రీలంక దేశాల మధ్య ఏడు ఒప్పందాలు ఖరారు!భారత్ - శ్రీలంక దేశాల మధ్య ఏడు ఒప్పందాలను ఖరారయ్యాయి. ఈమేరకు ఒప్పంద పత్రాలపై ఇరు దేశాల ప్రతినిధులు సంతకాలు చేశారు. శ్రీలంక అధ్యక్షుడు మహీందా రాజపక్సే భారత్‌లో పర్యటిస్తున్న విషయం తెల్సిందే. ఈ పర్యటన సందర్భంగా ఇరు దేశాలు ఏడు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశాయి.Source: జాతీయ | 9 Jun 2010 | 10:24 pm భోపాల్ తీర్పుపై అప్పీలు చేస్తాం: సీఎం శివరాజ్ చౌహాన్భోపాల్ గ్యాస్ లీకేజీ ప్రమాదంలో స్థానిక కోర్టు ఇచ్చిన తీర్పుపై పై కోర్టులో అప్పీలు చేయనున్నట్టు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఈ తీర్పు చాలా నిరాశా జనకంగా ఉందని అందువల్ల పైకోర్టులో అప్పీల్ చేయాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిపారు. ఇందుకు సంబంధించిన న్యాయపరమైన అంసాలను పరిశీలిస్తున్నట్టు ఆయన తెలిపారు.Source: జాతీయ | 9 Jun 2010 | 10:19 pm అర్థ సెంచరీలో అడుగెడుతున్న "సింహా"కు శుభాకాంక్షలుమనిషి జీవితం వందేళ్లు. అందులో సగభాగమైతే యాభై. సినిమా భాష కాబట్టి అర్థ శతదినోత్సవం అని అంటుంటాం. విషయం ఏమిటంటే... నందమూరి బాలకృష్ణ జన్మించి గురువారం నాటికి యాభై ఏళ్లు పూర్తయి 51లోకి అడుగుపెడతారు. 1960 జూన్ 10న ఎన్టీఆర్ - బసవతారకం దంపతులకు పుట్టిన బాలయ్య సినీరంగ ప్రవేశం నల్లేరుమీద నడకలా సాగింది. 1982లో వివాహం చేసుకున్నారు. ఆయనకు బ్రాహ్మణి, తేజస్విని, మోక్షజ్ఞ సంతానం. మోక్షజ్ఞ తండ్రి వారసునిగా ఇప్పటికే తగిన తర్ఫీదులో ఉన్నాడు. బెల్లంకొండ సురేష్ కార్యాలయంలోని జిమ్‌లో ప్రతిరోజూ మోక్షజ్ఞ సీనియర్ కోచ్ సూచనల మేరకే బాడీ బిల్డింగ్ నేర్చుకుంటున్నాడు.Source: Yahoo! Telugu: Entertainment | 9 Jun 2010 | 2:24 pm నాగచైతన్య - కాజల్ జంటగా భారీ చిత్రం ప్రారంభంఏ మాయ చేసావె వంటి రొమాంటిక్ హిట్ ఇచ్చిన యువహీరో నాగచైతన్య హీరోగా అగ్రనిర్మాత డి. శివప్రసాద్ రెడ్డి శ్రీ కామాక్షి ఎంటర్‌ప్రైజెస్ పతాకంపై అజయ్ భూయాన్ దర్శకత్వంలో నిర్మిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ షూటింగ్ జూన్ 21 నుంచి బ్యాంకాక్‌లో జరుగుతుంది.నాగచైతన్య సరసన కాజల్ హీరోయిన్‌గా నటించే ఈ భారీ చిత్రంలో రాహుల్ దేవ్, బ్రహ్మానందంలతోపాటు ప్రముఖ తారాగణం నటిస్తారు. భారీ వ్యయంతో హై టెక్నికల్ వేల్యూస్‌తో నిర్మాణమయ్యే ఈ చిత్రానికి సంగీతం: దేవీశ్రీ ప్రసాద్, నిర్మాత: డి. శివప్రసాద్ రెడ్డి, కథ- స్క్రీన్ ప్లే - దర్శకత్వం: అజయ్ భూయాన్.Source: Yahoo! Telugu: Entertainment | 9 Jun 2010 | 1:47 pm కృష్ణుడు హీరోగా వేగేశ్న సతీష్ దర్శకత్వంలో చిత్రంకృష్ణుడు కథానాయకుడుగా వేగేశ్న సతీష్ దర్శకత్వంలో నవచిత్రాలయ క్రియేషన్స్ నిర్మిస్తున్న చిత్రం షూటింగ్ జూన్ 7న ఉదయం 9 గంటల 30 నిమిషాలకు రాజోలులో ప్రారంభమైంది. తొలిషాట్‌కు ప్రముఖ న్యాయవాది పొన్నాడ హనమంతరావు కెమేరా స్విచాన్ చేయగా, ఎంఎల్సీ చైతన్యరాజు క్లాప్ ఇచ్చారు. తొలిషాట్ దర్శకత్వాన్ని ప్రముఖ దర్శకుడు సుకుమార్ తండ్రి తిరుపతిరావు నాయుడు నిర్వహించారు. జులై 20 వరకూ రాజోలు పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరిగే ఈ చిత్రంలో కృష్ణభగవాన్, ఎమ్మెస్ నారాయణ, కొండవలస, పృధ్వీ తదితరులు నటిస్తున్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 9 Jun 2010 | 12:59 pm టీవీ నటి డింపుల్ కళ్లలో కారం: వర్మ మాజీ ప్రేయసే కారణం..?ఆట, తూర్పు పడమర సీరియళ్లతో బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితురాలైన నటి డింపుల్‌పై ఓ గుర్తు తెలియని యువతి మెరుపు దాడి చేసింది. కారులో వెళుతున్న డింపుల్‌తోపాటు ఆమె సహాయకుడి కళ్లలో కారం కొట్టి ఆపై ఇద్దరికీ దేహశుద్ధి చేసింది. పదునైన ఇనుప రాడ్లతో డింపుల్ మెడపైనా నడుముకు పైభాగంపైన తీవ్రంగా గాయపరిచినట్లు సమాచారం. దాడి నుంచి తేరుకునేలోపే ఆ ఆంగతుకురాలు అక్కడి నుంచి మెరుపు వేగంతో మాయమైంది. తీవ్రంగా గాయపడిన డింపుల్‌ను స్థానిక అపోలో ఆస్పత్రికి తరలించారు. ఈ దాడికి ముక్కోణపు ప్రేమే కారణమని అంటున్నారు. నటుడు, దర్శకుడైన శ్రీధర్ వర్మతో డింపుల్ ప్రేమాయణం సాగిస్తున్నట్లు సమాచారం. అయితే అంతకుముందే శ్రీధర్ వర్మకు మరో గాళ్‌ఫ్రెండ్ ఉన్నదనీ చెపుతున్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 9 Jun 2010 | 10:13 am "వజ్రబలుడు"గా వస్తున్న టోనీ జా "ఆంగ్ బాక్-3" చిత్రంమార్షల్ ఆర్ట్స్‌లో బ్రూస్‌లీ, జాకీచాన్, జెట్‌లీల వారసుడు టోనీ జా నటించిన "ఆంగ్ బాక్ -3" చిత్రం జూలై నెల మొదటి వారంలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. మహాసంగ్రామం, క్లాఫ్ ఆఫ్ ది టైటాన్స్, హర్ట్ లాకర్, ప్రిన్స్ ఆఫ్ పర్షియా వంటి చిత్రాలను ఆంధ్ర ప్రేక్షకులకు అందించిన మల్టీ డైమన్షన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఈ "ఆంగ్ బాక్ 3" చిత్రాన్ని భారతదేశమంతటా విడుదల చేయడానికి సన్నద్ధమైంది. తెలుగునాట "వజ్రబలుడు"గా విడుదలవుతోంది. పిడికిలి విసరటంలో బ్రూస్‌లీని, జంపింగ్‌లో జాకీచాన్‌ను పల్టీలు కొట్టడంలో జెట్‌లీని గుర్తు చేసే టోనీ జా "ఆంగ్ బాక్-2"లోనూ తనదైన నటనను ప్రదర్శించాడు. తాజాగా రూపొందించిన "ఆంగ్ బాంక్-3"లోనూ టోనీజా మార్క్ పోరాట దృశ్యాలు లెక్కకు మిక్కిలి చోటుచేసుకున్నాయి.Source: Yahoo! Telugu: Entertainment | 9 Jun 2010 | 8:02 am తెలంగాణా ప్రజలు వద్దంటే నేను పర్యటించను: చిరుప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి బుధవారం ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌తో సమావేశమయ్యారు. పోలవరం, ప్రాణహిత ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించాలని విన్నవించారు.Source: ఏపీ న్యూస్ | 9 Jun 2010 | 8:01 am కసబ్ తరపున వాదించడానికి ఇద్దరు లాయర్ల నియామకం!ముంబై మారణ హోమంలో కీలక సూత్రధారి అజ్మల్ కసబ్ తనకు విధించిన మరణ శిక్షను సవాలు చేస్తూ దాఖలు చేస్తున్న పిటిషన్‌పై అతని తరపున వాదించడానికి ముంబై హైకోర్టు ఇద్దరు సీనియర్ క్రిమినల్ లాయర్లను నియమించింది.Source: జాతీయ | 9 Jun 2010 | 6:09 am కేసీఆర్.. ఈ ఉపఎన్నికలతో నీవు సాధించినదేమిటి..?!రాష్ట్రంలో ఉపఎన్నికలకు మూలకారణం తెలంగాణా రాష్ట్ర సమితి చీఫ్ కె. చంద్రశేఖర రావేనని తెలుగుదేశం తెలంగాణా ప్రాంత నాయకులు ఆరోపించారు. అసలు ఈ ఉపఎన్నికల ద్వారా కేసీఆర్ సాధించిందేమిటో చెప్పాలన్నారు.Source: ఏపీ న్యూస్ | 9 Jun 2010 | 5:39 am వైఎస్ జగన్ గురించి మాట్లాడటం శుద్ధ దండగ: వీహెచ్అధిష్టానం చెప్పిన మాట వినని నాయకుడు గురించి మాట్లాడటం శుద్ధ దండగ అని రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు అన్నారు. వైఎస్ జగన్ ఓదార్పు యాత్రపై స్పందించమని ఆయనను మీడియా అడిగినపుడు వీహెచ్ చిర్రుబుర్రులాడారు.Source: ఏపీ న్యూస్ | 9 Jun 2010 | 5:02 am తమిళుల పునరావాసం: ప్రధాని-రాజపక్సల మధ్య జరిగిన చర్చ!భారత్‌లో మూడు రోజుల పర్యటన నిమిత్తం దేశానికి చేరుకున్న శ్రీలంక అధ్యక్షుడు మహీందా రాజపక్సతో, దేశ ప్రధాని మన్మోహన్ సింగ్ బుధవారం భేటీ అయ్యారు. ఎల్టీటీఈపై పోరు ముగిసిన నేపథ్యంలో, శిబిరాల్లో నిర్బంధంలో ఉన్న తమిళుల పునరావాసంపై ప్రధాని రాజపక్సతో చర్చలు జరిపారు.Source: జాతీయ | 9 Jun 2010 | 4:37 am సమైక్యంతో తీవ్రంగా నష్టపోయిన తెలంగాణ రైతులు!సమైక్య రాష్ట్రంతో తెలంగాణ రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలంగాణ ఫార్మర్స్ ఆర్గనైజేషన్ తెలిపింది. సీమాంధ్ర ప్రాంత భూస్వాములు బలమైన సంపన్న వర్గంగా ఎదిగి, తెలంగాణ రైతులను అణగదొక్కుతున్నారని ఆర్గనైజేషన్ వాపోయింది. ఈ మేరకు పార్టీలకతీతంగా తెలంగాణ రైతు సంఘాలన్నీ ఏకమై తెలంగాణ రైతు సమస్యలను కేంద్ర ప్రభుత్వం నియమించిన శ్రీ కృష్ణ కమిటీ దృష్టికి తీసుకెళ్లాయి.Source: ఏపీ న్యూస్ | 9 Jun 2010 | 4:23 am భోపాల్ దుర్ఘటన తీర్పుపై జైరామ్ రమేష్ అసంతృప్తిభోపాల్ దుర్ఘటనకు సంబంధించిన బాధితులకు సరైన న్యాయం జరుగలేదని కేంద్ర పర్యావరణ శాఖామంత్రి జైరామ్ రమేష్ వాపోయారు. అయితే పర్యావరణ పరిరక్షణ చట్టాన్ని మరింత కఠినతరం చేయడం ద్వారా ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా చూడవచ్చని అభిప్రాయపడ్డారు.Source: జాతీయ | 9 Jun 2010 | 4:06 am
|