వాషింగ్టన్‌లో ఇండో-యూఎస్ సీఈఓల ఫోరం సమావేశం

ఈ నెల 22న ఇండో- యూఎస్ సీఈఓల ఫోరం వాషింగ్టన్‌లో సమావేశం కానుంది. గతవారం ఇరు దేశాల మధ్య కుదిరిన ఆర్థిక పరమైన ఒప్పందాలపై సీఈఓల ఫోరం పరస్పరం చర్చించుకోనున్నాయి.
Source: Yahoo! Telugu: News | 9 Jun 2010 | 8:56 am

అమెరికా మార్కెట్ ప్రభావం: లాభాల్లో సెన్సెక్స్!

అమెరికా స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ పుంజుకోవడం ద్వారా బాంబే స్టాక్ మార్కెట్ బుధవారం లాభాలను నమోదు చేసుకుంటోంది. ట్రేడింగ్ ప్రారంభం నుంచే ఆశాజకంగా కొనసాగుతున్న బాంబే స్టాక్ మార్కెట్, మధ్యాహ్నం 1.45 గంటల ప్రాంతంలో 128 పాయింట్లు బలపడి, 16,745 పాయింట్ల మార్కును తాకింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచి నిఫ్టీ కూడా 61 పాయింట్లు పుంజుకుని, ఐదువేల మార్కు వద్ద కొనసాగుతోంది.
Source: Yahoo! Telugu: News | 9 Jun 2010 | 8:24 am

లాభాల బాటలో బాంబే స్టాక్ మార్కెట్

బుధవారం బాంబే స్టాక్ మార్కెట్ లాభాల బాటలో కొనసాగుతోంది. ట్రేడింగ్ ప్రారంభం నుంచే వృద్ధి చెందిన బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచి సెన్సెక్స్, మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో 147 పాయింట్లు పుంజుకుని, 16,764 పాయింట్ల మార్కును తాకింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచి నిఫ్టీ కూడా 40 పాయింట్లు బలపడి, 5,027 పాయింట్ల వద్ద పయనిస్తోంది.
Source: Yahoo! Telugu: News | 9 Jun 2010 | 8:16 am

"వజ్రబలుడు"గా వస్తున్న టోనీ జా "ఆంగ్ బాక్-3" చిత్రం

మార్షల్ ఆర్ట్స్‌లో బ్రూస్‌లీ, జాకీచాన్, జెట్‌లీల వారసుడు టోనీ జా నటించిన "ఆంగ్ బాక్ -3" చిత్రం జూలై నెల మొదటి వారంలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. మహాసంగ్రామం, క్లాఫ్ ఆఫ్ ది టైటాన్స్, హర్ట్ లాకర్, ప్రిన్స్ ఆఫ్ పర్షియా వంటి చిత్రాలను ఆంధ్ర ప్రేక్షకులకు అందించిన మల్టీ డైమన్షన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఈ "ఆంగ్ బాక్ 3" చిత్రాన్ని భారతదేశమంతటా విడుదల చేయడానికి సన్నద్ధమైంది. తెలుగునాట "వజ్రబలుడు"గా విడుదలవుతోంది. పిడికిలి విసరటంలో బ్రూస్‌లీని, జంపింగ్‌లో జాకీచాన్‌ను పల్టీలు కొట్టడంలో జెట్‌లీని గుర్తు చేసే టోనీ జా "ఆంగ్ బాక్-2"లోనూ తనదైన నటనను ప్రదర్శించాడు. తాజాగా రూపొందించిన "ఆంగ్ బాంక్-3"లోనూ టోనీజా మార్క్ పోరాట దృశ్యాలు లెక్కకు మిక్కిలి చోటుచేసుకున్నాయి.
Source: Yahoo! Telugu: Entertainment | 9 Jun 2010 | 8:02 am

మంగళూరు విమాన ప్రమాదంపై న్యాయ విచారణ ప్రారంభం!

మంగళూరులో సంభవించిన ఘోర విమాన ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపేందుకు న్యాయ విచారణ కమిటీ బృందం సిద్ధమైంది. ఇందులో భాగంగా న్యాయ విచారణ కమిటీ బృందం విమాన ప్రమాదం జరిగిన సంఘటనా స్థలానికి చేరుకుని, విచారణను ప్రారంభించింది. మే 22వ తేదీన జరిగిన మంగళూరు ఎయిర్ ఇండియా విమానం ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 158 మంది దారుణంగా మృతి చెందారు.
Source: Yahoo! Telugu: News | 9 Jun 2010 | 7:50 am

రాజీనామా చేసినవారికే మద్దతిద్దాం: తెలంగాణా తెదేపా

ఆగస్టు నెలలో తెలంగాణాలో జరుగనున్న ఉపఎన్నికలలో తెలుగుదేశం పార్టీ బరిలో దిగాలా.. వద్దా అనే విషయంపై ఆ పార్టీ నేతల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సీమాంధ్రకు చెందిన నేతలు పోటీ చేయాలని బల్లగుద్ది చెపుతుంటే.. తెలంగాణా ప్రాంత నేతలు మాత్రం వద్దని వారిస్తున్నారు.
Source: Yahoo! Telugu: News | 9 Jun 2010 | 7:33 am

కేరళలో ఇంకా ఆకర్షిస్తూనే ఉన్న ప్రభుత్వోద్యోగాలు

కార్పొరేట్ కంపెనీల హవా కొనసాగుతూ... ఐదంకెల జీతాలను తీసుకునే ప్రస్తుత పరిస్థితిలో కూడా కేరళ యువత ప్రభుత్వోద్యోగాలపై ఎంతో ఇష్టతను ప్రదర్శిస్తోంది. ప్రభుత్వోద్యోగాలతోనే జీవితంలో స్థిరత్వం లభిస్తుందని విశ్వసించే కుర్రకారు కేరళలో ఎక్కువవుతున్నట్లు తెలుస్తోంది.
Source: Yahoo! Telugu: News | 9 Jun 2010 | 7:13 am

శ్రీలంకలో మళ్లీ తమిళ టైగర్ల సమీకృతం: శ్రీలంక ప్రధాని

ప్రముఖ తీవ్రవాద సంస్థ ఎల్టీటీఈపై పోరు ముగిసిందని ఊపిరిపీల్చుకుంటున్న శ్రీలంక ప్రభుత్వానికి మరో సమస్య వచ్చి పడింది. యుద్ధసమయంలో ప్రాణాలను కాపాడుకుని చెల్లాచెదురైన తమిళ టైగర్లు మళ్లీ శ్రీలంకలో అలజడి సృష్టిస్తున్నారని శ్రీలంక ప్రధాని జయరత్నే వెల్లడించారు.
Source: Yahoo! Telugu: News | 9 Jun 2010 | 7:01 am

ఊపందుకున్న ట్రేడింగ్: లాభాల్లో స్టాక్ మార్కెట్!

దేశీయ వాటాల ట్రేడింగ్ ఊపందుకోవడంతో బాంబే స్టాక్ మార్కెట్ లాభాలను నమోదు చేసుకుంటుంది. బుధవారం ట్రేడింగ్ ప్రారంభం నుంచే పురోగమనం వైపు ర్యాలీని కొనసాగిస్తున్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచి సెన్సెక్స్, ఉదయం 11.30 గంటల ప్రాంతంలో వృద్ధి చెందింది. అలాగే నిఫ్టీ కూడా లాభాలను నమోదు చేసుకుని ఐదువేల మార్కు వద్ద కొనసాగుతోంది.
Source: Yahoo! Telugu: News | 9 Jun 2010 | 6:48 am

లాభాల్లో స్టాక్ మార్కెట్: సెన్సెక్స్, నిఫ్టీల వృద్ధి!

బాంబే స్టాక్ మార్కెట్ గురువారం లాభాలను నమోదు చేసుకుంటోంది. ట్రేడింగ్ ప్రారంభం నుంచే ఊపందుకున్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచి సెన్సెక్స్ ఉదయం 10.30 గంటల ప్రాంతంలో 50 పాయింట్లు లాభపడి, 16,667 పాయింట్ల మార్కును తాకింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచి నిఫ్టీ కూడా 17 పాయింట్లు స్వల్పంగా బలపడి, 5,004 పాయింట్ల వద్ద పయనిస్తోంది.
Source: Yahoo! Telugu: News | 9 Jun 2010 | 6:42 am

మహీందా రాజపక్సేతో భేటీ కానున్న తమిళనాడు ఎంపీలు!

భారత్ పర్యటన కోసం దేశ రాజధాని నగరం ఢిల్లీకి చేరుకున్న శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సేతో తమిళనాడుకు చెందిన ఎంపీల బృందం బుధవారం సమావేశం కానుంది. శ్రీలంక శిబిరాల్లో నిర్బంధంలో ఉన్న 80వేల మంది తమిళుల పునరావాసంపై లంక అధ్యక్షుడితో తమిళనాడు ఎంపీల బృందం చర్చలు జరుపనుంది. ఎల్టీటీఈ పోరు సమయంలో తమిళులకు జరిగిన అన్యాయం, ఇంకా నిర్బంధంలో ఉన్న తమిళులకు పునరావాసం కల్పించాలని ఈ బృందం రాజపక్సను డిమాండ్ చేయనుంది.
Source: Yahoo! Telugu: News | 9 Jun 2010 | 6:04 am

మంగళూరు విమాన ప్రమాదంపై న్యాయ విచారణ ప్రారంభం!

మంగళూరులో సంభవించిన ఘోర విమాన ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపేందుకు న్యాయ విచారణ కమిటీ బృందం సిద్ధమైంది. ఇందులో భాగంగా న్యాయ విచారణ కమిటీ బృందం విమాన ప్రమాదం జరిగిన సంఘటనా స్థలానికి చేరుకుని, విచారణను ప్రారంభించింది. మే 22వ తేదీన జరిగిన మంగళూరు ఎయిర్ ఇండియా విమానం ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 158 మంది దారుణంగా మృతి చెందారు.
Source: జాతీయ | 9 Jun 2010 | 2:20 am

రాజీనామా చేసినవారికే మద్దతిద్దాం: తెలంగాణా తెదేపా

ఆగస్టు నెలలో తెలంగాణాలో జరుగనున్న ఉపఎన్నికలలో తెలుగుదేశం పార్టీ బరిలో దిగాలా.. వద్దా అనే విషయంపై ఆ పార్టీ నేతల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సీమాంధ్రకు చెందిన నేతలు పోటీ చేయాలని బల్లగుద్ది చెపుతుంటే.. తెలంగాణా ప్రాంత నేతలు మాత్రం వద్దని వారిస్తున్నారు.
Source: ఏపీ న్యూస్ | 9 Jun 2010 | 2:04 am

మహీందా రాజపక్సేతో భేటీ కానున్న తమిళనాడు ఎంపీలు!

భారత్ పర్యటన కోసం దేశ రాజధాని నగరం ఢిల్లీకి చేరుకున్న శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సేతో తమిళనాడుకు చెందిన ఎంపీల బృందం బుధవారం సమావేశం కానుంది. శ్రీలంక శిబిరాల్లో నిర్బంధంలో ఉన్న 80వేల మంది తమిళుల పునరావాసంపై లంక అధ్యక్షుడితో తమిళనాడు ఎంపీల బృందం చర్చలు జరుపనుంది. ఎల్టీటీఈ పోరు సమయంలో తమిళులకు జరిగిన అన్యాయం, ఇంకా నిర్బంధంలో ఉన్న తమిళులకు పునరావాసం కల్పించాలని ఈ బృందం రాజపక్సను డిమాండ్ చేయనుంది.
Source: జాతీయ | 9 Jun 2010 | 12:37 am

తెలంగాణాలో కాంగ్రెస్-తెరాసలే తన్నుకుంటాయి: కేసీఆర్

ఉప ఎన్నికలు తెచ్చిన వేడితో తెలంగాణా రాష్ట్ర సమితి కుతకుతలాడుతోంది. ముఖ్యంగా తమ పార్టీ అభ్యర్థులు రాజీనామా చేసిన స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను నిలబెడుతుండగా తెలుగుదేశం పార్టీ సైతం అదే బాటలో అడుగులు వేస్తోంది. ఆ పార్టీల వైఖరిపై తెరాస చీఫ్ కేసీఆర్ మండిపడ్డారు.
Source: ఏపీ న్యూస్ | 9 Jun 2010 | 12:30 am

కసబ్‌ తరపున వాదించడానికి ఇద్దరు లాయర్ల నియామకం!

ముంబై మారణ హోమంలో కీలక సూత్రధారి అజ్మల్ కసబ్‌ తనకు విధించిన మరణ శిక్షణను సవాలు చేస్తూ దాఖలు చేస్తున్న పిటిషన్‌పై అతని తరపున వాదించడానికి ముంబై హైకోర్టు ఇద్దరు సీనియర్ క్రిమినల్ లాయర్లను నియమించింది.
Source: జాతీయ | 8 Jun 2010 | 11:31 pm

బాబూ.. నీ నీతి సూత్రాలు నీకు నువ్వే చెప్పుకో: చిరంజీవి

కాంగ్రెస్‌తో పొత్తు కుదుర్చుకోవద్దని చెప్పే హక్కు తెలుగుదేశం పార్టీకి లేదని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి వ్యాఖ్యానించారు. దేశ ప్రయోజనాలు, ప్రజా ప్రయోజనాలు అంటూ కాంగ్రెస్ పార్టీకి, భారతీయ జనతా పార్టీకి మద్దతు పలికి, మంత్రి పదవుల్లో సైతం కొనసాగిన తెలుగుదేశం పార్టీకి తనను విమర్శించే హక్కు లేదన్నారు.
Source: ఏపీ న్యూస్ | 8 Jun 2010 | 11:28 pm

తెలంగాణా ద్రోహులను తరిమి కొట్టండి: నాయిని

ఉపఎన్నికల్లో పోటీ చేసే తెలంగాణా ద్రోహులను తెలంగాణా ప్రజలు తరిమికొట్టాలని తెలంగాణా రాష్ట్ర సమితి నాయకుడు నాయిని నర్సింహారెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ నయవంచక పార్టీ అనీ ఆ పార్టీకి చెందిన అభ్యర్థులకు డిపాజిట్ గల్లంతయ్యేలా చిత్తుచిత్తుగా ఓడించాలన్నారు.
Source: ఏపీ న్యూస్ | 8 Jun 2010 | 10:59 pm

జార్ఖండ్‌లో ఘోర ప్రమాదం: 30 మంది దారుణ మృతి

జార్ఖండ్‌లో ఘోర ప్రమాదం సంభవించింది. బుధవారం ఉదయం జరిగిన ఈ దుర్ఘటనలో 30 మంది దారుణంగా ప్రాణాలు కోల్పోయారు. జార్ఖండ్, ధనాబాద్‌లోని గోవింద్‌పూర్ వద్ద పెళ్లి బస్సు చెట్టును ఢీకొన్న ఉదంతంలో 30 మంది మృతి చెందగా, అనేక మంది తీవ్ర గాయాలకు గురైయ్యారు.
Source: జాతీయ | 8 Jun 2010 | 10:47 pm

పవార్ రాజకీయాలు వాటి చుట్టే తిరుగుతాయ్.!: థాక్రే

కేంద్ర వ్యవసాయ మంత్రి శరద్ పవార్ రాజకీయాలు ఎప్పుడూ డబ్బు, దానిద్వారా వచ్చే అధికారం చుట్టే తిరుగుతాయని శివసేన అధినేత బాల్‌థాకరే ధ్వజమెత్తారు. కొన్ని క్లిష్ట సందర్భాల్లో ఆయన వెలివేసిన ధనమే ఇప్పుడు ఆయన్ను చిక్కుల్లో పడవేసిందని థాక్రే వ్యాఖ్యానించారు.
Source: జాతీయ | 8 Jun 2010 | 10:40 pm

నేను వస్తున్నా: కంగనా - నీకంత సీన్ లేదు: టాలీవుడ్

బాలీవుడ్ తెల్లపిల్ల కంగనా రనౌత్ మరోసారి టాలీవుడ్ వస్తున్నట్లు ప్రకటించింది. టాలీవుడ్ సినిమా వాళ్లు తనకు ఎంతో నచ్చారనీ, వారి వద్ద పనిచేస్తున్నప్పుడు అసలు సమయమే తెలియదనీ... ఇంకా ఇలా ఏవేపో ఐస్ పెట్టే కొంతమంది హీరోయిన్ల మాటలనే తనూ చెపుతోందట.అయితే "ఏక్ నిరంజన్" అట్టర్ ప్లాప్ దెబ్బకు కంగనా పేరు చెబితేనే నిర్మాతలు పారిపోతున్నారట. ఆమె ఫలానా నిర్మాత వద్దకు వస్తున్నానని కబురు పంపితే చాలు..!! సదరు నిర్మాత తన అసిస్టెంటుతో తాను ఊర్లో లేనని చెప్పమని అంటున్నాడట. కంగనా మాత్రం తన పట్టును వదలట్లేదట. ఏక్ నిరంజన్ సినిమా టైమ్‌లో తన పెదవులు రెండూ వాచిపోయి చూసేందుకు అదోలా అనిపించాయనీ, అప్పట్లో అది తననూ ఇబ్బంది పెట్టిందనీ, కానీ ఇప్పుడు అన్నీ సర్దుకుని అందంగా మారిపోయానని ఫోటోలు కూడా పంపిస్తోందట.
Source: Yahoo! Telugu: Entertainment | 8 Jun 2010 | 1:09 pm

"తాగుబోతులు" తాగుతుంటే మనమేం చేస్తాం: వీహెచ్

ప్రజలు మద్యాన్ని తాగుతూ ఉంటే దానిని ఎవరు మాత్రం అడ్డుకోగలరని వీహెచ్ ప్రశ్నించారు. వారి ఆనందం వారిది... తాగాలనుకున్నవారు తాగుతారు. తాగకూడదనుకున్నవారు తాగరు. తాగొద్దు అని చెప్పడానికి మనమెవరమన్న చందంలో ఆయన మాట్లాడారు.
Source: ఏపీ న్యూస్ | 8 Jun 2010 | 8:53 am

"అమలాపురం సరోజ" కూడా ఓ మనిషే: అనుష్క

"అరుంధతి" చిత్రంలో కామాంధుడి అంతు చూసే పాత్రలో నటించిన అనుష్క "వేదం"లో అందుకు భిన్నమైన వేశ్య పాత్రలో నటించింది. వేశ్య పాత్ర అంటేనే పక్కకు పోయే నటీమణులున్న ఈ కాలంలో ఆ పాత్ర చేసేందుకు సాహసించారే..? అని అడిగితే... "నటి అన్నాక ఎటువంటి పాత్రనైనా చేయాలి. ఫలానా పాత్రలు మాత్రమే చేస్తానని అంటే నటి అని ఎలా అనిపించుకోగలరు. సమాజంలో భిన్నమైన వ్యక్తులు ఉంటారు. ఆ వ్యక్తులకు ఉండే అన్ని పార్శ్వాలను తాకినప్పుడే పరిపూర్ణమైన నటి అనిపించుకోగలరు. నామటుకు నేను ఈ భూమిపై మనుషులు ఎన్ని రకాలుగా ఉంటారో అన్ని రకాల పాత్రల్లో కనిపించాలని కోరుకుంటున్నా. అంతేకాదు కనిపించేందుకు నేను రెడీ. అటువంటి జీవమున్న కథతో వస్తే నేను ఎటువంటి పాత్రలోనైనా నటిస్తా... అది వేశ్యా... లేదా భిక్షగత్తా అని చూడను. నటన అన్నాక నటనే." అని కుండబద్ధలు కొట్టినట్లు చెపుతోంది అనుష్క.
Source: Yahoo! Telugu: Entertainment | 8 Jun 2010 | 8:53 am

సినిమా కథను నేను నొక్కేశా: అల్లు అరవింద్

సినిమాల్లో కథలు చౌర్యం చేయడం మామూలే. అందుకే యూనిట్ సభ్యులతో చాలా జాగ్రత్తగా ఉంటారు. కొంతమంది యూనిట్ అందరికీ కథ చెప్పాలంటేనే భయపడతారు. కానీ అల్లు అరవింద్ మాత్రం అందరికీ తెలిసేటట్లుగా కథలు చౌర్యం చేశానని చెప్పారు. విషయం ఏమంటే... అల్లు అర్జున్‌కు సుకుమార్ ఓ కథ చెప్పాడు. అది విని తెగ సంబరపడిపోయి ఎక్కడికి వెళ్లినా దాని గురించే చర్చ పెట్టేవాడు అల్లు అర్జున్. ఇది విన్న అల్లు అర్జున్ మేనేజర్ వాసు విషయం తెలుసుకున్నాడట. వాసు వెంటనే సుకుమార్‌ను కలిసి కథ గురించి అడిగాడు. కథ చెప్పేశాడు. ఆల్రెడీ సుకుమార్‌తో వాసు నిర్మాతగా ఆర్య అనే సినిమా చేశాడు కూడా. ఈ సినిమా కూడా తనే చేద్దామని అనుకుని శ్రేయోభిలాషి అయిన అరవింద్ గారికి కూడా చెబుదాం అన్నాడు. ఓ ఆదివారంనాడు అరవింద్ అపాయింట్‌మెంట్ తీసుకుని వెళ్లి కథ వినిపించారు.
Source: Yahoo! Telugu: Entertainment | 8 Jun 2010 | 7:12 am

క్వార్టర్ బాటిల్ ధర 100 రూపాయలా..?!!: "గాలి" ప్రశ్న

తెలుగుదేశం పార్టీ నాయకుడు గాలి ముద్దుకృష్ణమ నాయుడు కాంగ్రెస్ సర్కార్‌పై మరోసారి ధ్వజమెత్తారు. మద్యం టెండర్లు ప్రకటించి కోట్లకు కోట్లు దండుకున్నదని మండిపడ్డారు. గత ఏడాది క్వార్టర్ మద్యం బాటిల్ ధర కేవలం 20 రూపాయలుండగా అది ఇప్పుడు ఎకాఎకిన 100 రూపాయలకు పెంచేశారన్నారు.
Source: ఏపీ న్యూస్ | 8 Jun 2010 | 6:45 am

పవన్ కల్యాణ్ హీరోగా ఆదిత్య ప్రొడక్షన్స్ సినిమా

ఏసు క్రీస్తు జీవితం గురించి నాలుగు భాషల్లో ఆదిత్య ప్రొడక్షన్స్ సంస్థ ఓ భారీ చిత్రాన్ని నిర్మించబోతోంది. విజయేంద్ర వర్మ, శ్రీరామదాసు, చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన సంస్థ ఆదిత్య ప్రొడక్షన్స్. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ... ఏసు క్రీస్తుపై నిర్మించే తమ చిత్రంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అత్యంత ముఖ్యమైన పాత్రను పోషించడం విశేషం. ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా క్రీస్తు జీవితంపై దాదాపు 47 ఇంగ్లీషు చిత్రాలు వచ్చాయి. కింగ్ ఆఫ్ కింగ్స్, బెనహర్ వంటి ముఖ్యమైన చిత్రాలు ఇందులో ఉన్నాయి. ఆ చిత్రాలంతటి భారీ స్థాయిలోనే, వాటికి భిన్నమైన తరహాలో ఆదిత్య ప్రొడక్షన్స్ చిత్రం ఉంటుంది. అందరికీ తెలిసిన కథనే కొత్తగా ఆవిష్కరించబోతున్నాం అన్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 8 Jun 2010 | 6:22 am

ఆండర్సన్‌పై పెట్టిన కేసు ఇంకా మూసేయలేదు: మొయిలీ

భోపాల్ విష వాయువు దుర్ఘటనకు సంబంధించిన కేసును మూసివేశారంటూ వస్తున్న వార్తలు నిజం కాదనీ, యూనియన్ కార్బైడ్ మాజీ అధికారి వారెన్ ఆండర్సన్‌పై పెట్టిన కేసు ఇంకా అలాగే ఉందని కేంద్ర న్యాయశాఖా మంత్రి వీరప్ప మొయిలీ స్పష్టం చేశారు.
Source: జాతీయ | 8 Jun 2010 | 6:22 am

కేసీఆర్‌... జగన్‌పై రాళ్లెందుకు వేయించలేదు: మందకృష్ణ

ఎమ్మార్పీఎస్ చీఫ్ మందకృష్ణ మాదిగ తెలంగాణా రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావును సమయం దొరికినప్పుడల్లా తూర్పార బడుతూనే ఉన్నారు. కేసీఆర్‌కు ఎస్సీ, ఎస్టీ ఇతర వెనుకబడిన కులాలంటే చిన్నచూపని మహబూబాబాద్ ఘటన తేటతెల్లం చేస్తోందని చెప్పుకొచ్చారు. అదెలాగో ఆయనే వివరించారు.
Source: ఏపీ న్యూస్ | 8 Jun 2010 | 5:32 am

చిత్తూరులో ఉగ్రవాది అహ్మద్: గాలిస్తున్న కర్నాటక పోలీసులు

ఇటీవల హైదరాబాద్‌లో పట్టపగలే నడిరోడ్డుపై పోలీసులపై కాల్పులు జరిపి ఒక పోలీసును పొట్టనబెట్టుకున్న ఉగ్రవాది వికారుద్దీన్ వ్యవహారాన్ని మరువక ముందే చిత్తూరు జిల్లాలో అహ్మద్ అనే మరో ఉగ్రవాది సంచరిస్తున్నట్లు కర్నాటక పోలీసులు కనుగొన్నారు.
Source: ఏపీ న్యూస్ | 8 Jun 2010 | 4:16 am

జగన్-కాంగ్రెస్‌ల మధ్య జరుగుతున్నది.. భార్యాభర్తల గొడవ..!

మద్యం అమ్మకాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ధ్వజమెత్తారు. మద్యం అమ్మకాలను ప్రోత్సహించి ప్రజలను దెబ్బతీయడంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కె. రోశయ్య ప్రథమ ముద్దాయని నారాయణ ఆరోపించారు.మద్యాన్ని నియంత్రించాల్సి ప్రభుత్వమే.. దాన్ని ప్రోత్సహించడం ఎంతవరకు సబబని నారాయణ ప్రశ్నించారు.
Source: ఏపీ న్యూస్ | 8 Jun 2010 | 3:49 am

రాజపక్స రాకపై నిరసన: వైగో, నెడుమారన్‌ల అరెస్టు!

శ్రీలంక అధ్యక్షుడు మహీందా రాజపక్స భారత్ రాకను నిరసిస్తూ తమిళనాడులో నిరసనలు వెలువెత్తుతున్నాయి. ఇందులో భాగంగా చెన్నై నగరంలోని శ్రీలంక రాయబార కార్యాలయం వైపు భారీ ర్యాలీని చేపట్టిన ఎండీఎంకే నేత వైగో, తమిళ జాతీయోద్యమ నేత నెడుమారన్‌లను పోలీసులు అరెస్టు చేశారు.
Source: జాతీయ | 8 Jun 2010 | 3:07 am