లాభాల్లో స్టాక్ మార్కెట్: 5వేల దిగువ స్థాయికి నిఫ్టీ!

బాంబే స్టాక్ మార్కెట్ లాభాల బాటలో కొనసాగుతోంది. ట్రేడింగ్ ప్రారంభం నుంచే ఊపందుకున్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచి సెన్సెక్స్, మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో 110 పాయింట్లు లాభపడి, 16,670 పాయింట్ల మార్కును తాకింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచి నిఫ్టీ కూడా 52 పాయింట్లు వృద్ధి చెంది, ఐదువేల దిగువ స్థాయి (4,981)కి పడిపోయింది.
Source: Yahoo! Telugu: News | 8 Jun 2010 | 9:37 am

చిత్తూరులో ఉగ్రవాది అహ్మద్: గాలిస్తున్న కర్నాటక పోలీసులు

ఇటీవల హైదరాబాద్‌లో పట్టపగలే నడిరోడ్డుపై పోలీసులపై కాల్పులు జరిపి ఒక పోలీసును పొట్టనబెట్టుకున్న ఉగ్రవాది వికారుద్దీన్ వ్యవహారాన్ని మరువక ముందే చిత్తూరు జిల్లాలో అహ్మద్ అనే మరో ఉగ్రవాది సంచరిస్తున్నట్లు కర్నాటక పోలీసులు కనుగొన్నారు.
Source: Yahoo! Telugu: News | 8 Jun 2010 | 9:30 am

అమెరికాలో నానాటికి తగ్గుతున్న ఉద్యోగావకాశాలు!

అమెరికాలో ఉద్యోగవకాశాలు నానాటికి తగ్గిపోతున్నాయి. ఇందుకు అమెరికా ఎదుర్కొంటున్న ఆర్థిక మాంద్యమే కారణమని తెలుస్తోంది. ఆర్థికమాంద్యంతో కొట్టుమిట్టాడుతున్న అమెరికాలో ఏప్రిల్ 2,18,000 మందిని ప్రైవేట్ కంపెనీలు నియమించాయి. అదే ఉద్యోగవకాశాల సంఖ్య మే నెలలో భారీగా తగ్గిపోయింది.
Source: Yahoo! Telugu: News | 8 Jun 2010 | 9:29 am

శ్రీలంక వ్యవహారంపై ఐరాస మౌనం పాటించడం సరికాదు..!

శ్రీలంక ప్రభుత్వం ఎల్టీటీఈపై చేసిన యుద్ధం కారణంగా అనేక మంది తమిళులు హత్యకు గురైయ్యారనే విషయం తెలిసినా.. ఐక్యరాజ్యసమితి మౌనం పాటించడంపై ఇన్నర్ సిటీ ప్రెస్ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎల్టీటీఈపై పోరుకు అధికసంఖ్యలో తమిళులను పొట్టన బెట్టుకున్న శ్రీలంక ప్రభుత్వంపై ఐరాస స్పందించకపోవడం సరికాదని ఇన్నర్ సిటీ ప్రెస్ తెలిపింది.
Source: Yahoo! Telugu: News | 8 Jun 2010 | 8:59 am

"అమలాపురం సరోజ" కూడా ఓ మనిషే: అనుష్క

"అరుంధతి" చిత్రంలో కామాంధుడి అంతు చూసే పాత్రలో నటించిన అనుష్క "వేదం"లో అందుకు భిన్నమైన వేశ్య పాత్రలో నటించింది. వేశ్య పాత్ర అంటేనే పక్కకు పోయే నటీమణులున్న ఈ కాలంలో ఆ పాత్ర చేసేందుకు సాహసించారే..? అని అడిగితే... "నటి అన్నాక ఎటువంటి పాత్రనైనా చేయాలి. ఫలానా పాత్రలు మాత్రమే చేస్తానని అంటే నటి అని ఎలా అనిపించుకోగలరు. సమాజంలో భిన్నమైన వ్యక్తులు ఉంటారు. ఆ వ్యక్తులకు ఉండే అన్ని పార్శ్వాలను తాకినప్పుడే పరిపూర్ణమైన నటి అనిపించుకోగలరు. నామటుకు నేను ఈ భూమిపై మనుషులు ఎన్ని రకాలుగా ఉంటారో అన్ని రకాల పాత్రల్లో కనిపించాలని కోరుకుంటున్నా. అంతేకాదు కనిపించేందుకు నేను రెడీ. అటువంటి జీవమున్న కథతో వస్తే నేను ఎటువంటి పాత్రలోనైనా నటిస్తా... అది వేశ్యా... లేదా భిక్షగత్తా అని చూడను. నటన అన్నాక నటనే." అని కుండబద్ధలు కొట్టినట్లు చెపుతోంది అనుష్క.
Source: Yahoo! Telugu: Entertainment | 8 Jun 2010 | 8:53 am

లాభాల్లో స్టాక్ మార్కెట్: 5వేల మార్కు వద్ద నిఫ్టీ ర్యాలీ!

దేశీయ వాటాల ట్రేడింగ్ పుంజుకోవడంతో బాంబే స్టాక్ మార్కెట్ మంగళవారం ఆశాజనకంగా కొనసాగుతోంది. ట్రేడింగ్ ప్రారంభం నుంచే ఊపందుకున్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచి సెన్సెక్స్ మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో 16,860 మార్కు వద్ద పయనిస్తోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచి నిఫ్టీ కూడా వృద్ధితో 5,060 పాయింట్ల మార్కును తాకింది.
Source: Yahoo! Telugu: News | 8 Jun 2010 | 8:41 am

పన్ను బకాయిలు: జులై 8కి వాయిదా పడిన వొడాఫోన్ కేసు

పన్ను బకాయిలు చెల్లించాలంటూ ఆదాయపు పన్ను శాఖ పంపిన లేఖపై వొడాఫోన్ ఇంటర్నేషనల్ ముంబై హైకోర్టులో వేసిన పిటిషన్‌ను పరిశీలించిన కోర్టు, కేసును జులై 8కి వాయిదా వేసింది. అదేవిధంగా ఐటీ జారీ చేసిన ఆదేశాలపైనా మే 31 వరకూ స్టే విధించింది.
Source: Yahoo! Telugu: News | 8 Jun 2010 | 8:36 am

రాజపక్స రాకపై నిరసన: వైగో, నెడుమారన్‌ల అరెస్టు!

శ్రీలంక అధ్యక్షుడు మహీందా రాజపక్స భారత్ రాకను నిరసిస్తూ తమిళనాడులో నిరసనలు వెలువెత్తుతున్నాయి. ఇందులో భాగంగా చెన్నై నగరంలోని శ్రీలంక రాయబార కార్యాలయం వైపు భారీ ర్యాలీని చేపట్టిన ఎండీఎంకే నేత వైగో, తమిళ జాతీయోద్యమ నేత నెడుమారన్‌లను పోలీసులు అరెస్టు చేశారు.
Source: Yahoo! Telugu: News | 8 Jun 2010 | 8:35 am

పుంజుకున్న ట్రేడింగ్: లాభాల్లో స్టాక్ మార్కెట్!

దేశీయ వాటాల్ ట్రేడింగ్ పుంజుకోవడంతో బాంబే స్టాక్ మార్కెట్ లాభాలను నమోదు చేసుకుంది. ట్రేడింగ్ ప్రారంభం నుంచే పురోగమనం వైపు ర్యాలీని కొనసాగిస్తున్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచి సెన్సెక్స్, మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో 82 పాయింట్లు లాభపడి, 16,863 పాయింట్ల మార్కును తాకింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచి నిఫ్టీ కూడా 27 పాయింట్లు వృద్ధి చెంది, ఐదువేల మార్కు వద్ద ర్యాలీని కొనసాగిస్తోంది.
Source: Yahoo! Telugu: News | 8 Jun 2010 | 7:43 am

ఉపఎన్నికల్లో పోటీపై బాబు మల్లగుల్లాలు: టి.నేతలతో భేటీ

ఆగస్టు నెలలో జరుగనున్న ఉపఎన్నికల్లో తమ పార్టీ పోటీకి దిగుతోందని కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన నేపథ్యంలో తదుపరి వంతు తెలుగుదేశం పార్టీకి వచ్చినట్లయింది. తెలంగాణా లక్ష్య సాధనకు రాజీనామా చేసిన ఎమ్మెల్యేలనే తిరిగి గెలిపించాలని తెరాస ఐకాస పట్టుబట్టిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ దీనిపై లోతుగా పరిశీలించి నిర్ణయం తీసుకోనుంది.
Source: Yahoo! Telugu: News | 8 Jun 2010 | 7:32 am

జగన్-కాంగ్రెస్‌ల మధ్య జరుగుతున్నది.. భార్యాభర్తల గొడవ..!

మద్యం అమ్మకాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ధ్వజమెత్తారు. మద్యం అమ్మకాలను ప్రోత్సహించి ప్రజలను దెబ్బతీయడంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కె. రోశయ్య ప్రథమ ముద్దాయని నారాయణ ఆరోపించారు.మద్యాన్ని నియంత్రించాల్సి ప్రభుత్వమే.. దాన్ని ప్రోత్సహించడం ఎంతవరకు సబబని నారాయణ ప్రశ్నించారు.
Source: Yahoo! Telugu: News | 8 Jun 2010 | 7:21 am

సినిమా కథను నేను నొక్కేశా: అల్లు అరవింద్

సినిమాల్లో కథలు చౌర్యం చేయడం మామూలే. అందుకే యూనిట్ సభ్యులతో చాలా జాగ్రత్తగా ఉంటారు. కొంతమంది యూనిట్ అందరికీ కథ చెప్పాలంటేనే భయపడతారు. కానీ అల్లు అరవింద్ మాత్రం అందరికీ తెలిసేటట్లుగా కథలు చౌర్యం చేశానని చెప్పారు. విషయం ఏమంటే... అల్లు అర్జున్‌కు సుకుమార్ ఓ కథ చెప్పాడు. అది విని తెగ సంబరపడిపోయి ఎక్కడికి వెళ్లినా దాని గురించే చర్చ పెట్టేవాడు అల్లు అర్జున్. ఇది విన్న అల్లు అర్జున్ మేనేజర్ వాసు విషయం తెలుసుకున్నాడట. వాసు వెంటనే సుకుమార్‌ను కలిసి కథ గురించి అడిగాడు. కథ చెప్పేశాడు. ఆల్రెడీ సుకుమార్‌తో వాసు నిర్మాతగా ఆర్య అనే సినిమా చేశాడు కూడా. ఈ సినిమా కూడా తనే చేద్దామని అనుకుని శ్రేయోభిలాషి అయిన అరవింద్ గారికి కూడా చెబుదాం అన్నాడు. ఓ ఆదివారంనాడు అరవింద్ అపాయింట్‌మెంట్ తీసుకుని వెళ్లి కథ వినిపించారు.
Source: Yahoo! Telugu: Entertainment | 8 Jun 2010 | 7:12 am

పవన్ కల్యాణ్ హీరోగా ఆదిత్య ప్రొడక్షన్స్ సినిమా

ఏసు క్రీస్తు జీవితం గురించి నాలుగు భాషల్లో ఆదిత్య ప్రొడక్షన్స్ సంస్థ ఓ భారీ చిత్రాన్ని నిర్మించబోతోంది. విజయేంద్ర వర్మ, శ్రీరామదాసు, చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన సంస్థ ఆదిత్య ప్రొడక్షన్స్. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ... ఏసు క్రీస్తుపై నిర్మించే తమ చిత్రంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అత్యంత ముఖ్యమైన పాత్రను పోషించడం విశేషం. ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా క్రీస్తు జీవితంపై దాదాపు 47 ఇంగ్లీషు చిత్రాలు వచ్చాయి. కింగ్ ఆఫ్ కింగ్స్, బెనహర్ వంటి ముఖ్యమైన చిత్రాలు ఇందులో ఉన్నాయి. ఆ చిత్రాలంతటి భారీ స్థాయిలోనే, వాటికి భిన్నమైన తరహాలో ఆదిత్య ప్రొడక్షన్స్ చిత్రం ఉంటుంది. అందరికీ తెలిసిన కథనే కొత్తగా ఆవిష్కరించబోతున్నాం అన్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 8 Jun 2010 | 6:22 am

చిత్తూరులో ఉగ్రవాది అహ్మద్: గాలిస్తున్న కర్నాటక పోలీసులు

ఇటీవల హైదరాబాద్‌లో పట్టపగలే నడిరోడ్డుపై పోలీసులపై కాల్పులు జరిపి ఒక పోలీసును పొట్టనబెట్టుకున్న ఉగ్రవాది వికారుద్దీన్ వ్యవహారాన్ని మరువక ముందే చిత్తూరు జిల్లాలో అహ్మద్ అనే మరో ఉగ్రవాది సంచరిస్తున్నట్లు కర్నాటక పోలీసులు కనుగొన్నారు.
Source: ఏపీ న్యూస్ | 8 Jun 2010 | 4:16 am

జగన్-కాంగ్రెస్‌ల మధ్య జరుగుతున్నది.. భార్యాభర్తల గొడవ..!

మద్యం అమ్మకాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ధ్వజమెత్తారు. మద్యం అమ్మకాలను ప్రోత్సహించి ప్రజలను దెబ్బతీయడంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కె. రోశయ్య ప్రథమ ముద్దాయని నారాయణ ఆరోపించారు.మద్యాన్ని నియంత్రించాల్సి ప్రభుత్వమే.. దాన్ని ప్రోత్సహించడం ఎంతవరకు సబబని నారాయణ ప్రశ్నించారు.
Source: ఏపీ న్యూస్ | 8 Jun 2010 | 3:49 am

రాజపక్స రాకపై నిరసన: వైగో, నెడుమారన్‌ల అరెస్టు!

శ్రీలంక అధ్యక్షుడు మహీందా రాజపక్స భారత్ రాకను నిరసిస్తూ తమిళనాడులో నిరసనలు వెలువెత్తుతున్నాయి. ఇందులో భాగంగా చెన్నై నగరంలోని శ్రీలంక రాయబార కార్యాలయం వైపు భారీ ర్యాలీని చేపట్టిన ఎండీఎంకే నేత వైగో, తమిళ జాతీయోద్యమ నేత నెడుమారన్‌లను పోలీసులు అరెస్టు చేశారు.
Source: జాతీయ | 8 Jun 2010 | 3:07 am

ఉపఎన్నికల్లో పోటీపై బాబు మల్లగుల్లాలు: టి.నేతలతో భేటీ

ఆగస్టు నెలలో జరుగనున్న ఉపఎన్నికల్లో తమ పార్టీ పోటీకి దిగుతోందని కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన నేపథ్యంలో తదుపరి వంతు తెలుగుదేశం పార్టీకి వచ్చినట్లయింది. తెలంగాణా లక్ష్య సాధనకు రాజీనామా చేసిన ఎమ్మెల్యేలనే తిరిగి గెలిపించాలని తెరాస ఐకాస పట్టుబట్టిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ దీనిపై లోతుగా పరిశీలించి నిర్ణయం తీసుకోనుంది.
Source: ఏపీ న్యూస్ | 8 Jun 2010 | 2:03 am

సంక్షేమ పథకాల అమలులో యూపీఏ విఫలం: నితిన్ గడ్కరీ

యూపీఏ అనుసరిస్తున్న విధానాలను భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ తప్పు బట్టారు. సంక్షేమ పథకాలను అమలు చేయడంలో యూపీఏ ఛైర్ పర్సన్ సోనియా గాంధీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని గడ్కరీ విమర్శించారు.
Source: ఏపీ న్యూస్ | 8 Jun 2010 | 1:37 am

రాజపక్స పర్యటనపై తమిళనాడులో వెలువెత్తిన నిరసనలు!

భారత్‌లో మూడు రోజుల పాటు శ్రీలంక అధ్యక్షుడు మహీందా రాజపక్స పర్యటనపై తమిళనాడులో నిరసనలు వెలువెత్తుతున్నాయి. రాజపక్స భారత్‌రాకకు నిరసన తెలుపుతూ, తమిళనాడులో శ్రీలంక రాయబార కార్యాలయంతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఆందోళనలు జరుగుతున్నాయి.
Source: జాతీయ | 8 Jun 2010 | 1:06 am

నిత్యానంద పిటిషన్‌పై బెంగళూరు హైకోర్టు విచారణ నేడే!

భక్తి ముసుగులో రాసలీలలకు ఒడిగట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నిత్యానంద బెయిల్ పిటిషన్‌పై బెంగళూరు హైకోర్టు మంగళవారం విచారణ జరుపనుంది. ప్రస్తుతం బెంగళూరు రామ్‌నగర్ జైలులో ఉన్న నిత్యానంద బెయిల్‌ను రామ్‌నగర్ ప్రత్యేక కోర్టు కొట్టిపారేసింది.దీంతో ప్రత్యేక కోర్టు తీర్పును సవాలు చేస్తూ రామ్‌నగర్ కోర్టులో బెయిల్ మంజూరు చేయాల్సిందిగా పిటిషన్ వేశాడు.
Source: జాతీయ | 8 Jun 2010 | 12:54 am

సీఎం బాపట్ల పర్యటనలో అపశృతి: ఇద్దరు మహిళల మృతి!

రాష్ట్ర ముఖ్యమంత్రి కె. రోశయ్య చేపట్టిన బాపట్ల పర్యటనలో అపశృతి చోటుచేసుకంది. బాపట్లలో సీఎం పర్యటన నిమిత్తం బందోబస్తుకు వెళుతున్న ఓ పోలీసు వాహనం అదుపుతప్పి రోడ్డు దాటుతున్న ఇద్దరు మహిళలను ఢీకొట్టింది. దీంతో తీవ్రగాయాలకు గురైన ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందగా, మరో మహిళ తీవ్రంగా గాయాల పాలైంది. వీరంతా వ్యవసాయం చేసుకుని పబ్బం గడుపుకునే వారని పోలీసుల దర్యాప్తులు తెలిసింది.
Source: ఏపీ న్యూస్ | 7 Jun 2010 | 11:56 pm

హైకమాండ్‌కు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డెడ్‌లైన్

తన తండ్రి పుట్టినరోజు అయిన జులై 8న ఎవరు వద్దన్నా... కాదన్నా ఓదార్పు యాత్ర చేపట్టి తీరుతానని దివంగత నేత వైఎస్సార్ కుమారుడు వైఎస్ జగన్ మరోసారి పునరుద్ఘాటించారు. ఒక రకంగా ఆయన కాంగ్రెస్ హైకమాండ్‌కు డెడ్‌లైన్ విధించినట్లు అనుకోవచ్చు.
Source: ఏపీ న్యూస్ | 7 Jun 2010 | 11:36 pm

భారత వ్యతిరేక కార్యకలాపాలను పాక్ అడ్డుకోవాలి: ప్రధాని

పాకిస్తాన్‌తో సత్సంబంధాలు కొనసాగాలంటే ఆ దేశ భూభాగం నుంచి భారత వ్యతిరేక కార్యకలాపాలను నిరోధించాలని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ వెల్లడించారు.
Source: జాతీయ | 7 Jun 2010 | 10:09 pm

దళితులకు వ్యతిరేకంగా మోడీ ప్రభుత్వం: కాంగ్రెస్

గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ దళితులు, వెనుకబడిన వర్గాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. త్వరలో తమ పార్టీ ఆధ్వర్యంలో దీనిపై పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలను చేపట్టనున్నట్లు వెల్లడించింది.
Source: జాతీయ | 7 Jun 2010 | 9:53 pm

నగ్నంగా నటించేందుకు నాకేం సిగ్గులేదు: బార్బరా

హాలీవుడ్ హీరోయిన్లు మరీ బరి తెగించినట్లు మాట్లాడుతున్నారు. హృతిక్ రోషన్ హీరోగా రూపొందిన "కైట్స్" చిత్రంలో నడుముకు పైభాగాన్ని పూర్తి నగ్నంగా చూపించిన నటి బార్బరా నగ్నంగా నటించడానికి కూడా తాను వెనుకాడనని చెపుతోందట. అలా నటించడానికి సిగ్గుగా అనిపించదూ... అని ఓ పిల్లజర్నలిస్టు ప్రశ్నిస్తే... సిగ్గెందుకూ..? అది నటనలో భాగమైనప్పుడు తప్పకుండా నగ్నంగా నటించడానికి నేను సిద్ధం. అలా నటించడానికి నేను ఎట్టి పరిస్థితుల్లో సిగ్గుపడను అని సిగ్గు లేకుండా చెప్పిందట. "అయితే అలా బట్టలు విడిచి పూర్తి నగ్నంగా నటించిన రోజున నేను చాలా కోపంగా ఉంటాను. పూర్తిగా మూడవుట్ అవుతాను. ఎవ్వరితోనూ మాట్లాడను. కానీ సిగ్గు మాత్రం పడను" అని తలతిక్క సమాధానాలు చెపుతోందట. ఇటీవల ఓ నటీమణితో కలిసి తాను అర్థనగ్నంగా నటించాల్సి వచ్చిన సందర్భంలో సదరు హీరోయిన్ సిగ్గుపడుతుంటే తానే ఆమెకు ధైర్యం చెప్పి నటింపజేశానని చెపుతోందట.
Source: Yahoo! Telugu: Entertainment | 7 Jun 2010 | 12:46 pm

గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో నాగచైతన్య - తమన్నా సినిమా

కథకు సరిపడా హీరో ఎవరా...? అని అనుకుంటుండగా చిత్ర యూనిట్ అంతా నాగచైతన్య అయితే బాగుంటుందని చెప్పడంతో అతడిని ఎంపిక చేశామని అల్లు అరవింద్ చెప్పారు. ఎప్పుడూ మా బ్యానర్‌లో మా హీరోలే కాదు బయట హీరోలతోనూ చిత్రాలు తీస్తామని ప్రకటించారు. ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్. సుకుమార్ దర్శకుడు. ఓపెనింగ్ షాట్‌తో ఈ చిత్రం నిర్మాణం సోమవారం అన్నపూర్ణా స్టూడియోలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి చిరంజీవి కూడా రావల్సి ఉంది.. కానీ ఆయన రాజకీయాల పనిపై రాజమండ్రి వెళ్లడం వల్ల కుదరలేదని అల్లు అరవింద్ చెప్పారు. అందుకే దేవుని పటాలపై పూజ చేశామని చెప్పారు. నేటి నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుతున్నామని అన్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 7 Jun 2010 | 10:20 am

అధిష్టానాన్ని ఒప్పిస్తా.. శ్రీకాకుళం వెళతా.. ఓదార్చుతా: జగన్

ఓదార్పు యాత్రపై కాంగ్రెస్ హైకమాండ్ నుంచి తనకు ఆదివారం రాత్రి ఫోన్ సందేశం వచ్చిందని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు. తను చేపట్టిన ఓదార్పు యాత్రను నిరవధికంగా వాయిదా వేసుకోమని ఆ సందేశంలో కాంగ్రెస్ అధిష్టానం తనను కోరిందని చెప్పారు.
Source: ఏపీ న్యూస్ | 7 Jun 2010 | 8:52 am

రోశయ్య కిందు మీదైతే నేనే సీఎంనవుతానంటున్నాడట...

తెలంగాణాలో వచ్చే ఆగస్టు నెలలో జరుగనున్న ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పోటీకి దిగుతామని చెప్పడంపై తెరాస నేత, కేసీఆర్ తనయుడు కేటీఆర్ మండిపడ్డారు. పీసీసీ చీఫ్ డి. శ్రీనివాస్ పై నిప్పులు చెరిగారు.
Source: ఏపీ న్యూస్ | 7 Jun 2010 | 7:50 am

తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు కట్టుబడి ఉన్నాం: గడ్కరీ

భారతీయ జనతా పార్టీ తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు కట్టుబడి ఉన్నదని ఆ పార్టీ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ అన్నారు. తాము ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నామని పునరుద్ఘాటించారు.
Source: ఏపీ న్యూస్ | 7 Jun 2010 | 7:38 am

మాది ఉమ్మడి కుటుంబం అంటున్న "ఆ నలుగురు"

తెలంగాణా గొడవ మహిమో ఏమో కానీ టాలీవుడ్ అగ్రశ్రేణి నటులందరూ తమదంతా ఉమ్మడి కుటుంబమని ముక్తకంఠంతో చెప్పారు. వివరాలలోకి వెళితే... ఆదివారం రాత్రి టాలీవుడ్ క్రికెట్ డ్రెస్ కోడ్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో అగ్రశ్రేణి నటులందరూ మాట్లాడుతూ.. రాజకీయాలు, సినీ నటుల మధ్య విబేధాలు సృష్టించలేవనీ, తమ ఐకమత్యానికి అవి అడ్డంకి కాబోవని చెప్పారు. వందేమాతరం అంటూ దేశభక్తిని నింపుతూ చిరంజీవి, బాలృష్ణ, నాగార్జున, వెంకటేష్ చిందులు వేశారు. యూసుఫ్‌గూడ కోట్ల విజయభాస్కరరెడ్డి ఇండోర్ స్టేడియం దీనికి వేదికైంది. ఇక హీరోయిన్లు ఛార్మి, అనుష్క, భూమిక, ప్రియమణి ఒక్కో హీరోకు ఒక్కొక్కరు ప్రచారకర్తగా వ్యవహరించారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది.
Source: Yahoo! Telugu: Entertainment | 7 Jun 2010 | 7:21 am

పీఆర్పీ పని అయిపోయింది.. ఇక కాంగ్రెస్‌ గూటికే: బాబు

చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ పని అయిపోయిందనీ, ఆ పార్టీ కాంగ్రెస్‌లో విలీనమయ్యే రోజు ఇక ఎంతో దూరంలో లేదని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వెల్లడించారు. సోమవారం ప్రజారాజ్యం పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి చేరేందుకు వచ్చిన నేతలను బాబు ఆహ్వానించారు.
Source: ఏపీ న్యూస్ | 7 Jun 2010 | 6:40 am

ప్లీజ్ కమల్... త్రిష పెదవులను గాఢంగా చుంబించవూ..!!

కమల్ హాసన్‌తో నటించే ఏ నటైనా ఖచ్చితంగా ఆయన ముద్దు రుచి ఎలా ఉంటుందో చూసి తీరాల్సిందే. ఈ నేపధ్యంలో తాజాగా కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో కమల్ హాసన్, త్రిష జోడీగా రూపొందనున్న "మన్మథన్ అంబు" చిత్రంపై తమిళ చిత్ర పరిశ్రమలో బెట్టింగ్‌లు జోరుగా చోటుచేసుకుంటున్నట్లు కోలీవుడ్ న్యూస్. కమల్ - త్రిషల మధ్య లిప్ టు లిప్ సన్నివేశం ఉంటుందా...? ఉండదా...? అనే ప్రశ్నపై పందేలు వేసుకుంటున్నట్లు భోగట్టా. సహజంగా క్రీడల్లో ఇటువంటి బెట్టింగ్‌లు చోటుచేసుకోవడాన్ని మనం చూస్తుంటాం. కానీ త్రిష - కమల్ ముద్దు సన్నివేశంపై వేల రూపాయల్లో పోటీకి దిగడం కాస్తంత ఆశ్చర్యం కల్గించే అంశమే మరి. అంతేకాదండోయ్... కొంతమందైతే కమల్ హాసన్‌కు సెల్‌ఫోన్ల ద్వారా "కమల్... త్రిష పెదవులను గాఢంగా చుంబించే సన్నివేశంలో నీవు నటిస్తే చూడాలనుంది. ప్లీజ్.. త్రిషకు లిప్ టు లిప్ ముద్దివ్వవూ.." అనే సందేశాలను పంపుతున్నారట. మరి కమల్ హాసన్ త్రిష పెదవులను ఏం చేస్తాడో చూడాలి మరి...!!
Source: Yahoo! Telugu: Entertainment | 7 Jun 2010 | 5:49 am

భోపాల్ గ్యాస్ లీకేజీ కేసులో దోషులకు శిక్షలు ఖరారు!

మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్‌లోని యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్ కంపెనీలో విషవాయువు లీకేజీ కేసులో దోషులుగా తేలిన ఏడుగురికి స్థానిక చీఫ్ జ్యూడియల్ మేజిస్ట్రేట్ కోర్టు శిక్షలను ఖరారు చేసింది. కంపెనీ ఛైర్మన్ కేసుబ్ మహీంద్రాతో పాటు మిగిలిన ఆరుగురికి రెండేళ్ళ జైలు శిక్షతో పాటు ఐదు లక్షల రూపాయల జరిమానా విధించింది.
Source: జాతీయ | 7 Jun 2010 | 3:57 am